Nayana tara
-
ఏది నిజం ఏది ఏఐ ఓ ట్విట్టరూ..!
‘ఎవరి చిన్నప్పటి ఫొటోలు వారికి ముద్దు’ అని లోకం అనుకున్నా సరే అవి అంటే మనకు ఎంతో ఇష్టం. ఇక సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు ఎప్పుడూ హాట్ ఫేవరెట్టే! ఒకప్పుడు ‘ ఇవిగో మీ అభిమాన హీరో చిన్నప్పటి ఫోటో’ అంటే ఆశ్చర్యానందాలతో చూసేవాళ్లం. ఇప్పుడు మాత్రం ఏఐ పుణ్యమా అని నమ్మడానికి లేదు. ఏది నిజం ఏది ఏఐ! ఏఐ టెక్నాలజీ హవా చూస్తుంటే ఇక ముందు హీరో, హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలు బాల నటులు వేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న షారుఖ్ ఖాన్, రజనీకాంత్, నయన తార, మోహన్‌లాల్... చిన్ననాటి ఫొటోలే దీనికి నిదర్శనం. కాస్త సరదా అంశ కూడా వీటికి చేర్చడం వల్ల ఇవి ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఇమేజ్‌లు అని తెలిసిపోతుందిగానీ...లేకపోతే శానా కష్టం సుమీ! -
ఆస్కార్ 2022కి వెళ్లనున్న నయనతార మూవీ
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ‘ఆస్కార్’. ఒక్కసారైనా ఈ అవార్డుని సాధించాలని ప్రతి ఫిల్మ్ మేకర్ కోరుకుంటారు. అలాంటి ఫేమ్ ఉన్న ఈ అవార్డు కార్యక్రమం మార్చి 2022న లాస్ ఎంజెల్స్‌లో జరగనుంది. ఈ అవార్డుకి అంతర్జాతీయ చలనచిత్ర కేటగిరీ తమిళ చిత్రం ‘కూజాంగల్’ ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లదగ్గ మొత్తం 14 సినిమాలను వీక్షించింది. అందులో ఈ సినిమాను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పీఎస్ వినోద్‌రాజ్ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ నిర్మించారు. విదేశి ఉత్తమ మూవీ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్‌కి పోటీపడుతున్నట్లు సోషల్ మీడియా వేదిక ఈ చిత్ర నిర్మాత విఘ్నేష్ షేర్ చేసుకున్నాడు. ‘‘అండ్ ది ఆస్కార్స్ గోస్ టు..’ అనే పదం వినేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాం. ఎంతో ఆనందంగా ఉంది’ అని ఈ ఫిల్మ్ మేకర్ తెలిపాడు. చదవండి: ప్రియుడితో కలిసి దేవాలయాలను సందర్శించిన నయనతార There’s a chance to hear this! “And the Oscars goes to …. 🎉🎉🥰🥰🥰🥰 “ Two steps away from a dream come true moment in our lives …. ❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰#Pebbles #Nayanthara @PsVinothraj @thisisysr @AmudhavanKar @Rowdy_Pictures Can’t be prouder , happier & content 💝 pic.twitter.com/NKteru9CyI — Vignesh Shivan (@VigneshShivN) October 23, 2021 -
‘ఆడవాళ్లు ఎప్పుడూ ఆడవాళ్లే’.. స్ట్రీట్ షాపింగ్ చేసిన నయనతార
దేవాలయాలను సందర్శించారు.. స్ట్రీట్ షాపింగ్ చేశారు... దసరా సందర్భంగా విఘ్నేష్ శివన్, నయనతార బిజీ బిజీగా గడిపారు. ఇదంతా తమిళ నటి, లేడి సూపర్ స్టార్ నయనతార గురించే. షారుక్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి ఇటీవల నయనతార ఇటీవలే పుణె వెళ్లారు. ఈ షూటింగ్‌కి కాస్త గ్యాప్ రావడంతో లవర్ విఘ్నేష్‌తో కలసి షిర్డీ వెళ్లారు. ఆ తర్వాత ముంబై చేరుకుని ముంబై దేవి, మహాలక్ష్మి, సిద్ధి వినాయక ఆలయాలను సందర్శించారు. అంతేకాదు.. నయన స్ట్రీట్ షాపింగ్ కూడా చేశారు. ఒక బ్యాగుని బేరం చేస్తూ కనిపించారామె. ఆమె ఇలా రోడ్ సైడ్ షాపింగ్ చేయడం ఓ హాట్ టాపిక్. పైగా ప్రచారంలో ఉన్న వీడియోలో నయన బేరమాడుతూ కనిపించారు. దాంతో ‘ఆడవాళ్లు ఎప్పుడూ ఆడవాళ్లే... ఇలా బేరమాడుతుంటే చూడ్డానికి క్యూట్‌గా ఉంది’ అని నెటిజన్లు పోస్ట్ చేశారు. చదవండి: నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
విశాల్‌పై భగ్గుమన్న రాధారవి
చెన్నై : ప్రముఖ నటి నయనతారపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాధారవి తీరును పలువురు కోలీవుడ్ నటులు, సెలబ్రిటీలు తప్పుపడుతున్నారు. రాధారవి వ్యవహార శైలి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్ భగ్గుమన్నారు. రాధారవి తన పేరుముందున్న రాధాను తొలగించుకోవాలని లేకుంటే మహిళలకు అన్యాయం చేసినట్టవుతుందని విశాల్ ఘాటుగా ట్వీట్ చేశారు. విశాల్ ట్వీట్‌పై రాధారవి స్పందించారు. తన పేరు ముందున్న పదాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది ఆర్కే నగర్ లాంటిదే..విశాల్ ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నాడు..రాధ మా తండ్రి పేరు..అందుకే ఈ పేరు పెట్టుకున్నా’నని రాధారవి పేర్కొన్నారు. కాగా,నయనతార నటించిన ఓ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆమెను ఉద్దేశించి రాధారవి చేసిన వ్యాఖ్యలు కలకలంరేపిన సంగతి తెలిసిందే. మరోవైపు వేదికపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రవర్తనకు గాను ఆయనను డీఎంకే సస్పెండ్ చేసింది. -
ప్రభుదేవా చిత్రంలో నయన్
సాక్షి, తమిళసినిమా : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇది సినిమాకూ వర్తిస్తుంది. చిత్ర పరిశ్రమలో ప్రేమించుకున్న వాళ్లు విడిపోవచ్చు, మళ్లీ కలవా వచ్చు. ప్రస్తుతం అగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న నయనతారనే తీసుకుంటే తొలి రోజుల్లో నటుడు శింబుతో డీప్ లవ్‌లో పడ్డారు. వీరిద్దరికి సంబంధించిన సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అలాంటిది వారి ప్రేమకు బ్రేక్ పడింది. ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమ కథ కొంత కాలం సాగింది. ప్రభుదేవాతోనూ పెళ్లికి సిద్ధమై మతాన్నే మార్చుకున్న నయనతార నటనకు స్వస్తి చెప్పడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ ప్రేమపెళ్లి పీటల వరకూ వెళ్లలేదు. ఆ తరువాత ఒక విలేకరి ప్రభుదేవాతో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు శింబుతో అయినా నటిస్తాను కానీ, ప్రభుదేవాతో జీవితంలో నటించను అని టక్కున బదులిచ్చారు నయనతార. అన్నట్టుగానే శింబు నుంచి విడిపోయిన తరువాత ఇదు నమ్మఆళు చిత్రంలో ఆయనకు జంటగా నటించారు. ప్రస్తుతం యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమ, సహజీవనం అనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న కొలైయుధీర్ కాలం చిత్రంలో ఒక కీలక పాత్రలో ప్రభుదేవాను నటింపచేసే ప్రయత్నాలు జరిగాయని, అయితే అందుకు ఆయనతో నటించడానికి నయనతార సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరిగింది. అయితే చిత్ర హిందీ రీమేక్‌లో ప్రభుదేవా నటిస్తుండడం విశేషం. నయనతార పాత్రలో తమన్నా నటిస్తున్నారు. తాజాగా ప్రభుదేవా చిత్రంలో నయనతార నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. నటుడిగా బిజీగా ఉన్న ప్రభుదేవా నటుడు అజిత్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతునట్లు, అందులో అగ్రనటి నయనతారను హీరోయిన్గా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. మళ్లీ ప్రభుదేవా దర్శకత్వంలో నయనతార ఎలా నటిస్తారన్న డౌట్ వస్తోందా? వృత్తి వేరు, వ్యక్తిగతం వేరు అనే బదులు వస్తుంది. ఇంతకుముందు శింబుతో నటించిన నయనతార, ఇప్పుడు ప్రభుదేవా చిత్రంలో నటించడానికి ఓకే అనడంలో పెద్దగా ఆశ్యర్యపడాల్సిన అవసరం ఉండదు. -
డీజీపీ రూప పాత్రనా.. అయితే సారీ!
సాక్షి, తమిళసినిమా: తమిళనాట రాజకీయ నాయకురాలిగా ప్రకంపనలు రేపిన శశికళ ప్రస్తుతం కర్ణాటకలో జైలులో ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఆమె రాజభోగాలు అనుభవిస్తున్నారన్న కథనాలు రావడం పెద్ద దుమారమే రేపింది. జైల్లో ఆమె బాగోతాన్ని అప్పటి కర్ణాటక జైళ్లశాఖ డీఐజీ రూప బట్టబయలు చేసి సంచలనం సృష్టించారు. శశి అనుకూలంగా జైల్లో జరిగిన అధికార దుర్వినియోగాన్ని, అవినీతిని, ఆమె అనుభవిస్తున్న రాజభోగాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చిన రూప కథ ఆధారంగా దర్శకుడు ఏఎంఆర్ రమేశ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. గతంలో రాజీవ్‌గాంధీ హత్యోదంతాన్ని, బాబ్రీమసీదు నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించిన ఆయన తాజాగా డీఐజీ రూప కథ ఆధారంగా సినిమా తీస్తానని ప్రకటించడం సంచలనం రేపింది. ఈ చిత్రంలో డీఐజీ రూప పాత్రలో నటి నయనతార లేదా అనుష్కను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట. అయితే, ఆయన ప్రయత్నాలకు బ్రేక్ పడినట్టు సమాచారం. డీఐజీ రూప పాత్రలో నటించడానికి నయనతార నిరాకరించిందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. సారీ.. అలాంటి రాజకీయ సంబంధమున్న పాత్రలను చేయనని నయన కరాఖండీగా చెప్పేసిందట. అనుష్క కూడా సైతం అదే మాట చెప్పిందని సమాచారం. శశికళకు సంబంధమున్న కథ కావడంతో రాజకీయ బెదిరింపులు వస్తాయని ఈ బ్యూటీలు భయపడ్డటు కోలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో నటి త్రిషపై దర్శకుడు రమేశ్ దృష్టి పడిందని తెలుస్తోంది. డీఐజీ రూప పాత్రలో నటించడానికి త్రిష అయినా 'ఎస్' అంటుందా? వేచి చూడాలి అంటున్నారు తమిళ సినీ జనాలు. -
ఆ ముచ్చటకు టైం వచ్చింది!
తమిళసినిమా: కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదంటారు. అలాంటిది నటి నయనతార ప్రేమ ఇంతకు ముందు కలకలానికి దారి తీస్తే, పెళ్లి ఇప్పుడు సంచలనానికి దారి తీస్తోంది. అందానికి అందం ఈ పుత్తడిబొమ్మ.అందరికీ అందనిది ఈ మలయాళీ భామ అని నయనతారను అనవచ్చనుకుంటా. ఇంతకు ముందు నటుడు శింబు నయనతారను పొందాలనుకున్నారు.అయితే అది ప్రేమ వరకే సాగి ఆగిపోయింది. ఆ తరువాత నటుడు ప్రభుదేవా సొంతం చేసుకోవాలనుకున్నారు. అది పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఈ రెండు సంఘటనలు నయనతార జీవితంలో మరచిపోలేని చేదు అనుభవాలేనని చెప్పక తప్పదు. అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో వృత్తిపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడిన నయనతార ప్రస్తుతం అగ్రనటిగా రాణిస్తున్నారు.అయితే ఆ అమ్మడు మూడోసారి ప్రేమలో పడి మరోసారి వార్తల్లోకెక్కారు. దర్శకుడు విఘ్నేశ్‌శివ, నయనతార డీప్ లవ్‌లో పడిపోయారన్నది చాలా కాలంగానే గట్టిగా వినిపిస్తోంది. విఘ్నేశ్‌శివ, నయనతార కలిసి ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. అయినా ఇప్పటికీ వీరిద్దరిలో ఏ ఒక్కరూ తమ ప్రేమ గురించి గానీ, సహజీవనం సాగిస్తున్న విషయంగానీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇక తదుపరి ఘట్టం పెళ్లి. దానికీ సమయం ఆసన్నమైందనేది తాజా సమాచారం. నయనతారకిప్పుడు చేతినిండా చిత్రాలున్నాయి. వాటిలో 90 శాతం హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలే. చక్రి తోలేటి దర్శకత్వంలో కొలైయుదీర్ కాలం చిత్రంతో పాటు ఆరమ్ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా అరివళగన్ దర్శత్వంలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిం చడానికి అంగీకరించారు. శివకార్తికేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్ చిత్రం నిర్మాణాంతర కార్యక్రామాలను జరుపుకుంటోంది. తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్న నయనతార ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే విఘ్నేశ్‌శివతో పెళ్లి ముచ్చటకు రెడీ అవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తాజాగా ప్రచారం హల్చల్ చేస్తోంది. -
తారలు.. పారితోషికాలు
సినిమా అన్ని రంగాల మాదిరిగానే వ్యాపార రంగమే. అయితే ఇతర రంగాల్లా పెట్టుబడికి పెద్దగా గ్యారెంటీ లేని రంగం. ఇక్కడ నిర్మాతలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు. కొడితే లక్కు, లేకుంటే కిక్కు కూడా ఉండదు. అయితే చిత్రాల్లో నటించే తారలకు మాత్రం లక్కుంటే యమ కిక్కే. వారికి మొదట ఒక్క అవకాశం, ఆ తరువాత ఒకే ఒక్క విజయం అంతే చాలు. ఆ సక్సెస్ చూపిస్తూ మొదట పెంచుకునేది పారితోషికాలే. అలా తారల పారితోషికాలు ఇవాళ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం టాప్ హీరోహీరోయిన్లుగా రాణిస్తున్న తారల పారితోషికాలెంతన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుడికి ఉంటుంది. తారల పారితోషికాలతో పాటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి హక్కులకు గాను వారికి చేతికందుతు న్న మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అలాంటి కొందరు టాప్ తారల పారితోషికాల వివరాలివి. ముందుగా సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్‌తోనే మొదలెడదాం. 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసి కాలా చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న రజనీ తాజా పారితోషికం రూ.60కోట్లు, విజయ్, అజిత్‌లు రూ.48కోట్ల నుంచి రూ.50కోట్లు, సూర్య రూ.38కో ట్లు, విక్రమ్ రూ.20 కోట్లు, ధనుష్ రూ.15 కోట్లు, శివకార్తికేయన్ రూ.15కోట్లు, జయంరవి రూ.10 కోట్లు, శింబు రూ.10 కోట్లు, సంతానం రూ.8కోట్లు, విజయ్‌సేతుపతి రూ.6కోట్లు, ఇక తారల్లో అగ్ర స్థానం అనుష్కదేనట. ఈ స్వీటీ రూ.5 కోట్లు, నయనతార రూ.4కోట్లు, శ్రుతీహాసన్ రూ.2కోట్లు, కాజల్‌అగర్వాల్, సమంతలు రూ.రెండు కోట్లు, త్రిష రూ.ఒక కోటి పారితోషికాలు పుచ్చుకుంటున్నారట. అయితే ఈ సంఖ్య అధికారికంగా ప్రకటించినది కాదు. కోలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న బేస్‌లెస్ లెక్కలే అన్నది గమనార్హం. అయితే పైన చెప్పిన తారలు ఇంచు మించు అంత పారితోషికాలను డిమాండ్ చేస్తున్నారన్నది వాస్తవమే. ఇక ఈ విషయంలో వారి వెర్షన్ వేరేలా ఉంటుందని వేరే చెప్పాలా! -
అందుకే ఆమె లేడీ సూపర్‌స్టార్
ఒకప్పుడు గ్లామరస్ స్టార్. ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్. ఆ నటి ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్ దటీజ్ ఒన్ అండ్ ఓన్లీ నయనతార. ఇప్పుడు తను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్, టాపెస్ట్స్టార్. టాలెంటెడ్ యువ దర్శకులకు ఆశాస్టార్, నిర్మాతలకు వసూళ్ల క్వీన్. ఇంతకీ ఈ పట్టానికి ఎందుకు అర్హురాలయ్యారంటే, చిత్ర షూటింగ్లో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాగానే చేతులు దులుపుకుని వెళ్లి కెరవన్ వ్యాన్‌లో విశ్రాంతి తీసుకోరు. షూటింగ్ లొకేషన్లోనే ఉండి సహ నటీనటుల నటనను గమనిస్తుంటారు. షూటింగ్లో ఆలస్యం అయినా చిరాకు పడరు. కస్సుబుస్సులాడరు. ప్రశాంతంగా ఉంటారు. నటనపై అంకితభావం మెండు. ఈ విషయాలను ఆమెతో కలిసి నటించే సహ నటీనటులందరూ గ్రహించే విషయం. ప్రముఖ నటినన్న గర్వాన్ని ప్రదర్శించరు. అందుకే నయనతార అంటే అందరూ ఇష్టపడతారు. స్టార్ హీరోల నుంచి, యువ నటుల వరకూ నయనతారతో నటించాలని కోరుకుంటారు.