పచ్చబొట్టు నయనతారను చాలా ఇబ్బందిపాలు చేస్తోందని చెప్పవచ్చు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా తంటాలు పడుతోంది. ఆమె పచ్చబొట్టు వ్యవహారం తెలియంది కాదు. ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం సాగించినప్పుడు ప్రియుడు పేరుతో తన ఎడమ చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుంది.
తర్వాత వారి ప్రేమకు బ్రేక్ పడింది. పచ్చబొట్టును తొలగించుకోవడానికి ఈ మధ్య విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయినా ఫలితం లేకపోయిందట. కారణం ఏమైనా ఆ మాయని మచ్చ నయనతారను ఇబ్బందులకు గురి చేస్తోందన్న విషయం శుక్రవారం తేటతెల్లమైంది. చెన్నైలో జరిగిన నూతన చిత్ర ప్రారంభోత్సవంలో నయనతార పాల్గొంది.
ఆమె మోచేతుల వరకు చుడీదార్‌ను ధరించి పచ్చబొట్టు కనిపించకుండా శతవిధాలా యత్నించినా ఫలితం లేకపోరుుంది. ఫొటోగ్రాఫర్లు అరుుతే నయన్ పచ్చబొట్టు కనిపించేలా ఫొటోలు తీయడానికి ఆసక్తి చూపారు. దీనిని గుర్తించిన ఆమె పచ్చబొట్టును మరుగుపరచడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. అందుకేనేమో పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజ అన్నారో మహాకవి.