trees
-
దుమ్మును అడ్డుకునే దమ్ము
హైదరాబాద్‌లో రోజురోజుకూ వాహన, పారిశ్రామిక కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో నగరానికి చెందిన ఓ సంస్థ దీనికి ఓ విరుగుడును గుర్తించింది. దుమ్ము, వాయు కాలుష్యాన్ని సమర్థంగా నియంత్రించడంలో కొన్ని జాతుల వృక్షాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తాజా పరిశోధనలో తేల్చింది. ముఖ్యంగా మర్రి జాతి చెట్లు అత్యంత సమర్థంగా వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయని.. వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు సైతం కాలుష్య స్థాయిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నిర్ధారించింది. ఈ జాతుల చెట్లు దుమ్మును ఒడిసిపట్టుకోగలవని, గాలిలోని ధూళిని తట్టుకొని ఎదగగలవని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ పరిశోధన వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరిశోధనను పంకజ్ సింగ్ (సైంటిస్ట్–డీ – పరిశోధన బృంద సమన్వయకర్త), భారతీ పటేల్ (సైంటిస్ట్–డీ – అటవీ జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు) నిర్వహించారు. జీవరసాయననమూనాలతో.. ఈ పరిశోధన కోసంహైదరాబాద్ శివార్లలో అధిక కాలుష్యం వెలువరించే పరిశ్రమలున్న దూలపల్లి, బొల్లారంపారిశ్రామిక అభివృద్ధి ప్రాంతం, మేడ్చల్ హైవే వెంబడి ఉన్న తుక్కుగూడ ప్రాంతంలోని పలు చెట్ల జాతుల నుంచి జీవరసాయన నమూనాలను సేకరించారు. ఆయా నమూనాలనువిశ్లేషించగా వాటిలో మర్రి, వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు వాయు కాలుష్య నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.గ్రీన్‌బెల్ట్ విస్తరణకు దోహదం పారిశ్రామిక ప్రాంతాలతోపాటు ప్రధాన హైవేల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్లుగా ఈ జాతుల మొక్కలను నాటడం ద్వారా సత్ఫలితాలను పొందొచ్చని సూచించారు. నగరంలో గ్రీన్ బెల్ట్ విస్తరణకు, వాయుకాలుష్యం నియంత్రణతోపాటు వడగాడ్పుల ప్రభావం తగ్గించేందుకు, మట్టి, శబ్ద, నీటి కాలుష్యం నివారణకు సైతం ఈ వృక్షాలు దోహదపడతాయనిపేర్కొన్నారు.వాయు కాలుష్య తీవ్రతను సూచించే వరగోగువివిధ ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రతను తెలియజేయడంలో వరగోగు (సొగసుల చెట్టు) జాతి చెట్లు కీలకపాత్ర పోషిస్తున్నాయని కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది. పారిశ్రామిక వ్యర్థాలు అధికంగా ఉండే చోట లేదా భారీ ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో ఈ చెట్ల ఆకులు రంగుమారడం, మాడిపోవడం కనిపిస్తుందనిపరిశోధకులు పేర్కొన్నారు. - సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ..
సాక్షి, హైదరాబాద్: వరదల నుంచి 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు ఒకటి.. కొబ్బరికాయ ముడుపు కడితే వీసాలు ప్రసాదించేది మరో చెట్టు.. చేతులెత్తి మొక్కితే మొండి రోగాలను కూడా నయం చేస్తుందని భక్తులు నమ్మేది ఇంకో చెట్టు.. దోపిడీ దొంగల్ని పట్టించిన మరొక చెట్టు.. ఇలా రాష్ట్రంలో దేనికవే ప్రత్యేకమైన 9 పురాతన వృక్షాలున్నాయి. ఈ చెట్ల పరిరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ ‘వట’ ఫౌండేషన్.. ఆయా వృక్షాలకు వారసత్వ సంపద గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దేశంలోని పురాతన చెట్ల చరిత్రను డాక్యుమెంట్ చేయాలనే లక్ష్యంతో ‘వట’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ కృష్ణ ఇప్పటివరకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సుమారు 27 వేల కి.మీ. ప్రయాణించారు. అతి పురాతన చెట్లను గుర్తించి, వాటిని గూగుల్ ఎర్త్ ప్రో మ్యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 150 వృక్షాలను మ్యాపింగ్ చేశారు. మనుగడ కోల్పోయే దశలో ఉన్న వృక్షాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద సంస్థలు దత్తత తీసుకోవాలని కోరారు.తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ..దొంగల్ని పట్టించిన బావోబాబ్..హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో 600 ఏళ్ల నాటి పురాతన బావోబాబ్ చెట్టు ఉంది. గోల్కొండ కోట గోడను ఆనుకొని ఉన్న ఈ వృక్షపు కాండం ఒక రహస్య గది మాదిరిగా ఉంటుంది. ఇందులో 20 మంది దాక్కునేంత కుహరం ఉంది. దీంతో దొంగలు పగటి పూట ఈ రహస్య గదిలో దాక్కొని రాత్రి సమయంలో కోట పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేవారు. ఒకరోజు దొంగలు వంట చేస్తుండగా చెట్టు వెనక నుంచి పొగలు రావడం స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని సైనికులకు తెలపడంతోదొంగల గుట్టురట్టయింది.వరదల నుంచి కాపాడిన చింత..ఉస్మానియా ఆసుపత్రిలో చింత చెట్టు ఉంది. 1908, సెప్టెంబర్ 28న మూసీ నది వరదలు నగరాన్ని ముంచెత్తాయి. దాదాపు 30 వేల మంది మరణించారు. ఆ సమయంలో ప్రాణాలు రక్షించుకునేందుకు 150 మంది ప్రజలు ఈ చింత చెట్టు ఎక్కి రెండు రోజుల పాటు కొమ్మలపైనే ఉన్నారు. ప్రతీ ఏడాది నవంబర్ 30న హాస్పిటల్ డేను ఈ చెట్టు కిందే ఆసుపత్రి సిబ్బందిజరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.చెట్టుకు రాఖీ..నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని చీమ చింత చెట్టు భారీ వర్షానికి నేల కూలింది. 2017లో స్కూల్ యాజమాన్యంతో కలిసి ‘వట’ ఫౌండేషన్ దీనికి తిరిగి జీవం పోసింది. భారీ క్రేన్ సహాయంతో ఆ చెట్టును తిరిగి భూమిలో పాతారు. అప్పటినుంచి ఏటా జూన్ 28న విద్యార్థులు, టీచర్లందరూ ఆ చెట్టకు రాఖీ కడుతూ పండగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.వేయి ఉరుల మర్రి నిర్మల్‌లోని వేయి ఉరుల మర్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రామ్‌జీ గోండు నాయకత్వంలో స్వయంపాలన ప్రకటించుకున్న గిరిజనులను బ్రిటిష్ పాలకులు దారుణంగా అణచివేశారు. రామ్‌జీ గోండును, అతని వేయి మంది సైన్యాన్ని పట్టుకొని ఈ మర్రి చెట్టుకు1860 ఏప్రిల్ 9న అందరినీ ఒకేసారి ఉరి తీసినట్లు జాన పధ కథల్లో చెబుతుంటారు. అందుకే ఈ చెట్టును ‘వెయ్యి ఉరుల మర్రి’గా పిలుస్తుంటారు. అయితే కాలక్రమేణా ఈ వృక్షం నరికివేతకు గురి కావడంతో ఇక్కడ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు.రోగాలు మాన్పించే వృక్షం..చేవెళ్లలోని దామరిగిద్దలోఉన్న చింత చెట్టు 600 ఏళ్ల నాటిది.ఈ పురాతన చింత చెట్టుకు ఒక బొరియఉంటుంది. అనారోగ్యంతో ఉన్న పిల్లలుఈ బొరియ గుండా వెళితే రోగం నయమవుతుందని గ్రామస్తుల విశ్వాసం.పర్యాటక పిల్లలమర్రి..మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి సుమారు 800 ఏళ్ల నాటి భారీ వృక్షం. ఒకప్పుడు 4 ఎకరాల్లో విస్తరించి ఉండేది. కానీ, ఆక్రమణ కారణంగా ప్రస్తుతం 2.5 ఎకరాలకు పరిమితమైపోయింది. ఈ చెట్టును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. భారీ కొమ్మలతో విశాలంగా విస్తరించి ఉండటంతో ఈ ప్రాంతానికే పిల్లల మర్రి అనే పేరు వచ్చింది. వేల కొద్ది మర్రి ఊడల కారణంగా ప్రధాన కాండం ఏదో స్పష్టంగా గుర్తించలేం.వీసాలు ప్రసాదించే మర్రి హిమాయత్‌సాగర్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయం ఎలాగైతే వీసా గాడ్‌కు పేరు గాంచిందో.. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లోని మర్రి చెట్టు కూడా వీసాల చెట్టుగా గుర్తింపు పొందింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, కార్మికులు ఎరుపు లేదా తెలుపు రంగు గుడ్డలో కొబ్బరికాయ కట్టి ఈ చెట్టుకు ముడుపు కడితే వీసా వస్తుందని స్థానికుల విశ్వాసం. అయితే వడగళ్ల వర్షం కారణంగా ఈ భారీ వృక్షం నెలకొరిగింది. చుట్టుపక్కల నివాసితులకు ముప్పుగా మారడంతో గ్రామస్తులు వృక్షంలోని ఎక్కువ భాగాన్ని నరికివేశారు. కేవలం 15 అడుగుల వరకు విస్తరించి ఉన్న భారీ కాండం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. జహీరాబాద్‌లోని గొట్టిగారిపల్లి గ్రామంలోని చెరువు పక్కన ఉన్న మర్రి చెట్టు, నిజామాబాద్‌లోని ఆర్గుల్ గ్రామంలోనిఒక కొండపై ఉన్న మూడు పురాతన చింత చెట్లు కూడావందల ఏళ్ల నాటి వృక్షాలే. చారిత్రక గుర్తింపుతో ఆయావృక్షాలు పర్యాటకలను ఆకర్షిస్తున్నాయి. -
ఇక్కడ తొలగించి..అక్కడ పెంచి..!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణంతో 56 వేల వృక్షాలు నేలకూలబోతున్నాయి. ఈ భాగం రోడ్డు అలైన్‌మెంటు పరిధిలో ఉన్నందున వీటిని తొలగించేందుకు అటవీ శాఖ అనుమతించింది. భారీ సంఖ్యలో వృక్షాలను తొలగించాల్సిరావటంతో పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో వాటి లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కోల్పోయిన చెట్లకు ప్రతిగా 3.30 లక్షల మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే మహబూబాబాద్‌లో భూమిని ఎంపిక చేశారు. మూడు ప్రాంతాల్లో ఎక్కువ అటవీ భూములు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన్ని నిర్మించే 162 కి.మీ. నిడివిలో మూడు ప్రాంతాల్లో అటవీ భూములు అడ్డు వస్తున్నాయి. అడవి గుండా రోడ్డు నిర్మిస్తే వన్యప్రాణుల సంచారానికి ఇబ్బందిగా మారుతుంది. దీంతో ఆయా అటవీ భూముల్లో ఏదో ఒక చివరి నుంచి అలైన్‌మెంటు సాగేలా కన్సల్టెన్సీ సంస్థ దృష్టి పెట్టింది. రోడ్డుకు ఓవైపు 95 శాతం అటవీ భాగం ఉంటే, మరోవైపు 5 శాతం వరకు మాత్రమే ఇతర భూమి ఉండేలా అలైన్‌మెంటును రూపొందించింది. గజ్వేల్, నర్సాపూర్, యాదాద్రి ప్రాంతాల్లో ఈ అటవీ భూములున్నాయి. మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లా పరిధిలో 8.511 హెక్టార్లు.. వెరసి 72.3536 హెక్టార్ల మేర అటవీ భాగం అలైన్‌మెంటు పరిధిలోకి వచ్చింది. అంటే 200 ఎకరాలకు లోపు మాత్రమే ఉత్తర రింగు ప్రభావానికి గురికానున్నాయి. ఈ ప్రాంతాల్లో 44 వేల వృక్షాలను తొలగించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. దీంతో వాటిని తొలగించేందుకు ఇటీవల అటవీ శాఖ అనుమతించింది. ఇక అటవీ భూముల వెలుపల ఉండే సాధారణ భూముల్లోని మరో 12 వేల వృక్షాలను కూడా తొలగించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. వెరసి ఉత్తర భాగం పరిధిలో 56 వేల వృక్షాలను తొలగించబోతున్నారన్న మాట. పరిహారం స్థానంలో మొక్కల పెంపకం ప్రాజెక్టుల్లో కోల్పోయే అటవీ భూములకు కూడా పరిహారం ఇచ్చే విధానం గతంలో అమల్లో ఉండేది. అయితే మోదీ ప్రభుత్వం.. పరిహారానికి బదులు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి వాటిల్లో మొక్కలను పెంచాలని నిర్ణయించింది. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ఇప్పుడదే వర్తింపజేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యామ్నాయ భూమి కేటాయించారు. కొత్తగూడ మండలం పరిధిలోని పొగుళ్లపల్లి, నీలంపల్లి, గంగారం మండలం పరిధిలోని చింతల్‌గూడ గ్రామంలో ఈ భూమిని గుర్తించారు. ఈ మూడు గ్రామాల పరిధిలో కలిపి 3,29,452 చెట్లు పెరిగేలా త్వరలో మొక్కలు నాటనున్నారు. జంతువులకు ఇబ్బంది కలుగకుండా ఎకో బ్రిడ్జీలు 3 అటవీ ప్రాంతాల్లో జింకలు, దుప్పులు, నక్క లు, కోతులు, కొండముచ్చులు, నెమళ్లు, ఎలుగుబంట్లు కొన్ని ఇతర జంతువులు ఉన్నాయని గుర్తించారు. రోడ్డు నిర్మాణంతో వీటికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోనున్నారు. జంతువులు ఒకవైపు నుంచి రోడ్డు దాటి మరోవైపు వెళ్లేలా ఎకో బ్రిడ్జీలు (పర్యావరణ హిత వంతెనలు) నిర్మించనున్నారు. వీటివల్ల పైనుంచి వాహనాలు వెళ్తున్నా, జంతువులు దిగువ నుంచి మరోవైపు వెళ్లేందుకు, వచ్చేందుకు వీలవుతుంది. ఇక జంతు సంచారం మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాల శబ్దాలు వాటిని ఇబ్బంది పెట్టకుండా రోడ్డుకు రెండు వైపులా నాయిస్ బారియర్స్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉంది. -
బయోడైవర్సిటీ లాస్!
పక్షులు, జంతువుల సహజ ఆవాసాల తగ్గుదల... క్షీణిస్తున్న అడవులు, తగ్గుతున్న చెట్ల విస్తీర్ణం, పచ్చదనం... ఇంకా లోతుగా విశ్లేíÙస్తే ప్రపంచవ్యాప్తంగా వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో వన్యప్రాణులు, పక్షి, జంతు, వృక్ష... ఇలా విభిన్న రకాల జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి.భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో వివిధరూపాల్లో పర్యావరణంపై, ఇతర రూపాల్లో ప్రభావం చూపేలా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అవసరానికి మించి సహజ వనరుల వినియోగం, గాలి, నీరు కాలుష్య బారినపడడం వంటి వాటి వల్ల జీవవైవిధ్యంపై ప్రభావం చూపడంతో పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ రిపోర్ట్– 2024’నివేదిక ప్రకారం చూస్తే... ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలో వన్యప్రాణుల జనాభా సగటు సైజ్ అనేది 73 శాతం మేర తగ్గిపోయింది. జూలాజిక్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్ఎస్ఎల్) రూపొందించిన ‘ద లివింగ్ ప్లానెట్ ఇండక్స్’ నివేదికను గమనిస్తే...1970–2020 మధ్యలో వివిధ జంతు, పక్షు జాతుల్లో 85 శాతం ఫ్రెష్ వాటర్ పాపులేషన్, టెర్రస్టియల్ పాపులేషన్ 69 శాతం, మెరైన్ పాపులేషన్ 56 శాతం తగ్గినట్టుగా తేలింది. జీవవైవిధ్యమనేది భూమి, విభిన్న రకాల మొక్కలు, వృక్షజాతులు, జంతు, పక్షి జాతులు, వివిధ రకాల సూక్ష్మజీవులు (మైక్రో ఆర్గనిజమ్స్) తదితరాలతో కూడుకుని ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్తెలంగాణలో చూస్తే..వివిధ రూపాల్లో వెల్లడైన వివరాలు, సమాచారం మేరకు చూస్తే తెలంగాణలో జీవవైవిధ్యా నికి వాటిల్లిన నష్టానికి ప్రధానంగా అడవులకు వాటిల్లుతున్న నష్టం, తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం, అంతర్ గ్రహ మొక్కలు (ఇన్వెసివ్ ఎలియన్ స్పీషీస్) విపరీతంగా పెరుగుదల, మత్స్య రంగ అతి వినియోగం, కాలుష్య స్థాయిల పెరుగుదల, వాతావరణ మార్పులతో చోటుచేసుకుంటున్న పరిణామాలు వంటివి కారణమవుతున్నాయి. ⇒ 2023 జూన్ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2 వేల మొక్కలు, వృక్షాల రకాలు, 5,757 జంతురకాలు ఉన్నట్టుగా తేలింది. సాధారణంగా జెనిటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీల ద్వారా జీవవైవిధ్యాన్ని పరిశీలిస్తారు. ⇒ 2023లో తెలంగాణలో 646 హెక్టార్ల సహజ అటవీ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. ఇండియన్ పంగోలిన్, మౌస్డీర్స్, మలబార్ పైడ్ హార్న్‌బిల్, బ్లాక్నెక్డ్ స్టోర్క్, రుడ్డి మంగ్యూస్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సంద్కోల్ కార్ప్ వంటి జంతు, పక్షి రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. స్లోత్బేర్, ఇండియన్ బైసన్, ఇండియన్ స్కిమ్మర్ బర్డ్ జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జీవవైవిధ్యం ఏ స్థాయిలో ఉంది, ఎదురవుతున్న సమస్యలు, అందుకు కారణాలు ఏమిటి? తదితర అంశాలపై పర్యావరణ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ తమ అభిప్రాయాలు, విశ్లేషణలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...గ్రీన్‌కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదుజీవవైవిధ్యం అంటే ఏమిటనేది అందరూ అర్థం చేసుకోవాలి. కేవలం గ్రీన్‌కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదు అని గుర్తించాలి. విధాన నిర్ణేతలు, ప్రజాప్రతినిధులు కూడా గడ్డిభూములు, బీడుభూములు వంటివి కూడా పర్యావరణవ్యవస్థల పరిధిలోకి వస్తాయని గుర్తించాలి. చెట్లు అనేవి జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని మనమంతా గుర్తించాలి. భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల పెద్దసంఖ్యలో చెట్ల తొలగింపు, గ్రీన్‌కవర్ తగ్గినప్పుడు జీవవైవిధ్యానికి నష్టం జరుగుతుంది.నగరాల్లోనూ రోడ్ల విస్తరణ, నిర్మాణపరమైన ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు వెంటనే ట్రీకవర్ తగ్గిపోయిన ప్రభావం తప్పకుండా జీవవైవిధ్యంపై పడుతుంది. పచ్చదనం పెంచేందుకు చేపట్టే కార్యక్రమాల సందర్భంగా గడ్డి మైదానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ విషయంపై తెలంగాణలో పెద్దగా దృష్టి సారిస్తున్న పరిస్థితులు అంతగా కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో తగినంత స్థాయిలో గడ్డిమైదాన ప్రాంతాలున్నాయి.వాటిని యుద్ధప్రాతిపదికన సంరక్షించాలి. అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాల్లో మంచిస్థాయిలో జీవవైవిధ్యమనేది అలరారుతోంది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలోని జాతీయపార్కులు, శాంక్చురీలలోనూ జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో దాదాపు పది, పన్నెండేళ్ల క్రితం నిర్వహించిన కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్యం కొంతమేర మెరుగైంది. రాష్ట్రంలో ఎంత మేర జీవవైవిధ్యాన్ని నష్టం జరిగింది, ఏ ఏ పక్షి, చెట్లు, జంతువుల రకాలు తగ్గిపోయాయనే దానిపై పూర్తిస్థాయిలో శాస్త్రీయ పరిశీలన, అధ్యయనమేదీ జరగలేదు. అందువల్ల ఎంతమేర నష్టం జరిగింది, ఏఏ జాతులు కనుమరుగు అవుతున్నాయనే దానిపై సాధికారికంగా వ్యాఖ్యానించేందుకు అవకాశం లేదు. –ఫరీదా తంపాల్, స్టేట్ డైరెక్టర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫర్ నేచర్–ఇండియా రాష్ట్రంలో దిగజారుతున్న జీవ వైవిధ్యం కొంతకాలంగా రాష్ట్రంలో జీవవైవిధ్యం అనేది దిగజారుతోంది. అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. కొన్ని చెట్లు, మొక్కల రకాలు కూడా అంతరిస్తున్నాయి. ఊర పిచ్చుకలు, బోరుగ పిచ్చుకలు దాదాపుగా కనబడకుండాపోగా, కాకులు, ఇతర పక్షుల సంఖ్య కూడా క్షీణిస్తోంది. కప్పలు, కొన్నిరకాల చేపలు కూడా తగ్గిపోతున్నాయి. అడవుల తగ్గుదల ప్రభావం, చెట్లు, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల జంతువులు, పక్షుల ఆవాసాలు, నివసించే ప్రదేశాలు కుచించుకుపోతున్నాయి. వాటికి సరైన ఆహారం దొరకడం లేదు. పక్షులు, ఇతర జంతువులు తాగేనీరే తక్కువ కాగా, అది అంతగా లభించడం లేదు. నగరం, పట్టణాల చుట్టుపక్కల పైపులైన్లతోనే ఇళ్లకు నీటి సరఫరా, ఉపరితలంపై ఉన్న నీరు కలుషితం కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పక్షులు, జంతువులు వంటి వాటికి నీరు, ఆహారం దొరక్క ఆవాస ప్రాంతాలు, గుడ్లు, సంతానం పెంపొందించుకునే అవకాశం లేకపోవడంతో పక్షి, జంతుజాతులు తగ్గిపోతున్నాయి. ప్రధానంగా అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా ప్రాజెక్టులు, ఇతర రూపాల్లో నిర్మాణాలు పెరిగిపోవడం, అవసరానికి మించి సహజవనరుల అతి వినియోగం, గణనీయంగా పెరిగిన రోడ్ల విస్తరణ, వాహనాల రాకపోకలు పెరగడం, ఆన్‌రోడ్డు వెహికిల్సే కాకుండా ఇసుక, మైనింగ్, ఇతర అవసరాల కోసం నీరు, ఇతర ప్రదేశాల్లోకి వాహనాల ప్రవేశం నష్టం చేస్తోంది.2012లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్య పరిరక్షణ, అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చారు. పిచ్చుకలు, ఇతర తగ్గిపోతున్న పక్షి, జంతుజాతులను ఎలా సంరక్షించాలనే దానిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణరంగ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ -
ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!
అండమాన్, నికోబార్ దీవులలో ‘అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొ రేషన్’ (ఏఎన్ఐఐడీసీఓ) అనే పాక్షిక–ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. ‘ఈ ప్రాంత సమతుల్య పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం సహజ వనరులను వాణిజ్యపరంగా ఉప యోగించుకోవడానికీ, అభివృద్ధి చేయడానికీ’ దీనిని కంపెనీల చట్టం కింద 1988లో స్థాపించారు. దాని ప్రధాన కార్యకలాపాలలో పెట్రోలియం ఉత్పత్తుల వర్తకంతో సహా, భారతదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, పాలు, పర్యాటక రిసార్ట్‌ల నిర్వహణ; పర్యాటకం కోసం, మత్స్య సంపద కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివీ ఉన్నాయి. అంతవరకు పెద్దగా తెలియని ఈ సంస్థకు 2020 ఆగస్టులో రాత్రికి రాత్రే గ్రేట్ నికోబార్ ద్వీపంలో 72 వేల కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ఇందులో భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, టౌన్షిప్ నిర్మాణంతో పాటు, 130 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ భూమిలో విస్తరించే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత, ఏఎన్ఐఐడీసీఓ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) నుండి రెండు కీలకమైన అనుమతులను పొందింది. మొదటిది, అక్టోబర్ 2022లో చోటు చేసుకుంది. మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) అటవీ భూమిని ఇతర అవసరాలకోసం మళ్లించేందుకు అనుమతించింది. అత్యంత సహజమైన, జీవవైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవులలో 130 చదరపు కి.మీ. (ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కంటే పెద్దది) విస్తీర్ణం కల భూమి మళ్లింపుపై ఈ కమిటీ సంతకం చేసింది. దాదాపు ఒక నెల తర్వాత, నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) కీలకమైన పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు పది లక్షల చెట్లను నరికివేయనున్నారన్న విషయంపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్లలో దాదాపు 8.5 లక్షల నుండి 9.64 లక్షల వరకు చెట్లు నరికివేయడంపై ప్రాథమిక అంచనాలు మారాయి. వాతావరణ సంక్షోభం వేగవంతమైన ఈ యుగంలో బలి ఇవ్వాల్సిన చెట్ల సంఖ్యను చూసి చాలా మంది నివ్వెరపోయారు. ఒక జాతీయ పత్రికలో నివేదించి నట్లుగా, నిజానికి మనం కనీసం 30 లక్షల చెట్లను కోల్పో వలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇది వాస్తవమైతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాజెక్ట్, అటవీ భూమి మళ్లింపు కోసం అనుమతి కోరినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్రతి పాదకుడు మంత్రిత్వ శాఖకు ఏ సమాచారాన్ని అందించారు? ద్వీపంలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ ఏజెన్సీని కోరినప్పుడు, నరికివేయాల్సిన చెట్ల సంఖ్య ఎవరికీ తెలియదా? పాలు, ఆల్కహాల్, పెట్రోలియం అమ్మకంలో ప్రధాన వ్యాపార అనుభవం ఉన్న సంస్థను ఈ వ్యవహారంలో ఎవరైనా క్షమించవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ, పర్యావరణ సంస్థల మాట ఏమిటి? పైగా పర్యావరణం, అటవీ అనుమతుల మాట ఏంటి?అన్ని వనరులూ, అధికారం తమ వద్దే ఉన్నందున, ఈఏసీ, ఎఫ్సీఏ సరైన ప్రశ్నలను ఎందుకు అడగలేదు? ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతిని మంజూరు చేసేటప్పుడు ఈఏసీ స్థానం కేసి అంతర్ దృష్టితో చూస్తే శాస్త్రీయ సామర్థ్యం, భాషలో నైపుణ్యం అనేవి ఈఏసీ నిర్దేశించిన ప్రమాణాల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి: ‘ఏ చెట్లూ ఒకేసారి నరికివేయబడవు. వార్షిక ప్రాతిపదికన పని పురోగతిని బట్టి దశలవారీగా ఈ పని జరుగుతుంది. అసాధారణంగా పొడవుగానూ, వయ స్సులో పెద్దగా ఉన్న అన్ని చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ ‘అసాధారణంగా పొడవైన చెట్టు’ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే? చెట్టు పాతదిగా పరిగణించ బడటానికి సరైన వయస్సును ఎలా నిర్ణయిస్తారు? ప్రారంభించడానికి, మీరు చెట్టు వయస్సును ఎలా అంచనా వేస్తారు? అలాగే ‘సాధ్యమైనంత వరకు’ వాటిని రక్షించడం అంటే అర్థం ఏమిటి? రెండవ ఉదాహరణ మరింత మెరుగైనది– ‘స్థానిక గుడ్లగూబల గూడు రంధ్రాలు ఉన్న చెట్లను ఎస్ఏసీఓఎన్ (సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్) సహాయంతో గుర్తించి జియో–ట్యాగ్ చేయాలి. అటువంటి చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ పక్షి ప్రవర్తన, రాత్రిపూట దాని అలవాట్లను పరిగణ నలోకి తీసుకుని, గుడ్లగూబను (ఏదైనా గుడ్లగూబ) చూడటం ఎంత కష్టమో తెలియనిది కాదు. నిజానికి, నికోబార్ వర్షాటవిలోని చెట్లు ఆకాశంలోకి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే, ఒక మిలియన్ చెట్లకు గూడు రంధ్రాలు వెతకడానికి మొత్తం 83,000 గంటల సమయం పడుతుంది. మన ఉత్తమ పక్షి వీక్షకు లలో 10 మంది ఏకకాలంలో రోజుకు 8 గంటలు సర్వే చేసినా, అది పూర్తి కావడానికి దాదాపు ఆరేళ్లు పడుతుంది.ఇప్పుడు ఈ ఆమోదిత షరతును మళ్లీ చదవండి. మీరు దీని గురించి ఏ భావాన్ని పొందగలరో చూడండి. ఈ చెట్లను లెక్కించడానికి, కత్తిరించడానికి రవాణా చేయ డానికి ఇప్పటికే ఏఎన్ఐఐడీసీఓ కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. గొడ్డళ్లు చెట్లను నేలకూల్చుతుంటే వాటిని రక్షించడం మాని... భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న గుడ్లగూబల గూడు రంధ్రాల కోసం మన ఎస్ఏసీఓఎన్ మిత్రులు వెతుకుతూ ఉండరని ఆశిద్దాం.-పంకజ్ సేఖసరియావ్యాసకర్త ఐఐటీ బాంబే అసోసియేట్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైవ్స్ సౌజన్యంతో) -
అందుకు కోర్టు అనుమతి తీసుకోవాలని తెలీదు: సుప్రీంకోర్టుకు ఢిల్లీ ఎల్జీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంలోని చెట్లను నరికివేయడానికి కోర్టు అనుమతి అవసరమని తనకు తెలియదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో గవర్నర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై నేడు(బుధవారం) సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.గవర్నర్ వీకే సక్సేనా.. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. రిడ్జ్ ప్రాంతంలో దాదాపు 600 చెట్లను నరికేయడంపై ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయస్థానం.. అక్రమంగా 600 చెట్లను నేల కూల్చడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారోవివరిస్తూవ్యక్తిగత అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ఎల్జీని ఆదేశించింది. ఈ క్రమంలోనే తాయన తాజాగా ప్రమాణపత్రం సమర్పించారు.ఇందులో తాను రిడ్జి ప్రాంతంలో మెడికల్ ఫెసిలిటీ నిర్మించాలనుకున్న ప్రదేశాన్ని ఫిబ్రవరి 3వ తేదీన సందర్శించినట్లు ఎల్జీ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆ నిర్మాణ అవసరం, ప్రాధాన్యం, దానికి కేటాయించిన వనరుల అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొన్నట్లు తెలిపారు. తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు విస్తరణ జరుగుతున్న స్థలంలో ఆగినట్లు తెలిపారు. నాడు కోర్టు అనుమతి లేకుండా చెట్లను నరికివేయకూడదనే అంశాన్ని ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు.అయితే.. ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేతకు అనుమతి కోరుతూ డీడీఏ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత మాత్రమే మార్చి 21న ఆ విషయం తనకు తెలిసినట్లు ఎల్జీ చెప్పారు.. చెట్లను నరికివేయడానికి కాంట్రాక్టర్లకు డీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనోజ్ కుమార్ యాదవ్, డీడీఏ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పవన్ కుమార్, ఆయుష్ సరస్వత్‌లు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వీరే నరికివేతకు అనుమతించారని తెలిపారు.పంకజ్ వర్మ, సూపరింటెండింగ్ ఇంజనీర్ యాదవ్‌లను కోర్టు నుండి వాస్తవాలను దాచేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.చెట్లను నరికివేయడంపై కొందరు డీడీఏ, ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై దాఖలైన ధిక్కార కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. చైర్పర్సన్ అంగీకరిస్తే, చెట్ల నరికివేతకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవని పేర్కొంది. -
అడవిని మింగిన సుడిగాలి
పచ్చని అడవులు సుడిగాలి బీభత్సానికి అతలాకుతలం అయ్యాయి. మహావృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయి, నేలకొరిగాయి. ఇదివరకు ఎన్నడూ కనివిని ఎరుగని ఈ బీభత్సం ములుగు జిల్లా తాడ్వాయి– మేడారం అభయారణ్యంలో జరిగింది. దాదాపు టోర్నడోను తలపించే ఈ ఉత్పాతం ఎందుకు జరిగిందనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) శాస్త్రవేత్తలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ బీభత్సానికి కారణాలు కనుగొనేందుకు అధ్యయనం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్న వేళ ఆగస్టు 31న సాయంత్రం సుమారు 4.30 నుంచి 7 గంటల సమయంలో మేడారం అటవీ ప్రాంతం ఈ ఆకస్మిక ఉపద్రవానికి గురైంది. హఠాత్తుగా సుడిగాలులు పెనువేగంతో చుట్టుముట్టాయి. సుడిగాలుల తాకిడికి దాదాపు 78 వేలకు పైగా భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయి నేలకూలాయి. తాడ్వాయి–మేడారం అభయారణ్యంలోని 204.30 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విధ్వంసం జరిగింది. నేలకొరిగిన వృక్షాల్లో మద్ది, పెద్దేగి, జిట్రేగి, నల్లమద్ది, ఎజిత, నారవేప, రావి, గుంపెన, పచ్చగంధం వంటి భారీ వృక్షాలు ఉన్నాయి. మరెన్నో ఔషధ వృక్షాలు ఉన్నాయి. ఇదివరకు ఎన్నోసార్లు భారీ వర్షాలు కురిసినా, ఇలాంటి సుడిగాలి బీభత్సం మాత్రం ఎన్నడూ సంభవించలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఈ అడవి చరిత్రలోనే కనివిని ఎరుగని బీభత్సమని వారంటున్నారు.కారణాలపై అన్వేషణఆకస్మిక సుడిగాలి బీభత్సానికి గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు జాతీయ స్థాయి సంస్థలైన ఐఎండీ, ఎన్ఆర్ఎస్సీ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మెట్రియలాజికల్ డేటా వచ్చిన తర్వాత మరింత అధ్యయనం చేసేందుకు వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రకృతి విలయం ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్త. ఇదివరకు 1996లో మధ్యప్రదేశ్‌లోని నౌరదేవి అభయారణ్యంలో చెలరేగిన గాలిదుమారానికి చెట్లు నేలకూలాయి. అయితే, తాడ్వాయి–మేడారం అభయారణ్యంలో జరిగినంత తీవ్రనష్టం ఇప్పటి వరకు ఇంకెక్కడా చోటు చేసుకోలేదని పర్యావరణవేత్త పురుషోత్తం చెబుతున్నారు. టోర్నడో తరహా బీభత్సంఒకేసారి వేలాది మహావృక్షాలను నేలకూల్చేసిన సుడిగాలిని టోర్నడో తరహా బీభత్సంగా అటవీ శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుడిగాలి బీభత్సాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వర్షానికి తోడు దట్టమైన మేఘాలు, గాలి దగ్గరగా రావడంతో సుడిగాలి చెలరేగి ఇంతటి విధ్వంసానికి దారితీసి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, భారతదేశంలో టోర్నడోలు చెలరేగే అవకాశమే లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలోని హిమాలయాలు సహా పర్వతాలు, కొండలు సుడిగాలులు చెలరేగకుండా అడ్డుకుంటున్నాయని, అందువల్ల టోర్నడోలు రావని చెబుతున్నారు. పైగా, మన దేశంలోని వేడి, ఉక్కపోత వాతావరణంలో టోర్నడోలకు అవకాశమే ఉండదని అంటున్నారు. విపరీతమైన వాతావరణ మార్పులు చోటుచేసుకునే ప్రదేశాల్లో టోర్నడోలు చెలరేగుతుంటాయి. ఉత్తర అమెరికా, అగ్నేయ–దక్షిణ అమెరికా, యూరోప్‌లోని పలు దేశాలు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో టోర్నడోలు అప్పుడప్పుడు విధ్వంసాన్ని సృష్టిస్తుంటాయి. గడ్డం రాజిరెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్అడవి పునరుజ్జీవానికి మరో పదేళ్లుభారీ విధ్వంసానికి గురైన ఈ అడవి పునరుజ్జీవనానికి కనీసం మరో పదేళ్లు పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు చెబుతున్నారు. అడవిలో ఎలాంటి మొక్కలు నాటవద్దని, దానంతట అదే పునరుజ్జీవనం పొందుతుందని అంటున్నారు. కూలిన చెట్ల కొమ్మలను నరికివేసేందుకు, నిప్పు పెట్టేందుకు కొందరు ప్రయత్నించవచ్చని, అలాంటి చర్యలను నివారించాలని చెబుతున్నారు. ఏటూరునాగారం లేదా ములుగు ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఒక వాతావరణ పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఇలాంటి కేంద్రమేదీ లేకపోవడం వల్లనే జరిగిన విధ్వంసాన్ని అటవీశాఖ ముందుగా తెలుసుకునేందుకు వీలు లేకపోయిందని అధికారులు చెబుతున్నారు.అధ్యయనం తప్పనిసరిప్రకృతి కన్నెర్రచేస్తే దేవుడు కూడా కాపాడలేడనడానికి నిదర్శనం ఈ బీభత్సమని వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ కె.వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆకస్మిక ప్రకృతి బీభత్సాలపై తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెరిపిలేని వర్షం, ఈదురు గాలుల వల్ల టోర్నడో స్థాయి విధ్వంసం ఇక్కడి అడవిలో జరిగిందని, దేశంలో ఎక్కడా ఇదివరకు ఇలాంటి విధ్వంసం జరగలేదని అన్నారు. దాదాపు 78 వేల మహావృక్షాలు నేలకూలిపోయాయంటే, ఆ ప్రభావం పర్యావరణంపై చాలానే ఉంటుందని, ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా ప్రత్యేక అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు.∙కె.వెంకట్‌రెడ్డి,ప్రొఫెసర్, ఎన్ఐటీ, వరంగల్ఇది టోర్నడో కాదుములుగు జిల్లా అటవీప్రాంతంలో వచ్చినది టోర్నడో కాదని పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు కె.పురుషోత్తం అంటున్నారు. ఇక్కడ ఒకేసారి దట్టమైన మేఘాలు కమ్ముకుని, ఒకేసారి వర్షించడంతో కొమ్మలు బాగా తడిసిపోయి, విరిగిపోయాయని, గురుత్వాకర్షణ మూలంగా ఒకేచోట గాలి అంతా కేంద్రీకృతం కావడంతో ఈ అటవీ ప్రాంతం భారీ విధ్వంసాన్ని ఎదుర్కొందని ఆయన వివరించారు. దీనిని టోర్నడోగా కాదు, డౌన్బరస్ట్గా భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే సుడిగాలి చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించి ఉంటే, భారీ స్థాయిలో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించి ఉండేదని అన్నారు. ఈ బీభత్సాన్ని వాతావరణ మార్పుల కారణంగా తలెత్తిన ప్రకృతి ప్రకోపంగానే భావించాల్సి ఉంటుందని పురుషోత్తం అన్నారు. దట్టమైన అడవి కారణంగానే ఈ సుడిగాలి బీభత్సం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించకుండా ఉందని, విధ్వంసం తాకిడి మొత్తాన్ని అడవి భరించిందని తెలిపారు. ఈ అటవీ ప్రాంతంలోనిది ఇసుక నేల కావడంతో భారీవృక్షాల వేళ్లు కూడా ఎక్కువ లోతుకు వెళ్లలేదని, అందుకే అవి కూలిపోయాయని వివరించారు. ∙కె.పురుషోత్తం, అధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక -
నేలకొరిగిన లక్ష చెట్లు..
-
మానవాళికి ముప్పుగా ఉంటే ఏ చెట్లనైనా కొట్టేయొచ్చు
సాక్షి, అమరావతి : మానవాళికి ముప్పుగా పరిణవిుంచినప్పుడు ఏ చెట్లనైనా కొట్టేయడంలో తప్పేమీ లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం అభిప్రాయపడింది. కోనో కార్పస్ చెట్ల విషయంలో అలాంటి ముప్పు ఉందని భావించే వాటిని నరికేస్తుండవచ్చని తెలిపింది. జమ్ము కశ్మీర్లో ఇలాగే ఓ రకం చెట్ల నుంచి వచ్చే దూది లాంటి పదార్థం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చివరికి ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యక్తీ మాస్క్ ధరించాల్సి వచ్చేదని తెలిపింది. కోనో కార్పస్ చెట్ల విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉండొచ్చునని, అందుకే వాటిని తొల గించాలని నిర్ణయించి ఉంటారని చెప్పింది. కోనో కార్పస్ చెట్లను కొట్టేయకుండా, ఇవి మానవాళికి హానికరమో కాదో తేల్చేందుకు నిపుణుల కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, నాగార్జున వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ కె.బయపురెడ్డి, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.రామచంద్రారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. కోనో కార్పస్ చెట్లపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, వాటి ఆధారంగా కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 645 చెట్లు కొట్టేశారన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు స్పందిస్తూ.. శాస్త్రీయ అధ్యయనం చేయకుండా చెట్లను కొట్టేయడం సరికాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు చెట్లు నాటేందుకు మీరేం చర్యలు తీసుకున్నారు? ఇప్పటివరకు ఎన్ని నాటారు వంటి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 6కి వాయిదా వేసింది. -
తాజా మొలకలు త్వరగా ఎదిగేలా చేస్తుంది.. ఎలా అంటే?
మొలకెత్తిన గింజలు తినడం పాత అలవాటే అయినా, వాటికి లేలేత ఆకులు పుట్టుకొచ్చేంత వరకు పెంచి, వాటిని ‘మైక్రోగ్రీన్స్’ పేరిట తినే అలవాటు ఇటీవలి కాలంలో పెరుగుతోంది. మట్టి కుండీల్లో గింజలు చల్లి ‘మైక్రో గ్రీన్స్’ పెంచుతుంటారు. ఇలా పెంచడం వల్ల కొన్ని గింజలు కుళ్లిపోయి, వృథా కావడం జరుగుతూ ఉంటుంది. ఈ ‘ఆటోస్ప్రౌట్’ పరికరం గింజలను ఏమాత్రం వృథా పోనివ్వకుండా, తక్కువ వ్యవధిలోనే ‘మైక్రోగ్రీన్’ మొలకలు ఎదిగేలా చేస్తుంది.దీనిని ఉపయోగించుకోవడం చాలా తేలిక. దీనిలో అరకిలో గింజలను వేస్తే, రెండు నుంచి ఆరు రోజుల్లోగా ఆకుపచ్చని మొలకలు పెరుగుతాయి. స్టెయిన్లెస్ స్టీల్, టెంపర్డ్ గ్లాస్, కొద్ది కలప తప్ప ప్లాస్టిక్ లేకుండా తయారు చేసిన ఈ పరికరం అధునాతన మిస్టింగ్ టెక్నాలజీతో త్వరగా ఆరోగ్యకరమైన మొలకలు ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇందులో మూడు అంతస్తుల ట్రేలలో గింజలను చల్లుకుని పెట్టుకోవచ్చు. దీనిని ఆన్ చేసుకుంటే, దీని లోపల ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి, మిస్టింగ్ టెక్నాలజీ సౌకర్యంతో వెలువడే తేమ వల్ల మొలకలు త్వరగా పెరుగుతాయి. ‘ఆటోస్ప్రౌట్’ స్వీడిష్ కంపెనీ ఈ ఆటోమేటిక్ స్ప్రౌటింగ్ మెషిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 5,192 స్వీడిష్ క్రోనాలు (రూ.41,369)దుస్తులను త్వరగా ఆరబెడుతుంది..దుస్తులను ఉతుక్కోవడం ఒక ఎత్తు అయితే, వాటిని ఆరబెట్టుకోవడం మరో ఎత్తు. ఎండ కాసే సమయంలో ఆరుబయట దండేలకు ఆరవేస్తే దుస్తులు ఏదోలా ఆరిపోతాయి. మబ్బు పట్టినప్పుడు, ఎడతెగని ముసురు కురిసేటప్పుడు దుస్తులను ఆరబెట్టుకోవడం ఎవరికైనా సవాలే! ఇంటి లోపల దండేలు కట్టుకుని, దుస్తులను ఆరబెట్టుకుందామనుకుంటే, అవి ఒక పట్టాన ఆరవు. గంటలు గడిచే కొద్ది ముక్క వాసన కూడా వేస్తాయి.అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు డచ్ కంపెనీ ‘స్పీడ్డ్రైయర్’ తాజాగా ఈ రోటరీ క్లాత్స్ ర్యాక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ఆరుబయటనే కాదు, ఇంటి లోపల కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది విద్యుత్తుతో పనిచేస్తుంది. దీనికి దుస్తులను తగిలించి, ఆరబెడితే, ఇది వేగంగా తిరుగుతూ దుస్తులు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది. ఒకసారి దుస్తులను ఆరబెట్టడానికి ఇది వినియోగించుకునే విద్యుత్తు కేవలం 10 వాట్లు మాత్రమే! దీని ధర 219 యూరోలు (రూ.20,519) మాత్రమే! -
భవిష్యత్ తరాలను కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు పెంచి భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ఆ బాధ్యతను మరిచిపోకుండా చర్యలు చేపట్టాలని, ఏం చర్యలు చేపట్టారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో సంబంధం లేదన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్లుగా విచారణ సాగుతున్నా జీహెచ్ఎంసీ ప్రతివాదో.. కాదో.. కూడా తెలియదా అని అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఇలాగేనా వ్యవహరించేది అని ప్రశ్నించింది.తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. ‘పట్టణాలు, నగరాల్లో పార్కుల అవసరం ఎంతైనా ఉంది. ఉన్నవాటి పరిరక్షణతో పాటు లేని చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలి. చెట్లను కూడా అభివృద్ధి చేయాలి. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి’అని కోరుతూ హైదరాబాద్ హిమాయత్‌సాగర్‌కు చెందిన కె.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో 2016లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. 2023, ఆగస్టు చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 749 హెక్టార్లలో 8.37 లక్షల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌లో పరిస్థితి ఏంటని సీజే ప్రశ్నించగా...నగర అధికారులు ఎవరూ అందుబాటులో లేరని, అయినా ఆ వివరాలు తెలుసుకుని చెబుతామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణలోగా దీనిపై నివేదిక అందజే యాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
ల్యాండ్ మార్క్ చెట్లు
మణికొండ: ఒక్కో గ్రామంలో ఒక్కో భవనం, విగ్రహాలు, చౌరస్తాలు, బావులు లాండ్ మార్క్‌గా నిలవటం సహజం. కానీ రెండు చెట్లు ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలం పాటు ల్యాండ్ మార్క్‌గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమం నుంచి ఇప్పటికీ అవి అలాగే కొనసాగుతున్నాయి. వాటి చుట్టు పక్కల మరో ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసినా ప్రజలు వాటిని గుర్తించలేక పాత వాటితోనే పిలుస్తున్నారంటే ప్రజల్లో ఎంతలా నాటుకుపోయాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ చెట్లేంటి? వాటి కథేంటి? తెలుసుకుందాం.. దైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలన్నా.. ఎవరికైనా అడ్రస్ చెప్పాలన్నా.. ముందుగా ఆ ప్రాంతం పేరుతోపాటు అక్కడ ప్రాచుర్యం పొందిన ల్యాండ్ మార్క్ చెప్పడం పరిపాటి.. అయితే అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని పేర్లు మారుతుంటాయి.. మరికొన్ని ఏళ్ల తరబడి అవే గుర్తింపుగా మారుతుంటాయి.. అలాంటి గుర్తింపు పొందిన రెండు వృక్షాల కథే ఇది..పూర్తి వివరాల్లోకి వెళితే గతంలో మణికొండకు కొత్తగా వచ్చే వారు మీ ఇంటికి ఎలా రావాలి అంటే ముందుగా మర్రిచెట్టు వద్దకు వచ్చి ఎడమవైపు, కుడి వైపు, నేరుగా ఇటువైపు రావాలని చిరునామా చెప్పే వారు. దాని కేంద్రంగానే మణికొండకు కొత్తగా వచ్చే వారు గమ్యస్థానాలను చేరేవారు. ఇదే మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ, నెక్నాంపూర్ వాసులు అలకాపూర్ టౌన్షిప్ ప్రవేశంలో ఉండే చింత చెట్టును కేంద్రంగా చేసుకుని చిరునామా చెప్పేవారు. అక్కడి నుంచి ఎడమ, కుడి, నేరుగా అనే రోడ్లతో వారి గమ్యస్థానాలకు చేరుకునే వారు. ఆ తరువాతి క్రమంలో గూగుల్ మ్యాప్‌లు, లొకేషన్ పాయింట్లు వచ్చి వాటి ఆదారంగా కొత్త వారు గమ్య స్థానాలను చేరుకుంటున్నా వీటి గుర్తింపు ఏమాత్రం చెక్కు చెదరలేదు. వాటిలో ముందుగా మణికొండ మర్రిచెట్టు, పుప్పాలగూడ, నెక్నాంపూర్ చింతచెట్టు అడ్రస్‌కి కేరాఫ్‌గా మారాయి.మార్పులు చేసినా... మణికొండ మర్రిచెట్టు కూడలికి కాల క్రమంలో పేరు మార్చాలనే ఉద్దేశంతో ఓ సంస్థ దాని కింద భరతమాత విగ్రహాన్ని నెలకొలి్పంది. అప్పటి నుంచి దాన్ని భరతమాత కూడలిగా పిలవాలని ప్రకటించారు. అది ఏమాత్రం ప్రజల్లోకి ఎక్కకుండా అదే మర్రిచెట్టు కూడలిగానే ప్రసద్ధి చెందుతోంది. ఇదే తరహాలో పుప్పాలగూడ, నెక్నాంపూర్ వాసులకు ల్యాండ్ మార్క్‌గా ఉన్న చింత చెట్టు పక్కనే మున్సిపాలిటీ నుంచి శోభాయమానంగా సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టుగా కూడలిని అభివృద్ధి చేశారు. దాన్ని బటర్‌ఫ్లై కూడలిగా నామకరణం చేసినా దాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. అదే చింతచెట్టు సర్కిల్గానే దాని పేరు కొనసాగుతోంది. అదే రోడ్డులో అలకాపూర్ టౌన్íÙప్లోకి నేరుగా వెళితే మూలమలుపు వద్ద ఏర్పాటు చేసిన యోగ సర్కిల్(సూర్యనమస్కారాల బొమ్మలు) మాత్రం ఇప్పుడిపుడే ప్రాచూర్యం పొందుతున్నాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రిచెట్టు, చింతచెట్ల చరిత్ర అవి జీవించినంత కాలం కొనసాగుతుందని స్థానికులు భావిస్తున్నారు. మణికొండలోని అదే మర్రిచెట్టుపై కొత్తగా రావి చెట్టు, దాని కింద వేపచెట్టు పెరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
ఒంటెల్లాంటి చెట్లు! ఇవి కేవలం అక్కడ మాత్రమే..
మనం ఎన్నో రకాల చెట్లను చూసుంటాం. అందులో పొట్టివిగా, పొడవుగా ఏవైనా కావచ్చు. కానీ ఈ వింతరకమైనా చెట్లను ఎప్పుడైనా చూశారా! అచ్చం గజస్తంభాలను పోలిన విధంగా ఉన్నాయి. ఒంటె మెడలలాగా పొడవుగా, ఏనుడు ఆకారంలో భారీగా ఉన్నాయి. అవేంటో చూసేయండి!నిలువునా స్తంభాల్లా పెరిగే ఈ చెట్లను బేయబాబ్ చెట్లు అని అంటారు. ఇవి ఎక్కువగా మడగాస్కర్లోను, అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. బేయబాబ్ చెట్లలో తొమ్మిది రకాలు ఉంటే, వాటిలో ఆరు రకాలు కేవలం మడగాస్కర్‌లో మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన వాటిలో రెండు రకాలు అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, మరో రకం ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. వీటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇవి నిట్ట నిలువుగా పెరుగుతాయి. కాండానికి చిట్టచివర మాత్రమే కొమ్మలు ఉంటాయి. ఈ చెట్లు ఒంటెల్లాంటివి. వీటి కాండం చుట్టుకొలత 23 అడుగుల నుంచి 36 అడుగుల వరకు ఉంటుంది.ఆకురాలే కాలంలో కూడా ఈ చెట్లు తమ కాండంలో లీటర్ల కొద్ది నీటిని నిల్వ ఉంచు కుంటాయి. ఈ చెట్లు వెయ్యేళ్ల నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్ది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో బేయబాబ్ చెట్లు పెద్ద సంఖ్యలో మరణించాయి. అయితే, అవి చీడపీడల వల్ల కాకుండా, నీటి కొరత కారణంగానే మరణించినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.ఇవి చదవండి: తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా! -
సిద్ధిపేటలో మున్సిపల్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపం
-
అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
దేవాలయానికి ధ్వజస్తంభం ఎంతో కీలకం. వీలైనంత ఎత్తులో... ఇత్తడి తాపడంతో... చివర్లో చిరుగంటలతో అలరారే ఈ స్తంభాన్ని తాకకుండా... దానికి పూజలు చేయకుండా భక్తులెవ్వరూ లోపలికి వెళ్లరు. ఆలయ మూలవిరాట్టును దర్శించుకోరు. ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. అయితే వీటి తయారీకి వినియోగించే కర్రకూ ఓ ప్రత్యేకత ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే నారేప చెట్టును ఇందుకు వాడుకుంటారు. ఎత్తుగా పెరగడమే గాకుండా... బలంగా ఉండి... ఎన్నో ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బుట్టాయగూడెం: దేవాలయాల ముందు ఏర్పాటు చేసే ధ్వజస్తంభం నిర్మాణానికి ప్రధానంగా పొడవాటి బలమైన కర్ర అవసరమవుతుంది. ఇందుకోసం సోమి చెట్టు, టేకు, నారేప చెట్టుతో పాటు మరికొన్ని రకాల వృక్ష జాతులను వినియోగిస్తారు. వీటిలో ఎక్కువగా సోమిచెట్టు, నారేప చెట్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తారు. పశ్చిమ మన్యంలోని అటవీ ప్రాంతంలో ఈ కర్రలు అధికంగా లభిస్తాయి. అత్యధికంగా నారేప కర్రలతోనే ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం విశేషం.ఆకాశానికి నిచ్చెన వేసేలా ఈ చెట్లు పెరుగుతుంటాయి. ఈ వృక్షం ఎత్తు కనిష్టంగా 30 అడుగులు, గరిష్టంగా 50 అడుగులు ఉంటుంది. చుట్టుకొలత 40 నుంచి 50 అంగుళాలు ఉంటుంది. గోదావరి నదీ పరీవాహక అటవీ ప్రదేశాల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. పాపికొండల అభయారణ్యంతో పాటు ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఈ చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచే వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసే ధ్వజస్తంభాల కోసం వీటిని తరలిస్తుంటారు. నారేప చెట్ల ప్రత్యేకత వృక్ష జాతుల్లో అన్నింటి కంటే నారేప వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వృక్షానికి సంబంధించిన కర్ర వానకు తడిసినా, ఎండకు ఎండినా ఏ మాత్రం చెక్కు చెదరకుండా గట్టిగా బలంగా ఉంటుంది. వీటికి చెదలు కూడా పట్టవు. ప్రకృతిపరంగా ఎంతటి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం కలిగి, కొన్ని దశాబ్దాలపాటు చెక్కు చెదరకుండా ఉండటం దీని విశేషమని పూర్వికులు చెబుతున్నారు. మారుతున్న కాలంతో పాటు సోమి, నారేప, టేకు వృక్షాల కలప దొరకకపోవడం... కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ మార్చాల్సి రావడంతో పలుచోట్ల ఏక శిల రాళ్లను కూడా ధ్వజస్తంభాల కోసం వినియోగిస్తున్నారు. అనుమతులు తప్పనిసరి అడవిలో నుంచి వృక్షాలు తరలించాలంటే అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆలయం ఏ ప్రాంతంలో కడుతున్నారో, ధ్వజస్తంభానికి అవసరమైన కలప, తదితర వివరాలతో ఆధారాలను అధికారులకు చూపించాలి. బహిరంగ మార్కెట్లోని కలప విలువ ప్రకారం రుసుం చెల్లించాలి. ఇటీవల అటవీ సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అనుమతులు అంత సులభంగా లభించడం లేదు. చెట్లు కూడా సులభంగా దొరికే అవకాశం లేదు. అందుకోసం పశ్చిమ మన్యంలోని అటవీశాఖ అధికారులు నర్సరీలో నారేప మొక్కలను పెంచుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో నారేప చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని పెంచాలనే ఉద్దేశంతో నర్సరీల ద్వారా పెంచుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నారేప ఎంతో బలమైంది వృక్ష జాతుల్లో ఎన్నో రకాలున్నా వాటన్నింటి కంటే నారేప చెట్టు బలంగా ఉంటుంది. దాని తర్వాత సోమిచెట్టు బలమైంది. నారేప చెట్టు కర్ర ఎండకు ఎండినా, వానకు తడిసినా పాడవ్వదు. చెదలు పట్టవు. ఈ కర్రతో ఏర్పాటుచేసిన ధ్వజస్తంభం బలంగా ఉంటుంది. అందుకే ఆలయాల్లో ఎక్కువగా వీటినే వినియోగిస్తున్నారు. – ఎస్.బాలసుబ్రహ్మణ్యం, శివాలయం పూజారి, బుట్టాయగూడెం -
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
వేసవి సూరీడి కన్ను పడకుండా భద్రంగా ఉండే చోటు ఇల్లే! ఇంట్లో ఉండి ఎండ నుంచి తప్పించుకుంటాం సరే.. వేడి నుంచి ఉపశమనం పొందడమెలా?! ఇండోర్ ప్లాంట్స్‌తో! అవును.. చక్కగా ఇంట్లో కొలువుదీరి ప్యూర్ ఆక్సిజన్, చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచేవి ఇవిగో ఈ మొక్కలే!అలోవెరా.. కలబంద ఆకులలో నీటిని నిల్వ చేసే గుణం ఉంటుంది. నిర్వహణా సులువే! ఔషధ గుణాలు పుష్కలం. దీని ఆకుల్లోని జెల్.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది.. వడదెబ్బతో సహా చిన్న చిన్న చర్మ సమస్యలకూ ఉపశమనం కలిగిస్తుంది.పీస్ లిల్లీ..ఈ మొక్క సూర్యకాంతి పడని ప్లేస్‌లో చక్కగా ఎదుగుతుంది. గాలిలోని విషపదార్థాలను తొలగిస్తూ ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తుంది. వేసవిలో ఈ మొక్కలకు అందమైన తెల్లని పువ్వులు పూస్తాయి. వాటితో ఇంటి అందమూ రెట్టింపవుతుంది.స్నేక్ ప్లాంట్..వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. టాక్సిన్లను తొలగిస్తూ ఇవీ ఇంట్లో గాలిని శుద్ధి చేసి ఆరోగ్యాన్నందిస్తాయి.బోస్టన్ ఫెర్న్..అధిక తేమ, పరోక్ష సూర్యరశ్మిలో ఇది బాగా ఎదుగుతుంది. వేసవికి సరైనవి. ఈ మొక్కలు ఇండోర్ వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికడతాయి.గోల్డెన్ పోథోస్..దీన్ని డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. వేసవిని తట్టుకోవడంలో ఇది ఫస్ట్. ఇండోర్ ఎయిర్ని చక్కగా ఫిల్టర్ చేసి నాణ్యతను మెరుగుపరుస్తుంది.జెడ్ జెడ్ ప్లాంట్..దీని పెంపకం చాలా సులువు. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగలదు. దీనికి గాలిని శుభ్రపరచే, కాలుష్యాన్ని నివారించే లక్షణాలు మెండు.స్పైడర్ ప్లాంట్..ఇది వేసవిలో బాగా పెరుగుతుంది. ప్యూర్ ఆక్సిజన్‌కి ప్రసిద్ధి. -
రూ. 1500 చెల్లించి మరీ చెట్లను హగ్ చేసుకోవడమా?
చెట్లను హగ్ చేసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా..?. అదీగాక ఇటీవల ఓ విదేశీ మహిళ చెట్టుని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. మళ్లీ ఇందేంట్రా బాబు అనుకుంటున్నారా..!. ఓ కంపెనీ దుస్సాహసం లేదా సోమ్ము చేసుకునే సరికొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు దీన్ని. ఆఖరికి సహజ సిద్ధమైన ప్రకృతిని కూడా ఇలా అమ్మకానికి పెట్టేస్తోందా అని ఆ కంపెనీపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ అంటే.. చికాగుగా, ఒత్తిడిగా ఉంటే అలా కాసేపు ఓ పార్కుకో వెళ్లి ప్రకృతిలో కాసేపు సేద తీరుతాం. లేదా ఆరుబయట కాసేపు ఆకాశానికేసి చూసి ఆహా ఈ ప్రకృతి అద్భుతాలు ఊహకే అందవు అని ఆనందపడతాం. దీనికి డబ్బులు వెచ్చించాల్సిన పనిలేదు. ఈ భూమ్మీద జీవించే ప్రతి ఒక్కరి హక్కు ఇది. అదీగాక ఆరోగ నిపుణులు కూడా పచ్చని ప్రదేశాల్లో నిమగ్నమయ్యితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పదేపదే చెబుతుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఉండే ఉద్యానవనాలు ప్రజలకు ప్రకృతి ఒడిలో సేదతీరే చక్కటి ప్రదేశాలు. అంతేగాదు ఇలా ప్రకృతితో రమించడాన్ని జపాన్‌లో షిన్రిన్-యోకు అంటారు. దీన్ని 1982లో జపనీస్ వ్యవసాయ, అటవీ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ పేరుతో ప్రజలకు ఉచితంగా అటవీ ప్రాంతంలో గడపడం, కనెక్ట్ అవ్వడం వంటివి నేర్పిస్తుంది. దీని వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నది వారి నమ్మకం. అయితే ఇటీవల బెంగుళూరుకి చెందిన ఓ కంపెనీ అచ్చం అలాంటి కాన్సెప్ట్‌తో జస్ట్ రూ. 1500లతో గైడెడ్ ఫారెస్ట్ బాత్ అనుభవాలు నేర్పిస్తామంటూ ప్రకటన ఇవ్వడం వివాదాస్పదమయ్యింది. ఆ కంపెనీ చెట్టుని కౌగిలించుకుని వాటితో కనెక్ట్ అవ్వడం ఎలాగో నేర్పిస్తాం అంటూ ధర ప్రకటించడం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆఖరికి ప్రకృతిని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారా..? అని మండిపడుతున్నారు. ఇదేదో స్కామ్, అంటూ పోస్టులు పెట్టారు. ఇక్కడ చెట్టుని కౌగిలించుకుని వాటితో మమేకమవ్వడం వరకు బాగుంది. దీనికీ డబ్బులేం ఖర్చవ్వుతాయి. అదీ కూడా నేచర్‌కి ఉన్న పవర్. ఆ కంపెనీకి ఖర్చు పెట్టి చేసేదేం ఉంటుంది. వాలంటీర్‌గా గైడ్ చేయడమే సూచించడమే చేస్తే సరిపోయే దానికి ఇలా సొమ్ము చేసుకునే దుస్సాహాసానికి ఒడిగట్టడం అందరీకీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. సహిస్తే చక్కగా పీల్చే గాలిని కూడా సొమ్ము చేసుకుంటారు కొందరు ప్రబుద్ధులు అని తిట్టిపోస్తున్నారు ప్రజలు. (చదవండి: వారెవ్వా..నీరజ!.. మొత్తానికి సాధించింది..!) -
US: అమెరికాలో వెయ్యేళ్ల చెట్లు..! చూస్తే ఆశ్చర్యపోతారు
మనుష్యుల ఆయుర్దాయం వంద సంవత్సరాలకు అటు ఇటు. అంతకు మించి వందలు, వేల సంవత్సరాలు బతికున్న మనుషులే కాదు ఏ ఇతర ప్రాణులు కూడా పురాణ కథల్లో తప్ప ఎక్కడా ఉండవు. కానీ, అలాంటి సజీవ సాక్ష్యాలు, ఇప్పటికీ బతికున్న చెట్లను మాత్రం మనం అమెరికాలో చూడవచ్చు. నా బాల్యంలో మా ఊళ్లో అతి పెద్దవృక్షం ఒక వేపచెట్టు. అది మా ఇంటికి సమీపంలోని ఓ అంగడి బజారులో మా గ్రామానికి నడిబొడ్డులా, బొడ్రాయిలా ఉండేది. పిల్లలు ఆడుకోవాలనుకున్నా.. పెద్దవాళ్లు పంచాయతీకి కూర్చోవాలన్నా.. నలుగురు చేరి ముచ్చట్లు పెట్టుకోవాలనుకున్నా.. కేరాఫ్ వేపచెట్టే. మా ఊళ్లో బస్టాండ్ నిర్మించే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తొలగించడంతో ఆ చెట్టు, మా జ్ఞాపకాలు రెండూ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పైడిమడుగు గ్రామంలో 5 ఎకరాల్లో విస్తరించి వున్న 800 సంవత్సరాల నాటి మర్రిచెట్టు కూడా చాలా కాలం జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఓ అగ్ని ప్రమాదంలో ఆ మహావృక్షం దెబ్బ తిని 2 ఎకరాలకే పరిమితం కావడం చేదుగా అనిపించే విషయం. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని 700 సంవత్సరాల నాటి మర్రిచెట్టు, అనంతపురం జిల్లా కదిరి పట్టణ సమీపంలోనున్న ‘తిమ్మమ్మ మర్రిమాను’ .. ఇవి పేరుకు చెట్లే అయినా.. మనిషి జీవితంలో, జ్ఞాపకాల్లో ఎంతో విస్తరించాయి. రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. చెట్టును కాపాడుకోవాలన్న తాపత్రయం. ఈ విషయంలో అమెరికాను మెచ్చుకోవచ్చు. నేను కుటుంబంతో కలిసి 2012లో అమెరికా వెళ్ళినప్పుడు, లాస్ ఎంజెల్స్‌లో మా అబ్బాయి మమ్మల్ని ‘ సెకోయా నేషనల్ పార్క్ ’ తీసుకెళ్లాడు. అక్కడ వేల సంవత్సరాల వయసున్న సెకోయా, షర్మాన్ మహావృక్షాలను చూసే భాగ్యం మాకు కలిగింది. వాటి దగ్గర నిలబడ్డప్పుడు మనమింత అల్పజీవులమా! అనిపించింది. దాదాపు 4 లక్షల ఎకరాల్లో, సముద్ర మట్టానికి 14 వేలకు పైగా అడుగుల ఎత్తులోనున్న సెకోయా అడవిని, పక్కకే వున్న కింగ్స్ కాన్యన్లను యునెస్కో 1976 లో నే బయోస్పియర్ ( జీవావరణం ) రిజర్వులుగా గుర్తించిందట. లాస్ ఎంజెల్స్ నుంచి రాత్రి ఏడున్నరకు బయలుదేరితే, నాలుగున్నర గంటల కారు డ్రైవ్ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు సెకోయా అడవికి చేరుకున్నాము. మేము బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్ దగ్గర అప్పుడు ఆ కీకారణ్యంలో మమ్మల్ని పలకరించే నరమానవుడు కనబడలేదు, జంతువుల అరుపులు మాత్రం వినబడ్డాయి. సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే అక్కడున్న మెయిల్ బాక్స్‌లో మీ పేరుతో తాళం చెవి పెట్టాము, తీసుకొని హాయిగా ఆ చెక్క ఇంటిలో విశ్రమించమన్నారు. మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత అక్కడున్న ‘ ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త ! ’ అన్న హెచ్చరిక బోర్డులను చూసి తుపాకి రాముళ్లలా చేతి కర్రలు పట్టుకొని లంచ్ టైం వరకు ఆ అడవి అంతా కలియ దిరిగాము. ఈపాటి అడవులు మనకూ వున్నాయి కాని అమెరికన్లలా మనం వాటిని కాపాడుకోలేకపోయాం, మన అడవుల్లోని మహా వృక్షాలు అడవి దొంగల పాలు ఆయిపోయాయి కదా! అన్న బాధ కలిగింది. అంతేకాదు అమెరికా వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు, తమ అడవులను సురక్షితంగా ఉంచుకుంటూనే, తమకు కావలసిన కలపను బయటి దేశాల నుండి తెప్పించుకుంటున్నారు. సాయంత్రం వరకు అడవిలో తిరిగి, అందులోని వాగులు వంకలు చూసి అక్కడి స్వచ్ఛమైన నీటిలో జలకాలాడి, అలసి సొలసి వచ్చి ఆ నిర్జనారణ్య అతిథి గృహంలో కూర్చుని తిన్న మామూలు రాత్రి భోజనం కూడా మృష్టాన్నంలా అనిపించింది. తాగిన ద్రాక్షరసం కూడా అమృతంలా తోచింది. అదే నెలాఖరులో మేమంతా ‘ యోసేమైట్ నేషనల్ పార్క్ ’ కూడా వెళ్ళాము , ఆనాటి అనుభవాలు కూడా దాదాపు ఇలాంటివే. దాదాపు ఏడున్నర లక్షల ఎకరాల్లోనున్న ఈ నిర్జన అడవి మధ్యలో పర్యాటకులకు ఏర్పాటు చేసిన ఆధునిక వసతులు చాలా బాగున్నాయి. ఇందులోని గ్రానైట్ కొండలు , హిమనీ నదాలు, ఇరుకు లోయలు, పచ్చిక బయళ్లు విశేషమైనవనే చెప్పాలి. 1984 లో ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం విశేషం. యోసేమైట్ లోని పర్వతాన్ని తొలిచి ఏర్పరచిన మార్గం, జలపాతం అద్భుతం. ఈ అడవిలో మూడు రాత్రులు ఉన్నాం. వేముల ప్రభాకర్ (చదవండి: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!) -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన వృక్షాలివే!
చెట్లు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వృక్షం ఏదో తెలుసా? అది ఎక్కడ ఉంది? ఈ జాబితాలో ఇంకేమి వృక్షాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైపెరియన్, కోస్ట్ రెడ్‌వుడ్ కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ నేషనల్ పార్క్‌లో ఉన్న హైపెరియన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు. దీని సగటు ఎత్తు 360 అడుగులు. ఈ చెట్టు 16 అడుగులు (4.94 మీటర్లు) కంటే అధిక వ్యాసాన్ని కలిగి ఉంటుంది. హైపెరియన్ రెడ్వుడ్కు 600 నుంచి 800 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని అంచనా. హైపెరియన్ కోస్ట్ రెడ్వుడ్లు 2,000 సంవత్సరాలకు పైగా భూమిపై ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2006లో క్రిస్ అట్కిన్స్ , మైఖేల్ టేలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్తలు హైపెరియన్ను కనుగొన్నారు. మేనరా, ఎల్లో మెరంటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉష్ణమండల వృక్షం మేనరా. ఇది మలేషియా బోర్నియోలోని సబాలోని డానుమ్ వ్యాలీ పరిరక్షణ ప్రాంతంలో ఉంది. దాని ఖచ్చితమైన ఎత్తుపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఈ వృక్షం ఎత్తును 331 అడుగులు (100.8 మీటర్లు)అని గుర్తించారు. మేనరా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యాంజియోస్పెర్మ్ లేదా పుష్పించే మొక్కగా ప్రసిద్ధి చెందింది. సెంచూరియన్, మౌంటైన్ యాష్ సెంచూరియన్ అనేది 330 అడుగుల (100.5 మీటర్లు) ఎత్తులో 13 అడుగుల (4.05 మీటర్లు) ట్రంక్ వ్యాసంతో కూడి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలోని ఆర్వ్ లోయలో ఈ వృక్షాల కారణంగా చెలరేగిన టాస్మానియన్ బుష్ఫైర్ల వల్ల ఈ ద్వీప భూభాగంలో దాదాపు మూడు శాతం అంటే 494,210 ఎకరాలు (200,000 హెక్టార్లు) కాలిపోయింది. డోర్నర్ ఫిర్, కోస్ట్ డగ్లస్ ఫిర్ డోర్నర్ ఫిర్ను ఒరెగాన్ కోస్ట్ రేంజ్‌లోని బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ సంరక్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డగ్లస్ ఫిర్. భూమిపై ఉన్న అత్యంత ఎత్తయిన నాన్ రెడ్‌వుడ్ వృక్షం. 327 అడుగుల (99.7 మీటర్లు) ఎత్తుతో, 11.5 అడుగుల (3.5 మీటర్లు) వ్యాసంతో ఇది చూపరులను ఆకట్టుకుంటుంది. 1989లో ఈ భారీ వృక్షాన్ని కనుగొన్నారు. రావెన్స్ టవర్, సిట్కా స్ప్రూస్ రావెన్స్ టవర్ అనేది 317 అడుగుల (96.7 మీటర్లు)ఎత్తు కలిగివుంటుంది. సిట్కా స్ప్రూస్ 2001లో దీనిని కనుగొన్నారు. అతను హైపెరియన్, హీలియోస్, ఐకారస్ లాంటి ఇతర పొడవైన చెట్లను కూడా కనుగొన్నాడు. రావెన్స్ టవర్ ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రైరీ క్రీక్ రెడ్‌వుడ్స్ స్టేట్ పార్క్‌లో ఉంది. జెయింట్ సీక్వోయా కాలిఫోర్నియాలోని జెయింట్ సీక్వోయాస్ పొడవైన వృక్షాలుగా పేరొందాయి. సీక్వోయా నేషనల్ ఫారెస్ట్‌లో 314-అడుగుల (95.7 మీటర్లు) ఎత్తుతో ఈ వృక్షం ఉంది. జెయింట్ సీక్వోయాస్ 25 అడుగుల (7.7 మీటర్లు) వ్యాసంతో దృఢమైన ట్రంక్‌ను కలిగి ఉంటుంది. వైట్ నైట్, మన్నా గమ్ టాస్మానియాలోని ఎవర్క్రీచ్ ఫారెస్ట్ రిజర్వ్‌లోని మన్నా గమ్ (యూకలిప్టస్ విమినాలిస్) వృక్షం కనిపిస్తుంది. దీని ఎత్తు 299 అడుగులు (91 మీటర్లు). ఈ చెట్లు కలిగిన ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. కాగా ఆఫ్రికాలో పొడవైన చెట్ల జాతులు లేవు అయితే మౌంట్ కిలిమంజారో నేషనల్ పార్క్‌లో 267 అడుగుల (81.5 మీటర్లు) ఎత్తు కలిగిన ఎంటాండ్రోఫ్రాగ్మా ఎక్సెల్సమ్ వృక్షం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
మిస్టరీ: 'డోంట్ టచ్’ అనే హెచ్చరికతో.. 'చెచెన్, చాకా' ట్రీస్
'మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ప్రతి చెచెన్ చెట్టుకు ‘డోంట్ టచ్’ అనే హెచ్చరిక బోర్డ్ మీద డేంజర్ బొమ్మ గీసి మరీ ఉంటుంది. అవును ఆ చెట్టు బెరడు తాకితే.. భయంకరమైన దద్దుర్లు వస్తాయి. తట్టుకోలేనంత దురద పుడుతుంది. భరించలేనంత మంట వస్తుంది. దాని బెరడు నుంచి నల్లటి జిగురు పొంగుతుంది. కొన్నేళ్లక్రితమే ఆ చెట్టుపై ఎన్నో ప్రయోగాలు జరిపి.. అది విషపూరితమని, పట్టుకుంటే ప్రమాదమని నిపుణులు తేల్చేశారు. అందుకే ఆ చెట్టుకు ‘బ్లాక్ పాయిజన్ వుడ్ ట్రీ’ అని పేరు పెట్టారు. కొన్నిసార్లు ఆ చెట్టు సమీపంలో తిరిగితే.. దద్దుర్లు వచ్చేవరకు తెలియదట ఆ చెట్టును మనం తాకామన్న సంగతి'. అయితే విచిత్రమేమిటంటే.. ఆ చెట్టుకు పక్కనే లేదా సమీపంలో ‘చాకా’ అనే మరో చెట్టూ కచ్చితంగా పెరుగుతుంది. చెచెన్ చేసిన గాయాలకు.. చాకా చెట్టు బెరడు విరుగుడుగా పనిచేస్తుంది. దద్దుర్లు రాగానే.. చాకా బెరడును కత్తిరించి.. దాని నుంచి వచ్చే జిగురును దద్దుర్లొచ్చిన చోట రాయాలి. బాడీ లోపలి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే.. ఈ చాకా బెరడుతో టీ పెట్టుకుని తాగొచ్చు. చెచెన్ ట్రీ బెరడు తగిలిన వెంటనే చాకా ట్రీ బెరడును ఔషధంలా ఉపయోగించకపోతే.. వైద్యుల్ని సంప్రదించాల్సిందే. అయితే ఒక ప్రమాదం, దానికి పరిష్కారం రెండూ ఒకేచోట పుట్టిపెరగడం విశేషం. నిజానికి ఈ చెచెన్ – చాకా ట్రీస్ పుట్టుక వెనుక పెద్ద చరిత్రే ఉంది. కొన్ని వందల ఏళ్లక్రితం ఆగ్నేయ మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో ముగిసిన ఓ విషాద ప్రేమగాథే ఈ చెట్ల వెనుకున్న పురాణం. మాయన్ యోధులైన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. టిజిక్, కినిచ్ అనే సోదరులు.. గొప్ప యుద్ధవీరులు.. ఆ రాజ్యానికి యువరాజులు కూడా. అయితే కినిచ్ దయా హృదయంతో, మంచివాడిగా ఉండేవాడు. ప్రేమతో, నిస్వార్థంగా జీవించేవాడు. అందరినీ ఆదరించేవాడు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవాడు. చెచెన్ చెట్టు, పక్కపక్కనే ఉన్న చెచెన్, చాకా చెట్లు కానీ అతని సోదరుడు టిజిక్ మాత్రం.. కోపంతో, ఆవేశంతో నిత్యం అసహనంతో జీవించేవాడు. అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు. అహంకారం ప్రదర్శించేవాడు. ఒకరోజు కినిచ్, టిజిక్లు రాజ్యపర్యటనలో ఉండగా.. ‘నిక్టే హా’ అనే అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారట. ‘ఆమె నాకు సొంతమంటే నాకు సొంతం’ అని అన్నదమ్ములిద్దరూ వాదులాటకు దిగారు. అది కాస్తా గొడవకు దారితీసి.. యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి నిక్టే కళ్లముందే.. ఇద్దరు అన్నదమ్ములు యుద్ధానికి తెగబడ్డారట. కొన్నిరోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో.. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసిన ఒకనాడు.. సోదరులిద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చనిపోయారు. తనను ప్రేమించిన ఇద్దరు మహాయోధులు చనిపోయారన్న బెంగతో నిక్టే కూడా మరణించింది. మరణానంతరం స్వర్గానికి వెళ్లిన ఇద్దరు సోదరులూ.. దైవాన్ని క్షమాపణ కోరి, మళ్లీ పుట్టించమని కోరుకున్నారు. అనుగ్రహించిన దేవతలు వారికి పునర్జన్మను ప్రసాదించారు. టిజిక్.. చెచెన్ చెట్టులా.. కినిచ్.. చాకా చెట్టుగా తిరిగి జన్మించారు. అప్పుడే వారికి సమీపంలోనే నిక్టేహా అందమైన తెల్లటి పువ్వులా జన్మించిందట. నిజానికి టిజిక్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా.. చెచెన్ చెట్టు విషాన్ని చిమ్మితే.. దాన్ని సరిచేసే ఔషధంలా కినిచ్.. చాకాలా ప్రేమను పంచుతున్నాడట. అందుకే ఈ పురాణగాథలో చెప్పినట్లే.. అన్నదమ్ములిద్దరూ ఆ చెట్ల రూపంలో ఎక్కడ పుట్టినా కలసే పుడతారట. వారి సమీపంలో నిక్టే కూడా అందమైన పువ్వు రూపంలో జన్మిస్తుందని నమ్ముతారు. ఏదేమైనా.. చెచెన్, చాకా చెట్ల జన్మరహస్యం నేటికీ ఓ మిస్టరీనే. ఈ సృష్టిలో అద్భుతమే. — సంహిత నిమ్మన -
ఇచట చెట్లకు డబ్బులు కాయబడును!
ఈ వైరల్ వీడియోను చూసిన వాళ్లు ‘చెట్లకు డబ్బులు కాస్తాయా!’ అనే సామెతకు ‘భేషుగ్గా’ అని జవాబు చెప్పవచ్చు. 2.8 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ వీడియోలో రాయితో కొట్టి చెట్టు నుంచి ప్రజలు కాయిన్స్ తీసుకోవడం కనిపిస్తుంది. ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ అనే మాట నిజమేగానీ ‘ఇదెలా సాధ్యం?’ అనే ఒక ప్రశ్న మన ముందు నిటారుగా నిలబడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బిహార్‌లోని రాజ్‌గిర్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్టు ఇది. ఈ చెట్టు బెరడు తీసి అందులో నాణెం పెడితే శుభం జరుగుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ పుణ్యమా అని చెట్టులో ఎటు చూసినా డబ్బులే డబ్బులు! అదృష్టం కోసం ఇంట్లో ‘మనీ ప్లాంట్’ పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఈ వీడియోను చూసిన తరువాత మాత్రం ‘ఇదే అసలు సిసలు మనీప్లాంట్’ అంటున్నారు నెటిజనులు. -
పాక్ ఎన్నికలకు 54 వేల చెట్ల నరికివేత!
ఇస్లామాబాద్: ఇదేందిది... ఎన్నికలకోసం చెట్లు నరకడం ఏమిటా అనుకుంటున్నారా? అవును ఇది ఇది నిజం.. పాక్ ఎన్నికల నిర్వహణకు 56 వేల చెట్లు నరికి వేయాల్సి వచ్చింది. పాక్‌లో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల కోసం మొత్తంగా 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 2,179 టన్నుల కాగితం అవసరమయ్యింది. కాగితాన్ని చెట్ల నుంచే తయారు చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఒక అంచనా ప్రకారం ఒక చెట్టు నుండి దాదాపు 16 రీమ్‌ల కాగితాన్ని తయారు చేయవచ్చు. అటువంటి స్థితిలో ఒక టన్ను కాగితం తయారు చేయడానికి 25 చెట్లు అవసరం. దాని ప్రకారం మనం లెక్కలు వేస్తే ఎన్నికల కోసం పాకిస్తాన్లో దాదాపు 54 వేల చెట్లను నరికివేశారు. 2018 ఎన్నికల్లో 22 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 800 టన్నుల ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను ఉపయోగించారు. నియోజక వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య పెరిగిన కారణంగానే బ్యాలెట్ పేపర్ల సంఖ్య పెరిగిందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం పేర్కొంది. 2018 కంటే ఈసారి అభ్యర్థుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఎన్నికల సంఘం పేపర్ల ముద్రణను సకాలంలో పూర్తి చేసింది. సోమవారం నాటికి బ్యాలెట్ పత్రాల పంపిణీ పూర్తి కానుంది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాక్ టెస్ట్ నిర్వహించింది. ఈ మాక్ టెస్ట్ లో 859 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ చాలా కాలంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్‌ను బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. నవాజ్ మరోమారు ప్రధాని కాబోతున్నారని ఆయన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) చెబుతోంది. -
నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా?
నడిచే చెట్ల గురించి విన్నారా?. ఔను! మీరు వింటుంది నిజమే!. ఈ చెట్లు నిజంగా నడుస్తాయి అది కూడా సూర్యకాంతిని వెతుక్కుంటూ నడుస్తాయట. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?. నిజం నడిచేలా వాటి చెట్ల ఆకృతి కూడా అందుకు తగ్గట్టుగా ఉంటుంది. పైగా అలా నడిస్తే భూమిలో ఉన్న వేరు తెగిపోతుంది లేదా దాంతోపాటు ఎలా కదులుతుంది అని కదా డౌటు. అయితే ఆ చెట్టు ఎలా నడుస్తుంది? ఎలా కదులుతుందో సవివిరంగా చూద్దాం!. ఈ రకం చెట్టు దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్లను సక్రాటియా ఎక్సరిజా అంటారు. వాటి మూలాలు సూర్యకాంతి దిశగా పెరుగుతాయి. అందువల్ల ఇవి నడుస్తాయట. ఇవి అచ్చం తాటి చెట్టు మాదిరిగా ఉండే ప్రత్యేకమైన చెట్లు. ఏడాదికి సుమారుగా 15 నుంచి 20 మీటర్లు పొడవు పెరుగుతాయని లెక్కించారు శాస్త్రవేత్తలు. దీని వ్యాసం 16 సెం.మీ ఉంటుందని చెప్పారు. వాస్తవానికి తాటి చెట్టు వేళ్లు ఎక్కువగా నేలలోపలికి చొచ్చుకుని ఉంటాయి. ఈ చెట్లకి మాత్రం వాటి వేర్లు భూమికి వెలుపల చీపురి ఆకృతిలో ఉంటాయి. ఈ ప్రత్యేక రకం తాటి చెట్లు నడుస్తున్నప్పుడు వాటికి ఉన్న పాత వేర్లు ఊడిపోవడం(నశించిపోవడం) జరుగుతుందట. ఇలా అవి రోజుకి రెండు నుంచి 3 సెం.మీ వరకు నడుస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలా ఏడాదికి ఈ చెట్టు సుమారు 20 మీటర్ల దూరం వరకు నడుస్తాయని అంచనా వేశారు. ఇలాంటి చెట్లు దట్టమైన అడవుల్లోనే ఉంటాయని చెబుతున్నారు. ఇది నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ!. సూర్యరశ్మిని అనుసరిస్తూ కదలడం అలా ఏకంగా కొంత దూరం వరకు నడవడం అనేది శాస్త్రవేత్తలకు ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉంది. View this post on Instagram A post shared by Advancible (@advancible) (చదవండి: ఆ ఊరిలో నాలుగొందలకు పైగా ఇళ్లు ఉన్నాయ్! కానీ సడెన్‌గా..) -
ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు
నిజాయితీగా, విరామం లేకుండా కృషి చేస్తే విజయం తప్పక సాధిస్తామని నమ్మే ట్రీ టీచర్... అతిపెద్ద థార్ ఎడారిని సస్యశ్యామలం చేసేందుకు నిర్విరామంగా కృషిచేస్తున్నాడు. ఇసుకమేటలను పచ్చని అడవులుగా మార్చేందుకు తను తాపత్రయపడుతూ.. అందరిలో అవగాహన కల్పిస్తున్నాడు. ‘‘ప్రకృతిని తన కుటుంబంలో ఒకరిగా చూసుకుంటూ భూమాతను కాపాడుకుందాం రండి’’ అంటూ పచ్చదనం పాఠాలు చెబుతున్నాడు ట్రీ టీచర్ భేరారం భాఖర్. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా కుగ్రామం ఇంద్రోయ్‌కుచెందిన భేరారం భాఖర్ స్కూల్లో చదివే రోజుల్లో .. విద్యార్థులందర్నీ టూర్‌కు తీసుకెళ్లారు. ఈ టూర్లో యాభై మొక్కలను నాటడం ఒక టాస్క్‌గా అప్పగించారు పిల్లలకు. తన స్నేహితులతో కలిసి భేరారం కూడా మొక్కలను ఎంతో శ్రద్ధ్దగా నాటాడు. అలా మొక్కలు నాటడం తనకి బాగా నచ్చింది. టూర్ నుంచి ఇంటికొచ్చిన తరువాత మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం వల్ల ప్రకృతి బావుంటుంది అని తెలిసి భాఖర్‌కు చాలా సంతోషంగా అనిపించింది. మిగతా పిల్లలంతా మొక్కలు నాటడాన్ని ఒక టాస్క్‌గా తీసుకుని మర్చిపోతే భేరారం మాత్రం దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు.‘‘ప్రకృతిని ఎంత ప్రేమగా చూసుకుంటే అది మనల్ని అంతగా ఆదరిస్తుంది. పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత’’అని నిర్ణయించుకుని అప్పటి నుంచి మొక్కలు నాటడం మొదలు పెట్టాడు. ట్రీ టీచర్‌గా... మొక్కలు నాటుతూ చదువుకుంటూ పెరిగిన భాఖర్‌కు ప్రభుత్వ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. దీంతో తనకొచ్చిన తొలిజీతాన్ని మొక్కల నాటడానికే కేటాయించాడు.‘మొక్కనాటండి, జీవితాన్ని కాపాడుకోండి’ అనే నినాదంతో తన తోటి టీచర్లను సైతం మొక్కలు నాటడానికి ప్రేరేపించాడు. ఇతర టీచర్ల సాయంతో బర్మార్ జిల్లా సరిహద్దుల నుంచి జైసల్మేర్, జోధర్, ఇంకా ఇతర జిల్లాల్లో సైతం మొక్కలు నాటుతున్నాడు. ఒకపక్క తన విద్యార్థులకు పాఠాలు చెబుతూనే, మొక్కల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రకృతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తూ మొక్కలు నాటిస్తున్నాడు. తన స్కూలు విద్యార్థులకేగాక, ఇతర స్కూళ్లకు కూడా తన మోటర్ సైకిల్ మీద తిరుగుతూ మొక్కలు నరకవద్దని చెబుతూ ట్రీ టీచర్‌గా మారాడు భేరారం. అడవి కూడా కుటుంబమే... బర్మార్‌లో పుట్టిపెరిగిన భాఖర్‌కు అక్కడి వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. సరిగా వర్షాలు కురవకపోవడం, నీళ్లు లేక పంటలు పండకపోవడం, రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా చూసి ఎడారిలో ఎలాగైనా పచ్చదనం తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే... ‘ఫ్యామిలీ ఫారెస్ట్రీ’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొక్కను మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అనుకుంటే దానిని కచ్చితంగా కాపాడుకుంటాము. అప్పుడు మొక్కలు పచ్చగా పెరిగి ప్రకృతితో పాటు మనమూ బావుంటాము అని పిల్లలు, పెద్దల్లో అవగాహన కల్పిస్తున్నాడు. భేరారం మాటలతో స్ఫూర్తి పొందిన యువతీ యువకులు వారి చుట్టుపక్కల ఖాళీస్థలాల్లో మొక్కలు నాటుతున్నారు. నాలుగు లక్షలకుపైగా... అలుపెరగకుండా మొక్కలు నాటుకుంటూపోతున్న భేరారం ఇప్పటిదాకా నాలుగు లక్షలకుపైగా మొక్కలు నాటాడు. వీటిలో పుష్పించే మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతో సహా మొత్తం లక్షన్నర ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడి మట్టిలో చక్కగా పెరిగే మునగ మొక్కలు ఎక్కువగా ఉండడం విశేషం. రాజస్థాన్‌లోని ఎనిమిది జిల్లాల్లో పన్నెండు లక్షల విత్తనాలను నాటాడు. 28వేల కిలోమీటర్లు బైక్ మీద తిరుగుతూ లక్షా ఇరవైఐదు వేలమందికి మొక్కల నాటడంతో పాటు, వాటి ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించాడు. మొక్కలే కాకుండా 25వేల పక్షులకు వసతి కల్పించి వాటిని ఆదుకుంటున్నాడు. గాయపడిన వన్య్రప్రాణులను సైతం చేరదీస్తూ పర్యావరణాన్ని పచ్చగా ఉంచేందుకు కృషిచేస్తున్నాడు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైనట్టుగా.. భేరారం కృషితో ఎడారి ప్రాంతం కూడా పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుందాం. -
ఎర్రచందనం..ఎనీటైమ్ ప్రొటెక్షన్
చిప్ పనితీరు ఇలా.. రియల్‌టైం ప్రొటెక్షన్ చిప్ సెన్సార్ పరికరం 3.6 వాల్ట్స్ లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఎర్రచందనం చెట్లను ఎవరైనా నరికినా, దొంగిలించేందుకు ప్రయత్నించినా క్షణాల్లోనే మొబైల్ అప్లికేషన్స్, వాట్సాప్‌లకు అలర్ట్స్ పంపిస్తుంది. చెట్ల వద్ద ఉన్న హూటర్ ఎలక్ట్రానిక్ సైరన్ మోగిస్తుంది. వెంటనే అప్రమత్తమై చెట్లను రక్షించుకోవచ్చు.మొబైల్ అప్లికేషన్స్‌తో క్లౌడ్ సర్వర్‌ను అనుసంధానం చేయడంతో యూజర్స్‌కు వివిధ రకాల నివేదికలు చేరవేస్తుంది. గచ్చిబౌలి : ఖరీదైన ఎర్రచందనం చెట్లను పరిరక్షించేందుకు అధునాతన పరికరం (రియల్‌టైం ప్రొటెక్షన్ చిప్) అందుబాటులోకి వచ్చింది. నగరంలోని బొటానికల్ గార్డెన్లో ప్రయోగాత్మకంగా చిప్ సెట్లు అమర్చినట్టు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) వైస్‌చైర్మన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో విలేకరుల సమావేశంలో అధునాతన టెక్నాలజీని ఆయన వివరించారు. బొటానికల్ గార్డెన్లో 10 వేల ఎర్రచందనం మొక్కలు ఉన్నాయని, మొదటి విడతలో 50 ఎర్రచందనం చెట్లకు రియల్ టైం ప్రొటెక్షన్ చిప్‌లు అమర్చామని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన సీబీఐఓటీ టెక్నాలజీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. చిప్‌ల అమరికతో దొంగల నుంచి ఎర్రచందనం చెట్లను రక్షించుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే వీలుంటుందన్నారు. సీబీఐఓటీ సీఈఓ సత్యనారాయణ చొప్పదండి మాట్లాడుతూ ఎర్రచందనం చెట్ల రక్షణకు తమ సంస్థ ఇండియన్ ఉడ్ సైన్స్ టెక్నాలజీస్(ఐడబ్ల్యూఎస్‌టీ) సహకారంతో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ టెక్నాలజీని ఐడబ్ల్యూఎస్టీతో పాటు ఢిల్లీ ఐకార్, బెంగళూరు, ఝాన్సీ నగరాల్లో వాడుతున్నట్టు వివరించారు. సెన్సార్ కేసింగ్ (యాంటినో)తో అనుసంధానం చేయడంతో మొబైల్ ఫోన్లోనే చెట్ల రక్షణ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎవరైనా చెట్టును కొట్టేందుకు ప్రయత్నించినా చిప్ సెట్ సాయంతో అలారం మోగుతుందన్నారు. ఒక్క సెన్సార్ కేసింగ్‌తో కిలోమీటరు దూరంలో ఉన్న 500 చెట్లకు చిప్‌లను అమర్చుకోవచ్చన్నారు.అధికగాలి, జంతువుల రాపిడిని గుర్తించే విధంగా చిప్ సెట్ ఉంటుందన్నారు. ప్రతిరోజూ రాత్రి చెట్టుకు సంబంధించిన సమాచారాన్ని సర్వర్‌కు చేరవేస్తుందన్నారు. చెట్టును కొట్టాలని చూస్తే అలారం మోగుతుందని, చెట్టు ఎక్కడ ఉందనే వివరాలు ఫోన్‌కు చేరవేసి మ్యాప్ ద్వారా డైరెక్షన్ చూపిస్తుందన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్‌నాయక్, డైరెక్టర్ అక్బర్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
Intresting Facts: పేరుకు మాత్రమే చెట్లు.. కానీ అవి చెట్ల సమాధులు
నమ్మలేని నిజాలు.. ఇది మీకు తెలుసా? ► నమీబియాలోని ‘డెడ్ వ్లయ్’లో 900 ఏళ్ల వయసు ఉన్న చెట్లు ఉన్నాయి. అయితే అవి పేరుకు మాత్రమే చెట్లు. పచ్చదనం లేకుండా ఎండిపోయిన చెట్లు! అందుకే దీన్ని ‘చెట్ల ఎడారి’ ‘చెట్ల సమాధులు’ అని పిలుస్తారు. ► చిలకలలో ‘డ్రాకూన్ చిలకలు వేరయా’ అని చెప్పుకోవచ్చు. పపువా న్యూ గినియాలోని రెయిన్ ఫారెస్ట్‌లో కనిపించే డ్రాకూల ప్యారట్స్ నలుపు, చార్కోల్ గ్రే రంగుల్లో ఉండి కొంచెంచెం భయపెట్టేలా ఉంటాయి. ► నార్వేలో ‘హెల్’ పేరుతో ఒక విలేజ్ ఉంది. టూరిస్ట్ ఎట్రాక్షన్లో భాగంగా ఆ పేరు పెట్టారు! -
కూల్చాల్సిన భవనాలెన్ని..కొట్టేయాల్సిన చెట్లెన్ని..?
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి మూడు కాలా(కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్)ల పరిధిలో అవా ర్డు పాస్ చేసేందుకు ఎన్హెచ్ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పట్టాదారుల వారీగా వివరాలు నమోదు చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో సేకరించాల్సిన భూముల్లో ఉన్న నిర్మాణాలు, తోటలు, ఇతర ఆస్తుల విలువను మదింపు చేసే ప్రక్రియకు తాజా గా అధికారులు శ్రీకారం చుట్టారు. సేకరించాల్సిన భూమి విలువ ఆధారంగా పరిహారాన్ని అందించే క్రమంలో, ఆయా భూముల్లో ఉన్న నిర్మాణాలు, చెట్ల విలువలను కూడా గుణించి పరిహారం అందిస్తారు. ఇప్పుడు వాటి విలువకు సంబంధించి అధికారులు సర్వే చేస్తూ లెక్కలు సేకరిస్తున్నారు. ఉత్తరభాగంలో 8 ’కాలా’లు రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో 8 ‘కాలా’లున్న విషయం తెలిసిందే. ఇందులో యాదాద్రి–భువనగిరి, చౌటుప్పల్, ఆందోల్–జోగిపేట కాలాలకు సంబంధించి ఇటీవలే ఎన్హెచ్ఏఐ 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూడు ప్రాంతాల్లోని రైతులకు పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా అవార్డ్ పాస్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదాద్రి ప్రాంతంలో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ జరక్కుండా రైతులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లో రీజినల్ రింగ్‌రోడ్డుకు భూములు ఇవ్వబోమంటూ వారు భీషి్మంచుకుని కూర్చున్నారు. నిరసన కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల కొందరు రైతులపై కేసులు పెట్టిన పోలీసులు, వారికి బేడీలు వేసి మరీ కోర్టుకు తీసుకురావటం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో సర్వేను అలాగే పెండింగులో ఉంచిన అధికారులు, మిగతా రెండు కాలాల్లో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సేకరించాల్సిన భూముల్లో ఉన్న ఇళ్లు, దుకాణ సముదాయాలు, పరిశ్రమలు, ఇతర నిర్మాణాల లెక్కలు తీస్తున్నారు. పొలాల్లో ఉన్న తోటలు, సాధారణ చెట్ల లెక్కలు కూడా సిద్ధం చేస్తున్నారు. వాటి నిర్ధారిత విలువ ఆధారంగా నష్టపరిహారాన్ని అందిస్తారు. ప్రైవేటు వ్యక్తులతోపాటు, కొన్ని ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు కూడా ఉన్నాయి. వాటి లెక్కలను కూడా సంబంధించి విభాగాల అధికారులతో కలిసి సర్వే చేసి సిద్ధం చేస్తున్నారు. ఎన్హెచ్ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో రింగురోడ్డుకు అడ్డుగా ఉన్న స్తంభాలు, నీటి పైపులైన్లను తర లించేందుకు కూడా సమాంతరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్టీ లైన్లకు సంబంధించిన చిన్న స్తంభాలను తొలగించనున్నారు. అదే హైటెన్షన్, పవర్ గ్రిడ్ స్తంభాలను తొలగించకుండా, లైన్లు మరింత ఎత్తుగా ఉండేలా స్తంభాల ఎత్తును పెంచాలని నిర్ణయించారు. ఈమేరకు ట్రాన్స్‌కో, పవర్‌గ్రిడ్ అధికారులతో కలిసి ఎన్హెచ్ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైను కూడా అడ్డుగా ఉన్నందున, ఏయే ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలో, వాటి పొడవు, ఎత్తు ఎంత ఉండాలో తేల్చేందుకు రైల్వే అధికారులతో కలిసి సర్వే చేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్న చోట్ల ప్రత్యేక నిర్మాణాలు చేపడతారు. మరో నెల రోజుల్లో ఈ కసరత్తు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. సంగారెడ్డి–తూప్రాన్ మధ్య 30 కి.మీ.లు చొప్పున రెండు ప్యాకేజీలుగా 60 కి.మీ. నిడివి గల రింగు రోడ్డు పనులు తొలుత ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్యాకేజీలకు ఈ సంవత్సరమే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా అవార్డు పాస్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
భావి ఫలం
పాత కథే. కానీ కొత్త విషయానికి ప్రారంభంగా పనికొస్తుంది. చావు దగ్గరపడిన ఓ ముసలాయన ఎంతో శ్రద్ధగా మొక్క నాటడాన్ని చూసిన బాటసారి నవ్వడం మనకు తెలుసు. అది ఎప్పటికి పెరిగేనూ, ఎప్పటికి కాసేనూ! ప్రతి పనినీ మన కోసమే చేయం. ముందు తరాలకు పనికొచ్చేట్టుగా చేస్తాం. అదే వాళ్ల పూర్వీకులుగా మనం ఇవ్వగలిగే కానుక! బాటసారిలో గౌరవం పెరిగేలా వృద్ధుడు ఇదే చెబుతాడు. సరిగ్గా ఇలాంటి భావనతోనే నార్వేలో ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ ప్రారంభమైంది. దీనికి శ్రీకారం చుట్టింది స్కాట్లాండ్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ కేటీ పేటర్సన్. ఈమె వయసు 41 ఏళ్లు. ఈ భవిష్యత్ గ్రంథాలయ ప్రాజెక్టు 2014లో ప్రారంభమైంది. వందేళ్ల పాటు అంటే 2114 వరకూ కొనసాగుతుంది. ఒక్కో ఏడాదికి ఒక్కో రచయిత తన సరికొత్త అముద్రిత రచనను ఈ గ్రంథాలయానికి బహూకరిస్తారు. మొదటి రచనగా 2014 సంవత్సరానికి మార్గరెట్ అట్వుడ్ (కెనడా) తన ‘స్క్రిబ్లర్ మూన్ ’ సమర్పించారు. 2015కు డేవిడ్ మిషెల్ (ఇంగ్లండ్) తన ‘ఫ్రమ్ మి ఫ్లోస్ వాట్ యు కాల్ టైమ్’ను ఇచ్చారు. 2016కు షివోన్ (ఐస్లాండ్), 2017కు ఏలిఫ్ షాఫక్ (టర్కీ) తమ రచనలు బహూకరించారు. 2018కి హాన్ కాంగ్ (దక్షిణ కొరియా), 2019కి కార్ల్ ఊవ్ నాస్‌గార్డ్ (నార్వే), 2020కి ఓసియన్ వువాంగ్ (వియత్నాం) ఇచ్చారు. ఈ రచనలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయని కాదు, అలా ఇవ్వాలని కూడా లేదు. సౌకర్యార్థం శీర్షికల వరకు ఆంగ్లంలో అనువదించి ఉంచారు. విశేషం ఏమంటే– ఇందులోకి చేరే ‘పుస్తకాలు’ ఏమిటో కేటీకి గానీ, ఈ లైబ్రరీని నిర్వహించడానికి నెలకొల్పిన ‘ద ఫ్యూచర్ లైబ్రరీ ట్రస్టు’కు గానీ తెలీదు. సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అద్భుతమైన చేర్పు అయిన, భవిష్యత్ తరాల ఊహలను అందుకోగలిగే శక్తి సామర్థ్యాలున్న రచయితను ఆ సంవత్సరపు రచయితగా ఎంపిక చేసుకుంటారు. వారు అంగీకరించాక, అది రాయడానికి ఒక ఏడాదైనా పడితే, ఆ పూర్తయిన రాతపత్రిని నార్వేలో జరిపే ప్రత్యేక వేడుక ద్వారా స్వీకరిస్తారు. అందుకే 2021కి గానూ సిత్సి దాంగెరెంబ్గా(జింబాబ్వే) ‘నారిని అండ్ హర్ డాంకీ’ని 2022లో ఇచ్చారు. 2022 సంవత్సరానికి జుడిత్ షలన్ స్కీ (జర్మనీ) ఈ జూన్ లో అందజేస్తారు. ఆ రాతప్రతిని ప్రత్యేకమైన వస్త్రాల్లో చుట్టి, ఓస్లో ప్రజా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గదిలో ఉంచుతున్నారు. ఇవి వందేళ్ల తర్వాత ప్రచురితమవుతాయి. మరో విశేషం ఏమంటే, ఈ పుస్తకాలను అచ్చు వేయడానికే వెయ్యి చెట్లను ప్రత్యేకంగా అక్కడి నార్డ్‌మార్కా అటవీ ప్రాంతంలో పెంచుతున్నారు. ఈ వంద చేతిరాత ప్రతులను ఈ చెట్లతో తయారుచేసిన కాగితాలతో లిమిటెడ్–ఎడిషన్ గా ప్రచురిస్తారు. అందుకే దీన్ని ప్రపంచపు అత్యంత రహస్య గ్రంథాలయం అని గార్డియన్ పత్రిక అభివర్ణించింది. అయితే వందేళ్ల పాటు వీటిని చదవకుండా పాఠకులకు దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. వందేళ్ల నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వాళ్లుగానీ, దీనికి పుస్తకాలు సమర్పించిన చాలామంది రచయితలుగానీ ఉండరు. మార్గరెట్ అట్వుడ్ వయసు 83 ఏళ్లు. అంతెందుకు, ఈ ప్రాజెక్టు రచయితలుగా పరిగణనలోకి వచ్చిన టోమాస్ ట్రాన్స్ ట్రోమార్ (స్వీడన్ ), ఉంబెర్టో ఎకో (ఇటలీ) ఇప్పటికే మరణించారు కూడా. ‘‘అప్పటికి దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నా గొంతుక ఉన్నట్టుండి, ఒక వందేళ్ల తర్వాత మేల్కొంటుందన్న ఆలోచనే చిత్రంగా ఉంది. ఆ కంటెయినర్ లోంచి ఆ పుస్తకంలోని మొదటి పేజీ తెరిచే ఇప్పటికింకా శరీరంగా రూపుదిద్దుకోని ఆ చేతికి ఆ గొంతుక ఏం చెబుతుంది?’’ అని ఉద్విగ్నంగా మాట్లాడారు మార్గరెట్ అట్వుడ్. ‘‘భవిష్యత్తులో ఎప్పుడో చదువుతారని ఆశిస్తున్న ఒక రాతప్రతిని రాయడమనే ఆలోచనే ఒక ఉత్తరం రాసి నదిలో వేయడం లాంటిది. అది ఎటు పోతుందో మనకు తెలీదు, ఎవరు చదువుతారో తెలీదు– ఆ కాలప్రవాహాన్ని విశ్వసించడమే’’ అన్నారు ‘ద బాస్టర్డ్ ఆఫ్ ఇస్తాంబుల్’, ‘ద ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్’ లాంటి నవలలు రాసిన ఎలిఫ్ షఫాక్. ఆమె ఇచ్చిన ‘ద లాస్ట్ టాబూ’ కాల ప్రవాహంలో ఏ మలుపులు తీసుకుంటుందో! ‘‘నేనెట్లాగూ మరో వందేళ్లు ఉండను. నేను ప్రేమించేవాళ్లు కూడా ఉండరు. ఈ కనికరం లేని వాస్తవం నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయం గురించి ఆలోచించేట్టు చేసింది. నేనెందుకు రాస్తాను? నేను రాస్తున్నప్పుడు ఎవరితో సంభాషిస్తున్నాను? ఆ తర్వాత నేను ఒక ప్రపంచాన్ని ఊహించాను, అక్కడ నేను ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ ఆ ప్రపంచంలో నేను బతికి వుండగా కలిసిన నార్వేలోని చెట్లు ఇంకా ఉంటాయి. మనుషులకూ, చెట్లకూ మధ్య ఉన్న స్పష్టమైన ఈ అంతరం నన్ను తాకింది. ఈ ధ్యానం ఎంత తీవ్రమైనదంటే, మన నశించిపోయే జీవితాల అశాశ్వతత్వానికీ, విలువైన పెళుసుదనాల మన జీవితాలకూ నేరుగా కళ్లు తెరిపించింది’’ అంటారు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్. ‘‘ఈ ఆలోచన అద్భుతం. ఇప్పటికింకా పుట్టని పాఠకులకు మన కాలం నుంచి వారి కాలానికి ఒక చిన్న పడవను పంపడమే ఇది’’ అన్నారు కార్ల్ ఓవ్ నాస్‌గార్డ్. ఇప్పుడు పెరుగుతున్న ఈ చెట్ల నుంచి కాయనున్న పుస్తకాలను ఆరగించడానికి ప్రపంచంలోని ఏ మూలల్లో మనుషులు జీవం పోసుకోనున్నారో! వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూడాలని ఇప్పుడే కుతూహలంగా లేదూ! -
ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!
Mahogany Trees: జీవితంలో గొప్పవాడివి కావాలంటే తప్పకుండా ఏదో ఒక బిజినెస్ చేయాలి. బిజినెస్ అనగానే కోట్లలో పెట్టుబడి పెట్టాలనే భయం ఏ మాత్రం వద్దు. ఎందుకంటే నీ కృషి, పట్టుదలే నిన్ను జీవితంలో ఎదిగేలా చేస్తాయి. చెట్లను పెంచడం వల్ల కూడా కోటీశ్వరులయ్యే మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇందులో ఒకటి మహాగని చెట్ల పెంపకం. ఈ చెట్ల వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి? ఎన్ని రోజులకు వస్తాయనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. మహాగని మొక్కలను పెంచడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్లలోని ఆకులు, గింజలు, ఆఖరికి బెరడు కూడా విక్రయించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్కలు నాటిన తరువాత సుమారు 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. మహాగని ఉపయోగాలు మహాగని కలప సంగీత వాయిద్యాల్లోనూ, విగ్రహాల తయారీలోనూ, వాటర్‌క్రాఫ్ట్, అలంకార ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తారు. విత్తనాలను కొన్ని ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఔషదాలు షుగర్, క్యాన్సర్, బీపీ వంటి రుగ్మతల నివారణకు వాడే వైద్యంలో ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇక ఆకుల విషయానికి వస్తే, ఇవి వ్యవసాయ పురుగు మందులగా ఉపయోగిస్తారు. సబ్బు, పెయింట్ వంటి తయారీలో మహాగని నుంచి తీసిన నూనెలను వినియోగిస్తారు. ఈ విధంగా ఈ చెట్టులోకి ప్రతి భాగం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: చదివింది బీటెక్.. చేసేది బట్టల వ్యాపారం.. రూ. కోట్లలో టర్నోవర్) మహాగని వేర్లు భూమికి కొంత పైభాగంలోనే ఉంటాయి, కావున కొండ ప్రాంతాల్లో కాకుండా మిగిలిన అన్ని భూభాగాల్లో పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కావున రైతులు వ్యవసాయ, బంజరు భూములలో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు కలప రంగును బట్టి మార్కెట్లో గిరాకీ ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న కలప ధర రూ. 1300 నుంచి రూ. 2500 వరకు (క్యూబిక్ఫీట్) ఉంటుంది. బ్రౌన్ రంగులో ఉన్న కలప కొంత తక్కువ ధర పలుకుతుంది. ఈ చెట్టు సుమారు 60 నుంచి 80 అడుగులు పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ చెట్టు 40 క్యూబిక్ అడుగులు పెరుగుతుంది. క్యూబిక్ ఫీట్ ధర సరాసరి రూ. 1500 అనుకున్నప్పటికీ ఒక చెట్టు రూ. 60,000 వరకు అమ్ముడవుతుంది. (ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!) ఒక కేజీ మహాగని విత్తనాల ధర మార్కెట్లో రూ. 1000. ఈ విధంగా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఒక వ్యక్తి మహాగని పెంచాలనుకున్నప్పుడు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో సమీకృత వ్యవసాయం కూడా చేయవచ్చు. అలాంటి పంటలు కూడా వారికి కొంత లాభాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి. -
కొమ్మలు, ఆకులు లేని చెట్టు.. లిక్విడ్ ట్రీ
చెట్లు అంటే.. పెద్ద కాండం, కొమ్మలు, ఆకులు ఉంటాయి. గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని, మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. కానీ ఈ చెట్లకు కాండం, కొమ్మలు, ఆకులు వంటివేవీ ఉండవు. అయినా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి, ఆక్సిజన్ ఇస్తాయి. వీటిని ఎక్కడ కావాలన్నా పెట్టేసుకోవచ్చు. ఎన్ని అయినా రెడీ చేసుకోవచ్చు. మరి ఏమిటా చెట్లు? వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా.. కాలుష్యానికి పరిష్కారంగా.. బొగ్గును కలపను మండించడం నుంచి వాహనాల పొగ దాకా వాతావరణం కాలుష్యం ఏటేటా పెరిగిపోతోంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా చెట్లను పెంచడం దీనికి పరిష్కారమైతే.. అందుకు విరుద్ధంగా అడవుల నరికివేత విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో యూరప్‌లో అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచిన సెర్బియా శాస్త్రవేత్తలు.. వాతావరణ కాలుష్యానికి పరిష్కారం చూపేలా ‘లిక్విడ్ ట్రీస్’ను రూపొందించారు. ఏమిటీ ‘లిక్విడ్ ట్రీస్’? నీళ్లు, ఒక రకం నాచు (మైక్రో ఆల్గే) నింపి, ప్రత్యేకమైన కాంతి వెలువర్చే విద్యుత్ దీపాలను అమర్చిన ట్యాంకులే ‘నీటి చెట్లు (లిక్విడ్ ట్రీస్)’. సాంకేతికంగా వీటిని బయో రియాక్టర్లు అని పిలుస్తారు.నీటిలోని నాచు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని.. విద్యుత్ బల్బు నుంచి వెలువడే కాంతి సాయంతో ఫొటో సింథసిస్ (కిరణజన్య సంయోగ క్రియ) జరుపుతుంది. ఈ క్రమంలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఈ నీటి చెట్ల ట్యాంకులకు ‘లిక్విడ్3’ అని పేరు పెట్టారు. పదేళ్ల వయసున్న రెండు పెద్ద చెట్లతో, లేదా 200 చదరపు మీటర్ల స్థలంలోని గడ్డి, మొక్కలతో సమానమైన స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ను ‘లిక్విడ్ 3’ పీల్చుకుంటుందని దీనిని అభివృద్ధి చేసిన బెల్గ్రేడ్ యూనివర్సిటీ మల్టీడిసిప్లీనరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త ఇవాన్ స్పాసోజెవిక్ చెప్తున్నారు. గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎలా తగ్గుతుంది? సాధారణంగా నీటిలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వివిధ శాతాల్లో కరిగి ఉంటాయి. ఏదైనా కారణంతో నీటిలో వాటి శాతం తగ్గిన ప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి నీటిలోకి చేరుతాయి. ‘లిక్విడ్ 3’లోని కార్బన్ డయాక్సైడ్ను నాచు పీల్చుకున్నప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి తిరిగి కార్బన్ డయాక్సైడ్ ఆ నీటిలోకి చేరుతుంది. అంటే చుట్టూ ఉన్న గాలిలో కాలుష్యం తగ్గుతుంది. ఉదాహరణకు అక్వేరియంలలోని నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను చేప పిల్లలు పీల్చుకుంటాయి. ఇలా నీటిలో తగ్గిపోయే ఆక్సిజన్ శాతాన్ని తిరిగి పెంచేందుకే గాలి బుడగలను వెలువర్చే పంపులను అమర్చుతుంటారు. అయితే ‘లిక్విడ్ 3’లో ఇలా కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంటుంది. బెంచ్గా.. చార్జర్‌గా.. సెర్బియాలోని బెల్గ్రేడ్లో మున్సిపాలిటీ ఆఫీసు ముందు మొట్టమొదటి ‘లిక్విడ్ 3’ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. దీనిని భూమి నుంచి కాస్త లోతుగా ఏర్పాటు చేయడం వల్ల కూర్చునే బెంచ్‌లా ఉపయోగపడుతుంది. పైన సోలార్ ప్యానల్‌తో నీడ అమర్చారు. ఆ ప్యానెల్ నుంచి వచ్చే విద్యుత్‌తోనే ట్యాంకులో బల్బు వెలుగుతుంది. మొబైల్ ఫోన్లు వంటివి చార్జింగ్ చేసుకునే సాకెట్ కూడా ఉంటుంది. ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రోగ్రాం (యూఎన్డీపీ)’ కింద ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 11 ఉత్తమ వినూత్న ఆవిష్కరణల్లో ‘లిక్విడ్ 3’ కూడా చోటు సాధించడం గమనార్హం. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పొరుగింటి పచ్చదనం
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : గత పదేళ్లలో తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ (647 చ.కి.మీ) తర్వాత పచ్చదనం పెరిగిన రెండో రాష్ట్రం తెలంగాణ అని ఇండియన్ ఫారెస్ట్ సర్విస్ రిపోర్ట్ తాజాగా వెల్లడించింది. తెలంగాణలో వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న సమయంలో ఇది సంతోషకర పరిణామమే అయినా.. పర్యావరణవేత్తలు, జీవ వైవిధ్య నిపుణులు మాత్రం ఒక అంశంపై పెదవి విరుస్తున్నారు. అదేమిటంటే.. విస్తరిస్తున్న వనాల్లో స్థానిక మొక్కలు లేకపోవడం, ట్రాన్స్‌లొకేషన్ (భారీ వృక్షాలను ఒకచోటి నుంచి మరోచోటికి తరలించడం)లో సక్సెస్ రేటు సగం కూడా లేకపోవటమే. దక్కన్ పీఠభూమి విస్తారమైన ఆయుర్వేద మొక్కల నిలయమని, దేశంలోని జీవవైవిధ్య మండలాల్లో అత్యధిక దిగుబడి, పునరుత్పత్తి కలిగిన పశ్చి మ, తూర్పు కనుమల్లోని మొక్కలు, వృక్షాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కనిపించే పరిస్థితి ఉండేదని నిపుణులు చెప్తున్నారు. కానీ నేడు ఎక్కడ చూసినా విదేశీ జాతుల మొక్కలకే ప్రాధాన్యమివ్వటం వల్ల జీవవైవిధ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలెత్తుకు నిలబడింది.. మూసీ ఒడ్డున ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని ఈ చింతచెట్టు వయసు సుమారు 425 సంవత్సరాలపైనే. అయినా నిటారుగా నిలబడింది. వానలు, వరదలెన్ని వచ్చినా కదల్లేదు.. కారణం లోకల్ జాతి కావటమే. ఇక్కడి వాతావరణం, భూమితో పెనవేసుకున్న బలమైన బంధంతో ఇంకా అందరి ‘చింత’తీరుస్తోంది. ఈ చెట్టే 1908 నాటి మూసీ వరదల్లో 150 మంది ప్రాణాలు కాపాడింది. ఆ ఏడాది సెపె్టంబర్ 27, 28 తేదీల్లో కుండపోత వానతో మూసీ ఉప్పొంగి తీర ప్రాంతాలను ముంచెత్తగా.. ఈ చెట్టు ఎక్కి కూర్చున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. అందుకే ఈ చెట్టుకు ఏటా సెప్టెంబర్ 28న ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ‘బాగ్’నగర్లో.. బాగ్‌లు మాయం.. హైదరాబాద్ అంటేనే ‘బాగ్ నగర్’.. అంటే ఉద్యాన వనాల నగరం అని అర్థం. అప్పట్లో నగరమంతా పరుచుకున్న మొక్కలు, వృక్షాలన్నీ అన్నీ స్థానిక వెరైటీలే. నగరంలో జాంబాగ్, కుందన్‌బాగ్, సీతారాంబాగ్, బషీర్‌బాగ్, రాంబాగ్, పూల్‌బాగ్, కిషన్‌బాగ్,, మూసారాంబాగ్ , ఇబ్రహీంబాగ్, బాగ్లింగంపల్లిలతోపాటు చింత వనాలతో నిండిన ఇమ్లీబన్, చింతలబస్తీలతో హైదరాబాద్ నగరం ప్రపంచ జీవ వైవిధ్య పటంలో ప్రత్యేకంగా నిలిచేది. తూర్పు, పశ్చి మ కనుమల్లో ఉండే ప్రతిమొక్క, వృక్షం మూసీ పరీవాహకంతోపాటు హైదరాబాద్ నగరంలో కనిపించేవని పర్యావరణవేత్త డాక్టర్ కె.పురుషోత్తంరెడ్డి చెప్తున్నారు. అందులో అత్యధికం ఔషధ గుణాలున్నవేనని.. గండిపేట నీళ్లు, హైదరాబాద్ గాలి తాకగానే మనుషుల్లో మార్పు స్పష్టంగా కనిపించేదని అంటున్నారు. కానీ క్రమంగా జనావాసాలు పెరగడం, కాలనీలు, రోడ్ల విస్తరణ, ప్రభుత్వ, చెరువు భూముల కబ్జాలతో స్థానిక రకాలైన మర్రి, రావి, వేప, చింత, నేరేడు తదితర వృక్షాలన్నీ కనిపించకుండా పోయాయి. వాటి స్థానంలో అందం కోసమంటూ ఇతర ప్రాంతాలు, దేశాలకు చెందిన మొక్కలు, చెట్లను పెంచేశారు. కానీ అవి బలంగా లేక, ఈదురుగాలులకు కూలిపడుతుండటంతో ఏటా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. హరితహారంలోనూ ఇలాగే..! రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలోనూ విదేశీ జాతుల మొక్కలనే ఎక్కువగా నాటుతున్నారు. స్థానిక జాతులైతే పెరిగేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయని.. వేగంగా పెరిగే విదేశీ జాతులను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఎడారి దేశాల్లో పెరిగే ‘కోనోకార్పస్’అనే మొక్కను రాష్ట్రమంతటా నాటారు. పెద్దగా నీటి తడి లేకున్నా పెరిగి, ఏడాదంతా పచ్చగా కనిపించే ఈ చెట్లు ఇప్పుడు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ కనిపిస్తున్నాయి. అయితే కోనోకార్పస్ పూల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా వంటి సమస్యలు వస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. వాటి వేర్లు లోతుగా పాతుకుపోతూ.. మధ్యలో అడ్డు వచ్చే కమ్యూనికేషన్ కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు, మంచినీటి వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని.. సమీపంలో ఇతర చెట్లు పెరగకుండా చేస్తున్నాయని గుర్తించారు. ఈ చెట్ల ఆకులను స్థానిక జంతువులేవీ తినవు కూడా. దీంతో ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాలు కోనోకార్పస్ నాటడాన్ని నిషేధించాయి. ట్రాన్స్‌లొకేషన్.. ట్రాజెడీయే.. రహదారుల విస్తరణ సమయంలో భారీ వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్ చేస్తున్నా.. తదనంతర జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఆశించిన ఫలితం రావటం లేదు. అదే విధంగా వేసవి కాలంలో ట్రాన్స్‌లొకేషన్ చేయొద్దు. అయినా ఇదే సమయంలో చేస్తున్నారు. ట్రాన్స్‌లొకేషన్‌కు సంబంధించి త్వరలోనే ఓ ప్రొటోకాల్ విడుదల చేయనున్నాం. – ఉదయకృష్ణ, వట ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఇక్కడి ప్రతి మొక్కలో ఔషధ గుణాలే.. దక్కన్ పీఠభూమిలో పెరిగే ప్రతి మొక్క జీవ వైవిధ్యానికి పనికి వచ్చేదే. ప్రకృతి వర ప్రసాదాన్ని మనం రక్షించుకోలేకపోతున్నాం. ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడ్డ వృక్షాలను తొలగించి.. వాటి స్థానంలో కాత, పూత లేని విదేశీ మొక్కలను నాటుతున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. తూర్పు, పశ్చి మ కనుమల్లో కనుగొన్న అపార వృక్ష సంపదను ప్రత్యేక విభాగాలతో సంరక్షించాల్సి ఉంది. – డాక్టర్ కె.తులసీరావు, జీవ వైవిధ్య నిపుణుడు -
సేవ్ స్పారో
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): పిచ్చుక గూడు నిర్మాణమే ఓ అద్భుతం. ప్రకృతి తీర్చిదిద్దిన గొప్ప ఇంజనీర్లుగా పిచ్చుకలు పేరొందాయి. రేడియేషన్, వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పట్టణాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో చెట్లు లేక పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. పల్లెల్లో చెట్లు ఉన్నా.. అరకొరగానే పిచ్చుక గూళ్లు కనిపిస్తున్నాయి. కాపాడుతున్న పక్షి ప్రేమికులు గతంలో పట్టణాలలో పూరిళ్లు, పెంకుటిళ్లలో గూళ్లు ఏర్పాటు చేసుకుని పిచ్చుకలు సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. నగరీకరణ నేపథ్యంలో ఇపుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలు సాగు చేస్తుండటంతో పిచ్చుకలు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. సంతానోత్పత్తి మాట అలా ఉంచి ప్రాణాలు కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసుల్లో పక్షుల పట్ల ప్రేమ పెరుగుతోంది. ముఖ్యంగా పిచ్చుకల కిచకిచలు వినాలని.. వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలన్న స్పృహ చాలా మందిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే చెక్కతో చేసిన స్పారో హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్స్‌లోని బాల్కనీలు, ఇళ్ల ముంగిట వీటిని అమరుస్తున్నారు. పిచ్చుకలకు కావాల్సిన ఆహారాన్ని, నీటిని సమకూరుస్తున్నారు. బియ్యం నూక, జొన్నలు, సజ్జలు వివిధ రకాల ధాన్యపు గింజలు వాటి కోసం పెడుతున్నారు. పక్షి ప్రేమికుల కోసం గడ్డితో తయారు చేసిన పిచ్చుక గూళ్లు సైతం కొన్ని మాల్స్‌లో విక్రయిస్తున్నారు. ‘స్ఫూర్తి’ నింపుతున్నారు పిచ్చుకలను రక్షించే లక్ష్యంతో విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పిల్లలకు పిచ్చుకల రక్షణపై అవగాహన కలి్పంచడం, వాటికి ఆవాసాలు ఏర్పాటుపై ఆసక్తి కల్పిస్తున్నారు. పిచ్చుకలను రక్షించుకోవడం ఎలా అనే అంశంపై వర్క్‌షాపులు, చిత్ర ప్రదర్శనలు సైతం నిర్వహిస్తోంది. అంతటితో సరిపెట్టకుండా చెక్కతో చేసిన కృత్రిమ ఆవాసాలను సైతం చిన్నారులకు అందిస్తోంది. కొందరు వ్యక్తులు పిచ్చుకలపై ప్రేమతో తమ ఇంటి పరిసరాల్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ గిన్నెల్లో నీళ్లు నింపి, గింజలు పెడుతున్నారు. మార్కెట్లో లభించే స్పారో హౌస్‌లను తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరుకు చెందిన తోట శ్రీనివాసరావు తన ఇంటి పెరట్లోని చిన్న చెట్లకు 10కి పైగా స్పారో హౌస్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో చేరే పిచ్చుకలకు నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. వేసవి కాలం పిచ్చుక సంతానోత్పత్తి సమయమని.. ఈ కాలంలో వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితే మంచిదని ఆయన సూచిస్తున్నారు. పిచ్చుకలను కాపాడుకోవాలి పంటలకు హాని చేసే క్రిములను తినడం ద్వారా పిచ్చుకలు రైతులకు సహాయకారిగా ఉండేవి. చిన్న జీవి అయినా పిచ్చుకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమవంతుగా పిచ్చుకలకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్, విజయవాడ -
అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్!
చింతపల్లి(పశ్చిమగోదావరి జిల్లా): డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా... అంటూ చాలామంది వ్యంగ్యంగా అంటుంటారు. కానీ, చాలా దేశాల్లో డబ్బులను చెట్ల నుంచే తయారు చేస్తారు. మన దేశంలో చెట్ల నుంచి కరెన్సీ నోట్లు తయారు చేయకపోయినా... ఇందుకోసం ఉపయోగించే అరుదైన ఆల్పైన్స్ వృక్షాలు మాత్రం మన దగ్గర దశాబ్దాలుగా పెరుగుతున్నాయి. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర చీమల దండయాత్ర.. హడలిపోతున్న జనం.. వాటిలో అల్లూరి జిల్లాలోని చింతపల్లి ప్రాంతం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాల కిందట అటవీ శాఖ ఆధ్వర్యంలో పరిశోధనల కోసం చింతపల్లి మండలంలోని కృష్ణాపురం, చిన్నగెడ్డ అటవీ ప్రాంతాల్లో 20 హెక్టార్లలో ఆల్పైన్స్ మొక్కలను శాస్త్రవేత్తలు నాటారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో చెట్లు బాగా పెరిగాయి. దీంతో మరో పది హెక్టార్లకు ఆల్పైన్స్ మొక్కల సాగును విస్తరించారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో... అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఆల్ పైన్స్ వృక్షాల కలప నుంచే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. ఆయా దేశాల్లో మెత్తని స్వభావం కలిగిన ఆల్పైన్స్ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల కరెన్సీ నోట్ల తయారీకి పూర్తిగా వీటిపైనే ఆధారపడతారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మన దేశంలో ఆల్పైన్స్ వృక్షాల పెంపకం తక్కువగా ఉండడం వల్ల నగదు తయారీకి ఉపయోగించడం లేదు. కరెన్సీ తయారీకి సంబంధించిన యంత్ర సామగ్రి కూడా అందుబాటులో లేదు. దీంతో ఈ కలపను ఫర్నిచర్, ఇళ్లలో కబోర్డులు, ఫ్లోరింగ్, అలంకరణ వస్తువుల తయారీ వంటి వాటికి వినియోగిస్తున్నారు. పర్యాటకులకు కనువిందు... మన దేశంలో హిమాలయాలు, పశ్చిమ కనుమలు, రాష్ట్రంలోని చింతపల్లిలో గల ఎత్తయిన చల్లని వాతావరణం కలిగిన ప్రాంతాల్లో మాత్రమే ఆల్పైన్స్ చెట్లు పెరుగుతాయి. చాలా ఎత్తుగా ఉండే ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. వేసవిలో సేదదీరేందుకు అనువుగా ఉంటాయి. చింతపల్లి ప్రాంతం అనువైనది ఎత్తయిన పర్వత శ్రేణి ప్రాంతంలో ఉన్న చింతపల్లి అటవీ ఏరియాలో ఆల్పైన్స్ చెట్లను పెంచేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మన దేశంలో తక్కువ ప్రాంతాల్లో ఈ చెట్లు పెంచడం వల్ల కరెన్సీ తయారీకి సరిపడా కలప ఉత్పత్తి కావడం లేదు. దీంతో కరెన్సీ తయారీకి ఉపయోగించడం లేదు. విదేశాల్లో ఎక్కువగా ఈ చెట్ల కలప ద్వారానే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. – శ్రీనివాసరావు, అటవీ శాఖ రేంజ్ అధికారి, చింతపల్లి -
Library On Trees: పుస్తకాలు కాసే చెట్లు!
