
అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో చేయడం దాదాపు ఖరారైపోయింది. ఎప్పుడు అధికారికంగా ప్రకటించనున్నారనేది కూడా రూమర్స్ వచ్చేస్తున్నాయి. అలానే స్టోరీ గురించి చిన్న హింట్ తో పాటు రెమ్యునరేషన్ డీటైల్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)
'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేయాలి. కానీ ఇది భారీ బడ్జెట్ తో తీసే మైథలాజికల్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్ లో మరో మూవీ చేయాలని బన్నీ అనుకున్నాడట. ఈ క్రమంలోనే అట్లీ లైనులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టుని బన్నీ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించనున్నారట.
మరోవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్.. హీరో కమ్ విలన్ గా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. అంటే అటు హీరోయిక్ ఎలివేషన్లతో పాటు విలన్ గానూ రచ్చ చేస్తాడేమో. ఇకపోతే ఈ మూవీ చేస్తున్నందుకు గానూ రూ.175 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 20 శాతం వాటా కూడా తీసుకోబోతున్నాడని అంటున్నారు. మరి వీటిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!)
Comments
Please login to add a commentAdd a comment