prabhudeva
-
ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి
నటి సృష్టి డాంగే (Srusti Dange)కు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుదేవా నాట్య కచేరి (Prabhu Deva’s VIBE – LIVE IN DANCE CONCERT)లో తనకు సరైన గౌరవం, ప్రాధాన్యత దక్కలేదని వాపోయింది. ఆ వివక్షను భరించలేక లైవ్ షోకు రావాలనుకున్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చసింది.ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో.. అయినా..ప్రభుదేవా లైవ్ షోకు నేను వస్తానని ఎదురుచూస్తున్న అందరికీ ఓ విషయం చెప్పాలి. ఆ షోకు నేను రావడం లేదని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాను. ఈ నిర్ణయానికి, ప్రభుదేవా సర్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికీ, ఎప్పటికీ నేను ఆయనకు పెద్ద అభిమానినే. కాకపోతే ఆ షో నిర్వాహకులు చూపించే వివక్షను నేను భరించలేను. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ నాకు దక్కాల్సిన వాటికోసం నేను ఇప్పటికీ పోరాడాల్సి వస్తోంది. క్షమాపణలు చెప్పట్లేదు..ఇచ్చిన మాటపై నిలబడకపోవడం, అబద్ధపు హామీలివ్వడం నిజంగా విచారకరం. అందుకే కన్సర్ట్కు రాకూడదని ఫిక్సయ్యాను. నేను మీ అందరినీ క్షమించమని అడగడం లేదు. ఎందుకు షోకు హాజరవడం లేదో కారణం చెప్పాలనుకున్నాను. కుదిరితే మరోసారి మంచి వాతావరణంలో, సముచిత గౌరవం దక్కే ప్రదేశంలో మిమ్మల్ని కలుస్తాను.ఎంతో ఆశగా ఎదురుచూశా.. చివరకు!ఈ షో నిర్వాహకులకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. క్రియేటివ్ టీమ్.. ఆర్టిస్టులను గౌరవిస్తే బాగుంటుంది. ఈ ప్రాజెక్టు గురించి ఎంతో ఆశగా ఎదురుచూశాను. దురదృష్టవశాత్తూ దానికి దూరంగా ఉండక తప్పడం లేదు అని రాసుకొచ్చింది. దీనిపై ప్రభుదేవా టీమ్ స్పందించాల్సి ఉంది. ప్రభుదేవా నాట్యకచేరి ఫిబ్రవరి 22న చెన్నైలో జరగనుంది. ఇక సృష్టి డాంగే తమిళంలో పలు సినిమాలు చేసింది. తెలుగులో ఏప్రిల్ ఫూల్, ఓయ్ నిన్నే, చంద్రముఖి 2 చిత్రాల్లో మెరిసింది. View this post on Instagram A post shared by S r u s h t i i D a n g e 🦋💫 (@srushtidangeoffl) చదవండి: ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ -
ఓటీటీలో శివన్న, ప్రభుదేవా సినిమా స్ట్రీమింగ్
శివరాజ్‌కుమార్, ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన కన్నడ సినిమా 'కరటక దమనక'. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక సాంగ్ దేశవ్యాప్తంగా ఊపేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కన్నడ ప్రముఖ డైరెక్టర్ యోగరాజ్ భట్ తెరకెక్కించారు. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా మార్చి నెలలో విడుదలైంది. అయితే, తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది.శివరాజ్ కుమార్‌తో యోగరాజ్ భట్ మొదటి సారి ఈ సినిమా తెరకెక్కించారు. ఆపై శివన్న- ప్రభదేవా కాంబినేషన్లో నటించిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభుదేవా హీరోగా కన్నడ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, వారు ఆశించనంతగా ఈ చిత్రం మెప్పించలేదని టాక్ వచ్చింది. అయితే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో తెలుగు, తమిళ్ వర్షన్స్ కూడా విడుదల కానున్నాయని సమాచారం.కరటక (శివరాజ్‌కుమార్), దమనక (ప్రభుదేవా) పాత్రలలో ఇద్దరూ పోటీపడి నటించారు. ఒక కేసు కారణంతో జైలులో ఉన్న వారిద్దరిని ఒక పనిచేసి పెట్టాలని జైలర్ విడుదల చేస్తాడు. అప్పుడు వారిద్దరూ ఒక పల్లెటూరుకు వెళ్తారు. అక్కడ ఊరును మోసం చేసి, దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే మోసగాళ్లలా ఉంటారు. అదే గ్రామంలో నీటి కోసం అల్లాడుతున్న ప్రజల ఇబ్బందులు చూసి చలించిపోతారు. నీళ్లు లేకపోవడంతో కొందరు ప్రజలు అక్కడి నుంచి పట్టణాలకు వెళ్లిపోతారు. కానీ, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా అక్కడే ఉండాలని కొందరు అనుకుంటారు. ఇలాంటి సమయంలో జిత్తులమారి నక్కలుగా ఉన్న వారిద్దరూ ఆ గ్రామం కోసం ఏం చేశారు. వారికి ఆ జైలర్ అప్పగించిన పని ఏంటి..? అనేది ఆసక్తిని పెంచుతుంది. ప్రియా ఆనంద్, నిశ్విక నాయుడు, రవిశంకర్, రంగాయణ రఘు, తనికెళ్ల భరణి తదితరలు ఈ సినిమాలో నటించారు. తనికెళ్ల భరణి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఇంటి వద్దే చూసేయండి. -
ప్రభుదేవా ఇంట్లో విషాదం.. హుటాహుటిన ప్రయాణం
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రభుదేవా అమ్మమ్మ 'పుట్టమ్మన్ని' (97) అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన వెంటనే మైసూరు చేరుకున్నారు. కర్నాటకలోని మైసూర్లో జన్మించిన ప్రభుదేవా చైన్నైలో నివాసం ఉంటున్నారు.ప్రభుదేవా అమ్మమ్మ మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మైసూర్‌లోని మందకల్లి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తన సొంత గ్రామం 'తొరు' చేరుకున్నారు. నేడు జరిగిన ఈ అంత్యక్రియల్లో ప్రభుదేవా తమ్ముళ్ళు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్‌లు కూడా పాల్గొన్నారు. పుట్టమ్మన్ని మరణంతో ప్రభుదేవా కుటుంబంలో విషాదం నెలకొంది. -
కాంబినేషన్ కుదిరింది
‘మిన్సార కనవు’ (‘మెరుపు కలలు’ – 1997) చిత్రం తర్వాత కాజోల్, ప్రభుదేవా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇరవయ్యేడేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాతో నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నసీరుద్దీన్ షా, సంయుక్తా మీనన్, జిషు సేన్ గుప్తాఆదిత్య సీల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ మొదలైంది.‘‘మా సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే టీజర్‌తో పాటు మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. చరణ్ తేజ్‌కి మాత్రమే కాదు.. సంయుక్తాకు కూడా హిందీలో ఇది తొలి చిత్రం కావడం విశేషం. -
టాలీవుడ్ డైరెక్టర్ భారీ యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై స్టార్ జోడీ..!
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా జంటగా నటించిన చిత్రం 'మిన్సార కనవు'. 1997లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ సినిమా రిలీజై ఇప్పటికీ దాదాపు 27 ఏళ్లు పూర్తవుతోంది.తాజాగా ఈ జోడీ మళ్లీ తెరపై జంటగా సందడి చేయనుంది. టాలీవుడ్ చిత్రనిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ 27 ఏళ్ల కాజోల్, ప్రభుదేవా నటించడం సినీ ప్రియుల్లో ఆసక్తి పెంచుతోంది. వీరితో పాటు ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.మరోవైపు టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసి.. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
ప్రభుదేవా హిట్ సినిమా 'ప్రేమికుడు' రీ-రిలీజ్
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ- రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా సాంగ్స్ ఉన్నాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్‌కు అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు. -
రీరిలీజ్‌కు రెడీ అవుతోన్న సూపర్ హిట్ లవ్ స్టోరీ
ప్రేక్షక్షుల ముందుకు మరోసారి వచ్చేందుకు ప్రేమికుడు సిద్ధం అవుతున్నాడు. ప్రభుదేవా హీరోగా, నగ్మా హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘ప్రేమికుడు’(తమిళంలో ‘కాదలన్’). శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘ముక్కాలా ముక్కాబులా’, ‘ఊర్వశి ఊర్వశి’, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’, ‘అందమైన ప్రేమరాణి’.. వంటి పాటలన్నీ యువతను ఉర్రూతలూగించాయి. క్లాసిక్ హిట్‌గా రూపొందిన ‘ప్రేమికుడు’ తెలుగులో రీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగు రీ రిలీజ్ హక్కులను నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ దక్కించుకున్నారు. సీఎల్ఎన్ మీడియా ద్వారా త్వరలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. -
న్యూ ఇయర్లో గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్!
న్యూ ఇయర్ వేళ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది శాండల్‌వుడ్ భామ. తోతాపురి- 2, రంగనాయకి, దిల్మార్ చిత్రాల్లో నటించిన కన్నడ హీరోయిన్ అదితి ప్రభుదేవా గర్భం ధరించినట్లు వెల్లడించింది. కొత్త సంవత్సరంలో తాను అమ్మను కాబోతున్నట్లు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఏడాదిలో తల్లి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో ఫోటోలను పంచుకుంది. అదితి తన ఇన్‌స్టాలో రాస్తూ..' బంధుత్వాలలో గొప్పది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి బాధలోనూ మన నోటి నుండి వచ్చే ఏకైక పదం అమ్మ. జీవితంలో ప్రతి ఒక్కరినీ ప్రేమగా, గౌరవంగా చూసుకునే బంధం అమ్మ. మన కోసం ప్రతిక్షణం ఆలోచించేది అమ్మా. నేను 2024లో అమ్మను కాబోతున్నా' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కూడా పంచుకుంది. కాగా..నటి అదితి ప్రభుదేవాకు, వ్యాపారవేత్త యషాస్‌తో నవంబర్ 2022లో వివాహం జరిగింది. ప్రస్తుతం అదితి నటించిన 'అలెక్సా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
ప్రభుదేవాతో ఆ పాట చేయడానికి కారణం ఎవరంటే..
-
రామ్ చరణ్‌కు ప్రభుదేవా బిగ్ సర్ప్రైజ్.. అదేంటంటే!
ఆస్కార్ వేడుకలు ముగించుకున్న రామ్ చరణ్ ఇటీవలే అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ ఇంటికి కూడా చేరుకున్నారు. ఆయన తదుపరి చిత్రంలో శంకర్ దర్శకత్వంలో పనిచేయనున్నారు. తాత్కాలికంగా ఈ సినిమాకు ఆర్సీ15 అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన చెర్రీకి ఘనస్వాగతం లభించింది. ప్రభుదేవా ఆధ్వర్యంలోని ఆర్సీ15 చిత్రబృందం నాటు నాటు స్టెప్పులతో వెల్కమ్ చెప్పింది. అ తర్వాత రామ్ చరణ్‌ను పూలమాలతో సత్కరించింది. (ఇది చదవండి: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ప్రముఖ నటి కూతురు, ఫోటో వైరల్) దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. రామ్ చరమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.' ఇంతటి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పలేను. నాకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రభుదేవా సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్సీ15 షూటింగ్‌కి తిరిగి వచ్చినందుకు చాలా గొప్పగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చెర్రీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా స్పందించింది. స్వీటెస్ట్ వెల్కమ్ అంటూ కామెంట్ చేసింది. కాగా.. ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. కాగా.. మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న RC15 పొలిటికల్ యాక్షన్ డ్రామాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య, జయరామ్, అంజలి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ఓటీటీలో మై డియర్ భూతం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అన్ని అన్నిరకాలుగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు ప్రభుదేవా. ఇటీవలే ఆయన మై డియర్ భూతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మించగా శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ దీన్ని తెలుగులో విడుదల చేశారు. జూలై 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 2న ఈ సినిమా జీ5లో ప్రసారం కానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. మరింకే.. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయిన పిల్లలు ఈ శుక్రవారం ఎంచక్కా మై డియర్ భూతం చూసేయండి.. Karkimuki is coming to your houses on the 2nd of September. Stay tuned!#MyDearBootham #MyDearBoothamOnZee5 #ZEE5 #ZEE5Tamil@PDdancing @sureshmenonnew @samyuktha_shan @actorashwanth @immancomposer @RSeanRoldan @naviin2050 @nambessan_ramya @immancomposer @uksrr @Sanlokesh pic.twitter.com/WIJFvvnbfN — ZEE5 Tamil (@ZEE5Tamil) August 28, 2022 చదవండి: ఒకే భవనంలో అపార్ట్మెంట్స్ కొన్న ఇద్దరు స్టార్ హీరోలు! విమానాశ్రయంలో ఇళయరాజా పడిగాపులు -
ప్రభుదేవా 'మై డియర్ భూతం' రిలీజ్ డేట్ ఖరారు..
Prabhudeva My Dear Bootham Movie: టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్‌గా ప్రభుదేవా సుపరిచితమే. ఈ ఫేమ్ కంటిన్యూ చేస్తూనే హీరోగా, దర్శకుడిగా తన టాలెంట్ బయటపెట్టి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. ఆయన ముఖ్య పాత్రలో నటించిన కొత్త సినిమా 'మై డియర్ భూతం'. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్లై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా జూలై15న విడుదల చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రమని వారు తెలిపారు. MY DEAR BOOTHAM JULY 15 th IN THEATRES pic.twitter.com/mSmNpNGAHB — Prabhudheva (@PDdancing) July 6, 2022 ఈ చిత్రంలో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా.. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే చూసిన జీ నెట్వర్క్ టీమ్.. భారీ ధర చెల్లించి 'మై డియర్ భూతం' ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్నట్లు సమాచారం. -
మై డియర్ భూతం: మాస్టర్ ఓ మై మాస్టర్ సాంగ్ విన్నారా?
ప్రభు దేవా ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా 'మై డియర్ భూతం'. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. మాస్టర్ ఓ మై మాస్టర్ అంటూ ఫాస్ట్ బీట్తో సాగిపోతున్న ఈ పాటలో ప్రభుదేవా డాన్స్ హైలైట్ అయింది. ఎప్పటిలాగే స్టైలిష్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు ప్రభుదేవా. నీ మనసు కన్న కళలు అన్నీ చూసేయ్.. చూసేయ్.. నిన్ను మించినోడు లేనేలేడు ఆడేయ్ పాడేయ్ అంటూ రాసిన లిరిక్స్ ప్రేరణాత్మకంగా ఉన్నాయి. అరవింద్ అన్నెస్ట్ పాడిన ఈ పాటకు డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి అందించిన లిరిక్స్ ప్రాణం పోశాయి. రాజేష్, డి. ఇమ్మాన్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవెల్ మార్చేశాయి. ఇకపోతే ఈ సినిమాలో రమ్య నంబీసన్, బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: వారం రోజులుగా ఆస్పత్రిలో దర్శకుడు, పరిస్థితి విషమం బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న బేబమ్మ, అప్పుడే మరో ఛాన్స్ కొట్టేసిందిగా! -
జిన్నాకి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!
విష్ణు మంచు తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సిన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య 'జిన్నా' లోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించాడట. ఈ సినిమాలోని ఓ పాటకు ఇప్పటికే ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవ కొరియోగ్రఫీ అందించగా తాజాగా ఓ సాంగ్‌ను స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య స్టెప్స్ సమకూర్చాడు. హీరో విష్ణు, పాయల్, సన్నీలియోన్‌ల మధ్య సాగే ఓ పార్టీ సాంగ్‌కు ఆయన కొరియోగ్రఫి అందించినట్లు తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ పాట సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. విష్ణు మంచుతో ఉన్న అనుబంధంతో గణేష్ ఆచార్య ఈ పాటలో కాలు కదపడం విశేషం. ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండ ప్రభుదేవ, గణేశ్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లతో పాటలను రూపొందించి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు క్రియేట్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తుండగా.. చోటా కే నాయుడా కెమెరా మ్యాన్‌గా పని చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో ప్రభుదేవా..
Prabhu Deva Choreography In Chiranjeevi Godfather Movie: కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. చిరంజీవి చేతిలో ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్, మెగా 154 చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మంగళవారం (మే 3) రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేయనున్నారని మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఇదివరకే తెలిపాడు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ను ప్రకటించాడు తమన్. చిరు-సల్మాన్ కలిసి డ్యాన్స్ చేయనున్న సాంగ్‌ను ఇండియన్ మైఖేల్ డ్యాన్సర్‌గా పేరొందిన ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించనున్నారు. ఇదివరకు అనేక చిరంజీవి చిత్రాలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి చిందేయడం, దీనికి తమన్ సంగీతం అందించడంతోపాటు ప్రభుదేవా కొరియోగ్రఫీ యాడ్ కావడంతో ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ పాట సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి. చదవండి: సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి.. టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి Yayyyy !! ❤️ THIS IS NEWS 🎬🧨💞 @PDdancing Will Be Choreographing An Atom Bombing Swinging Song For Our Boss @KChiruTweets and @BeingSalmanKhan Gaaru What A High Seriously @jayam_mohanraja Our Mighty #GodfatherMusic #Godfather This is GONNA LIT 🔥 THE Screens For Sure 😍 pic.twitter.com/H618OaI9b6 — thaman S (@MusicThaman) May 3, 2022 -
భుజంపై భారంతో బన్నీ, ఒంటికాలుతో ప్రభుదేవా.. తగ్గేదే లే!
పాత్రలు ప్రతిసారీ ఛాలెంజ్‌లు విసరవు.. క్యారెక్టర్ ప్రతిసారీ కొత్తగా ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం ఛాలెంజ్ గట్టిగా ఉంటుంది. క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. అలాంటి రోల్స్‌కి యాక్టర్స్ ‘యస్’ అన్నారంటే... సిల్వర్ స్క్రీన్ మీద తప్పకుండా మ్యాజిక్ జరుగుతుంది. ప్రస్తుతం కొందరు స్టార్స్‌ని అలాంటి రోల్స్ ఛాలెంజ్ చేశాయి. ‘తగ్గేదే లే’ అంటూ ఆ సవాల్‌ని స్వీకరించారు. ఆ విశేషాలేంటో చూద్దాం. భారమంతా భుజం పైనే! సాధారణంగా మాస్ కమర్షియల్ సినిమాల బరువంతా స్టార్ హీరోల భుజాలపైనే ఉంటుంది. ఎందుకంటే సినిమాకు సెంటరాఫ్ అట్రాక్షన్ హీరోయే. అలాంటి భారీ సినిమాలను మోయాలంటే హీరో భుజాలు ఎంత బలంగా ఉండాలి! కానీ షోల్డర్ ఇన్బ్యాలెన్స్తోనే పాన్ ఇండియా సినిమాకు సిద్ధమయ్యారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘పుష్ప’. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ అనే మాస్ పాత్రలో కనిపిస్తారు బన్నీ. గుబురు గడ్డం, రింగులు తిరిగిన జుట్టు, కమిలిని చర్మంతో బన్నీ డీ–గ్లామరస్ పాత్రలో కనిపిస్తారని తెలిసిందే. అలాగే షోల్డర్ ఇన్‌బ్యాలెన్స్ (భుజ అసమతుల్యత) ఉన్న వ్యక్తిగా బన్నీ కనిపిస్తారనే ఫీల్‌ని ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘నిను చుస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే..’ పాట కలగజేస్తోంది. భుజ అసమతుల్యత భారాన్ని తన భుజం మీద బన్నీ బాగా మోసిన విషయం పాటలో కనిపిస్తోందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాలో బన్నీ ‘తగ్గేదే లే’ అని డైలాగ్ చెబుతారు. నటన పరంగా తగ్గేదే లే అంటూ ఈ పాత్రను సవాల్‌గా తీసుకుని చేశారు. ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదల కానుంది. చదవండి: ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్, ఈసారి క్లాసికల్ టచ్‌తో..! పాప కోసం ఒంటి కాలితో... ప్రభుదేవా మ్యాజిక్ అంతా ఆయన కాళ్లలోనే ఉంది. మెరుపు వేగంతో కాళ్లను ఆడించే నైపుణ్యం ఉన్న డ్యాన్సర్ ప్రభుదేవా. ఆయన కాళ్లలోని చురుకుదనానికి ఇన్నేళ్లు ఈలలు వేశారు. ఇప్పుడు ఓ కొత్త ఛాలెంజ్‌కి రెడీ అయ్యారు ప్రభుదేవా. ‘పొయ్ కాల్ కుదిరై’ (కృత్రిమ కాలు ఉన్న గుర్రం అని అర్థం) సినిమాలో ప్రభుదేవా ఒక కాలు లేని వ్యక్తిగా కనిపించనున్నారు. కృత్రిమ కాలు ధరించి ఉన్న ఆయన లుక్ ఇటీవల విడుదలయింది. ఈ చిత్రంలో శత్రువుల బారి నుంచి ఓ పాపను కాపాడే పాత్రను ప్రభుదేవా చేస్తున్నారని తెలుస్తోంది. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ట్రాక్‌లో సవాల్ హీరోగా, విలన్‌గా ప్రూవ్ చేసుకుంటూ కెరీర్ ట్రాక్‌లో దూసుకెళుతున్నారు ఆది పినిశెట్టి. ఇప్పుడు ‘క్లాప్’ సినిమాలో రన్నర్ ట్రాక్ ఎక్కారు. ఇందులో జాతీయ స్థాయిలో రన్నింగ్ రేస్‌లో బంగారు పతాకం సాధించాలనే పాత్రలో కనిపించనున్నారు. అయితే మధ్యలో తన కుడి కాలుని పోగొట్టుకుంటారు. కృత్రిమ కాలుతో తన ప్రయాణాన్ని ఈ రన్నర్ మళ్లీ మొదలుపెడతాడా? అనేది కథ. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆకాంక్షా సింగ్ కథానాయిక. ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్యా దర్శకుడు. చదవండి: వీకెండ్ ఇలా అద్భుతంగా గడిచింది: సమంత -
'ప్రభుదేవాతో గొడవలు'..క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు
వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘శత్రువు’ సినిమాతో నిర్మాగా మారారు ఎంఎస్ రాజు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం పౌర్ణమి. ఈ చిత్రాన్ని కూడా ఎంఎస్ రాజునే నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ సమయంలో డైరెక్టర్ ప్రభుదేవాకు, ఎంఎస్ రాజుకు మధ్య గొడవలు వచ్చాయని, ప్రభాస్ దీన్ని సద్దుమణిగించారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ రాజు క్లారిటీ ఇచ్చారు. 'ప్రభుదేవాకు నాకు చాలా గొడవలు అయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. నిజానికి ప్రభుదేవా మంచి పొజిషన్లో ఉన్నాడని సంతోషిస్తాను కానీ అతనితో నాకు గొడవలు ఎందుకు ఉంటాయి? ఇది కేవలం పుకార్లు మాత్రమే' అని వివరించారు. ఇక నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాను అందించిన ఎంఎస్ రాజు కొంతం గ్యాప్ తర్వాత దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఆయన తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుందని పేర్కొన్నారు. చదవండి : మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా అనుష్క నటించనుందా? Karnataka: సీఎం కావాలని ఉంది: ఉపేంద్ర -
అల్లు అర్జున్ను కాపీ కొట్టిన సల్మాన్.. సేమ్ టు సేమ్!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే. గతేడాది విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ రంజాన్ కానుకగా మే 13న రాధే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇక సినిమాలో తనకు నచ్చినట్లు వ్యవహరించే రౌడీ పోలీస్ పాత్రలో సల్మాన్ కనిపించనున్నాడు. దిశాపటాని హీరోయిన్గా కనిపించనుంది. రణదీప్ హుడా పవర్ఫుల్ విలన్‌గా సల్మాన్‌ను ఢీ కొట్టనున్నాడు. తాజాగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం రిలిజ్ చేశారు. ఈ ట్రైలర్లో చేజింగ్‌లు, భారీ యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాను అంతం చేసే పోలీస్ ఆఫీసర్ స్టోరీని ప్రభుదేవా పక్కా మాస్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాడు. అయితే ట్రైలర్‌పై టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలోని సీటీమార్ పాటను రాధే చిత్రయూనిట్ కాపీ కొట్టిందని మండిపడుతున్నారు. సల్మాన్, దిశా కనిపించే ఓ పాటలో పూర్తిగా బన్నీ స్టైల్లో భాయ్‌జాన్ స్టెప్పులు వేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బన్నీని కాపీ కొట్టిన సల్మాన్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక అల్లు అర్జున్ స్టెప్పులను సల్మాన్ కాపీ కొట్టారంటే మన హీరో రేంజ్ వేరు అని బన్నీ అభిమానులు మురిసిపోతున్నారు. చదవండి: సెల్ఫీ అన్నాడు.. ఏకంగా ముద్దే పెట్టేశాడు అల్లు అర్జున్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు! Why is #seetimaar in #RadheTrailer !!?? — Great_Indian (@Since_01999) April 22, 2021 #Seetimaar song in #radhe?....south ke film ke saath gaane bhi copy karre hain😂 — NeedKane (@messagebabu) April 22, 2021 @alluarjun bhai bollywood ke taraf se sorry 😭#RadheTrailer #SeetiMaar — Sunny (@TheAce1kka) April 22, 2021 After listening to #Seetimaar song In #RadheTrailer @alluarjun - Yeh toh mera wala gaana hai 😂#RadheTrailer #DJ #AlluArjun #SalmanKhan #Pushpa pic.twitter.com/oK6hYGz6VU — Muthayyab Ali™️ (@immali14) April 22, 2021 -
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న ప్రభుదేవా!
దర్శకుడు, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్, హీరో... ఇలా అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్ జర్నీలో కొనసాగుతున్నారు ప్రభుదేవా. ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి ప్రభుదేవా రాదే సినిమా చేస్తున్నాడు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో విడుదల చేసేది లేదని వచ్చే ఏడాది జనవరిలో లేదా ఈద్ పండగకు థియేటర్స్‌లనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తునట్లు ప్రభుదేవా వెల్లడించారు. కెరీర్లో ఎలాంటి ఢోకా లేకుండా వెళుతున్న ప్రభుదేవాకు వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదరయ్యాయి. ప్రేమ, పెళ్లి ఇలా రెండింటిలోనూ విఫలమయ్యారు. మొదట 1995లో రామలతను వివాహం చేసుకున్న ఈ నటుడు 2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చదవండి: ఈ నెల 21న కలుద్దామంటున్న నాని! ఆ తర్వాత స్టార్ హీరోయిన్ నయనతారతో ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభుదేవా రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తన చుట్టాలమ్మాయితో రిలేషన్ షిప్లో ఉన్నట్లు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ప్రభుదేవా మాత్రం స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. ఇక నయనతార కూడా ముందు శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడిన ఈ భామ ప్రస్తుతం డెర్టెక్టర్ విఘ్నేష్ శివన్‌తో రిలేషన్షిప్లో ఉన్నారు. చదవండి: రాదే ఓటీటీలోకి రాదు -
దుమ్ములేపే డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్..!
ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా. ప్రేమికుడు సినిమాలో ముక్కాలా.. ముక్కాబులా అంటూ ఆయన చేసిన డ్యాన్సులు ఇప్పటికీ మన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఎంతో మంది యువతకు ఆయన స్పూర్తి. ఇదే కోవలో ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నలుగురు కుర్రాళ్లు వారిలో దాగిన ప్రతిభని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో మనలో దాగి ఉన్న ప్రతిభని నలుగురికి చెప్పాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారడంతో టెక్నాలజీని వాడుకొని రాత్రికి రాత్రే ఓవర్‌నైట్ సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. చదవండి: రెస్టారెంట్ కిచెన్‌లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’! తాజాగా ఓ నలుగురు కుర్రాళ్లు స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ చిత్రంలోని ముక్కాలా.. ముక్కాబులా అనే సాంగ్‌కి దిమ్మతిరిగే స్టెప్పులు వేశారు. ముక్కాలా.. ముక్కాబులా అనే పాటకు ప్రభుదేవా వేసిన డ్యాన్స్ అప్పట్లో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నలుగురు కుర్రాళ్లు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుండగా, బాలీవుడ్ యాక్టర్స్ శృతి సేత్, గౌరవ్ కపూర్ ఆ గ్యాంగ్ వేసిన స్టెప్పులకి ఫిదా అయ్యారు. 3.9 లక్షలకి పైగా నెటిజన్స్ ఇప్పటి వరకు ఈ వీడియోని చూడగా.. 26,000 మందికి పైగా లైక్ చేయడం విశేషం. చదవండి: పాల కోసం ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసింది! Indian youth is so creative. The last frame will make you watch it again and again. Video courtesy: @cinnabar_dust pic.twitter.com/HHMtX42zHl — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 17, 2020 -
‘భగీర’గా ప్రభుదేవా
చెన్నై : నటుడు, నృత్యదర్శకుడు, దర్శకుడు ప్రభుదేవా నటిస్తున్న తాజా చిత్రానికి భగీర అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈయన నెవర్ బిఫోర్ లాంటి పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల తెలియజేసిన విషయం తెలిసిందే. త్రిష ఇల్లన్నా నయనతార, శింబు హీరోగా అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం భగీర. నటి అమైనా దస్తూర్ నాయకిగా నటిస్తోంది. ఈ అమ్మడు చాలా కాలం తరువాత కోలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం ఇదే. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. నటుడు ధనుష్ ఈ పోస్టర్‌ను ఆన్లైన్లో ఆవిష్కరించారు. కాగా చిత్ర వివరాలను దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ తెలుపుతూ భగీర అనేది కామిక్ పుస్తకాల్లో వచ్చే కల్పిత పాత్ర అని చెప్పారు. జంగిల్‌బుక్ చిత్రంలో మోగ్లీ పాత్రకు ఫ్రెండ్‌గా కనిపించే చిరుతపులి పాత్ర లాంటిదన్నారు. ఆపదలో ఉన్న అబలలను మరో ఆలోచన లేకుండా కాపాడే ఈ పాత్రలో నటుడు ప్రభుదేవా నటిస్తున్నారని చెప్పారు. ఇది సైకో థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన సస్పెన్స్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. వరుస హత్యల నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రంగా భగీర ఉంటుందన్నారు. ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి కథ, కథనాలతో, ఆశ్యర్యకరమైన అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ప్రస్తుతానికి భగీర గురించి ఏమీ చెప్పదలచుకోలేదని, షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని చెప్పారు. దీన్ని ఆవీ.భరతన్ బీఏబీఎల్, ఎస్వీఆర్.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు. కాగా భగీర చిత్ర పోస్టర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభుదేవా గెటప్ చాలా వింతగా ఉండి చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. -
‘రౌడీబేబీ’ సాయిపల్లవి మరో రికార్డు!
కోలీవుడ్ హీరో ధనుష్, సాయి పల్లవిల కాంబినేషన్లో వచ్చిన ‘మారి 2’ చిత్రం తమిళ్లో కమర్షియల్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే సినిమా విడుదలైన కొద్ది రోజులకే చిత్రయూనిట్ రౌడీబేబీ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి రికార్డులు సృష్టిస్తున్న ‘రౌడిబేబీ’ ట్రెండింగ్ సాంగ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచినట్లు తాజాగా యూట్యూబ్ ప్రకటించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రౌడిబేబీ 725 మిలియన్ల వ్యూస్‌తో 7వ స్థానంలో నిలిచింది. హీరో ధనుష్ రచించి పాడిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు ప్రభుదేవా కొరియోగ్రఫి చేశారు. కాగా బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన మారి-2లో టోవినో, వరలక్ష్మీ శరత్ కుమార్, కృష్ణలు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక మారి మొదటి పార్ట్ బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించకపోయినా సీక్వెల్ మాత్రం తమిళంలో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే యూట్యూబ్ ట్రెండింగ్ అయిన భారతీయ పాటలలో రౌడిబేబీతో పాటు ధన్వీ భనుషాలి పాడిన వస్తే, టోని కక్కర పాడిన ‘కో కో లా’, ‘ధీమే ధీమే’ పాటలు, అజిత్ సింగర్ పాడిన ‘వే మాహి’ కూడ ఈ ట్రెండింగ్ జాబితాలో ఉన్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. -
సల్మాన్ సినిమాలో ‘స్పైడర్ విలన్’
సాక్షి, ముంబై : సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న రాధే సినిమాలో తమిళ నటుడు భరత్ విలన్‌గా నటించనున్నాడు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ నటుడు భరత్ సల్మాన్, ప్రభుదేవాతో విడివిడిగా దిగిన ఫోటోలను శుక్రవారం ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా భరత్ తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే దర్శకుడు ప్రభుదేవాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. భరత్‌కు బాలీవుడ్లో ఇది రెండో సినిమా. 2013లో ఆయన జాక్‌పాట్ అనే హిందీ సినిమాలో నటించారు. భరత్ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమాలో మెయిన్ విలన్ సూర్యకు తమ్ముడిగా కీలక పాత్ర పోషించాడు. సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్లో ప్రస్తుతం దబాంగ్ 3 తెరకెక్కుతోంది. డిసెంబరు 20న విడుదల అవుతున్న ఈ సినిమాలో ఈగ విలన్ కిచ్చ సుదీప్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం సల్మాన్ ‘రాధే’ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా 2020 రంజాన్‌కు విడుదల కానుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతీ రంజాన్‌కు సినిమా విడుదల చేసే ఆనవాయితీ ఉన్న సల్మాన్ 2019 రంజాన్‌కి ప్రేక్షకులకి నిరాశపరిచాడు. మొదట్లో ఇన్షా అల్లా పేరుతో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ హీరోయిన్గా సినిమా అనౌన్స్ చేశారు కానీ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. దాంతో దబాంగ్ 3 సినిమాను ఆఘమేఘాల మీద పట్టాలెక్కించి, శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఆ చిత్రానికీ ప్రభుదేవానే దర్శకుడు. ఈద్‌కి రాబోయే రాధే సినిమాలో దిశాపటాని, జాకీష్రాఫ్, రణదీప్ హుడా కీలక పాత్రధారులు. కాగా, సల్మాన్ ఖాన్ తన వరుస సినిమాలలో దక్షిణాది నటులకు అవకాశాలివ్వడం వెనుక మార్కెట్ స్ట్రాటజీ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖాన్ త్రయంలోని మిగతా ఇద్దరితో పోల్చి చూస్తే సల్మాన్‌కు హైదరాబాద్ మినహా సౌత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమా కలెక్షన్లు తక్కువ. వీటిని అధిగమించడానికే సౌత్‌లో పేరున్న నటులను తీసుకుంటున్నారని బి టౌన్ టాక్. -
ప్రభుదేవా, తమన్నా రేర్ రికార్డ్!
డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ అభినేత్రి 2. సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే జోడి కలిసి నటించిన మరో హార్రర్ థ్రిల్లర్ మూవీ ఖామోషీ. చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బాలీవుడ్ మూవీ కూడా మే 31న ప్రేక్షకుల ముందు రానుంది. ఇలా ఒకే జంట కలిసి నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావటం అరుదైన రికార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు. అభినేత్రి 2 కూడా దేవీ 2 పేరుతో బాలీవుడ్ లో రిలీజ్ అవుతోంది. ఇలా ఒకే రోజు ఒకే జంట నటించిన ఒకే జానర్ సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు రావటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. -
సూర్యతో ఢీ అంటున్న ప్రభుదేవా
తమిళసినిమా: నటుడు సూర్యతో ఢీ కొట్టేందుకు డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా సిద్ధం అవుతున్నారు. సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఎన్జీకే. రకుల్‌ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఆర్ఎస్ ప్రకాశ్, ఆర్ఎస్ ప్రభు నిర్మించారు.ఈ చిత్రం మే 31న విడుదలకు సిద్ధం అవుతోంది.సెల్వరాఘవన్ దర్శకత్వంలో చిత్రం అంటేనే సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంటుంది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా, దర్శకుడు విజయ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన దేవి చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో టైటిల్ పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా పోషించింది.ఇదే కాంబినేషన్లో దేవి–2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హారర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సైతం మే 31న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ విధంగా సూర్య, ప్రభుదేవాలు ఒకే రోజున బరిలో దిగనున్నారన్నమాట. -
అభినేత్రి 2.. ఒకటి కాదు రెండు దెయ్యాలు
ప్రభుదేవా, తమన్నా జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ అభినేత్రి. తమిళ నాట దేవీ పేరుతో విడుదలైన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వల్‌ను తెరకెక్కించారు. తొలి భాగంలో నటించిన ప్రభుదేవా, తమన్నాలు మరోసారి జంటగా నటించిన ఈ సినిమాలో మరింత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయంటున్నారు చిత్రయూనిట్. అంతేకాదు తొలి భాగంలో తమన్నా మాత్రమే దెయ్యంగా కనిపించగా ఈ సీక్వల్లో ప్రభుదేవా కూడా దెయ్యంగా కనిపంచనున్నాడు. నందితా శ్వేత మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయ్ దర్శకుడు. అభిషేక్ నామా, ఆర్ రవీంద్రన్‌ను సంయుక్తంగా నిర్మిస్తుండగా శ్యామ్ సీయస్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘దబాంగ్3’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ మూవీ రికార్డులను క్రియేట్ చేయగా.. సినిమాలోని తన పాత్రపై సల్మాన్ ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నారు. దీనిలో భాగంగానే సీక్వెల్‌ను కూడా తీశారు. అయితే.. సీక్వెల్‌గా తీసిన దబాంగ్2 అంతగా మెప్పించలేకపోయింది. మళ్లీ మూడో సిరీస్‌ను సిద్దం చేస్తున్నాడు సల్మాన్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్లో ‘దబాంగ్3’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ మూవీ మొదటి షెడ్యూల్‌ను మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో ప్రారంభించాడు. అక్కడ షూటింగ్ చేస్తుండగా.. ఓ పురాతన విగ్రహం ధ్వంసమైందనే వార్త వైరల్ అయింది. అయితే మొత్తానికి దబాంగ్3 చిత్రబృందం మొదటి షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇందులో కూడా సోనాక్షి సిన్హానే హీరోయిన్గా తీసుకున్నారు. వాంటెడ్ చిత్రం తరువాత ప్రభుదేవా డైరెక్షన్లో సల్మాన్ ‘దబాంగ్3’ని చేస్తున్నాడు. -
రెండింతల థ్రిల్
ఎండలు మండిపోతున్నాయి. ఈ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెల ఎలా ఉంటుంది? ఎండలు రెండింతలు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కోసం చల్లని థియేటర్‌కి వెళితే బోలెడంత థ్రిల్‌కి గురి చేస్తారట ప్రభుదేవా, తమన్నా. కూల్ కూల్ అంటూ హాయిగా థియేటర్లో కూర్చుని మా థ్రిల్‌ని ఎంజాయ్ చేయండి అంటున్నారు. ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ ముఖ్య తారలుగా రెండేళ్ల క్రితం వచ్చిన ‘అభినేత్రి’ గుర్తుందా? తమిళంలో ‘అభినేత్రి’గా తెలుగులో, ‘దేవి’గా విడుదలైంది. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే ‘అభినేత్రి 2 ’ రూపొందింది. ఫస్ట్ పార్ట్ కన్నా సీక్వెల్లో రెండింతల థ్రిల్ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ట్రైడెంట్ ఆర్ట్స్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితా శ్వేత, డింపుల్ హయాతి, కోవై సరళ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 1న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచాలను చేరుకునే విధంగా సినిమా ఉంటుంది’’ అన్నారు అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్, సినిమాటోగ్రఫీ: అయాంకా బోస్, డైలాగ్స్: సత్య. -
సల్మాన్ షూటింగ్లో అపశ్రుతి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం దంబాగ్ 3. దంబాగ్, దబాంగ్ 2 చిత్రాలు ఘనవిజయం సాధించటంతో ఈ సీక్వెల్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సల్మాన్ సోదరుడు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని అహల్య కోటలో జరుగుతోంది. అయితే షూటింగ్ కోసం సామాన్లు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కోటలోని ఓ పురాతన విగ్రహం ధ్వసమైంది. ప్రస్తుతం ధ్వంసమైన విగ్రహం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాళ్ల సాయంతో షూటింగ్‌కు సంబంధించిన వస్తువులు పైకి లాగుతుండగా అవి విగ్రహానికి తగిలి చేయి విరిగిపోయినట్టుగా తెలుస్తోంది. పురాతన విగ్రహం ధ్వంసం కావటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుదేవా డైరెక్షన్లో సల్మాన్ ‘దబాంగ్-3’
ముంబై: సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రం షూటింగ్ ఆదివారం ఇండోర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ దర్శకుడు ప్రభుదేవాతో కలిసున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో సల్లూని చూసి అభిమానులు ఈల వేయాల్సిందే. ఇక సినిమా విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ముహూర్త క్లాప్నిచ్చే ఫోటోను పోస్ట్ చేస్తూ చుల్బుల్ పాండే (సల్మాన్) ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. తిరిగి జన్మస్థలానికి వచ్చేశాం అంటూ సల్మాన్ ఖాన్, అర్బజ్ ఖాన్ ఇండోర్‌లో ల్యాండ్ అయిన వీడియో క్లిప్‌ను సల్మాన్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం సల్లూభాయ్ బాగానే కష్టపడుతున్నారు. అందులో భాగంగా వీరి తాతగారు పోలీసుగా పని చేసిన ఆయా ప్రాంతాలను చుట్టిరానున్నారు. ఈ మధ్యే ‘దబాంగ్ 3’ కోసం సల్మాన్ ఏస్ కొరియాగ్రాఫర్ సరోజ్‌ఖాన్‌ని కలిశారు. 2010లో అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో ‘దబాంగ్’ చిత్రం రాగా అది బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన అర్బజ్‌ఖాన్ దానికి సీక్వెల్‌గా ‘దబాంగ్ 2’ తీశాడు. అది కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది. మరి ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రంతో రికార్డులు బద్దలు కొడతాడో లేదో వేచి చూడాలి. ‘దబాంగ్ 3’ ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది. -
ముచ్చటగా మూడోసారి..
ముచ్చటగా మూడోసారి నటి తమన్నాను హర్రర్ చిత్రం వదలడం లేదు. వరుసగా మూడోసారి హర్రర్ చిత్రం చేయడానికి ఈ మిల్కీబ్యూటీ రెడీ అవుతోంది. అంతేకాదు కొంతకాలం డల్‌గా ఉన్న ఈ అమ్మడి కెరీర్ ఇప్పుడు స్వీడ్ అందుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు వరస కట్టడం నిజంగా తమన్నా లక్కీనే. అదీ మూడు పదులు దాటిన ఈ వయసులోనూ హీరోయిన్గా బిజీగా ఉండడం అరుదైన విషయమే. ప్రస్తుతం తమన్నా ప్రభుదేవాకు జంటగా నటించిన దేవి–2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 12న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి విశాల్‌తో వరుసగా రెండు చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతోంది. వీటితో పాటు మరో అవకాశం తమన్నాను వరించిందన్నది తాజా సమాచారం. ఇది హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటోందని తెలిసింది. దీనిని యువ దర్శకుడు రోహిన్ వెంకటేశన్ తెరకెక్కించబోతున్నారు. ఈయన ఇంతకుముందు కలైయరసన్, శివదా జంటగా నటించిన అదే కంగళ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ హర్రర్ కథా చిత్రంలో తమన్నాతో పాటు యోగిబాబు, మన్సూర్ అలీఖాన్, భగవతి పెరుమాళ్ నటించనున్నారు. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని అందించనున్నారు. డాని డైమండ్ ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్ర షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. తమన్నా ఇంతకుముందు ప్రభుదేవాతో జతకట్టిన దేవి హర్రర్ నేపథ్యంలో తెరకెక్కి ఫర్వాలేదనే టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం అదే జంట దేవి–2లో నటించారు. ఇదీ హర్రర్ కథా చిత్రమే. తాజాగా మూడోసారి ఈ బ్యూటీ హర్రర్ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందన్న మాట. -
బయోపిక్ బాటలో ప్రభుదేవా..?
ప్రసుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ లెజండ్ల బయోపిక్‌లకు మంచి ప్రజాదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఎంజీఆర్, జయలలితల బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా వాటి సరసన దివంగత ప్రముఖ నటుడు చంద్రబాబు బయోపిక్ చేరనుంది. ఇందులో ‘డ్యాన్సింగ్ కింగ్’ ప్రభుదేవా చంద్రబాబు పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. దర్శకుడు రాజేశ్వర్ తెరకెక్కించనున్న చంద్రబాబు బయోపిక్‌లో ప్రభుదేవా ఆయన పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ‘జేపీ ది లెజండ్ ఆఫ్ చంద్రబాబు’ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రభుదేవా నటించిన తాజా చిత్రం చార్లీచాప్లిన్–2 ఇటీవలే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రభుదేవా ‘దేవి–2’, ‘యంగ్ మంగ్ ఛంగ్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. చంద్రబాబు 1950-60 ప్రాంతంలో ఆటా, పాటా, నటన అంటూ అదరగొట్టిన నటుడు. అప్పట్లో చంద్రబాబు ఉంటే ఆ చిత్రం హిట్టే అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. ‘శభాష్ మీనా’ అనే చిత్రంలో నటించినందుకుగాను శివాజీగణేశన్ కంటే ఒక్క రూపాయి అధికంగా పారితోషికం తీసుకున్న నటుడిగా పేరుపొందారు. ఈయనకు చెన్నై, ఆర్ ఏ.పురంలో బ్రహ్మాండమైన ఇల్లు ఉండేది. అందులో రెండో అంతస్తు వరకూ కారు వెళ్లేలా మార్గాన్ని ఏర్పాటు చేశారట. అంత ఆడంబర జీవితాన్ని అనుభవించిన చంద్రబాబు 47 ఏళ్లకే జీవితాన్ని చాలించుకున్నారు. చివరికి ఆస్తులన్నీ పోగొట్టుకుని, తాగుడుకు బానిసై, అప్పుల బారిన పడి, అనారోగ్యానికి గురై జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అలాంటి చంద్రబాబు బయోపిక్ వెండితెరకెక్కనుంది. -
స్టెప్పుకి మెప్పు
డ్యాన్స్‌లో సరికొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చి దక్షిణాది, ఉత్తరాది తారలతో ఉర్రూతలూగించే స్టెప్పులేయించిన ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ అనిపించుకున్నారు ప్రభుదేవా. తండ్రి సుందరం మాస్టారుని ఆదర్శంగా తీసుకుని, ఆయన దగ్గరే సహాయకుడిగా చేసి, ఆ తర్వాత నృత్యదర్శకుడిగా మారారు ప్రభుదేవా. 13 ఏళ్ల వయసులో తొలిసారి ‘మౌనరాగం’(1986) చిత్రంలో ఫ్లూట్ వాయించే కుర్రాడిగా ఓ పాటలో కనిపించిన ప్రభుదేవా ఆ తర్వాత ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా చేశాడు. ‘ఇదయం’ (1991) (తెలుగులో ‘హృదయం’)లో చేసిన స్పెషల్ సాంగ్ ‘ఏప్రిల్ మేయిలే..’ అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఇక ‘జెంటిల్‌మేన్’లో ‘చికుబుకు చికుబుకు రైలే...’ సాంగ్‌లో ప్రభుదేవా వేసిన స్టెప్స్ సూపర్ అననివాళ్లు లేరు. ఇతర హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాటలు చేయడంతో పాటు పలువురు అగ్రహీరోల చిత్రాలకు నృత్యదర్శకుడిగానూ చేశారు ప్రభుదేవా. 16 ఏళ్ల వయసులో తొలిసారి నృత్యదర్శకుడిగా కమల్‌హాసన్ ‘వెట్రి విళా’కి చేసిన ప్రభుదేవా ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీగా అయ్యాడు. రజనీ ‘దళపతి’లోని ‘చిలకమ్మా చిటికెయ్యంట...’, చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’... వంటి చిత్రాలతో పాటు రీ–ఎంట్రీ మూవీ ‘ఖైదీ నం. 150’ వరకూ ప్రభుదేవా పలు చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. నాగార్జునతో ‘విక్రమ్, కెప్టెన్ నాగార్జున’ వంటి చిత్రాలకు, బాలకృష్ణ, వెంకటేశ్ .. ఇలా అగ్రహీరోలందరితో కొత్త స్టెప్పులు వేయించారు. ఒకవైపు నృత్యదర్శకుడిగా కొనసాగుతూ నటుడిగా మారారు ప్రభుదేవా. దర్శకుడు పవిత్రన్ ‘ఇందు’ చిత్రంలో ప్రభుదేవా తొలిసారి లీడ్ రోల్ చేశారు. శంకర్ ‘ప్రేమికుడు’ హీరోగా ప్రభుదేవాకు పెద్ద బ్రేక్. ఆ సినిమాలో ‘ముక్కాలా ముక్కాబులా..’, ‘ఊర్వశీ ఊర్వశీ.. టేకిట్ ఈజీ పాలసీ..’ పాటలకు ప్రభుదేవా వేసిన స్టెప్స్‌ని నేటి తరం కూడా ఫాలో అవుతోంది. ‘మెరుపు కలలు’, ‘సంతోషం’..వంటి చిత్రాలతో పాటు డ్యాన్స్ బేస్డ్ మూవీస్ ‘స్టైల్’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలు కూడా చేశారు. డైరెక్షన్ మారింది తండ్రి దగ్గర సహాయకుడిగా చేసి, నృత్యదర్శకుడిగా స్టెప్ వేసి, నటుడిగా మరో అడుగు వేసి, ఆ తర్వాత డైరెక్టర్‌గానూ తన కెరీర్ డైరెక్షన్ మార్చారు ప్రభుదేవా. సిథ్ధార్థ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన తొలి చిత్ర ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సూపర్ హిట్. ప్రభాస్‌తో ‘పౌర్ణమి’ని తెరకెక్కించారు. చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’కి కూడా దర్శకత్వం వహించారు. తెలుగు ‘పోకిరి’కి రీమేక్‌గా తమిళంలో ‘పోకిరి’, హిందీలో ‘వాంటెడ్’గా ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రాలు దర్శకుడిగా అతని ప్రతిభను నిరూపించాయి. ఆ తర్వాత పలు తమిళ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రభుదేవా. నిర్మాతగా తమిళంలో దేవి, బోగన్తో పాటు మరో మూడు చిత్రాలను రూపొందించారు. మైసూర్లో 1973 ఏప్రిల్ 3న ముగూర్ సుందర్, మహదేవమ్మ సుందర్‌లకు జన్మించిన ప్రభుదేవా పెరిగింది చెన్నైలో. ధర్మరాజ్, ఉడుపి లక్ష్మీనారాయణన్ మాస్టార్ల దగ్గర క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని టీనేజ్లోనే సినిమాల్లోకొచ్చారు. దాదాపు 30 ఏళ్ల కెరీర్‌ని సొంతం చేసుకున్న ప్రభుదేవా సినీ రంగంలో నృత్యదర్శకుడిగా చేసిన సేవలకు గాను ‘పద్మశ్రీ’ వరించింది. -
పాట పరవశించింది
శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగులో ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించారు. నృత్యదర్శకుడు ప్రభుదేవా, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, గాయకులు శంకర్ మహదేవన్‌లకు పద్మశ్రీలను ప్రకటించారు. అలాగే మలయాళ నటుడు మోహన్ లాల్‌కు ‘పద్మభూషణ్’ ప్రకటించారు. ‘అవును.. ఆలస్యం అయింది. అవార్డు అనేది విలువను గుర్తించేది, గౌరవించేది మాత్రమే కానీ విలువను నిరూపించేది కాదు’ అని ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఓ సందర్భంలో అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన 35 ఏళ్లకు పద్మశ్రీ అందుకున్న ఆయన ఇండస్ట్రీకు రాకముందే తన పేరు ముందు పద్మను కలుపుకున్నారు. సిరివెన్నెల భార్య పేరు పద్మ. ఆ మధ్య ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసినప్పుడు పద్మ అవార్డు రాకపోవడం గురించి ప్రస్తావిస్తే ... ‘నా పేరులోనే పద్మ ఉంది’ అని చమత్కరించారు సిరివెన్నెల. సిరి శక్తి సమస్యను ఎదుర్కోమంటూ పాట ద్వారా ప్రేరేపించగలిగే శక్తి సిరివెన్నెల. మాట సైతం తన వెన్నెల ప్రసరించమని విన్నవించుకునే విన్నపం సిరివెన్నెల. ఆత్రేయ, వేటూరి తర్వాత తెలుగు పాట అంతలా పొంగిపోయేలా చేసింది సిరివెన్నెల. కాకినాడ ఆంధ్రా యూనివర్శిటీలో బికామ్ పూర్తి చేసిన íసీతారామశాస్త్రి 1984లో సినిమా సాహిత్యం వైపు అడుగులేశారు. మొట్టమొదట రాసింది జననీ జన్మభూమి(1984) సినిమాకే అయినా ఆ తర్వాత రాసిన ‘సిరివెన్నెల’ సినిమా పాటలు ఆయనకు ఇండస్ట్రీలో స్థానం ఇచ్చాయి. చెంబోలు సీతారామశాస్త్రి నుంచి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మార్చింది ఆ చిత్రం. ‘సిరివెన్నెల’ తర్వాత శాస్త్రి వెనక్కు చూసుకునే పనిలేకుండా పోయింది. ఆ సినిమాలో రాసిన ప్రతీ పాట ఓ ఆణిముత్యం. అంత అర్థవంతంగా ఉండబట్టే ఆ ఏడాది బంగారు నంది శాస్త్రి ఇంటికి పరుగుతీసింది. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న రికార్డు నెలకొల్పారాయన. ఆ తర్వాత అద్భుతమైన పాటలు రాస్తూ ఇండస్ట్రీలో తన మాటను పాటలా విస్తరిస్తూ సుస్థిరం చేసుకున్నారు. ‘స్వయంకృషి, స్వర్ణకమలం, శ్రుతిలయలు, రుద్రవీణ, గాయం, సింధూరం, ప్రేమ కథ, నిన్నే పెళ్లాడతా, చక్రం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారాయన. ‘సింధూరం’లో అర్ధ శతాబ్దపు అజ్ఞానమే స్వాతం త్య్రం అనుకుందామా? అని ప్రశ్నను సంధిస్తే దానికి సమాధానం నంది అవార్డు అయింది. ‘దేవుడు కరుణిస్తాడనీ వరములు కురిపిస్తాడని..’ ప్రేమ పాట రాయడం రాష్ట్ర ప్రభుత్వం నంది కురిపించడం జరిగిపోయింది. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అని ‘చక్రం’ సినిమాలో రాశారాయన. ‘ఆయువనేది ఉండేవరకూ ఇంకేదో లేదని అనకూ’ అనే జీవిత సారాన్ని చాలా తేలికైన పదాలతో కమర్షియల్ సినిమాలో చెప్పగల శక్తి, సామర్థం ఉన్నది సిరివెన్నెలకే. ‘సాహిత్యం అనేది అర్థం అయ్యేలానే రాయక్కర్లేదు. అర్థం చేసుకోవాలనే కుతూహలం రేకెత్తించేలా కూడా రాయొచ్చు. అలాంటి రచయిత సిరివెన్నెలగారు’ అంటారు దర్శకుడు త్రివిక్రమ్. 3 వేలకు పైగా పాటలు, 11 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు. 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు. 1986, 87, 88 సంవత్సరాలలో వరుసగా నంది అవార్డులను అందుకొని హ్యాట్రిక్ సృష్టించారు. ప్రస్తు తం ఉన్న అగ్ర పాటల రచయితలు కూడా సిరివెన్నెలను ‘గురువు’గా భావిస్తారన్న సంగతి తెలిసిందే. కళ, కళ యొక్క ముఖ్య ఉద్దేశం రేపటి మీద ఆశ కలిగించడం. సిరివెన్నెల పాటల్లో అది కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. చాలా సులువుగానే లోతుగా రాయడం ఆయన సొంతం. ఎన్ని అవార్డులు వరించినా ప్రేక్షకుడి పెదవి మీద కూనిరాగమే పెద్ద అవార్డు అంటారు సిరివెన్నెల. ఇప్పుడాయన పేరులో రెండు ‘పద్మ’లున్నాయి. సతీమణి ‘పద్మ’... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’. పాట ఆనందపడిన వేళ ఇది. పాట పరవశించిపోయిన వేళ ఇది. -
ఏమో ఏదైనా జరగొచ్చు!
‘‘జీవితంలో అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగకపోతే ఏం టెన్షన్ పడకండి. చేసిన పనిలో మన బెస్ట్ ఇచ్చామా? లేదా అన్నదే ముఖ్యం. ఏమో? ఎవరికి తెలుసు.. దొరకలేదనుకున్నది మరో రూపంలో సర్ప్రైజ్ గిఫ్ట్‌లా మనకే తారసపడొచ్చు’’ అని సాయి పల్లవి అంటున్నారు. దానికి ఆమె ప్రయాణమే ఎగ్జాంపుల్. అది 2008.. చెన్నైలోని ఏవీయమ్ స్టూడియోస్. ‘ఉంగళిల్ యార్ ఆడుత్త ప్రభుదేవా’ (మీలో ఎవరు తర్వాతి ప్రభుదేవా?) అనే డ్యాన్స్ షో సెమీ ఫైనల్స్ నడుస్తున్నాయి. సాయి పల్లవి టీమ్ కూడా ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. కానీ సెమీ ఫైనల్స్‌లోనే వెనక్కి తిరిగారు... నిరాశతో. కట్ చేస్తే.. 2018, ఏవీయమ్ స్టూడియోస్. ధనుష్‌తో సాయి పల్లవి చేస్తున్న ‘మారీ 2’లోని ‘రౌడీ బేబీ.. ’ సాంగ్ షూట్. షూటింగ్ స్పాట్‌కు వెళ్తుంటే తెలిసిన ప్రదేశంలానే తోచింది సాయి పల్లవికి. యస్.. పదేళ్ల క్రితం డ్యాన్స్ షో చేయడానికి వచ్చింది. ఆ షో గెలిచి ఉంటే ప్రభుదేవాతో ఓ మొమెంటో అందుకునేదేమో పల్లవి. కానీ ఏకంగా ప్రభుదేవా మాస్టరే ఇప్పుడు ఆమెకు మూమెంట్స్ కంపోజ్ చేయడం విశేషం. అక్కడ చేజారిందనుకున్న అవకాశాన్ని కాలం రెట్టించి తిరిగిచ్చేసింది. అప్పుడు ఫెయిలైన సాయి పల్లవి ఈసారి సక్సెస్ అయింది. ‘బాగా డ్యాన్స్ చేశావ్’ అంటూ ప్రభుదేవా నుంచి అభినందనలు కూడా అందుకుంది. ఈ ఆనందాన్నే తాజాగా పంచుకున్నారు సాయి పల్లవి. ‘ఎప్పుడూ నీ బెస్ట్ ఇవ్వు. జీవితం ఏదో ఓ రూపంలో ఎప్పటికైనా ఆశీర్వదిస్తుంది’ అంటూ ప్రభుదేవాతో దిగిన ఫొటోను షేర్ చేశారు సాయి పల్లవి. -
ఇప్పుడు సెట్ అయ్యింది
సినిమా: కొన్ని కాంబినేషన్లు మొదల్లో సెట్ కావు. అలా ప్రభుదేవాతో నటించే అవకాశాన్ని నటి సంయుక్త జారవిడుచుకుంది. ఈ కన్నడ భామ ఇంతకు ముందు మెర్యూరీ చిత్రంలో ప్రభుదేవాతో కలిసి నటించాల్సింది. అయితే కాల్షీట్స్ సమస్య, ఇతర చిత్ర వర్గాలు ఈ బ్యూటీపై ఫిర్యాదుల కారణంగా ఆ అవకాశాన్ని వదులుకోక తప్పలేదు. అలా మిస్ అయిన అవకాశం మరోసారి నటి సంయుక్త తలుపు తట్టింది. ఈ సారి మాత్రం ఈ బ్యూటీ వదలుకోదలచుకోలేదు. వెంటనే ఓకే చెప్పేసింది. ఇక పోతే నటుడు వ్రభుదేవా 2019లో హిందిలో సల్మాన్‌ఖాన్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈలోగా తమిళంలో వరుసగా చిత్రాలు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈయన చేతిలో యంగ్ మంగ్ చంగ్, చార్లి చాప్లిన్–2, దేవి–2 అంటూ నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. తేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్య సంగీతాన్ని, విఘ్నేశ్ ఛాయాగ్రహణను అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ చెన్నైలో జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్ ఎవరన్నది చిత్ర వర్గాలు ఇంతకు ముందు వెల్లడించలేదు. తాజాగా నటి సంయుక్తను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆమెతో పాటు తేల్ చిత్రంలో ప్రధాన కథా పాత్రలో నటి ఈశ్వరీరావు నటిస్తున్నారు. ఈమె పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు చిత్ర వర్గాలు. మరో ముఖ్య పాత్రలో నటుడు యోగిబాబు నటిస్తున్నారు. కాగా మెర్క్యూరీ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వవలసిన నటి సంయుక్తకి ఇప్పుడు ప్రభుదేవాతో సెట్ అయ్యిందన్న మాట. -
ఫైటింగ్ కింగ్‌గా డాన్సింగ్ స్టార్
సినిమా: ప్రభుదేవాను ఇప్పటి వరకూ డాన్సింగ్స్టార్గానే చూసిన ప్రేక్షకులు త్వరలో ఫైటింగ్కింగ్గా కూడా చూడబోతున్నారు. అవును ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం ఒకటి. వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కేఎస్.శ్రీనివాసన్, కేఎస్.శివరామన్ నిర్మిస్తున్న చిత్రం యంగ్ మంగ్ ఛంగ్. ఇందులో ప్రభుదేవా సరసన నటి లక్ష్మీమీనన్ నటిస్తోంది. దర్శకుడు తంగర్‌బచ్చన్, ఆర్జే.బాలాజి, కట్, మునీశ్కాంత్, మారిముత్తు, విద్య నటిస్తున్నారు. బాహుబలి చిత్ర విలన్ ప్రభాకర్ ఇందులోనూ విలన్‌గా నటిస్తున్నారు. నవ దర్శకుడు అర్జున్.ఎంఎస్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈచిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యంగ్ మంగ్ ఛంగ్ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని చెప్పారు. ఇటీవల ఇందులోని ప్రభుదేవా విలన్ ప్రభాకర్‌తో పోరాడే ఒక భారీ పోరు దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలిపారు. చెన్నై సమీపంలోని పొళిచ్చనూర్ అడవుల్లో 7 రోజులు పాటు చిత్రీకరించిన ఈ పోరాట సన్నివేశాల్లో ప్రభుదేవా, ప్రభాకర్లతో పాటు వేలాది మంది సహాయ నటీనటులు పాల్గొన్నారని చెప్పారు. చిత్రంలోని హైలెట్ అంశాల్లో ఈ పోరాట దృశ్యం ఒకటి అని అన్నారు. ఇందులో ప్రభుదేవా కుంగ్‌ఫూ మాస్టర్‌గా నటిస్తున్నారని తెలిపారు. ఆయన నటించిన చిత్రాలన్నింటికంటే యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఇక ప్రభాకర్ ఫైట్స్‌లో శిక్షణ ఇచ్చే బృందానికి నాయకుడిగా నటిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించేవిధంగా ఉంటుందని దర్శకుడు అర్జున్ తెలిపారు. ఈ చిత్రానికి ఆర్పీ.గురుదేవ్ ఛాయాగ్రహణం, అమ్రీశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ప్రభుదేవా సూపర్ హిట్ సాంగ్ రిమిక్స్
ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు. ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి పాటకు ఇన్నేళ్ల తరువాత ఓ రిమిక్స్ వర్సణ్ వచ్చింది. అయితే రిమిక్స్ సినిమా కోసం చేసింది కాదు ఓ వీడియో ఆల్బమ్కోసం ఆ పాటను రిమిక్స్ చేశారు. పాటలోని ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి మెయిన్ లైన్స్ మాత్రమే తీసుకొని మిగతా అంతా కొత్త లిరిక్స్ తో ఈ పాటను రూపొదించారు. సెన్సేషనల్ బాలీవుడ్ సింగర్ యో యో హనీ సింగ్ స్వయంగా ఈ పాటను కంపోజ్ చేసి ఆలపించారు. ఈ ఆల్బమ్‌లో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో జంటగా నటిస్తున్న షాహిద్ కపూర్, కియారా అద్వానీలు జంటగా కనిపించారు. -
మరో మంచి టీమ్‌తో...!
రెండేళ్ల క్రితం తమిళంలో రిలీజైన ‘దేవి’ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఇందులో ప్రభుదేవా, సోనూ సూద్, తమన్నా కీలక పాత్రలు చేశారు. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభుదేవా లీడ్ రోల్ చేస్తున్నారు. ఓ లీడ్ రోల్‌ను తమన్నా చేస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్‌కు స్కోప్ ఉన్న ఈ సినిమాలో మరో ఇద్దరు నాయికలుగా నిత్యా మీనన్, నందితా శ్వేతా పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో అమీ జాక్సన్ ఓ గెస్ట్ రోల్ చేస్తారట. ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నా, కోవై సరళ పాల్గొనగా సీన్స్ తీస్తున్నారు. మరో బెస్ట్ టీమ్‌తో వర్క్ చేస్తున్నానని అంటున్నారు తమన్నా. -
అదే నా కోరిక..!
ఇప్పుడు కోలీవుడ్‌లో దూసుకుపోతున్న యువ కథానాయికల్లో నటి సాయేషా సైగల్ ఒకరు. తమిళనాట తొలి చిత్రం వనయుద్ధంతోనే మంచి పేరు తెచ్చుకున్న నటి ఈ బాలీవుడ్ బ్యూటీ. ఆ తరువాత ఆర్యతో గజనీకాంత్, విజయ్‌సేతుపతి సరసన జుంగా, కార్తీకి జంటగా కడైకుట్టి సింగం చిత్రాల్లో నటించి వరుసగా విజయాలను అందుకుంది. తాజాగా సూర్యతో రొమాన్స్ చేస్తోంది. మరిన్ని అవకాశాలు చర్చల్లో ఉన్నాయంటున్న ఈ బ్యూటీతో చిన్న భేటీ. షూటింగ్లో డైలాగ్స్ చెప్పడానికి ప్రాంటింగ్ వద్దంటున్నారట? నిజానికి భాష తెలియని తారలు డైలాగులు చెప్పడానికి ప్రాంటింగ్ కోరుకుంటారు. అయితే నాకు ప్రాంటింగ్తో డైలాగ్స్ చెప్పడం ఇష్టం ఉండదు. కెమెరా ముందు నటిస్తున్నప్పుడు పక్క నుంచి వేరే వారు చెప్పె డైలాగ్స్‌ను అట్లాగే అప్పజెప్పడం ప్రేక్షకులను మోసం చేసే పనే అవుతుంది. సంభాషణలు బట్టి పట్టి చెప్పడంలోనే ఆ సన్నివేశానికి తగ్గ రియాక్షన్ వస్తుంది. అందుకే నేను ప్రాంటింగ్ను అంగీకరించను. ప్రస్తుతం చిన్నపిల్లలపై అత్యాచారాలు అధికమవడం గురించి మీ స్పందన? అలాంటి సంఘటనలు నిజంగా ఖండించదగ్గవి. నాకు రోజు ఉదయం కాఫీ తాగుతూ పేపర్ చదవడం అలవాటు. ఇటీవల చెన్నైలో 11 ఏళ్ల చిన్నారికి జరిగిన దారుణం గురించి చదవగానే మనసుకు బాధనిపించింది. చిన్నారులపై ఇటువంటి ఆకృత్యాలను ఆపాలి. చట్టాలు మరింత కఠినం కావాలి. అంతే కాకుండా ప్రజల్లోనూ ఇలాంటి సంఘటనలపై అవేర్నెస్ రావాలి. నటన పరంగా మీరు ఆశించేది.? ప్రభుదేవా దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నా ను. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో విశాల్, కార్తీ హీ రోలుగా మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. చాలా ఆనంద పడ్డాను. అయితే ఆ చిత్రం మొదట్లోనే ఆగిపోయింది. ప్రభుదేవా దర్శకత్వంలోనే నటించాలని ఎందుకు ఆశ పడుతున్నారు? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే డాన్స్ నేర్చుకున్నాను. నాకు 10 రకాల డాన్స్‌లు తెలుసు. అందుకే పూర్తి స్థాయి డాన్స్ ఇతివృత్తంతో కూడిన చిత్రంలో నటించాలని కోరుకుంటున్నాను. అలాంటి చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే సంతోషిస్తా. మీకు తెలిసిన డాన్స్ గురించి? ఏ విషయానైనా వెంటనే నేర్చుకోవాలన్న ఆసక్తి నాకు ఎక్కువ. అందులోనూ నూరు శాతం విజయం సాధించాలనుకుంటాను. ఏదైనా కొత్తగా సాధించాలని తపిస్తుంటాను. అలా చిన్న వయసులోనే అన్ని రకాల నృత్యాలను నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా సమయం దొరికితే డాన్స్ క్లాస్‌కు వెళతాను. కథక్ నృత్యం తెలుసు. సినిమాకు కావలసిన క్లాసిక్, వెస్ట్రన్ లాంటి డాన్స్ నేర్చుకున్నాను. లాఠిన్ అమెరికన్ స్టైల్లో సంబా, కల్సా డాన్స్ తెలుసు, అమెరికా వెళ్లి వారి బాడీలాంగ్వేజ్‌ను, ఎలా డాన్స్ చేస్తున్నారన్నది తెలుసుకున్నాను. ఇప్పుడు అదనంగా జిమ్నాస్టిక్‌ను నేర్చుకుంటున్నాను. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. -
హైదరాబాద్‌కి వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది
ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేశ్, బేబి దిత్య ముఖ్య తారలుగా నటించిన డ్యాన్స్ బేస్డ్ మూవీ ‘లక్ష్మి’. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత సి.కల్యాణ్ ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సీఎస్ శ్యామ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియోను దర్శకుడు వీవీ వినాయక్, ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అనంతరం వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ప్రభు మాస్టర్ అంటే మా అందరికీ చాలా గౌరవం. అన్ని భాషల్లో కీర్తి సంపాదించిన ఆయన ఇప్పటికీ లైమ్‌లైట్‌లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. విజయ్ అర్థవంతమైన సినిమాలు తీస్తాడు. నా సినిమా టైటిల్‌ను వాడుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘గొప్ప ప్రొడ్యూసర్ కల్యాణ్‌గారు రిలీజ్ చేస్తున్న ఈ సినిమా హిట్ సాధించాలి. ఎ.ఎల్. విజయ్, నేను ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు క్రిష్. ‘‘చాలా ఇష్టపడి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఇందుకు కారణం ప్రభుదేవాగారే. మంచి ఫీల్‌తో సాగే చిత్రమిది’’ అన్నారు సి.కల్యాణ్. ‘‘ఈ ఆడియో వేడుకను ఇంత బాగా సెలబ్రేట్ చేసిన కల్యాణ్‌గారికి థ్యాంక్స్. హైదరాబాద్‌కి వస్తే నాకు పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. విజయ్‌గారికి ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇది డ్యాన్స్ సినిమా అనే కంటే ఎమోషనల్ మూవీ అని చెప్పవచ్చు. దిత్య సూపర్ డ్యాన్సర్’’ అన్నారు ప్రభుదేవా. ‘‘ప్రభుదేవా ఈ సినిమాకు ఒక యాక్టర్లా కాకుండా గాడ్‌ఫాదర్‌లా పనిచేశారు. చిన్నారి దిత్య బాగా కష్టపడింది’’ అన్నారు చిత్రదర్శకుడు విజయ్. ‘‘నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రభుదేవాగారి ‘ప్రేమికుడు’ సినిమా చూశా. ఇప్పుడు ఆయన పక్కన కూర్చునే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. చిన్న పిల్లల ప్రతిభను బయటకు చూపించే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు రాజ్ కందుకూరి. బేబి దిత్య, ఐశ్వర్యా రాజేశ్, సత్యం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గురుశిష్యుల కథ
ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేష్, దిత్య బండే ముఖ్య తారలుగా దర్శకుడు ఏ.యల్. విజయ్ తెరకెక్కించిన డ్యాన్స్ బేస్డ్ మూవీ ‘లక్ష్మి’. ఓ రియాలిటీ షో విజేతగా నిలిచిన బేబి దిత్య బండే ఈ సినిమాతో నటిగా పరిచయం కానుంది. ఈ సినిమా హక్కులను నిర్మాత సి. కల్యాణ్ సొంతం చేసుకున్నారు. ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్. రవీంద్రన్ నిర్మాతలు. ఈ సినిమాలో దిత్యకు డ్యాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపిస్తారు. ‘‘రిలీజైన టీజర్స్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభుదేవా డ్యాన్సింగ్ ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆడియోను ఈ నెల 12న, సినిమాను 24న రిలీజ్ చేయబోతున్నాం. సామ్ సీఎస్ మంచి సంగీతం అందించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు..
తమిళసినిమా: నమ్మకమైన వాడు తోడు కావాలని నటి లక్ష్మీమీనన్ అంటోంది. 15 ఏళ్ల వయసులోనే నటిగా పరిచయమైన ఈ కేరళా కుట్టి కుంకీ చిత్రంతో కోలీవుడ్‌ను ఆకట్టుకుంది. ఆ తరువాత విశాల్, విజయ్‌సేతుపతి, జయంరవి వంటి స్టార్ హీరోలతో జతకట్టి సక్సెస్ఫుల్ నాయకిగా గుర్తింపు పొందింది. అలా ఎదుగుతున్న సమయంలో చదువు పూర్తి చేయాలంటూ నటనకు గ్యాప్ తీసుకుంది. ఆ నిర్ణయం సినీకెరీర్‌కు నష్టాన్నే కలిగించింది. రీఎంట్రీ అయినా మునుపటి లక్కు రాలేదు. ప్రస్తుతం ప్రభుదేవాతో జంటగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఈ చిత్రం లక్ష్మీమీనన్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. చాలాకాలం మీడియాకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఒక భేటీలో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఎలాంటి బదులిచ్చిందో చూద్దాం. నాకు వివాహబంధంపై నమ్మకం లేదు. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని నేను అనుకోను. పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు. నేను చెప్పేది ఇతరులకు అర్థం అవుతుందో, కాదో తెలియదు. నేను మాత్రం తెలివిగానే చెబుతున్నాను. వివాహ జీవితంపై నాకు నమ్మకం లేదు. అందుకే నేను పెళ్లే చేసుకోను. అలాగని నాకు జీవితానికి అండ ఉండరని చెప్పడం లేదు. కచ్చితంగా ఉంటాడు. అందుకు అండ అనే మాటకు బలం, చాలా నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగించే వ్యక్తి కావాలి. దాన్ని పెళ్లి అనే మాటల్లో చేర్చడం నాకు ఇష్టం లేదు.అయితే దాన్ని సహజీవనం అని కూడా చెప్పను. మరో విషయం ఏమిటంటే జీవితంలో అనుభవమే ఉత్తమ ఉపాధ్యాయుడు. అయితే నేను పెళ్లి గురించి చెప్పిన విషయాలు అనుభవాలే కారణం అని చెప్పను. దాన్ని ఎలా చెప్పాలో నిజానికి నాకే తెలియదు. -
డ్యూటీకి వేళాయె
పోలీస్‌గా చార్జ్ తీసుకోవడానికి టైమ్ అయ్యింది హీరో ప్రభుదేవాకు. ఏసీ ముగిల్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో నివేథా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్నారు. నేమిచంద్ ఝబాగ్ నిర్మిస్తున్నారు. సురేశ్ మీనన్, మహేందర్ కీలక పాత్రలు చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కెరీర్లో తొలిసారి ప్రభుదేవా పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. సో.. పోలీస్‌గా ప్రభుదేవాకు డ్యూటీకి వేళ అయిందన్న మాట. ఇది వరకు ప్రభుదేవా దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన ‘పోకిరి, విల్లు’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఏసీ ముగిల్ ఇప్పుడు ప్రభుదేవాను డైరెక్ట్ చేయడం విశేషం. -
ఖాకీ తొడిగి... లాఠీ పట్టి
ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్స్ గురించి డీప్‌గా తెలుసుకుంటున్నారు ప్రభుదేవా. అదేంటీ.. ఆయనది సినిమా సెక్షన్ కదా అంటే నిజమే. సినిమా కోసమే ఐపీసీ సెక్షన్స్ తెలుసుకుంటున్నారు. ఇంకా అర్థం కాలేదా? తన నెక్ట్స్ సినిమాలో ఆయన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ఖాకీ తొడిగి, లాఠీ పట్టి, తూటా పేల్చి.. అన్యాయాన్ని ప్రభుదేవా ఎలా అరికడతాడు? అన్న విషయం తెలుసుకోవడానికి చాలా టైమ్ ఉంది. అన్నట్లు ఈ సినిమాకు దర్శకుడు ఎవరనుకున్నారు? ప్రభుదేవా తమిళ్లో డైరెక్ట్ చేసిన ‘పోకిరి, విల్లు’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన ఏసీ. ముగిల్. కెరీర్లో ప్రభుదేవా పోలీసాఫీసర్‌గా కనిపించనున్న తొలి చిత్రం ఇదే. నేమిచంద్ జబాక్ నిర్మించనున్నారు. ‘‘ఫ్యామిలీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందీ చిత్రం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సల్మాన్ సినిమాలో జగ్గుభాయ్
విలన్ గా టర్న్ తీసుకున్న తరువాత కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయ్యారు జగపతి బాబు. లెజెండ్ సినిమాతో విలన్ మారిన ఈ సీనియర్ నటుడు తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ దూసుకుపోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో ఎంట్రీ ఇచ్చిన జగ్గుభాయ్ ఇప్పుడు ఉత్తరాది మీద కన్నేశారు. త్వరలోనే ఓ భారీ చిత్రంతో జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ దబాంగ్ సిరీస్ లో మూడో భాగంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకు జగపతి బాబును తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే అది విలన్ క్యారెక్టరా.. లేక సహాయ పాత్రా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు తన బాలీవుడ్ ఎంట్రీపై జగపతి బాబు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
సెమీ సాలిడ్.. సెమీ లిక్విడ్.. మెర్క్యూరీ
మెర్క్యూరీ.. కార్పోరేట్ శక్తుల ఆశకు బలవుతున్న జీవితాలను తెరకెక్కించే ప్రయత్నం చేసిన చిత్రం. తొలి మూకీ థ్రిల్లర్‌గా ట్యాగ్ వేసుకుంది. 1987లో సింగీతం శ్రీనివాసరావు తీసిన మూకీ చిత్రం.. లవ్, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘పుష్పక్’ (తెలుగులో ‘పుష్పక విమానం’)కు మించిన అంచనాలతో వచ్చింది. కథ.. చెవిటి, మూగ అయిన అయిదుగురు స్నేహితులు (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) ఓ వారాంతం ఒక టీ ఎస్టేట్‌లో కలుసుకుంటారు. ఆ రోజే అమ్మాయి బర్త్‌డే ఉండడంతో బర్త్‌డే పార్టీ కూడా చేసుకుంటారు. ఈ కథలో ముందుకు వెళ్లాలంటే దీని మూలమైన చిన్న ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకోవాలి. ఈ సినిమా నడిచే కాలానికి పదేళ్ల క్రితం.. తమిళనాడులోని ఒక ఊళ్లో కార్పోరేట్ ఎర్త్ అనే సంస్థ ఓ కెమికల్ ఫ్యాక్టరీ పెడుతుంది. అందులోని విషవాయువు లీక్ అయ్యి ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని దాదాపు 80 మంది చనిపోతారు. ఇంకా చాలామంది దాని దుష్ప్రభావాలకు లోనవుతారు. ఈ అయిదుగురు స్నేహితులు కూడా ఆ బాధితులే. ఆ విషవాయువు వల్లే వీళ్లకు వినికిడి లోపం వస్తుంది. దానివల్ల మాట్లాడలేకుండా అవుతారు. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. టీ ఎస్టేట్‌లో పార్టీ చేసుకొని కార్పోరేట్ ఎర్త్ ఫ్యాక్టరీ వల్ల చనిపోయిన 80 మంది స్మారక చిహ్నం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తారు. ఆ దారిలోనే ఉన్న మూతబడ్డ ఆ ఫ్యాక్టరీ మీద రాళ్లు విసిరి తమ కోపాన్ని, బాధను, నిస్సహాయతనూ వెళ్లగక్కుతారు. అక్కడే ఓ కొండ మీద ఆ నలుగురులోని ఓ అబ్బాయి ఆ అమ్మాయి పట్ల తనుకున్న ప్రేమను చెబుతాడు కానుకనిచ్చి. అమ్మాయీ ఆ ప్రేమను సమ్మతిస్తుంది. రాత్రయిపోతుంది.. తిరిగి టీ ఎస్టేట్‌లోని తామున్న బసకు బయలుదేరుతారు అయిదుగురు. అమ్మాయి డ్రైవ్ చేస్తుంటుంది. ఆమెను ప్రేమిస్తున్న అబ్బాయి పక్క సీట్లో.. మిగిలిన ముగ్గురూ వెనకాల కూర్చుంటారు. ఆ అబ్బాయి తన ప్రేమికురాలిని ఆటపట్టించేందుకు హెడ్ లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటాడు. ఈ ఆటకు వెనకాలున్న ఓ అబ్బాయీ జత కలుస్తాడు. అలా ఓ రెండుమూడు సార్లు ఆడుతుంటే అమ్మాయి ముద్దుగానే తన ప్రేమికుడిని విసుక్కుంటుంటుంది. నాలుగోసారీ అలాగే లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేసేసరికి చీకట్లో దారి కనపడక బండి అదుపు తప్పుతుంది. అప్పుడే ఓ కుక్క దారికి అడ్డు వస్తుంది. అసలే కొండదారి.. రాత్రి.. వేగం.. భయపడ్డ ఆమె ప్రేమికుడు లైట్లు ఆన్‌చేసి కంట్రోల్ తప్పిన వెహికిల్‌ను కంట్రోల్లోకి తెస్తాడు. సడెన్ బ్రేక్‌తో వెహికిల్ ఆగుతుంది. అంతా ఊపిరి పీల్చుకుంటారు. రోడ్డుకు కాస్త పక్కకు వెళ్లిన వెహికిల్‌ను రివర్స్‌గేర్‌తో సరిచేసి మళ్లీ స్టార్ట్ చేస్తుంది అమ్మాయి. కొంత దూరం వెళ్తుందో లేదో ఎవరో చైన్ వేసి లాగినట్టయి బండి ఆగిపోతుంది. అందరూ దిగి చూస్తారు. నిజంగానే వెహికిల్ వెనక సైలెన్సర్‌కు ఓ గొలుసు కనపడుతుంది. భయంతో షాక్ అవుతారు వీళ్లు. ఆ చైన్ రెండో కొన పక్కనే ఉన్న పొదలోకి చొచ్చుకొని ఉంటుంది. ఆ అయిదుగురిలో ఒక అబ్బాయి ధైర్యం చేసి చూస్తాడు. అక్కడ ఈ చైన్ రెండో కొనను చేయికి చుట్టుకొని రక్తం మడుగులో పడి ఉన్న ఒక వ్యక్తి (ప్రభుదేవా)కనపడ్తాడు. కళ్లు తేలేసి ఉంటాయి. మిగిలిన వాళ్లనూ పిలుస్తాడు ఆ అబ్బాయి. అతనూ బాధితుడే.. ఆ అయిదుగురూ తమ వెహికిల్కున్న ఆ గొలుసును తీయడానికి ప్రయత్నిస్తారు. కాని రాదు. దాంతో ఆ వ్యక్తి చేతికున్న కొసను తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ లోపు ఆ దారిలోనే మరో వెహికిల్ వస్తున్న శబ్దం రావడంతో గబగబా ఆ శవాన్ని తీసి వెహికిల్ వెనక భాగంలో పెట్టేస్తారు. దారిలో ఓ జలపాతం దగ్గర బండి ఆపి.. శవాన్ని అందులో పడేయాలనుకుంటారు. కాని అక్కడ సర్వైలెన్స్ కెమెరా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని ఆపేసుకొని బండిని ముందుకు తీసుకెళ్తారు. అంతకుముందు వాళ్లు రాళ్లేసిన మూతపడ్డ కార్పోరేట్ ఎర్త్ ఫ్యాక్టరీ గ్రౌండ్లో ఉన్న గొయ్యిలో శవాన్ని ఆకులు, తుప్పలు, కర్రలతో కప్పేస్తారు. కాటేజ్‌కు వెళ్లిపోతారు. అయితే ఈ క్రమంలో ఆ అయిదుగురిలో ఒక అబ్బాయి తన ఐపాడ్‌ను ఎక్కడో పారేసుకుంటాడు. అది వెతుక్కోవడానికి తెల్లవారి మళ్లీ ఈ గొయ్యి దగ్గరకు వచ్చి చూస్తారు. అక్కడ ఐపాడ్ దొరుకుతుంది కాని శవం ఉండదు. అలాగే ఆ అమ్మాయీ మాయం అవుతుంది. ఆ అమ్మాయి ఆచూకీ కనుక్కోవడానికి ఫ్యాక్టరీకి వెళ్తారు. అక్కడే శవం కనపడుతుంది. ఆ శవం ఈ అయిదుగురిలో ముగ్గురినీ చంపేస్తుంది. అలా చంపేటప్పుడు తెలుస్తుంది ఆ శవం గుడ్డిదని. చివరకు ఆ అమ్మాయి, ఆమె ప్రేమికుడు ఇద్దరే మిగులుతారు. ప్రేమికుడినీ చంపుతుంటే ఆ అమ్మాయి అడ్డుపడుతుంది చంపొద్దని. అప్పటికే అతను చనిపోయి ఉంటాడు. అప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి ఆ వ్యక్తి తనకెంత ముఖ్యమైన వాడో.. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఎంత ఇష్టపడ్తున్నారో అని. తాము అయిదుగురూ చెవిటి, మూగ వాళ్లమని. అప్పుడు ఆ శవానికీ తన గతం గుర్తొస్తుంది. ఆ అమ్మాయికి చెప్తుంది. ఆ శవమూ గతంలో ఆ ఫ్యాక్టరీలో లీక్ అయిన విషవాయువు బాధితుడే. అతనికి కళ్లు పోతాయి. తన ప్రేమికురాలు అతనికి కళ్ల ఆపరేషన్ చేయించడానికి ట్రై చేస్తుంటుంది. తెల్లవారితే ఆపరేషన్.. ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టక పెంపుడు కుక్క సహాయంతో బయటకు వస్తాడు. వీళ్ల వెహికిల్తో యాక్సిడెంట్ అవుతుంది. వీళ్లు తమ వెహికిల్‌ను రివర్స్తీసుకున్నప్పుడు ప్రభుదేవాకు యాక్సిడెంట్ అవుతుంది. అతను గుడ్డి వాడు కాబట్టి కనపడదు.. వీళ్లంతా చెవిటి వాళ్లు కాబట్టి అతని ఆర్తనాదం వీళ్లకు వినపడదు. అలా అందులో ఎవరి తప్పూ ఉండదు. అకారణంగా వాళ్లను శిక్షించినందుకు ప్రభుదేవా పశ్చాత్తాపపడ్తాడు. అంతలోకే ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్లి తన ప్రేయసిని.. తన ప్రాంతాన్ని కళ్లతో చూడాలనుకుంటాడు. అమ్మాయి శరీరంలోకి అతని ఆత్మ ప్రవేశించి అన్నీ చూసుకొని... ఆస్వాదించి ఆ ఆత్మ వెళ్లిపోతుంది. వెళ్లిపోతూ ఆ అమ్మాయికి వినికిడి శక్తిని ఇస్తుంది. గొంతూ వస్తుంది. ఇదీ మెర్క్యూరీ కథ. corporate earth లోంచి corpor తీసేసి ate earth అని ఎండ్ చేస్తాడు సినిమాను దర్శకుడు. ఈ సినిమా ద్వారా ఆయన చెప్పదల్చుకుంది కూడా అదే. ఈ భూమ్మీద మనుషులతోపాటు సమస్త జీవులకూ జీవించే హక్కు అంతే ఉంది. కాని హద్దులు మరిచిన కార్పోరేట్ శక్తులు తమ దురాశతో భూమిని మింగేస్తున్నాయి అని. ఈ సందేశం మూకీ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకులను చేరిందా? ఆ విషయాన్ని చెప్పడానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? ప్రేక్షకులే నిర్ణయించాలి. మెర్క్యూరీ ప్రస్తుతం అన్ని థియేటర్స్‌లో ఆడుతోంది. ఆసక్తి ఉన్న వాళ్లు చూడొచ్చు. ఈ చిత్రదర్శకుడు.. కార్తిక్ సుబ్బరాజ్.. పిజ్జా ఫేమ్! – శరాది -
‘మెర్క్యూరి’ మూవీ రివ్యూ
టైటిల్ : మెర్క్యూరి జానర్ : సైలెంట్ హర్రర్ థ్రిల్లర్ తారాగణం : ప్రభుదేవా, సనంత్‌రెడ్డి, దీపర్ పరమేష్, శశాంక్ పురుషోత్తం, అనీష్ పద్మనాభన్, ఇందుజా, గజరాజ్ సంగీతం : సంతోష్ నారాయణన్ దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత : స్టోన్ బెంచ్ ఫిలింస్, పెన్ స్టూడియోస్ 30 ఏళ్ల క్రితం కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ‘పుష్పక విమానం’ పేరుతో ఓ మూకీ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మరోసారి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అదే ప్రయోగం చేశాడు. మూకీ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మెర్క్యూరి సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటించాడు. పిజ్జా, జిగర్తాండ, ఇరైవి లాంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించిన కార్తీక్, ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. మూడు దశాబ్దల తరువాత భారతీయ వెండితెర మీద సందడి చేసిన మూకీ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? గతంలో ఎన్నడూ కనిపించనంత కొత్త అవతారంలో కనిపించిన ప్రభుదేవ భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడా..? కార్తీక్ మరోసారి తన మార్క్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో అలరించాడా..? కథ : కార్పొరేట్ ఎర్త్ అనే కంపెనీలో జరిగిన మెర్య్కూరి పాయిజనింగ్ కారణంగా ఆ దగ్గరలోని ఓ గ్రామంలో 84 మంది చనిపోతారు. అంతేకాదు ప్రమాదం కారణంగా ఎంతోమంది చిన్నారులు మూగ చెవిటి వారిగా, అంధులుగా పుడతారు. మెర్య్యూరి పాయిజనింగ్ కారణంగానే బధిరులైన నలుగురు కుర్రాలు, ఓ అమ్మాయి కాలేజ్ లో జరిగిన అలూమ్ని పార్టీ లో పాల్గొని తరువాత కొద్దిరోజులు ఫ్రెండ్స్ తో ఆనందంగా గడపడానికి అక్కడే ఉండిపోతారు. అలా ఫ్రెండ్స్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తూ కారులో వెళ్తూ ఓ యాక్సిడెంట్ చేస్తారు. ఆ యాక్సిడెంట్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తిని అక్కడే వదిలేసి వెళ్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఆ శవాన్ని మోర్య్కూరి పాయిజనింగ్ కు కారణమైన ఫ్యాక్టరిలో పడేస్తారు. తరువాత ఆ కుర్రాళ్లు అదే ఫ్యాక్టరికీ ఎందుకు వెళ్లారు..? వారు యాక్సిడెంట్ చేసి చంపేసిన వ్యక్తి ఎవరు..? ఆ కుర్రాళ్లు ఒక్కొక్కరుగా చనిపోవటానికి కారణం ఏంటి..? చివరకు ఎంత మంది మిగిలారు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : దాదాపు 30 ఏళ్ల తరువాత ఇండియన్ స్క్రీన్ మీద మూకీ సినిమాను చూపించిన కార్తీక్ సుబ్బరాజ్ ధైర్యాన్ని ప్రశంసించాల్సిందే. అది కూడా డ్యాన్సర్ గా, లవర్ భాయ్‌గా మంచి ఇమేజ్ ఉన్న ప్రభుదేవాను పూర్తిగా డిఫరెంట్ రోల్లో, డిఫరెంట్ గెటప్‌లో చూపించి మెప్పించాడు కార్తీక్. సందేశాత్మక అంశాన్ని హర్రర్ థ్రిల్లర్‌గా మలిచి ఆకట్టుకున్నాడు. అయితే రొటీన్ కమర్షియల్ సినిమాలో ఉండే అంశాలేవి లేకపోవటం, తొలి భాగంలో లీడ్ యాక్టర్స్ మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులకు అర్ధం కాకపోవటం లాంటివి కాస్త ఇబ్బంది పెడతాయి. దర్శకుడు సృష్టించిన పాత్రకు ప్రభుదేవా వందశాతం న్యాయం చేశాడు. తనకు జరిగిన అన్యాయానికి పగతీర్చుకునే పాత్రలో ప్రభుదేవా నటన చాలా సందర్భాల్లో భయపెడుతుంది. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో కంటతడి కూడా పెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం. ఒక్క డైలాగ్ కూడా లేని సినిమాను పూర్తిగా తన నేపథ్య సంగీతంతో ఆసక్తికరంగా మార్చాడు సంతోష్. తిరు అందించిన సినిమాటోగ్రఫి సినిమాలోని ఫీల్ ను క్యారీ చేసింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రభుదేవా లుక్, నటన కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ మైనస్ పాయింట్స్ : బధిరుల భాషలో చెప్పించిన సంభాషణలు అర్ధం కాకపోవటం స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
విలన్ పాత్రకి ఎవరి స్ఫూర్తీ లేదు – ప్రభుదేవా
‘‘ఎంటర్టైనింగ్, మాస్ అంశాలతో తెరకెక్కిన మంచి చిత్రం ‘మెర్క్యురి’. నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా ఉంటుంది. విలన్‌గా చేయడం ఎగ్జయిట్మెంట్ అనిపించింది. ఆ పాత్ర చేయడానికి ఎవరి స్ఫూర్తీ లేదు. కార్తీక్ సుబ్బరాజ్‌పై నమ్మకంతోనే చేశా. సినిమా చూస్తున్నంత సేపు పాత్రలు మాత్రమే కనపడతాయి’’ అని ప్రభుదేవా అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెర్క్యురి’. పెన్ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలింస్ సమర్పణలో కార్తికేయన్ సంతానం, జయంతి లాల్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 13న విడుదలవుతోంది. తెలుగులో కె.ఎఫ్.సి. ప్రొడక్షన్ విడుదల చేస్తున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ– ‘‘యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. కమల్‌హాసన్‌గారి ‘పుష్పకవిమానం’ తర్వాత వస్తోన్న మూకీ సినిమా ‘మెర్క్యురి’. కమర్షియల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. ఇండియన్ సినిమాను తర్వాతి లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘పిజ్జా’ తెలుగులోనూ మంచి హిట్ అయింది. ‘మెర్క్యురి’ లాంటి వైవిధ్యమైన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇందులో పాటలు, డ్యాన్సులు ఉండవు’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. -
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు – కార్తీక్ సుబ్బరాజ్
‘‘రెండు రోజుల్లో జరిగే కథే ‘మెర్క్యూరీ’. ‘పుష్పక విమానం’ తర్వాత సైలెంట్ ఫిల్మ్ రాలేదు. ఈ చిత్రంలో కొత్త ప్రభుదేవాని చూస్తారు. ప్రేక్షకులు మా సినిమాని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అన్నారు. ప్రభుదేవా ముఖ్య పాత్రలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెర్క్యూరీ’. స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ సమర్పణలో కార్తికేయన్, సంతానం, జయంతి లాల్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘మనకు మొదట్లో సైలెంట్ ఫిల్మ్స్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత టాకీ సినిమా వచ్చింది. సైలెంట్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మెర్క్యూరీ’. డైలాగ్స్ చాలా తక్కువగా ఉండే సినిమా తీయాలని దర్శకుణ్ణి అయిన కొత్తలో అనుకున్నా. అది ఈ చిత్రంతో నెరవేరింది. ప్రభుదేవాగారు విలన్ పాత్రలో కనిపించనున్నారు. కథ విన్నప్పుడు డైలాగ్స్ లేకుండా వర్కవుట్ అవుతుందా? అని అడిగారు. ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాం. బంద్ ముగిసే వరకు తమిళనాడులో సినిమా రిలీజ్ చేయం. నా తర్వాతి సినిమా రజనీకాంత్ సార్‌తో చేస్తున్నా. రెండు మూడు నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. -
ప్రభుదేవా చిత్రంలో నయన్
సాక్షి, తమిళసినిమా : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇది సినిమాకూ వర్తిస్తుంది. చిత్ర పరిశ్రమలో ప్రేమించుకున్న వాళ్లు విడిపోవచ్చు, మళ్లీ కలవా వచ్చు. ప్రస్తుతం అగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న నయనతారనే తీసుకుంటే తొలి రోజుల్లో నటుడు శింబుతో డీప్ లవ్‌లో పడ్డారు. వీరిద్దరికి సంబంధించిన సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అలాంటిది వారి ప్రేమకు బ్రేక్ పడింది. ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమ కథ కొంత కాలం సాగింది. ప్రభుదేవాతోనూ పెళ్లికి సిద్ధమై మతాన్నే మార్చుకున్న నయనతార నటనకు స్వస్తి చెప్పడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ ప్రేమపెళ్లి పీటల వరకూ వెళ్లలేదు. ఆ తరువాత ఒక విలేకరి ప్రభుదేవాతో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు శింబుతో అయినా నటిస్తాను కానీ, ప్రభుదేవాతో జీవితంలో నటించను అని టక్కున బదులిచ్చారు నయనతార. అన్నట్టుగానే శింబు నుంచి విడిపోయిన తరువాత ఇదు నమ్మఆళు చిత్రంలో ఆయనకు జంటగా నటించారు. ప్రస్తుతం యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమ, సహజీవనం అనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న కొలైయుధీర్ కాలం చిత్రంలో ఒక కీలక పాత్రలో ప్రభుదేవాను నటింపచేసే ప్రయత్నాలు జరిగాయని, అయితే అందుకు ఆయనతో నటించడానికి నయనతార సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరిగింది. అయితే చిత్ర హిందీ రీమేక్‌లో ప్రభుదేవా నటిస్తుండడం విశేషం. నయనతార పాత్రలో తమన్నా నటిస్తున్నారు. తాజాగా ప్రభుదేవా చిత్రంలో నయనతార నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. నటుడిగా బిజీగా ఉన్న ప్రభుదేవా నటుడు అజిత్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతునట్లు, అందులో అగ్రనటి నయనతారను హీరోయిన్గా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. మళ్లీ ప్రభుదేవా దర్శకత్వంలో నయనతార ఎలా నటిస్తారన్న డౌట్ వస్తోందా? వృత్తి వేరు, వ్యక్తిగతం వేరు అనే బదులు వస్తుంది. ఇంతకుముందు శింబుతో నటించిన నయనతార, ఇప్పుడు ప్రభుదేవా చిత్రంలో నటించడానికి ఓకే అనడంలో పెద్దగా ఆశ్యర్యపడాల్సిన అవసరం ఉండదు. -
ఐపీఎల్ ఆరంభం అదిరింది
-
రజనీలా కష్టపడే వ్యక్తి సల్మాన్...
... అంటున్నారు నటుడు, దర్శకుడు ప్రభుదేవా. సల్మాన్‌ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘వాంటెడ్’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఇది మన తెలుగు ‘పోకిరి’కి రీమేక్. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సల్మాన్ హీరోగా ప్రభుదేవా ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సూపర్ హిట్ సిరీస్ ‘దబాంగ్’లో మూడో భాగం ఇది. ‘దబాంగ్–3’ పేరుతో తెరకెక్కించనున్నారు. కాగా, ‘దబాంగ్ టూర్’ పేరుతో సల్మాన్ పలు ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుదేవా కూడా ఆయనతో ఉన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ గురించి ప్రభుదేవా మాట్లాడుతూ– ‘‘సల్మాన్‌తో సినిమా అంటే నాకు ఛాలెంజ్‌తో కూడుకున్న పని. ఛాలెంజ్‌ని నేనెప్పుడూ ఒత్తిడిగా భావించను. సినిమా రిలీజ్ టైమ్‌లో మాత్రం ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనే విషయంలో ఒత్తిడికి గురవుతుంటా. సల్లూ భాయ్ బాగా కష్టపడే వ్యక్తి. ఆయనలో సూపర్‌స్టార్ రజనీకాంత్ లక్షణాలు చాలా ఉన్నాయి. ఇద్దరికీ ఓ విభిన్నమైన స్టైల్ ఉంది. వారెప్పుడూ ఇతరులను మెప్పించాలనుకోరు. వారిని తెరపై చూసి మనమే మెస్మరైజ్ అవుతుంటాం’’ అన్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా కథానాయిక. ‘దబాంగ్’ కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిదే అన్న సంగతి తెలిసిందే. -
ఈయనది పేద్ద ఇలియానా నడుము మరి
‘‘ఇదే నాన్న చెప్పిన విగ్రహం. దీనికి ఫారిన్లో సూపర్ డిమాండ్ ఉంది... నేను తెస్తాను నా శిల్పాన్ని’..., ‘వద్దురా.. ఆ ఊరే పెద్ద రిస్కు’..., ‘మీరు ముగ్గురూ కలిసి ఆ పెట్టెను కొట్టేయాలి’..., ‘ఏం.. మమ్మల్ని చూస్తే హీరోల్లా అనిపించట్లేదా?’..., ‘మా అన్నకు షుగర్ అని తెలీదా.. ఎందుకురా లాలీపాప్ పెట్టారు’..., ‘మీరూ మీ పొట్టలు.. మీ బండ నడుములు.., ఈయనది పేద్ద ఇలియానా నడుము మరి’..., ‘చనిపోయిన మా అబ్బాయి శ్రీనివాస్ నీలాగే ఉండేవాడు’..., ‘అప్పుడు ఆ నిధి ఏమైనట్టు’... వంటి డైలాగులు ‘గులేబకావళి’ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతున్నాయి. ప్రభుదేవా, హన్సిక జంటగా నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గులేబకావళి’. కల్యాణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఏప్రిల్ 6న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గులేబకావళి గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తమిళంలోలా తెలుగులోనూ మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్ఎస్ ఆనంద్‌కుమార్. -
నిధి కోసం అన్వేషణ
ప్రభుదేవా, హన్సిక జంటగా సీనియర్ నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గులేబకావళి’. కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అదేపేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఏప్రిల్ 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో కథ కొనసాగుతుంది. పూర్తి ఎంటర్టైన్మెంట్గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. తమిళ ప్రేక్షకులు ఆదరించినట్టే తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్ఎస్ ఆనంద్ కుమార్. -
టీజర్‌తో భయపెట్టిన ప్రభుదేవా
-
నిధి కోసం అన్వేషణ
ప్రభుదేవా, హన్సిక జంటగా కల్యాణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గులేబకావళి’. నటి రేవతి పవర్ఫుల్ పాత్రలో నటించిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్‡్ష ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన సినిమాకి ప్రధాన హైలైట్. ఈ నెల 16న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్ఎస్ ఆనంద్‌కుమార్, పాటలు: సామ్రాట్. -
తుది దశలో చార్లీచాప్లిన్–2
తమిళసినిమా: ఇంతకుముందు ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన పూర్తి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టెయినర్ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో తాజాగా ఆ చిత్ర దర్శకుడు శక్తి చిదంబరంనే దానికి సీక్వెల్‌గా చార్లీచాప్లిన్–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్వకత్వంలో పార్టీ అనే కలర్‌ఫుల్ చిత్రాన్ని నిర్మిస్తున్న అమ్మా క్రియేషన్స్ శివనే ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోనూ ప్రభుదేవా, ప్రభు కలిసి నటిస్తుండడం విశేషం. ఇక హీరోయిన్లుగా గ్లామర్ డాల్స్ నిక్కీగల్రాణి, బాలీవుడ్ భామ ఆదాశర్మ నటిస్తున్నారు. ఆదాశర్మకు ఇదే తోలి తమిళ చిత్రం అవుతుంది. ఇతర ముఖ్య పాత్రల్లో రవిమరియ, సెంథిల్, ఆకాశ్, వివేక్ ప్రసన్న,శామ్స్, శాంత, కావ్య, మగధీర చిత్ర ఫేమ్ దేవ్‌సింగ్, ముంబై విలన్ సమీర్ కోచ్, కోవమల్శర్మ, అమీత్, నట్పుకాగ వైభన్ నటిస్తున్నారు. అమ్రేశ్ సంగీతాన్ని, సౌందర్‌రాజన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీనికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను అందిస్తున్న శక్తిచిదంబరం చిత్ర వివరాలను తెలుపుతూ చార్లీచాప్లిన్–2 పూర్తిగా కమర్శియల్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం తుది ఘట్ట చిత్రీకరణ జరుపుకుంటోందదని తెలిపారు. -
రిస్క్ తీసుకున్నా...
తమిళసినిమా: చాలా రిస్క్ తీసుకుని నటించా అంటోంది నటి హన్సిక. చిన్న గ్యాప్ తరువాత శుక్రవారం గులేబాకావళి చిత్రంతో తమిళ తెరపైకి వచ్చింది ఈ బ్యూటీ. ప్రభుదేవా హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను వినోదంతో కడుపుబ్బ నవ్విస్తోంది. ఈ సందర్భంగా హన్సికతో చిన్న చిట్‌చాట్ ప్ర: గులేబాకావళి చిత్రం గురించి? జ: ఈ చిత్ర కథ 1945లో ప్రారంభమవుతుంది. ఒక నిధి బయట పడుతుంది. దాన్ని సొంతం చేసుకోవడానికి ఒక ముఠా ప్రయత్నిస్తుంది. ఆ నిధి ఎవరికి దక్కుతుందనేదే చిత్ర కథ. ఆద్యంతం వినోదభరితంగా, ఆసక్తిగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్ర: చిత్రంలో మీ పాత్ర ఏమిటి? జ: ఇందులో నిధి కోసం ప్రయత్నించే ముఠాలో ఒకరిగా ప్రభుదేవా నటించారు. నేనూ తొలిసారిగా దొంగగా నటించాను. దర్శకుడు కల్యాణ్ కథ చెప్పినప్పుడు నేనీ చిత్రంలో నటించగలనా అని భయపడ్డాను. అయితే దర్శకుడు ధైర్యం చెప్పి నటింపజేశారు. ప్ర: దర్శకుడు ప్రభుదేవా ఎలా ఉండేవారు? నటుడు ప్రభుదేవా ఎలా అనిపించారు? జ: నేను ఇంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించాను. దర్శకుడిగా ఆయన చాలా టెన్షన్‌గా, హడావుడిగానూ ఉండేవారు. నటుడిగా చాలా జాలీగా ఉంటారు. ఆయనకు జంటగా నటించడం చాలా మంచి అనుభవం ప్ర: తమిళంలో ఇన్నేళ్లుగా, పలు చిత్రాల్లో నటించినా ఇప్పటికీ తమిళ భాషను సరిగా మాట్లడలేకపోతున్నారే? జ: నిజం చెప్పాలంటే నా సహాయకులతో తమిళంలోనే మాట్లాడతాను. మునుపటి కంటే ఇప్పుడు కొంచెం బెటర్. త్వరలోనే సరళంగా తమిళ భాషను మాట్లాడగలుగుతాననుకుంటున్నా. ప్ర: మీరు కథలను ఎలా ఎంచుకుంటారు? జ: మొదట నాకు కథ నచ్చాలి. అందులో నా పాత్రకు కాస్త అయినా ప్రాధాన్యత ఉండాలి. కాన్సెప్ట్ వైవి«ధ్యంగా ఉండాలి. ఇవన్నీ సరిగ్గా అమరితే వెంటనే నటించడానికి రెడీ అంటాను. ప్ర: గులేబాకావళి చిత్రంలో ఫైట్స్ కూడా చేశారట? జ: అవును నటుడు ఆనందరాజ్‌తో ఫైటింగ్ సన్నివేశాల్లో నటించాను. అలా ఈ చిత్రం కోసం కాస్త రిస్క్ తీసుకున్నాను. -
మళ్లీ బిజీ బిజీగా..
తమిళసినిమా: జీవితంలో ఎత్తుపల్లాలు ఎవరికైనా సర్వసాధారణం. కొందరికి కాలం కలిసిరాకపోవడం లాంటివి, మరికొందరికి స్వయంకృతాపరాధం కారణం అవుతుంది. వీటిలో ఏ కారణంగానో ఇంతకుముందు టాప్ హీరోయిన్ల రేస్‌లో ఉన్న నటి హన్సిక కాస్త వెనుక పడిపోయింది. బహుశా ఆ మధ్య తాను నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడం అయిఉండవచ్చు. ఏదేమైనా బోగన్ చిత్రం తరువాత హన్సికను కోలీవుడ్ తెరపై చూడలేదు. దీంతో హన్సిక పనైపోయింది. ముంబైకి మూటాముల్లె సర్దేసింది అనే ప్రచారం మొదలైంది. ఇలాంటి సమయంలో డాన్సింగ్ స్టార్ ప్రభుదేవాతో నటించే చాన్స్‌ను దక్కించుకుంది. చాలా సైలెంట్‌గా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పొంగల్ రేస్‌కు సిద్ధమైంది. మళ్లీ హన్సిక భవిష్యత్తును నిర్ణయించే చిత్రం ఇదే అనే ప్రచారం సాగింది. అయితే నటుడు అధర్వతో జతకట్టే అవకాశం హన్సిక తలుపు తట్టింది. ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుండగా తాజాగా మరో అవకాశం హన్సికను వరించింది. ఈ సారి యువ నటుడు విక్రమ్‌ప్రభుతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. దీనికి తుపాకీ మునై అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇంతకు ముందు విజయ్ హీరోగా తుపాకీ, రజనీకాంత్ నటించిన కబాలి వంటి భారీ చిత్రాలను నిర్మించిన వి.క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. దినేష్ సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా రాస్మది ఛాయాగ్రహణం, ఎల్వీ.ముత్తు సంగీతాన్ని అందిస్తున్నారు. కమర్షియల్ అంశాలతో కూడిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. లేవు లేవు అంటూనే మళ్లీ ప్రైమ్‌టైమ్‌లోకి వచ్చేన నటి హన్సిక వరుసగా చిత్రాలు చేస్తూ మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అయిపోతోంది. అన్నట్టు ఈ అమ్మడు ఈ చిత్రం కోసం 6 కిలోల బరువు తగ్గి మరింత స్లిమ్‌గా తయారైందట. దీని గురించి హన్సిక తెలుపుతూ చిత్ర దర్శకుడు ముంబై వచ్చి కథను వినిపించారని, కథ తనను చాలా ఇన్స్పైర్ చేసిందని చెప్పింది. ఇది రెగ్యులర్ పాత్రల్లా ఉండదని, తానింత వరకూ చేయనటువంటి పాత్ర అని చెప్పింది. ఇక విక్రమ్‌ప్రభు ఇందులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటించనున్నారట. ఆయన ఇంతకు ముందు ఇదే బ్యానర్లో అరిమానంబి వంటి విజయవంతమైన చిత్రంలో నటించారన్నది గమనార్హం. -
‘చార్లీ చాప్లిన్’ సీక్వెల్లోనూ ఆ ఇద్దరే!
సినిమాలకు ఇపుడంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హాలీవుడ్లో ఎప్పటినుంచో ఉన్నా అది ఇటీవల బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లకూ పాకింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ ట్రెండ్ అధికం అనే చెప్పాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 2.ఓ, కలగలప్పు 2, తమిళ పడం 2 ఈ తరహా చిత్రాలే. వీటికి తొలి భాగాలు మంచి విజయాన్ని పొందడంతో రెండవ భాగాలకు రెడీ అయ్యాయి. అలా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం చార్లీచాప్లిన్ 2. 2002లో ప్రభు, ప్రభుదేవా, గాయత్రి రఘురామ్, అభిరామిలు కలిసి నటించిన చార్లీచాప్లిన్ మంచి విజయాన్ని సాధించింది. దాని దర్శకనిర్మాత శక్తి ఎన్.చిదంబరం తాజాగా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. టి.శివ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోగా ప్రభుదేవానే నటిస్తున్నారు. ఆయనకు జంటగా నిక్కీగల్రాణి ఎంపికయ్యింది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్‌ను ఈ నెల 15 నుంచి జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా, తొలి భాగంలో నటించిన ప్రభు పాత్రలో ఎవరు నటిస్తారన్న సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో తాజాగా ఇందులోనూ ప్రభు నటించనున్నారని చిత్రవర్గాలు వెల్లడించాయి. తమ చిత్రంలో ఆయన నటించడం సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు అన్నారు. అయితే హీరో పాత్రలను దాటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ప్రభు ఇందులో ఏ తరహా పాత్రను పోషిస్తున్నారన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ప్రభు చార్లీచాప్లిన్ చిత్రంలో పోషించిన పాత్రకు కొనసాగింపుగానే ఈ చిత్రంలోనూ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే ప్రభు హీరోగా రెండవ ఇన్నింగ్ మొదలెట్టినట్లే అవుతుంది. -
శస్త్రచికిత్సతో స్లిమ్‌గా..
తమిళ సినిమా: కాస్త బొద్దుగా ఉన్న కథానాయికలు బరువు తగ్గి, మరింత నాజూగ్గా తయారవడానికి నోరు కుట్టుకుని, కసరత్తుతో నానా తంటాలు పడుతున్నారు. కోట్లు గడిస్తున్నా ఆహారపు కట్టుబాట్లంటూ డైట్ చేస్తున్నారు. అదీ మీరి కొందరు శస్త్ర చికిత్సకు వెనుకాడడం లేదు. తాజాగా నటి లక్ష్మీమీనన్ ఇదే బాట పట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ చిత్రం హిట్‌తో ఇక్కడ సెటిల్ అయిపోయింది, వరుసగా అవకావాలు అందిపుచ్చుకుంది. దీంతో కాస్త బొద్దుగా ఉన్నా ఆ విషయం గురించి పట్టించుకోలేదు. పైగా నేనిలానే ఉంటాను అని స్టెట్మెంట్ కూడా ఇచ్చేసింది. అయితే అనూహ్యంగా అవకాశాలు తగ్గడంతో అమ్మడికి అందం గురించి గుర్తొచ్చినట్లుంది. కొత్తవారు దూసుకురావడంతో లక్ష్మీమీనన్‌ను కోలీవుడ్ దాదాపూ పక్కన పెట్టేసింది. ఆ మధ్య నటించిన రెక్క చిత్రంలో మరీ లావుగా కనిపించింది. ఇటీవల బరువు తగ్గే ప్రయత్నాలు మొదలెట్టిందట. వ్యాయామం, యోగా లాంటి కసరత్తులతో కాస్త బరువు తగ్గించుకున్న లక్ష్మీమీనన్‌కు ఫలితంగా ప్రభుదేవాతో యంగ్ మంగ్ ఛంగ్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అయితే ఇంకా స్లిమ్‌గా తయారవ్వాలన్న తలంపుతో బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించడానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తం మీద లక్ష్మీమీనన్ సోషల్ మీడియాకు విడుదల చేసిన ఫొటోల్లో చాలా స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించింది. అదేవిధంగా ఇప్పటి వరకు సంప్రదాయబద్ధంగా నటించిన లక్ష్మీమీనన్ ఇకపై గ్లామర్ పాత్రలకు సై అనేవిధంగా దర్శక నిర్మాతలకు హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
అవకాశాల కోసం తప్పలేదు..!
తమిళ సినిమా: సినీ రంగంలో క్రేజ్ ఉన్నంత వరకే అవకాశాలైనా, డిమాండ్ అయినా.. క్రేజ్ తగ్గకూడదంటే సక్సెస్ చాలా అవసరం. సక్సెస్ లేకుంటే దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడరు. నటి హన్సిక విషయానికే వస్తే ఆదిలో విజయాలు దరి చేరకపోయినా, ఆ తరువాత సక్సెస్ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకుంది. విజయ్, విశాల్, జయంరవి లాంటి స్టార్ హీరోలతో జత కట్టి మంచి ఇమేజ్ సంపాదించుకోవడంతో పాటు దర్శకుల నటిగా పేరు తెచుకుంది. ఆ తరువాత నటించిన చిత్రాలు హిట్ అయినా ఎందుకో గానీ అవకాశాలే పలచబడ్డాయి. ప్రభుదేవాతో నటిస్తున్న గులేబకావిళి చిత్రం మినహా చేతిలో మరో చిత్రం లేని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి తరుణంలో అధర్వతో నటించే అవకాశం తలుపు తట్టింది. అజిత్ హీరోగా చిత్రం చేయాలన్న నిర్ణయంతో చిత్రం నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆరా సంస్థ ఆయన కాల్షీట్స్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఇతర చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలెట్టారు. ఈ సంస్థ తాజాగా జై, అంజలి, జననీఅయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన బెలూన్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పుడు అధర్వ హీరోగా చిత్ర నిర్మాణం తలపెట్టారు. డార్లింగ్, ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు చిత్రాల ఫేమ్ శ్యామ్ అంటని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సికను నాయకిగా ఎంపిక చేశారు. అధర్వ, హన్సిక జంట కడుతున్న తొలి చిత్రం ఇదే. ఇంతకు ముందు రూ.కోటి వరకూ పుచ్చుకున్న ఈ అమ్మడు పారితోషికం తగ్గించుకోవడం వల్లనే ఈ అవకాశాన్ని పొందించనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై హన్సిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. -
ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు..!
సాక్షి, తమిళ సినిమా: కొన్ని చిత్రాల విడుదలలో జాప్యానికి కారణాలు చెప్పలేం. అలా ఒక వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏళ్ల పాటు విడుదలకు ఎదురు చూస్తోంది. అదే డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన కళవాడియ పొళుదుగళ్. నటి భూమిక నాయకిగా నటించారు. దర్శకుడు తంగర్‌బచ్చన్ చిత్రాలు ఇతర చిత్రాలకు భిన్నంగానూ, విలువలతో కూడినవిగా ఉంటాయి. అళగి, ఒంబదురూపాయ్ నోటు, సొల్లమరంద కథై, పళ్లికూట్టం వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఆయన తదుపరి చిత్రం కలవాడియ పొళుదుగళ్. ప్రకాశ్‌రాజ్, సత్యన్ ప్రముఖ పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని ఐన్గరన్ ఫిలింస్ పతాకంపై కరుణాకరన్ నిర్మించారు. చాలా కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రానికిప్పుడు మోక్షం కలిగింది. పలు రకాల సంకెళ్లను తెంచుకుని ఈ నెలలోనే విడుదల కానందని చిత్ర నిర్మాత కరుణాకరన్ వెల్లడించారు. ప్రేమ బాధను తప్పించుకోని మనిషి ఉండరని చెప్పవచ్చు. అదే విధంగా ప్రతి వ్యక్తి ప్రేమ ఫలించదు. అలాంటి ప్రేమ నేపథ్యంలో రూపొందించిన చిత్రం కలవాడియ పొదుళుదుగళ్ అని చిత్ర దర్శకుడు తంగర్‌బచ్చన్ తెలిపారు. ప్రభుదేవా కథ చదివి పూర్తి చేసిన వెంటనే ఇందులో తాను నటిస్తున్నానని చెప్పి, ఇలాంటి పాత్రలో తానిప్పటి వరకూ నటించలేదని ప్రశంసించారన్నారు. అదే విధంగా ప్రకాశ్‌రాజ్, భూమికల పాత్రలు చాలా ప్రాధాన్యంతో కూడి ఉంటాయని తెలిపారు. చిత్రాన్ని ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. -
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కన్నుమూత
నిజామాబాద్ : నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు బాడిగ ధర్మరాజు(97) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ధర్మరాజు శనివారం తుదిశ్వాస విడిచారు. ధర్మరాజు మృతి చెందిన వార్త తెలుసుకున్న ప్రభుదేవా, నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌కు చేరుకుని గురువు భౌతికకాయానికి నివాళులర్పించారు. ధర్మరాజు కుటుంబ సభ్యులను ప్రభుదేవా పరామర్శించారు. 20వ ఏట నుంచే డ్యాన్స్‌పై ఆసక్తితో తన చిన్నాన్న బీవీ నరసింహరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. ఎన్టీఆర్, కృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఉదయభానుతో పాటు ప్రముఖ హీరోలకు క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశారు. సినిమా రంగానికి చెందిన కృపావతిని ధర్మరాజు పెళ్లి చేసుకున్నారు. -
డాన్సింగ్ కింగ్‌తో రొమాన్స్‌కు..
తమిళసినిమా: నృత్యదర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా ఆ తరువాత దర్శకుడిగా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ వరకూ సంచలనం సృష్టించారు. తాజాగా కథానాయకుడిగా యమ బీజీ అయిపోయారు. రెండు మూడు చిత్రాలు షూటింగ్లో మరో రెండు మూడు చిత్రాలు కమిట్మెంట్లో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చదరం 2 చిత్రం ఫేమ్ దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ తాజా చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో నివేదాపేతురాజ్ ఆయనతో రొమాన్స్ చేసే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రం ఒరునాళ్ కూత్తు చిత్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల నటించిన పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణను పొందలేకపోయింది. దీంతో జయం రవితో జత కడుతున్న టిక్ టిక్ టిక్ చిత్రంపైన చాలా అశలు పెట్టుకుంది. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అంతరిక్షంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కుతోంది. దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ ఇటీవల నటి నివేదాపేతురాజ్ను కలిసి కథను వినిపించారట. కథ నచ్చడంతో పాటు ప్రభుదేవాతో నటించడానికి ఈ అమ్మడు చాలా ఆసక్తిని కనబరచిందట. ఈ విషయాన్ని దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశాన్ని నివేదా పేతురాజ్ కొట్టేసిందన్నమాట. -
ప్రభుదేవాతో మరోసారి..
