Anand Mahindra tweet viral
-
కొత్త సంవత్సరంలో తొలి అడుగులు
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం సామాజిక మాధ్యమా(Social Media)ల్లో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాజాగా ఆయన తన ఎక్స్(X.com) ఖాతాలో షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లిబిడ్డల మధ్య ప్రేమను తెలియజేస్తూ, కొత్తగా ఏదైనా ప్రయత్నించాల్సినప్పుడు తల్లి నుంచి వచ్చే ప్రోత్సాహం ఎంతో విలువైందనేలా తెలిపే ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.ఈ వీడియోలో తల్లి తన పక్కన చిన్నపాపను ఉంచి ఫ్లోర్ క్లీన్ చేస్తూంటుంది. ఒక్కసారిగా చిన్నపాప లేచి నడిచేందుకు ప్రయత్నించడం చూసి తల్లి తన పని ఆపేస్తుంది. కొంచెంకొంచెంగా నడవడానికి ప్రయత్నిస్తున్న తన బిడ్డను చూసిన తల్లి హృదయం ఆనందంతో నిండి బిడ్డను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుంది. బిడ్డ తన మొదటి అడుగులు వేసేందుకు కొంత తడబడినా పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఆ చిన్నారి తాపత్రయాన్ని గమనించిన తల్లి ప్రేమగా ఒళ్లోకి తీసుకుని ముద్దాడుతుంది.That’s one way of starting a New Year. Baby steps. The first steps towards fulfilling our new resolutions…🙂 pic.twitter.com/Qs7GGZEx9b— anand mahindra (@anandmahindra) January 1, 2025ఇదీ చదవండి: ‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులుఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ‘ఇది కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక మార్గం. బేబీ స్టెప్స్.. మన కొత్త ప్రయత్నాలు నెరవేర్చే దిశగా తొలి అడుగులు పడాలి’ అని రాసుకొచ్చారు. -
పర్ఫెక్ట్ రీక్రియేషన్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ పర్ఫెక్ట్ రీక్రియేషన్ అని పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఓ చిన్న ప్రదేశంలో వివిధ రకాల వాహనాలు ఉండటం చూడవచ్చు. అయితే ఇవన్నీ రిమోట్ ద్వారా పనిచేసే బొమ్మ వాహనాలను. వీటిని అక్కడే నిలబడి ఉన్న యువకులు ఆపరేట్ చేస్తున్నారు. ఇవి కదులుతూ ఉన్నాయి. మొత్తానికి ఆ వాహనాలన్నీ బ్రిడ్జ్ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో షేర్ చేస్తూ సండే పర్ఫెక్ట్ రీక్రియేషన్ అంటూ ట్వీట్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇప్పటికే రెండు వేలకంటే ఎక్కువ లైక్స్ పొందింది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Perfect recreation on a #Sunday Can we create something like this out here @MahindraTrukBus @Mahindra_CE ??pic.twitter.com/DqJmTqKkpa— anand mahindra (@anandmahindra) November 24, 2024 -
క్రియేటివిటీ ఉంటే.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చూశారా?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) మండే మోటివేషన్ పేరుతో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. నాలుగు చక్రాలు, ఒక మోటార్ కలిగిన ఓ బొమ్మ వెహికల్ కనిపిస్తుంది. అది ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే.. ఓ చిన్న బ్రిడ్జిలాంటి నిర్మాణాన్ని దాటాల్సి ఉంది. ప్రారంభంలో ఆ కారు ముందుకు వెళ్లి అక్కడే ఆగిపోతుంది. ఆ తరువాత చక్రాలను ఆ బ్రిడ్జి మీద వెళ్ళడానికి అనుకూలంగా ఫిక్స్ చేసినప్పుడు అది సజావుగా ముందుకు సాగింది. ఇలా అక్కడ ఏర్పరచి బ్రిడ్జి మీద వెళ్ళడానికి చక్రాలను అనుకూలంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది. చివరకు దారంలాంటి నిర్మాణం మీద నుంచి కూడా కారు ముందుకు వెళ్లగలిగింది.ఈ వీడియోలో కనిపించిన బొమ్మ వెహికల్ ముందుకు వెళ్లగలిగింది అంటే.. అక్కడున్న మార్గానికి అనుకూలంగా దాన్ని క్రియేట్ చేయడమే. అలా చేయడం వల్లనే.. అది సులభంగా ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లగలిగింది.వీడియో షేర్ చేస్తూ.. మీలో క్రియేటివిటీ ఉంటే తప్పకుండా సాధించగలరు, అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దీనికి మండే మోటివేషన్ అని ట్యాగ్ చేశారు. ఇప్పటికే వేల వీక్షణలు పొందిన వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెట్ల వర్షం కురిపిస్తున్నారు.There is no chasm that creative and solution-oriented thinking won’t help you cross…#MondayMotivationpic.twitter.com/uExm8r7goq— anand mahindra (@anandmahindra) November 18, 2024 -
ఫిట్నెస్ కోసం హోం జిమ్!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్‌కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్‌గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అరొలీప్ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.Home gym created by 4 IIT grads. No rocket science here.But a clever convergence of mechanics & physical therapy principles to design a product that has global potential. In small apartments & even in Business Hotel rooms! Bravo! pic.twitter.com/Tz1vm1rIYN— anand mahindra (@anandmahindra) October 24, 2024ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్‘ఈ హోమ్ జిమ్ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్మెంట్లు, హోటల్ రూమ్‌ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల 'ఇలాన్ మస్క్'కు (Elon Musk) చెందిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ విజయవంతంగా దాని లాంచ్ ప్యాడ్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా ఆ వీడియోను షేర్ చేస్తూ.. నేను నా టికెట్‌ను ఎక్కడ కొనాలి అంటూ ట్వీట్ చేశారు.ఈ ఆదివారం స్పేస్ఎక్స్ ప్రయోగం జరుగుతున్న సమయంలో టీవీ ముందే ఉండిపోయాను. స్పేస్ఎక్స్ తిరిగిరావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రయోగం.. అంతరిక్ష ప్రయాణంలోనే కీలకమైన క్షణం కావచ్చని ఆనంద్ మహీంద్రా పేర్కొంటూ మస్క్‌ను ప్రశంసించారు.And this Sunday, I’m happy to be a couch potato, if it means that I get to watch history being made. This experiment may just be the critical moment when space travel was democratised and made routine. Where can I buy my ticket, @elonmusk ? 👏🏽👏🏽👏🏽pic.twitter.com/yruGSwL2Y4— anand mahindra (@anandmahindra) October 13, 2024మొదటిసారి నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలా తిరిగి వచ్చిన మొదటి బూస్టర్‌గా.. స్టార్‌షిప్ రాకెట్ గుర్తింపు పొందింది. సూపర్ హెవీ బూస్టర్ రాకెట్ మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి అంతరాయాలకు లోనుకాకుండా కిందికి దిగుతుందని ఎవరూ ఊహించలేదు.ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ కిందికి దిగటానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. టవర్ రాకెట్‌ని పట్టుకుంది. ఈ విజయవంతమైన క్యాచ్ పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని మస్క్ పేర్కొన్నారు. -
సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఐకమత్యం గురించి తెలిపే ఒక అద్భుతమైన వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు. వ్యాపార వ్యవహరాల్లో తలమునకలై ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఫాలోవర్స్‌ను ఎడ్యుకేట్ చేయడంలో, మోటివేట్ చేయడంలో ఈ బిజినెస్ టైకూన్ తరువాతే మరెవ్వరైనా అని చెప్పవచ్చు.మట్టిలో మాణిక్యాల్లాంటి వ్యక్తుల ప్రతిభను పరిచయం చేయడమే కాదు, తనవంతుబాధ్యతగా వారికి అండగా నిలుస్తారు. ఇన్స్పిరేషనల్ వీడియోస్, సామాజిక స్పృహతో పాటు ప్రోత్సాహపరిచే వీడియోలు, అప్పుడప్పుడు మరికొన్ని ఫన్నీ విడియోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మండే మోటివేషన్ పేరుతో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బలం, శక్తి, స్వేచ్ఛకు ప్రతీకలు పక్షులు గుంపుగా ఎగురుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒంటరిగా ఎగరడం, అదీ అందనంత ఎత్తున ఆకాశతీరాన విహరించడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ పనిలో జట్టుగా, జమిలిగా ఎగరడం(ఎదగడం)లో చాలా మేజిక్ ఉంది. దానికి చాలా శక్తి ఉంది అంటూ కలిసికట్టుగా ఉండటంలోని ప్రయోజనాన్ని గురించి ఆనంద్ మహీంద్ర గురించి చెప్పారు. ఇది ఆయన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘‘అవును సార్, టీమ్‌వర్క్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అనుకున్నకలలను నెరవేర్చుకోవచ్చు, కలిసి, కొత్త శిఖరాలను చేరుకోవచ్చు మరపురాని అనుభవాన్ని సాధించవచ్చు! అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేయడం విశేషం.Flying solo and soaring high in the skies can be exhilarating. But there is as much magic—and power—in flying together, as a Team….#MondayMotivation#TogetherWeRisepic.twitter.com/ARVcoEJtwM— anand mahindra (@anandmahindra) October 7, 2024 -
ఆనంద్ మహీంద్రను ఫిదా చేసిన ఇన్క్రెడిబుల్ ఇండియన్
వ్యాపారవేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో అద్భుతమైన పోస్ట్‌తో అభిమానులను ఫిదా చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ,ఎన్నో స్ఫూర్తిదాయక కథనాలను, విజ్ఞానదాయక అంశాలను పంచుకునే ఆయన తాజాగా మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే...ఇటీవల అమెరికన్ యూట్యూబర్ క్రిస్టోఫర్ లూయిస్ చెన్నైలోని ఒక వీధి వ్యాపారి గురించి ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో పార్ట్ టైమ్ ఫుడ్ స్టాల్లో పనిచేస్తున్న పీహెచ్డీ స్టూడెంట్ రేయాన్ని పరిచయం చేశాడు. అంతేకాదు ఇందులో యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాల గురించి రేయాన్ ప్రశ్నించగా, దానికి బదులు సగర్వంగా తన రీసెర్చ్ పేపర్స్ ఆన్లైన్లో చూపించడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోనే ఆనంద్ మహీంద్రాను విపరీతంగా ఆకర్షించింది. దీంతో రేయాన్ స్ఫూర్తిని ప్రశంసిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఆయన షేర్ చేశారు. అతణ్ని అత్యద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించడంతో పాటు, ఇన్క్రెడిబుల్..యూనిక్. ఇండియన్ అంటూ అభినందించడం విశేషం. దీంతో ఇది నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది. విద్యతో ఉన్నత వ్యక్తిత్వం కలగలిసిన వ్యక్తి అంటూ తెగపొగిడేస్తున్నారు.This clip went viral a while ago. An American vlogger discovers a Ph.D candidate running a food stall, part-time.What struck me as truly special, however, was the end, when he picks up his phone & the vlogger thinks he’s going to show him social media mentions of his… pic.twitter.com/e9zMizTJwG— anand mahindra (@anandmahindra) October 4, 2024 -
మస్క్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: ఇదే జరిగితే..
'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం'.. అందమైన ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే అవయవం 'కళ్ళు'. కళ్ళు లేకపోతే బతికున్నా నరకం చూసినట్టే అవుతుంది. అలాంటి వాటికి టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఓ శుభవార్త చెప్పారు. కళ్ళు లేనివారికి కంటి చూపు తెప్పించే ఓ గ్యాడ్జెట్ తయారు చేయడానికి న్యూరాలింక్ సిద్ధమైందని వెల్లడించారు.బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ చేస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే.. అంధులు కూడా ఈ లోకాన్ని చూడగలరు. ఇలాంటి గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టిన మస్క్‌ను.. భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.అంధుల కోసం రూపొందిస్తున్న పరికరం అంచనాలను అనుగుణంగా ఉంటే.. మానవాళికి మీరిచ్చే గొప్ప గిఫ్ట్ ఇదే అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మస్క్‌ను కొనియాడారు. ఎంతోమంది ప్రజలు కూడా మస్క్ చేస్తున్న ఈ ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు.ఇదీ చదవండి: 'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రాన్యూరాలింక్ రూపొందిస్తున్న బ్లైండ్‌సైట్ పరికరం కళ్ళు లేదా ఆప్టిక్ నరాలను కోల్పోయిన వారికి కూడా చూడటానికి వీలు కల్పిస్తుంది. విజువల్ కార్టెక్స్ చెక్కుచెదరకుండా ఉంటే, పుట్టుకతో అంధత్వం ఉన్నవారు కూడా లోకాన్ని చూడగలరని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇదెలా పని చేస్తుంది? చూపు లేని వారు లోకాన్ని ఎలా చూడగలరు అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.If this device lives up to these expectations then, much more than Tesla or Space X, THIS will be your most enduring gift to humankind. https://t.co/BtnbEEIvyn— anand mahindra (@anandmahindra) September 19, 2024 -
వెనిస్లో ముంబై స్టైల్ ట్రాఫిక్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చెందిన వీడియోలో ఒక కాలువలో పడవలు.. ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''ముంబై తరహా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడానికి మాత్రమే వెనిస్ వరకు ప్రయాణించారు. ముంబైతో పోలిస్తే ఇది కొంత తక్కువే అని నేను అంగీకరిస్తున్నాను'' అని అన్నారు. దీనికి సండే ఫీలింగ్ అంటూ ఓ హ్యస్టాగ్ కూడా ఇచ్చారు.ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!Traveled all the way to Venice only to run into a Mumbai-style traffic jam!(Ok, I admit this traffic pile-up is less stressful…🙂)#SundayFeeling pic.twitter.com/n25G8Y5upk— anand mahindra (@anandmahindra) September 15, 2024 -
'అలాంటిదేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రా
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' మేడ్ ఇన్ ఇండియా అని చెబుతూనే అన్యదేశ్య బ్రాండ్స్ అయిన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కార్లను ఎందుకు ఎంచుకున్నారు, అని 'రతన్ దిలాన్' (Rattan Dhillon) అనే వ్యక్తి ప్రశ్నిస్తూ.. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.దీనిపైన 'హార్మజ్ద్ సొరాబ్జీ' (Hormazd Sorabjee) స్పందిస్తూ.. ఆనంద్ మహీంద్రా నిబద్దత కలిగిన వ్యక్తి. ఈయన కేవలం ఇండియన్ బ్రాండ్ కార్లను మాత్రమే ఉపయోగితున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవమని అన్నారు.Given Mr. Anand Mahindra’s strong advocacy for “Made in India,” why does he opt to drive BMW and Mercedes cars instead of a Mahindra Thar, which is built by his own company? @anandmahindra pic.twitter.com/aHl299W1DI— Rattan Dhillon (@ShivrattanDhil1) September 1, 2024ఈ విషయం మీద స్వయంగా ఆనంద్ మహీంద్రా స్పందించారు. నేను విదేశీ బ్రాండ్ కార్లను ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. నాకు మా అమ్మ మొదట్లో తన లైట్ స్కై-బ్లూ కలర్ ప్రీమియర్ కారులో డ్రైవింగ్ నేర్పించారు. 1991 నుంచి ఇప్పటి వరకు కేవలం మహీంద్రా కార్లను మాత్రమే ఉపయోగిస్తున్నాను. నాకు కంపెనీ కేటాయించిన మొదటి కారు హిందూస్థాన్ మోటార్స్ కాంటెస్సా.ఆ తరువాత కొన్నేళ్ళకు నేను ఆర్మడ, బొలెరో, స్కార్పియో క్లాసిక్, ఎక్స్‌యూవీ 5OO ఉపయోగించని. ఇప్పుడు లేటెస్ట్ రెడ్ స్కార్పియో ఎన్ వినియోగిస్తున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. సొంత కంపెనీ కార్లను ఉపయోగించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు.సోషల్ మీడియాలో వెల్లడవుతున్న ఫోటో.. మా బట్టిస్టా ఎలక్ట్రిక్ హైపర్‌కార్‌ను విడుదల చేస్తున్నప్పుడు మాంటెరీ కార్ వీక్‌లో తీసుకున్నదే. అది పాతకాలపు సిసిటాలియా. దీనిని మహీంద్రా కంపెనీ డిజైన్ చేసింది. నేను ఇప్పటి వరకు ఎలాంటి అన్యదేశ్య కార్లను కొనుగోలు చేయలేదని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.Hormazd, you have covered Mahindra since the time I joined the company. So you are in a unique position to call out this fabricated and fake story. Thank you.And for the record:I was taught how to drive by my mother, in her light sky-blue colour Premier car (earlier known as… https://t.co/BXFr3hfYVU— anand mahindra (@anandmahindra) September 2, 2024 -
భళా శీతల్... నీకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను
పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అబ్బురపర్చింది. 17 ఏళ్ల శీతల్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అదిరిపోయే షాట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. అసాధారణ ధైర్యం, నిబద్ధత, పట్టువదలని స్ఫూర్తి పతకాలతో ముడిపడి ఉండదు అంటూ ట్వీట్ చేశారు. మీరు దేశానికి, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అంటూ సోషల్ మీడియా వేదికగా శీతల్ దేవిని అభినందించారు. Extraordinary courage, commitment & a never-give-up spirit are not linked to medals…#SheetalDevi, you are a beacon of inspiration for the country—and the entire world.Almost a year ago, as a salute to your indomitable spirit, I had requested you to accept any car from our… pic.twitter.com/LDpaEOolxA— anand mahindra (@anandmahindra) September 2, 2024అలాగే ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘18 ఏళ్లు నిండిన తర్వాత ఆఫర్(కారు బహుతి) స్వీకరిస్తారని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది కారు మీ చేతికి వస్తుంది. మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టారు ఆనంద్ మహీంద్ర.కాగా పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో యువ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రిక్వార్టర్స్‌కు చేరి అరుదైన రికార్డు సాధించింది. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ కాలి ఫీట్‌తో అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఆమె చేతులకు బదులుగా కాలితో విల్లు ఎక్కి పెట్టిన దృశ్యం వైరల్ గా మారింది. ప్రత్యర్థి వీల్ చైర్లోకూర్చుని చేతులతోనే బాణం వేసి పతకాన్ని కైవసం చేసుకోవడంతో తృటిలో పతకం చేజారింది. అయితే శీతల్ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలో కొద్దిమందిగా ఉన్న ఆర్మ్లెస్ ఆర్చర్లలో పిన్న వయసు ఆర్చర్‌గా శీతల్ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో శీతల్ మున్ముందు అద్భుతాలు సాధిస్తుందంటూ పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు కొని యాడారు. -
'సూపర్ టాలెంట్ బ్రో.!’ దెబ్బకి ఆనంద్ మహీంద్ర ఫిదా!
టాలెంట్ ఓ ఒక్కరి సొత్తూ కాదు. ఆధునిక ప్రపంచంలో తనకంటూ ఒక స్పెషాల్టీ సాధించాలంటే ఒక ప్రత్యేకమైన ప్రతిభను సొంతం చేసుకోవాలి. అందరికంటే భిన్నంగా ఉన్నతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతిభకు గుర్తింపు,పాపులారిటీ వస్తుంది. అలాంటి వారిలో ప్రముఖ గాయకుడు, రచయిత ఒకరు రాఘవ్ సచార్. అందుకే ఆయన ఆనంద్‌మహీంద్ర పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర దృష్టిని ఆకర్షించారు. అసమాన ప్రతిభ అంటూ రాఘవ్ సచార్ అద్భుమైన టాలెంట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు వాయించాడు అనే కాప్షన్‌తో రాఘవ్ సచార్ వీడియోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు రాఘవ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. మరోవైపు తన వీడియో షేర్ చేయడంపై స్పందించిన రాఘవ్ ఆనంద్ మహీంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.Thank you so much sir. Means the world coming from you 🙏. Am truly honoured for your kind words 😊❤️ https://t.co/23AkRAa6y0— Raghav Sachar (@raghavsachar) September 1, 20242001 నాటి హిట్ ‘దిల్ చాహ్తా హై ’ టైటిల్ ట్రాక్‌ను విభిన్న వాయిద్యాలతో వీనుల విందుగా వాయించాడు. శాక్సోఫోన్ ,వేణువు, హ్యాండ్ ప్యాన్ ఇలా పలు రకాల వాయిద్యాలతో మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ వీడియో చూస్తే మీరు కూడా వావ్.. అంటారు.ఎవరీ రాఘవ్ సచార్ మ్యూజిక్ ఫ్యామిలీలో పుట్టిన రాఘవ్ సచార్‌కు చిన్నప్పటినుంచీ సంగీతం మీద ఆసక్తి. ముఖ్యంగా ఒకేసారి పలు వాయిద్యాలను వాయించడంలో ఆరితేరాడు. 2003లో స్పెషల్ ఆల్బబ్తో గాయకుడు పేరు తెచ్చుకున్నాడు. అలాగే కాబూల్ ఎక్స్‌ప్రెస్ (2006)లో బాలీవుడ్ సంగీత దర్శకుడి అరంగేట్రం చేశాడు. ఇంకా బిట్టూ బాస్, వన్‌టూత్రీ లాంటి సినిమాలకు పనిచేశాడు. అలాగే సలామ్ నమస్తే, పరిణీత, ధూమ్, కల్, హమ్ తుమ్, యహాన్, బ్లాక్ ఫ్రైడే, కల్ హో నా హో, డాన్ కొన్నింటిని పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు 150కి పైగా సినిమాల్లో తన వాయిద్య ప్రతిభను చాటుకున్నాడు. పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.ఆస్కార్విన్నర్ ఏఆర్ రెహ్మాన్,విశాల్-శేఖర్, శంకర్-ఎహసాన్-లాయ్, సలీం-సులైమాన్, అను మాలిక్ సహా అనేకమంది సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ జాజ్ డ్రమ్మర్ డేవ్ వెక్ల్ , సోను నిగమ్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్, అద్నాన్ సమీ, శుభా ముద్గల్, నీరజ్ శ్రీధర్, కునాల్ గంజావాలా, శివమణి, నిలాద్రి వంటి ప్రముఖ కళాకారులతో కూడా రికార్డ్ చేసి ప్రదర్శించారు. కుమార్, తౌఫిక్ ఖురేషి, లూయిస్ బ్యాంక్స్, రంజిత్ బారోట్, తదితరులో కలిసి అనేక ప్రదర్శనలిచ్చాడు. రాఘవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
చాట్‌జీపీటీ ఫోటో.. ఆనంద్ మహీంద్రా ఫిదా!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మొదలైన పారాలింపిక్స్ 2024లో పాల్గొనే టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్‌జీపీటీ 4oను ఉపయోగించారు.ఆనంద్ మహీంద్రా ఫోటో షేర్ చేస్తూ.. టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఒక గ్రాఫిక్‌ను రూపొందించమని చాట్‌జీపీటీ-4oని కోరాను. అది వెంటనే ఒక చిత్రాన్ని డిజైన్ చేసింది. ఈ ఫోటో నా మనోభావాలకు చాలా దగ్గరగా ఉందని, నన్ను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.పారిస్ పారాలింపిక్స్ 2024 గేమ్స్ ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 8వరకు జరుగుతాయి. ఇందులో ఇండియా తరపున 84మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పారా సైక్లింగ్, పారా రోయింగ్, బ్లింక్ జూడో వంటి కొత్త క్రీడల్లో భారతీయ క్రీడాకారులు మొదటిసారి పాల్గొంటున్నారు. I asked ChatGPT 4o to create a graphic for wishing the Indian #Paralympics2024 Team Good Luck. This outcome isn’t bad at all! It adequately showcases my sentiments—my excitement about our Team’s potential. 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/LYMZoCGsVL— anand mahindra (@anandmahindra) August 28, 2024 -
ఆ రోజుల్లో ఈ డిజైన్ చూసి ఉంటే?: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు ఓ పేపర్ ప్లేన్కు సంబంధించిన వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పేపర్ ప్లేన్ రూపొందించడం చూడవచ్చు. బహుశా ఇలాంటివి చిన్నప్పుడు అందరూ చేసి ఉంటారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''పిల్లలకు ఇంకా ఇలాంటి వాటిమీద ఆసక్తి ఉందో లేదో తెలియదు, కానీ నా స్కూల్ రోజుల్లో చాలా దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్‌ని డిజైన్ చేయాలనే ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో నేను ఈ డిజైన్ని చూసి ఉంటే... పోటీలో తేలికగా గెలిచి ఉండేవాడిని'' అని వెల్లడించారు.నిజానికి పేపర్ ప్లేన్స్ అనేవి వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. అయితే ఎక్కువ దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్ తయారు చేయడానికి కొన్ని టిప్స్ అవసరం. అలాంటివి ఈ వీడియోలో చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో వేల లైక్స్ పొందింది.Don’t know if kids are still interested but in my school days designing the farthest travelling paper plane was a preoccupationWish I had seen this design in those days… would have handily won the competition. #Sunday is perfect for paper planes…pic.twitter.com/jifbSuwtxy— anand mahindra (@anandmahindra) August 25, 2024 -
దోమల అంతానికి లేజర్ ఫిరంగి!
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విపరీతమైన వర్షాల కారణంగా దోమలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో డెంగ్యూ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో ఆనంద్ మహీంద్రా ఇంట్లో దోమలను నాశనం చేసే ఓ చిన్న యంత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ యంత్రాన్ని 'ఇంటికి ఐరన్ డోమ్' అని ఆయన పేర్కొన్నారు.వర్షాల కారణంగా దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ సమయంలో వాటిని నియంత్రించడానికి ఈ యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చైనీస్ వ్యక్తి కనిపెట్టిన ఈ యంత్రం ఓ చిన్న ఫిరంగి మాదిరిగా ఉంది.వీడియోలో కనిపించే ఈ చిన్న యంత్రం లేజర్ కిరణాల ద్వారా దోమలను కనిపెట్టి నాశనం చేస్తోంది. నిమిషాల వ్యవధిలోనే ఆ మిషన్ లెక్కకు మించిన దోమలను అంతం చేస్తోంది. ఇలాంటి మిషన్ కొనటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.With dengue on the rise in Mumbai, I’m trying to figure out how to acquire this miniature cannon, invented by a Chinese man, which can seek out & destroy mosquitoes! An Iron Dome for your Home…pic.twitter.com/js8sOdmDsd— anand mahindra (@anandmahindra) August 24, 2024 -
భారత్‌లో కొత్త బైక్ లాంచ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బైక్ వీడియో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో బీఎస్ఏ మోటార్‌సైకిల్స్ కంపెనీకి చెందిన గోల్డ్ స్టార్ 650 బైక్ కనిపిస్తోంది. ఈ బైక్ వీడియో షేర్ చేస్తూ వెల్కమ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. లక్షల మందిని మెప్పించిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ దశాబ్దాల తరువాత భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్ స్టార్ 650 పేరుతో లాంచ్ అయిన కొత్త బైక్ ధరలు రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 652 సీసీ ఇంజిన్ కలిగి 45.6 పీఎస్ పవర్, 55 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.Welcome back….#TheGreatestSingleOfAllTime #LegendIsHere #BSAgoldstar pic.twitter.com/03a66g8YHg— anand mahindra (@anandmahindra) August 20, 2024 -
ఆర్బీఐ గవర్నర్‌తో ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఢిల్లీ బోర్డు సమావేశానికి మొదటిసారి హాజరవుతున్నాను. సంసద్ మార్గ్‌లో చాలా అద్భుతమైన, చారిత్రాత్మకమైన ఆర్ట్ డెకో ప్రధాన కార్యాలయ భవనం ఉంది. పాతరోజుల్లో ఇక్కడికి రిటైల్ ట్రాన్సక్షన్స్ కోసం ప్రజలు ఇక్కడికి వచ్చేవారని ఆయన నాతో చెప్పారని ట్వీట్ చేశారు.My first time attending an RBI Delhi board meeting this morning. What a splendid, historic, Art Deco Headquarters building they have on Sansad Marg. With Governor @DasShaktikanta just above the well of the iconic Banking Hall, where he told me people would flock in the old… pic.twitter.com/L7LDVaPHZH— anand mahindra (@anandmahindra) August 10, 2024కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దేశ రాజధానిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశానికి హాజరయ్యారు. 2024-25 కేంద్ర బడ్జెట్ తర్వాత.. లోక్‌సభ ఆర్థిక బిల్లును ఆమోదించిన తర్వాత, ప్రభుత్వం పార్లమెంట్లో కొన్ని సవరణలతో సమావేశమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇతర డైరెక్టర్ల బోర్డు పాల్గొన్నారు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిన వడ్డీరేట్లు ప్రపంచంలోని అగ్ర దేశాలను సైతం ఆర్ధిక మాంద్యంలోకి నెడతాయేమో అన్న భయం పుట్టిస్తున్నాయి. దీంతో ఈ రోజు (సోమవారం) గ్లోబల్ స్టాక్‌మార్కెట్లు భారీగా క్షిణించాయి. దీనిపై దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ప్రాచీన భారతీయ అభ్యాసం ప్రాణాయమాన్ని అమలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం ఎన్నటికీ రాదు. గట్టిగా శ్వాసతీసుకుని లోతుగా చూడండి. మీడియం నుంచి లాంగ్ టర్మ్ వరకు ఎవరి దుగుదలకు ఆటంకం కలగదు. లాంగ్ గేమ్ ఆడండి అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆర్ధిక మాంద్యం భయాల మధ్య.. మార్కెట్ సోమవారం సెన్సెక్స్ 3 శాతం క్షీణించగా, నిఫ్టీ కూడా విస్తృత అమ్మకాలతో దాదాపుగా పతనమైంది. స్టాక్ మార్కెట్ క్రాష్ బీఎస్ఈలో జాబితాని సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో దాదాపు రూ. 457 లక్షల కోట్ల నుండి దాదాపు రూ. 442 లక్షల కోట్లకు తుడిచిపెట్టుకుపోయింది.ఈ రోజు సెషన్లో పెట్టుబడిదారులు దాదాపు రూ. 15 లక్షల కోట్లను కోల్పోయారు, అయితే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో కూడా తిరోగమనం ఉంది. జపాన్ బెంచ్‌మార్క్ నిక్కీ 225 స్టాక్ ఇండెక్స్ దాదాపు 13 శాతం క్షీణించడంతో ఆసియా మార్కెట్లు పడిపోయాయి.Never a better time to deploy the ancient Indian practice of Pranayama. It’s about breathing deeply and looking inwards.What I see is an India that is an oasis in the world. Whose Rise will not be impeded in the medium to long term. Play the long game… https://t.co/UASfOSjQ10— anand mahindra (@anandmahindra) August 5, 2024 -
డిజైన్ అద్భుతం, ఇదొక జీవితం లాంటిది!.. ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి బాస్కెట్ బాస్కెట్ బాల్‌ను.. గోల్లో వేశారు. ఆ బాల్ అలా వెళ్లి.. తిరిగి తిరిగి.. సెట్ చేసిన ప్రదేశంలో పడటం చూడవచ్చు. ఇది గొప్ప డిజైన్ అని.. ఇది ఒకరకమైన జీవితం లాంటిదని, లవ్ రూబ్ గోల్డ్బెర్గ్ క్రియేషన్స్ చాలా అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు.Each individual cause and effect seems isolated. But someone had a grand design for how it all came to be…Sort of like life itself. Love Rube Goldberg inspired creations. #SundaySpace pic.twitter.com/3uvGhwkxH5— anand mahindra (@anandmahindra) July 28, 2024 -
మన ముందున్న కర్తవ్యం ఇదే!.. బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెన్‌ను ఉద్దేశించి, తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రకటనలలో ఉద్యోగ కల్పన గురించి వెల్లడించడాన్ని అంశాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు ఉపాధి కల్పించాలనే నిర్ణయం ప్రశంసనీయం. దీనికి తగిన విధంగా ప్రైవేట్ రంగం కృషి చేయాలి. ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రైవేట్ రంగం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, మన ముందున్న కర్తవ్యం ఇదే అని.. ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకపోతే.. రాబోయే రోజుల్లో విపత్తుగా మారే అవకాశం ఉందని ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిలో మనదేశం ప్రపంచమే అసూయపడేలా మనదేశం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పథకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.We are the envy of the world in terms of our growth in GDP.We are the preferred destination of the world for investment because of the belief in our future.But the vital task ahead for us is to ensure that this growth is now accompanied by an explosion in job-creation.… pic.twitter.com/Z73BKJwWR1— anand mahindra (@anandmahindra) July 24, 2024 -
ఇక్కడ ఏదీ వృథా కాదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నిరూపయోగంగా ఉన్న వెహికల్ టైర్స్, డ్రమ్ములు వంటి వాటితో అద్భుతమైన ఇంటీరియర్ వస్తువులను రూపొందించి ఉండటం చూడవచ్చు. చైర్లు, టేబుల్స్, వాష్ బేషన్స్, వాల్ క్లాక్స్ ఇలా పనికిరాని వస్తువులతో అద్భుతమైన కళాకండాలను తయారు చేస్తుండటం చూడవచ్చు.ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది సర్క్యులర్ఎకానమీ, ఇక్కడ ఏమీ వేస్ట్ (వృథా) కాదు. ఇందులో కొత్తేమీ లేదు, భారతదేశంలో ఇదొక జీవన విధానమని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.The circular economy.Where nothing is wasted.Nothing new. Just a way of life in India… pic.twitter.com/j0UhQxjAmM— anand mahindra (@anandmahindra) July 11, 2024 -
నొప్పిని తగ్గించే మార్గం.. సరికొత్త ఆవిష్కరణ: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఏముంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. సిరలను గుర్తించడానికి పరారుణ కాంతిని ఉపయోగించడం చూడవచ్చు. రక్తం తీసుకునేటప్పుడు సిరలను గుర్తించడం కొంత కష్టమైన పని. ఈ టెక్నాలజీ ద్వారా సిరలను ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇది వైద్య విధానంలో అతి చిన్న ఆకర్షణీయమైన ఆవిష్కరణ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వేలమంది వీక్షించిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఇది నిజంగా గొప్ప టెక్నాలజీ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.Using infrared light to locate veins. Saving the pain from repeated attempts to find a vein when drawing blood. It’s often the smallest, least glamorous inventions which significantly improve our medical experience and hence, the quality of our lives… pic.twitter.com/XgZI8Bcf2m— anand mahindra (@anandmahindra) July 6, 2024 -
