![Nayanatara Street Shopping With Boyfriend Vignesh Shivan in Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/20/Nayanatara.jpg.webp?itok=sUHWbJg1)
దేవాలయాలను సందర్శించారు.. స్ట్రీట్ షాపింగ్ చేశారు... దసరా సందర్భంగా విఘ్నేష్ శివన్, నయనతార బిజీ బిజీగా గడిపారు. ఇదంతా తమిళ నటి, లేడి సూపర్ స్టార్ నయనతార గురించే.
షారుక్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి ఇటీవల నయనతార ఇటీవలే పుణె వెళ్లారు. ఈ షూటింగ్‌కి కాస్త గ్యాప్ రావడంతో లవర్ విఘ్నేష్‌తో కలసి షిర్డీ వెళ్లారు. ఆ తర్వాత ముంబై చేరుకుని ముంబై దేవి, మహాలక్ష్మి, సిద్ధి వినాయక ఆలయాలను సందర్శించారు. అంతేకాదు.. నయన స్ట్రీట్ షాపింగ్ కూడా చేశారు. ఒక బ్యాగుని బేరం చేస్తూ కనిపించారామె. ఆమె ఇలా రోడ్ సైడ్ షాపింగ్ చేయడం ఓ హాట్ టాపిక్. పైగా ప్రచారంలో ఉన్న వీడియోలో నయన బేరమాడుతూ కనిపించారు. దాంతో ‘ఆడవాళ్లు ఎప్పుడూ ఆడవాళ్లే... ఇలా బేరమాడుతుంటే చూడ్డానికి క్యూట్‌గా ఉంది’ అని నెటిజన్లు పోస్ట్ చేశారు.
చదవండి: నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్
Comments
Please login to add a commentAdd a comment