hugging
-
రూ. 1500 చెల్లించి మరీ చెట్లను హగ్ చేసుకోవడమా?
చెట్లను హగ్ చేసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా..?. అదీగాక ఇటీవల ఓ విదేశీ మహిళ చెట్టుని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. మళ్లీ ఇందేంట్రా బాబు అనుకుంటున్నారా..!. ఓ కంపెనీ దుస్సాహసం లేదా సోమ్ము చేసుకునే సరికొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు దీన్ని. ఆఖరికి సహజ సిద్ధమైన ప్రకృతిని కూడా ఇలా అమ్మకానికి పెట్టేస్తోందా అని ఆ కంపెనీపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ అంటే.. చికాగుగా, ఒత్తిడిగా ఉంటే అలా కాసేపు ఓ పార్కుకో వెళ్లి ప్రకృతిలో కాసేపు సేద తీరుతాం. లేదా ఆరుబయట కాసేపు ఆకాశానికేసి చూసి ఆహా ఈ ప్రకృతి అద్భుతాలు ఊహకే అందవు అని ఆనందపడతాం. దీనికి డబ్బులు వెచ్చించాల్సిన పనిలేదు. ఈ భూమ్మీద జీవించే ప్రతి ఒక్కరి హక్కు ఇది. అదీగాక ఆరోగ నిపుణులు కూడా పచ్చని ప్రదేశాల్లో నిమగ్నమయ్యితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పదేపదే చెబుతుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఉండే ఉద్యానవనాలు ప్రజలకు ప్రకృతి ఒడిలో సేదతీరే చక్కటి ప్రదేశాలు. అంతేగాదు ఇలా ప్రకృతితో రమించడాన్ని జపాన్‌లో షిన్రిన్-యోకు అంటారు. దీన్ని 1982లో జపనీస్ వ్యవసాయ, అటవీ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ పేరుతో ప్రజలకు ఉచితంగా అటవీ ప్రాంతంలో గడపడం, కనెక్ట్ అవ్వడం వంటివి నేర్పిస్తుంది. దీని వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నది వారి నమ్మకం. అయితే ఇటీవల బెంగుళూరుకి చెందిన ఓ కంపెనీ అచ్చం అలాంటి కాన్సెప్ట్‌తో జస్ట్ రూ. 1500లతో గైడెడ్ ఫారెస్ట్ బాత్ అనుభవాలు నేర్పిస్తామంటూ ప్రకటన ఇవ్వడం వివాదాస్పదమయ్యింది. ఆ కంపెనీ చెట్టుని కౌగిలించుకుని వాటితో కనెక్ట్ అవ్వడం ఎలాగో నేర్పిస్తాం అంటూ ధర ప్రకటించడం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆఖరికి ప్రకృతిని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారా..? అని మండిపడుతున్నారు. ఇదేదో స్కామ్, అంటూ పోస్టులు పెట్టారు. ఇక్కడ చెట్టుని కౌగిలించుకుని వాటితో మమేకమవ్వడం వరకు బాగుంది. దీనికీ డబ్బులేం ఖర్చవ్వుతాయి. అదీ కూడా నేచర్‌కి ఉన్న పవర్. ఆ కంపెనీకి ఖర్చు పెట్టి చేసేదేం ఉంటుంది. వాలంటీర్‌గా గైడ్ చేయడమే సూచించడమే చేస్తే సరిపోయే దానికి ఇలా సొమ్ము చేసుకునే దుస్సాహాసానికి ఒడిగట్టడం అందరీకీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. సహిస్తే చక్కగా పీల్చే గాలిని కూడా సొమ్ము చేసుకుంటారు కొందరు ప్రబుద్ధులు అని తిట్టిపోస్తున్నారు ప్రజలు. (చదవండి: వారెవ్వా..నీరజ!.. మొత్తానికి సాధించింది..!) -
దేశ రాజధానిలో ఘనంగా ఈద్ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు వివిధ మసీదులలో నమాజ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు ముస్లింలు నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈద్ జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపూర్ మసీదు ఇమామ్‌లు చంద్రుని దర్శనాన్ని ధృవీకరించారు. చంద్రుడిని చూసిన తర్వాత ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఫతేపూర్ మసీదు షాహీ ఇమామ్ మౌలానా ముఫ్తీ ముకర్రమ్ అహ్మద్.. ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశానికి శాంతి, సామరస్యం సమకూరేందుకు ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరారు. కాగా చంద్రుడు కనిపించినంతనే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా అభినందనల పరంపర మొదలైంది. ఫోన్, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లింలు ఈద్ కోసం పెర్ఫ్యూమ్, క్యాప్స్, డ్రై ఫ్రూట్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. పాత ఢిల్లీతో పాటు, జామియా నగర్, సీలంపూర్, జాఫ్రాబాద్, నిజాముద్దీన్ సహా ఇతర మార్కెట్లలో రద్దీ పెరిగింది. రాత్రంతా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈద్ వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. #WATCH | Delhi: Devotees gather at Jama Masjid to offer prayers, on the occasion of Eid-ul-Fitr. pic.twitter.com/Id3OsJDGxv — ANI (@ANI) April 11, 2024 -
ఆస్కార్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హగ్
-
సీరియల్స్ మేకర్స్‌కు షాక్.. ఇకపై ‘ఆ సీన్లు’ ఉంటే చర్యలు తప్పవు
ఇస్లామాబాద్: కాలం మారుతున్న కొద్ది ప్రతి రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మంచికి దారితీస్తే.. మరికొన్ని అతిని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ చూస్తే పైన చెప్పిన మాట నిజం అనిపిస్తుంది. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. ఇప్పుడది సీరియల్స్ కూడా అంటుకుంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సీరియల్స్ కూడా రోమాంటిక్ సీన్లు ప్రసారం అవుతున్నాయి. అయితే ఇక మీదట టీవీల్లో ప్రసారం అయ్యే సీరియల్స్‌లో కౌగిలించుకోవడం, రోమాన్స్ చేసే సన్నివేశాలు ప్రసారం చేయకూడదని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తాన్ ఎలాక్ట్రానిక్ మీడియా రెగ్యూలేటరి అథారటీ(పీఈఎంఆర్ఏ) ఉత్తుర్వులు జారీ చేసింది. సీరియల్స్‌లో ఇలాంటి సన్నివేశాలు బాగా పెరిగిపోయానని తమకు ఫిర్యాదులు వచ్చాయని పెమ్రా తెలిపింది. ఇలాంటి సన్నివేశాలు ప్రసారం చేసే సీరియల్స్ పాకిస్తాన్ సమాజానికి పూర్తి వ్యతిరేకం అని నోటిఫికేషన్లో పేర్కొంది. (చదవండి: సీరియల్ ప్రమోషన్లో కృతిశెట్టి.. రెమ్యునరేషన్ ఎంతంటే?) ఈ మేరకు ‘‘కౌగిలించుకోవడం, ఒకరినొకరు లాలించడం, వివాహేతర సంబంధాలు, పడకగది సన్నివేశాలు, భార్యభర్తల మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు, అసభ్యకరంగా దుస్తులు ధరించడం వంటి సీన్లు ఇస్లామిక్ బోధనలు, పాకిస్తానీ సమాజం సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కిందకే వస్తుంది. కనుక ఇలాంటి సీరియల్స్‌ని ప్రసారం చేసే ముందు సదరు చానెల్స్ ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకుని.. అసభ్యతకు తావులేదని భావించిన తర్వాతే ప్రసారం చేయాలి’’ అని పెమ్రా తన నోటిఫికేషన్లో పేర్కొంది. (చదవండి: సన్నిహిత సన్నివేశాల రూపశిల్పి) పెమ్రా నోటిఫికేషన్‌పై లీగల్, హ్యూమన్ రైట్స్ ప్రొఫెషనల్ రీమా ఒమర్ ప్రతిస్పందిస్తూ, "పెమ్రా తీసుకున్న నిర్ణయం సరైంది. వివాహిత జంటల మధ్య సాన్నిహిత్యం, ఆప్యాయత 'పాకిస్తానీ సమాజంలో ఉండదు'. మా 'సంస్కృతి' నియంత్రణ, దుర్వినియోగం, హింస మాత్రమే. ఇటువంటి పరాయి విలువలు విధించకుండా మనమందరం మన సంస్కృతిని కాపాడుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. చదవండి: ‘యాక్.. ఇలాంటి చెత్త సీన్లు ఎలా తీస్తారు మీరు?’ PEMRA finally got something right: Intimacy and affection between married couples isn’t “true depiction of Pakistani society” and must not be “glamourised” Our “culture” is control, abuse and violence, which we must jealously guard against imposition of such alien values pic.twitter.com/MJQekyT1nH — Reema Omer (@reema_omer) October 22, 2021 -
క్యాంపస్‌లో కౌగిలించుకున్నారు, కట్ చేస్తే..
లాహోర్: ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమను వ్యక్తీకరించడం గొప్ప అంటుంటారు. కానీ ఇలా ఏకంగా చదువుల నిలయమైన యూనివర్సిటీలో ప్రపోజ్ చేసుకోవడం కొంత ఆశ్చర్యకరమే! అందులోనూ అందరి ముందే హగ్గులిస్తూ ప్రేమలో తూలి తేలిపోవడం మరింత విడ్డూరకరం. ఈ అరుదైన ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఇద్దరు ప్రేమ పక్షులు వారి మనసులోని భావాలను ఒకరికొకరు చెప్పుకునేందుకు క్యాంపస్నే ఎంచుకున్నారు. అందరూ చూస్తుండగానే యువతి మోకాలిపై కూర్చుని మనసు పడ్డ వ్యక్తికి పువ్వులు ఇస్తూ ప్రపోజ్ చేసింది. దీంతో అతడు ఆమెను అక్కున చేర్చుకుని కౌగిలితంల్లో బంధించాడు. దీన్నంతటినీ అక్కడున్న విద్యార్థులు ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూనివర్సిటీ అధికారులు ఆ ఇద్దరినీ తమముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను వారు బేఖాతరు చేశారు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కింద వారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, వారు యూనివర్సిటీకి సంబంధించిన ఏ క్యాంపస్‌లోనూ అడుగు పెట్టేందుకు వీల్లేదని నిషేధం విధించారు. కాగా ఈ వీడియో గత వారం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరినీ డిబార్ చేసినట్లు యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లు తీసుకున్న నిర్ణయం మంచిదేనని కొందరు హర్షిస్తే వాళ్లు ప్రేమించుకుంటే మీకేంటంటా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. చదవండి: మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి వైరల్: ఆకలేస్తే అంతేమరీ! -
'కౌ'గిలింత
ఆవు మనకు గోమాత.కాని ఆవు యాంగ్జయిటీని తగ్గించే డాక్టర్ కూడా అని హాలెండ్వాసులే ముందు కనిపెట్టి దశాబ్దం నుంచి‘కౌ హగింగ్’ను సాధన చేస్తున్నారు. ఆవును కావలించుకుని కొంతసేపు గడిపితే యాంగ్జయిటీ పోతుందనివారు చెబుతున్న అనుభవం ఇప్పుడు మన దేశానికి కూడా వ్యాపించింది. కోవిడ్ సమయంలో ఆందోళనలు పోగొట్టుకోవడానికికౌ హగింగ్ను ప్రయత్నిస్తున్నారు. ‘కో నఫ్లెన్’ అంటారట డచ్‌లో ‘ఆవు కావలింత’ని. మన దేశంలో ఆవును గోమాతగా తలిచే వారుంటే ఆ దేశంలో ఆవును ఒక డాక్టర్‌గా చూసే వారున్నారు. ఆవును కావలించుకుని కాసేపు గడిపితే, ఆవును నిమిరితే, ఆవుతో బాధలు చెప్పుకుంటే, ఆవు నిర్మలమైన కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే, ఆవుకు ప్రేమ ఇస్తే, ఆవు నుంచి ప్రేమ పొందితే మనసు, శరీరం స్వస్థత పొందుతాయని కౌ హగింగ్ని ఒక థెరపీగా వారు భావిస్తారు. పదేళ్ల నుంచి ఉన్న సాంత్వన వైద్య భావన ఇప్పుడు అమెరికాకు మిగిలిన దేశాలకు కూడా ఒక నమ్మకంలా విస్తరిస్తోంది. అమెరికాలో అయితే కౌ హగింగ్ కోసం గోశాలలు నిర్వహిస్తున్నారు. కొన్ని గోశాలల్లో ఒక గోవును పట్టుకుని కూచోవడానికి దాదాపు 75 డాలర్లు (5 వేల రూపాయలు) వసూలు చేస్తున్నారు. అయితే అక్కడి గోశాలలు చాలా శుభ్రంగా, వాసన లేకుండా మెయింటెయిన్ చేస్తున్నారు. గరిక మీద తిరిగే ఆవులను అక్కడ చూడవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి కనుక కౌగిలింత మంచి ఫలితాలిస్తుందని సైకియాట్రిస్ట్‌లు కూడా చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన సైకియాట్రిస్ట్ ‘పసిపిల్లలనో, గోవు, శునకం వంటి పెంపుడు జంతువులనో కావలించుకుంటే ఆక్సీటోసిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు విడుదలయ్యి వత్తిడి కలిగించే కార్టిసోల్ హార్మోన్‌ను అదుపు చేస్తాయి’ అంటున్నారు. భారతదేశంలో విశ్వాసాల వల్ల కాని విధానాల వల్లగాని ప్రతి జీవి నుంచి, జీవజాలం నుంచి స్వస్థత పొందడానికే చూస్తారు. పశువులున్న వారి ఇళ్లల్లో పశువులతో అనుబంధం వల్ల పొందే ఆనందం తెలుసు.. -
‘రాహుల్ నీకు ధైర్యం ఉంటే నన్ను కౌగిలించుకో’
లక్నో : లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకున్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ‘రాహుల్ నీకు దమ్ముంటే నన్ను కౌగిలించుకో’ అంటూ సవాల్ కూడా విసిరారు. తనను ఆలింగనం చేసుకోవాలంటే రాహుల్ కనీసం ఓ పది నిమిషాలైనా ఆలోచించుకోవాల్సిందే అన్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని కౌగిలించుకున్న విషయం గురించి ప్రస్తావిస్తూ ‘ఒక వేళ రాహుల్ గాంధీ మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటే మీరు ఎలా స్పందిస్తారు’ అని అడగ్గా ‘ఇలాంటి జిమ్మిక్కులన్ని నా దగ్గర కుదరవు. ఇలాంటి చర్యలను నేను ఎన్నటికి ఆమోదించను. రాహుల్ పనులు చిన్న పిల్లల చేష్టల లాగున్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తి ఎవరూ ఇలా చేయరు. రాహుల్‌కు నిర్ణయం తీసుకునే సామార్ధ్యం, తెలివితేటలు లేవని’ విమర్శించారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ తన ప్రసంగం ముగిసిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ స్థానం వద్దకు వెళ్లి హఠాత్తుగా ఆయనను కౌగిలించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యోగి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఇలాంటి పిల్ల చేష్టలు చేసే రాహుల్ గాంధీని ప్రతిపక్షాలు ఎలా స్వీకరిస్తాయి. ఇక ఇప్పుడు అఖిలేయ్ యాదవ్, మయావతి, శరద్ పవర్ రాహుల్ గాంధీతో కలిసి పనిచేస్తారా? అని ప్రశ్నించారు. మూక దాడులపై స్పందిస్తూ.. గో రక్షకుల పేరుతో చేసే ఇలాంటి ఘటనలను తాను అంగీకరించబోనని స్పష్టంచేశారు. అంతే కాక గోవుల అక్రమ రవాణాను, గోవధను కూడా తాను సహించబోనని యోగి తేల్చి చెప్పారు. -
లోక్‌సభలో అనూహ్య ఘటన
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. లోక్‌సభలో శుక్రవారం ఊహించని దృశ్యం కంటపడింది. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎవరూ ఊహించని విధంగా ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మోదీ సర్కారు తీరును తీవ్రంగా తూర్పాబట్టారు. తనపై రాహుల్ విమర్శలు చేస్తున్నా మోదీ మాత్రం నవ్వుతూ కనిపించారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ స్థానం వద్దకు చేరుకున్నారు రాహుల్. ఆయనేం చేస్తారని సభలో ఉన్నవారితో పాటు లోక్‌సభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నవారంతా అనుకుంటుండగా.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. రాహుల్‌తో మొదట కరచాలనం చేసేందుకు మోదీ సిద్దపడగా ఆయన నిరాకరించారు. తర్వాత రాహుల్ గాంధీ హఠాత్తుగా మోదీని అమాంతం వాటేసుకున్నారు. మోదీతో పాటు ఈ దృశ్యాన్ని చూసినవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అక్కడి నుంచి తన స్థానానికి తిరిగి వెళుతున్న రాహుల్‌ను మరోసారి పిలిచి మోదీ కరచాలనం చేశారు. బాగా మాట్లాడారంటూ మెచ్చుకున్నారు. దీంతో సభలో వాతావరణం తేలికపడింది. రాహుల్ చిలిపి పని తన స్థానంలోకి వెళ్లి కూర్చోగానే రాహుల్ గాంధీ మరో చిలిపి పని చేశారు. మోదీని కౌగిలించుకున్న తర్వాత తన సీటులో కూర్చొన్న ఆయన చిరునవ్వులు చిందిస్తూ తమ పార్టీ సభ్యులను చూసి సరదాగా కన్నుగీటారు. మోదీని వాటేసుకుని ఆయనకు షాక్ ఇచ్చానన్న భావం రాహుల్ ముఖంలో కనపడింది. రాహుల్‌కు ప్రధాని మోదీకి ఏవిధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి. -
ప్రదర్శనలో సింగర్‌ను కౌగిలించుకుందని..
-
సింగర్‌ని కౌగిలించుకుందని..
రియాద్ : సౌదీ అరేబియా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో నిరూపించే సంఘటన మరొకటి చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో సింగర్‌ను కౌగిలించుకుందని ఓ మహిళను సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం తైఫ్ సిటీలో గాయకుడు మజిద్ అల్ మోహండిస్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో స్టేజి వద్ద ఉన్న మహిళ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. ఆమెను ఆపడానికి సిబ్బంది ప్రయత్నించారు. కానీ ఆమె వారిని నెట్టి మరీ అతన్ని కౌగిలించుకున్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గాయకుడి ప్రదర్శన కొనసాగింది. సౌదీ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ఎలాంటి సంబంధం లేని పురుషులను సౌదీ మహిళ తాకరాదు. దీంతో సదరు మహిళపై ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మహిళా సాధికారత విషయంలో ఇప్పుడిప్పుడే సౌదీ అరేబియా మెల్లగా అభ్యుదయపథం వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. చమురుపై ఆధారపడుతున్న సౌదీ భవిష్యత్తులో దాని నుంచి దూరంగా జరగాలనే ఉద్దేశంతో విజన్ 2030 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. మహిళల అభ్యున్నతికి ఆటంకాలుగా ఉన్న చట్టాలకు సవరణలు చేస్తూ వారికి సడలింపులు ఇస్తున్నారు. మహిళలు డ్రైవింగ్ చేయటంపై నిషేధం ఎత్తివేత, ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సౌదీలో మహిళల పట్ట కఠినంగా వ్యవహరించే చట్టాలు ఇంకా కొన్ని అమలులో ఉన్నాయి. డ్రెస్‌కోడ్ నిబంధన ఉంది. బహిరంగ ప్రదేశాల్లో తల నుంచి కాళ్ల దాకా బురఖా ధరించాలి. గాయకున్ని కౌగిలించుకున్న మహిళ కూడా బురఖా ధరించే ఉన్నారు. -
మోదీ ఆలింగనంపై విపరీతార్థాలు
హైదరాబాద్: ప్రముఖులు కలిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిని ఆలింగనం చేసుకోవడంపై ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనను మోదీ హత్తుకోవడంపై సోషల్ మీడియాలో కొందరు చేసిన విపరీతార్థాలు, వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్ లో చిలువలు పలువలుగా చూపించి హల్ చల్ చేసే ప్రయత్నం చేసింది. సాధారణంగా చిన్నవ్యక్తి కావొచ్చు.. పెద్ద వ్యక్తి కావచ్చు.. చిరుద్యోగి కావొచ్చి.. పెద్ద హోదాలో ఉన్న ఉద్యోగి కావొచ్చు.. గల్లీ నాయకుడు కావొచ్చు.. ప్రపంచ నేత అయ్యుండొచ్చు.. వీళ్లలో ఎవరూ ప్రత్యేకంగా ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు వెళ్లినా, మోదీ వారిని కలిసేందుకు వెళ్లినా అక్కడ జరిగే మొట్టమొదటి పని ప్రధాని నరేంద్రమోదీ వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా వాత్సల్యంతో పాటు సందర్భానుసారం అర్థం ఉంటుంది. ఒకరికొకరం భరోసా అని చెప్పుకోవడం కూడా దాని ఉద్దేశం అయి ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో ఇమిడి ఉన్న ఈ అంశాన్ని పెద్దగా బయటకు కనిపించకపోయినా చాలామంది పాటిస్తూనే ఉంటారు. అయితే, ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ కాస్త వక్రీకరించిన రీతిలో వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్ లో ఒక కథనాన్ని వెలువరించింది. మోదీ అభ్యంతరకరంగా అనిపించేలా ఏ నేతను వదిలిపెట్టకుండా అందరినీ హగ్ చేసుకుంటున్నారంటూ అందులో పేర్కొంది. అయితే ఇది తన సొంత ఉద్దేశం కాదని చెప్పేందుకు... మోదీ ఇతర దేశాల నేతలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలపై కొందరు వ్యక్తుల నెగెటివ్ స్పందనను జత చేసి ట్యాగ్స్ ఆ కథనానికి తగిలించింది. ముఖ్యంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయను ఆలింగనం చేసుకున్నప్పటి ఫొటోలను ఉద్దేశిస్తూ కొందరు ట్విట్టర్లో చేసిన కామెంట్లను ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. అందులో మోదీ ఆలింగనం చేసుకున్న విధానం ఎబ్బెట్టుగా ఉందన్నారు.. దీంతో హోలాండే తప్పించుకునేందుకు వెనక్కి తిరిగారు కానీ... అంటూ రాశారు. మరో ఫొటోలో మోదీ, హోలాండే గుర్రం ఎక్కి ఉన్నట్లుగా ఒక ఫొటో చూపిస్తూ మిస్టర్ అండ్ మిసెస్ హోలాండ్ పానిపట్‌కు వెళ్లే మార్గంలో... అని సోషల్ మీడియాలో ఒకరిద్దరి కామెంట్స్ ఆధారంగా కథనం అల్లేశారు. హోలాండే వెనుక భాగంలో మోదీ ఉన్న ఫోటోను టైటానిక్ లో హీరో హీరోయిన్ ఫొటోతో పోల్చారు. షిప్ లేకుండా నేలపై టైటానిక్ చిత్రంలోని ఫేమస్ సీన్ చూపించిన ఏకైక వ్యక్తి మోదీ ఒక్కరే.. మరో ఫొటోను చూపిస్తూ.. ఇంత దగ్గరిగానా ఇక చాలు.... అంటూ కామెంట్స్ పోస్టు చేశారు. మరొకరు మాత్రం ఆలింగనం అనేది ఫ్రెంచ్ సంస్కృతి కాదని మోదీకి ఎందుకు తెలియజేయలేదు.. అది కూడా వెనుక నుంచి.. వెనుక నుంచి హోలాండ్ను హగ్ చేసుకోవడం ఏవగింపుగా అనిపించడం లేదా అంటూ మరో వ్యక్తి చేసిన ట్వీట్‌ను అందులో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు ఆయా నాయకులను ఆలింగనం చేసుకున్న ఫొటోలను పెట్టారు. -
బలవంతపు కౌగిలింత!
అక్షర తూణీరం లాలూ కేజ్రీవాల్‌ని ఏకపక్షంగా ఆలింగనం చేసుకుని వార్తల్లో కెక్కాడు. కేజ్రీవాల్ ఈ ఘటనలో నాకే పాపం తెలియదన్నాడు. అయినా అమలిన ఆలింగనానికి ఇంత రాద్ధాంతం అవనరమా? సృష్టిలో ఆలింగ నానికి ఒక అర్థం, పరమార్థం కల్పించి, సార్థకం చెందిన ఆద్యుడు మార్కండేయుడు. శివలింగాన్ని గాఠ్ఠిగా కౌగిలించుకుని, మరి వదల్లేదు. దాంతో మార్కండేయుడు మృత్యుంజయుడైనాడు. తదాది ఆలింగనం ఒక సదాచారంగా, సేవగా, మర్యాదగా ప్రబలింది. శృంగారపు కౌగిలింతలు వేరు. నేను మాట్లాడేది అమలిన ఆలింగనాల గురించి- కొందరు అమృతమూర్తులు ప్రేమగా ఆలింగనం చేసుకుని సాంత్వన పరుస్తారు. కొన్ని మత సంప్రదాయాలలో ఇది పరిపాటి. మూడుసార్లు మార్చిమార్చి హత్తుకుని తమ ఆత్మీయతను వ్యక్తపరుస్తారు. కొందరు స్వామీజీలు గాఢంగా ఆలింగనం చేసుకుని, భక్తుడి తల గుండెలకు పొదువుకుని, ‘నీ స్థానం ఇదిరా’ అని భరోసా ఇవ్వడం నాకు తెలుసు. అప్పుడు రుద్రాక్షలు బుగ్గలకు గుచ్చుకోవడం; గంధం, చెమట కలసిన వాసన ముక్కుకి తగలడం తప్పదు. ఆలింగనంలో ఒక రకమైన విద్యుత్ పుడుతుందని పరిశోధనల్లో తేలింది. రెండు శరీరాలు ఆపాదమస్తకం హత్తుకున్నప్పుడు ఆ దేహాల్లో, మెదళ్లలో ఉన్న నెగెటివ్ కరెంట్స్ యావత్తూ ఎర్త్ అయిపోతాయట. కావచ్చు. కొన్ని ఉత్తమజాతి వృక్షాలు మాంచి వయసులో ఉన్న కన్నెపిల్లలు కౌగిలించుకుంటే కానీ పూయవట. వృక్షాలు ప్రాణులే కదా! మనకున్న రకరకాల కౌగిళ్లలో ధృతరాష్ట్ర కౌగిలి ఒక ప్రత్యేకం. ఇది కూడా అప్రస్తుతం. ఎన్నికల తరుణంలో అభ్యర్థులు ఎదురైన వారందరినీ విచక్షణారహితంగా పొదువుకుంటారు. ఉత్తర భారతానికి హత్తుకునే అలవాటు ఎక్కువ అంటారు. బహుశా చలిప్రాంతం వల్ల కావచ్చు. ఆలింగనం అంటే నాకు ఒక ఉదంతం గుర్తుకు రాకుండా ఉండదు. మా ఆఫీసు టైపిస్ట్ విజయ తల మీద ఉన్నట్టుండి బల్లి పడింది. ఆఫీసంతా కలకలం రేగింది. పైగా శిరస్సు ప్రాణగండం అన్నాడు శాస్త్రకారుడు. అసలెట్లా పడింది, కొంచెం పక్కన కూచోవలసింది, నడినెత్తిన పడిందా, చెంపకు జారిందా లాంటి ప్రశ్నలలో ఆ పిల్ల తలప్రాణం తోకకు వచ్చింది. పైగా నిలువెల్లా భయం. ఏం ఫర్వాలేదు, వెళ్లి కంచి బల్లిని తాకివస్తే ఏ దోషమూ లేదని సెక్షనాఫీసరు ధైర్యం చెప్పాడు. విజయకి ఎక్కిళ్లు ఆగడం లేదు. స్ప్రింగ్డోర్లోంచి బయటకొచ్చిన పెద్దాయన, దీనికంత రాద్ధాంతమా? ఎవరైనా కంచిబల్లి తాకొచ్చిన వారిని తాకితే చాలు అనగానే, అందరూ చిత్తరంజన్ వైపు చూపులు తిప్పారు. ఎందుకంటే ఆ కుర్రవాడు చిన్నతనంలో కంచికి వెళ్లొచ్చిన కథనం పలుమార్లు పలువురికి చెప్పి ఉన్నాడు. విజయ దుఃఖభారంతో ఇంటికెళ్లి, మర్నాడు తల్లిగారిని వెంటబెట్టుకు వచ్చింది. మా విజయ చెయ్యి పట్టుకుని ప్రాణదానం చేయమని కోరగా, పాణిగ్రహణానికి చిత్తరంజన్ నిరాకరించాడు. విజయ జాలిగా, ‘లైఫ్ అండ్ డెత్ కొశ్చన్’ అన్నట్టుగా చూసింది. ‘దేహాన్ని పూర్తిగా స్పృశిస్తే తప్ప ఫలితం ఉండదని జాగంటి వారు మొన్ననే రేడియోలో ప్రవచించారు. ఒక ఎండు ఖర్జూరం, ఒక వక్క తెప్పించండి! పూర్తి విరుగుడుకి ఉపాయం ఉందన్నా’డు చిత్తరంజన్. క్షణంలో కోరినవి వచ్చాయి. ఒకరి ఎంగిలి ఒకరు చవి చూస్తే తప్ప బల్లిపాటు దిగదుట- అంటూనే విజయ చేత కొరికించి తను నోట్లో వేసుకున్నాడు. తను వక్క కొరికి ఇచ్చాడు. తర్వాత చాలా సిగ్గుపడుతున్న విజయని చిత్తరంజన్ మెడిసినల్‌గా కౌగిలించుకున్నాడు. రెండేళ్లకు వారిద్దరికీ పెళ్లి అయింది. బల్లిపాటు ఒక ఐడియా మాత్రమేనని కొందరికే తెలుసు. లాలూ కేజ్రీవాల్‌ని ఏకపక్షంగా ఆలింగనం చేసుకుని వార్తల్లోకెక్కాడు. కేజ్రీవాల్ ఈ ఘటనలో నాకే పాపం తెలియదన్నాడు. అయినా అమలిన ఆలింగనానికి, చిన్న అల్లాయ్ బల్లాయ్కి ఇంత రాద్ధాంతం అవనరమా? శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)