చెట్లకు డబ్బులు కాస్తాయా! అంటారు. డబ్బులు కాదుగానీ పుస్తకాలు కాస్తాయి... అని సరదాగా అనవచ్చు. ఎలా అంటే... అస్సాంలోని జోర్హాట్ జిల్లాకు చెందిన మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. రకరకాల సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకసారి వీరి మధ్య గ్రంథాలయాల గురించి చర్చ జరిగింది. తమ చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ అయిపోగానే రోజూ ఊరి గ్రంథాలయానికి వెళ్లేవాళ్లు. లోపల పెద్దవాళ్లు న్యూస్‌పేపర్లు తిరగేస్తూనో, పుస్తకాలు చదువుకుంటూనో గంభీరంగా కనిపించేవారు. తాము మాత్రం ఆరుబయట పచ్చటిగడ్డిలో కూర్చొని బొమ్మలపుస్తకాలు చదువుకునేవారు. సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఈ ఇంటర్నెట్ యుగంలో చాలామంది పిల్లలు సెల్ఫోన్ల నుంచి తల బయట పెట్టడం లేదు. పాఠ్యపుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు వారి దగ్గర కనిపించడం లేదు. చదివే అలవాటు అనేది బాగా దూరం అయింది. ‘మన వంతుగా ఏం చేయలేమా’ అనుకుంది మహిళాబృందం. అప్పుడే ‘ట్రీ లైబ్రరీ’ అనే ఐడియా పుట్టింది. ప్రయోగాత్మకంగా మారియాని గర్ల్స్హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న చెట్లకు బాక్స్‌లు అమర్చి వాటిలో దినపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు పెట్టారు. స్పందన చూశారు. అద్భుతం. చెట్ల నీడన పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్న దృశ్యం కన్నుల పర్వం! ‘పిల్లలకు, లైబ్రరీలకు మధ్య దూరం ఉంది. ఆ దూరాన్ని దూరం చేయడమే మా ప్రయత్నం. సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా పఠనం అనేది మనకు ఎప్పుడూ అవసరమే. అది మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైనా దిపిల పొద్దార్. విశేషం ఏమిటంటే... జోర్హాట్ జిల్లా చుట్టుపక్కల గ్రామాలు ఈ ట్రీ లైబ్రరీని స్ఫూర్తిగా తీసుకొని, తమ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ‘ఈ ట్రీ లైబ్రరీ గురించి విని మా ఊరి నుంచి పనిగట్టుకొని వచ్చాను. నాకు బాగా నచ్చింది. పిల్లలను పుస్తకాల దగ్గరికి తీసుకురావడానికి అనువైన వాతావరణం కనిపించింది. మా ఊళ్లో కూడా ఇలాంటి లైబ్రరీ మొదలు పెట్టాలనుకుంటున్నాను’ అంటుంది భోగ్పూర్ సత్రా అనే గ్రామానికి చెందిన హిమంత అనే ఉపాధ్యాయిని. ఇక మజులి గ్రామానికి చెందిన నీరబ్ ఈ ‘ట్రీ లైబ్రరీ’ గురించి సామాజిక వేదికలలో విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ‘ఇలాంటివి మా ఊళ్లో కూడా మొదలుపెట్టాలనుకుంటున్నాము’ అంటూ మంచి స్పందన మొదలైంది. మూడు నెలలు వెనక్కి వెళితే... పశ్చిమబెంగాల్లోని అలీపూర్దౌర్ యూరోపియన్ క్లబ్ గ్రౌండ్‌లోని చెట్లకు అరలు తయారు చేసి పుస్తకాలు పెట్టారు. ఓపెన్ ఎయిర్ కాన్సెప్ట్‌తో మొదలైన ఈ ట్రీ లైబ్రరీ సూపర్ సక్సెస్ అయింది. ఇది పర్యాటక కేంద్రంగా మారడం మరో విశేషం! -
బ్యూటిఫుల్ వీడియోతో గడ్కరీకి ఆనంద్ మహీంద్ర వినతి
న్యూఢిల్లీ: ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర. తాజాగా మరో అందమైన, అద్భుత ట్రీ టన్నల్ (ట్రన్నల్) దృశ్యాలతో కూడిన వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న గ్రామీణ రహదారుల వెంట ఇలాంటి చెట్లను నాటి ‘ట్రన్నల్స్’ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ‘నాకు సొరంగాలు(టన్నల్స్) అంటే చాలా ఇష్టం. కానీ, నిజంగా ఇలాంటి ‘ట్రన్నల్స్’ గుండా వెళ్లడానికి ఇష్టపడతాను. కొత్తగా నిర్మించే గ్రామీణ రహదారుల వెంట చెట్లు నాటి ఇలాంటి ట్రన్నల్స్‌ను మనం నిర్మించగలమా నితిన్ గడ్కరీ జీ?’ అంటూ రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి రెండు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 37వేలకుపైగా లైకులు వచ్చాయి. ‘ప్రపంచంలోనే సహసిద్ధ టన్నల్’ అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. ‘రోడ్డుపై ఉష్ణోగ్రతలను ఈ టన్నల్స్ తగ్గిస్తాయి’ అని మరొకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్‌కు స్పందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేది. ‘వృక్షాలు బలంగా లేకపోతే వాహనాలపై పడతాయి. హైవేలపై పడి ప్రయాణాలకు ఆటంకం కలిగిస్తాయి. ఇది ఆ ప్రాంతంలోని మట్టి, వాతావరణ పరిస్థితులు, చెట్ల రకాలపై ఆధారపడి ఉంటుంది. భద్రత అనేది సమస్య కానప్పుడు ఇది చాలా అందంగా కనిపిస్తుందని చెప్పగలను.’ అంటూ పేర్కొన్నారు. I like tunnels, but frankly, I’d much rather go through this kind of ‘Trunnel’ …@nitin_gadkari ji, can we plan to purposefully plant some of these trunnels on the new rural roads you are building? https://t.co/6cE4njjGGi — anand mahindra (@anandmahindra) August 27, 2022 ఇదీ చదవండి: Anand Mahindra: ఆనంద్ మహీంద్ర అద్భుతమైన పోస్ట్: నెటిజన్లు ఫిదా -
ఔషధ గుణం.. తారా వనం..
పిఠాపురం: వృక్షారాధన భారతీయుల ఆచారంగా కొనసాగుతోంది. ప్రతి దైవక్షేత్రానికి ఒక స్థల వృక్షం ఉంటుంది.తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి ఆలయ స్థలవృక్షం చింత చెట్టు. ద్వాదశ రాశులు, నవ గ్రహాలు, 27 నక్షత్రాలతో పవిత్రమైన వృక్షాలకు అనుబంధం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. నక్షత్ర వనాలు.. ప్రకృతిని ప్రభావితం చేసే పచ్చని వృక్షాలు జీవరాశుల మనుగడకు దోహదం చేస్తున్నాయి. ప్రతి గ్రహానికి నక్షత్రానికి ఒక వృక్షం ఉంటుందని భారతీయ సనాతన ధర్మం చెబుతోంది. నవగ్రహారాధనలో వృక్షాలకు ప్రత్యేక స్థానం ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఒక్కో కాలంలో ఒక్కో చెట్టును పూజిస్తుంటారు.నవ గ్రహాల్లో చంద్రుడికి మోదుగ, సూర్యుడికి ఎర్ర చందనం, అంగారకుడికి చండ్ర, బుధుడికి రావి, గురుడుకి ఉత్తరేణి, శుక్రుడికి వెలగ, శనీశ్వరుడికి జమ్మి, రాహువుకు గరిక, కేతువుకు దర్ప వృక్షాలను పూజించాలని వేదాలు చెబుతున్నాయి. ఆగమ శాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలు, 9 గ్రహాలకు సంబంధించి 36 రకాల వృక్షాలను గ్రహాలు, నక్షత్రాలకు సూచికగా చెబుతుంటారు. నక్షత్రాల్లో అశ్వినికి ముషిని, భరణికి ఉసిరి, కృత్తికకు మేడి, రోహిణికి నేరేడు, మృగశిరకు సండ్ర, ఆరుద్రకు గుమ్మడి, పునర్వసుకు సదనం, పుష్యమికి రావి, ఆశ్లేషకు నాగకేశరి, మూలాకు శ్రీగంధం, పూర్వాషాఢకు వందనం, ఉత్తరాషాఢకు పనస, శ్రవణానికి తెల్ల జిల్లేడు, ధనిష్టకు ఇనుపతుమ్మ, శతభిషానికి కదంబ, పూర్వాభాద్రకు వేప, ఉత్తరాభాద్రకు మామిడి, రేవతికి ఇప్ప, మఖకు మర్రి, పుబ్బకు మోదుగ, ఉత్తరకు జువ్వి, హస్తకు అడివి మామిడి, చిత్తకు మారేడు, స్వాతికి తెల్లమద్ది, వైశాఖకి పులివెలగ, అనురాధకు పొగడ, జేష్టకు బూరుగు మొక్కలు నాటడం మంచిదని చెబుతున్నారు. ఆయుర్వేద వనమూలికలుగా చెప్పే నక్షత్ర వృక్షాల కొమ్మలతో హోమం నిర్వహిస్తే వాటి నుంచి వచ్చే పొగ వాతావరణాన్ని రక్షిస్తుందని, గాలిని శుభ్రపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. నా మొక్క నా శ్వాస నా మొక్క నా శ్వాస అనే నినాదంతో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. ఔషధ గుణాలున్న మొక్కలు నాటాలనే సంకల్పంతో ఇటీవల నక్షత్రవనం నిర్మాణం చేపట్టాం. – డాక్టర్ ఉమర్ అలీషా, శ్రీవిశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతులు, పిఠాపురం నక్షత్రాలను బట్టి మొక్కలు ఎవరి నక్షత్రానికి తగ్గ మొక్కను నాటడం వారికి చాలా మంచిది. ఆయా నక్షత్రాల ప్రకారం ఔషధ మొక్కలు నాటితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. – అల్లంరాజు చంద్ర మౌళి, వేద పండితులు, పిఠాపురం -
ఈ వేడి ఏమార్చేస్తోంది..!
కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని దశాబ్దాల ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతున్నాయి. ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ‘వేడి’ మంటెక్కిస్తోంది. మనుషులపై మాత్రమేకాదు.. జంతువులు, చెట్లు, ఇతర జీవజాలం మొత్తంపై ప్రభావం చూపుతోంది. చల్లగా యాపిల్స్ పండేచోట మండే ఎండల్లో వచ్చే మామిడి పళ్లు కాస్తున్నాయి.. జంతువులే కాదు చెట్లూ తమ ప్రాంతాలు వదిలి ‘వలస’పోతున్నాయి.. ఇదేదో కొద్దిరోజులకో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదు.. భూమిపై జీవం మొత్తం అసాధారణ మార్పులకు లోనవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, జీవజాలంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందామా? సాక్షి సెంట్రల్ డెస్క్ జంతుజాలం ‘వలస మారె!’ మారుతున్న వాతావరణంలో జంతువులు ఇమడలేకపోతున్నాయి. ఆయా జంతువులకు తగిన ఆహారం దొరకడం లేదు. దీనితో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొత్త కొత్త అలవాట్లు సంతరించుకుంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ♦అమెజాన్ అడవుల్లో పక్షులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా వాటి పరిమాణం తగ్గిపోతోందని తేల్చారు. పక్షులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ఓ వైపు శరీర పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయని గుర్తించారు. మరోవైపు శరీరాన్ని చల్లబర్చుకోవడం, బయటి ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవడం కోసం ముక్కు, రెక్కలు, ఈకలు, తోకల పరిమాణాన్ని పెంచుకుంటున్నాయని గుర్తించారు. ♦ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రాంతాల్లో మాంసం, పాల కోసం పెంచుతున్న పశువుల నుంచి ఉత్పత్తి తగ్గిపోతోందని ఇటీవల లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ♦మంచు ప్రాంతాల్లో బతికే ఎలుగుబంట్లు, పెంగ్విన్లు, ఇతర జీవజాతుల సంతతి తగ్గిపోతోందని అమెరికన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ♦ఏటా శీతాకాలం, ఎండాకాలంలో పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తమకు అనువైన ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులతో.. ఈ వలసలు మారిపోతున్నాయి. మన దేశానికి వలస వచ్చే సైబీరియన్ కొంగల సంఖ్య కొన్నేళ్లుగా బాగా తగ్గిపోయింది. అందులోనూ కొద్దిరోజులకే అవి తిరిగి వెళ్లిపోతుండటం గమనార్హం. ♦సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో కొన్నిరకాల చేపలు, ఇతర జలచరాలు అంతరించిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. చెట్టూచేమ.. వరుస మారె.. ప్రతి చెట్టు, మొక్క కూడా ఆయా ప్రాంతాల్లోని చల్లదనం, వేడి వంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎదిగే, మనగలిగే లక్షణాలను అలవర్చుకుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు అడ్డగోలుగా పెరిగిపోవడంతో చల్లటి ప్రాంతాల్లోని పలు రకాల చెట్లు, మొక్కలు బతకలేకపోతున్నాయి. మరోవైపు అదేచోట ఉష్ణమండల చెట్లు (వేడి వాతావరణంలో మాత్రమే పెరిగే చెట్లు/ మొక్కలు) కొత్తగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ♦ఉదాహరణకు కాఫీ, తేయాకు, యాపిల్స్ వంటివి చల్లగా ఉండే హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో, పశ్చిమ కనుమలు వంటి ప్రాంతాల్లో పండుతాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. అవి దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వేడిని తట్టుకునే పంటలు/ చెట్లు/మొక్కలు కొత్తగా పెరుగుతున్నాయి. ♦ఇక వేడిగా ఉండేచోట్ల మరింత వేడి పెరిగి చెట్లు, మొక్కలు ఎండిపోయి బీళ్లుగా మారుతున్నాయి. ♦వేడి వాతావరణంలో చెట్లు బలహీనపడుతుండటంతో.. ఫంగస్‌లు విజృంభించి వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇటీవలే మన దేశంలో మూడు రకాల ఫంగస్‌లు వ్యాపించి పెద్ద సంఖ్యలో వేప చెట్లు దెబ్బతినడం దీనికి ఉదాహరణ అని నిపుణులు చెప్తున్నారు. అడవి రూపు మారె... వాతావరణ మార్పులతో తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, వర్షాభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అడవులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన దేశంలోనూ భారీగా అడవులు ఎండిపోతున్నాయి. బ్రిటన్‌కు చెందిన రీడింగ్ యూనివర్సిటీ ఇటీవలే భారతదేశంలో వర్షపాతం, ఉష్ణోగ్రతల తీరు, వాటివల్ల అడవుల క్షీణతపై శాస్త్రీయ అధ్యయనం చేసింది. దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలు, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల క్షీణత ఎక్కువగా ఉందని పేర్కొంది. దేశంలోని వృక్షాలు, జీవజాతుల్లో పదిశాతం మేర అంతరించిపోయే దశలో ఉన్నాయని తెలిపింది. ♦ 2001 – 2018 మధ్య దేశంలో 20,472 చదరపు కిలోమీటర్ల అడవులు తగ్గిపోయినట్టు పేర్కొంది. ఇది దేశంలోని మొత్తం అడవుల్లో 7.34 శాతం కావడం గమనార్హం. ♦ఇక ఒక్క 2017లోనే 2,503 చ. కిలోమీటర్ల అడవి అంతరించిపోయినట్టు పరిశోధన వెల్లడించింది. ♦‘‘ఇండియాలో కొన్నేళ్లుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అతి ఎక్కువ వేడి, వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య పెరిగింది. ఈ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఇండియాలో మరింత ఎక్కువగా అడవులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది అటవీ సంపద, వన్యప్రాణులపైనా ప్రభావం చూపుతుంది’’అని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త అలైస్ హఫన్ పేర్కొన్నారు. రోగాల తీరు మారె.. ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఆయా ప్రాంతాల్లో వాతావరణ మార్పులు జరగడంతో.. కొత్త కొత్త బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు విజృంభిస్తున్నాయి. వేడి వాతావరణం కారణంగా దోమలు, ఈగలు, ఇతర కీటకాలు పెరిగి అంటు రోగాలు విజృంభిస్తున్నాయని.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధులు, రోగాలు ఇతర ప్రాంతాలను కమ్ముకుంటున్నాయని గతేడాది స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ♦అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం వల్ల ఊపిరితిత్తులు, గుండె నాళాల సమస్యలు, చర్మ సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇటీవలే హెచ్చరించింది. ♦వేల ఏళ్ల కిందట మంచు అడుగున కూరుకుపోయిన నాటి సూక్ష్మజీవులు బయటికి వచ్చి కొత్త వ్యాధులు కమ్ముకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. కాలం అదను మారె.. ♦ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల చాలా ప్రాంతాల్లో వానాకాలం, చలికాలం తగ్గిపోతున్నాయి. ఎండాకాలం పెరిగిపోతోంది. భవిష్యత్తులో ఆరు నెలలు ఎండాకాలమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ♦అధిక ఉష్ణోగ్రతలు వల్ల ఆరుబయట పనిచేసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ది లాన్సెట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇలా ఒక్క 2019 ఏడాదిలోనే 30వేల కోట్ల పని గంటలకు నష్టం జరిగింది. ♦వాతావరణ మార్పుల వల్ల రుతువుల సమయాల్లోనూ మార్పులు వస్తున్నాయి. బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో మార్చి నెల మధ్యలో వసంతకాలం మొదలవుతుంది. కానీ కొన్నేళ్లుగా ఫిబ్రవరి నెల మొదట్లోనే ఇది మొదలవుతోంది. ♦ హిమాలయాల ప్రాంతంలో ఉండే రోడోడెండ్రాన్ చెట్లు సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో అంటే ఎండాకాలం మొదట్లో పూలు పూస్తాయి. కానీ కొన్నేళ్లుగా జనవరిలోనే పూస్తున్నాయి. ♦మామిడి చెట్లకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే అనుకూలం. చలి, మంచు ప్రదేశాల్లో చెట్లు పెరిగినా పళ్లు కాయవు. కానీ శీతల ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కొన్నేళ్లుగా మామిడి పండ్లు కాస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే దీనికి కారణం. -
లక్ష చెట్ల రింగురోడ్డు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించబోతున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), దాని పరిసరాలను హరితమయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం అనుమతించిన ఉత్తర భాగంలో 158 కిలోమీటర్ల పొడవునా లక్ష చెట్లు పెంచాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డుకు రెండు వైపులా మూడు వరుసల్లో.. మొత్తంగా ఒక్కో కిలోమీటర్‌కు 600 మొక్కల చొప్పున నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రీజనల్ రింగ్‌రోడ్డు, ఇతర రాష్ట్ర, జాతీయ రహదారులు కలిసే ఎనిమిది చోట్ల నిర్మించే భారీ ఇంటర్ ఛేంజర్ల వద్ద చెట్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉండనుంది. భారీగా వృక్ష సంపద కోల్పోతుండటంతో.. రీజనల్ రింగ్ రోడ్డును భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎనిమిది వరుసలకు సరిపడా భూసేకరణ చేయనున్నారు. అందులో ప్రస్తుతానికి నాలుగు వరుసలతో రోడ్డు నిర్మిస్తారు, వాహనాల సంఖ్య పెరిగే క్రమంలో ఎనిమిది లేన్లకు విస్తరిస్తారు. మొత్తంగా రోడ్డుతోపాటు విద్యుత్ స్తంభాలు, చెట్ల పెంపకం, అవసరమైన చోట ట్రక్ వే సైడ్ పార్కింగ్, డ్రైనేజీ.. ఇలా ఇతర అవసరాలకు కలిపి 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేసి చదును చేసి పెడతారు. ఈ క్రమంలో భారీగా వృక్ష సంపదకు నష్టం జరగనుంది. అదే సమయంలో రోడ్డు వెంట భూముల్లో వ్యవసాయం స్థానంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటితో పర్యావరణానికి దెబ్బపడే నేపథ్యంలో.. రీజినల్ రింగురోడ్డు పొడవునా భారీగా చెట్లు పెంచేందుకు ప్రణాళిక వేస్తున్నారు. మొక్కలు నాటేదిలా.. వంద మీటర్ల వెడల్పుతో భూమిని చదును చేశాక.. రెండు చివరల్లో 3 మీటర్ల చొప్పున 6 మీటర్ల స్థలాన్ని మొక్కలు నాటేందుకు కేటాయించారు. ఒక్కోవైపు మీటరు చొప్పున దూరంతో మూడు వరుసల్లో మొక్కలు నాటుతారు. రోడ్డు వైపు ఉండే వరుసలో తక్కువ వెడల్పుతో విస్తరించే చెట్లను, మధ్యలో సాధారణమైనవి, చివరిగా ఏపుగా పెరిగే పెద్ద చెట్లను పెంచుతారు. ఇలా రోడ్డుకు రెండు వైపులా, ఇంటర్ ఛేంజర్లతో కలుపుకొంటే మొత్తం చెట్ల సంఖ్య లక్షకుపైగా ఉండనుంది. ♦ప్రస్తుతం రోడ్డు మధ్యలో 20 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ మీడియన్ ఉండనుంది. అందులో ఆరు వరుసలతో వివిధ జాతుల పూల మొక్కలు నాటనున్నారు. భవిష్యత్తులో రోడ్డును ఎనిమిది లేన్లకు విస్తరిస్తే.. సెంట్రల్ మీడియన్ స్థలం ఐదు మీటర్లకు పరిమితమవుతుంది. అప్పుడు పూల చెట్ల వరుసలు తగ్గుతాయి. ♦గతంలో పెద్ద రహదారులకు ఇరువైపులా రోడ్డుపైకి అల్లుకునేలా రావి, మర్రి, వేప, మామిడి, చింత వంటి భారీ చెట్లు కనిపించేవి. రీజినల్ రింగురోడ్డును ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నందున.. వాహనాలకు ఇబ్బంది రాకుండా తక్కువ కొమ్మలతో ఎత్తుగా పెరిగే జాతులనే ఎంపిక చేస్తున్నారు. -
అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!