చాట్‌జీపీటీని రిక్వెస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్)ఖాతలో ఆసక్తికర విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్‌జీపీటీని రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా.. తన ట్విటర్ ఖాతాలో ఫోటో షేర్ చేస్తూ.. హలో చాట్‌జీపీటీ 4.O, దయచేసి నాకు ఇండియా క్రికెట్ జట్టు బృందాన్ని సూపర్‌హీరోలుగా చూపించే గ్రాఫిక్ ఫోటో రూపొందించు, ఎందుకంటే అవి చివరి వరకు సూపర్ కూల్‌గా ఉన్నాయి. ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. ఇది దాదాపు వారి పట్టు నుంచి జారిపోయింది. కానీ వారి మనసులో ఎప్పుడూ మ్యాచ్ ఓడిపోలేదు. గెలవాలనే వారి దృఢ సంకల్పమే విజయం పొందేలా చేసింది. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో.. క్రికెటర్స్ జాతీయ జెండాను కలిగి ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. లక్షల మంది వీక్షించిన ఈ ఫోటో.. లెక్కకు మించిన వ్యూవ్స్ పొందింది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు.Hello Chat GPT 4.OPlease make me a graphic image showing the Indian Cricket team as Superheroes. Because they were SuperCool till the end.The greatest gift of this final to India was that it didn’t come easy. It almost slipped out of their grasp. But they never lost the… pic.twitter.com/pg8PsXjjqw— anand mahindra (@anandmahindra) June 29, 2024 -
టీమ్ వర్క్ అండ్ టైమింగ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు, దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నలుగురు వ్యక్తులు నిలబడి ఉండటం చూడవచ్చు. మొదటి వ్యక్తి కొంత పైకి ఎగిరి రింగ్‌లో దూరాడు. ఆ సమయంలోనే ఆ వ్యక్తి రింగును వెనక్కు వేగంగా పంపించారు. అదే సమయంలో వెనుక వున్న వ్యక్తులు కూడా కొంత ఎగిరి ఆ రింగు గుండా బయటకు వచ్చేస్తారు. ఈ సన్నివేశం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీమ్ వర్క్ అండ్ టైమింగ్.. ఈ రాత్రికి లెక్కించబడుతుంది. గో ఇండియా అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.Teamwork… and TimingIt’s what’s going to count tonight..Go #TeamIndia !#INDvsSA #T20WorldCupFinal 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/6aovoJZpX6— anand mahindra (@anandmahindra) June 29, 2024 -
నేను అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను!.. ఆనంద్ మహీంద్రా
దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ ఇలాంటి దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. వర్షంలో ఒక కారునే మంచి నివాస ప్రాంతంగా మార్చడం చూడవచ్చు. ఇందులో ఓ మహిళ వర్షం పడుతున్న సమయంలో తన కారు వెనుక డోర్ ఓపెన్ చేసి అక్కడ ఒక టెంట్ మాదిరిగా ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత కారులోని సీట్లను కిందికి వంచి మంచి బెడ్ మాదిరిగా ఏర్పాటు చేసుకుని దానిపై ఓ దుప్పటి కూడా పరుస్తుంది. ఇది అప్పుడు ఓ అద్భుతమైన బెడ్ మాదిరిగా తయారవుతుంది.ఇక కారుకి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన టెంటులో చిన్న టేబుల్స్ వంటివి ఏర్పాటు చేసుకుని రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్రదేశంగా రూపొందించుకుంటుంది. ఆ తరువాత స్నానం చేయడానికి మరో చిన్న టెంట్ ఏర్పాటు చేసుకోవడం కూడా చూడవచ్చు. ఇలా మొత్తం మీద ఓ అద్భుతమైన గదిగా ఏర్పాటు చేసుకుంది.ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది క్యాంపింగ్. నేను ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. మరోవైపు ప్రకృతిలో ఇలాంటి ఆనందం అద్భుతంగా ఉంటుందని, ఆనందన్ని పొందవచ్చని అన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.This is camping??I want to move in there permanently and claim tenancy rights to this ‘apartment.’ On the other hand, all the pleasures of being outdoors and as close to nature as possible without ‘devices’ are lost!pic.twitter.com/CAC7iOO7v7— anand mahindra (@anandmahindra) June 26, 2024