చెట్లను హగ్ చేసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా..?. అదీగాక ఇటీవల ఓ విదేశీ మహిళ చెట్టుని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. మళ్లీ ఇందేంట్రా బాబు అనుకుంటున్నారా..!. ఓ కంపెనీ దుస్సాహసం లేదా సోమ్ము చేసుకునే సరికొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు దీన్ని. ఆఖరికి సహజ సిద్ధమైన ప్రకృతిని కూడా ఇలా అమ్మకానికి పెట్టేస్తోందా అని ఆ కంపెనీపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ అంటే..
చికాగుగా, ఒత్తిడిగా ఉంటే అలా కాసేపు ఓ పార్కుకో వెళ్లి ప్రకృతిలో కాసేపు సేద తీరుతాం. లేదా ఆరుబయట కాసేపు ఆకాశానికేసి చూసి ఆహా ఈ ప్రకృతి అద్భుతాలు ఊహకే అందవు అని ఆనందపడతాం. దీనికి డబ్బులు వెచ్చించాల్సిన పనిలేదు. ఈ భూమ్మీద జీవించే ప్రతి ఒక్కరి హక్కు ఇది. అదీగాక ఆరోగ నిపుణులు కూడా పచ్చని ప్రదేశాల్లో నిమగ్నమయ్యితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పదేపదే చెబుతుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఉండే ఉద్యానవనాలు ప్రజలకు ప్రకృతి ఒడిలో సేదతీరే చక్కటి ప్రదేశాలు. అంతేగాదు ఇలా ప్రకృతితో రమించడాన్ని జపాన్‌లో షిన్రిన్-యోకు అంటారు.
దీన్ని 1982లో జపనీస్ వ్యవసాయ, అటవీ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ పేరుతో ప్రజలకు ఉచితంగా అటవీ ప్రాంతంలో గడపడం, కనెక్ట్ అవ్వడం వంటివి నేర్పిస్తుంది. దీని వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నది వారి నమ్మకం. అయితే ఇటీవల బెంగుళూరుకి చెందిన ఓ కంపెనీ అచ్చం అలాంటి కాన్సెప్ట్‌తో జస్ట్ రూ. 1500లతో గైడెడ్ ఫారెస్ట్ బాత్ అనుభవాలు నేర్పిస్తామంటూ ప్రకటన ఇవ్వడం వివాదాస్పదమయ్యింది. ఆ కంపెనీ చెట్టుని కౌగిలించుకుని వాటితో కనెక్ట్ అవ్వడం ఎలాగో నేర్పిస్తాం అంటూ ధర ప్రకటించడం నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
దీంతో నెటిజన్లు ఆఖరికి ప్రకృతిని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారా..? అని మండిపడుతున్నారు. ఇదేదో స్కామ్, అంటూ పోస్టులు పెట్టారు. ఇక్కడ చెట్టుని కౌగిలించుకుని వాటితో మమేకమవ్వడం వరకు బాగుంది. దీనికీ డబ్బులేం ఖర్చవ్వుతాయి. అదీ కూడా నేచర్‌కి ఉన్న పవర్. ఆ కంపెనీకి ఖర్చు పెట్టి చేసేదేం ఉంటుంది. వాలంటీర్‌గా గైడ్ చేయడమే సూచించడమే చేస్తే సరిపోయే దానికి ఇలా సొమ్ము చేసుకునే దుస్సాహాసానికి ఒడిగట్టడం అందరీకీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. సహిస్తే చక్కగా పీల్చే గాలిని కూడా సొమ్ము చేసుకుంటారు కొందరు ప్రబుద్ధులు అని తిట్టిపోస్తున్నారు ప్రజలు.
Comments
Please login to add a commentAdd a comment