Natu Natu Song
-
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫిఫా పోస్టర్.. స్పందించిన యంగ్ టైగర్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ చిత్రంలో హీరోలుగా నటించారు. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీలోని నాటు నాటు అనే పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. దీంతో ఆస్కార్ వేదికగా నాటు నాటు సాంగ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.అయితే ఈ సాంగ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ చూసినా నాటు నాటు స్టెప్పులకు కాలు కదపకుండా ఉండరేమో అనేలా ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఈ పాటను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్(ఫిఫా) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ముగ్గురు ఫుట్ బాల్ దిగ్గజాల పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఆ పోస్టర్లో ఫుట్‌బాల్ దిగ్గజాలు నేయ్మార్, టెవెజ్, రొనాల్డో ఫోటోలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా క్రియేట్ చేసింది. వీరి పేర్లలోని తొలి అక్షరాలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా పోస్టర్‌ను రూపొందించారు. ఇందులో ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ స్టెప్పులు వేస్తున్నట్లు కనిపించారు. ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ముగ్గురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మన యంగ్ టైగర్. ఈ పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మాస్ టైగర్ ఎన్టీఆర్ అంటూ జూనియర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ చివరిసారిగా దేవర పార్ట్ -1 చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి వార్- 2 మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. View this post on Instagram A post shared by FIFA World Cup (@fifaworldcup) View this post on Instagram A post shared by FIFA World Cup (@fifaworldcup) -
బాలీవుడ్లో ఎన్టీఆర్.. నాటు నాటు పాట రిపీట్?
ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఎంత హిట్టో తెలియంది కాదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకెత్తయితే ఆ ఒక్క పాట ఒకెత్తు అన్నట్టుగా భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ఆ పాట దునియాని ఊపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పాట ఓ రేంజ్లో పాప్యులరైంది. అదే ఊపులో ఇండియాకి ఆస్కార్‌ని కూడా తెచ్చేసింది. మరోసారి ఈ తరహా పాట రిపీట్ కానుందా? అందులో మన యంగ్ టైగర్ తన కాలు కదపనున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో రూపొందుతున్న భారీ చిత్రం వార్ 2 చిత్ర విశేషాలను గమనిస్తున్నవారు దీనిని దాదాపుగా ధృవీకరిస్తున్నారు. తొలిసారిగా ఎన్టీయార్ వార్ -2లో నటిస్తుండటంతో ఈ పాన్ ఇండియా సినిమాపై తెలుగు, హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మన ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.హృతిక్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతీ సన్నివేశం స్పెషల్‌గా ఉండాలని కాబట్టి తప్పకుండా తగినన్ని యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అందరూ భావిస్తున్నారు. మరోవైపు నాటునాటు పాట తరహాలో ఈ సినిమాలో కూడా అలాంటి పాట ఒకటి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందట. బాలీవుడ్లో హృతిక్ నృత్యాలకు కూడా మంచి పేరుంది. మరోవైపు ఎన్టీయార్ డ్యాన్సుల గురించి చెప్పనక్కర్లేదు. ఈ నేపధ్యంలో వీరి కాంబోలో సాంగ్ అనే ఆలోచన నిజమైతే... ఇక ప్రేక్షకులకు కన్నుల పండుగే అని చెప్పాలి. ఇటీవల హృతిక్ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం పెద్ద సవాలుగా ఉంటుందని అన్నారు. . ఆయనతో పాటుగా స్టెప్స్ వేయాలంటే మరింతగా ప్రిపరేషన్ అవసరం అని అభిప్రాయపడ్డాడు. .ఈ సినిమాలో పాట నాటు నాటు పాట కంటే హై లెవెల్లో ఉండేలా తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.మరోవైపు తొలిసారిగా ఒక అగ్రగామి తెలుగు హీరో...విలన్ తరహా పాత్రను బాలీవుడ్లో పోషిస్తుండడంతో వార్ 2 సినిమా చర్చనీయాంశంగా మారింది: ఇందులో ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని టాక్. అటు డ్యాన్స్, ఇటు యాక్షన్‌లో హృతిక్‌తో పోటీ పడాల్సిన ఈ పాత్రకు ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ 2 విడుదలకు సంబంధించి ఇంకా స్పష్టత రానప్పటికీ... ఆగస్టు 15కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది సంచలనాత్మక సినిమాల్లో వార్ -2 ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలి బాలీవుడ్, టాలీవుడ్ పూర్తి స్థాయి మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలయ్యాక బాలీవుడ్, టాలీవుడ్ ల మధ్య సంబంధాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మల్టీ జానర్ సినిమా చేయబోతుండగా, మరోవైపు దేవర 2 కూడా లైన్లో ఉంది. -
వరుణ్ తేజ్ పెళ్లిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ నాటు నాటు డాన్స్ వైరల్
-
క్రికెట్ లీగ్‌లో రామ్ చరణ్.. సచిన్‌తో కలిసి స్టేడియాన్ని ఊపేసిన హీరో!
మెగా తనయుడు, హీరో రామ్ చరణ్ క్రికెట్ లీగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. గతంలోనే హైదరాబాద్‌ను జట్టును కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ ప్రకటించారు. టెన్నిస్ బాల్‌తో నిర్వహించే ఐఎస్పీఎల్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్‌కు యజమానిగా ఉన్నారు. అంతే కాదు.. తనతో పాటు టీమ్‌లో చేరాలంటూ ట్విటర్ వేదికగా చెర్రీ పిలుపునిచ్చారు. తాజాగా ఐఎస్పీఎల్ టీ10 లీగ్ మహారాష్ట్రలోని థానేలో ప్రారంభమైంది. దడోజి కోనదేవ్ స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో మెగా హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ సూర్య, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్టేడియంలో సందడి చేశారు. చీర్ లీడర్స్‌తో కలిసి నాటు నాటు సాంగ్‌కు కాలు కదిపారు. చరణ్ డ్యాన్స్ చేస్తుండగా.. రవిశాస్త్రి, సచిన్ తిలకించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత సచిన్, సూర్య, అక్షయ్ కుమార్, రవిశాస్త్రితో కలిసి మరోసారి స్టెప్పులు వేశారు రామ్ చరణ్. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయగా తెగ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీకి చెర్రీకి జంటగా కనిపించనుంది. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పని చేయనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Sachin, Ram Charan, Suriya, Akshay Kumar doing the "Naatu Naatu" step in the inaugural function of ISPL. 🔥pic.twitter.com/d6YORP0JL8 — Johns. (@CricCrazyJohns) March 6, 2024 #RamCharan 🤝 #Suriya for @ispl_t10 Opening Ceremony !!@AlwaysRamCharan @Suriya_offlpic.twitter.com/spCjejkRC3 — Raees (@RaeesHere_) March 6, 2024 Man Of Masses @AlwaysRamCharan 🦁👑 Joins With a NAATU NAATU 🕺STYLE the Opening Ceremony Of @ispl_t10 at Dadoni Kondadev Athletics Stadium 📸✨💥🔥 In Frame Master #SachinTendulkar#Ravishastri ❤☺🤩#GameChanger #RamCharan 🦁👑🌟 pic.twitter.com/tNnUUwFCnN — 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) March 6, 2024 -
దర్శకధీరుడిపై మరోసారి ప్రశంసలు.. హాలీవుడ్ దిగ్గజం ఏమన్నారంటే?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతే కాదు.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్‌ను గెలిచి మన గొప్పదనాన్ని మరింత పెంచారు. గతేడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డ్ దక్కింది. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ లభించింది. ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. అదే సమయంలో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. 2023లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో కామెరూన్‌ను రాజమౌళి కలిశాడు. ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మూవీ అద్భుతంగా ఉందని కొనియాడారు. (ఇది చదవండి: 'మా నాన్నకు అలాంటి అవసరం లేదు'.. సూపర్ స్టార్ కూతురు ఆసక్తికర కామెంట్స్!) తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ దిగ్గజం మరోసారి రాజమౌళిని పొగిడారు. ఈవెంట్లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు. కామెరూన్ మాట్లాడుతూ.. 'నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. అది చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమా ప్రపంచ వేదిక స్థాయికి చేరడం చాలా గొప్పగా విషయం' అని అన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ద్వారా పంచుకుంది. 'మీ అమూల్యమైన మాటలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని సరిహద్దులను బద్దలు కొట్టి మరింత ఎత్తుకు ఎదుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.' అంటూ ట్వీట్ చేసింది. కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. James Cameron.. 🤗 Your precious words always inspire us to strive better and be the best. We strongly believe Indian cinema is going to break all boundaries and grow to its fullest. ❤️ #RRRMovie pic.twitter.com/pzHjGQNZnC — RRR Movie (@RRRMovie) February 7, 2024 -
లండన్ వీధుల్లో నాటు నాటు సాంగ్.. అదరగొట్టిన మహిళలు!
ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే నాటునాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఓ రేంజ్లో ఊపేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్‌ను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో దక్కించుకుంది. తాజాగా నాటునాటు పాటకు లండన్‌లో డ్యాన్స్ చేస్తూ అలరించారు. ఏకంగా 700 మంది లండన్ వీధుల్లో స్టెప్పులేస్తూ సందడి చేశారు. (ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. మహిళలంతా శారీలతో ఆర్ఆర్ఆర్ సాంగ్‌కు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరలు ధరించిన మహిళలు లండన్ వీధుల్లో దుమ్ములేపారు. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల నాటు నాటు స్టెప్పులతో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సాంగ్ క్రేజీ మామూలుగా లేదంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్. (ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) Naatu Naatu opposite 10 Downing Street today https://t.co/neqM08DJuu pic.twitter.com/WMIUfvSqqD — Naomi Canton (@naomi2009) August 7, 2023 The saree walkathon ended up at Gandhi's statue in Parliament Square opposite Big Ben. The aim was to promote hand-woven sarees from across India to mark national handloom day. https://t.co/neqM08DJuu pic.twitter.com/kcqqPR1gil — Naomi Canton (@naomi2009) August 7, 2023 -
హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!
ఉపాసన- రామ్ చరణ్ ఈ ఏడాది తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న అపోలో ఆస్పత్రిలో చేరిన మెగా కోడలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే తమ ముద్దుల కూతురి పేరును క్లీంకారగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యామిలీలో వారసురాలు అడుగు పెట్టడంతో పండుగ వాతావరణం నెలకొంది. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా ) అయితే ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన వేడుకలో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. అయితే ఇవాళ సంగీత దర్శకుడు కీరవాణి బర్త్‌డే సందర్భంగా ఉపాసన వినూత్నంగా విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫోటోను పంచుకున్నారు. నాటు నాటు పాట స్టెప్పులకు వింబుల్డన్‌లో టెన్నిస్ ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్నట్లు ఫోటోను షేర్ చేశారు. అంతే కాకుండా హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆస్కార్ అవార్డ్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. (ఇది చదవండి: డైరెక్టర్‌తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్) -
'నాటునాటు' పాటకు ఈ వెర్షన్ చూశారా.. చూడండి అదిరిపోద్ది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- జూ. ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన RRR నుంచి ‘ఆస్కార్ అవార్డ్ సాధించిన ‘నాటునాటు’ పాట ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లోనూ అంతే సూపర్ హిట్ అయింది. ఈ పాటకు ఆస్కార్‌తో పాటు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలిచింది. ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. కానీ తాజాగా తన విభిన్నమైన స్వరంతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించే ప్రముఖ గాయని ఉషా ఉతుప్ నాటునాటు పాటను ఆలపించారు. ఉషా ఉతుప్ వెర్షన్లో వచ్చిన ఈ పాటను మీరూ కూడా వినేయండి. (ఇదీ చదవండి:ఆమెతో సుధీర్ పెళ్లి ఫిక్స్.. గతంలో రష్మి చేసిన కామెంట్స్ వైరల్?) -
నాటు నాటుకి అమెరికన్ యువత స్టెప్పులు
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక విందు సరదా సంభాషణలతో సందడిగా సాగింది. వైట్‌హౌస్ నార్త్ లాన్లో గురువారం రాత్రి ఈ విందుకు 400 మందికిపైగా అతిథుల్ని ఆహ్వానించారు. పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహేంద్ర, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తదితరులు ఈ విందుకి హాజరయ్యారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ విందులో అధ్యక్షుడు బైడెన్ ప్రధాని మోదీతో సరదా సంభాషణలతో నవ్వులు పూయించారు. విందులో టోస్ట్ (ఆరోగ్యం కోసం తీసుకునే ఒక పెగ్గు ఆల్కహాల్) సంప్రదాయం గురించి బైడెన్ మాట్లాడుతూ ‘‘మిస్టర్ పీఎం మీరు ఎవరికైనా టోస్ట్ అందించాలనుకుంటే మీ చేతి గ్లాసులో ఆల్కహాల్ లేకపోతే ఎడమ చేత్తో వారికి ఇవ్వాలి. ఈ విషయాన్ని మా తాతయ్య చెప్పేవారు’ అని బైడెన్ అంటే మోదీ చిరునవ్వులు చిందించారు. బైడెన్, మోదీ ఇద్దరూ ఆల్కహాల్ తీసుకోరు. దీంతో అందరూ ఫక్కున నవ్వేశారు. బైడెన్ ఆతిథ్యానికి అతిథులందరూ ఫిదా అయిపోయి పాటలు పాడాలని అనుకుంటారని మోదీ అన్నారు. 2014లో అమెరికాకు వచ్చినప్పుడు నవరాత్రుల సందర్భంగా ఉపవాసం ఉండడంతో ఏమీ తినలేదని, అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్ తనని బాగా ఆకలేస్తే ఏదో ఒకటి తినాలని ఆప్యాయంగా అడిగేవారని గుర్తు చేసుకున్నారు. తాను తినాలన్న బైడెన్ కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. అతిధులందరూ ఆరోగ్యం కోసం ఆల్కహాల్ తీసుకోవాలంటూ మోదీ స్వయంగా టోస్ట్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, అమెరికా మధ్య బంధాల బలోపేతంలో ప్రవాస భారతీయులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ‘భారతీయులు, అమెరికన్లు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుంటున్నారు. భారత్‌లో పిల్లలు హాలోవిన్ వేడుకల్ని చేసుకుంటూ స్పైడర్ మ్యాన్‌ను చూసి పులకించిపోతూ ఉంటే, అమెరికన్ యువత తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్లో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు పాటకి స్టెప్పులేస్తున్నారు’అని ప్రధాని పేర్కొన్నారు. అధికారిక విందులో మెనూ..! ప్రధాని కోసం ప్రత్యేకంగా శాకాహారం, తృణధాన్యాలతో చేసిన వంటలను దగ్గరుండి మరీ జిల్ బైడెన్ వడ్డించారు. మారినేటెడ్ మిల్లెట్స్, గ్రిల్డ్ మొక్కజొన్న సలాడ్, పుచ్చకాయ జ్యూస్, అవకాడో సాస్, స్టఫ్డ్ మష్రూమ్స్, క్రీమీ రిసొట్టో, లెమన్ డిల్ యోగర్ట్ సాస్ వంటివి ప్రత్యేకంగా వడ్డించారు. -
నాటు పాట పాడుతున్న నాగలాండ్ రైతులు
-
జెలెన్స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
జెలెన్స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో ..: వీడియో వైరల్
ఆర్ఆర్ఆర్ మూవీ క్రేజ్ మాములుగా లేదు. ఆ మూవీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న థియోటర్లలో ఇంకా ప్రదర్శితమవుతూనే ఉంది. అదీగాక ఈ పాటకి చిందులు వేస్తూ రోజు ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అవ్వడం, వైరల్ అవ్వడం జరుగుతుంది. తాజగా ఇప్పుడు ఉక్రెయిన్ సైనికులు ఆ పాటకు స్టెప్పులు వేశారు. ఎలాగైతే ఆ మూవీలో ఇద్దరు నటులు బ్రిటీస్ వారికి వ్యతిరేకంగా ఎలా డ్యాన్స్‌ని ప్రదర్శించారో అలానే ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు చేసి అందర్నీ అలరించారు. ఈ పాటతో ఆ నటులిద్దరు బ్రిటిష్ అధికారికి వ్యతిరేకంగా ఎలా అయితే తమ నిరసనను వ్యక్తం చేశారో అలా రష్యాకి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఆపాటను చిత్రీకరించింది ఉక్రెయిన్ ఆర్మీ. అదీకూడా సరిగ్గా ఆర్‌ఆర్‌మూవీ నాటు నాటు పాటను ఎక్కడైతే షూట్ చేశారో అక్కడే(జెలెన్స్కీ అధికారిక నివాసం ఎదుట) ఆప్రదేశంలోనే ఉక్రెయిన్ సైనికులు కూడా తమ వీడియోని చిత్రీకరించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఉక్రెయిన్ నెటిజన్లు మేము మా స్వంత వలసవాదులతో పోరాడుతున్నాం. ఉక్రెయిన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉందని రష్యాకు మరోసారి అర్థమయ్యేలా చేస్తాం అని ఒకరు, యుద్ధం వేళ ఈ పాట అనుకరణగా అద్భతంగా ఉందని మరోకరు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ అధికార ఖాతా కూడా ఈ వీడియోకి ఫోల్డింగ్ హ్యాండ్స్ ఎమోజీలను పెట్టడమే గకా వీడియోని రీట్వీట్ చేసింది. అంతేగాదు ఈ వీడియోకి ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్ హ్యారీ) -
నాటు నాటు పాట రాయడానికి 19 నెలలు పట్టింది.. చంద్రబోస్
-
ఆస్కార్ తీసుకునే రోజు ఏం జరిగిందో చెప్తూ ఎమోషనల్ అయిన కీరవాణి
-
వరంగల్ స్టూడెంట్ ఇవాళ ఆస్కార్‌ను తీసుకొచ్చాడు: అల్లు అరవింద్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డ్ దక్కింది. దీంతో టాలీవుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందాన్ని ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికపై ఆర్ఆర్ఆర్ టీంకు అభినందన సభ నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ. 'కలలో కూడా కనలేని ఆస్కార్ ఈ రోజు రాజమౌళి టీం వల్ల సాధ్యమైంది. క్షణక్షణం నుంచి మొదలైన కీరవాణి ప్రస్థానం ఈ రోజు ఆస్కార్ అందుకునే స్థాయికి వచ్చింది. వరంగల్‌లో చదువుకుంటున్న ఒక స్టూడెంట్ ఈ రోజు ఎక్కడో ఉన్న ఆస్కార్‌ను తీసుకొచ్చాడు. అతనే చంద్రబోస్. ఈ రోజు తెలుగు సినిమా అంటే అందరూ తిరిగి చూసే స్థాయికి తీసుకొచ్చారు. రాజమౌళి చిత్రబృందం తెలుగు సినిమాస్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. చంద్రబోస్ మాట్లాడుతూ..' సినీ ఇండస్ట్రీ అంత మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు కీరవాణి మాటలతో నా జీవిత గమనం మార్చింది. ఆస్కార్ ఎనౌన్స్ చేసేటప్పుడు నేను భయంతో కీరవాణి చెయ్యి పట్టుకున్నా. ఆస్కార్ పట్టుకున్న వెంటనే భారతీయ కీర్తి పతాకాన్ని పట్టుకున్నాననే భావన కలిగింది. ఆస్కార్ అందుకోవడం నా జన్మలో చేసుకున్న అదృష్టం. కీరవాణితో నాది 28 ఏళ్ల అనుబంధం. బాహుబలిలో నాకు అవకాశం రాకున్నా.. ఆర్ఆర్ఆర్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుని సహనంతో ఉండి ఈ పాట రాయడానికి దాదాపు 17 నెలలు పట్టింది.' అని అన్నారు. సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి మాట్లాడుతూ:.. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం వెనుక మూల విగ్రహాలు రాజమౌళి, ప్రేమ్ రక్షిత్. నేను చంద్రబోస్ ఉత్సవ విగ్రహాలు మాత్రమే. తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు ఒక్కచోట చేరి ఇలా పండుగ చేసుకోవడం సంతోషంగా ఉంది. నా మొట్ట మొదటి పాట చేసింది చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న థియేటర్ అది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయిన నాకు కృష్ణంరాజు సూర్యనారాయణ రాజు ఇచ్చారు. ఆస్కార్ వల్ల నేను ఎక్సయిటింగ్ అవ్వలేదు. నిజంగా ప్రతిష్టాత్మకమైన అవార్డ్. ఈ పాటకు అందరూ ఎంతో కష్టపడి చేశారు. ఈ సినిమా కోసం ఆస్కార్ మెంబర్స్‌కి షోస్ వేసి చూపించాం. వాళ్లకు నచ్చింది. అందరూ సమిష్టిగా చేసిన కృషికి లభించిన విజయానికి మీరందరు వేడుక చేయడం సంతోషంగా ఉంది.' అని అన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ..' ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. బాహుబలి సినిమాతో టాలీవుడ్ విశ్వ వ్యాప్తంగా విస్తరించింది. ఆ సినిమాకు కూడా ఆస్కార్ అవార్డ్స్ రావాల్సింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా సీఎం కేసీఆర్, ప్రభుత్వం సహకారం అందించింది. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు తెలుగులోనూ వస్తున్నాయి. లక్షలాది మందికి అన్నం పెడుతున్న పరిశ్రమ తెలుగు సినిమా. పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం.' అని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ' ఈరోజు ఆస్కార్ అవార్డు రావడం సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. తెలంగాణ వస్తే సినీ పరిశ్రమ వస్తే ఏమౌతుందోనని అనుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా మా పోరాటం పాలకుల మీద కానీ ప్రజల మీదకు కాదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ భాషను యాసను సినిమాల్లో అవమానించేవారు అని మేము బాధ పడేటోళ్లం. కానీ ఈరోజు గర్వపడుతున్నాం. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలినేదే మా ధ్యేయం. తెలంగాణలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ షూటింగ్స్ జరుపుకోవడానికి మేము సహకరిస్తాం. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి.' అని అన్నారు. -
'నాటు నాటు' పాట అలా పుట్టింది... వెల్లడించిన చంద్రబోస్
చిట్యాల: చల్లగరిగలో చిన్నప్పుడు నేర్చుకున్న పదాలతోనే ‘నాటు నాటు’పాట పుట్టింది.. దీంతో ఊరికే ఆస్కార్ అవార్డు దక్కిందని.. సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాసిన ‘నాటు నాటు’పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు స్వీకరించిన అనంతరం సొంత ఊరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు ఆదివారం వచ్చిన చంద్రబోస్ దంపతులు.. స్థానిక శివాలయంలో పూజలు చేశారు. ఇంటినుంచి పాఠశాల వరకు డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లారు. చంద్రబోస్ చదివిన పాఠశాల 1969–2022 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు అతన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ గ్రంథాలయం నుంచే తనకు అక్షర బీజం పడిందని.. ఇప్పడు శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని పునర్నిర్మిస్తానని చెప్పారు. గ్రామస్తులతో చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. -
నాటు నాటు సాంగ్.. ఒకే వేదికపై ఆలియా భట్, రష్మిక
ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం హాజరయ్యారు. రెండో రోజు కూడా అదేస్థాయిలో పలువురు బాలీవుడ్ తారలు వేదికపై సందడి చేశారు. వారికి ఇష్టమైన పాటలకు స్టెప్పులు వేస్తూ హల్చల్ చేశారు. వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ఆలియా భట్, రష్మిక మందన్న ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు స్టెప్పులతో అదరగొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. పలువురు బాలీవుడ్ తారలు సైతం వేదికపై డ్యాన్స్ చేశారు. రణవీర్ సింగ్ సైతం ప్రియాంక చోప్రాతో కలిసి స్టెప్పులేశారు. వరుణ్ ధావన్ డ్యాన్స్ చేస్తూ జిగి హడిద్‌ను చేతులపై ఎత్తుకుని సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఈవెంట్లో పెనెలోప్ క్రజ్, టామ్ హాలండ్, జెండయా, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, దుల్కర్ సల్మాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Indian Express Entertainment (@ieentertainment) -
నాటు నాటు పాటకు అవార్డ్ వస్తుందని ఊహించలేదు: కీరవాణి
‘‘నాటు నాటు’ పాటకు అవార్డులు వస్తాయని నేను ఊహించలేదు. ఆస్కార్ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఈ ‘నాటు నాటు’ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడగా ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. కాగా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం గురించి తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు. ఓ తమిళ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి చెప్పిన విశేషాల్లో కొన్ని ఈ విధంగా... ► ‘నాటు నాటు’ ఓ కమర్షియల్ సాంగ్... అంతే. ఒక వినూత్నమైన పాటలో మన ప్రతిభను క్లాసికల్ మ్యూజిక్ పరంగా, ఆర్కెస్ట్రాలో కొత్త డిజైనింగ్ కంపోజిషన్, అద్భుతమైన పొయిట్రీ వంటి వాటితో కనబరిచి ఉంటే.. అప్పుడు ఆ పాటకు అవార్డులను ఊహిస్తాం. కానీ ‘నాటు నాటు’ పాట పక్కా ఫాస్ట్ బీట్ కమర్షియల్ నెంబర్. ఆస్కార్‌ని మరచిపోండి.. అసలు ‘నాటు నాటు’ పాటకు నేను ఏ అవార్డునూ ఊహించలేదు. ఈ పాటను రాజమౌళి తీసిన విధానం, ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన విధానానికి మేజర్ క్రెడిట్ దక్కుతుంది. అఫ్కోర్స్ చంద్రబోస్‌కి కూడా. ‘నాటు నాటు వీరనాటు.. నాటు నాటు ఊరనాటు’ అనే ఆ రెండు వాక్యాలు ఒక మంత్రంలాంటివి. వాటిని క్రియేట్ చేసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డుకి అర్హుడు. ఈ పాటను తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కూడా చేశాం. అక్కడి రచయితలు కూడా వారి స్థాయికి తగ్గట్లుగా బాగానే కష్టపడ్డారు. కానీ తెలుగు వెర్షన్‌కి మంచి సౌండింగ్, రైమింగ్ కుదిరాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ► ఇక నాకు లభించిన తొలి ఆస్కార్ రామ్‌గోపాల్ వర్మగారు. ఇప్పుడు తీసుకున్నది రెండో ఆస్కార్. కెరీర్ స్టార్టింగ్‌లో నా సంగీత ప్రతిభను గుర్తించమన్నట్లుగా నా మ్యూజిక్ క్యాసెట్స్‌ను కొందరికి షేర్ చేశాను. వాటిని కొందరు డస్ట్‌బిన్‌లో వేశారు. ఇండస్ట్రీకి ఓ స్ట్రేంజర్ వచ్చి నా పాటలు వినండని క్యాసెట్స్ ఇస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. కానీ ‘క్షణక్షణం’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మగారు చాన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ‘శివ’ ఆస్కార్ రోల్ ప్లే చేస్తే.. నా కెరీర్లో రామ్‌గోపాల్‌వర్మగారు ఆస్కార్ రోల్ ప్లే చేశారు. ‘రామ్‌గోపాల్‌వర్మతో వర్క్ చేస్తున్నాడు కాబట్టి కీరవాణిని మన సినిమాకి తీసుకుందాం’ అంటూ నాకు అవకాశాలు ఇచ్చారు. ► గునీత్ మోంగాగారి (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌లో ఆస్కార్ పొందిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత)కి ఆస్కార్ వేదికపై మాట్లాడటానికి తగిన సమయం దక్కలేదు. దీంతో ఆమె తన యాక్సెప్టెన్సీ స్పీచ్ తర్వాత సరిగా శ్వాస తీసుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. -
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చంద్రబోస్ కు ఘన స్వాగతం
-
‘నాటు నాటు’ ఫీవర్: నా వల్ల కావడం లేదు..ఇదే లాస్ట్! ఆనంద్ మహీంద్ర
సాక్షి, హైదరాబాద్: సంచలనాలు నమోదు చేసిన టాలీవుడ్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట హవా ఇంకా ప్రపంచంలో ఎక్కడో ఒక మూలకొనసాగుతూనే ఉంది. ఆస్కార్ అవార్డుతో ప్రపంచవ్యాప్త కీర్తిని దక్కించుకున్న ఈ పాటకు పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇకసామాన్య ప్రజానీకి గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇప్పటికే ఆ సాంగ్‌పై రామ్ చరణ్ తో కలసి ఈ పాటకు స్టెప్స్ వేసిన పారిశ్రామిక వేత్త , ఎం అండ్ ఎం అధినేత ఆనంద్‌మహీంద్ర తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఇదీ చదవండి: ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది? తోలుబొమ్మతో ఒక మహిళ నాటునాటు పాటకు అదరిపోయే స్టెప్స్ వేయిస్తున్న వీడియోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు దీనికి మరింత ఆసక్తికరమైన కామెంట్ కూడా యాడ్ చేశారు. ఒకే ఒక్క. లాస్ట్ ట్వీట్. దీన్ని పోస్ట్ చేయకుండా నిలవరించుకోవడం నా వల్ల కావడంలేదు.. నాటునాటుపై హామీ ఇస్తున్నా.. ప్రపంచవ్యాప్తం అనే దానికి ఇదే కదా తార్కాణం. ఇప్పటికీ ఇది ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తోంది అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. Ok. One last tweet, I promise, about #NaatuNaatu But couldn’t resist this one. Real evidence of it being a global phenomenon since it now has the whole world on its ‘strings’ 😊 pic.twitter.com/ex1bmf4Boh — anand mahindra (@anandmahindra) March 22, 2023 మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు -
ఆస్కార్ నాటునాటుకు తీగల ‘బొమ్మ’ డాన్స్ అదుర్స్! ఆనంద్ మహింద్రా ఫిదా!
-
బీన్స్ గింజపై ఆస్కార్ ‘నాటు నాటు’
తెనాలి(గుంటూరు జిల్లా): లాస్ ఏంజిలిస్‌లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు..ఊర నాటు’ పాటను ప్రవాస భారతీయ చిత్రకారుడు బీన్స్ గింజపై చిత్రీకరించారు. దర్శక ప్రముఖుడు రాజమౌళి తీసిన ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటను జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌పై చిత్రీకరించారు. ఆస్కార్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కువైట్‌లోని పాహీల్ అల్ వతానీ ఇండియన్ ప్రైవేట్ స్కూలులో చిత్రకళ విభాగం అధిపతి ఎ.శివనాగేశ్వరరావు వైట్ బీన్స్ గింజపై సూక్ష్మంగా చిత్రీకరించారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్‌ను, మధ్యలో ఆస్కార్ అవార్డును తీర్చిదిద్దారు. చిత్రకారుడనైన తాను, ఈ సూక్ష్మచిత్రంతో ఆర్ఆర్ఆర్ బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నట్టు శివనాగేశ్వరరావు ‘సాక్షి’కి ఫోనులో వెల్లడించారు. శివనాగేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. చదవండి: రూ.6 కోట్లు ఉంటే.. అంతరిక్షంలోకి! నెరవేరనున్న భారతీయుల కల -
నిజంగా ఇదో అద్భుతం.. రాజమౌళి ప్రశంసలు
నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ పాటకు అమెరికాలోనూ క్రేజ్ మామూలుగా లేదు. తాజాగా న్యూజెర్సీలో టెస్లా కార్లతో ప్రదర్శించిన ఓ వీడియో సోషల్ మీడియోలో పెద్దఎత్తున వైరలైంది. ఈ వీడియో చూసిన రాజమౌళి తాజాగా స్పందించారు. ఆ వీడియోను తన ట్విటర్లో షేర్ చేస్తూ అద్భుతమంటూ కొనియాడారు. రాజమౌళి తన ట్విటర్లో రాస్తూ.. 'న్యూజెర్సీ నుంచి నాటు నాటు పాటకు మీరు చూపిన అభిమానానికి నిజంగా పొంగిపోయా. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంతటి అధ్బుతమైన వీడియోను ప్రదర్శించిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నాటు నాటు సాంగ్‌కు టెస్లా కార్లతో లైట్ షో ఒక అద్భుతమైన అనుభూతి.' అంటూ పోస్ట్ చేశారు. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు సాంగ్ ఇంత క్రేజ్ తీసుకొచ్చన ఘనత దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో ఈ పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. Truly overwhelmed by this tribute to #NaatuNaatu from New Jersey ! Thank you @vkkoppu garu, #NASAA, @peoplemediafcy and everyone associated with this incredible and ingenious @Tesla Light Show...:) It was a stunning show. #RRRMovie @elonmusk pic.twitter.com/JKRfTZdvLK — rajamouli ss (@ssrajamouli) March 21, 2023 -
నాటు నాటు సాంగ్.. టెస్లా కార్లు డ్యాన్స్.. వీడియో వైరల్
ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆ పాటకు స్టెప్పులేయకుండా ఎవరు మాత్రం ఉండగలరు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై తెలుగోడి సత్తాను చాటింది. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎలన్ మస్క్‌కు చెందిన కార్ల కంపెనీ టెస్లాలో నాటు నాటు సాంగ్ ఊర్రూతలూగించింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. టెస్లా కార్లకు ఉన్న లైట్లు నాటు నాటు స్టెప్పులతో సింక్ అయ్యేలా ప్రదర్శించారు. పాట లిరిక్స్‌కు అనుగుణంగా కార్ల లైట్స్ వెలగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతే కాకుండా పక్కన ఉన్న టెస్లా ఉద్యోగులు సైతం కాలు కదపకుండా ఉండలేకపోయారు. నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ లైట్ షో నిర్వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్, సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు వంశీ కొప్పురావూరి, ఉజ్వల్ కుమార్ కస్తల ఈ కార్యక్రమం సక్సెస్ లో ప్రముఖ పాత్రను వహించారు. ఎడిసన్ నగర మేయర్ సామ్ జోషి మరియు అతని బృందం అతి తక్కువ టైములో సహకరించి దీనిని విజయవంతం చేసారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. .@Teslalightshows light sync with the beats of #Oscar Winning Song #NaatuNaatu in New Jersey 🤩😍 Thanks for all the love. #RRRMovie @Tesla @elonmusk pic.twitter.com/wCJIY4sTyr — RRR Movie (@RRRMovie) March 20, 2023 -
రామ్ చరణ్‌కు ప్రభుదేవా బిగ్ సర్ప్రైజ్.. అదేంటంటే!
ఆస్కార్ వేడుకలు ముగించుకున్న రామ్ చరణ్ ఇటీవలే అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ ఇంటికి కూడా చేరుకున్నారు. ఆయన తదుపరి చిత్రంలో శంకర్ దర్శకత్వంలో పనిచేయనున్నారు. తాత్కాలికంగా ఈ సినిమాకు ఆర్సీ15 అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన చెర్రీకి ఘనస్వాగతం లభించింది. ప్రభుదేవా ఆధ్వర్యంలోని ఆర్సీ15 చిత్రబృందం నాటు నాటు స్టెప్పులతో వెల్కమ్ చెప్పింది. అ తర్వాత రామ్ చరణ్‌ను పూలమాలతో సత్కరించింది. (ఇది చదవండి: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ప్రముఖ నటి కూతురు, ఫోటో వైరల్) దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. రామ్ చరమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.' ఇంతటి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పలేను. నాకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రభుదేవా సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్సీ15 షూటింగ్‌కి తిరిగి వచ్చినందుకు చాలా గొప్పగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చెర్రీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా స్పందించింది. స్వీటెస్ట్ వెల్కమ్ అంటూ కామెంట్ చేసింది. కాగా.. ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. కాగా.. మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న RC15 పొలిటికల్ యాక్షన్ డ్రామాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య, జయరామ్, అంజలి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
నాటు నాటు పాటకి జర్మన్ అంబాసిడర్ స్టెప్పులు..వీడియో వైరల్
నాటు నాటు పాట యావత్ దేశాన్ని ఊర్రూతలు ఊగించడమే గాక ప్రపంచ దేశాల ప్రజల చేత కూడా స్పెప్పులు వేయించింది. ఆ పాటకు వచ్చిన క్రేజ్ మాములుగా లేదు. అందుకు తగ్గట్టుగానే రాజమైళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుతో గొప్ప విజయాన్ని దక్కించుకుంది. దీంతో యావత్తు భారతదేశం సంతోషంతో సంబరాలు జరపుకుంది. అంతేగాదు అందులోనూ ఒక తెలుగ సినిమాకు తొలిసారిగా దక్కడం అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకుంది భారత్. ఐతే ఇప్పుడూ పాట దేశ రాయబారుల చేత కూడ స్పెప్పులు వేయిచింది. ఈ మేరకు భారత్‌లోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిఫ్ అకెర్మాన్ ఓల్డ్ ఢిల్లీలోని తన బృందంతో కలిసి డాన్య్లు చేసి ఆ విజయాన్ని వారు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు కూడా.ఆ వీడియోలో జర్మన్ రాయబారి చాందినీ రిక్షాలో దిగుతూ.. ఒక దుకాణదారుని వద్దకు వచ్చాడు. అతను అక్కడ బాగా ఫేమస్ అయిన జిలేబితో పాటు దక్షిణ కొరియ జెండా తోపాటు నాటు నాటు పాట ముద్రించిన లాఠీని అందిస్తాడు. ఆ తర్వాత అకెర్మాన్ తన బృందంతో రహదారిపై నాటు నాటు పాటకు డ్యాన్స్‌లు చేస్తూ కనిపించారు. ఆ వీడియోలో వారిని ఉత్సాహపరిచేలా చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా గుమిగూడారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. జర్మన్లు డ్యాన్సులు చేయలేరనుకుంటున్నారా? అని అన్నారు.పైగా తాను తన ఇండో బృందంతో ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న నాటు నాటు విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐతే అంత పరెఫెక్ట్గా రాలేదు కానీ ఏదో సరదాగా ఇలా చేశాం అని ట్వీట్ చేశారు. అంతేగాదు ఆయన ట్విట్టర్లో మాకు స్ఫూర్తినిచ్చిన భారత్‌లోని కొరియన్ ఎబసీకి ధన్యావాదాలు. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ బృందానికి అభినందనలు. ఐతే ఇప్పుడూ నెక్స్ట్ ఎవరూ? అంటూ ఎంబసీ ఛాలెంజ్ విసురుతుంది. అని అన్నారు. కాగా, ఇంతకు మునుపు కొరియా రాయబారి చాంగ్ జే బోక్ తన సిబ్బందితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఐతే నెటిజన్లు ఈ వీడియను చూసి..వావ్ చాల బాగా చేసింది బృందం అంటూ జర్నన్ రాయబారిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోపై భారత్‌లోని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కూడా స్పందిస్తూ చాలా బాగుందని తెగ మెచ్చుకున్నారు. Germans can't dance? Me & my Indo-German team celebrated #NaatuNaatu’s victory at #Oscar95 in Old Delhi. Ok, far from perfect. But fun! Thanks @rokEmbIndia for inspiring us. Congratulations & welcome back @alwaysRamCharan & @RRRMovie team! #embassychallange is open. Who's next? pic.twitter.com/uthQq9Ez3V — Dr Philipp Ackermann (@AmbAckermann) March 18, 2023 (చదవండి: చైనాతో పరిస్థితి డేంజర్‌గానే ఉంది! జైశంకర్) -
విరాట్ కోహ్లి బయోపిక్‌లో రామ్‌చరణ్..? పోలికలు కూడా దగ్గరగా ఉన్నాయి..!
తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన చెర్రీ.. స్పోర్ట్స్ బయోపిక్‌లో నటించాలని తనకు చాలకాలంగా కోరిక ఉందని అన్నాడు. అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించేందుకు ఇష్టపడతానని తెలిపాడు. క్రీడా జగత్తులో విరాట్ కోహ్లి ఓ అద్భుతమని, అతనిదో స్ఫూర్తిదాయకమైన క్యారెక్టరని పొగడ్తలతో ముంచెత్తిన చరణ్.. కోహ్లి రోల్ ప్లే చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకునేది లేదని తన మనసులోని మాటను బయటపెట్టాడు. లుక్స్ పరంగా కూడా తాను కోహ్లికి దగ్గరగా ఉంటానని, ఇది తనకు అదనపు అడ్వాంటేజ్ అని తెలిపాడు. వెండితెరపై ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలను పోషించి సక్సెస్ సాధించిన చరణ్.. స్పోర్ట్స్ బయోపిక్ చేయాలన్న సాహసోపేతమైన కోరిక కలిగి ఉండటం సినీ జనాలకు ఆకట్టుకుంటుంది. కాంక్లేవ్ సందర్భంగా చరణ్.. ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాటకు స్టెప్పులేసి అలరించాడు. #ViratKohli this is crazy 🕺🕺🕺 He is doing #NaatuNaatu #rrr #RamCharan #jrntr #INDvAUS @imVkohli @ImRo45 @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/2bm6FL6iAT — Telugu Box office (@TCinemaFun) March 17, 2023 ఓ పక్క చరణ్.. కోహ్లి బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టగా, మరో పక్క కోహ్లి.. ఆసీస్‌తో తొలి వన్డే సందర్భంగా మైదానంలో నాటు నాటు పాటకు స్టెప్పులేసి పరోక్షంగా చరణ్ ప్రపోజల్‌కు అంగీకారం తెలిపాడు. కాగా, నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న తర్వాత అమెరికా నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన రామ్ చరణ్.. తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశాడు. చరణ్ పాల్గొన్న కాంక్లేవ్‌లోనే పాల్గొన్న అమిత్ షా.. సదస్సు అనంతరం అదే హోటల్లో బస చేస్తున్న చరణ్ రూమ్ కి వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు గానూ అమిత్‌షా అభినందించి చరణ్‌ను శాలువాతో సత్కరించారు. భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు @KChiruTweets మరియు @AlwaysRamCharan లను కలవడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది. నాటు-నాటు పాటకు ఆస్కార్ మరియు RRR చిత్రం అద్భుత విజయం సాధించినందుకు రాంచరణ్ ను అభినందించారు. pic.twitter.com/eyLWuq3xmM — Amit Shah (@AmitShah) March 17, 2023 అనంతరం ట్వీట్ చేసిన కేంద్రమంత్రి అమిత్ షా భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్ చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ.. భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. -
‘నాటు నాటు సాంగ్ పెడితేనే జెహ్ తింటున్నాడు, అది కూడా తెలుగులోనే’
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విశ్వ వేదికలపై పలు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌నే గెలుచుకుంది. నాటు నాటుకు ఆస్కార్ రావడంతో యావత్ ప్రపంచం ఈ పాటకు ఫిదా అయ్యింది. ఎక్కడ చూసినా నాటు నాటు కాలు కదుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ పాట క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రెటీల వరకు నాటు నాటుకు స్టెప్పులు వేస్తున్నారు. చదవండి: ‘అసహనంతో పుష్ప 2 సెట్ వీడిన రష్మిక!’ బన్నీనే కారణమంటూ ట్వీట్ అంతగా క్రేజ్ సంపాదించుకున్న నాటు నాటు పాట గురించి తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె హోస్ట్ చేస్తున్న ‘వాట్ ఉమెన్ వాంట్’ నాలుగ సీజన్లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఇందులో కరీనా మాట్లాడుతూ ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాట గురించి ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాటు నాటు పాట చరిత్ర సృష్టించిందని, ఇది రెండేళ్ల పిల్లాడి మనసుని సైతం కొల్లగొట్టిందన్నారు. చదవండి: ఓ ఇంటివాడైన చై! నాగార్జున ఇంటికి సమీపంలోనే మకాం? తన చిన్న కుమారుడు జెహ్ నాటు నాటు పాట పెడితే కానీ అన్నం తినడం లేదని, అది కూడా తెలుగులో వినడానికే ఇష్టపడుతున్నాడని చెప్పింది. ‘జెహ్‌కి నాటు నాటు పాట బాగా నచ్చింది. ఆ పాట వచ్చినప్పుడల్లా జెహ్ ఆనందంతో గత్తులు వేస్తున్నాడు. ఆ పాట పెడితే కానీ అన్నం తినడం లేదు. ఆస్కార్ గెలిచిన ఈ పాట.. ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ కరీనా చెప్పుకొచ్చింది. కాగా కరీనా-సైఫ్ దంపతులకు ఇద్దరు కుమారులు అనే విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు పేరు తైమూర్ కాగా చిన్న కుమారుడు పేరు జెహ్. -
Ram Charan: ఢిల్లీలో రామ్‌చరణ్‌కు గ్రాండ్ వెల్కమ్ (ఫొటోలు)
-
నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయడం ఆనందంగా ఉంది : రామ్ చరణ్
-
"నాటు నాటు" స్టెప్పులతో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్లు
RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో యావత్ ప్రపంచానికి ఈ పాట ఫోబియా పట్టుకుంది. ఎక్కడ చూసినా జనాల ఈ పాటకు స్టెప్పులేస్తూ దర్శనిమిస్తున్నారు. సోషల్‌మీడియా మాధ్యమాల్లో అయితే ఈ పాటకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నాటు నాటు పాటకు కాలు కదుపుతున్నారు. తాజాగా ఇద్దరు టీమిండియా మాజీలు కూడా ఈ పాటకు స్టెప్పేసి ఇరగదీశారు. Those are some sweet feet, I tell you what! 😍@IndMaharajasLLC @harbhajan_singh @ImRaina #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/Kv9y1ss6bs — Legends League Cricket (@llct20) March 15, 2023 లెజెండ్ లీగ్ క్రికెట్-2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నాటు నాటు పాటకు చిందేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. సీఎస్కే మాజీ క్రికెటర్లను అభిమానులు రామ్‌చరణ్, తారక్‌లతో పోలుస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహారాజాస్.. సురేశ్ రైనా (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బిస్లా (36), ఇర్ఫాన్ పఠాన్ (25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వరల్డ్ జెయింట్స్ బౌలర్లు బ్రెట్ లీ (3-0-18-3), పోఫు (4-0-22-2), టీనో బెస్ట్ (4-0-27-2) చెలరేగారు. అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ జెయింట్స్.. క్రిస్ గేల్ (46 బంతుల్లో 57; 9 ఫోర్లు, సిక్స్) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్‌కు షేన్ వాట్సన్ (26), సమిత్ పటేల్ (12) సహకరించారు. మహారాజాస్ బౌలర్లలో యుసఫ్ పఠాన్ (4-0-14-2), ప్రవీణ్ తాంబే (4-0-22-1), హర్భజన్ సింగ్ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ జట్టుకు హర్భజన్ సింగ్ నాయకత్వం వహించాడు. గంభీర గైర్హాజరీలో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు. లీగ్‌లో మహారాజాస్ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్‌లో గెలవగా.. వరల్డ్ జెయింట్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 16) వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ తలపడనున్నాయి. -
ఎన్టీఆర్ - రామ్ చరణ్ నాటు నాటు డాన్స్ మళ్ళీ..?
-
‘నాటు నాటు’ కోసం 15 కోట్ల ఖర్చు
-
‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!
‘నాటు నాటు’ తెలుగు పాటకు ఇప్పుడు దిగ్గజ కంపెనీలు ఆడిపాడుతున్నాయి. భారత్ నుంచి ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతోపాటు, ‘ది ఎలిఫెంట్ విష్ఫరర్స్’ చిత్రాల వెంట దిగ్గజ బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. 95వ ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో రెండు భారత్‌ను వరించడం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో యూజర్లను చేరుకునేందుకు కంపెనీలు ఇప్పుడు అవార్డు పొందిన చిత్రాల ఆధారంగా ప్రచార ప్రకటనలు రూపొందించుకుంటున్నాయి. జొమాటో, స్విగ్గీ, డంజో, మీషో, కేఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రెకిట్ బెంకిసర్‌కు చెందిన కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్, గ్లూకోజ్ డ్రింక్ గ్లూకాన్ డీ, మథర్ డెయిరీ, పీఅండ్‌జీకి చెందిన టైడ్ డిటర్జెంట్ ఇప్పటికే వీటి ఆధారంగా ప్రకటనలు, మీమ్స్‌ను రూపొందించాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు, ది ఎలిఫెంట్ విష్ఫరర్స్ సినిమాలను తమ బ్రాండ్ల సందేశాల్లో చూపిస్తున్నాయి. (‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్ ఫీట్‌తో గూగుల్ సెర్చ్‌లో జూమ్) వృద్ధికి ఎన్నో మార్గాలు.. స్విగ్గీ బైక్ ఐకాన్‌ను తీసివేసింది. దీని స్థానంలో ఏనుగును (ఎలిఫెంట్ విష్ఫరర్స్)ను ప్రవేశపెట్టింది. పేటీఎం అయితే.. ‘సే నా టో యూపీఐ ఫెయిల్యూర్స్ విత్ పేటీఎం’ అంటూ ప్రకటన రూపొందించింది. అంటే లావాదేవీల వైఫల్యానికి నో చెప్పండనే సందేశాన్ని నా టో అని గుర్తు చేసింది. ‘గెలుపొందిన అరుపుల గుసగుసలు. నిజంగా గొప్ప రాత్రి’ అని కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్ ప్రకటన విడుదల చేసింది. డంజో మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ మేనేజర్ తన్వీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆస్కార్ కార్యక్రమం సందర్భానుసారం వచ్చే మార్కెట్ అవకాశాల కంటే ఎక్కువని వ్యాఖ్యానించారు. ఇటువంటి తరుణంలో దేశాన్ని గర్వపడేలా చేసిన వారి గురించి సంబరాలు చేసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. Congratulations team RRR for delivering smiles to a billion people! You’ve made all of us proud!#NaatuNaatuSong #Oscars95 #RRR #Oscars2023Live #NaatuNaatuForOscars #Oscars pic.twitter.com/9xpW1HKseD — Dunzo (@DunzoIt) March 13, 2023 ఇన్స్టంట్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన డంజో 3డీ వెర్షన్‌తో ప్రత్యేకమైన హూక్ సెŠట్ప్ వెర్షన్‌ను రూపొందించింది. ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటలో హూక్ స్టెప్స్ చూసే ఉంటారు. వీటిని తన మస్కట్ హర్రితో చేయించి విడుదల చేసింది. కేఎఫ్‌సీ సైతం చికెన్ డిన్నర్‌కు ఆర్ఆర్ఆర్ టైటిల్ జోడిస్తూ పోస్ట్ పెట్టింది. ఇది కేఎఫ్‌సీ ప్రియులతో పాటు, సినీ అభిమానులను చేరుకునే విధంగా ఉంది. A glass of Instant Energy to make you go NAATU NAATU. 🕺🕺#GluconD #InstantEnergy #RRR #NaatuNaatu #Oscars #TasteBhiEnergyBhi #Flavours #Orange #VitaminC pic.twitter.com/TPAIzvxsPM — Glucon-D India (@GluconDIndia) March 13, 2023 #NaatuNaatu and #TheElephantWhisperer just deliveRRRed a 'jumbo' order for 140 crore Indians. #Oscars2023 #Oscars pic.twitter.com/xcmPolutE1 — Meesho (@Meesho_Official) March 13, 2023 -
‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్ ఫీట్‌తో గూగుల్ సెర్చ్‌లో జూమ్
సాక్షి,ముంబై: 95వ అకాడమీ అవార్డ్స్‌లో సత్తాచాటిన సెన్సేషనల్ సాంగ్ నాటు నాటు హవా ఒక రేంజ్లో కొనసాగుతోంది. ఆస్కార్ గెల్చుకున్న ఇండియన్ తొలి సాంగ్‌గా రికార్డును కొట్టేసిన తర్వాత గూగుల్‌లో నెటిజన్లు తెగ వెతికేశారట. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని ఈ సూపర్-హిట్ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ గెల్చుకున్న తరువాత దీనిపై నెటిజన్ల ఆసక్తి 10 రెట్లకు పైగా పెరిగింది. ఫలితంగా నాటు నాటు సూపర్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై సెర్చెస్ 1,105 శాతం పెరిగాయని ఒక నివేదిక బుధవారం వెల్లడించింది. జపనీస్ ఆన్లైన్ క్యాసినో గైడ్ 6తకరకుజీ, గూగుల్ సెర్చ్ ట్రెండ్ డేటాను విశ్లేషించింది. ఇందులో తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే నాటునాటు కోసం ఆన్లైన్లో భారీ క్రేజ్ వచ్చిందనీ, సగటు కంటే 10 రెట్లు శోధనలు పెరిగాయని వెల్లడించింది. టాలీవుడ్ హీరోలు, జూ.ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచింది. నాటు నాటు ఒక హై-టెంపో రిథమ్, డ్యాన్స్ , స్టెప్పులు గ్లోబల్‌గా విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాపులర్ సింగర్స్ లేడీ గాగా , రిహన్న వంటి సంగీత దిగ్గజాల మనసు కూడా దోచుకుందీ పాట. అంతేనా ఈ సాంగ్ టిక్‌టాక్‌లో ప్రముఖ సంచలనంగా మారింది, గత సంవత్సరం మార్చిలో విడుదలైనప్పటి నుండి 52.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సంవత్సరం ఆస్కార్ వేడుకలో ఆర్ఆర్ఆర్మూవీకిసముచిత గౌరవం లభించిందనీ, అవార్డుతో చరిత్ర సృష్టించిదంటూ 6టకరకుజీ ప్రతినిధి ప్రశంసించారు. కాగా 95వ అకాడమీ ఆస్కార్ వేడుకలో, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఎలక్ట్రిఫైయింగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఉర్రూత లూగిపోయారు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో నాటు నాటు ప్రదర్శనకు అపురూపమైన స్టాండింగ్ ఒవేషన్‌తో పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. -
అలా అస్సలు ఊహించలేదు.. కన్నీళ్లు వచ్చేశాయి: ప్రేమ్ రక్షిత్
తాను కొరియోగ్రఫీ చేసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించడం ఆనందంగా ఉందని కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అన్నారు. ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఆయన..తాజాగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆస్కార్ వేడుకలకు వెళ్తానని అస్సలు ఊహించలేదన్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ సపోర్ట్‌తోనే తాను లాస్ ఏంజెల్స్ వెళ్లగలిగానన్నారు. ‘లాస్ ఏంజెల్స్ వెళ్లగానే నాటు నాటు రిహార్సల్స్‌లో పాల్గొన్నాను. ఆస్కార్ వేడుకల్లో స్టేజ్‌పై ఆ పాట ప్రదర్శన పూర్తయిన వెంటనే అక్కడున్న వారంతా లేచి నిల్చొని చప్పట్లు కొట్టారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. అవార్డు తీసుకున్న తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను’అని ప్రేమ్ రక్షిత్ అన్నారు. కాగా, ఈనెల 12న (భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలు)లాజ్ ఏంజిల్‌లో జరిగిన 95వ ఆస్కార్ ప్రదానోత్సవంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు(ఆర్ఆర్ఆర్)’ పాటకు అస్కార్ లభించింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆస్కార్ పై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్
-
తెలుగు రచయిత చంద్రబోస్ తో సాక్షి ఎన్నారై ముఖాముఖీ
-
ఆస్కార్ విజేతలకు పార్లమెంట్ జేజేలు
న్యూఢిల్లీ: విశ్వ వేదికపై తెలుగు బావుటా ఎగరేసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డులు సాధించినందుకు పార్లమెంట్ జేజేలు పలికింది. భారతీయ సినిమా ఖ్యాతికి ఈ విజయాలు మరింతగా వన్నెతెచ్చాయంటూ మంగళవారం రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రస్తుతించారు. ‘‘ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఇద్దరు మహిళల ఉత్కృష్ట పనితనాన్ని ఎలుగెత్తి చాటింది. భారతీయ మహిళలకు అంతర్జాతీయంగా దక్కిన అపురూప గౌరవమిది’’ అని రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ రచయిత వి.విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడేనని గుర్తుచేశారు. సభలో నవ్వులు పూయించిన ఖర్గే రెండు దక్షిణాది సినిమాలు ఆస్కార్ దక్కడం గర్వించాల్సిన గొప్ప విషయమని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా బీజేపీనుద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ‘అధికార పార్టీని నేను కోరేదొక్కటే. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది, పాట రాసింది మేమేనంటూ మోదీజీ గానీ, బీజేపీ సర్కార్ గానీ ఆస్కార్ ఘనతను తమ ఖాతాలో వేసుకోవద్దు. ఇది దేశం సాధించిన ఘనత’ అన్నారు. దాంతో సభ్యులు బిగ్గరగా నవ్వేశారు. ఆస్కార్ గెలిచిన దేశ ప్రతినిధుల గురించి పార్లమెంట్లో చర్చించడం ఆనందంగా ఉందని మాజీ నటి, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ అన్నారు. -
యూఎస్‌లో ఆస్కార్ ‘నాటు’ సంబురాలు (ఫొటోలు)
-
యూఎస్‌లో నాటు నాటు ఫీవర్.. ఈజీ కాదమ్మా.. స్టెప్పులు వేయలేక పోలీసుల తిప్పలు!
వాషింగ్టన్: లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా 95వ ఆస్కార్ ప్రదానోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సారి వేడుకలో చరిత్రను తిరగరాస్తూ భారత్ రెండు ఆస్కార్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా హాలీవుడ్ పాటలను సైతం వెనక్కి నెట్టి అవార్డును ఎగరేసుకుపోగా.. బెస్ట్ డ్యాకుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ’ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ ఆస్కార్‌ను కూడా నీటుగా దక్కించుకుంది. సంచలనంగా మారి ఈ పాటకు తాజాగా యూఎస్ పోలీసులు చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నాటు నాటు .. ఎక్కడ చూసిన ఇదే ఏ ముహార్తాన ‘నాటు నాటు’ పాట విడుదలైందో గానీ ప్రపంచవ్యాప్తంగా అందరి చేత స్టెప్పులు వేయిస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కూడా తన బుట్టలో వేసుకుంది. తాజాగా ఓ వీడియోలో.. హోలీ జరపుకుంటుండగా ఇద్దరు పోలీసులు నాటు నాటు స్టెప్పులు వేసేందుకు ఇబ్బందులు పడుతుంటారు. వారు ఎంత ప్రయత్నించినా డ్యాన్స్ వేయలేకపోతుంటారు. ఇంతలో ఓ వ్యక్తి పోలీసుల దగ్గరకు వచ్చి ఎలా వేయాలో నేర్పుతుంటాడు. ఆ వ్యక్తి పోలీసుల భుజాలపై చేతులు వేసి బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఈ స్టెప్ని వేసి చూపిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నాటు నాటు స్టెప్పులు అంత ఈజీ కాదమ్మా అని కామెంట్లు పెడుతున్నారు. #California cops are enjoying the the #NaatuNaatu song.🙌🙌🤙🤙 Naatu naatu is everywhere #RamCharan #NTR #RRRMovie #SSRajamouli #RRRForOscars #RRR #GlobalStarRamCharan #NTRGoesGlobal #Oscars #Oscars2023 #letsdance pic.twitter.com/rjRQMrjoTs — nenavath Jagan (@Nenavat_Jagan) March 11, 2023 -
Oscar Naatu Naatu: రాహుల్.. ధూల్‌పేట్ నుంచి లాస్ ఎంజిల్స్ వరకు(అరుదైన ఫోటోలు)
-
Oscar Naatu Naatu: నాటునాటు ప్రేమ్‌రక్షిత్.. నాటి నుంచి నేటివరకు (అరుదైన ఫోటోలు)
-
Natu Natu: 17 రోజుల కష్టం.. రూ.15 కోట్ల బడ్జెట్.. ఆస్కార్ ఊరికే రాలేదు..
‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భవన ప్రాంగణంలో ఈ పాటను షూట్ చేశారు. పక్కనే పార్లమెంట్ భవనం కూడా ఉంది. అయితే ఇలాంటి ప్రదేశంలో ఓ సినిమా షూటింగ్ అంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జెలెన్స్కీ ఒకప్పుడు టెలివిజన్ యాక్టర్ అట. సో.. ఆర్ట్ గురించి ఆయనకు అవగాహన ఉండటంతో పాటను చిత్రీకరించేందుకు అనుమతి ఇచ్చారు. ‘నాటు నాటు..’ పాటను 17 రోజుల పాటు షూట్ చేశారు. సెట్స్‌లో ప్రతి రోజూ 150మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 200మంది సాంకేతిక నిపుణులు ఈ పాట కోసం లొకేషన్లో హాజరయ్యారు. ఇక ఈ పాటలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ‘హుక్ స్టెప్’ గురించి. దాదాపు 80 రకాల స్టెప్స్‌ను కంపోజ్ చేశాక ఈ పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అండ్ టీమ్ ఆ స్టెప్‌ను ఫైనలైజ్ చేశారు. ఈ స్టెప్ కూడా ఊరికే పూర్తి కాలేదు. డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు 18 టేక్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య సింక్ రావడానికి ఎక్కువ సమయం పట్టిందట. ఇలా వీరందరి కష్టం ఇప్పడు ఆస్కార్ అవార్డు రూపంలో ఫలించింది. అలాగే ఈ పాట కోసం దాదాపు రూ. 15 కోట్లు అయింది. నిజానికి ఈ పాటను ముందుగా ఇండియాలోనే షూట్ చేయాలనుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట లొకేషన్‌ను అనుకున్నారు. కానీ ఆ సమయానికి వర్షాకాలం కావడంతో ఇతర దేశాల్లో తీయాలనుకున్నారు రాజమౌళి. సెట్ అయితే సహజంగా ఉండదని భావించారు. ఆ సమయంలోనే జెలెన్స్కీ భవనం లొకేషన్ రాజమౌళి కంట పడింది. అక్కడే పాటను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ అనుమతులు దొరకవని అనుకున్నారు. అయితే ఉక్రెయిన్ టీమ్ వల్ల అది సాధ్యమైంది. అలాగే పాట సమయంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు సైడ్ డ్యాన్సర్స్‌కు కూడా రెండు, మూడు కాస్ట్యూమ్స్‌ను రెడీగా ఉంచారు. ఎందుకంటే సాంగ్‌ను దుమ్ములో తీశారు. కాస్ట్యూమ్స్ పాడైతే షూటింగ్ లేట్ అవుతుందని. ఈ సినిమాకు రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైన దేశం. ‘ఆర్ఆర్ఆర్’లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్ తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు భారతీయులకు పూర్తి నమ్మకం కలిగింది. – ఎన్టీఆర్ మనం గెలిచాం. మన ఇండియా సినిమా గెలిచింది. యావత్ దేశమే గెలిచింది. ఆస్కార్‌ను ఇంటికి తెచ్చేస్తున్నాం. మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ‘ఆర్ఆర్ఆర్’ ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేనింకా కలలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. రాజమౌళి, కీరవాణిగార్లు భారత చలనచిత్రపరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ఈ అద్భుత కళాఖండంలో నన్ను భాగం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు..’ అనేది ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి రూపమిచ్చిన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్‌రక్షిత్‌లకు థ్యాంక్స్. నా బ్రదర్ ఎన్టీఆర్, కో స్టార్ ఆలియాభట్‌కు «థ్యాంక్స్. తారక్.. కుదిరితే నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులు సృష్టించాలనుంది. ఈ అవార్డు భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులందరి సొంతం. నా భార్య (ఉపాసన)కు ఆరో నెల. మా బేబీయే మాకీ అదృష్టాన్ని తెచ్చిందనుకుంటున్నాను. – రామ్‌చరణ్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ..
‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా...’ పాటలో దమ్ముంటే లోకం పాడుతుంది.. ఆడుతుంది.. ఆ పాట విశ్వ విజేత అవుతుంది. ‘నాటు నాటు...’ అందుకో ఉదాహరణ. క్లాస్, మాస్ తేడా లేకుండా నాటు బీటు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగు పరిశ్రమ తొలి ఆస్కార్ ఆనందాన్ని చవి చూసేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, డాల్బీ థియేటర్లో ఇతరుల కరతాళ ధ్వనుల మధ్య చిత్రసంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్‌ని అందుకున్నారు. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ 95వ ఆస్కార్ అవార్డు విశేషాలు తెలుసుకుందాం... అంతర్జాతీయ వేదికపై తెలుగోడి ‘నాటు నాటు’ మారుమోగిపోయింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులు అదిరిపోయాయి. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దాదాపు 80 పాటలను పరిశీలించి 15 పాటలను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు కోసం షార్ట్‌లిస్ట్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్‌తో ‘నాటు నాటు..’ విదేశీయులకు కూడా మరింత చేరువైంది. ఈ క్రమంలోనే జనవరి 24న వెల్లడైన ఆస్కార్ నామినేషన్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు..’కు చోటు దక్కింది. ‘ నాటు నాటు’ పాటతో పాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ చిత్రంలోని ‘అప్లాజ్’, ‘బ్లాక్‌పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’లోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలు బరిలో నిలిచాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని తెలుగు ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును తెచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఇలా దేశానికి ఆస్కార్ తెచ్చిన తొలి చిత్రంగా, తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది (గతంలో కొందరు భారతీయులు, ఇండో–అమెరికన్స్ ఆస్కార్ అవార్డులు సాధించినప్పటికీ అవి భారతీయ చిత్రాలు కావు). ఒక ఏషియన్ చిత్రం (ఆర్ఆర్ఆర్) నుంచి ఓ పాటకు (నాటు నాటు) అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే నాన్–ఇంగ్లిష్ పాటల్లో ఆస్కార్ అవార్డు సాధించిన నాలుగో పాటగా ‘నాటు నాటు’ నిలిచింది. ఇక ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు వ్యక్తులుగా కీరవాణి, చంద్రబోస్ రికార్డు సృష్టించారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెండో భారతీయుడుగా కీరవాణి, రెండో గీత రచయితగా చంద్రబోస్ నిలిచారు. 2009లో జరిగిన 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఇంగ్లిష్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఏఆర్ రెహమాన్, రచయిత గుల్జార్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ప్రకటించిన మొత్తం 23 విభాగాల జాబితాల్లోకి వస్తే... ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ ఒరిజినల్‌సాంగ్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’(మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్) ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయ నటి: జామి లీ కర్టిస్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: రూథ్ కార్టర్(బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్) ఉత్తమ స్క్రీన్ ప్లే: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్) ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్ (జర్మనీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవాల్నీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2) బెస్ట్ సౌండ్: టాప్‌గన్: మ్యావరిక్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: ది వేల్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిస్ గుడ్ బై యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ది హార్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్) బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) హోస్ట్ జిమ్మిపై నెటిజన్ల ఆగ్రహం ఆస్కార్ వేడుక ప్రారంభంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావన వచ్చినప్పుడు హోస్ట్ జిమ్మి ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ మూవీ అన్నట్లుగా చెప్పారు. దీంతో నెటిజన్లు జిమ్మి కిమ్మెల్ను తప్పుపడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా అని గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆస్కార్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు హోస్ట్ అయిన జిమ్మీ బాలీవుడ్ మూవీ అనడం సరికాదని çపలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శించారు. డు యూ నో నాటు? ‘నాటు నాటు’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్కక్కర్లేదు. కానీ ఆస్కార్ వేదికపై ‘డు యూ నో నాటు?.. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు’.. అంటూ దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కి ఓ ప్రెజెంటర్‌గా వెళ్లిన దీపికా పదుకోన్ ‘నాటు నాటు’ పాటను పరిచయం చేశారు. వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ పాటను పాడగా, వెస్ట్రన్ డ్యాన్సర్స్ కాలు కదిపారు. ఈ వేడుకలో వీక్షకుల్లో ‘నాటు నాటు..’ పాట ఎంత జోష్ నింపిందంటే.. పాట పూర్తయ్యాక అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
RRR Naatu Naatu Oscars 2023: చెయ్యెత్తి జైకొట్టిన ఆస్కార్
అనుకున్నదే అయింది. ఆశించినది దక్కింది. ప్రతిష్ఠాత్మక అకాడెమీ అవార్డుల (ఆస్కార్) విశ్వ వేదికపై భారతీయ సినిమా వెలుగులీనింది. తెలుగు సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ తొలిసారిగా మన వెండితెరకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో కీర్తి కిరీటధారణ చేసింది. హాలీవుడ్లో సినీ శిఖరమని భావించే ఆస్కార్‌ను పూర్తి స్వదేశీ నిర్మాణంతో అందుకోవాలన్న భారతీయ సినిమా దీర్ఘకాల స్వప్నం నెరవేరింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గానూ మన దక్షిణ భారతీయురాలు అనాథ ఏనుగు సంరక్షణపై తమిళనాట తీసిన చిత్రమే (కార్తికీ గొంజాల్వెజ్ తొలియత్నం ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’) ఆస్కార్ సాధించింది. వెరసి కమర్షియల్ సినిమానే కాదు, కదిలించే డాక్యుమెంటరీతోనూ విదేశా లతో పోటీపడగలమని ఒకటికి రెండు ఆస్కార్ ప్రతిమల సాక్షిగా 95వ అకాడెమీ అవార్డుల ప్రకటన నిరూపించింది. ప్రధానంగా అమెరికన్ల వ్యవహారమైన ఆస్కార్ కోటలో మన సినిమా పాగావేసింది. రెండు విభిన్న పార్శా్వలకు ప్రతీకగా, మూడు విభాగాల్లో ఆస్కార్ తుది జాబితాకు నామినేటై, అందులో ఏకంగా రెండింటిలో పురస్కార విజేతగా నిలవడం భారతీయ సినిమా కనివిని ఎరుగని విషయం. ఇది యావద్భారత సినీ ప్రపంచం రొమ్ము విరుచుకొనే సమయం. శతాధిక వసంత భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షర లిఖిత సందర్భం. స్వాతంత్య్రం సిద్ధించే నాటికి వివిధ భాషల్లో ఏటా 283 ఫీచర్ ఫిల్మ్స్ తీస్తున్న మన భారతీయ చిత్ర పరిశ్రమ ఇవాళ ఏటా 2 వేల సినిమాలకి ఎదిగింది. మూకీల రోజుల్లోనే విదేశాలకు వెళ్ళిన మన సినిమాకు ఉత్తమ విదేశీ చిత్ర విభాగమంటూ 1956లో కొత్త కేటగిరీ పెట్టినప్పటి నుంచి గత 67 వత్సరాలుగా ఆస్కార్ అందని ద్రాక్షపండే. ఇన్నేళ్ళలో మన సినిమాలు మూడే తుది జాబితా దాకా వెళ్ళినా, ఒక్క ఓటుతో అవార్డు మిస్సయిన మదర్ ఇండియా (1957), ఆ తర్వాత మీరా నాయర్ ‘సలామ్ బాంబే’ (1988), ఆమిర్‌ఖాన్ ‘లగాన్’ (2001)– ఏవీ అవార్డు తేలేకపోయాయి. ఇప్పటికి వేరే కేటగిరీలోనైతేనేం ఆ కోరిక తీరింది. ఆస్కార్ మనకు మరీ కొత్త కాదు. విదేశీయులు తీసిన చిత్రాల్లో మనం ఆస్కార్ అందుకోవడం అటెన్‌బరో ‘గాంధీ’ (1982) నుంచి ఉంది. ‘ప్యాసా’, ‘ఆమ్రపాలి’, ‘గైడ్’లకు పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ స్వర్గీయ భానూ అతయ్యా ‘గాంధీ’తో తొలి భారతీయ ఆస్కార్ విజేతయ్యారు. ఆ పైన గౌరవంగా ఇచ్చే జీవన సాఫల్య పురస్కారాన్ని దిగ్దర్శకుడు సత్యజిత్ రాయ్ (1991) అందుకున్నారు. ఇక, భారత్‌లోని పట్టణ ప్రాంత పేదరికంపై విదేశీయులు తీసిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2008) సంగీత దిగ్గజం రెహమాన్‌కు రెండు (బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్) ఆస్కార్లు తెచ్చింది. పాటకు రెహమాన్‌తో కలసి గీత రచయిత గుల్జార్ గౌరవం పంచుకున్నారు. అదే చిత్రంలో బెస్ట్ సౌండ్ మిక్సింగ్‌కు మరో ఇద్దరితో కలసి రసూల్ పూకుట్టి విజేతగా నిలిచారు. షార్ట్ ఫిల్మ్లకొస్తే – ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో తీయగా 2018లో ఆస్కార్ గెలిచిన షార్ట్ ఫిల్మ్ ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్’కు నిర్మాతల్లో ఒకరు భారతీయ వనిత గునీత్ మోంగా. అయితే, దర్శకురాలు విదేశీయురాలు. ఇలా ఇప్పటిదాకా అన్నీ విదేశీ భాగస్వామ్యంలో మనవాళ్ళు ఎగరేసిన జెండాలు. తొలిసారి పూర్తి స్వదేశీ దర్శక, నిర్మాణాలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘ఎలిఫెంట్’ రెండూ ఆస్కార్లు తేవడం మరువలేని ఘనత. బ్రిటీషు పాలనా కాలపు నేపథ్యంలో వేర్వేరు కాలఘట్టాలకు చెందిన పోరాటయోధుడు అల్లూరి, ఆదివాసీ ముద్దుబిడ్డ కొమురం భీమ్ కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథ ‘ఆర్ఆర్ఆర్’ తెరపై సినిమాటిక్ భావోద్వేగాలకు పరాకాష్ఠ. అసలు చరితను సైతం ఆలోచింప జేయనివ్వని రాజమౌళీంద్రజాలం. కీరవాణి బాణీలో నృత్యప్రధాన గీతం ‘నాటు నాటు’ దేశదేశాల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. దానికి చంద్రబోస్ కూర్చిన తేటతెలుగు మాటలు, ప్రేమ్ రక్షిత్ సమకూర్చిన స్టెప్పులు, రెండు నెలల కఠోరసాధన– 20 రోజుల షూటింగ్‌తో జూనియర్ ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌ల సమన్వయ నృత్య విన్యాసం – అన్నీ కలిసొచ్చాయి. ఆస్కార్ విజేతల్ని నిర్ణయించే 9 వేల పైచిలుకు సభ్యుల్నీ ఊపేశాయి. భారతదేశం తరఫున ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో అధికారిక ఎంట్రీగా గుజరాతీ ‘ఛెల్లో షో’ వెళ్ళినా, అది తుదిపోరు దాకా చేరుకోనే లేదు. ఆ మాట కొస్తే, గత 21 ఏళ్ళలో ఏ ఇతర భారతీయ ఎంట్రీ తుది 5 చిత్రాల జాబితాలో నిలవలేదు. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ అమెరికన్ డిస్ట్రిబ్యూ టర్ వేరియన్స్ ఫిల్మ్స్– రాజమౌళి బృందం పట్టుదలగా ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’ క్యాంపెయిన్‌లో 14 కేటగిరీల్లో సినిమాను ప్రమోట్‌చేసింది. ప్రచారమూల్యం మాటెలా ఉన్నా, చివరకు ఒక కేటగిరీలో ఆస్కార్ కల నిజమైంది. తుది జాబితా నాటికే ‘నాటు నాటు’పై పెరిగిన అంచనాలు ఫలించాయి. పాపులర్ హాలీవుడ్ ఎంట్రీలను పక్కకు నెట్టి మరీ మన ‘నాటు నాటు’ ఈ ఘనత సాధించింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌లూ వరించేసరికి తెలుగు పాటకు విశ్వకీర్తి దక్కింది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ ఈ చారిత్రక ఫ్యాంటసీకి, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ వారి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ రాజమౌళికీ దక్కాయి. ఇంతకన్నా గొప్ప పాటలు, సినిమాలొచ్చాయన్న కొందరి సన్నాయి నొక్కులు సినిమా జోరు, అవార్డుల హోరులో కలసిపోయాయి. ‘ఈ నక్కలవేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పద’ అని ఈ చిత్రంలో ఓ హీరో డైలాగ్. అవును. రాజమౌళి బృందం ఇప్పుడుఅంతర్జాతీయ అవార్డుల కుంభస్థలాన్ని బద్దలుకొట్టింది. పక్కా ప్రణాళికతో అడుగేస్తే అసాధ్యమే లేదని మన ఫిల్మ్ మేకర్స్‌లో నమ్మకం కలిగించింది. వ్యాపారంలోనూ, వ్యవహారంలోనూ కొత్త తలు పులు తెరిచి, కొత్త ఎత్తులు చూపిన మన సినిమాకు స్వాగతం. అందుకు ఇది ఓ శుభారంభం. -
'నాటునాటు'కు ఆస్కార్ రావడంపై స్పందించిన తమ్మారెడ్డి
-
తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వంగా ఉంది: తమ్మారెడ్డి
టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంటే తెలుగువాళ్లై ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని తమ్మారెడ్డిపై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. హాలీవుడ్ పాటలను తలదన్ని నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి యావత్ సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ స్పందన కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా నాటునాటు పాటకు ఆస్కార్ రావడంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. 'మన తెలుగు పాటకు ఆస్కార్ రావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నాకే కాదు, ప్రతి భారతీయుడు, సినిమాను ప్రేమించే వాళ్లకు ఇది గర్వకారణం. తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని ఇప్పటికీ తమ సినిమాల్లో పొందుపరుస్తున్న అతికొద్దిమందిలో కీరవాణి, చంద్రబోస్ ఒకరు. వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాటునాటు పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంకి నా అభినందలు తెలియజేస్తున్నాను' అంటూ తమ్మారెడ్డి పేర్కొన్నారు. -
రూ.50 వేల కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇప్పుడు ఆస్కార్ అందుకున్నాడు
అందరూ ఊహించనట్టే ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చింది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో తొలిసారి ఇండియన్ మూవీకి ఆస్కార్ రావడం..అదీ అచ్చ తెలుగు పాట కావడం నిజంగా మనందరికి ఎంతో గర్వకారణం. సినిమాలో నాలుగున్నర నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ఈ పాట కోసం చంద్రబోస్ కొన్ని నెలల పాటు కష్టపడి సాహిత్యం అందించగా.. కీరవాణి అదిరిపోయే సంగీతం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అద్భుతంగా ఆలపించారు. అయితే ఈ పాట ఆస్కార్ స్థాయికి వెళ్లడం వెనక ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ కూడా కీలక పాత్ర వహించింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు అదిరిపోయే స్టెప్పులు వేయడం వల్లే ఈ పాట మరింత ఫేమస్ అయింది. ఇద్దరి స్టార్ హీరోలతో అలాంటి స్టెప్పులు వేయించిన ప్రేమ్ రక్షిత్ గురించి ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఓ గొప్ప కొరియోగ్రాఫర్. కానీ ఒకప్పుడు మాత్రం టైలర్ షాపులో పనివాడు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరాడు. ప్రేమ్ రక్షిత్ తండ్రి ఒక వజ్రాల వ్యాపారి. 1993లో కుటుంబ విబేధాల కారణంగా ఆయన ఆస్తులు పోయాయి. వ్యాపారం మానేసి సినిమాల్లో డాన్స్ అసిస్టెంట్ గా మారారు. ఆ సమయంలో ప్రేమ్ రక్షిత్‌ని టైలర్ షాప్‌లో పని చేశాడట. డ్యాన్స్‌పై ఇంట్రస్ట్ ఉండడంతో సినిమా ప్రయత్నాలు చేశాడు. టైలర్ షాపులో పని చేస్తూనే.. కొరియోగ్రఫీగా ట్రై చేశాడు. కానీ ఎలాంటి అవకాశాలు రాలేదు. మరోవైపు అప్పులు పెరిగిపోయాయి. దీంతో కుటుంబాన్ని పోషించడం తన వల్ల కాదని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. తాను చనిపోతే డ్యాన్స్ ఫెడరేషన్ వాళ్ళు తన కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తారనీ.. దానితో కుటుంబానికి కొన్ని ఇబ్బందులైనా తగ్గుతాయని అతని ఆలోచన. ఒకరోజు పక్కింటి వారి నుంచి సైకిల్ అరువు తెచ్చుకొని మెరీనా బీచ్‌కు వెళ్లాడు. అక్కడే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. తాను చనిపోతే సైకిల్ ఓనర్ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడని భావించి.. అది ఇచ్చేసి వచ్చి చనిపోవాలనుకున్నాడట. అలా ఇంటికి వెళ్లగానే.. సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చిందని తండ్రి చెప్పాడట. దాంతో తన కష్టాలు తీరిపోయాయని.. ప్రేమ్ ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాడట. ఆ ఒక్క క్షణం నా జీవితాన్నే మార్చేసిందని ఓ ఇంటర్వ్యూలో ప్రేమ్ రక్షిత్ పేర్కొన్నారు. -
రామ్ చరణ్ ట్వీట్.. మరో 'నాటు నాటు' పక్కా..!
ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది. తెలుగువారి పేరును ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా భారత సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమాలో అవకాశమిచ్చిన రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఓ లెటర్‌ను తన ట్వీట్లో పంచుకున్నారు. అయితే అందులో రామ్ చరణ్ రాసిన ఓ లైన్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఎందుకంటే అందులో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కో- స్టార్, బ్రదర్ తారక్ నీకు ధన్యవాదాలు.. నీతో మరోసారి డ్యాన్స్ చేసి మళ్లీ రికార్డులు సృష్టించాలనుకుంటున్నా' అంటూ నోట్లో రాశారు. దీంతో ఆర్ఆర్ఆర్-2లో మరో నాటు నాటు పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. మరోసారి ఎన్టీఆర్- చెర్రీ స్క్రీన్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టడం కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్-2 ఉంటుందని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ అభిమానులు మరోసారి చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్- 2 పట్టాలెక్కుతుందేమో వేచి చూడాల్సిందే. We have won!! We have won as Indian Cinema!! We won as a country!! The Oscar Award is coming home!@ssrajamouli @mmkeeravaani @tarak9999 @boselyricist @DOPSenthilKumar @Rahulsipligunj @kaalabhairava7 #PremRakshith @ssk1122 pic.twitter.com/x8ZYtpOTDN — Ram Charan (@AlwaysRamCharan) March 13, 2023 -
Oscars 2023 Photos: అపురూప క్షణాలు.. అవార్డు ఫంక్షన్లో మెరిసిన తారక్-రామ్‌చరణ్ ( ఫొటోలు)
-
ఓ పక్క నాటు నాటు పాటకు అందలం.. మరో పక్క నీటు నీటు ఆటకు..!
మార్చి 13, 2023.. భారతీయులకు చిరకాలం గుర్తుండి పోయే రోజు ఇది. విశ్వవేదికపై ఈ రోజు రెండు విషయాల్లో భారత కీర్తి పతాకం రెపరెపలాడింది. భారతీయ చిత్ర గీతానికి, మరి ముఖ్యంగా తెలుగు పాట "నాటు.. నాటు (ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలోని పాట)"కు ఈ రోజున ప్రతిష్టాత్మక ఆస్కార్ (అకాడమీ) అవార్డు దక్కగా.. ఇదే రోజున భారత క్రికెట్ జట్టు వరుసగా రెండో సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరింది. Back-to-back WTC finals for India 🕺 🕺 pic.twitter.com/8f7EpVUrpW— ESPNcricinfo (@ESPNcricinfo) March 13, 2023 సినిమా, క్రీడా రంగానికి సంబంధించి మరపురానిదిగా మిగిలిపోయే ఈ రోజున యావత్ భారతావణి సంబురాలు చేసుకుంటుంది. ముఖ్యంగా సినిమా అభిమానులు, అందులోనూ తెలుగువారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. నాటు.. నాటు పాట ఆస్కార్ గెలవడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. RRR టీమ్‌కు యావత్ సినీ జగత్తు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిత్ర దర్శకుడు రాజమౌళి, కథానాయకులు రామ్‌చరణ్, తారక్‌లతో పాటు నాటు.. నాటుకు బాణీలు సమకూర్చిన ఎంఎం కీరవాణికి, సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్‌కు, గాత్రాన్ని అందించిన కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లకు, కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్‌లపై విశ్వవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాటు నాటు పాటకు సగం జీవం పోసింది సంగీతమైతే.. చరణ్, తారక్‌లు తమ అత్యుత్తమ నృత్య ప్రావీణ్యంతో ఈ పాటకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారని అభామానులు జేజేలు పలుకుతున్నారు. మరోవైపు భారత్ క్రికెట్ జట్టుకు, విశ్వవ్యాప్తంగా ఉన్న టీమిండియా ఫాలోవర్స్‌కు కూడా ఈ రోజు చిరకాలం గుర్తుండి పోతుంది. భారత క్రికెట్ జట్టు వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో (2021-23) ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ఆసీస్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత్.. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించడంతో టీమిండియా దర్జాగా ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్ రేసులో భారత్‌తో పోటీ పడిన శ్రీలంకను న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్ (121 నాటౌట్) సూపర్ శతకంతో దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి భారత్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేయాలనుకున్న లంకేయుల ఆశలపై కేన్ మామ నీళ్లు చల్లాడు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు. -
బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా
ధూల్ పేట్లో పుట్టిన కుర్రాడు.. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఉన్న ఇష్టంతో గిన్నెలపై గరిటెలతో వాయిస్తూ సాంగ్స్ పాడేవాడు. అతని టాలెంట్‌ను గుర్తించిన తండ్రి కుమారుడికి సంగీతం నేర్పించాలని ఓ గజల్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకున్న ఆ కుర్రాడు చిన్న చిన్న సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గా మారాడు. అలా ఓ వైపు సంగీతంలో ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్ షాప్‌లో పనిచేశాడు. తన సింగింగ్ టాలెంట్‌తో శ్రోతలను మైమరిపించేవాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా మొదలైన అతని ప్రయాణం ఈరోజు ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా ఎదిగాడు.. అతడే రాహుల్ సిప్లిగంజ్. ధూల్ పేట్ టూ లాస్ ఎంజిల్స్ వరకు సాగిన అతడి ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. గల్లీ బాయ్ పేరుకు తగ్గట్లుగానే వివాదాలు అతనితో ముడిపడి ఉన్నాయి. ఆనాటి నుంచి ఇప్పుటిదాకా సాగిన రాహుల్ విజయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. రాహుల్ సిప్లిగంజ్ బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలో అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు చేరుకున్నాడు. 1989 ఆగష్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో జన్మించిన రాహుల్‌కు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేదట. స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలపై కర్రలతో వాయిస్తూ ఫోక్సాంగ్స్ పాడేవాడట. ఇది గమనించిన రాహుల్ తండ్రి, ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్ లో సాయం చేసేవాడు. సుమారు 7 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొని గజల్స్‌పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే కోరస్ పాడే అవకాశాలు తలుపుతట్టాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్‌లో ‘కాలేజీ బుల్లోడా’ అనే సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో.. అప్పటి వరకు తను పాడిన పాటలన్ని ఒక సీడీ చేసుకొని, దాని తీసుకోని వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడట.రాహుల్ ప్రతిభను చూసిన కీరవాణి అతనికి దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ అనే టైటిల్ సాంగ్ ను పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘ఈగ’లో ఈగ ఈగ ఈగ, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు ఇలా పలు సినిమాల్లో సింగర్‌గా రాహుల్ అవకాశాలు దక్కించుకున్నాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. మంగమ్మ,పూర్ బాయ్, మాకి కిరికిర', 'గల్లీ కా గణేష్', 'దావత్'.. ఇలా హైదరాబాదీ సంస్కృతి, సంప్రదాయాలకు తన జోష్ మిక్స్ చేసి రాహుల్ పాటలు కంపోజ్ చేశాడు. ఇదిలా ఉంటే 2019లో తెలుగు బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొనడంతో రాహుల్ దశ తిరిగిందని చెప్పొచ్చు. పునర్నవితో లవ్‌ట్రాక్, తన పాటలు, ఎనర్జీ, శ్రీముఖితో గొడవలు ఇలా ఒకటేమిటి అన్ని షేడ్స్ చూపించి యూత్‌లో మాంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ సీజన్ విన్నర్‌గా బయటకు వచ్చి తన జర్నీని మరింత ముందుకు తీసుకుళ్లాడు. గల్లీబాయ్ పేరుకు తగ్గట్లేగానే రాహుల్ పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన కొన్ని వారాలకే ఓ పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్‌పై బీరు సీసీలతో దాడి చేసిన సంఘటన అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎమ్మెల్యే బంధువులపై రాహుల్, అతని స్నేహితులకు మధ్య జరిగిన గొడవలో బీరుసీసాలతో గొడవ, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వరకు వెళ్లింది. కట్‌చేస్తే.. కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్ వాడారనే సమాచారంతో అర్థరాత్రి పోలీసులు జరిపిన రైడ్‌లో రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 150మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకోగా పలువురు సెలబ్రిటీలతో పాటు రాహుల్ కూడా విచారణను ఎదుర్కున్నాడు. ఇలా వివాదాలతో సావాసం చేసిన రాహుల్ తనను విమర్శించినవాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా చేశాడు. విశ్వవేదికపై తెలుగోడి సత్తా సగర్వంగా నిరూపించాడు. ఆర్ఆర్ఆర్లోని రాహుల్ పాడిన నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆ బస్తీ పోరడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. -
నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని కొనియాడారు. 'ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది. తెలుగులోని మట్టివాసనలను చంద్రబోస్ వెలుగులోకి తెచ్చారు. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు.' అని కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు కొల్లగొట్టింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. దీంతో దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశం గర్వించదగ్గ సినిమా ఇది అని కొనియాడుతున్నారు. చదవండి: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి -
ఆస్కార్ విజయంపై చంద్రబోస్ భార్య ఎమోషనల్
-
Oscars 2023: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సీఎం జగన్ అభినందనలు
తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ‘ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది. గ్లోబల్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసిన పాట ఇది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది. ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సహకాన్ని ఇచ్చింది’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, భారత్ నుంచి మూడు విభాగాల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌కు నామినేషన్స్ దక్కాయి. వీటీలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగం నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకున్నాయి. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’కు నిరాశ ఎదురైంది. The #Telugu flag is flying higher! I’m filled with pride on a Telugu song, that so beautifully celebrates our folk heritage, being given its due recognition internationally today. @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and @mmkeeravaani have truly redefined excellence! 1/2 https://t.co/jp75mpiZHv — YS Jagan Mohan Reddy (@ysjagan) March 13, 2023 -
ఆస్కార్ అవార్డు గెల్చిన నాటు నాటు సాంగ్...ఆనందంతో గంతులేసిన రాజమౌళి దంపతులు
-
ఆర్ఆర్ఆర్ టీంకు చిరు అభినందనలు
-
ఆస్కార్ అవార్డు గెల్చిన నాటు నాటు సాంగ్... సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అమ్మ నాన్న ఎమోషనల్
-
Oscars 2023 : ప్రపంచస్థాయికి తెలుగు సినిమా.. RRRటీమ్‌కు అరుదైన గౌరవం
-
Oscars 2023: కోరిక తీరింది.. పాటతో మనసులో మాట చెప్పిన ఎంఎం కీరవాణి!
లాస్ ఏంజెల్స్: ప్రపంచ వేదికపై ఓ తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కైవసం చేసుకుని మన సత్తా చాటింది. భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డ్‌ను సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రానికి గుర్తింపును తెచ్చిపెట్టింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఆస్కార్ అవార్డ్‌ను ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అనంతరం ఆయన పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు. చివరిలో రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ తెలుగులో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా కంటున్న కలలను నిజం చేస్తూ రెండు ఆస్కార్లను మన చిత్రాలు దక్కించుకున్నాయి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకోగా.. మరో భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను దక్కించుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #NaatuNaatu wins the #Oscar for best Original Song 😭#SSRajamouli & team has done it🫡🇮🇳 Indian Cinema on the Rise 🔥 !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe — Abhi (@abhi_is_online) March 13, 2023 -
RRR నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు
-
కోట్ల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి.. చిరంజీవి ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: విశ్వవేదికపై సత్తా చాటి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆస్కార్ అందుకోవడం భారత్ కల అని, అది ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే సాకారమైందని దర్శకధీరుడు రాజమౌళిని చిరు కొనియాడారు. కోట్ల మంది భారతీయుల హృదయాలు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయన్నారు. ఆర్ఆర్ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. #NaatuNaatu ON TOP OF THE WORLD !!! 👏👏👏👏👏 And THE OSCAR for the Best Original Song Goes To : Take a Bow .. @mmkeeravaani garu & @boselyricist @kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith @tarak9999 @AlwaysRamCharan And the One & Only @ssrajamouli 😍😍😍#Oscars95 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023 కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్‌రక్షిత్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళిల పేర్లను ప్రస్తావిస్తూ అందరికీ చిరు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకించి రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. -
Oscar 2023: నాటునాటుకు ఆస్కార్.. ప్రముఖుల స్పందనలివే..!
తెలుగు పాటను విశ్వవ్యాప్తం చేసిన రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణిని భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి అభినందనల వెల్లువతాకింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను పతాకశీర్షికలకు ఎక్కించిన ఘనులు అని ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖుల స్పందనలివే..! ప్రధాని నరేంద్ర మోదీ తెలుగువారికి అవార్డు రావడం గర్వకారణం, ప్రతిష్టాత్మక అవార్డు తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌కు, ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీమ్‌కు అభినందనలు. ఇది దేశం గర్వించే రోజు. కేటీఆర్ నాటునాటు పాటకు ఆస్కార్ రావడం దేశానికి గర్వకారణం. రాజమౌళి దేశాన్ని గర్వపడేలా చేశారు. చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు. జోగి రమేశ్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ రావడం పట్ల ఏపీ మంత్రి జోగి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వకారణమన్నారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్‌కు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్‌కు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అభినందనలు తెలిపారు. ► ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ టీమ్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. ► ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడం.. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగ్గ విషయం అని బాలకృష్ణ ప్రశంసించారు. ► భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారంటూ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను పవన్ కల్యాణ్ అభినందించారు. మంచు విష్ణు ఆస్కార్ గెలుచుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి సినీ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకు ఈ విభాగంలో అవార్డు రావడం చరిత్రాత్మకం అని ట్వీట్ చేశారు. Amazing! I extend my warmest congratulations to Sri. Keeravani Garu on his historic achievement as the first Indian Music Composer to win an Oscar award for an Indian movie. Congratulations! 💐@mmkeeravaani @ssrajamouli #Oscars #AcademyAwards #NaatuNaatu #Oscars95 pic.twitter.com/2gDZCk86Lf — Vishnu Manchu (@iVishnuManchu) March 13, 2023 చిరంజీవి తెలుగు సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ విశ్వప్యాప్తం చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సినిమా అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో తన కుమారుడు రామ్‌చరణ్ భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ దేశానికి గర్వకారణమన్నారు. #NaatuNaatu ON TOP OF THE WORLD !!! 👏👏👏👏👏 And THE OSCAR for the Best Original Song Goes To : Take a Bow .. @mmkeeravaani garu & @boselyricist @kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith @tarak9999 @AlwaysRamCharan And the One & Only @ssrajamouli 😍😍😍#Oscars95 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023 రవితేజ ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది, ఈ సినిమా ఆడియన్స్ మదిలో చాలా ఏళ్ల పాటు నిలిచిపోతుందని రవితేజ్ ట్వీట్ చేశారు. ఆస్కార్‌తో ప్రపంచ శిఖరాగ్రాన నిలిచిందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఎలక్ట్రిఫయింగ్ డ్యాన్స్ మూవ్స్ లేకపోతే.. నాటు నాటు పాటకు ఆస్కార్ సాధ్యమయ్యేది కాదని రవితేజ అన్నారు. History is created!#NaatuNaatu has truly left a lasting impact on audiences and will be remembered for years to come & this prestigious OscaRRR is a cherry on top❤️ Congratulations @mmkeeravaani garu, @boselyricist garu, Prem , @kaalabhairava7 @Rahulsipligunj🤗#RRRatOSCARS — Ravi Teja (@RaviTeja_offl) March 13, 2023 #oscar for #NatuNatu Historic moment for Indian cinema!! you make us proud!! Congratulations to @MMKeeravaani @SSRajamouli @BoseLyricist @Tarak9999 @AlwaysRamCharan @KaalaBhairava7 @RahulSipligunj #PremRakshith @DVVMovies @RRRMovie and team!!💐💐💐👏🏼👏🏼👏🏼👏🏼👏🏼 — Nagarjuna Akkineni (@iamnagarjuna) March 13, 2023 Sir @mmkeeravaani YOU OSCARRED IT! 😘😘😘😍😍😍 CONGRATS to the KILLER TEAM of RRR 🙏🙏🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) March 13, 2023 Team #RRR u made the whole of india proud …. Congrats @mmkeeravaani sir and dear @boselyricist sir … this is hugeeeee 👏👏👏👏👏👏 @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/HPcl4O49BJ — G.V.Prakash Kumar (@gvprakash) March 13, 2023 As it is often said, cinema speaks a universal language. Congratulations to the teams of #RRR and #TheElephantWhisperers for their #Oscar wins. It’s a proud 🇮🇳 moment 🎈 — Ajay Devgn (@ajaydevgn) March 13, 2023 Congratulations to entire India🇮🇳a movie about suppression, torture, killing, colonisation of Indians based on racial grounds gets appreciated on a world platform, number of Indians died just during one Bengal famine were way more than Jews died during holocaust. Thank team RRR🙏 https://t.co/J0L2RFuicH — Kangana Ranaut (@KanganaTeam) March 13, 2023 🔥👏❤️#RRR is a True example of Team work lead by a Great Visionary. @ssrajamouli 🙏 Congratulations & keep inspiring.@mmkeeravaani @boselyricist @premrakchoreo @tarak9999 @AlwaysRamCharan @ssk1122 @RRRMovie Love..#RAPO https://t.co/HXycu5tWIt — RAm POthineni (@ramsayz) March 13, 2023 I join a Billion Indians in celebrating the Honour for #NaatuNaatu and #RRR 🎉 Kudos to @mmkeeravaani Garu and @boselyricist Garu on making History ❤️👏 The man of the moment, brilliant storyteller who has made India proud @ssrajamouli Garu 🎉 Both my brothers, the superstars… https://t.co/TxKRZ8Dq1q pic.twitter.com/2IRfgPltYo — KTR (@KTRBRS) March 13, 2023 And there you go... NAATU NAATU!! Crossing all boundaries!! Congratulations to @mmkeeravaani garu, @boselyricist and the entire team of #RRR on their phenomenal win at the Oscars!! A jubilant moment for Indian cinema 👏👏👏 — Mahesh Babu (@urstrulyMahesh) March 13, 2023 View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) -
Oscar 2023: ఆస్కార్ స్టేజీపై 'నాటు నాటు' సందడి..
వాషింగ్టన్: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ ప్రదానోత్సవ వేడుకల్లో ఆర్ఆర్ఆర్- నాటు నాటు పాట సందడి చేసింది. అవార్డుల ప్రకటనకు ముందే స్టేజీపై ఈ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు హాలీవుడ్ డాన్సర్లు. ఈ బీట్‌కు హాలీవుడ్ నటీ నటులు ఊర్రూతలూగారు. ఆస్కార్ అవార్డుకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాట నామినేట్ అయిన విషయం తెలిసిందే. మన పాటకు లిస్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హాండ్( టాప్ గన్ మావరిక్), ఠిస్ ఇస్ ఏ లైఫ్ ( ఎవరీ థింగ్ ఏవిరివేర్ ఆల్ ఇట్ వన్స్) పాటలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందింది. గతేడాది మార్చి 25న విడుదలైన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. పాన్ ఇండియానే గాక, పాన్ వరల్డ్ స్థాయిలో సినీ అభిమానులను అలరించింది. ముఖ్యంగా నాటు నాటు పాటుకు ప్రపంచ నలుమూలల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ పాటకు మ్యూజిక్ మాంత్రికుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ ఈ పాటను ఆలకించారు. ఆస్కార్ స్టేజీపైనా వీరు లైవ్‌లో ఈ పాట పాడి అభిమానులను అలరించారు. -
నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్స్ సాంగ్ కేటగిరీలో నామినేషన్
-
‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్
యావత్ సినీ ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు) లాజ్ ఏంజిల్స్ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంగా బెట్టింగ్ రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఆస్కార్ అందుకునే హీరో ఎవరు? ఏ సినిమాకి ఆస్కార్ వస్తుంది? తదితర అంశాలపై జోరుగా బెట్టింగ్ సాగిస్తున్నారు. (చదవండి: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..) ఇక ఇండియా నుంచి ఆస్కార్ బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’పై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై నగరాల్లో తిష్టవేసిన బుకీలు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందా? లేదా? అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. బెట్టింగ్ వ్యవహారమంతా ఆన్లైన్లోనే నడిపిస్తున్నారు. 1:4 నిష్పత్తితో నడుస్తున్న ఈ బెట్టింగ్‌లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. (చదవండి: ఆస్కార్‌కు అడుగు దూరంలో నాటు నాటు.. ఆ పాటనే అడ్డు..!) సామాన్యులతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నిర్మాతలు..టెక్నీషియన్స్ కూడా బెట్టింగ్స్ వేస్తున్నట్లు సమాచారం. తొలిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో టాలీవుడ్ ప్రేక్షకులంతా ఈ వేడుక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా..ఆర్ఆర్ఆర్.. నాటు నాటు పాట గురించే చర్చిస్తున్నారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో మరో నాలుగు పాటలతో పోటీ పడుతున్న నాటు నాటుకి ఆస్కార్ వస్తుందా రాదా తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. -
ఆస్కార్‌కు అడుగు దూరంలో నాటు నాటు.. ఆ పాటనే అడ్డు..!
సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ ఆస్కార్ వేడుక. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు ఆస్కార్ బరిలో నిలవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు సినిమాలు పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో ఫైనల్‌కు చేరిన పాటలు మొత్తం ఐదు ఉన్నాయి. వాటిలో ‘నాటు నాటు’తో పాటు 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' (అప్లాజ్), 'హోల్డ్ మై హ్యాండ్' (టాప్‌గన్.. మావెరిక్), 'లిఫ్ట్ మీ అప్'(బ్లాక్ పాంథర్), 'దిస్ ఈజ్ ఎ లైఫ్' (ఎవ్రీథింగ్ ఎవీవ్రేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు పోటీలో నిలిచాయి. వీటిల్లో మార్వెల్ సూపర్ హీరో చిత్రం ‘బ్లాక్‌పాంథర్: వకాండా ఫరెవర్’లో రిహానా పాడిన 'లిఫ్ట్ మీ అప్' పాట, టామ్ క్రూజ్ హీరోగా వచ్చిన ‘టాప్ గన్ మావెరిక్’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, ఆలపించిన 'హోల్డ్ మై హ్యాండ్' పాట.. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో కూడా మన ‘నాటు నాటు’ పాటకు గట్టి పోటీ ఇచ్చాయి. కానీ చివరికీ మన పాటనే విజయం వరించింది. చదవండి: ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా? అయితే అస్కార్ బరిలోనూ నిలిచిన ఆ సాంగ్ నాటు నాటు సాంగ్‌కు రిహానా పాడిన 'లిఫ్ట్ మీ అప్' పాట గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదే కాకుండా 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' (అప్లాజ్), ‘టాప్ గన్ మావెరిక్’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, ఆలపించిన 'హోల్డ్ మై హ్యాండ్' పాట ఆ తర్వాత వరుసలో ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది. అమెరికాలో థియేటర్లలోనూ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 14 పాటలతో పోటీపడిన ‘నాటు నాటు’ సాంగ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యాలు సమకూర్చిన ‘నాటు నాటు’ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 81 పాటలు బరిలో నిలవగా ఫైనల్‌గా 15 పాటలు మాత్రమే షార్ట్‌లిస్ట్‌లో చేరాయి. అందులో ‘నాటు నాటు’ పాటకి చోటు దక్కింది. భారత చలన చిత్ర చరిత్రలో షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన తొలి పాట ఇదే. చదవండి: Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే.. Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్ ఇస్తారు! -
ప్రియాంక చోప్రా పార్టీలో సందడి చేసిన రాహుల్ సిప్లిగంజ్
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ హంగామానే కనిపిస్తుంది. ఈనెల 12న జరగనున్న ఆస్కార్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని నాటునాటు పాట ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అంతార్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ పాట ఆస్కార్ పురస్కారానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. తెలుగు వారితో పాటు భారతీయులంతా ఈసారి మనకు ఆస్కార్ కశ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సహా ఆర్ఆర్ఆర్ టీం అమెరికాకు పయనమయ్యారు. ఆస్కార్ 95వ అకాడమీ వేడుకల్లో రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ నాటునాటు సాంగ్ లైవ్ ఫర్మార్మెన్స్ ఇవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే వీరు కూడా యూఎస్‌లో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ప్రియాంక చోప్రా నిర్వహించిన ప్రీ ఆస్కార్ పార్టీకి రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యాడు. ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ మీ పార్టీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రియాంక చోప్రాజీ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటుకు చరణ్, తారక్ డాన్స్? ఎన్టీఆర్ క్లారిటీ
అకాడమీ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉంది ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కాటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వస్తుందా? లేదా? అనేది ఒక్క రోజులో తేలనుంది. మార్చి 12న అమెరికాలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. దీంతో అందరి చూపు ఆర్ఆర్ఆర్పైనే ఉంది. అంతేకాదు ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో నాటు నాటు సాంగ్ పర్ఫామెన్స్ కూడా ఉండనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కీరవాణిలు స్టేజ్ఈ పాట పాడుతుండగా.. తారక్, చరణ్‌లు కాలు కదపనున్నారని సమాచారం. తాజాగా దీనిపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో నేపథ్యంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు వరుసగా పలు హాలీవుడ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లాస్ ఏంజిల్స్‌కు చెందిన KTLA ఛానల్‌తో తారక్ ముచ్చటించాడు. చదవండి: శ్రీవారి సేవలో దిల్ రాజు ఫ్యామిలీ.. వారసుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు వేదికపై నాటు నాటు పాట పర్ఫామెన్స్పై ప్రశ్న ఎదురైంది. దీనికి తాను ఆస్కార్ అవార్డుల రెడ్ కార్పెట్‌పై పూర్తి ఇండియన్‌గా నడిచి వస్తానని చెప్పుకొచ్చిన తారక్, వేదికపై నాటు నాటు సాంగ్‌కు పర్ఫామెన్స్ చేయడం లేదని తేల్చి చెప్పాడు. కానీ, కీరవాణితో పాటు ఈ పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లు స్టేజ్‌పై నాటు నాటు పాటను పాడనున్నారని స్పష్టం చేశాడు. కాగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గొల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ వంటి అవార్డులను గెలుచుకుంది. -
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా ఆర్ఆర్ఆర్ జోరు తగ్గలేదు. ఇటీవలె ఈ సినిమాలోని ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో జక్కన్న, జూనియర్, రామ్ చరణ్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇక ఈనెల 13న 95వ అకాడమీ (Oscars 2023)అవార్డులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని తెలుగువారితో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. తాజాగా నాటు నాటు పాట, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాటునాటు పాట గురించి ప్రస్తావిస్తూ.. ''అచ్చ తెలుగులో రాసిన ఈ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుత నటన,కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వం, చంద్రబోస్ అద్భుత రచన కారణంగా ఇవాళ ప్రపంచ స్థాయి బహుమతి రాబోతోంది. గుడికి వెళ్తే ఆస్కార్ పురస్కారం రావాలని దండం పెట్టండి.ఇక నాటునాటులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటన అద్భుతం. నాటు నాటు పాటలో ఈయన బెల్ట్ తీస్తే ఆయనా తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే ఆయనా కుడికాలే తిప్పాడు. కవలలై పుట్టినవారికి కూడా ఇది సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి నటన చేశారంటే నా కంటే చిన్నవాళ్లైనా ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను'' అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. -
పాపులర్ బిటిఎస్ బాయ్ నోట మన తెలుగు పాట.. వీడియో వైరల్
కొరియన్ బిటిఎస్ బాయ్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యూజిక్ బ్యాండ్‌కి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి వీడియోలే దర్శనం ఇస్తాయి. ఈ బిటిఎస్ బ్యాండ్‌లోని బాయ్స్‌కు ఉండే లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలంటూ కుప్పలు తెప్పలుగా వారికి రిక్వెస్ట్స్ వస్తుంటాయట. ఇదిలా ఉంటే ఈ బిటిఎస్ బ్యాండ్‌కు చెందిన ఓ సింగర్ మన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ అంటే చాలా ఇష్టమట. చదవండి: తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ తాజాగా అతడు ఆ పాటకు హమ్ చేస్తూ స్టెప్పులు వేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకి ఆ సింగర్ ఎవరంటే అమ్మాయిల రాకుమారుడైన జంగ్ కూక్. రీసెంట్గా జంగ్ కూక్ నాటు నాటు పాట వింటూ ఆ పాటను స్వయంగా ఆలిపించాడు. అయితే ఈ పాటను తెలుగులోనే విని పాడటం విశేషం. పాడటంమే కాదే నాటు నాటు సిగ్నేచర్ స్టేప్ కూడా వేశాడు. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. అనంతరం ఈ పాట తనని ఎంతగా ఆకట్టుకుందో కూడా వివరించిన వీడియోను తన యూట్యూబ్ చానల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం వీడియోకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన బిటిఎస్ బ్యాండ్ సింగర్ స్వయంగా నాటు నాటు పాడటం చూసి తెలుగు అభిమానులంతా మురిసిపోతున్నారు. అంతేకాదు ఈ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక జంగ్ కూక్ నాటు నాటు పాట పాడిన అనంతరం ప్రస్తుతం ఈ పాట, ఆర్ఆర్ఆర్ సౌత్ కొరియాలో ట్రెండింగ్‌లో నిలిచిందని సమాచారం. -
ఆస్కార్ వేదికపై నాటు నాటు...
ఆస్కార్ వేదికపై తెలుగు ‘నాటు నాటు’ మారుమోగనుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘నాటు నాటు..’ పాటను పాడిన గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌లో పాడనున్నట్లు ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. యం.యం. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. అమెరికాలోనే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ అవార్డుల వేడుక దగ్గర పడటంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి తదితరులు అమెరికాలో ఉన్నారని తెలిసిది. ఆస్కార్‌కి సంబంధించిన వరుస ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు రామ్‌చరణ్ కూడా ఈ నెల 12కు వరకు యూస్లోనే ఉంటారట. మరో హీరో ఎన్టీఆర్ వీరిని త్వరలో జాయిన్ కానున్నారు. అలాగే ఇటీవల ఆస్కార్ నిర్వాహకులు అవార్డుల నామినీల కోసం ఏర్పాటు చేసిన లంచ్‌కు కీరవాణి, చంద్రబోస్ హాజరైన విషయం తెలిసిందే. ఈ నెల 9న అమెరికాలో నామినీల కోసం డిన్నర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ విందులో కీరవాణి, చంద్రబోస్ పాల్గొననున్నారు. ఎన్టీఆర్... చరణ్... హుక్ స్టెప్? ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడతారు కాబట్టి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు పో స్ట్ చేస్తున్నారు. వీటికి తోడు ఇటీవల ఓ అమెరికా మీడియాకు రామ్‌చరణ్ ఇంటర్వ్యూ ఇస్తూ...‘‘ఇప్పటివరకు ప్రేక్షకులు మాకు చాలానే ఇచ్చారు. నా ప్రేమను ప్రేక్షకులకు చూపించడానికి ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ లైవ్‌లో ప్రదర్శించడం ఓ మార్గంలా భావిస్తున్నాను. ఇది నేను వారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్‌లా అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. దీంతో ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే మరో ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ ‘నాటు నాటు’ పాట గురించి మాట్లాడుతూ– ‘‘ఈ పాట చిత్రీకరణ సమయంలో దాదాపు 300మందిప్రొ ఫెషనల్ డ్యాన్సర్లు సెట్స్‌లో ఉన్నారు. 7 రోజుల రిహార్సల్స్ తర్వాత 17 రోజుల పాటు ఈ పాటను షూట్ చేశాం.. ‘నాటు నాటు’ పాటను మేం ప్రదర్శించిన ప్రతిచోటా మంచి స్పందన లభిస్తోంది. అలా అని అన్ని చోట్లా చేయలేం. ఇక ఆస్కార్ నిర్వాహకులు రిక్వెస్ట్ చేస్తే, టైమ్ కలిసొస్తే ‘నాటు నాటు’ పాట పెర్ఫార్మ్ చేస్తాం. అయితే పాట మొత్తం ప్రదర్శించడం అనేది కష్టం. ఎందుకంటే ఈ పాటకు స్టెప్స్ వేసే టైమ్‌లో చాలా బ్రీత్ కావాలి, ఎనర్జీ ఉండాలి. కానీ చాన్స్ ఉంటే ‘నాటు నాటు’లోని ‘హుక్ స్టెప్’ను ఎందుకు ప్రయత్నించకూడదు? అను కుంటున్నాను’’ అని పేర్కొన్నారు. మరి.. ఎన్టీఆర్, చరణ్‌ల లైవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా? లేదా అనేది 13న తెలిసి పో తుంది. -
నాటు నాటు పాటకు రామ్‌చరణ్ ఆనంద్ మహీంద్ర స్టెప్పులు..ఫోటోలు వైరల్
-
రామ్ చరణ్‌తో ఆనంద్ మహీంద్రా స్టెప్పులు.. ట్వీట్ వైరల్
హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ ప్రిక్స్ రేసింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ను చూసేందుకు సినీ, క్రీడా ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవెంట్ చూసేందుకు మెగా హీరో రామ్ చరణ్, ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి సరదాగా నాటునాటు పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఫార్ములా-ఈ ప్రిక్స్ రేసులో తనకు రామ్ చరణ్ దగ్గర నాటు నాటు పాట స్టెప్పులు నేర్చుకున్నట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఈ మేరకు ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ఈ పాటకు ఆస్కార్ రావాలని కు ఆనంద్ మహీంద్రా ఆకాంక్షించారు.ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఈ ప్రిక్స్ రేసింగ్‌ను చూసేందుకు సినీ తారలు నాగ చైతన్య, సిద్ధు జొన్నలగడ్డ, నాగార్జున, క్రికెటర్లు సచిన్ , శిఖర్ ధావన్ తరలివచ్చారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్సీ15' సినిమా షూటింగ్లో బిజీగా రామ్ చరణ్ ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ కర్నూలులో జరుగుతోంది. Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons from @AlwaysRamCharan on the basic #NaatuNaatu steps. Thank you and good luck at the Oscars, my friend! pic.twitter.com/YUWTcCvCdw — anand mahindra (@anandmahindra) February 11, 2023 What a brilliant race! Was quite thrilled to watch @MahindraRacing at Formula E today along with the master blaster @sachin_rt ! What a proud moment to our country, our state and our Hyderabad city @KTRBRS@GreenkoIndia #HyderabadEPrix #CheerForTeamMahindra pic.twitter.com/wypkJ8WE8x — Ram Charan (@AlwaysRamCharan) February 11, 2023 -
‘నాటు నాటు’ ఆస్కార్‌కి నామినేట్ అవ్వడం గర్వంగా ఉంది: రాహుల్ సిప్లిగంజ్
తాను ఆలపించిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కి నామినేట్ అవ్వడం ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట అస్కార్కి నామినేట్ అయిన సందర్భం రాహుల్ సిప్లిగంజ్ను షేడ్ స్టూడియోస్ సీఈవో దేవీప్రసాద్ బలివాడ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ఖ్యాతిని గౌరవాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట ఆస్కార్ బరిలో నిలవడం గర్వంగా ఉందన్నారు. ‘మా స్టూడియోస్‌తో ఎంతో అనుబంధం ఉన్న కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ మరియు లిరిక్ రైటర్ చద్రబోస్ ఈ పాటకి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ టీమ్‌తో కలిసి ఎన్నోసార్లు మ్యూజికల్ జర్నీ లో మా షేడ్ స్టూడియోస్ భాగమైనందుకు మేము అదృష్టం గా భావిస్తున్నాం’నఅ్నారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. ‘నా పాట ఆస్కార్‌కి నామినేట్ అయిందన్న విషయం తెలిసి నా తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. ఈ సంతోషానికి మూల కారణమైన దర్శకధీరుడు రాజమౌళి గారు, ఎమ్.ఎమ్. కీరవాణి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాటు నాటు సాంగ్ తప్పకుండ ఆస్కార్ లో గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతలు నాకు ఎంతో సంతోషంగా ఉంది. -
రాజమౌళి సార్.. ఇది ఎల్లప్పుడు మీ కోసమే: సుకుమార్
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌లతో దర్శకుడు సుకుమార్ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా తనదైన శైలిలో విష్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దర్శకధీరుడు రాజమౌళిపై సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా రాజమౌళికి వినూత్న రీతిలో అభినందనలు తెలియజేశారు సుకుమార్. ఓ మీటింగ్ రూమ్‌లో తన బృందంతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ఖాళీగా ఉన్న కుర్చీని ప్రస్తావించారు. సుకుమార్ మాట్లాడుతూ..'ఇన్నాళ్లుగా నా టీమ్ మీటింగ్‌లు, డిస్కషన్స్ అన్నింటిలో అసంకల్పితంగా ప్రిన్సిపల్ కుర్చీని ఖాళీగా వదిలేశా. కానీ, ఇప్పుడు నేను అలా ఎందుకు చేశానో అర్థం చేసుకున్నా. ఎస్.ఎస్.రాజమౌళి సార్ ఈ కుర్చీ మీ కోసమే. ఈ కుర్చీ ఎప్పుడు మీకు చెందినదే. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. రాజమౌళి అండ్ మూవీ టీమ్‌కి అభినందనలు.' అని అన్నారు. ఆ తర్వాత నాటు నాటు సాంగ్ లిరిక్స్ అందించిన చంద్రబోస్.. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కొరియోగ్రాఫర్ ప్రేమ్రక్షిత్తో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) -
ఆర్ఆర్ఆర్కు పోటీగా జాక్వెలిన్ మూవీ.. ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు
ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. 95వ ఆస్కార్ -2023 నామినేషన్లను జనవరి 24న తేదీన ప్రకటించారు. మార్చి 13న ఈ అవార్డులను ఎంపికైన వారికి ప్రదానం చేయనున్నారు. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ 'నాటు నాటు'తో పాటు మరో ఐదు చిత్రాలు పోటీలో నిలిచాయి. అందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన 'టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్' చిత్రంలోని అప్లాజ్ అనే సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ విభాగంలో ఆర్ఆర్ఆర్కు పోటీగా నిలిచింది. జాక్వెలిన్ మాట్లాడుతూ, "టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ టీమ్‌ని చూసి నేను చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా చప్పట్లతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన డయాన్, సోఫియా గురించి నేను చాలా గర్వపడుతున్నా. ఈ సినిమా చేసిన అనుభవం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఆస్కార్ నామినేషన్స్‌తో అనుబంధం కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైనది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ సాంగ్ ఆస్కార్ నామినేట్ కావడం పట్ల జాక్వెలిన్ ఆర్ఆర్ఆర్ బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపింది. ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా ఇదే నాటు నాటు (ఆర్ఆర్ఆర్) అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్) హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్) లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్) ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143)