RC15 Team Grand Welcome to Ram Charan Return To Shooting Set - Sakshi
Sakshi News home page

Ram Charan: చెర్రీకి ఆర్‌సీ15 టీం సర్‌ప్రైజ్.. ఫిదా అయిన రామ్ చరణ్

Published Sun, Mar 19 2023 5:15 PM | Last Updated on Sun, Mar 19 2023 5:32 PM

RC15 Team Grand Welcome To Ram Charan return to Shooting set - Sakshi

ఆస్కార్ వేడుకలు ముగించుకున్న రామ్ చరణ్ ఇటీవలే అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ ఇంటికి కూడా చేరుకున్నారు. ఆయన తదుపరి చిత్రంలో శంకర్ దర్శకత్వంలో పనిచేయనున్నారు. తాత్కాలికంగా ఈ సినిమాకు ఆర్సీ15 అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన చెర్రీకి ఘనస్వాగతం లభించింది. ప్రభుదేవా ఆధ్వర్యంలోని ఆర్సీ15 చిత్రబృందం నాటు నాటు స్టెప్పులతో వెల్‌కమ్ చెప్పింది. అ తర్వాత రామ్‌ చరణ్‌ను పూలమాలతో సత్కరించింది. 

(ఇది చదవండి: ప్రేమించిన ‍వ్యక్తిని పెళ్లాడిన ప్రముఖ నటి కూతురు, ఫోటో వైరల్‌)

దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. రామ్ చరమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.'  ఇంతటి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పలేను. నాకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రభుదేవా  సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్సీ15 షూటింగ్‌కి తిరిగి వచ్చినందుకు చాలా గొప్పగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చెర్రీ ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా స్పందించింది. స్వీటెస్ట్ వెల్‌కమ్‌ అంటూ కామెంట్ చేసింది. కాగా.. ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే.

కాగా.. మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న RC15 పొలిటికల్ యాక్షన్ డ్రామాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య, జయరామ్, అంజలి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement