Atlee
-
గురూ.... కొత్త కాంబినేషన్ షురూ
జానర్ మాత్రమే కాదు... ఒక్కోసారి కాంబినేషన్స్ కూడా ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ మూవీస్‌కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు స్టార్ హీరోలు ఇప్పటివరకు తమతో సినిమాలు చేయని దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న కొన్ని కొత్త కాంబినేషన్స్ కథా కమామీషుపై ఓ లుక్ వేయండి.ప్రభాస్‌తో లోకేశ్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే తనతో ‘సలార్’ వంటి మాస్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు సినిమాలు కమిటయ్యారు. ఈ మూడు సినిమాలు వరుసగా 2026, 2027, 2028లలో విడుదల కానున్నాయి.కాగా వీటిలో ఓ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే లోకేశ్ కార్తీతో ‘ఖైదీ 2’ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభాస్–లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లోని మూవీ చిత్రీకరణ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యే చాన్సెస్ ఉన్నాయి.అలాగే ‘హనుమాన్’ తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ‘జై హనుమాన్’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం.గ్రీన్ సిగ్నల్తమిళంలో రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమా తీసి సూపర్‌హిట్ అందుకున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం రజనీకాంత్‌తోనే ‘జైలర్ 2’ సినిమా చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నెల్సన్. అయితే ‘జైలర్’కు, ‘జైలర్ 2’కు మధ్య తనకు లభించిన గ్యాప్‌లో ఓ కథ రాసుకున్నారట నెల్సన్. ఈ కథను ఎన్టీఆర్‌కు వినిపించగా, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.అయితే ఇటీవలే హిందీలో ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో తాను కమిటైన ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ సినిమా కోసం కావాల్సిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్.ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత నెల్సన్ సినిమాను ఎన్టీఆర్ సెట్స్‌కు తీసుకువెళతారని ఊహించవచ్చు. అలాగే ‘హాయ్ నాన్న’ వంటి ఫీల్‌గుడ్ మూవీ తీసిన శౌర్యువ్ కూడా ఎన్టీఆర్కుప్రాథమికంగా ఓ లైన్ చెప్పారని, స్టోరీ కుదిరితే శౌర్యువ్‌తోనూ ఎన్టీఆర్ మూవీ చేస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.అర్జున్‌తో అట్లీ‘పుష్ప: ది రూల్’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు అల్లు అర్జున్. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేసేందుకు ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు అల్లు అర్జున్. కాగా ‘పుష్ప’ సినిమా నిర్మాణం సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నట్లుగా అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అయితే ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీతో సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉండటంతో అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్‌తో చేస్తారనే టాక్ వినిపించింది.కానీ త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాకు మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ ఉంటుందట, చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరం అవుతుందట. ఇలా ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ ఇంకా సమయం పడుతుందట. దీంతో తన నెక్ట్స్ మూవీ కోసం తమిళ టాప్ డైరెక్టర్ అట్లీతో చర్చలు జరిపారట అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్లోనే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారని, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని భోగట్టా. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా రూ. 1871 కోట్ల వసూళ్లు రాబట్టింది.మరోవైపు దర్శకుడిగా షారుక్ ఖాన్‌తో రూ. 1000 కోట్ల ‘జవాను’ను తీశారు అట్లీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మూవీ పై మరింత సమాచారం బయటకు రానుందని తెలిసింది. అలాగే ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ఇటీవల ముంబైలో కలిశారు అల్లు అర్జున్. వీరి మధ్య ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయి. సో... భన్సాలీతో కూడా అల్లు అర్జున్ సినిమా చేసే చాన్స్ ఉందని ఊహించవచ్చు.మాస్ ప్లస్ క్లాస్ ఎక్కువగా మాస్, వీలైనప్పుడు క్లాస్ మూవీస్ చేస్తుంటారు రవితేజ. అయితే రీసెంట్ టైమ్స్‌లో రవితేజ మాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’ మాస్ అప్పీల్ ఉన్న సినిమాయే. దీంతో ఓ క్లాస్ మూవీ చేయాలని రవితేజ అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కిశోర్ తిరుమల రెడీ చేసిన ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీకి రవితేజ పచ్చజెండా ఊపారని, త్వరలోనే ఈ వీరి కాంబినేషన్లోని మూవీపై స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఓకే చెప్పిన నానీశివ కార్తికేయన్‌తో తమిళంలో ‘డాన్’ (2022) వంటి క్యాంపస్ డ్రామా ఫిల్మ్ తీసి హిట్ సాధించారు తమిళ యంగ్ డైరెక్టర్ సిబీ చక్రవర్తి. అప్పట్నుంచి సిబీ చక్రవర్తితో ఓ మూవీ చేయాలని నానీ అనుకుంటున్నారట. ఆ సమయం ఇప్పడు వచ్చిందని, నానీ–సిబీ చక్రవర్తి కాంబినేషన్లోని మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం నానీ ‘హిట్ 3’ మూవీతో బిజీగా ఉన్నారు.మే 1న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత తనకు ‘దసరా’ వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నానీ ‘ప్యారడైజ్’ అనే మూవీ చేస్తారు. అయితే ‘ప్యారడైజ్’ చిత్రానికి సమాంతరంగా సిబీ సినిమాను కూడా నానీ చేస్తారా? లేక ‘ప్యారడైజ్’ చిత్రాన్ని పూర్తి చేశాక సిబీ చక్రవర్తి సినిమాను స్టార్ట్ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన ఓ కథ నానీని ఇంప్రెస్ చేసిందని, నానీ ప్రస్తుత కమిట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత శేఖర్ కమ్ములతో చేసే మూవీపై ఓ స్పష్టత వస్తుందని సమాచారం. ఈ నెల 24న నానీ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ హీరో తదుపరి చిత్రాలపై అధికారిక అప్డేట్స్ ఏమైనా వస్తాయా? అనేది చూడాలి.కిల్ డైరెక్టర్‌తో..!హిందీలో ‘కిల్’ వంటి మాస్ యాక్షన్ ఫిల్మ్ తీసి, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యారు దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్. ఈ దర్శకుడు ఇప్పుడు ఓ క్రేజీ తెలుగు హీరోతో భారీ బడ్జెట్ మూవీ తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండను కలిశారు నిఖిల్ నగేశ్. వీరి మధ్య ఓ కొత్త సినిమా గురించిన చర్చలు జరిగాయి. ప్రస్తుతం ‘కింగ్డమ్’ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.మే 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో రాయలసీమ నేపథ్యంలో ఓ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్, రవికిరణ్ కోలాతో ఓ విలేజ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలు పూర్తయ్యాక విజయ్ దేవరకొండ–నిఖిల్ నగేశ్‌ల కాంబినేషన్లోని మూవీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అల్లు అర్జున్ అట్లీ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ కన్ఫర్మ్..?
-
అల్లు అర్జున్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ..?
తెలుగు చిత్ర పరిశ్రమలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు జాన్వీ. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్గా చేస్తున్నారామె. ఈ యంగ్ బ్యూటీకి మరో సూపర్ చాన్స్ దక్కిందట. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా అట్లీ(Atlee) దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుందనే టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మించనుందట. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మరి... ఈ వార్త నిజమై అల్లు అర్జున్ సరసన జాన్వీ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... ప్రస్తుతం వెకేషన్లో భాగంగా అల్లు అర్జున్ స్పెయిన్‌లో ఉన్నారు. తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమాకు చెందిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని తెలిసింది. -
టాలీవుడ్ లో పాతుకపోతున్న జాన్వీ కపూర్
-
త్రివిక్రమ్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
-
అట్లీ కలర్‌పై కామెంట్స్.. గొర్రెలాగా అనుసరించొద్దు: నెటిజన్‌కు కపిల్ శర్మ కౌంటర్
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తన షోలో ఇటీవల చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీని అభ్యంతకరమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టార్‌గా ఎదిగారు.. ఎవరైనా స్టార్‌ను మొదటిసారి కలవడానికి వెళ్లినప్పుడు అతనికి మీరు కనిపించారా? అంటూ కలర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీనికి అట్లీ సైతం రిప్లై కూడా ఇచ్చారు. ఎవరినైనా సరే రూపాన్ని చూసి ఓ అంచనాకు రాకండి.. అతని హృదయాన్ని చూసి చెప్పాలంటూ సమాధానమిచ్చారు.అయితే ఈ షోలో అట్లీని అవమానించాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కపిల్ శర్మను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్లీ కలర్‌పై అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అట్లీకి క్షమాపణలు చెప్పాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్‌పై కపిల్ శర్మ స్పందించారు.తనపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు కపిల్ శర్మ బదులిచ్చారు. డియర్ సర్.. నేను ఈ వీడియోలో అట్లీ లుక్స్ గురించి మాట్లాడినట్లు దయచేసి నాకు వివరించగలరా? దయచేసి సోషల్ మీడియాలో విద్వేషాన్ని వ్యాప్తి చేయకండి. మీకు ధన్యవాదాలు. అంతే కాదు అబ్బాయిలు మీ నిర్ణయం మీరే తీసుకోండి.. అంతేకానీ గొర్రెలాగా ఎవరో చేసిన ట్వీట్‌ను అనుసరించవద్దు' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే మరికొందరేమో కపిల్ శర్మ కామెంట్స్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. Dear sir, can you pls explain me where n when I talked about looks in this video ? pls don’t spread hate on social media 🙏 thank you. (guys watch n decide by yourself, don’t follow any body’s tweet like a sheep). https://t.co/PdsxTo8xjg— Kapil Sharma (@KapilSharmaK9) December 17, 2024 -
స్టార్ డైరెక్టర్‌పై కమెడియన్ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.అయితే ఈ షోలో డైరెక్టర్ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్‌ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్‌ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. ' అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Will they never stop these crass and racist jibes at his skin color in the name of ‘comedy’?Someone with the amount of influence and clout like Kapil Sharma saying something like this is disappointing and unfortunately, not surprising. https://t.co/63WjcoqHzA— Chinmayi Sripaada (@Chinmayi) December 15, 2024 -
నిర్మాతగా స్టార్ డైరెక్టర్ భార్య.. ట్రైలర్ చూశారా?
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం. -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
ఎవరు ఊహించని విధంగా విజయ్ దళపతి మల్టీస్టారర్ సినిమా
-
అట్లీతో సినిమా కచ్చితంగా చేస్తా
-
కమల్–సల్మాన్–ఓ సినిమా
హిందీలో షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ తీసి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ. ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటాయి. ఈ క్రమంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం ఏంటి? అనే చర్చల్లో భాగంగా అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా గురించి అధికారిక సమాచారం ఏదీ రాలేదు.కాగా అట్లీ ఓ మల్టీస్టారర్ మూవీ కథను రెడీ చేశారని, ఇందులో రజనీకాంత్, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ సినిమాలో రజనీకాంత్ ప్లేస్‌లో కమల్‌హాసన్ నటించనున్నారని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సల్మాన్–కమల్ కాంబినేషన్లో అట్లీ దర్శకత్వంలోని సినిమా దాదాపు ఖరారైనట్లే అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. -
బన్నీ మూవీ పక్కన పెట్టి.. సల్మాన్ వైపు అట్లీ చూపు..
-
అల్లు అర్జున్ చేయాల్సిన మూవీ సల్మాన్ చేతికి!
దక్షిణాది డైరెక్టర్లకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తమిళ దర్శకులు మురుగదాస్, అట్లీ లాంటోళ్లు అక్కడ హిట్స్ కొట్టారు. ఏఆర్ మురుగదాస్.. 'గజిని'తో సక్సెస్ అందుకోగా, అట్లీ 'జవాన్'తో వెయ్యి కోట్ల వసూళ్లు మూవీ తీశాడు. కాగా అట్లీ మరోసారి బాలీవుడ్‌పై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిజానికి అల్లు అర్జున్ హీరోగా ఇతడు మూవీ తీస్తాడని ప్రచారం జరిగింది. కాకపోతే ఇదే ఇప్పుడు సల్మాన్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)అల్లు అర్జున్‌తో కథా చర్చలు జరిగాయని, అయితే రెమ్యునరేషన్ విషయంలో అట్లీ ఏకంగా రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారని సమాచారం. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి సల్మాన్ ఎంటరయ్యాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇది సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వస్తాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!) -
జవాన్ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్ వైడ్‌గా గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్ వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ— atlee (@Atlee_dir) June 6, 2024 -
డైరెక్టర్ కూతురి రెండో పెళ్లి.. స్టెప్పులతో అదరగొట్టిన స్టార్స్
ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఏప్రిల్ 15న జరిగిన ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్ సహా దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం ఎంతో వైభవంగా రిసెప్షన్ నిర్వహించగా బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా సౌత్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లేలా చేశారు. వీరితోపాటు శంకర్ రెండో కూతురు, హీరోయిన్ అదితి శంకర్ కూడా ఎంతో హుషారుగా చిందేయడం విశేషం. ఇక వీరంతా తమిళ హిట్ సాంగ్స్‌కు కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐశ్వర్య శంకర్ గతంలో క్రికెటర్ దామోదర్ రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో ఐశ్వర్య తన నుంచి విడాకులు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ కార్తికేయన్‌తో నిశ్చితార్థం జరగ్గా రెండు రోజులక్రితమే ఘనంగా వివాహం జరిపించారు. #RanveerSingh & #AditiShankar dancing for ThalapathyVijay & #Trisha's Apadi Podu Song 🤩🔥pic.twitter.com/RFXuZLSZo1 — Kolly Corner (@kollycorner) April 16, 2024 చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్ తనయుడు -
అల్లు అర్జున్‌కి జోడీగా..?
‘పుష్ప: ది రైజ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ‘పుష్ప: ది రూల్’ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అందులో భాగంగానే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో పడ్డారట అట్లీ. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్‌కి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో సమంత, త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత త్రిష పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్‌కి ఆమె జోడీగా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరి’ సినిమాలో విజయ్‌కి జోడీగా నటించారు సమంత. అలాగే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్‌తో జతకట్టారీ బ్యూటీ. అలాగే ‘పుష్ప: ది రైజ్’ మూవీలో ‘ఊ అంటావా...’ అంటూ ప్రత్యేక పాట చేశారు. తాజాగా వీరి జోడీ రిపీట్ కానుందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి అల్లు అర్జున్ సరసన నటించేది సమంతా? త్రిషా? లేకుంటే ఇద్దరూ నటిస్తారా? ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక నటిస్తారా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఈ అక్టోబర్‌లో అల్లు అర్జున్–అట్లీ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
స్టార్ జంటను ఫాలో అవుతున్న అట్లీ దంపతులు!
