రామ్‌ చరణ్‌తో ఆనంద్ మహీంద్రా స్టెప్పులు.. ట్వీట్ వైరల్ | Anand Mahindra Steps To RRR Song Natu Natu Song | Sakshi
Sakshi News home page

RRR Song: ఆర్ఆర్ఆర్ పాటకు ఆనంద్ మహీంద్రా స్టెప్పులు.. ట్వీట్ వైరల్

Published Sat, Feb 11 2023 9:24 PM | Last Updated on Sat, Feb 11 2023 9:35 PM

Anand Mahindra Steps To RRR Song Natu Natu Song - Sakshi

హైదరాబా​ద్‌లో ఫార్ములా- ఈ ప్రిక్స్ రేసింగ్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ను చూసేందుకు సినీ, క్రీడా ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవెంట్‌ చూసేందుకు మెగా హీరో రామ్‌ చరణ్‌, ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్​ మహీంద్రా కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి సరదాగా నాటునాటు పాటకు ఉత్సాహంగా డ్యాన్స్​ చేశారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరలవుతోంది.

ఫార్ములా-ఈ ప్రిక్స్ రేసులో తనకు రామ్ చరణ్ దగ్గర నాటు నాటు పాట స్టెప్పులు నేర్చుకున్నట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఈ మేరకు ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ఈ పాటకు ఆస్కార్ రావాలని కు ఆనంద్ మహీంద్రా ఆకాంక్షించారు.ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఈ ప్రిక్స్ రేసింగ్‌ను చూసేందుకు సినీ తారలు నాగ చైతన్య, సిద్ధు జొన్నలగడ్డ, నాగార్జున, క్రికెటర్లు సచిన్‌ , శిఖర్​ ధావన్​ తరలివచ్చారు. శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్​​సీ15' సినిమా షూటింగ్​లో బిజీగా రామ్ చరణ్ ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ కర్నూలులో జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement