ప్రభుదేవా చిత్రంలో నయన్‌ | Nayana Tara Acting In Prabhudevas New Movie | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా చిత్రంలో నయన్‌

Published Sun, Apr 8 2018 6:44 AM | Last Updated on Sun, Apr 8 2018 6:45 AM

Nayana Tara Acting In Prabhudevas New Movie - Sakshi

సాక్షి, తమిళసినిమా : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇది సినిమాకూ వర్తిస్తుంది. చిత్ర పరిశ్రమలో ప్రేమించుకున్న వాళ్లు విడిపోవచ్చు, మళ్లీ కలవా వచ్చు. ప్రస్తుతం అగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న నయనతారనే తీసుకుంటే తొలి రోజుల్లో నటుడు శింబుతో డీప్‌ లవ్‌లో పడ్డారు. వీరిద్దరికి సంబంధించిన సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేశాయి. పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అలాంటిది వారి ప్రేమకు బ్రేక్‌ పడింది. ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమ కథ కొంత కాలం సాగింది. ప్రభుదేవాతోనూ పెళ్లికి సిద్ధమై మతాన్నే మార్చుకున్న నయనతార నటనకు స్వస్తి చెప్పడానికి సిద్ధమయ్యారు.

అయితే ఆ ప్రేమపెళ్లి పీటల వరకూ వెళ్లలేదు. ఆ తరువాత ఒక విలేకరి ప్రభుదేవాతో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు శింబుతో అయినా నటిస్తాను కానీ, ప్రభుదేవాతో జీవితంలో నటించను అని టక్కున బదులిచ్చారు నయనతార. అన్నట్టుగానే శింబు నుంచి విడిపోయిన తరువాత ఇదు నమ్మఆళు చిత్రంలో ఆయనకు జంటగా నటించారు. ప్రస్తుతం యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమ, సహజీవనం అనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న కొలైయుధీర్‌ కాలం చిత్రంలో ఒక కీలక పాత్రలో ప్రభుదేవాను నటింపచేసే ప్రయత్నాలు జరిగాయని, అయితే అందుకు ఆయనతో నటించడానికి నయనతార సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరిగింది. అయితే చిత్ర హిందీ రీమేక్‌లో ప్రభుదేవా నటిస్తుండడం విశేషం. నయనతార పాత్రలో తమన్నా నటిస్తున్నారు.

తాజాగా ప్రభుదేవా చిత్రంలో నయనతార నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. నటుడిగా బిజీగా ఉన్న ప్రభుదేవా నటుడు అజిత్‌ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతునట్లు, అందులో అగ్రనటి నయనతారను హీరోయిన్‌గా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. మళ్లీ ప్రభుదేవా దర్శకత్వంలో నయనతార ఎలా నటిస్తారన్న డౌట్‌ వస్తోందా? వృత్తి వేరు, వ్యక్తిగతం వేరు అనే బదులు వస్తుంది. ఇంతకుముందు శింబుతో నటించిన నయనతార, ఇప్పుడు ప్రభుదేవా చిత్రంలో నటించడానికి ఓకే అనడంలో పెద్దగా ఆశ్యర్యపడాల్సిన అవసరం ఉండదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement