
ఇటీవల "వర్క్ లైఫ్ బ్యాలెన్స్" తెగ చర్చనీయాంశంగా మారింది. వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే మన భారత్ మరింత అభివృద్ధి చెందడానికి అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఏ ముహర్తానా అన్నారో గానీ అప్పటి నుంచి వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ తెరపైకి వచ్చేంది. అందరూ ఇక పనికే అంకితమైతే వ్యక్తిగత జీవితం, బాంధవ్యాల పరిస్థితి ఏంటీ...?. ఆ తరువాత జీవిత చరమాంకలో ఎవ్వరూ మనతో ఉండరు అంటూ రకరకాలు మాటలు లెవెనెత్తారు నెట్టింట నెటిజన్లు. సరిగ్గా ఈ సమయంలో ఓ బెంగళూరు టెకీ ఇలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సులభంగా మెయింటైన్ చేయొచ్చు అంటూ ఓ సలహా సూచించాడు. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్‌గా మారి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అతడు చెప్పిన సలహా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు గానీ కానీ కాస్త ఆలోచింపచేసేలా ఉందంటున్నారు నెటిజన్లు. మరీ అదెంటో చూసేద్దామా..!.
బెంగళూరు టెకీ హర్షిత్ మహావర్ లింక్డ్ ఇన్ పోస్ట్‌లో పని జీవిత సమతుల్య సాధించడానికి ఇలా చేయండి అంటూ ఓ ఉచిత సలహ ఇచ్చాడు. అదేంటంటే..మీ సహోద్యోగినే పెళ్లాడండి సింపుల్‌గా. అంతే ఇక ఎన్నో ప్రయోజనాలు పొందుతారంటూ జాబితా చిట్టా చెప్పుకొచ్చాడు. క్యాబ్‌లపై డబ్బు ఆదా అవుతుంది. ఇంటి నుంచి పనిచేసిన అనుభూతే ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్‌లో అనుక్షణం మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది కదా..!.
కాబట్టి ఆఫీస్‌లో ఉన్నాం అనిపించదు. ఏ మాత్రం విరామం దొరికినా..కాసేపు మీ శ్రీమతి లేదా శ్రీవారితో ముచ్చటించొచ్చు. ఇక తిరిగి ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడూ ఏదో ఊరు నుంచి వెళ్తున్నట్లుగా జాలీగా గడపండి. మీ భాగస్వామితో గడపలేదన్న భాధ కూడా ఉండదు. అటు వర్కు హయిగా చేసుకోవచ్చు..ఇటు భార్యతోనూ హ్యాపీగా స్పెండ్ చెయ్యొచ్చు.
ఇలా చేస్తే కుటుంబాన్ని మిస్ అవుతున్నాం అనే ఫీల్ ఉండదు. రెండింటికి న్యాయం చేసినవారు అవుతారంటూ రాసుకొచ్చాడు లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో హర్షిత్. అయితే నెటిజన్లు ఇదేదో బాగుందే..!.. ట్రై చేస్తా అని కొందరు, సహోద్యోగిని పెళ్లిచేసుకోవడం అనేది శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు అని మరికొందరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఊపిరి సలపని ఒత్తిడులు..ఆగిపోతున్న ఖాకీల గుండెలు..!)