
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకంటూటారు. అవి యువతకే కాదు, ఉద్యోగులకు, సాధారణ గృహిణులకు స్థైర్యాన్ని, స్పూర్తిని అందించేలా ఉంటాయి. మనకే ఇంత పెద్ద కష్టం ఏమో!.. అనే అజ్ఞానం నుంచి బయటపడేసేలా ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఈసారి కూడా ఆనంద్ అలాంటి స్ఫూర్తిని కలిగించే వీడియోని షేర్‌చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఓ ఉద్యోగి ఎలా వ్యవహరించాలో తెలియజెప్పే స్టోరీ ఇదీ..!.
సమస్యలనేవి వస్తూనే ఉంటాయి. అయితే అవి ఏ రూపంలో వచ్చినా మనం ధైర్యం, ఆశ కోల్పోకూడదు. అదే చెబుతోంది ఈ రాజ్‌కుమార్ దాబీ గాథ. అతడు మహీంద్రా గ్రూప్ ఉద్యోగి. సేల్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతను 2014లో కంటిశుక్లంకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. దాంతో అప్పటి నుంచి నెమ్మదినెమ్మదిగా దృష్టిని కోల్పోవడం ప్రారంభించాడు.
అలా ఇప్పుడాయన 5% దృష్టిని మాత్రమే కలిగి ఉన్నారు. అయినా ఆయన అధైర్యపడలేదు. అపుడెలా ఉద్యోగంలో డైనమిక్‌గా పనిచేశారో అలానే దూసుకుపోతున్నారు. తన సహోద్యోగులతో సమానంగా పనిచేస్తారాయన. ఆ టైంలో కూడా ఆయన సుమారు 5 మందికి పైగా తన విభాగంలో శిక్షణ ఇచ్చారు. అతడి సీనియర్ ఉద్యోగులు సైతం రాజ్‌కుమార్ దాబీ విల్‌పవర్‌కి అబ్బురపడటమే కాదు అతడి పనిని మెచ్చుకుంటున్నారు కూడా.
అంతేగాదు అతను ఇలాంటి స్థితిలో కూడా మంచిగా అమ్మకాలు జోరందుకునేలా చేశాడని చెబుతున్నారు వారంతా. అతడు కంపెనీని తన కుటుంబంలా భావించి..వర్క్ గురించి తన కింద ఉద్యోగులకు తర్ఫీదు ఇస్తాడు. ఫలితంగా అతడు వాళ్ల నుంచి ప్రేమ ఆప్యాయతలో కూడిన ప్రోత్సహాం అందుకుంటాడు. అందువల్లే అతడు ఈ ఆకస్మిక వైకల్యాన్ని అధిగమించి ఉద్యోగంలో కొనసాగుతున్నాడు.
అతడు తనకు సడెన్‌గా వచ్చిపడిన ఈవైకల్యానికి చింతిస్తూ కూర్చోలేదు. కేవలం పరిష్కారం దిశగా, తాను చేయగలిగే పనిపై దృష్టిసారించాడు. అదే అతడిని తన ఉద్యోగంలో యథావిధిగా కొనసాగిలే చేసింది. పని అనేది తన అభిరుచిగా భావించి చేసేవారికి తిరిగే ఉండదు అనేందుకు రాజ్‌కుమార్ దాబీనే ఉదాహరణ. ఆ వ్యక్తి తన కంపెనీలో సహోద్యోగిగా కొనసాగడం గర్వంగా భావిస్తున్నా అంటూ అతడికి సంబంధించిన వీడియోని కూడా జత చేసి పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
నెటిజన్లు కూడా ఇది స్పూర్తిదాయకమైన కథ, కార్యాలయంలో గుర్తింపు ఎలా తెచ్చుకోవాలో ఇతడిని చూస్తే క్లియర్‌గా తెలుస్తుందని కొందరూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకూడదు, అదే మనల్ని ముందుకు సాగేలా ధైర్యం అందిస్తుంది అంటూ పోస్టులు పెట్టారు.
Often, the #MondayMotivation you need is right next to you, on your home turf…
Dhanyavaad, Thank you, Rajkumar Dabi, for making me so proud to be your colleague.
You inspire us every single day…pic.twitter.com/2UcBnqQxjc— anand mahindra (@anandmahindra) March 24, 2025
(చదవండి: 'విల్‌పవర్' అంటే ఇది..ఏకంగా వీల్‌చైర్‌తో బంగీ జంప్..! వీడియో వైరల్)