అందుకే నయనతార లేడీసూపర్‌స్టార్ అయ్యారు.ఇలా అన్నది ఎవరో కాదు నయనతార నటించిన డోర చిత్రంలో ఆమెతో నటించిన నటుడు హరీష్ ఉత్తమన్. డోర చిత్రం ఈ నెల 31న తెరపైకి రానుంది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది.దీంతో సెన్సార్బోర్డుపై దర్శకుడు విఘ్నేశ్‌శివ విమర్శలు గుప్పించడం విశేషం.ఈయనకేం సంబంధం అని మాత్రం అడగకండి. ఈయన నటి నయనతార ప్రేమించుకుంటున్నారన్న వ్యవహారం గురించి మీడియాలో చాలా కాలంగానే ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న టాక్ కోలీవుడ్‌లో గట్టిగానే వినిపిస్తోంది. అయినా ఈ విషయం గురించి ఇటు నయనతార గానీ, అటు దర్శకుడు విఘ్నేశ్శివగానీ నోరు మెదపడంలేదు. ఇంతకీ డోర చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం గురించి దర్శకుడు విఘ్నేశ్‌శివ స్పందన ఏమిటన్నదేగా మీ ఆసక్తి. అక్కడికే వస్తున్నాం. డోర చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇస్తారు. దృవంగళ్ 16, మానగరం చిత్రాలాంటి వాటికి యూఏ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇటీవల విడుదలైన పలు చిత్రాలకు యూ సర్టిఫికెట్లు అందిస్తారు. రాను రాను సెన్సార్ బోర్డుపై ప్రేమ రోజురోజుకు అధికం అవుతోంది అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. -
అతడితో మాకు ఓకే అంటున్న నయన్, త్రిష
విజయ్ సేతుపతిని ఫ్లాప్‌ల నుంచి బయటపడేసిన చిత్రం నానుమ్ రౌడీదాన్. అందులో హీరోయిన్ నయనతార. ఆ చిత్రానికి దర్శకుడు విఘ్నేష్ శివ. అతడికి ఈ చిత్రంలో పరిచయమే నయనతారతో ప్రేమకు దారి తీసిందనే ప్రచారం హల్చల్ చేసింది. మొత్తం మీద నానుమ్ రౌడీదాన్ చిత్రం చాలా మార్పులకు కారణంగా నిలిచిందని చెప్పాలి. నానుమ్ రౌడీదాన్ చిత్రం తరువాత సేతుపతి, కాదలుమ్ కడందుపోగుమ్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం రెక్క చిత్రంలో నటిస్తున్న ఈ హీరో కోసం పలు అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. నానుమ్ రౌడీదాన్ చిత్రం తరువాత దర్శకుడు విఘ్నేష్ శివ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా మళ్లీ విజయ్‌సేతుపతినే ఎంచుకున్నారు. ఇక ఇందులో ఇద్దరు నాయికలు అవసరం కావడంతో తన ప్రేమికురాలిగా ప్రచారంలో ఉన్న నయనతారను ఒక నాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇకపోతే మరో నాయకిగా నయనతార స్నేహితురాలు త్రిషను నటింపచేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చిన నటి త్రిష తననెవరూ సంప్రదించలేదని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే తాజాగా త్రిష, నయనతారతో కలసి విఘ్నేష్ శివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాత్తువాక్కుల రెండు కాదల్ అనే పేరును నిర్ణయించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం తన శ్రీసాయిరామ్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. ఇద్దరు టాప్ హీరోయిన్లతో ఒకే చిత్రంలో నటించే అవకాశం రావడంతో విజయ్ సేతుపతి యమ ఖుషీ అయిపోతున్నారట. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - నయనతార
-
చిరు పక్కన హీరోయిన్ ఎవరు?
-
నెట్లో హల్చల్ చేస్తున్న నయన,విఘ్నేష్‌ల సెల్ఫీ
-
నేనూ సాధారణ మహిళనే
బెంగళూరు: నేను సాధారణ స్త్రీనే అని అంటున్నారు సంచలన తార నయనతార. అయితే చాలామంది నటీమణులు వ్యక్తిగత జీవితాలకు భిన్నం ఈమె జీవితం అని చెప్పవచ్చు. కారణం నయన నిజ జీవితం తెరచిన పుస్తకం. అందులో చాలా పుటలు, పలువురికి సుపరిచయమే. తొలుత మాతృభాష మలయాళంలో రెండు చిత్రాలు చేశారు. ఆ తరువాత అయ్యా చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమెకిక్కడ తొలి చిత్రంతోనే విజయాహ్వానం లభించింది. ఆ తరువాత గజని చిత్రంలో అందాలారబోసినా ( ఒకపాటలో) ఆ చిత్ర విజయాన్ని నటి ఆసిన్ కొట్టేశారు. ఆ తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చంద్రముఖి, శింబుకు జంటగా నటించిన వల్లవన్ చిత్రాలు నయన్ స్థాయిని పెంచాయనే చెప్పాలి. అలా ఒక్కోమెట్టూ ఎక్కుతూ నటిగా బలపడుతున్న సమయంలో నటుడు శింబుతో ప్రేమాయణం ఆమెను సంచలన నటిని చేసింది. అలా మంచి డీప్కు చేరిన శింబుతో ప్రేమ మనస్పర్థల కారణంగా బద్దలైంది. ఆ సంఘటనలు నయన్‌ను కోలీవుడ్‌లో నిలువ నీయకుండా చేశాయి. అదే సమయంలో టాలీవుడ్ తలుపులు తెరిచింది. అక్కడ లక్ష్మీ తదితర చిత్రాలు విజయాలు గత చేదు అనుభవాలను మరిచేలా చేశాయి. అంతేకాదు శ్రీరామరాజ్యం వంటి గొప్ప కళాఖండంలో మహా సాద్వి సీతమ్మ పాత్రలో నటించే భాగ్యాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ కలిగించింది. అయితే అదే సమయంలో నృత్య దర్శకుడు ప్రభుదేవాతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు దారి తీసింది. అయితే అనూహ్యంగా ఆ ప్రేమ ఫెయిల్ అయ్యింది. సుమారు రెండేళ్ల పాటు నటనకు దూరం అయిన నయనతార మళ్లీ నటనపై దృష్టి సారించడం, ఆమెను మరోసారి తమిళ పరిశ్రమ ఆదరించడం అనేది బహుశా ఆమె కూడా ఆశించి ఉండదు. ప్రస్తుతం ప్రముఖ కథానాయికగా ప్రకాశిస్తున్న నయన ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గత ప్రేమలు, అవి విఫలమైన విషయాల గురించి ప్రశ్నలు విలేకరుల నుంచి ఎదురయ్యాయి. వాటికి నయనతార బదులిస్తూ నేను సాధారణ అమ్మాయినే. ఇతరుల మాదిరిగానే నాకు ఆశలు, ఆగ్రహాలు కలుగుతాయి. సరాసరి మనిషిలో ఉండే భావోద్రేకాలకు నేను అతీతురాలిని కాదు అని అన్నారు. -
నిరాశపరచిన నయనతార
ధనుష్, నయనతారలది హిట్ పెయిర్. యారడీ నీ మోహినీ చిత్రంలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. చిత్రం హిట్ అయ్యింది. మరో విషయం ఏమిటంటే నటుడు ధనుష్‌కు ఈ మధ్య సరైన సక్సెస్ లేదు. మయక్కం ఎన్న, 3, మరియాన్, నైయాండి వరుసగా ఆయన్ని నిరాశపరిచారుు. మధ్యలో హిందీ చిత్రం రంజనా విజయబాట పట్టినా తమిళంలో అంబికాతి విడుదలై అనువాద చిత్ర ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ధనుష్‌కు మంచి హిట్ కావలసిన అవసరం ఎంతయినా ఉంది. ఇప్పుడాయన బాలీవుడ్లో బాల్కి దర్శకత్వంలో ఒక చిత్రం తమిళంలో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో అనేకన్ చిత్రంతోపాటు కెమెరామన్ వేల్రాజ్ దర్శకత్వంలో వేలైఇల్లాద పట్టదారి చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా సురాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్ గా నయనతార బాగుంటుందని దర్శకుడితోపాటు ధనుష్ భావించారట. యారడి నీ మోహిని హిట్ అవడంతో ధనుష్‌తో మరోసారి జతకట్టడానికి నయనతార కూడా ఒకే అందట. పారితోషికం విషయంలో చర్చలు జరుగుతుండగా ఉదయనిధి స్టాలిన్ సరసన నన్బేండా చిత్రంలో నటించే అవకాశం నయనతారను వరించింది. ఈ చిత్రానికి పారితోషికం కూడా మెండుగా లభించడంతో డబ్బెవరికి చేదు పిచ్చోడా అన్న చందంగా సురాజ్ చిత్రానికి మొండి చెయ్యి చూపించి ఉదయనిధి స్టాలిన్ చిత్రానికి కమిట్ అయిపోయింది. ఇది దర్శకుడు సూరజ్‌కు షాక్ నిచ్చి నా ధనుష్‌ను మాత్రం చాలా నిరాశపరిచిందని సమాచారం. -
'అనామికా' మూవీ స్టిల్స్
-
అజయ్ స్వామినాథన్ మిస్సింగ్
నేడు సినిమా యువతరం చేతిలో కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తమ యుక్తిని జోడించి లబ్ధిపొందడంతో కృతకృత్యులవుతున్నారు. అదే సమయంలో కొంచెం వివాదాస్పద అంశాలకు తావిచ్చేలా కార్యక్రమాలు చేపడుతూ తద్వారా ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవకు చెందిన తాజా చిత్రం నయనతారది కావడం విశేషం. ఈ సంచలన తార నటిస్తున్న తాజా చిత్రం అనామిక. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన కహానీకి ఇది రీమేక్. ఇందులో నయనతార మిస్ అయిన ప్రియుడి కోసం గాలించే ప్రియురాలి పాత్ర పోషిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రచార పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పెన్సిల్ స్కెచ్ ఫొటోతో కూడిన ఈ పోస్టర్‌పై అజయ్స్వామినాథన్ అనే వ్యక్తి కనిపించడం లేదు. ఆయన వయసు, ఎత్తు ఇక్కడ పేర్కొన్నాం. అజయ్ స్వామినాథన్ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే అనామిక స్వామినాథన్ (www.Facebook.com/viacom18 tami)కు సమాచారం అందించండి అని ఉంది. ఈ పోస్టర్లు అనామిక చిత్ర ప్రచారం కోసం ముద్రించినవి. ఈ కొత్త రకం ప్రచారం చూపరుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోందని చిత్ర వర్గం పేర్కొంటోంది. ఇది చాలా చీఫ్ ప్రచారమంటూ హిందూమక్కల్ కట్చి దుయ్యపడుతోంది. ఈ తరహా ప్రచారం హిందువుల సంస్కృతి, సంప్రదాయాలను, మనో భావాలను కించపరచడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆ పార్టీ జోనల్ అధ్యక్షుడు ముత్తురమేష్ డిమాండ్ చేశారు. ఇలాంటి చీఫ్ ప్రచారంతో మనుషుల మనోభావాలతో ఆడుకోవడం తగదన్నారు. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఇలాంటి పోస్టర్లను అంటించడానికి తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ వ్యవహారంపై చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందిస్తూ ఎవరినీ నొప్పించాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. చిత్ర ప్రసారం కోసమే ఈ తరహా పోస్టర్లను రూపొందించినట్లు వివరించారు. ఇది వినూత్న ప్రచారంలో భాగమేనని పోస్టర్లపై కూడా చిత్ర నిర్మాతను ఫేస్బుక్ ద్వారా సంప్రదించగలరని స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు. -
ప్రేమికుల రోజున నయనతార, ఉదయనిధి స్టాలిన్ చిత్రం
ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. ఈ చిత్రం ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఉదయనిధి స్టాలిన్, నయనతార తొలిసారిగా జత కట్టిన చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ జెయిన్ మూవీస్ నిర్మిస్తోంది. హారిష్ జయరాజ్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 20న విడుదలకానుంది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన తొలి చిత్రం ఒరుకల్ ఒరు కన్నాడి ఘన విజయం సాధించింది. దీంతో ఆయన రెండవ చిత్రమైన ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అదే విధంగా దర్శకుడు ప్రభాకరన్ తొలి చిత్రం సుందర పాండియన్ విజయం సాధించింది. ఇది ఆయనకు రెండవ చిత్రం కావడం విశేషం. -
వారిలా నిజజీవితంలో నటించలేను!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కథానాయిక ఎవరంటే... గతంలో అందరూ నయనతార పేరు చెప్పేవారు. ఇప్పుడు ఆ క్రెడిట్‌ని నిదానంగా సమంత సొంతం చేసుకుంటున్నారు. మాటలతోనే దుమారాలను రేపుతున్నారామె. మొన్నామధ్య ‘1’ పోస్టర్ విషయంలో ‘ఆడవారి మనోభావాలు దెబ్బతినేలా ఆ పోస్టర్ ఉంది’ అని ఓ రేంజ్లో రాద్ధాంతం చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడేమో.. చెన్నయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ మరో వివాదానికి తెరలేపారు. ‘‘మేకప్ ఉన్నంతవరకే నేను నటిని. అప్పుడు నా ఆలోచనంతా పాత్ర మీదే ఉంటుంది. మేకప్ తీసేస్తే.. మామూలు సమంతని అయిపోతా. ఇక పొరపాటున కూడా పాత్ర గురించి ఆలోచించను. కొందరిలా నిజజీవితంలో కూడా నటించడం నాకు చేతకాదు’’ అనేసి పెద్ద చర్చకే తెరలేపారు సమంత. ఇంతకీ ‘ఆ కొందరు ఎవరు?’ అనే చర్చ కోలీవుడ్‌లో జోరందుకుంది. తన తోటి హీరోయిన్లను ఉద్దేశించే సమంత అలా అన్నారా? అని పలువురు సందేహం. మరి సమంతకు పోటీగా చలామణీ అవుతున్న హీరోయిన్లు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి. -
పచ్చబొట్టుతో తంటాలు
తర్వాత వారి ప్రేమకు బ్రేక్ పడింది. పచ్చబొట్టును తొలగించుకోవడానికి ఈ మధ్య విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయినా ఫలితం లేకపోయిందట. కారణం ఏమైనా ఆ మాయని మచ్చ నయనతారను ఇబ్బందులకు గురి చేస్తోందన్న విషయం శుక్రవారం తేటతెల్లమైంది. చెన్నైలో జరిగిన నూతన చిత్ర ప్రారంభోత్సవంలో నయనతార పాల్గొంది. ఆమె మోచేతుల వరకు చుడీదార్‌ను ధరించి పచ్చబొట్టు కనిపించకుండా శతవిధాలా యత్నించినా ఫలితం లేకపోరుుంది. ఫొటోగ్రాఫర్లు అరుుతే నయన్ పచ్చబొట్టు కనిపించేలా ఫొటోలు తీయడానికి ఆసక్తి చూపారు. దీనిని గుర్తించిన ఆమె పచ్చబొట్టును మరుగుపరచడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. అందుకేనేమో పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజ అన్నారో మహాకవి.