తమిళసినిమా: మార్కెట్ పడిపోయింది. అవకాశాలు లేవు. ఇక మూటాముల్లు సర్దుకోవలసిందే అనే టాక్ స్ప్రెడ్ అయినప్పుడల్లా నటి తమన్నాకు అవకాశాలు తలుపుతడుతూ ఆ ప్రచారం తప్పని సమాధానాన్ని ఇస్తున్నాయి. బాహుబలి–2 చిత్రంలో తమన్నా పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేదు కదా, ఆ చిత్రం తరువాత ఈ అమ్మడికి సరైన అవకాశాలు రాలేదు. అదే సమయంలో శింబుతో రొమాన్స్ చేసిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ తీవ్రంగా నిరాశపరచింది. దీంతో విక్రమ్‌తో నటిస్తున్న స్కెచ్ పైనే ఆశలు పెట్టుకున్న ఈ మిల్కీబ్యూటీకి తాజాగా మరో అవకాశం వచ్చింది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం తమన్నా తలుపు తట్టింది. ఇంతకు ముందు ఈ జంట నటించిన దేవి చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందనుందని, అందులోనూ తమన్నా, ప్రభుదేవాతో కలిసి నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అయితే అంతకు ముందే ఈ క్రేజీ జంట మరో చిత్రంలో నటించడానికి రెడీ అయిపోతున్నారన్నది తాజా సమాచారం. కోలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్‌ల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. రజనీకాంత్ 2.ఓ, విక్రమ్ సామి–2, సుందర్.సీ కలగలప్పు–2 చిత్రాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా విశ్వనటుడు కమలహాసన్ ఇండియన్–2కు రెడీ అవుతున్నారు. ఇలా మరి కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్న తరుణంలో చార్లీచాప్లిన్ చిత్ర సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. 2002లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం చార్లీచాప్లిన్. ప్రభుదేవా,ప్రభు, అభిరామి,గాయత్రి రఘురామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు. దీనికిప్పుడు సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులో ప్రభుదేవాకు జంటగా నటి తమన్నా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
నన్ను సోదరిలా చూసుకున్నారు : హీరోయిన్
చెన్నై: హీరోయిన్గా కోటీ ఆశలతో టాలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్‌కుమార్ మనవరాలైన ఈమె నటించిన తొలి తెలుగు చిత్రం అఖిల్. ఈ చిత్రం సాయేషాకు నిరాశనే మిగిల్చింది. అయితే అఖిల్ సినిమాతో ఈ బ్యూటీకి ఏమైనా మేలు జరిగిందంటే అది కోలీవుడ్‌కు ఎంట్రీ అవడమే. కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో ముందుండే దర్శకుడు విజయ్ దృష్టిలో సాయేషా సైగల్ పడింది. తనకు కోలీవుడ్‌లో తొలి అవకాశం కల్పించడంతో పాటు, వనమగన్ చిత్ర షూటింగ్లో దర్శకుడు విజయ్ తనను ఒక సోదరిగా చాలా బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు. అందుకే ఆయన్ని కలిసి రాఖీ కట్టడానికి ముంబాయి నుంచి ప్రత్యేకంగా చెన్నైకి వచ్చానని చెప్పింది. అంతే జయంరవికి జంటగా తాను దర్శకత్వం వహించినా వనమగన్ చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చేశారు. ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందినా, సాయేషాకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. వనమగన్ చిత్రంలో సాయేషా ఒక పాటకు కొరియోగ్రాపర్‌గా చేసిన డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాకు ఆమె డాన్స్ బాగా నచ్చేసింది. అయితే తాను విశాల్, కార్తీ హీరోలుగా తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రం కరుప్పురాజా వెళ్లరాజా సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చేశారు. దీంతో తన కెరీర్ వెలిగి పోతుందని సంతోషించిన సాయేషా ఆనందం అంతలోనే ఆవిరై పోయింది. కారణం కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రం డ్రాప్ అయ్యిపోయ్యిందనే ప్రచారం జరగడమే. అయితే ఇటీవల అనూహ్యంగా చెన్నైకి వచ్చిన సాయేషా కరుప్పురాజా వెళ్లైరాజా చ్రితంలో నటించే అవకాశం రావడంతో చాలా సంతోషపడ్డానని, ఈ చిత్రానికి సంబంధించి నాలుగు రోజులు షూటింగ్ కూడా జరిగిందని ఆమె చెప్పింది. అయితే చిత్రం డ్రాప్ అయిన విషయం తెలియదని, దర్శకుడు ప్రభుదేవా కూడా తనకు ఏమీ చెప్పలేదని పేర్కొంది. కాగా తాను చెన్నైకి రావడానికి కారణం ఏమిటని అడిగినందుకు.. ఈ విధంగా సమాధానం చెప్పారు. తనకు కోలీవుడ్‌లో తొలి అవకాశం కల్పించడంతో పాటు, వనమగన్ చిత్ర షూటింగ్లో దర్శకుడు విజయ్ తనను ఒక సోదరిగా చాలా బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు. ఏదేమైనా సాయేషా సైగల్కి ఇప్పుడు ఏ భాషలోనూ సినిమాలు లేవన్నది వాస్తవం. -
ఆ సెట్ ఖరీదు చాలా ఎక్కువట !
బాహుబలి చిత్రం తరువాత చిత్ర నిర్మాణ వ్యయాన్ని ఊహించలేకపోతున్నాం. ఆ చిత్రం ప్రేక్షకులకు బ్రహ్మాండాన్ని పరిచయం చేసిందనే చెప్పాలి. దీంతో చాలా మంది దర్శక నిర్మాతలు భారీ వ్యయాన్ని వెచ్చించి చిత్రాలను నిర్మించడానికి సాహసిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా ప్రభుదేవా చిత్రంలోనూ అలాంటి బ్రహ్మాండాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుదేవా, నటి హన్సిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం గులేబాకావళి. కేసేఆర్ స్డూడియోస్ పతాకంపై కేసేఆర్.రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు ఎస్.కల్యాణ్ మెగాఫోన్ పట్టారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వివేక్–మెర్విన్ల ద్వయం సంగీత బాణీలు సమకూరుస్తున్నారు. ఒక పాట కోసం రూ.2 కోట్లు వ్యచించి ఒక బ్రహ్మాండమైన సెట్‌ను కళాదర్శకుడు కదిర్ నేతృత్వంలో వేశారు. కొరియోగ్రాఫర్ జానీ నృత్యరీతులు సమకూర్చుతున్న ఈ పాటను ఛాయాగ్రాహకుడు ఆనందకుమార్ అతి నవీన సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ గ్రాఫిక్ నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారట. గులేబాకావళి చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని సన్‌టీవీ పెద్ద మొత్తానికి కొనుగోలు చేయడం మరో విశేషం. -
నిర్మాతగా మారిన యువ దర్శకుడు
తమిళ దర్శకులు డైరెక్షన్ తో పాటు నిర్మాణ రంగంలోనూ సత్తాచాటుతున్నారు. యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమయ్యాడు. 2014లోనే స్టోన్ బెంచ్ సంస్థను ప్రారంభించిన కార్తీక్ ఈ సంస్థ ద్వారా బెంచ్ ఫ్లిక్స్, షార్ట్ ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్, బెంచ్ క్యాస్ట్ అనే విభాగాల్లో సినీ సేవలందిస్తున్నారు. ఈ శాఖల ద్వారా ఇప్పటికే 150 చిత్రాలకు సబ్‌టైటిల్స్‌ను, 200 లఘు చిత్రాల డిస్ట్రిబ్యూషన్, 25 చిత్రాలకు క్యాస్టింగ్‌ను సమకూర్చారు. యూఎస్ఏకు చెందిన కల్రామన్, సోమశేఖరలతో కలిసి స్టోన్ బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రెండు సినిమాలను, ఒక వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. అందులో ఒక చిత్రానికి మెయ్యాద మాన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కొత్త దర్శకుడు రత్నకుమార్ పరిచయం అవుతున్న ఈ సినిమాలో నటుడు వైభవ్, ప్రియ భవానీశంకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండో చిత్రానికి మెర్కురీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో డాన్సింగ్‌స్టార్ ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రభుదేవా హీరోగా నటించనున్న సినిమాకు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలకు జాతీయ అవార్డు గ్రహీత తిరు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వీటితో పాటు కళ్లసిరిప్పు అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ లో రోహిత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాల పరిచయ కార్యక్రమం శుక్రవారం చెన్నై గిండీలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. దర్శకుడు మణిరత్నం, భారతీరాజ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆ హీరోయిన్ మూటాముల్లె సర్దుకోవలసిందే !
బొద్దుగుమ్మ హన్సిక పరిస్థితి చూసి ఇటీవల సినీ వర్గాలు అయ్యో పాపం అనుకున్నాయి. కొందరైతే ఈమె పని అయిపోయింది. ఇక మూటాముల్లె సర్దుకోవలసిందే అనే కామెంట్లు కూడా చేశారు. అందుకు కారణం హన్సిక చేతిలో ఒక్క చిత్రం కూడా లేదన్నదే. అయితే ఇలాంటి పనికి మాలిన కామెంట్స్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను సైలెంట్‌గా చేసుకుపోతోంది ఈ భామ. అర్ధం కాలేదా? హన్సికకు మళ్లీ అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే కోలీవుడ్‌లో రెండు, మాలీవుడ్‌లో ఒకటి చిత్రాలతో హన్సిక బిజీగా ఉంది. తమిళంలో డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో గుళేభకావళి చిత్రంలో రొమాన్స్ చేస్తున్న హన్సిక శశికుమార్‌కు జంటగా కొడివీరన్ చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటు తొలిసారిగా మలయాళ చిత్ర సీమలోకి అడుగుపెట్టి అక్కడ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, సుదీప్ హీరోలుగా నటిస్తున్న విలన్ చిత్రంలో హన్సిక ప్రధాన పాత్రలో మెరుస్తోంది. ఇందులో టాలీవుడ్ ప్రముఖ హీరో విశాల్ విలన్‌గా విలక్షణ పాత్రలో నటించడం మరో విశేషం. కాగా ఇటీవలే హన్సిక విలన్ చిత్ర షూటింగ్లో జాయిన్ అయ్యిందట. -
అడ్వాన్స్ తిరిగిచ్చేసిన తమన్నా..?
బాహుబలి 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మిల్కీ బ్యూటి తమన్నా, ఆ ఇమేజ్ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. రెండో భాగంలో కొద్ది క్షణాల పాటే కనిపించినా.. బాహుబలి స్టార్‌గా తమన్నాకు నేషనల్ లెవల్లో మంచి ఇమేజ్ వచ్చింది. దీంతో చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న బాలీవుడ్ కలను సాకారం చేసుకునేందుకు ఇదే సరైన టైం అని భావిస్తుంది మిల్కీ బ్యూటి. అందుకే సౌత్‌లో ఇప్పటికే అంగీకరించిన సినిమాలకు కూడా నో చెప్తుతోందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రభుదేవ స్వయంగా నిర్మించి నటించిన అభినేత్రి సినిమాలో కీలక పాత్రలో నటించిన తమన్నా, ఆ తరువాత అదే కాంబినేషన్లో మరో సినిమా చేసేందుకు అంగీకరించింది. అయితే ఆ ప్రాజెక్ట్‌పై ఎనౌన్స్మెంట్ కూడా వచ్చిన తరువాత ఇప్పుడు తమన్నా నో చెప్పేసిందట. తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసిన మిల్కీ బ్యూటి, బాలీవుడ్ అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. -
కొత్త అవతారమెత్తిన ప్రభుదేవా
చెన్నై: నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న ప్రభుదేవా ప్రస్తుతం పాటల రచయిత అవతారమెత్తారు. ‘దేవి’ చిత్రం తర్వాత ప్రభుదేవా నటిస్తున్న చిత్రం ‘ఎంగ్ మంగ్ సంగ్’. ఎం.ఎస్.అర్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అమ్రీష్ సంగీత దర్శకత్వంలో ‘అయ్యనారా వందుటాంగ ఇంగ పారు’ అనే పాటను ప్రభుదేవా రాయగా శంకర్ మహాదేవన్ పాడారు. కుంభకోణంలో ప్రభుదేవా, 150 మంది నృత్య కళాకారులతో ఈ పాటకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. వాసన్ విజువల్ వెంచర్స్ సంస్థ పతాకంపై కె.ఎస్.శ్రీనివాసన్, కె.ఎస్.శివరామన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభుదేవా పాట రాయడం గురించి దర్శకుడు మాట్లాడుతూ చిత్రంలో ఓ భారీ ఉత్సవం జరిగే సన్నివేశం ఉందని, ఆ సందర్భంగా ఓ పాట కూడా ఉందని తెలిపారు. అలాంటి పాటను ఓ ప్రసిద్ధ గీత రచయితతో రాయించాలని ముందుగా అనుకున్నామని, ప్రభుదేవాతో చెప్పగా ఆ పాటలో ఏ అంశాలు ఉండాలనే విషయాన్ని వివరించారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన అంశాలు బాగుండటంతో ఆ పాటను రాయమని ప్రభుదేవాకు చెప్పానన్నారు. అయితే మొదట సంకోచించినప్పటికీ తర్వాత ఆయన పాటను రాశారని తెలిపారు. -
ఎట్టకేలకు బాలీవుడ్లో మగధీరకు మోక్షం
-
టాలీవుడ్‌కు మెరుపుతీగ రీ ఎంట్రీ
ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. డ్యాన్సర్ గానే కాదు నటుడిగా కూడా మంచి మార్కులు సాధించిన ఈ మెరుపు తీగ, తరువాత దర్శకుడిగానూ సత్తా చాటాడు. బాలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకొని వరుస వంద కోట్ల సినిమాలతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. నార్త్‌లో ఇంత సాధించినా.. ప్రభుదేవా దర్శకుడిగా మారింది మాత్రం తెలుగు సినిమాతోనే. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా, తరువాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తరువాత బాలీవుడ్ వెళ్లిపోయి, సౌత్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఇటీవలే నిర్మాతగా మారి సౌత్‌లో అడుగుపెట్టిన ప్రభుదేవా.. మరోసారి తన సొంత గడ్డ పై ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తనకు దర్శకుడిగా బ్రేక్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీలో మరో సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే స్టార్ హీరోలతో కాకుండా మినిమమ్ బడ్జెట్లో రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మరి ప్రభుదేవా మరోసారి తెలుగు ప్రేక్షకులతో నువ్వొస్తానంటే మేమొద్దంటామా అని అనిపిస్తాడేమో చూడాలి. -
అభినేత్రితో మైఖేల్ జాక్సన్
-
నగరంలో అభినేత్రి టీం సందడి
బంజారాహిల్స్: ప్రముఖ నటుడు సోనూసూద్ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆల్మాస్ ప్యాలెస్ హోటల్లో సందడి చేశారు. ప్రభుదేవా, తమన్నాతో కలిసి ఆయన నటించిన చిత్రం తటక్ తటక్ తుటియా (తెలుగులో అభినేత్రి) ప్రమోషన్లో భాగంగా సోనూసూద్ హైదరాబాద్ వచ్చారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానున్నట్లు చెప్పారు. హోటల్ యజమాని రజా తనకు సన్నిహితుడన్నారు. కార్యక్రమంలో అభినేత్రి సినిమా దర్శకులు విజయ్ పాల్గొన్నారు. -
అభినేత్రి ప్రమోషన్లో జాకీచాన్
తమన్నా లీడ్ రోల్లో ప్రభుదేవా, సోనూసూద్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా అభినేత్రి. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తమిళంలో డెవిల్ పేరుతో, హిందీలో టూ ఇన్ వన్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమిళ వర్షన్‌ను ప్రభుదేవా, హిందీ వర్షన్‌ను సోనూసూద్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్, కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ ప్రమోషన్ ప్రారంభించిన సోనూ, పోస్టర్ లాంచ్‌కు ఏకంగా హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్‌ను ఆహ్వానించాడు. ప్రస్తుతం జాకీతో కలిసి కుంగ్ ఫూ యోగా అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు సోనూ. ఆ అనుబంధంతోనే సోనూసూద్ నిర్మించిన తొలి సినిమా పోస్టర్‌ను లాంచ్ చేశాడు జాకీ. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న అభినేత్రి హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ప్రభుదేవా, సోనూసూద్‌లు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అభినేత్రి సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
విజయవాడలో అభినేత్రి ఆడియో
ఇన్నాళ్లు గ్లామర్ పాత్రల్లో అలరించిన తమన్నా, తొలిసారిగా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా అభినేత్రి. నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా మంచి విజయాలు సాధించిన ప్రభుదేవా.. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు వర్షన్‌కు కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ, బ్లూ సర్కిల్ కార్పొరేషన్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న అభినేత్రి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఆడియో వేడుకను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఆగస్టు 15న విజయవాడ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతిలోక సుందరి శ్రీదేవి హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్, మురళీ శర్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఆ ముగ్గురి కల ఒక్కటే..!
ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన సౌత్ దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా అంతర్జాతీయ సినీ సెలబ్రిటీగా మారిన అతడు ఆ చిత్రం కన్నా భారీగా మహా భారతాన్ని తెరకెక్కిస్తానంటూ ప్రకటించాడు. అయితే ఆ సినిమా రూపొందించే స్థాయి, పరిజ్ఞానం తనకింకా రాలేదన్న జక్కన్న ఏ రోజుకైనా మహాభారతానికి దృశ్యరూపం ఇవ్వటమే తన కల అంటూ ప్రకటించాడు. తాజాగా బాలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటి ఇప్పుడు దర్శకుడిగా హవా చూపిస్తున్న ప్రభుదేవా, ఎప్పటికైన మహాభారతాన్ని తన దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అది కూడా హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ స్థాయిలో భారీగా తెరకెక్కించడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇక దర్శకరత్న దాసరి కూడా మహాభారతానికి దృశ్యరూపం ఇవ్వాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయప సరైన సమయంలో మరోసారి మెగాఫోన్ పట్టి మహాభారత పౌరాణిక గాథను తనదైన స్టైల్లో వెండితెర మీద ఆవిష్కరించే ఆలోచనలో ఉన్నాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా మహాభారతాన్ని మొదలు పెడతారో చూడాలి.