కోలీవుడ్‌లో నయనతార, విఘ్నేశ్ శివన్‌లకు బ్రాండ్ ఉంది. పదేళ్ల క్రితం ప్రేమలో పడి.. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రికార్డు వీరిది. అయితే పెళ్లికి ముందు నుంచే ఏ చిన్న అకేషన్ వచ్చినా ఈ జంట విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడాన్ని ఈ జంట ఆనవాయితీగా పెట్టుకున్నారనే చెప్పాలి. అలా పుట్టిన రోజు, పెళ్లి రోజులు వస్తున్నాయంటే ఈ జంట నుంచి రకరకాల ఫొటోల కోసం నెటిజన్లు ఎదురు చూసేస్థితికి వారిని తీసుకొచ్చారు. తాజాగా వీరిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉన్నారు దర్శకుడు అట్లీ. దర్శకుడు శంకర్ శిష్యుడు అయిన అట్లీ రాజా రాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని సాధించడంతో ఆ తరువాత విజయ్ వంటి స్టార్ హీరోకు అవకాశం కల్పించారు. ఆయనతో మెర్శల్, తెరి, బిగిల్ వంటి హిట్ చిత్రాలను చేసి హిట్ కొట్టారు. ఇక ఇటీవల బాలీవుడ్‌కు వెళుతూ బాద్షా షారూఖ్‌ఖాన్ హీరోగా జవాన్‌తో అట్లీ సక్సెస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. నటి ప్రియనుప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. కాగా తొమ్మిది ఏళ్ల తరువాత ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. ఇక అసలు విషయం ఏమంటే నయనతార, విఘ్నేష్ శివన్ తరహాలోనే ఈ జంట ఎలాంటి అకేషన్ వచ్చినా, లేకపోయినా ప్రత్యేకంగా ఫొటోలు తీయించుకుని మరీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట దిగిన రొమాంటిక్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
Priya Atlee: డైరెక్టర్ అట్లీ భార్యలో ఈ యాంగిల్ కూడా ఉందా! (ఫోటోలు)
-
నమ్మించి మోసం చేశారు..నటి సంచలనం
-
మీ వల్లే ఈ ఘనత దక్కింది.. జవాన్ డైరెక్టర్ పోస్ట్ వైరల్!
ఈ ఏడాది జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన జాబితాలో ఇండియాలో అత్యధిక ఆదరణ దక్కించుకున్న మూవీగా జవాన్ నిలిచింది. ఈ ఏడాది ప్రకటించిన థియేట్రికల్ సినిమాల్లో అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ నిలిచింది. ఈ సందర్భంగా అట్లీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అట్లీ ఇన్‌స్టాలో రాస్తూ.. "జవాన్ అనేది ఓ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది సమాజంలోని అన్యాయాలను సరిదిద్దాలని నిర్ణయించుకున్న ఒక వ్యక్తి లోతైన భావోద్వేగానికి సంబంధించినగి. ఈ సినిమా మీ అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ, ప్రేమ చాలా గొప్పది. ప్రపంచ సినిమా గురించి నాకున్న జ్ఞానానికి ఐఎండీబీ ప్రశంసలు పొందడంతో ఓ కల నిజమైంది. ఈ విజయం కోసం సహకారించిన షారూఖ్ ఖాన్ సార్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, నా భార్య, నా టీమ్, ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ మీరు నంబర్ వన్ డైరెక్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు జవాన్-2 కోసం వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) -
జవాన్ డైరెక్టర్ భారీ స్కెచ్.. ఆ ఇద్దరు స్టార్స్‌తో మూవీ!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జవాన్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి సౌత్ సూపర్‌స్టార్స్ ఎక్కువగా నటించారు. దర్శకుడు కూడా తమిళనాడుకు చెందిన అట్లీ కావడం విశేషం. కాగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. (ఇది చదవండి: ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్న కంగువ) ఇక కోలీవుడ్‌లో దళపతిగా అభిమానులు పట్టం కట్టిన నటుడు విజయ్ ఆ మధ్య నటించిన చిత్రం బిగిల్. అందులోనూ నయనతారనే హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక జవాన్, బిగిల్ చిత్రాల్లో మరో కామన్ విషయం హీరోలు ద్విపాత్రాభినయం చేయడం. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా అట్లీ నిలిచారు. కాగా ఆయన తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీనిపై తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జవాన్ హీరో షారుక్ ఖాన్, బిగిల్ హీరో విజయ్‌తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారన్నదే లేటెస్ట్ టాక్. జవాన్ చిత్రంలో షారుక్‌ఖాన్‌తో కలిసి విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని తెలిసిపోయింది. అయితే విజయ్‌తో కలిసి నటించడానికి తాను సిద్ధమని షారుక్ ఖాన్ జవాన్ చిత్రం సమయంలోనే వెల్లడించారు. అదేవిధంగా షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన డానికి తాను సిద్ధమేనని విజయ్ కూడా అన్నారు. కాగా ఇటీవల ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ తన దర్శకత్వంలో చిత్రం చేయడానికి ముందుకు వచ్చినట్లు అట్లీనే స్వ యంగా ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఇది షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించిన చిత్రం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. అదేవిధంగా ఇది బాలీవుడ్ చిత్రం అవుతుందా? లేక హాలీవుడ్ చిత్రం అవుతుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్ హీరోయిన్) -
జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, నయనతరా జంటగా నటించిన చిత్రం జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. అయితే తాజాగా ఫ్యాన్స్‌కు బిగ్ ఆఫర్ తీసుకొచ్చింది. (ఇది చదవండి: అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!) ఈనెల 28,29, 30 తేదీల్లో సినిమా చూసేవారికి జవాన్ చిత్రబృందం ఓ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఈ మూడు రోజుల్లో టికెట్ బుక్ చేసుకున్నవారికి మరో టికెట్ ఫ్రీగా రానుంది. దీంతో ఒక టికెట్ తీసుకుని ఇద్దరు మూవీ చూసేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నవారికే వర్తిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని షారుక్ ఖాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఇంకేం ఈ వీకెండ్లో జవాన్ మూవీ చూడాలనుకువారు ఈ ఆఫర్‌ను ఎంజాయ్ చేయండి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. Bhai ko, behen ko… Dushman ko, Yaar ko… And of course, apne Pyaar ko… Kal Jawan dikhaaiyega! Chacha-Chachi, Phoopha-Phoophi, Maama-Maami… Yaani Poore Parivaar ko. Sab ke liye ek ke saath ek free ticket!!! Toh kal se… Parivaar, yaar aur pyaar… Just Buy 1 ticket and get the… pic.twitter.com/Qr9gI4ihcO — Shah Rukh Khan (@iamsrk) September 27, 2023 -
వెయ్యి కోట్ల క్లబ్లో జవాన్.. షారుక్ అరుదైన ఘనత!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ షారుక్ ఖాన్ కాంబో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈనెల 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటింది. ఇండియాలో ఇప్పటి వరకు రూ.560 కోట్లు వసూలు చేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. జవాన్ మూవీ వెయ్యి కోట్లు అధిగమించడంపై అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??) 'దేవుడు మా పట్ల చాలా దయతో ఉన్నాడు' అంటూ జవాన్ మూవీ క్లిప్‌ను షేర్ చేశారు. ఈ మైల్ స్టోన్‌కు కారణమైన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ ఏడాదిలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన షారుక్ రెండో చిత్రమిది. ఒకే ఏడాదిలో రెండు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ నటుడు షారుఖ్ ఖాన్ ఘనత సాధించారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇదంతా షారుక్ హవా అని.. త్వరలోనే రూ.1500 కోట్లకు చేరుకుంటుందని కామెంట్ చేశారు. పఠాన్ బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ అయితే ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కొల్లగొట్టింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం నాలుగు వారాల తర్వాత ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును దాటింది. పఠాన్‌తో పోలిస్తే.. జవాన్ కేవలం 18 రోజుల్లోనే ఈ మార్క్‌ని దాటింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, గిరిజా ఓక్ సంజీతా భట్టాచార్య కూడా నటించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, దీపికా పదుకొణె కూడా అతిథి పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి) God is so kind to us Thank you all #jawan History in the maKING ft. Jawan! 🔥 Have you watched it yet? Go book your tickets now! https://t.co/uO9YicOXAI Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/h57GwuTTP3 — atlee (@Atlee_dir) September 25, 2023 -
Nayanathara : అట్లీపై నయనతార కోపంలో నిజమెంత?
తమిళసినిమా: నటి నయనతార దర్శకుడు అట్లీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రచారం. మరి ఇందులో నిజం ఎంత? దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నయనతార తొలిసారిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి నటించిన చిత్రం జవాన్. షారుక్‌ఖాన్ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ యువదర్శకుడు అట్లీ బాలీవుడ్ పరిచయం అయ్యారు. కాగా ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనె కూడా నటించిన విషయం తెలిసిందే. చిత్రం ఈనెల 7న విడుదలై బాక్సాఫీస్ షేక్ చేస్తూ రూ.1000 కోట్ల క్లబ్ చేరువలో ఉంది. అలాంటి చిత్రంలో దర్శకుడు తన పాత్రకు సరైన న్యాయం చేయలేదనే అసంతృప్తితో నయనతార ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. Witnessing the magic of my favouritest @iamsrk last night in a packed hall amidst the cacophony of whistles & cheer was something else. #Jawan is truly an exceptional film. @Atlee_dir you are a magician who knows the pulse of the nation. @NayantharaU you were ethereal. No words… pic.twitter.com/YKdc3bsnsk — Genelia Deshmukh (@geneliad) September 8, 2023 జవాన్ చిత్రంలో నటి దీపిక పడుకొనెకు అతిథి పాత్ర అని చెప్పి ఆమెకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు నయనతార ఆవేదన చెందుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకే నయనతార ఆ చిత్ర ప్రచార కార్యక్రమంలోగానీ, విజయోత్సవ వేడుకల్లోగాని పాల్గొనలేదనేది నెటిజన్ల విశ్లేషణ. అయితే ఈ ప్రచారాన్ని నయనతార వర్గం తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజానికి షారుఖ్‌ఖాన్ అంటే నయనతారకు చాలా ఇష్టమని అందుకే ఆమె ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారని వారు పేర్కొంటున్నారు. Nayanthara special message to all after #Jawan success. She loved working with @iamsrk ❤️ SRK Nayanthara ❤️❤️ @NayantharaU + @iamsrk#JawanCreatesHistory #JawanEvent pic.twitter.com/S8ZU3uD2zp — Abu Bakar (@_Abubakar03) September 15, 2023 ఇక చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన లేదన్నది ఆమె పాలసీ అని అందుకే జవాన్ చిత్ర ప్రచారంలో కూడా పాల్గొనలేదని అంటున్నారు. అదేవిధంగా ముంబైలో జరిగిన చిత్ర సక్సెస్ కార్యక్రమంలో పాల్గొనపోవడానికి కారణం, అదేరోజు నయనతార తల్లి పుట్టినరోజు కావడంతో ఆమె తన తల్లికి ప్రాముఖ్యత ఇచ్చారని చెబుతున్నారు. అయితే దర్శకుడు అట్లీపై నయనతార ఆగ్రహం అని వారు, వీరు అంటుండడమే కానీ నయన మాత్రం ఏవిధంగా స్పందించలేదన్నది గమనార్హం. Nayanthara spotted in Mumbai #Nayanthara #VigneshShivan @NayantharaU #Jawan pic.twitter.com/wcJRbypqAl — Deccan Mirror (@TheDeccanMirror) September 8, 2023 -
జవాన్ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే జవాన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన కనిపించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రంలో నయన్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఆమె యాక్షన్ సన్నివేశాలతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. (ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!) అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె సైతం కీలక పాత్రలో కనిపించింది. ఆమె పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నయనతారకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ అట్లీపై నయన్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించినా.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కోలీవుడ్ లేటెస్ట్ టాక్. నయనతార అసంతృప్తిగా ఉందా? తాజా బజ్ ప్రకారం జవాన్‌లో అతిథి పాత్ర పోషించిన దీపికా పదుకొణెకు దక్కిన ప్రాధాన్యత నయనతారకు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయంలో నయనతార అట్లీ తీరు పట్ల కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో బాలీవుడ్ చిత్రాల్లో నయన్ నటించకూడదని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రమోషన్లకు దూరం? జావాన్ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో నయన్ కనిపించక పోవడం ఇదే ప్రధాన కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. షారుక్-నయనతార జవాన్ కాస్తా దీపికా- షారుక్ మూవీగా మారిపోయిందంటున్నారు. అంతే కాకుకండా గత వారం ముంబైలో జరిగిన సక్సెస్ మీట్లో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతితో సహా అందరూ హాజరైనప్పటికీ నయన్ సక్సెస్ మీట్‌కు కూడా హాజరు కాలేదు. (ఇది చదవండి: 6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్) దక్షిణాదిలో ఆమెనే! అయితే మరికొందరేమో దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. గతంలోనూ నయనతార ఎప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదంటున్నారు. గతంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. కేవలం నటించడమే తన పని నయన్ భావిస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు నయనతార దాదాపు రూ.10 నుంచి 11 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది హీరోయిన్లలో ఇప్పటివరకు ఇంత భారీ పారితోషికం తీసుకోలేదని సమాచారం. -
ఆ విషయంలో అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి
తమిళసినిమా: బహుభాషా నటిగా రాణిస్తున్న ప్రియమణి మొదట్లో హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తమిళంలో పరుత్తివీరన్ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. కాగా వివాహానంతరం తన వయసుకు తగిన పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జవాన్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రంలో నటించిన గురించి ప్రియమణి ఒక భేటీలో పేర్కొంటూ జవాన్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఏదో క్యామియో పాత్ర అయి ఉంటుందని భావించారన్నారు. అయితే షారుక్ ఖాన్ టీం లో ఒకరిగా ముఖ్యమైన పాత్ర అని తెలియగానే చాలా సంతోషించానన్నారు. అట్లీ దర్శకుడు అని చెప్పగానే నటిస్తానని చెప్పానన్నారు. అలా ఒకసారి జూమ్ కాల్లో దర్శకుడు అట్లీ, ఆర్య మాట్లాడారని చెప్పారు. అట్లీ తన మిత్రుడు అని పరిచయం చేసి ఆర్య వెళ్లిపోయారన్నారు. అలా ప్రియమణి జవాన్ చిత్రంలో నటిస్తుందన్న వార్త వెలువడగానే ఏదో ఐటమ్ సాంగ్ అయ్యింటుందనే ప్రచారం జరిగిందన్నారు. అలాంటి ప్రచారాన్ని తాను పట్టించుకోలేదన్నారు. అయితే దర్శకుడు అట్లీ తనను చాలా ఏమార్చారన్నారు.. జవాన్ చిత్రం తమిళ వర్షన్లో నటుడు విజయ్ గెస్ట్ రోల్ లో నటించనున్నారని, అదే విధంగా తెలుగు వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రను నటించనున్నారని ప్రచారం హోరెత్తిందన్నారు. విజయ్ ఇందులో నటిస్తున్నారా..? అని తాను అట్లీని అడగ్గా నటింపజేస్తే పోద్ది అన్నారన్నారు. అయితే విజయ్‌తో తనను ఒక్క సన్నివేశంలోనైనా నటింపజేయమని కోరగా అలాగే అన్నారని, అయితే చివరివరకూ దర్శకుడు అట్లీ తనను అలా ఏమార్చుతూనే వచ్చారని వెల్లడించారు. నిజానికి ఈ చిత్రంలో విజయ్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ నటించలేదని ప్రియమణి పేర్కొన్నారు. -
అట్లీ, షారుఖ్‌పై నయనతార అసంతృప్తి.. నిజమెంత?
తమిళసినిమా: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు అన్నది సామెత. అయితే ఇది కొందరి విషయంలో అక్షరసత్యంగా మారుతుంది. ముఖ్యంగా నటి నయనతార పరిస్థితి ఇదే. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. తాజాగా జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేశారు. దీంతో ఇండియన్ సినిమా తారగా గుర్తింపుపొందారు. నయనతార నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఈమైపె సంచలన నటిగా ముద్రవేశారు. నటిగా రెండు దశాబ్దాలకు దగ్గరలో ఉన్న నయనతార 75 చిత్రాల మైలురాయిని అవలీలగా అధిగమించి నాటౌట్‌గా వెలుగొందుతున్నారు. కాగా దీని గురించి ఇటీవల ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. జవాన్ చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదని దర్శకుడు అట్లీ, నటుడు షారుక్ఖాన్లపై అసంతృప్తిగా ఉన్నారన్నది ఆ వదంతి. అయితే జవాన్ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై అనూహ్యంగా వసూళ్లను కురిపిస్తోంది. ఇది ఇండియాలో ఒకరోజులో రూ.75 కోట్లు వసూళ్లు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు సాధించి గత రికార్డులను తిరగరాస్తున్నట్లు సమాచారం. ఇకపోతే జవాన్ చిత్రంలో నయనతారకు తగిన ప్రాధాన్యత ఉంది. ఆమెకు యాక్షన్ సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. మరో విషయం ఏమిటంటే నటుడు షారుక్‌ఖాన్ అంటే నయనతారకు పిచ్చి అభిమానం. ఇక అట్లి దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో కథానాయకి నయనతారనే ఆ తర్వాత బిగిల్ చిత్రంలో విజయ్ సరసన నయనతారనే నటింపజేశారు. ఇకపోతే జవాన్ చిత్రం సక్సెస్‌ను సెలబ్రేట్ చేయడానికి నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి ముంబై వెళ్లారు. ఈ జంటను ముంబై విమానాశ్రయంలో ఫొటో గ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాబట్టి జవాన్ చిత్ర దర్శక నిర్మాతలపై నయనతార అసంతృప్తిగా ఉన్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేటతెల్లమవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆస్పత్రిలో భార్య.. షూటింగ్ ఆపేయమన్న షారుక్: అట్లీ
ప్రపంచ వ్యాప్తంగా షారుక్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జవాన్. ఈ సినిమాను తమిళ హిట్ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. జవాన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని లుక్‌లో ఈ సినిమాలో షారుక్ కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో కథానాయిక. విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషిస్తుండగా, దీపికా పదుకొణె కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోంది. (ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే) దర్శకుడు శంకర్‌తో కో-డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన అట్లీకి జవాన్ ఐదవ చిత్రం కానున్నడం విశేషం. 'రాజా రాణి'తో అట్లీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాక దళపతి విజయ్‌తో వరుసగా మూడు చిత్రాలు థెరి, మెర్సల్, బిగిల్ భారీ విజయాలు సాధించాయి. దీని తర్వాత అట్లీ జవాన్‌ను ప్రకటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై అట్లీ ప్రసంగం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నటి ప్రియను వివాహం చేసుకున్న అట్లీ సుమారు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న సమయంలో తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని షారుక్ ఖాన్‌కు తెలిపినప్పుడు ఆయన ఎలా స్పందించాడో తాజాగ అట్లీ గుర్తుచేసుకున్నాడు. 'జవాన్ షూటింగ్ కోసం నేను అమెరికాకు చేరుకున్నాను. ఈలోపు తాను గర్భం దాల్చినట్లు ప్రియా ఫోన్ చేసి తెలిపింది. ఎనిమిదేళ్ల తర్వాత గర్భం దాల్చినందున మూడు నెలల పాటు ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించారు. పూర్తిగా బెడ్ రెస్ట్ అన్నారు. అప్పటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి మూడు రోజులే అయింది. దీంతో ప్రియాను అమెరికాకు రమ్మని చెప్పలేకపోయాను ఏం చేయ్యాలో తెలియక ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్‌కి చెప్పగా, వెంటనే షూటింగ్ ఆపేయమని, కొద్దిరోజులు వెయిట్ చేస్తానని చెప్పాడు. షారుక్ చెప్పిన మాటను ప్రియతో తెలుపగా.. షూటింగ్ ఆపవద్దని చెప్పడమే కాకుండా తన పనులు తానే చూసుకుంటానని చెప్పింది. అలాంటి కష్ట సమయంలో కూడా సినిమా పనులపై దృష్టి పెట్టమని ఆమె నన్ను ప్రోత్సహించింది. ప్రియా అందించిన ఆ సహకారమే నా విజయ రహస్యం' అని వేదికపై అట్లీ అన్నారు. తన కష్ట సమయంలో షారుక్ ఏంతో ధైర్యాన్ని ఇచ్చాడని, తండ్రి స్థానంలో షారుక్ ఎప్పుడూ తనవెంటే ఉన్నారని ఆట్లీ ఎమోషనల్ అయ్యాడు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆందోళన చెందనని అట్లీ తెలిపాడు. కాగా, గత జనవరిలో వీరికి మగబిడ్డ జన్మించాడు. అట్లీ, ప్రియా నవంబర్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఇక అట్లీ భార్య ప్రియా కొన్ని తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియా నటించి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నా పేరు శివ, యముడు లాంటి సినిమాల్లో ప్రియా నటించింది. 10years back , we were shooting near #ShahRukhKhan sir home , I stood near his gate and clicked a pic. Now his home gate opened for me and Shah Rukh sir stood at the gate to welcome me ! You are more than my father , my everything sir . #Atlee pic.twitter.com/ulmjyaSOzN — iamsrksneha (@iamsrkian000) August 30, 2023 -
'జవాన్' రెండో ట్రైలర్ విడుదల
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. యూఎస్ఏలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నెలరోజుల కిందటే విడుదలైంది. అందులో భారీ యాక్షన్ సీన్స్‌తో షారుక్ అదరగొట్టాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గపడుతుండడం వల్ల సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అందువల్ల ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్ తాజాగ విడుదల చేశారు. రెండో ట్రైలర్లో కూడా షారుఖ్ దుమ్ములేపాడనే చెప్పవచ్చు. ముంబయ్‌లోని మెట్రోను షారుఖ్ హైజాక్ చేస్తాడు.. ఈ సీన్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. ట్రైలర్లో విజయ్ సేతుపతిని ప్రత్యేకమైన లుక్‌లో చూపించారని చెప్పవచ్చు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ జవాన్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నరు. ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది .ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా(దుబాయ్)పై జవాన్ ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిని నేడు రాత్రి (ఆగష్టు 31) 9 గంటలకు పదర్శించనున్నారు. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌పై షారుక్ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన 'పఠాన్' సినిమా ట్రైలర్‌ను కూడా ఇదివరకే అక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. -
దుమ్ము రేపుతున్న ‘జవాన్’ మేకింగ్ వీడియో
పటాన్ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు జవాన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన రెడ్ చిల్లీ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా లేడి సూపర్‌స్టార్ నయనతార బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ప్రతి నాయకుడుగా విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్ చేసే పనిలో బిజీగా ఉంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. కాగా ఇటీవల ఈ చిత్రంలోని వుంద ఎడమ్ (హిందీలో జిందా బండా, తెలుగులో దుమ్ము దులిపేలా) పల్లవి తో సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ పాటలో నటుడు షారుక్ ఖాన్‌కు తెలుగు , తమిళ పదాల ఉచ్చరణను దర్శకుడు అట్లీ స్వయంగా నేర్పించడం విశేషం. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఈ పాటలో అనేకమంది నృత్య కళాకారుల మధ్య దర్శకుడు అట్లీ నటుడు షారుక్ ఖాన్‌తో కలిసి స్టెప్స్ వేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో జవాన్ చిత్రంపై అంచనాలు నానాటికి పెరిగిపోతున్నాయి. -
స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!
బాలీవుడ్ హీరోలందరూ సౌత్ డైరెక్టర్లపై మనసు పారేసుకుంటున్నారు! ప్రస్తుతం అంతటా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే యంగ్ హీరో వరుణ్ ధావన్.. దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ మూవీలో నటిస్తున్నాడు. షారుక్‌తో 'జవాన్' తీసిన తమిళ దర్శకుడు అట్లీ.. వరుణ్ ధావన్ సినిమాని మాత్రం నిర్మిస్తున్నాడు. కలీస్ దర్శకుడు. ఇదంతా పక్కనబెడితే షూటింగ్ మొదలైన రోజే హీరో గాయపడ్డాడనే వార్త అభిమానుల్ని కంగారు పెట్టింది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) 'బవాల్' సినిమాతో ఈ మధ్య ప్రేక్షకుల్ని పలకరించిన వరుణ్ ధావన్.. 'VD18' వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ప్రోమో కోసం కీలక ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఓ యాక్షన్ సీన్లో భాగంగా పట్టుతప్పి కిందపడిపోయిన వరుణ్ మోచేతికి గాయమైంది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఇతడు.. 'నో పెయిన్ నో గెయిన్' (ఫలితం కావాలంటే నొప్పిని భరించాలి) అని రాసుకొచ్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమాతో హీరోయిన్ కీర్తి సురేశ్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. వామిక గబ్బి మరో హీరోయిన్. ఇదిలా ఉండగా గతేడాది 'భేడియా' చిత్రంతో హిట్ కొట్టిన వరుణ్.. మొన్నీ మధ్య 'బవాల్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే పెట్టుకుని, గట్టిగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!) -
కీర్తి సురేష్ ఉంటే ఆ సినిమా రిజల్ట్ ఇదేనా?
ఒకటి రెండు చిత్రాలు ప్లాప్ అయితే ఆ చిత్రాల్లో నటించిన హీరోయిన్లను ఐరన్‌లెగ్ అనీ, వారి పని అయిపోయిందని సినీ వర్గాల్లో ప్రచారం జరగడం పరిపాటిగా మారింది. అయితే అలా ఒకటి రెండు చిత్రాల ప్లాప్‌లతో హీరోయిన్ల కెరీర్‌ను అంచనా వేయడం సరికాదు. నటి కీర్తి సురేష్ విషయంలోనూ ఇదే జరిగింది. మొదట మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కీర్తీసురేశ్ అక్కడ కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టాలీవుడ్లోకి రంగప్రవేశం చేశారు. (ఇదీ చదవండి; Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) ఇక్కడ మహానటి చిత్రంతో అనూహ్య విజయాన్ని అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అయితే ఆ తరువాత ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో కీర్తీసురేశ్ చాప్టర్ క్లోజ్ అనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇటీవల తెలుగులో నటించిన దసరా, తమిళంలో నటించిన మామన్నన్ చిత్రాల విజయాలు ఆమెను మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చాయి. తాజాగ భోళా శంకర్‌లో కూడా చిరంజీవికి చెల్లెలుగా నటించింది. దీంతో కీర్తి మళ్లీ బిజీ నాయకిగా మారారు. అంతేకాదు బాలీవుడ్లో బెర్త్‌ను ఖరారు కూడా చేసుకున్నారు. నిజానికి కీర్తి సురేష్‌కు ఇంతకు ముందే హిందీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈమె బాలీవుడ్ ఎంట్రీకి ఆసక్తి చూపలేదని ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఈ బ్యూటీని తమిళ యువ దర్శకుడు అట్లీ బాలీవుడ్‌కు తీసుకెళుతున్నారని సమాచారం. తమిళంలో నటుడు విజయ్ హీరోగా వరుసగా మూడు హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవల బాలీవుడ్‌లోకి ప్రవేశించి షారూక్ ఖాన్ హీరోగా జవాన్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా నటి నయనతారను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా తాజాగా అట్లీ బాలీవుడ్లో నిర్మాతగా పరిచయం అవుతూ నటి కీర్తి సురేష్‌ను అక్కడకు తీసుకెళ్తున్నారు. తమిళంలో విజయ్ హీరోగా ఆయన తెరకెక్కించిన తెరి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో విజయ్ పాత్రను వరుణ్ ధావన్ పోషించనున్నారని, నటి సమంత పాత్రలో కీర్తి సురేష్ నటించనున్నారని సమాచారం. కాగా ఎమీజాక్సన్ పాత్రలో నటి వామిక గబ్బి నటించనున్నట్లు తెలిసింది. దీనికి కలీస్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు తమిళంలో జీవా హీరోగా కీ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
Jawan: లుంగీ డాన్స్‌తో దుమ్ము రేపిన షారూఖ్ ఖాన్, ప్రియమణి
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ పాటకు ప్రియమణితో కలిసి షారుఖ్ అదిరిపోయే స్టెప్పులేశాడు. తాజాగా ఈ జోడి మరోసారి లుంగీ డాన్స్‌తో అదరగొట్టింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తోన్న చిత్రం జవాన్. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘దుమ్మే దులిపేలా..’సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో దాదాపు 1000 మందితో కలిసి షారుఖ్ స్టెప్పులేశాడు. బ్యాగ్రౌండ్లో ఉండే 1000 డ్యాన్సర్స్ లుంగీ కట్టుకొని డ్యాన్స్ చేయడం ఈ పాట స్పెషల్. ఇందులో ప్రియమణి మరోసారి కింగ్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 1,2,3,4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ అంటూ షారూక్, ప్రియమణిని మరోసారి చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. లార్జర్ దేన్ లైఫ్ విజువల్స్, పాజిటివ్ ఎనర్జీతో ఈ పాట షారూఖ్‌కి మ్యూజిక్‌పై ఉన్న కనెక్షన్‌ను ఎలివేట్ చేస్తోంది. ఈ పాటకు 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్ రావటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న ‘జవాన్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. -
'జవాన్' మొదటి పాట రిలీజ్.. దీనికి పెట్టిన ఖర్చుతో సినిమానే తీయవచ్చు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'జవాన్'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ 'జిందా బందా' తెలుగులో 'దుమ్ము దులిపేలా'ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పాటకోసం హైదరాబాద్,చెన్నై, బెంగళూరు, ముంబయి నుంచి వెయ్యికి మందికి పైగా మహిళ డ్యాన్సర్లన రప్పించి షూట్ చేశారు. వీరందరితో పాటు సన్యా మల్హోత్రా, ప్రియమణిలతో షారుఖ్ వేసిన స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవుతారు. ఇందులో ఆయన చాలా యంగ్ లుక్‌లో కనిపించారు. (ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?) ఈ పాటను ఐదు రోజుల పాటు చిత్రీకరించగా అందుకు అయిన ఖర్చు సుమారుగా రూ.15 కోట్లు అని సమాచారం. ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ పాడితే.. నృత్య దర్శకుడు శోభి వారందరితో అదిరిపోయే స్టెప్పులు వేయించారు. ఈ పాటకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. -
ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం విడుదలై చాలా రోజులైంది. కనెక్ట్ చిత్రం తర్వాత నయనతార తెరపై కనిపించలేదు. ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో పారితోషికాన్ని పెంచుకుంటూనే పోతున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!) ఈ సంచలన భామ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన తొలి చిత్రం జవాన్. షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఇక క్రేజీ బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. కాగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అట్లీకి నటి నయనతార లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. ఈయన తొలి చిత్రం రాజారాణిలో నయనతారనే కథానాయకి. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా రూపొందించిన బిగిల్ చిత్రంలోని ఈమెనే హీరోయిన్. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా తన తొలి హిందీ చిత్రంలోను నయనతారనే కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమెకు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం ముట్ట జెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ హీరోయిన్లతో పోస్తే ఇది తక్కువే అయినా దక్షిణాది హీరోయిన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. కాగా జవాన్ తన తొలి హిందీ చిత్రం కావడంతో రిజల్ట్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు ) -
ఒక్క ట్రైలర్.. మూడు సినిమాలు కనిపించాయ్!
Jawan Trailer Review: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ డ్రామాగా తీస్తున్న ఈ సినిమాలో షారుక్ తోపాటు నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 'పఠాన్' లాంటి వెయ్యి కోట్ల మూవీ తర్వాత షారుక్ చేస్తున్న చిత్రమిదే. దీంతో అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ఈ క్రమంలోనే 'జవాన్' అంతకు మించి ఉండబోతుందనేలా ట్రైలర్ ఉంది. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) 'జవాన్' కథేంటి? ట్రైలర్‌ని చాలావరకు ఎలివేషన్స్ సీన్స్‌తో నింపేశారు. కాస్త స్టోరీని మాత్రం చెప్పి చెప్పనట్లు చూపించారు. మా అంచనా ప్రకారం.. జైల్లో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు(షారుక్ ఖాన్) గతంలో తల్లికి జరిగిన అన్యాయంపై పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు. దీంతో ఆమె బాధకి కారణమైన వాళ్లని చంపాలనుకుంటాడు. ఎంతకైనా తెగిస్తుంటాడు. మరోవైపు ఇతడిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ (నయనతార), విలన్(విజయ్ సేతుపతి) వేర్వేరుగా ప్రయత్నిస్తుంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ. కాపీ షాట్స్! 'జవాన్' ట్రైలర్ అంతా బాగానే ఉంది. అయితే షారుక్ ముఖానికి సగం మాస్క్ పెట్టుకున్న సీన్ 'అపరిచితుడు'లో విక్రమ్‌ని.. చిన్నపిల్లాడ్ని గాల్లో ఎత్తి పట్టుకునే సీన్ 'బాహుబలి' మొదటి భాగాన్ని.. బాడీ మొత్తాన్ని క్లాత్‌తో కప్పేసుకున్న సీన్ 'మూన్ నైట్' వెబ్ సిరీస్‌ని గుర్తుచేసింది. ట్రైలర్ లో కనిపించి అమ్మాయిల గ్యాంగ్.. విజయ్ 'బిగిల్' చిత్రాన్ని జ్ఞాపకం తెచ్చింది. చివర్లో షారుక్ గుండుతో కనిపించే సీన్ చూడగానే 'శివాజీ'లో రజినీకాంతే గుర్తొచ్చాడు. అయితే ఇవన్నీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికైతే ఓకే.. లేదంటే మొదటికే మోసపోయే అవకాశముంది. (ఇదీ చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!) Your thoughts on Atlee getting inspiration from other movies for #JawanPrevue?#ShahRukhKhan pic.twitter.com/ZLyHki7OJn — Manobala Vijayabalan (@ManobalaV) July 10, 2023 -
కౌంట్ డౌన్ షురూ.. షారూక్ ఖాన్ ‘జవాన్’ క్రేజీ అప్డేట్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘జవాన్’. ఈ చిత్రం కోసం ప్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. జవాన్ ప్రివ్యూను జూలై 10న ఉదయం 10:30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు షారూక్ తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!) అయితే ఈ సినిమాను ఎలా ఉండబోతుంది? అసలు షారూక్ ఖాన్ స్టార్ డమ్‌ను అట్లీ ఎలా చూపించబోతున్నారు? అని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాతో పాటు కౌంట్ డౌన్లో అందరూ భాగస్వామ్యం కావాలని మేకర్స్ ప్రకటించారు. కాగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మాతగా.. జవాన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: నా నడుము 22.. ఆ రోజులు కనుమరుగై పోయాయి: స్టార్ హీరోయిన్) मैं पुण्य हूँ या पाप हूँ?... मैं भी आप हूँ... Main punya hoon ya paap hoon?... Main bhi aap hoon…#JawanPrevueOn10July#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/GI3RqgVGqr — Shah Rukh Khan (@iamsrk) July 8, 2023 -
ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురి హీరోయిన్ల కాంబో రిపీట్
కాంబినేషన్ రిపీట్ కావడం కామన్. అయితే హిట్ కాంబినేషన్‌రిపీట్ అయినప్పుడు ‘హిట్ రిపీట్’ కావడం ఖాయం అనే అంచనాలు ఉంటాయి. తాజాగా మూడు కాంబినేషన్ల మీద అలాంటి అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్–పూజా హెగ్డే, వెంకీ కుడుముల–రష్మికా మందన్నా, అట్లీ–నయనతార... ఈ ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురి హీరోయిన్ల కాంబో రిపీట్ అవుతోంది. ఆ విశేషాల్లోకి వెళదాం. త్రివిక్రమ్ – పూజా హెగ్డే తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే కథానాయికగా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018). ఈ సినిమాలో అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ ఉన్న అరవిందపా త్ర చేశారు పూజా హెగ్డే. నటిగా తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఈ క్యారెక్టర్ హెల్ప్ అయింది. దాంతోపా టు సినిమా కూడా ఘనవిజయం సాధించడంతో పూజా కెరీర్‌కి ప్లస్ అయింది. ఆ తర్వాత రెండేళ్లకు ‘అల.. వైకుంఠపురములో’ సినిమా ప్లాన్ చేసి, అందులోనూ పూజా హెగ్డేని తీసుకున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాలో పూజా హెగ్డే చేసిన అమూల్య క్యారెక్టర్ ఆమెకు ప్లస్ అయింది. ‘అల..’తో మరో హిట్ సినిమా ఆమె ఖాతాలో పడింది. ఇప్పుడు మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనూ పూజానే హీరోయిన్. ఈ సినిమాలో పూజా హెగ్డేపా త్ర ఎలా ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది. వెంకీ కుడుముల – రష్మికా మందన్నా ఒక మీడియమ్ బడ్జెట్ సినిమాలో చేసిన సింపుల్, హోమ్లీ క్యారెక్టర్ ఆ తర్వాత పెద్ద బడ్జెట్ సినిమాలు, గ్లామరస్ రోల్స్ చేసే రేంజ్‌కి తీసుకెళుతుందని ‘ఛలో’ (2018) సినిమా ఒప్పుకున్నప్పుడు రష్మికా మందన్నా ఊహించి ఉండరు. కానీ ఆ మేజిక్ జరిగింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన ‘ఛలో’ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా తెలుగుకి పరిచయం అయ్యారు. తొలి సినిమానే హిట్. ఆ తర్వాత పెద్ద సినిమాలు చేస్తూ వచ్చిన రష్మిక మళ్లీ రెండేళ్లకు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ (2020) సినిమాలో మంచిపా త్ర చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మళ్లీ వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక ఓ సినిమా చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ‘భీష్మ’లో నటించిన నితిన్ ఇందులో హీరో. ఆ విధంగా వెంకీ–నితిన్–రష్మికలకు ఇది రెండో సినిమా. ఈ హిట్ కాంబినేషన్ చేస్తున్న ఈ సినిమా ఇటీవలే ఆరంభమైంది. అట్లీ – నయనతార దర్శకుడిగా అట్లీ తొలి సినిమా ‘రాజా రాణి’ (2013) చేస్తున్నప్పటికి నయనతార స్టార్ హీరోయిన్. ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి ఆమె ‘రాజా రాణి’ చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి చిత్రం తర్వాత అట్లీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఇక మళ్లీ నయనతారను ఆయన కథానాయికగా తీసుకున్న చిత్రం ‘బిగిల్’ (2019). ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో నయనతార ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈసారి ఈ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్లో రానున్నది హిందీ చిత్రం ‘జవాన్’. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా నయనతార బాలీవుడ్‌కి కథానాయికగా పరిచయం అవుతున్నారు. సౌత్‌లో హిట్స్ ఇచ్చిన ఈ కాంబో నార్త్‌లోనూ ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తుందని ఊహించవచ్చు. -
బన్నీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్!
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఇండియా వైడ్ హీరోలందరూ తమ మార్కెట్ ను పెంచుకోవటానికి ట్రై చేస్తున్నారు. అందుకే తమ సినిమాల్లో ఇతర భాషల స్టార్ హీరోస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం తమ సినిమాల్లో సౌతిండియా యాక్టర్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అంతేకాదు సౌతిండియా స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి ఓ బంపరాఫర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. సౌతిండియా డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్‌తో ఓ బాలీవుడ్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నయన తార నటిస్తుంది. విజయ్ సేతుపతి, రానా, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సౌతిండియా మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు షారూఖ్... ఈ సినిమా తమిళ్ వెర్షన్ లో ఇళయ దళపతి విజయ్ ని...తెలుగు వెర్షన్ లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్ లో కనిపించేలా ప్లాన్ చేశాడు. డైరెక్టర్ అట్లీ..బన్నీ ని అప్రోచ్ కూడా అయ్యాడు..ఈ మూవీ కథ కూడా నేరేట్ చేయడం జరిగింది. ముందు ఇంట్రెస్ట్ చూపించిన బన్నీ...ఇప్పుడు నటించటానికి నో చెప్పాడనే మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంవలో పుష్ఫ 2 సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు. పుష్ప 2 కోసం గెడ్డం ఉన్న లుక్ ని మెయింటేన్ చేస్తున్నాడు. కానీ జవాన్ లో బన్నీ లుక్ మార్చాల్సి ఉంది. దీంతో జవాన్ లో తన క్యారెక్టర్ నచ్చిన కూడా...లుక్ ఛెంజ్ కావాల్సి ఉండటంతో డైరెక్టర్ అట్లీకి నో చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు మేకర్స్ దృష్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై పడింది. ఆస్కార్ అవార్డ్స్ నుంచి చెర్రీ రాగానే అప్రోచ్ అయ్యేందుకు రెడీ ఉన్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కి....రామ్ చరణ్ కి మధ్య గుడ్ రిలేషన్ ఉంది. కాబట్టి జవాన్ మూవీలో గెస్ట్ రోల్ రిక్వెస్ట్ ను ..యాక్సెప్ట్ చేస్తాడనే ప్రచారం నెట్టింట బాగా సాగుతోంది. ఈ ఆఫర్ విషయంలో రామ్ చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్...శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15లో నటిస్తున్నాడు. -
స్టార్ హీరో సినిమాకు బన్నీ నో చెప్పేశాడా?.. కారణం అదేనా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అంతా ఇంతా కాదు. పుష్ప మూవీ భారీ హిట్ అవడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పైనే పూర్తిగా దృష్టి సారించారు. అయితే గతంలో బన్నీ బాలీవుడ్ సినిమాలో నటించనున్నారని అప్పట్లో ఓ వార్త తెగ వైరలైంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మూవీ జవాన్‌లో ప్రత్యేక పాత్రలో బన్నీ నటిస్తారని అందరూ భావించారు. అల్లు అర్జున్ నటిస్తే బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ అభిమానులకు దగ్గర కావొచ్చని అట్లీ ప్లాన్ చేశారు. కానీ తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ టాక్ చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా బన్నీ జవాన్‌లో నటించేందుకు ఒప్పుకోలేదని ఓ వార్త వైరలవుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. పుష్ప-2 షూటింగ్ బిజీ షెడ్యూల్ వల్లే జవాన్‌లో అతిథి పాత్రకు నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ పూర్తిస్థాయిలో పుష్ప-2 పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. చదవండి: జవాన్‌లో బన్నీ.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..! -
జవాన్‌లో బన్నీ.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..!
ఇటీవలే పఠాన్ మూవీ సక్సెస్ అందుకున్నారు బాలీవుడ్ బాద్షా. ఆ తర్వాత వెంటనే అట్లీ డైరెక్షన్లో జవాన్ షూటింగ్లో బిజీ అయిపోయారు. ఇటీవలే చెన్నై షెడ్యూల్లో పాల్గొన్న షారుక్ నయనతార ఇంటికి కూడా వెళ్లారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు చెందిన మరో క్రేజీ అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. జవాన్‌లో ఓ అతిథి పాత్ర కోసం బన్నీని చిత్రబృందం సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అట్లీ ఈ సినిమాపై పెద్ద ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో కనిపిస్తే టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలుస్తుందని ఆయన అభిప్రాయం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే ఈ చిత్రబృందంతో కలవనుంది. -
స్టార్ హీరోకు ముద్దు పెట్టిన నయనతార..వీడియో వైరల్!
పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. తన తదుపరి చిత్రం అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార కనిపించనుంది. షూటింగ్ కోసం చెన్నై చేరుకున్న హీరో నయనతార ఇంటికి వెళ్లారు. అయితే షారుక్ ఖాన్ తిరిగి వెళ్తుండగా.. నయనతార అతనికి ముద్దు పెడుతూ వీడ్కోలు పలికింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గుడ్ బై చెప్పేందుకు నయనతార ఇంటివద్ద అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జవాన్ షూటింగ్లో పాల్గొన్న షారుక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం చివరి షెడ్యూల్లో నయనతార కూడా పాల్గొంటోంది. పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎస్ఆర్కే మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయారు. జవాన్‌లో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన జవాన్ జూన్ 2023లో థియేటర్లలో విడుదల కానుంది. The way Shah Rukh kissed Nayanthara goodbye @iamsrk you have my whole heart 😭❤️ #Nayanthara #Jawan pic.twitter.com/0zoBaBQGMP — Samina ✨ (@SRKsSamina_) February 11, 2023 1 more Exclusive Video: Welcome King 👑 @iamsrk in Namma #CHENNAI Nayanthara saying goodbye to SRK & King gave good bye kiss 🥹😭 Our #Chennai team reached to capture @iamsrk sir in our camera 📸 We clicked #ShahRukhKhan𓀠 while leaving at #Nayanthara’s apartment in #CHENNAI pic.twitter.com/7trHm571eW — ♡♔SRKCFC♔♡™ (@SRKCHENNAIFC) February 11, 2023 -
బిడ్డకు జన్మనిచ్చిన నటి.. తండ్రైన స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రయ్యారు. కొన్ని నెలల క్రితమే తన భార్య ప్రియా మోహన్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు అట్లీ. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అట్లీ ఇన్‌స్టాలో షేర్చేస్తూ..'అవును వారు చెప్పింది నిజమే. ప్రపంచంలో దీన్ని మించిన ఆనందం మరెక్కడా లేదు. మాకు మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా. ' అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియ దంపతులు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో వారి ఇంట్లో ఎక్కడా లేని సంతోషం నెలకొంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. They were right 😍 There’s no feeling in the world like this ♥️ And just like tat our baby boy is here! A new exciting adventure of parenthood starts today! Grateful. Happy. Blessed. 🤗♥️🙏🏼 @priyaatlee pic.twitter.com/TzvoiFPzyc — atlee (@Atlee_dir) January 31, 2023 View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత.. తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ప్రియ మోహన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్చేస్తూ.. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రెగ్నెంట్. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్ చేసింది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియలు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత అట్లీ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
చిక్కుల్లో షారుక్ చిత్రం, డైరెక్టర్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు
‘కింగ్ ఖాన్’ జవాన్ మూవీ చిక్కుల్లో పడింది. ఈ మూవీ డైరెక్టర్ అట్లీపై ఓ కోలీవుడ్ నిర్మాత ఫిర్యాదు చేసినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ బాద్షా షారుక్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో హిందీలో జవాన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. దీంతో ఈ మూవీపై సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ తనదని, డైరెక్టర్ అట్లీ దానిని కాపీ కొట్టాడని కోలీవుడ్ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఆరోపించాడు. చదవండి: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’ అంతేకాదు డైరెక్టర్ అట్లీపై నిర్మాత మండలిలో ఫిర్యాదు చేసి జవాన్ టీంకి షాకిచ్చాడు. 2006లో తాము విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కించిన ‘పేరరసు’ సినిమా కథనే అట్లీ ‘జవాన్’ పేరుతో హిందీలో నిర్మిస్తున్నాడంటూ ఆయన ఆరోపించాడు. అయితే ఈ సినిమాపై షారుక్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తమిళంలోనూ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జవాన్ మూవీపై కాపీ రైట్ ఆరోపణలు రావడంతో బాద్షా ఫ్యాన్స్ ఆందోళన చేందుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు డైరెక్టర్ అట్లీ స్పందించకపోవడం గమనార్హం. మరి దీనిపై జవాన్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత -
మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్
తమిళసినిమా: కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్‌పై మక్కువ చూపుతున్నారనడంలో ఎలాంటి సందేహమే లేదు. నటుడు విజయ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. కమల్‌హాసన్, రజనీకాంత్ వంటి సీనియర్ హీరోలు ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించారు. నటుడు కార్తీ కూడా ఆ మధ్య ఊపిరి అనే తెలుగు చిత్రంలో నాగార్జునతో కలిసి నటించారు. తాజాగా నటుడు సూర్య కూడా మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించనున్న భారీ బడ్జెట్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్ తెలుగులో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఈయన ప్రస్తుతం వారీసు (తెలుగులో వారసుడు) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం కాబోతున్నారు. దిల్‌రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్న ఇందులో నటి రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా విజయ్ తదుపరి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన నటించే 67వ చిత్రం అవుతుంది. ఇప్పుడు విజయ్ 68వ చిత్రం గురించి ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఆయన తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌కు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఆ సంస్థ నుంచి విజయ్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు, ఆయన ఇటీవల మైత్రీ మూవీస్ అధినేతలకు కథను కూడా వినిపించినట్లు సమాచారం. ఇప్పటికే విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరీ, మెర్సల్ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. అట్లీ ప్రస్తుతం షారుఖ్‌ఖాన్, నయనతార జంటగా హిందీలో జవాన్ చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి విజయ్‌తో చేసే చిత్ర కథపై దృష్టి సారిస్తున్నట్లు కోడంబాక్కం టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
జవాన్‌కు బై బై
వెండితెర ‘జవాన్’కు రీసెంట్గా బై బై చెప్పారు హీరోయిన్ దీపికా పదుకొనె. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జవాన్’. విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ప్రారంభించిన ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో షారుక్, దీపికా, విజయ్ సేతుపతిలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించింది యూనిట్. ప్రస్తుతం ‘జవాన్’ షూటింగ్ జరుగుతున్నప్పటికీ దీపిక పాత్ర చిత్రీకరణ పూర్తయింది. దీంతో యూనిట్‌కి బై బై చెప్పారామె. ఈ సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేశారనీ, అందులో ఒక షారుక్‌కి భార్య పాత్రలో దీపికా నటించార ని టాక్. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎక్కువగా ఉండదట. ఓ అతిథి పాత్ర అని బాలీవుడ్ టాక్. కాగా ‘జవాన్’ కాకుండా ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, రణ్వీర్ సింగ్ ‘సర్కస్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు దీపికా పదుకొనె. -
పెళ్లి అనంతరం తొలిసారి షూటింగ్ సెట్లో నయన్ సందడి!
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్ ఇటీవల వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నూతన దంపతులు దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమల క్షేత్రానికి సైతం వెళ్లి వచ్చారు. అంతేకాదు, తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా సుమారు లక్ష మందికి విందు భోజనాలు అందించారు. ఆనంతరం థాయ్‌లాండ్‌కు హానీమూన్ వెళ్లిన ఈ కొత్త దంపతులు నిన్న తిరిగి వచ్చారు. హానీమూన్ నుంచి వచ్చిరాగే నవ వధువు నయన్ షూటింగ్ సెట్లో అడుగు పెట్టిందట. నయన్ జావాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక హానీమూన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే నయన్ షూటింగ్ కోసం ముంబైలో వాలిపోయిందట. ఈ రోజు జవాన్ షూటింగ్లో నయనతార పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా పెళ్లి అనంతరం తొలిసారి నయన్ షూటింగ్లో పాల్గొని సందడి చేసిందని తాజాగా వార్తలు వస్తున్నాయి. పెళ్లి అనంతరం షూటింగ్ కాస్తా బ్రేక్ ఇస్తుందని అంత అనుకున్నారు. అంతేకాదు ఇక సినిమాలకు కూడా బ్రేక్ ఇస్తుందని, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌కు కూడా నయన్ కొత్త కండిషన్స్ పెడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా ఆమె జవాన్ షూటింగ్లో పాల్గొనడం వార్తల్లో నిలిచింది. ఇక దీనితో పాటు నయన్ తెలుగులో చిరంజీవి సరసన గాడ్ ఫాదర్ మూవీ చేస్తోంది. -
షారుక్ యాక్షన్ మూవీ, జవాన్‌గా రానున్న హీరో
ఎన్నో ఆశలు పెట్టుకున్న జీరో (2018) మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టేందుకు చాలా సమయమే తీసుకున్నాడు షారుక్ ఖాన్. ఎందరో దర్శకుల దగ్గర కథలు విని ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షారుక్ సిద్దార్థ్ ఆనంద్‌తో పటాన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు రాజ్‌కుమార్ హిరానీతో డంకీ మూవీ చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త సినిమా అధికారికంగా ప్రకటించాడు హీరో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో యాక్షన్ మూవీ చేస్తున్నట్లు వెల్లడించాడు. శుక్రవారం ఈ సినిమా టైటిల్‌ను వెల్లడిస్తూ మోషన్ పోస్టర్ వదిలాడు. ఇందులో గాయాలపాలైన షారుక్ ముఖానికి ఓ బట్ట కట్టుకుని చేతిలో గన్‌తో మాస్ లుక్‌లో కనిపించాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 2న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జవాన్ మూవీ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మించనున్నారు. కాగా షారుక్ మాధవన్ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’, రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మస్త్ర’ చిత్రాల్లో అతిథిగా వెండితెరపై కనిపించనున్నాడు. చదవండి: సందీప్ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంది: మేజర్ సందీప్ తండ్రి 'విక్రమ్' మూవీపై నెటిజన్స్ టాక్ ఎలా ఉందంటే.. -
నయనతారతో షారుక్ ఖాన్ సినిమా, టైటిల్ ఫిక్స్!
మాస్ డైరెక్టర్‌గా అట్లీకి కోలీవుడ్‌లో మంచి పేరుంది. అట్లీ- విజయ్ కాంబినేషన్లో వచ్చిన తెరి, మెర్సిల్, బిగిల్ సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే! తెలుగులోనూ ఈ సినిమాలు మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఈ దర్శకుడు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నయనతార కథానాయికగా నటిస్తుండగా సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు జవాన్ అన్న టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు జవాన్ టీజర్ కూడా రెడీ అయిందని, దీని నిడివి ఒక నిమిషం 34 సెకన్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో జవాన్ (#jawan), షారుక్ ఖాన్ (#ShahRuKhan) హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నాయి. #Jawan Teaser - 1 mins 34 secs#ShahRukhKhan — Manobala Vijayabalan (@ManobalaV) June 1, 2022 #Jawan Teaser is FANTASTIC! 2023 belongs to King Khan #ShahRukhKhan ! He is back with Super Bang ! 🔥🔥🔥🔥🔥 — Umair Sandhu (@UmairSandu) June 1, 2022 Mentioned ages ago... @iamsrk 👑💞 3 releases.. 》#Pathaan with #SiddharthAnand in Jan 》#Jawan (tentative) with @Atlee_dir in Jun 》#Dunki with @RajkumarHirani in Dec .. all 3 being planned for 2023 !!! ❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖❤️🔥💖 pic.twitter.com/ExsaaAL8QP — Girish Johar (@girishjohar) June 1, 2022 చదవండి: ‘ఛాతీలో భారంగా ఉందంటూ కుప్పకూలిన కేకే.. అలా చేసుంటే బతికేవారు’ మేనేజర్‌ను ఒంటరిగా కలిస్తే ఎక్కువ డబ్బులిస్తామన్నారు -
అల్లు అర్జున్‌కు పెరిగిన డిమాండ్.. 100 కోట్ల పారితోషికం ?
'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ మారిపోయింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పతో నార్త్‌లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా మారాడు. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ 'ది రూల్' సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బన్నీ తర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటా అని ఆసక్తి నెలకొంది. అయితే తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్‌కు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం అట్లీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు భోగట్టా. అయితే ఈ చర్చలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ లైకా ప్రొడక్షన్ బన్నీకి రూ. 100 కోట్ల పారితోషికం ఆఫర్ చేసి అల్లు అర్జున్ ఒప్పుకుంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నిలుస్తాడు. ప్రభాస్ కూడా తన సినిమాలకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా ఇలా ఉంటే అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతారలతో 'లయన్' సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్'తో పాటు వేణు శ్రీరామ్‌తో ఒక సినిమా, కొరటాల శివతో రివేంజ్ డ్రామా మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ఏఆర్ మురుగదాస్, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీనులతో కూడా సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
షారుక్ ఖాన్.. ఇక చకచకా!
షారుక్ ఖాన్ ఇక స్పీడ్ పెంచనున్నారు. 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రం తర్వాత ఆయన వెండితెరపై కనిపించలేదు. ‘జీరో’ ఆశించినంత సక్సెస్‌ను ఇవ్వలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న షారుక్ ఆ తర్వాత ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్, అట్లీ దర్శకత్వాల్లో సినిమాలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి షూటింగ్స్‌ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాల షూటింగ్స్ స్పీడ్‌గా జరుగుతున్న టైమ్‌లో తనయుడు అర్యన్‌ఖాన్ ఓ కేసులో అరెస్ట్ కావడంతో షారుక్ ఖాన్ ఆ పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో ఆయన చేస్తున్న సినిమాలకు స్పీడ్ బ్రేకర్స్ పడ్డాయి. ఇటీవల ఆర్యన్‌ఖాన్ విడుదల కావడంతో తన సినిమాలపై షారుక్ మళ్లీ ఫోకస్ పెట్టారని బాలీవుడ్ సమాచారం. తన సినిమాల్లోని గెటప్స్‌కు తగ్గట్లుగా ఫిజిక్‌ను చేంజ్ చేసేందుకు జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారట ఆయన. ముందుగా ‘పఠాన్’ చిత్రాన్ని, ఆ తర్వాత అట్లీ సినిమాను పూర్తి చేసేసి, ఆ నెక్ట్స్ రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించే సినిమాకు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. ‘పఠాన్’ షూటింగ్ తిరిగి ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. (చదవండి: సోనూసూద్‌కు బీఎంసీ మరో షాక్, మాట నిలబెట్టుకోలేదంటూ హెచ్చరిక) -
‘ఆడవాళ్లు ఎప్పుడూ ఆడవాళ్లే’.. స్ట్రీట్ షాపింగ్ చేసిన నయనతార
దేవాలయాలను సందర్శించారు.. స్ట్రీట్ షాపింగ్ చేశారు... దసరా సందర్భంగా విఘ్నేష్ శివన్, నయనతార బిజీ బిజీగా గడిపారు. ఇదంతా తమిళ నటి, లేడి సూపర్ స్టార్ నయనతార గురించే. షారుక్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి ఇటీవల నయనతార ఇటీవలే పుణె వెళ్లారు. ఈ షూటింగ్‌కి కాస్త గ్యాప్ రావడంతో లవర్ విఘ్నేష్‌తో కలసి షిర్డీ వెళ్లారు. ఆ తర్వాత ముంబై చేరుకుని ముంబై దేవి, మహాలక్ష్మి, సిద్ధి వినాయక ఆలయాలను సందర్శించారు. అంతేకాదు.. నయన స్ట్రీట్ షాపింగ్ కూడా చేశారు. ఒక బ్యాగుని బేరం చేస్తూ కనిపించారామె. ఆమె ఇలా రోడ్ సైడ్ షాపింగ్ చేయడం ఓ హాట్ టాపిక్. పైగా ప్రచారంలో ఉన్న వీడియోలో నయన బేరమాడుతూ కనిపించారు. దాంతో ‘ఆడవాళ్లు ఎప్పుడూ ఆడవాళ్లే... ఇలా బేరమాడుతుంటే చూడ్డానికి క్యూట్‌గా ఉంది’ అని నెటిజన్లు పోస్ట్ చేశారు. చదవండి: నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
షారుక్ ఖాన్ సినిమాలో విజయ్?
Thalapathy Vijay to Share Screen Space with Shah Rukh Khan: షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్లు నయనతార, ప్రియమణి, సాన్యా మల్హోత్రా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పుణేలో ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. తమిళ హీరో విజయ్ ఈ సినిమాలో అతిథి పాత్ర చేయనున్నారట. గతంలో తెలుగు ‘విక్రమార్కుడు’ హిందీ రీమేక్ ‘రౌడీ రాథోడ్’ (2012)లో విజయ్ గెస్ట్‌గా కనిపించారు. ఇప్పుడు ‘జవాన్’ కమిట్ అయితే తొమ్మిదేళ్ల తర్వాత హిందీలో విజయ్ కనిపించే సినిమా ఇదే అవుతుంది. చదవండి : ‘సర్కారి వారి పాట’ సెట్లో ప్రత్యక్షమైన ఎంపీ శశిథరూర్ రేపు పవన్- హరీశ్‌శంకర్ మూవీ నుంచి అప్డేట్ -
నయనతార బాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..
ప్రస్తుతం ‘పఠాన్’ సినిమాతో బిజీగా ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ త్వరలో దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అట్లీ చెప్పిన ఫైనల్ కథకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై ఫోకస్ పెట్టారని టాక్. ఈ ప్రక్రియలో భాగంగానే తన దర్శకత్వంలో వచ్చిన ‘రాజా– రాణి’ (2013), ‘బిగిల్’ (2019) చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార పేరును పరిశీలిస్తున్నారట అట్లీ. ఆల్రెడీ నయనతారతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. అయితే పదిహేనేళ్లుగా సౌత్‌లో అగ్ర కథనాయికగా రాణిస్తున్న నయనతార ఇంతవరకూ హిందీ సినిమా చేయలేదు. మరి.. షారుక్‌తో నయనతార జోడీ కడతారా? హిందీ సినిమాకు నయనతార సైన్ చేస్తారా? వేచి చూడాల్సిందే. చదవండి: నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ -
ఆ వార్త నిజమేనా?
కొన్ని నెలల క్రితం చెన్నై కోడంబాక్కమ్‌లో హల్చల్ చేసిన ఓ వార్త నిజం అయ్యేట్లు ఉంది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో హిందీ నటుడు షారుక్ ఖాన్ హీరోగా ఓ సినిమా రూపొందనుందన్నది ఆ వార్త సారాంశం. ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అట. ఈ సినిమాను పట్టాలెక్కించడానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారట. 2018లో చేసిన ‘జీరో’ తర్వాత షారుక్ ఇప్పటివరకూ సినిమా కమిట్ కాలేదు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా ఫ్లాప్‌తో షారుక్ కథల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు. అట్లీ చెప్పిన కథ బాగా నచ్చిందట. తమిళంలో తేరి, మెర్సల్, బిగిల్ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, మంచి మాస్ డైరెక్టర్ అనిపించుకున్న అట్లీకి హిందీలో ఇది తొలి సినిమా. -
విజిల్ మూవీ రివ్యూ
టైటిల్: విజిల్ (తమిళంలో బిగిల్) జానర్: మాస్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : విజయ్, నయనతార, జాకీష్రాఫ్, కదీర్, యోగిబాబు సంగీతం : ఏఆర్ రహమాన్ దర్శకత్వం : అట్లీ నిర్మాతలు: కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేశ్, కల్పాతి ఎస్ సురేశ్ వరుస విజయాలతో తిరుగులేని ఫామ్‌లో ఉన్న తమిళ స్టార్ హీరో విజయ్. మెర్శల్, సర్కార్ వంటి భారీ సూపర్‌హిట్స్ ఊపుమీదున్న ఆయన.. మరోసారి దర్శకుడు అట్లీతో జతకట్టి ‘విజిల్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో తెరమీదకు వచ్చారు. ఇంతకుమునుపు విజయ్-అట్లీ కాంబినేషన్లో తేరి, మెర్శల్ వంటి బాక్ల్‌బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుండటం, ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తుండటంతో.. హ్యాట్రిక్ సూపర్‌హిట్ ఖాయమని ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్. విజయ్ సరసన నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘విజిల్’ ఎలా ఉంది? ప్రేక్షకులతో ఈల వేయించిందా? ఓసారి తెలుసుకుందాం పదండి. కథ: మైఖేల్ రాజప్ప (విజయ్) స్థానికంగా మంచి రౌడీ. తన మురికివాడలోని వాళ్లను ప్రత్యర్థుల నుంచి కాపాడుకుంటూ ఉంటాడు. స్థానికంగా మంత్రి కాలేజీ మూయించాలని చూస్తే దానిని అడ్డుకుంటాడు. ప్రత్యర్థులు చెడు చేయకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అమ్మాయిల ఫుట్‌బాల్ టీమ్ కోచ్ అయిన మైఖేల్ స్నేహితుడు కిరణ్ తన టీమ్‌ను తీసుకొని అతను ఉండే చోటుకి వస్తాడు. కిరణ్‌తో కలిసి కారులో వెళుతుండగా ప్రత్యర్థులు మైఖేల్‌పై అటాక్ చేస్తారు. ఈ దాడిలో మైఖేల్ రౌడీలను చితగ్గొట్టినప్పటికీ.. అతని విరోధి మాత్రం కిరణ్‌ను గొంతులో కత్తితో పొడుస్తాడు. దీంతో చికిత్స పొందుతూ.. ఆస్పత్రి బెడ్‌కు పరిమితమైన కిరణ్.. తనస్థానంలో మైఖేల్‌ను అమ్మాయిల టీమ్‌కు కోచ్‌గా వెళ్లమని కోరుతాడు. ప్లాష్‌బ్యాక్‌లో బిగిల్‌గా పేరొందిన మైఖేల్ గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు. అతని తండ్రి రాజప్ప (విజయ్) స్థానికంగా పేరుమోసిన రౌడీ. అయినా తన కొడుకు కత్తి పట్టకుండా ఆటలతో పైకి రావాలని కోరుకుంటాడు. ఈక్రమంలో అతను, అతని స్నేహితులు కలిసి నేషనల్ గేమ్స్ ఆడేందుకు వెళ్తుండగా రైల్వే స్టేషన్లో ప్రత్యర్థులు అటాక్ చేసి.. మైఖేల్ కళ్లముందే రాజప్పను చంపేస్తారు. దీంతో జాతీయ కప్ కొట్టాలన్న తన తండ్రి కల రైల్వే స్టేషన్లో ఆగిపోతుంది. పుట్‌బాల్ ప్లేయర్ కావాలనుకున్న మైఖేల్ తండ్రి స్థానంలోకి రౌడీగా మారిపోతాడు. ఈ క్రమంలో కిరణ్ కోరిక మేరకు అమ్మాయిల జట్టుకు కోచ్‌గా మారిన మైఖేల్.. బిగిల్ కప్పు ముఖ్యంరా అన్న తండ్రి కలను నెరవేర్చాడా? కోచ్‌గా ఎలా నిలదొక్కుకున్నాడు? నేషనల్ గేమ్స్‌లో అతనికి ఎదురైన అవాంతరాలు ఏమిటి? అమ్మాయిలు సమాజంలోని ప్రతికూలతలను ఎదుర్కొని ఎలా పోరాడారు? అన్నది తర్వాతి కథ. విశ్లేషణ: స్పోర్ట్స్ డ్రామాకు బలమైన భావోద్వేగాలు ముఖ్యం. తెరమీద కనిపిస్తున్న ఆట నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తూ.. అందులో ప్రేక్షకుడిని మమేకం చేయాలి. అప్పుడే తెరమీద భావోద్వేగాలు పండుతాయి. షారుఖ్ ఖాన్ ‘చక్ దే ఇండియా’, సల్మాన్ ఖాన్ ’సుల్తాన్’,, ఆమీర్ ఖాన్ ‘దంగల్’, మాధవన్ ‘గురు’ సినిమాలు ఈవిధంగా తెరమీద భావోద్వేగాలను అద్భుతంగా పండించి.. ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నాయి. బిగిల్ పేరుకు స్పోర్ట్స్ డ్రామా అయినా అందులో ఫక్తు మాస్ యాక్షన్ సీన్లు బోలెడు ఉన్నాయి. విజయ్‌లాంటి స్టార్ హీరోతో పూర్తిస్థాయి స్పోర్ట్స్ డ్రామా చేయడం బాగుండదనుకున్నాడేమో డైరెక్టర్.. కథ కంటే కూడా ప్రతి 20, 30 నిమిషాలకు ఒక ఫైట్ సీన్..హీరోను ఎలివేట్ చేసే సీన్లతో విసిగించాడు. అంతేకాకుండా సినిమా నిడిమి చాలా ఎక్కువైపోవడంతో కథ మీద దర్శకుడికి పట్టు తప్పినట్టు కనిపిస్తుంది. చాలా సీన్లు సాగదీతతో ఉండి.. తమిళ వాసనలతో బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ భరించడం చాలా కష్టమే. ఫస్టాఫ్‌లో తండ్రీ-కొడుకుగా డ్యుయల్ రోల్స్‌లో విజయ్ పండించిన వేరియేషన్స్, వారి మధ్య అనుబంధం కొంచెం ఆకట్టుకుంటుంది. ఇక, ఫస్టాఫ్‌లో కనిపించే తండ్రి పాత్రకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్టు కనిపించదు. రాజప్ప నేపథ్యమేమిటో పూర్తిగా చూపించకుండానే దర్శకుడు అర్ధంతరంగా ముగించేసిన భావన కలుగుతుంది. ఇక, ఫస్టాఫ్‌లో సాఫ్ట్రోల్లో కనిపించిన ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జేకే శర్మ (జాకీష్రాఫ్) సెకండాఫ్‌లో విలన్‌గా అవతారమెత్తుతాడు. ప్లాష్‌బ్యాక్‌లో రాజప్ప తనను చితకబాదినందుకు.. ఇప్పుడు కోచ్ మైఖేల్, అతని టీమ్‌ను ఓడించి.. ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఇలా మైదానంలో క్రీడాపరమైన ఉద్వేగాల కంటే.. హీరో-విలన్ మధ్య పోటాపోటీ సీన్లు.. కేవలం హీరోయిజాన్ని ఎలివేట్ చేసినందుకు పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే, మన దేశంలో క్రీడల్లోకి వచ్చేందుకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు అట్లీ కొంత నిజాయితీగా చూపించడం ఆకట్టుకుంటుంది. తనకు ప్రేమ కన్నా ఫుట్‌బాలే ముఖ్యమన్నందుకు ఓ ఉన్మాది చేతిలో యాసిడ్ దాడికి గురైన అమ్మాయి.. కోచ్ ఇచ్చిన మనోస్థైర్యంతో తిరిగి జట్టులోకి వచ్చి రాణించడం, పెళ్లయి.. సంప్రదాయ కుటంబంలో గృహిణిగా సెటిలైన యువతి తిరిగి జట్టులోకి రావడం వంటి చక్కని అంశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. ఇక, ఫుట్‌బాల్ గేమ్‌లోనూ భావోద్వేగాల కంటే.. ప్రేక్షకులను కట్టిపడేసి విన్యాసాలను చూపించడానికే ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తోంది. ఏఆర్ రహమాన్ సంగీతం అంతగా ఆకట్టుకోకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన అస్సెట్‌గా నిలిచింది. ముఖ్యంగా శివంగివే పాట స్ఫూర్తిదాయకంగా ఉంది. జీకే విష్ణు నీట్ సినిమాటోగ్రఫి, ఆర్ట్ డైరెక్టర్ ముథురాజు పనితనం సినిమాలో కనిపిస్తోంది. చిత్రస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. సినిమాకు బాగా కత్తెరవేసి.. ట్రిమ్ చేసి.. కథను క్రిస్ప్‌గా తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఎప్పటిలాగే విజయ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోగా.. అతన్ని ప్రేమించే ఏంజిల్ ఆశ్విరాదంగా ఓ మోస్తరు పాత్రకు నయనతార పరిమితమైంది. బలాలు విజయ్ యాక్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నిర్మాణ విలువలు బలహీనతలు ఫస్టాఫ్ సాగదీత సీన్లు సినిమా నిడివి రోటిన్ హీరోయిజం, ఫైట్లు - శ్రీకాంత్ కాంటేకర్ -
‘విజిల్’ ప్రీ రిలీజ్ వేడుక
-
మహిళలకు విజిల్ అంకితం
‘‘తమిళంలో ‘బిగిల్’ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో తెలుగులో ‘విజిల్’కి కూడా అంతే క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఇదేదో తమిళ సినిమా అనో.. దక్షిణాది సినిమా అనో చెప్పడం కంటే ఇండియన్ సినిమా అని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో కంటెంటే కింగ్’’ అని నిర్మాత మహేష్ కోనేరు అన్నారు. ‘పోలీస్, అదిరింది’ వంటి చిత్రాల తర్వాత హీరో విజయ్–డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘బిగిల్’. నయనతార హీరోయిన్. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరాం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ‘విజిల్’ పేరుతో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రేపు ఈ సినిమా విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘అట్లీగారి సినిమాలకు పెద్ద ఫ్యాన్‌ని. విజయ్‌గారితో ఆయన చేసిన సినిమాలకు తెలుగులో పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. ‘విజిల్’ బెస్ట్ మూవీగా నిలుస్తుంది’’ అన్నారు. అట్లీ మాట్లాడుతూ– ‘‘నేను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని చాలా కాలంగా కల కంటున్నాను.. త్వరలోనే ఆ కల నేరవేరనుంది. ఎన్టీఆర్‌గారు మంచి వ్యక్తి. నా ప్రతి సినిమాకు ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ‘విజిల్’ కేవలం ఫుట్‌బాల్ ఆట నేపథ్యంలోనే ఉండదు.. చాలా భావోద్వేగాలుంటాయి. స్త్రీ సాధికారతను తెలియజే సే ఈ సినిమాను మహిళలకు అంకితమిస్తున్నా’’ అన్నారు. -
విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ వచ్చేసింది!
-
విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ వచ్చేసింది!
తమిళ బడా స్టార్ విజయ్ తాజా సినిమా ‘బిగిల్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ‘బిగిల్’ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపిస్తుండగా ఆయన సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్.. ఈ సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా, కోచ్‌గా విభిన్నమైన షేడ్స్‌తో విజయ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి మాస్ యాక్షన్ థ్రిలర్‌గా విజయ్ ఫ్యాన్స్‌కు పండుగ బొనాంజాలా సినిమా ట్రైలర్ ఉంది. అట్లీ దర్శకత్వంలో బిగిల్ తెరకెక్కింది. విజయ్ - అట్లీ కాంబినేషన్లో గతంలో వచ్చిన తెరీ, మెర్సల్ సినిమాలు భారీ విజయం సాధించాయి. -
‘మెర్శల్’ డైరెక్షన్లో ఎన్టీఆర్ కొత్త సినిమా!
చెన్నై : కోలీవుడ్‌లో అపజయమెరుగని దర్శకుడిగా రాణిస్తున్న యువ దర్శకుడు అట్లీ. రాజారాణి చిత్రంలో దర్శకుడిగా తన పయనాన్ని ప్రారంభించిన ఈయన దర్శకుడు శంకర్ శిష్యుడన్న విషయం తెలిసిందే. తొలి చిత్రంతో శభాష్ అనిపించుకున్న అట్లీ ఆ తరువాత నటుడు విజయ్‌తో వరుసగా తెరి, మెర్శల్, తాజాగా బిగిల్ చిత్రాలను చేశారు. తెరి హిట్ చిత్రం అయితే మెర్శల్ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిగిల్ చిత్రం అంతకు మించి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. ఇకపోతే దర్శకుడు అట్లీ ఒక చిత్రం పూర్తి చేయగానే నెక్ట్సేంటి? అనే ఆసక్తి రేకెత్తుతుంటుంది. అలా మెర్శల్ తరువాత అట్లీ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. అక్కడ ఒక స్టార్ హీరోతో చిత్రం చేయనున్నారనే ప్రచారం సాగింది. అయితే అది ప్రచారానికే పరిమితమైంది. ఇప్పుడు బిగిల్ చిత్రం పూర్తి కావచ్చింది. ఇప్పుడు నెక్ట్సేంటి? అన్న ప్రశ్నకు మళ్లీ తెలుగులో చిత్రం చేయనున్నాడు అనే ప్రచారం మొదలైంది. అవును ఈయన టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా చిత్రం చేయనున్నారనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు తమిళంలో నటించాలన్న ఆశ చాలా కాలంగా ఉంది. త్వరలో అది నెరవేరనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా ఆయనతో దర్శకుడు అట్లీ చిత్రం చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత అట్లీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అట్లీ బిగిల్ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదల తరువాతనే ఆయన తన తాజా చిత్రం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. -
నెక్ట్స్ సూపర్‌స్టార్ నువ్వే!
‘ఎంకే త్యాగరాజ భాగవతార్, ఎంజీ రామచంద్రన్, రజనీకాంత్ తర్వాత సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకునే వ్యక్తివి నువ్వే. అయ్యో అసలు నేను నీ తల్లిననే విషయాన్నే మర్చిపోయాను. ఎందుకంటే నీకున్న లక్షలాది మంది అభిమానుల్లో ఒకదాన్నైన నేను కూడా ఓ విజిల్ వేసి నిన్ను ప్రశంసిస్తాను కదా’ అంటూ దర్శకురాలు, నేపథ్య గాయని, నిర్మాత శోభా చంద్రశేఖర్ తన తనయుడు ఇళయ దళపతి విజయ్‌కు లేఖ రాశారు. విజయ్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ లేఖ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా శోభా చంద్రశేఖర్ బహుముఖ ప్రఙ్ఞాశాలిగా పేరొందారు. క్లాసికల్ సింగర్‌గా గుర్తింపు పొందిన ఆమె నంబర్గల్, ఇన్నిసాయి మలాయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బిగిల్’.. తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాల తర్వాత యువ డైరెక్టర్ అట్లీ- విజయ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో బిగిల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఇళయదళపతి.. ‘బిగిల్’ యూనిట్ సభ్యులకు 400 ఉంగరాలు ఇచ్చి సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. #ShobaChandrasekhar Abut #ThalapathyVijay 😍😍 pic.twitter.com/vpnkEqsegc — Jegan ebi (@jeganebenezar1) August 27, 2019 -
కేరింగ్
విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బిగిల్’ (విజిల్ అని అర్థం). ఫీమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ కథాంశంతో అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడీ చిత్రబృందం విజయ్ అన్నకు విజిల్ కొట్టు అంటున్నారు. విజిల్ కొట్టే పని ఏం చేశారు? అంటే.. ఈ సినిమా పూర్తి కావస్తున్న సందర్భంగా పని చేసిన చిత్రబృందానికి గోల్డ్ రింగ్స్‌ను బహుమతిగా అందించారట. ప్రతి సినిమా పూర్తయ్యే సందర్భంలో తన టీమ్‌లో అందరికీ బహుమతులు అందించడం విజయ్ అలవాటు. అలా ఈసారి బిగిల్ టీమ్ అందరికీ ‘బిగిల్’ అని రాసి ఉన్న ఉంగరాలను అందించారు విజయ్. కొందరికి ఆటోగ్రాఫ్ చేసిన ఫుట్‌బాల్‌ను కూడా బహూకరించారు. తమ హీరో తమ పట్ల చూపించిన కే–రింగ్ చూసి విజయ్‌ని ‘గోల్డెన్ స్టార్’ అంటున్నారు ‘బిగిల్’ యూనిట్. -
400 మందికి గోల్డ్ రింగ్స్ ఇచ్చిన హీరో!
తమిళ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బిగిల్’. తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాల తర్వాత యువ డైరెక్టర్ అట్లీ- విజయ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో బిగిల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇళయదళపతి.. ‘బిగిల్’ యూనిట్ సభ్యులను సర్ప్రైజ్ చేశాడు. సినిమా కోసం వివిధ శాఖల్లో పనిచేసిన దాదాపు 400 మందికి బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చాడు. ‘బిగిల్’ నిర్మాణ సంస్థకు చెందిన అర్చనా కలపతి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘ బిగిల్ కోసం పనిచేస్తున్న 400 మంది సభ్యులకు ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా చేశారు దళపతి. ఆయన మాపై కురిపించిన ఆప్యాయత ఈరోజును ఎంతో ప్రత్యేకంగా నిలిపింది’ అని ఆమె ట్వీట్ చేశారు. ఇక బిగిల్‌లో నటిస్తున్న వర్ష బొల్లమ్మ కూడా..విజయ్ ఇచ్చిన రింగ్ చూపుతూ ఫొటో దిగి ట్విటర్లో షేర్ చేశారు. కాగా బిగిల్ అంటే విజిల్ అని అర్థం. ఇంతవరకు విడుదల చేసిన పోస్టర్లలో విజయ్ లుక్స్ చూస్తుంటే అతడి క్యారెక్టర్లో మూడు నాలుగు షేడ్స్ ఉంటాయని అర్థం అవుతోంది. వాటి ప్రకారం విజయ్ ఒక గెటప్‌లో యంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తుండగా, ఇంకో లుక్‌లో కత్తి పట్టుకుని మాస్ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా దీపావళికి విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. When #thalapathy Vijay gives you the best gift EVER!!!!!!! #Bigil #Thalapathy63 pic.twitter.com/73WeS6Wdge — Varsha Bollamma (@VarshaBollamma) August 13, 2019 -
కియారా కమిట్ అవుతుందా?
సినిమా: కోలీవుడ్ ఆఫర్ల కోసం బాలీవుడ్ బ్యూటీస్ సహా పలు భాషలకు చెందిన వారు ఆసక్తి చూపుతారన్నది వాస్తవం. ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామలు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగారు. తాజాగా నటి కియారాను కోలీవుడ్‌కు దిగుమతి చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ అమ్మడు ఇప్పటికే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి భరత్ అనే నేను చిత్రంతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా తాజాగా తమిళంలో విజయ్ సరసన నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బిగిల్ చిత్రంలో నటిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటి నయనతార నాయకిగా నటిస్తోంది. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించారు. విజయ్ హీరోగా తెరకెక్కించనున్న చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. పీవీ.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రారంభించి వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఇందులో విజయ్‌తో రొమాన్స్ చేసే నాయకి ఎవరన్న విషయం గురించి పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నటి త్రిష, క్రేజీ నటి రష్మిక పేర్లు కూడా ప్రచారంలో నానుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కొత్తగా బాలీవుడ్ బ్యూటీ కియారా పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె కాల్షీట్స్ సెట్ అయితే, మరే చిత్రంలోనూ నటించకపోతే విజయ్‌తో రొమాన్స్ చేయడానికి కమిట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. -
స్క్రీన్‌పై తొలిసారి
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సిల్వర్ స్క్రీన్ వెనక చాలా ఏళ్లుగా సందడి చేస్తూనే ఉంది. ఆయన మ్యూజిక్‌ని ఇన్నాళ్లూ వింటూనే ఉన్నాం. త్వరలోనే ఆయన్ను సిల్వర్ స్కీన్ మీద కూడా చూడబోతున్నాం. అయితే పూర్తి స్థాయి పాత్రలో కాదు అతిథి పాత్రలో అని తెలిసింది. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘బిగిల్’. అంటే విజిల్ అని అర్థం. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో మొదటి పాట ‘సింగపెన్నే..’ రిలీజై మంచి విజయం సాధించింది. ఈ పాటలో విజయ్‌తో కలసి రెహమాన్ స్క్రీన్ మీద కనిపిస్తారట. మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఇదివరకు రెహమాన్ చాలాసార్లు నటించారు. కానీ సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
మిస్ ఫిజియో
ఫిజియోథెరపీ క్లాసులకు రెగ్యులర్‌గా వెళ్తున్నారు నయనతార. షూటింగ్లో స్టంట్స్ చేస్తూ గాయపడి ఫిజియో వద్దకు వెళ్తున్నారని ఊహించేసుకోవద్దు. ఫిజియో క్లాసులకు వెళ్లేది పేషెంట్‌గా కాదట.. స్టూడెంట్‌గా అని సమాచారం. నయనతార హీరోయిన్గా విజయ్‌తో కలసి నటిస్తున్న చిత్రం ‘బిగిల్’. (విజిల్ అని అర్థం) అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన ఫిజియోథెరపీ స్టూడెంట్‌లా కనిపిస్తారట. విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌లా నటిస్తున్నారు. స్పోర్ట్స్ ఆడే సమయంలో ఆటగాళ్లతోనే ఫిజియోథెరపిస్ట్‌లు ఉండే సంగతి తెలిసింది. ఈ విధంగా మిస్టర్ కోచ్‌కి, మిస్ ఫిజియోకి లవ్ ట్రాక్‌ని దర్శకుడు కలిపారని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
బిగిల్ కొట్టు
ఫుట్‌బాల్ గ్రౌండ్లో ప్రత్యర్థులను హడలెత్తించేలా ఆడారు తమిళ నటుడు విజయ్. ఈ ఆట ఈ ఏడాది దీపావళికి వెండితెరపైకి వస్తుంది. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు ‘బిగిల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే శనివారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్స్ చూస్తుంటే విజయ్ క్యారెక్టర్లో మూడు నాలుగు షేడ్స్ ఉంటాయని అర్థం అవుతోంది. ఇక్కడున్న ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక గెటప్‌లో యంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తున్న విజయ్, ఇంకో లుక్‌లో కత్తి పట్టుకుని మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి సినిమా విడుదల కానుంది. అన్నట్లు.. ‘బిగిల్’ అంటే విజిల్ అని అర్థం. -
విజయ్ బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు ట్రీట్
తమిళసినిమా: నటుడు విజయ్ నటిస్తున్న తాజా చిత్రం గురించి ఇప్పటికే చాలా వివరాలు వెలుగుచూశాయి. ఇది ఆయన 63వ చిత్రం అనీ, లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయకిగా నటిస్తోందని, ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని, ఆస్కార్ అవార్డుగ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారని, దర్శకుడు అట్లీ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం ఇదని లాంటి వివరాలు తెలిసినవే. కాగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు గానీ, విడుదల తేదీని మాత్రం ఫిక్స్ చేశారు. అవును చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురానున్నట్లు వర్గాలు ఇప్పటికే వెల్లడించారు. కాగా కొత్త విషయాలేమిటంటే ఇందలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది, అది తండ్రి కొడుకులుగా తొలిసారిగా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ నెల 22న విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటుడు కదిర్, యోగిబాబు, డేనియల్ బాలాజి, రెబామోనికాజాన్, ఇదుజా, వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం కాబట్టి అంచనాలు భారీ స్టాయిలోనే నెలకొన్నాయి. పైగా సర్కార్ వంటి సంచలన చిత్రం తరువాత తెరపైకి రానున్న చిత్రం కావడంతో సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ గ్యారెంటీ అని చిత్ర యూనిట్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అగ్రనటి నయనతార అదనపు ఆకర్షణగా ఉండనే ఉంది. అదే విధంగా చాలా కాలం తరువాత విజయ్ ద్విపాత్రాభినయం చేయడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
ఆటోడ్రైవర్లకు భోజనాలు పెట్టించిన హీరో!
తమిళనాట హీరోలకు, అభిమానులకు మధ్య ఉండే సంబంధం ఎప్పడూ ప్రత్యేకంగానే ఉంటుంది. తమ అభిమానులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ.. వారికి ఆతిథ్యమిస్తూ ఉంటారు హీరోలు. రజినీ ఏడాదికొకసారి అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమవుతుంటారు. ఇళయ దళపతి విజయ్ ఏటా మేడేన కొంతమంది కార్మికులకు భోజనాలు పెట్టిస్తుంటారు. ఈ ఏడాది కూడా విజయ్ ఈ కార్యక్రమాన్ని మే ఒకటో తేదీన చేపట్టాలని అనుకున్నారట కానీ ఎన్నికలు జరగుతుండటంతో కుదరలేదని సమాచారం. అయితే ఎలక్షన్స్ ముగిసి ఎన్నికల కోడ్‌ను ఎత్తేసిన సందర్భంలో.. విజయ్ అధికారిక బృంధం ఆటోడ్రైవర్స్‌కు భోజనాలు పెట్టించి, బహుమతులు అందజేసింది. ప్రస్తుతం విజయ్-అట్లీ కాంబినేషన్లో రాబోతోన్న మూవీ షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని సమాచారం. -
ఖైదీ డైరెక్టర్‌తో విజయ్
వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ప్రతీ సినిమాకు తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ పోతున్న విజయ్, సీనియర్ దర్శకులతో పాటు యువ దర్శకులకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విజయ్ తదుపరి చిత్రాన్ని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. మానగరం, అవియల్ లాంటి సినిమాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు విజయ్ ఓకె చెప్పాడట. లోకేష్ ప్రస్తుతం కార్తీ హీరోగా ఖైదీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. కేవలం 50 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. -
వాటిని పట్టించుకోకండి.. అభిమానులు ప్రశాంతంగా ఉండండి
రాజా రాణి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యువ దర్శకుడు అట్లీ.. తేరి, మెర్సెల్ లాంటి చిత్రాలతో ఘన విజయాలు నమోదు చేశాడు. సినిమా సినిమాకు సక్సెస్ రేట్‌తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లను పెంచుకుంటూ పోతూ ఉన్న ఈ దర్శకుడు ముచ్చటగా మూడో సారి విజయ్‌తో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్ 63వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్లో మహిళను వేధించాడని డైరెక్టర్ అట్లీపై వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి వార్తలను పట్టించుకోకండంటూ.. మీరు థియేటర్స్‌లో పండుగ చేసుకునేలా సినిమా రావాలని ఎంతో కష్టపడి 70 రోజుల నుంచి నిరంతరాయంగా షూట్ చేస్తున్నామని చిత్రయూనిట్‌లోని ఓ సభ్యుడు తెలిపారు. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్లోకి ఎంటరవుతున్నామని అన్నారు. సినిమాకు సంబంధించి అప్డేట్స్ను సరైన సమయంలో చెబుతామని అంత వరకు అభిమానులంతా ప్రశాంతంగా ఉండాలని, రూమర్స్‌ను పట్టించుకోవద్దని కోరారు. 70 days of continuous shoot, entering into the 4th schedule. And all the hard work are for the fans to celebrate in theatres. Updates & Announcements will be on right time and request fans to stay cool & avoid the rumours till then #IgnoreNegativity #Thalapathy63 pic.twitter.com/wtFKqeuEy0 — Jagadish (@Jagadishbliss) May 3, 2019 -
విజయ్ సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం
అన్నానగర్: చెన్నైలో గురువారం నటుడు విజయ్ సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం ఏర్పడింది. వివరాలు.. విజయ్ నటిస్తున్న 63వ సినిమాను డైరెక్టర్ అట్లి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై మీనంబాక్కంలోని బిన్నిమిల్లు ప్రాంతంలో ఆలయం, ఆస్పత్రి, మెడికల్ దుకాణాలు, పాఠశాల సెట్ వేశారు. కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో గురువారం మధ్యాహ్నం సమయంలో షూటింగ్ కోసం కొత్తగా సెట్ వేసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. ఇనుప కమ్మీలను వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు అక్కడున్న ఎండిన ఆకులపై పడి మంటలు వ్యాపించాయి. క్రమంగా మంటలు సెట్ అంతటా వ్యాపించాయి. వెంటనే కార్మికులు అక్కడినుంచి పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమండలంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న గిండి, తాంబరం, శానిటోరియం ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి సుమారు నాలుగు గంటల సేపు పోరాడి మంటలను అదుపుచేశారు. గురువారం సినిమా షూటింగ్ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదంలో రూ. లక్షల విలువైన సామగ్రి, సినిమా సెట్ కాలి బూడిదయ్యాయి. దీనిపై మీనంబాక్కం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
విజయ్ను వెంటాడుతున్న చోరీ కేసులు
పెరంబూరు: ఇళయదళపతి విజయ్ను విజయాలు వరిస్తున్నా, కథల చోరీ కేసులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన నటించిన కత్తి చిత్రం నుంచి నిన్నటి సర్కార్ వరకూ కథల చోరీ కేసులు, కోర్టులు, పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి. సర్కార్ చిత్ర కథ విషయంలో చోరీ జరిగిందని కథా రచయితల సంఘం అధ్యక్షుడు వెల్లడించడం పెద్ద వివాదానికే దారి తీసింది. అంతే కాదు ఆ చిత్ర దర్శకుడు మురుగదాస్ పిటీషన్‌దారుడికి కొంత మొత్తాన్ని చెల్లించుకోక తప్పలేదని కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అంతకు ముందు కత్తి చిత్రం విషయంలోనూ కథ చోరీ ఆరోపణలు ఎదురయ్యాయి. తాజాగా విజయ్ నటిస్తున్న చిత్రం కూడా కథ చోరీ ఆరోపణలను ఎదుర్కొంటోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయకి. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్‌ను నిర్విరామంగా జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెల్వ అనే లఘు చిత్రాల దర్శకుడు విజయ్ నటిస్తున్న 63వ చిత్ర కథ తనదంటూ చెన్నై హైకోర్టుకెక్కారు. అందులో మహిళా ఫుట్‌బాల్ క్రీడ ఇతి వృత్తంతో కూడిన కథను తాను 265 పేజీలు రాసుకున్నానని తెలిపారు. ఆ కథను పలువురు నిర్మాతలకు వినిపించానని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు అట్లీ ఈ కథను నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్నారన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిత్ర షూటింగ్‌పై నిషేధం విధించాలని పిటీషన్లో కోరారు. ఈ కథ చోరీ కేసుపై ఈనెల 23వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది. కాగా పిటీషన్‌దారుడు దర్శకుడు అట్లీని, నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థను, కథా రచయితల సంఘాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఈ పిటీషన్‌పై తగిన వివరణ ఇవ్వాల్సిందిగా ఏజీఎస్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. -
అట్లీకి ఓకే చెప్పిన షారుఖ్!
కోలీవుడ్‌లో వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో కలిసి అట్లీ సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మెర్సల్ రీమేక్‌పై షారుఖ్ ఆసక్తి చూపడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అట్లీ సన్నిహితులు తెలిపారు. ఈ రీమేక్‌తో పాటుగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కన్ను మరో సినిమాలో నటించేందుకు కూడా షారుఖ్ సుముఖత వ్యక్తం చేయడంతో ఇరువురి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్12లో భాగంగా చెన్నై- కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం అట్లీ ఆఫీసుకు వెళ్లిన షారుఖ్ రెండు స్క్రిప్టులను ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాగా ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అట్లీ.. రాజా-రాణి సినిమాతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్టార్ హీరో విజయ్‌తో తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాలు రూపొందించి పలు అవార్డులు కూడా పొందాడు. ప్రస్తుతం విజయ్‌తో దళపతి63 సినిమా తెరకెక్కిస్తున్న అట్లీ.. షారుఖ్ సినిమాతో బాలీవుడ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇక జీరో సినిమా డిజాస్టర్ కావడంతో నిరాశ చెందిన షారుఖ్ ఇంతవరకు ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. అయితే అట్లీ మీద ఉన్న నమ్మకంతో అతడికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. -
మ్యాచ్ కుదిరిందా?
షారుక్ ఖాన్ తమిళ సినిమాలో కనిపించబోతున్నారా? కొన్ని రోజులుగా తమిళ ఇండస్ట్రీ సర్కిల్లో ఇదే చర్చ. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో షారుక్ కనిపిస్తారని టాక్. మరోవైపు తమిళ బ్లాక్‌బస్టర్ ‘మెర్సల్’ను హిందీ రీమేక్ చేసే ఆలోచనలో షారుక్ ఉన్నారని టాక్. మంగళవారం చెన్నై – కోల్కత్తా ఐపీఎల్ మ్యాచ్‌లో షారుక్‌తో పాటు దర్శకుడు అట్లీ కూడా స్టేడియంలో కనిపించడంతో అట్లీ నెక్ట్స్ సినిమాలో షారుక్ కనిపిస్తారనే వాదనకు బలం చేకూరింది. మ్యాచ్ అనంతరం అట్లీ ఆఫీస్‌కి షారుక్ ఖాన్ వెళ్లారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. మరి ఈ చర్చలు విజయ్ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపించడానికా? లేక ‘మెర్సల్’ రీమేక్ కోసమా? తెలియాల్సి ఉంది. -
ఒక్క సెట్‌కు ఆరు కోట్లు!
వరుస విజయాలతో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ 63వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కీలకమైన మూడో షెడ్యూల్ కోసం చెన్నైలోని ఈవీపీ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను రెడీ చేస్తున్నారు. గతంలో విజయ్, అట్లీ కాంబినేషన్లో రూపొందిన తేరి, మెర్సల్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీగా ఖర్చు పెడుతున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నాడు. తదుపరి షెడ్యూల్లో గేమ్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 50 రోజుల పాటు షూటింగ్ నిర్వహించాల్సి ఉండటంతో ఫుట్‌బాల్ స్టేడియం సెట్‌ను రెడీ చేస్తున్నారు. కేవలం ఈ సెట్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. -
‘అట్లీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’
ఐపీఎల్ సీజన్12లో భాగంగా చెన్నై- కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో కోలీవుడ్ హిట్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించాడు. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా సహ యజమానితో కలిసి కేకేఆర్ గ్యాలరీలో అట్లీ దర్శనమివ్వడంతో సీఎస్కే ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో.. షారుఖ్‌తో సినిమా చేసేందుకో లేదా ఇలయదళపతి63 సినిమాలో గెస్ట్ రోల్లో నటింపజేసేందుకు అట్లీ చర్చలు జరుపుతున్నాడేమోలేనని సరిపెట్టుకున్నారు. అయితే మరికొంత మంది మాత్రం షారుక్‌తో అట్లీ ఉండటాన్ని జీర్ణించుకోలేక అతడి శరీర రంగు గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అట్లీ ఫ్యాన్స్... ‘తన రంగు గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నిజానికి ఎన్నో కష్టనష్టాలకు, కఠిన శ్రమకు ఓర్చి అట్లీ ఈ స్థాయికి వచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ పక్కన కూర్చున్నాడు. మరి మీరేం చేశారు ఇంట్లో కూర్చుని ఓ ప్రతిభావంతుడైన డైరెక్టర్ గురించి కామెంట్లు చేసేందుకు మాత్రమే మీరు పనికివస్తారు. వీరిద్దరి కలయిక ఓ బ్లాక్‌బస్టర్ సినిమాకు దారి తీస్తుంది. ప్రస్తుతం తమిళనాడులోని ప్రముఖ స్టార్లలో అట్లీది ప్రత్యేక స్థానం. అందమైన భార్య చక్కని కుటుంబం, మంచి సంపాదనతో అతడు ఆనందంగా ఉన్నాడు. ఎందుకు ఇలాంటి చెత్త కామెంట్లు చేసి సమయం వృథా చేసుకుంటారు’ అంటూ ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. కాగా ఫ్యాన్స్ ఊహించినట్లుగానే.. షారుఖ్- అట్లీల కాంబోలో మూవీ ఉంటుందని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ప్రకటించారు. మెర్సెల్ సినిమా రీమేక్ లేదా మరో కొత్త సినిమాతో వీళ్లిద్దరు ప్రేక్షకుల ముందుకు వస్తారని ఆయన ట్వీట్ చేశారు. ఇక ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అట్లీ..రాజా రాణి సినిమాతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్టార్ హీరో విజయ్‌తో తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాలు రూపొందించి పలు అవార్డులు పొందాడు. 2014లో నటి క్రిష్ణ ప్రియను పెళ్లి చేసుకున్నాడు. Y’all making fun of Atlee’s skin colour well at least he got to sit beside SRK by his own hardwork. What have you achieved other than sitting at your home commenting about his skin colour? #Atlee #CSKvKKR — Yaaro 🤔 (@lostsoulheree) April 9, 2019 . @iamsrk and @Atlee_dir are certainly doing a Movie together.. Whether it's #Mersal Hindi remake or fresh script is to be decided.. — Ramesh Bala (@rameshlaus) April 9, 2019