Callery Pear Tree Smells Bad In US state of Maine: చెట్లను నాటండి అంటూ మన దేశాల్లో పచ్చదనం, హరిత విప్లవం అంటూ రకరకాల కార్యక్రమాలను చేపడుతుంటారు. అయితే అందుకు విరుద్ధంగా యూఎస్‌లోని మైనే రాష్ట్రంలోని అధికారులు మొక్కలను తొలగిస్తే బహుమతులు ఇస్తాం అంటున్నారు. అసలే ప్రపంచ దేశాలన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకుని బెంబేలెత్తుతుంటే ఏంటిది వెటకారంగా అని అనుకోకండి. (చదవండి: బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!) అసలు విషయంలోకెళ్లితే... మానవుల మనగడ చెట్లతోనే సాధ్యం అని అందరికి తెలిసి విషయమే. కానీ యూఎస్‌కి తూర్పున ఉన్న మైనే రాష్ట్రంలోని కాలరీ పియర్ చెట్లు మాత్రం ప్రజలకు సమస్యగా మారి ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతేకాదు సౌత్ కరోలినా ఫారెస్ట్రీ కమిషన్ కాలరీ పియర్ చెట్లను తొలగించాలనుకునే వారికి ఐదు కొత్త చెట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. అయితే ఈ కాలరీ పియర్ చెట్టు యూఎస్‌కి చెందినది కాదు. అంతేకాదు ఈ చెట్టు చైనా, వియత్నాంకు చెందిన పియర్ చెట్టు జాతి. ఈ మేరకు ఇది 1900లలో అనేక ఆసియా దేశాల నుండి యూఎస్ దేశానికి వచ్చింది. అయితే 1960ల నాటికల్లా ఈ చెట్లు వాటికి పూచే ఆకర్షణీయమైన తెల్లని పువ్వుల కోసం రాష్ట్రాలలోని అనేక శివారు ప్రాంతాల్లో విస్తారంగా వీటిని నాటారు. పైగా యూఎస్‌లో విస్తృతంగా సాగు చేయబడిన 'బ్రాడ్ఫోర్డ్' పియర్ చెట్టుగా కూడా పిలుస్తారు. ఏ ఆకర్షణీయమైన పువ్వుల కోసం అయితే ఈ మొక్కలను నాటారో ఆ పువ్వులు అత్యంత భయంకరమైన వాసనను కలిగి ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించలేకపోయారని మైనే వ్యవసాయ సంరక్షణ అటవీ శాఖకు చెందిన ఉద్యానవన నిపుణులు అన్నారు. అంతేకాదు ఈ పియర్ చెట్లు వల్ల స్థానిక జాతి చెట్ల పై తీవ్ర వినాసకరమైన ప్రభావాన్ని చూపాయని చెప్పారు. దీంతో అక్కడి అధికారులు 2024 నాటికల్లా ఈ పియర్ మొక్కలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. పైగా అక్కడి అధికారులు ఇప్పటికే ఉన్న కాలరీ పియర్ చెట్లను తొలగించినందుకు ఇంటి యజమానులకు బహుమతులు అందించే వరకు వెళ్లడం గమనార్హం (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) -
California Wildfire: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు..
జనరల్ షెర్మాన్ అనే చెట్టు ప్రపంచంలోనే అతి పె..ద్ద.. చెట్టంట! ఇది కాలిఫోర్నియాలోని సిక్వోయా అండ్ కింగ్స్ కెన్యాన్ నేషనల్ పార్కులో ఉంది. ఐతే ప్రస్తుతం ఇది ప్రమాదంలో ఉందట. ఎందుకంటే.. గత నెలలో 9వ తేదీన కురిసిన మెరుపులతో కూడిన గాలివాన తుఫానులో అక్కడి అడవిలో నిప్పురాజుకుని పశ్చిమ భాగంలో చాలా వరకు కాలిపోయినట్లు నివేదికలో వెల్లడించింది. ఐతే ఇప్పుడు 275 అడుగుల ఎత్తున్న జనరల్ షెర్మాన్ చెట్టుకు ఆ మంటలు అంటుకునే ప్రమాదం ఉన్నట్లు ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అగ్నిమాపక సిబ్బంది దీనిని పరిరక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా 2200 యేళ్ల నాటి ఈ చెట్టు ప్రపంచంలోనే అతి పురాతనమైన వృక్షంగా పేరుగాంచింది. కాగా గత యేడాది సంభవించిన కార్చిచ్చులో వేలకొద్ది జనరల్ షెర్మాన్ చెట్లు కాలి బూడిదైపోయాయి. ఇవి కూడా వేల యేళ్లనుంచి ఉన్నఅతిప్రాచీన చెట్లే. ఈ అగ్నికీలలవల్ల అడవులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని పశ్చిమ ప్రాంతంలో మంటలను ప్రస్తుత రోజుల్లో అదుపుచేయడం చాలా కష్టంగా ఉంది. దాదాపు 30 యేళ్ల క్రితం నాటి ఉష్ణోగ్రతతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఇటీవలి కాలంలో అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించడం పరిపాటైపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ మంటలు సిక్వోయా నేషనల్ పార్కుకు 1.5 కిలీమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పార్కులో దాదాపుగా రెండువేల చెట్లు ఉన్నాయి. ఈ అగ్నికీలన్నుంచి చెట్లను కాపాడటానికి అల్యుమినియం చుట్లతో వీటిని కప్పుతున్నారు. అడవిలో మంటలు మరింత పెరగడానికి కారణమయ్యే చెట్లను తొలగించే పనులను అగ్నిమాపక సిబ్బంది ముమ్మరం చేస్తున్నారు. వాతావరణం వేడెక్కితే సంభవించే పరిణామాలకు నిదర్శనమే కాలిఫోర్నియా కార్చిచ్చు. వీటిని అదుపు చేయలేక, చెట్లను కాపాడుకోలేక అక్కడి ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులు ఇతర దేశాలకు భవిష్యత్తు హెచ్చరికలుగా భావించవచ్చు. చదవండి: కాలిఫోర్నియా బీచ్‌లో ముడిచమురు లీక్.. పర్యావరణానికి తీవ్ర నష్టం! -
ఓ వైపు అలా.. మరో వైపు ఇలా.. మరి ఇందులో ముందుకెలా?
సాక్షి, ఉప్పల్( హైదరాబాద్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరిత హార కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా మరో వైపు చెట్లను నరికి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ పక్కన గల పెంగ్విన్ స్థలంలో ఏపుగా పెరిగిన చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి ముక్కలు చేసుకుని ఆటోలో తీసుకువెళుతున్నారు. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు నరికిన కలపను స్వాధీనం చేసుకున్నారు. విచారించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఓ వైపు హరిత హార ద్వారా చెట్లను నాటుతుంటే మరో వైపు కొందరు తమ స్వప్రయోజనాల కోసం ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఇటీవల అదిలాబాద్ పట్టణ శివారు దుర్గానగర్‌లోని 250 ఎకరాల అటవీ ప్రాంతంలో ఆదివారం 35 వేల మంది గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. ఇది టర్కీలో గతంలో 3.2 లక్షల మొక్కలు నాటిన రికార్డును అధిగమించి వండర్బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కిన సంగతి తెలిసిందే. -
ఎన్ని మొక్కలు నాటారబ్బా, గుర్తించేలా టూల్ డిజైన్
రాయదుర్గం: పట్టణాల్లో రోడ్డుకు ఇరు పక్కల ఉన్న చెట్లను లెక్కించేందుకు ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ పరిశోధకులు వినూత్నమైన పద్ధతిని రూపొందించారు. మెషీన్ లెర్నింగ్ సాంకేతికత సాయంతో పనిచేసే కంప్యూటర్ విజన్ అసిస్టెడ్ పరికరాన్ని అభివృద్ధి పరిచారు. ఈ పరికరం ఆటోమేటిక్‌గా పట్టణాల్లో చెట్ల విస్తారం ఎంత ఉందో గుర్తిస్తుందని ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు చెట్ల సంఖ్య ఎంత ఉందో నేరుగా లెక్కించడం ద్వారా కాని, కృత్రిమ ఉపగ్రహాల సాయంతో గానీ లెక్కించేవారు. ఈ సరికొత్త పరికరాన్ని ట్రిపుల్ ఐటీ– హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ సీవీ జవహర్ నేతృత్వంలో అర్పిత్ బహేతి అనే పరిశోధక విద్యార్థి రూపొందించారు. ఈ పరికరాన్ని బైక్‌కు బిగించి ఏదైనా రోడ్డు మీదుగా తీసుకెళ్తే చాలు ఆటోమేటిక్‌గా చెట్లను లెక్కించడమే కాకుండా ఆ రోడ్డుకు సంబంధించిన మ్యాప్‌ను కూడా సులువుగా అర్థం అయ్యేలా రంగులతో అందజేస్తుందని అర్పిత్ వివరించారు. చెట్ల కాండాలు లేదా మొదళ్ల ద్వారా చెట్ల సంఖ్యను లెక్కిస్తుందని తెలిపారు. ఈ పరికరాన్ని హైదరాబాద్‌తో పాటు సూరత్‌లో పరీక్షించగా, 83 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని చెప్పారు. -
మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్.. కొత్తవి నాటండి: కేసీఆర్
సాక్షి, గజ్వేల్: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోవడంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఇటీవల ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి మృతి చెందగా.. బుధవారం సుమన్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం, తిరుగు ప్రయాణంలో తూప్రాన్.. అక్కడి నుంచి గజ్వేల్ మీదుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. మార్గమధ్యలో రోడ్డుకు ఇరువైపులా కొన్నిచోట్ల ట్రీగార్డులు పడిపోవడం, మరికొన్ని చోట్ల మొక్కలు ఎండిపోవడం గమనించారు. ఎందుకిలా జరిగిందని కాన్వాయ్ నుంచే ‘గడా’(గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. గతేడాది నర్సాపూర్ నియోజకవర్గానికి గజ్వేల్ నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ నిర్మించడంతో మొక్కలు దెబ్బతిన్నాయని ముత్యంరెడ్డి సీఎంకు వివరించారు. అయితే వాటి స్థానంలో కొత్తవి ఎందుకు నాటలేదని ప్రశ్నించిన సీఎం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోనూ రోడ్డుకు ఇరువైపులా దెబ్బతిన్న మొక్కల స్థానంలో తిరిగి కొత్త మొక్కలు నాటాలన్నారు. దీంతో గురువారం ‘గడా’ప్రత్యేకాధికారి.. తూప్రాన్ నుంచి గజ్వేల్ వరకు దెబ్బతిన్న మొక్కల స్థానంలో కొత్తవి నాటేందుకు చర్యలు ప్రారంభించారు. పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్ -
శ్మశానాలను తవ్వేసి.. భారీ భవంతులు
శాన్‌మార్కోస్ (యూఎస్): ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతోంది. మరోవైపు భూమి విస్తీర్ణం మాత్రం పరిమితం. అందుబాటులో ఉన్న భూమితోనే అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మృతదేహాలను ఖననం చేయడానికి సైతం స్థలం దొరకడం లేదు. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సింగపూర్‌లో పాత శ్మశానాలను తవ్వేసి, భారీ భవంతులు కట్టేస్తున్నారు. కొత్త శ్మశానాలను ఏర్పాటు చేయకపోవడం, స్థలం కొరత వల్ల అంత్యక్రియల విషయంలో ఆచారాలను సైతం మార్చుకోవాల్సి వస్తోంది. శ్మశానాల కోసం దొరకని స్థలం అగ్రరాజ్యం అమెరికాలోనూ శ్మశానాల కోసం స్థలం దొరకడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింగపూర్‌లో ప్రభుత్వం శ్మశానాల స్థానంలో కొలంబరియ్స్ నెలకొల్పుతోంది. ఒక ఎత్తయిన గోడ లాంటిది కట్టి, మధ్యలో గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మృతుల అస్థికలతో కూడిన కలశాలను ఈ గూళ్లలో ఉంచుతున్నారు. పూర్వీకుల జ్ఞాపకార్థం ఇక్కడే ప్రార్థనలు చేసుకోవాలి. సింగపూర్‌లో ఒక మృతదేహాన్ని 15 ఏళ్ల పాటే శ్మశానంలో ఖననం చేయాలి. తర్వాత వెలికి తీసి, దహనం చేయాలి. అస్థికలను కలశాల్లో భద్రపర్చుకోవచ్చు. అదే స్థలంలో మరో మృతదేహాన్ని ఖననం చేస్తారు. దహనాలకే ప్రాధాన్యం: హాంకాంగ్‌లో భూముల విలువ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ స్థలాలు ప్రపంచంలోనే అత్యధిక ధర పలుకుతుంటాయి. శ్మశానాల్లో పార్థివ దేహాల ఖననానికి అవసరమైన స్థలాలను ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. అందుకే హాంకాంగ్ ప్రభుత్వం ఖననం కంటే దహనాలకే ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామాలకు తరలిపోదాం: వృద్ధుల జనాభా పెరిగి, జననాలు తక్కువగా ఉన్న జపాన్‌లో సైతం శ్మశానాల కొరత 1970ల నుంచే మొదలైంది. అందుకే అక్కడి అధికారులు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నారు. నగరంలో ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులు, బంధు మిత్రులు ఒక బస్సులో మృతదేహంతోపాటు యాత్రగా బయలుదేరుతారు. గ్రామానికి దూరంగా తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేస్తారు. జపాన్‌లో 1990ల్లో ‘గ్రేవ్–ఫ్రీ ప్రమోషన్ సొసైటీ’ అనే సంస్థ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మృతదేహాన్ని దహనం చేసి, బూడిదను భూమిపై వెదజల్లాలని ప్రచారం చేసింది. అయితే, ఈ విధానం ఆదరణ పొందలేదు. వృక్ష సమాధితో పర్యావరణ పరిరక్షణ ఉత్తర జపాన్‌లోని షౌన్‌జీ టెంపుల్ 1999 నుంచి నవీన ఆవిష్కరణకు తెరతీసింది. అదేమిటంటే.. వృక్ష సమాధి(ట్రీ బరియల్). దీన్ని జపాన్ భాషలో జుమొకుసో అంటారు. ఇందులో శవాన్ని దహనం చేస్తారు. అస్థికలు, బూడిదను ఒకచోట భూమిలో పాతిపెట్టి, దానిపై మొక్క నాటుతారు. అదే ఆ మనిషి సమాధి. అది వృక్షంగా మారుతుంది. కుటుంబ సభ్యులు ఏటా అక్కడే ప్రార్థనలు చేస్తారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన సులభమైన పద్ధతి అని షౌన్‌జీ టెంపుల్ చెబుతోంది. ప్రభుత్వం అనుమతించిన చోట ఒక వృక్ష సమాధి ఏర్పాటయ్యాక క్రమంగా ఇతరులూ అదే తరహా సమాధులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తర్వాతి కాలంలో అదొక పెద్ద వనంగా మారుతోంది. ఇలా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతోందని నిపుణులు అభినందిస్తున్నారు. షౌన్‌జీ టెంపుల్‌కు చెందిన స్థలంలో చిషోయిన్ పేరిట వృక్ష సమాధులతో ఒక చిట్టడవి ఏర్పడింది. ఈ శ్మశానంలో కేవలం పెద్దపెద్ద చెట్లే కనిపిస్తాయి. రాళ్లు, సమాధులు గుర్తులు కనిపించవు. మృతుల కుటుంబ సభ్యులు, మత గురువులు ఈ చెట్ల వద్ద ప్రార్థనలు చేస్తారు. సాధారణంగా బౌద్ధులు పర్యావరణ పరిరక్షణను ఆచారంగా పాటిస్తారు. సహజ ప్రకృతి ప్రపంచంలోనే దేవుడుంటాడని నమ్ముతారు. అందుకే ట్రీ బరియల్స్కు జపాన్‌లో ఆదరణ పెరుగుతోంది. చదవండి: కుప్పకూలిన విమానం: 12 మంది దుర్మరణం చదవండి: కోవిడ్ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్ టాప్ -
Mango Trees Marriage: మామిడి చెట్లకు పెళ్లి
రామడుగు (చొప్పదండి): మామిడి చెట్లు తొలికాత కాయడంతో ఓ రైతు గురువారం వాటికి కల్యాణం జరిపించాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన కడారి వీరయ్య మూడేళ్ల క్రితం మూడెకరాలలో మామిడి మొక్కలు నాటాడు. ఈ ఏడాది అవి కాపునకు రావడంతో వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. -
కరోనా నుంచి కాపాడాలని.. రావి, వేప చెట్లకు వివాహం
వేలూరు(తిరువణ్ణామలై): కరోనా నుంచి కాపాడాలని రాగి, వేప చెట్లకు వివాహం చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా నరియంపేటలో శ్రీతంజయమ్మన్ ఆలయం ఉంది. పదేళ్ల కిందట గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి, కుంభాభిషేకం చేశారు. ఆ సమయంలో ఒక మహిళపై అమ్మవారు వాలి, ఆలయం ఉన్న ప్రాంతంలో రాగి–వేప చెట్లను నరకవద్దని ఈ చెట్లు రెండూ దేశ ప్రజలను కాపాడుతాయని చెప్పినట్లు గ్రామపెద్దల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో భక్తులు ప్రతి రోజూ ఈ చెట్లకు పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం అదే మహిళపై అమ్మవారు మళ్లీ వాలి, దేశంలో కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు, ఆక్సిజన్ సమస్య రాకుండా ఉండేందుకు వేప, రాగి చెట్లకు వివాహం చేయాలని తెలిపింది. దీంతో గ్రామస్తులు పెళ్లి పత్రికలు కొట్టి, గ్రామంలో పంచి పెట్టి ఆలయ ప్రాంగణంలో అరటి చెట్లు కట్టి, పందిళ్లు వేసి రెండు చెట్లను కొత్తదుస్తులతో అలంకరించారు. శనివారం ఉద యం 6 గంటల సమయంలో మేళ తాళాల నడుమ వరుస తాంబూలను గ్రామంలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో తాంబూలం మార్చుకుని సంప్రదాయం ప్రకారం బంగారం తాళి బొట్టును వేప చెట్టుకు కట్టి వివాహం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అక్సిజన్ ఉత్పత్తి పెరిగేందుకు చెట్లను పెంచాలని, మానవుడి తరహాలోనే చెట్లును రక్షించాలని, ప్రపంచ శాంతి కోసం,వేప–రాగి చెట్టుకు వివాహం చేయడంతో పలువురిని ఆశ్చర్యపరిచింది. వివాహ అనంతరం గ్రామస్తులందరికీ వివాహ వేడుకల తరహాలోనే విందు ఏర్పాటు చేశారు. చదవండి: యూకేలో 49శాతం వ్యాక్సినేషన్‌తో 97% తగ్గిన కేసులు -
వృక్షాలపై ఔరా చిత్రకళా ‘కాండము’లు
కంచిలి (శ్రీకాకుళం): వృక్షాలే ఆయన కాన్వాస్. చెట్ల కాండలు కనిపిస్తే ఆయన తన మెదడుకు పదును పెడతాడు.. అద్భుతమైన బొమ్మ దింపేస్తాడు. ఆ విధంగా వృక్షాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు శ్రీకాకుళం జిల్లా కంచిలికి చెందిన ఉపాధ్యాయుడు గొర్లె దుర్గారావు. తన రెగ్యులర్ విధులతోపాటు, తనకిష్టమైన చిత్రకళ సరికొత్త పద్ధతుల్లో ప్రదర్శిస్తున్నారు. కంచిలిలో ఏపీ బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలలో ఆర్ట్స్ టీచర్‌గా గొర్లె దుర్గారావు విధులు నిర్వర్తిస్తున్నాడు. వృక్ష కాండములో కళాఖండాలు సృష్టించడం ఆయన ప్రత్యేకత. గురుకుల విద్యాలయ ఆవరణలో తిత్లీ తుఫాను వలన చెట్లు కూలిపోయాయి. ఈ సమయంలో ఒక టేకు చెట్టు పాఠశాల ఆవరణలో ఉండిపోయింది. పలుచగా.. పెద్ద సైజులో ఆ వృక్షం కాండం ఉండడంతో దుర్గారావు దానిపై తన కళను ప్రదర్శించాలని అనుకున్నాడు. ఈ విధంగా ఆ వృక్షంపై వీలు చిక్కినప్పుడల్లా వివిధ దేవతామూర్తుల ఆకారాలను చెక్కడం ప్రారంభించారు. ఈ విధంగా చెక్కుతూ ఇప్పటికీ 7 ప్రతిమలను చెక్కారు. గౌతమబుద్ధుడు, రాధాకృష్ణులు, వినాయకుడు, పరశురాముడు, వరాహావతారం, మత్య్సావతారం, కూర్మావతారం ప్రతిమలను చెట్లపై చెక్కారు.ఇవి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పాఠశాల ఆవరణలో తరగతి గదుల సమీపంలో ఉన్న ఒక చెట్టు మొదలు మీద వినాయకుని ప్రతిమను చెక్కారు. అలాగే పాఠశాల చుట్టూ పలువురు దేశ నాయకుల ఫొటోలు, ఇతర చిత్రాలను గీశారు. ఇతని పనితీరు, శ్రద్ధను ప్రిన్సిపాల్ హెచ్. సింహాచలంతోపాటు, మిగతా ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. -
చంద్రుడిపై చైనా చెట్లు
చంద్రుడిపై పేదరాసి పెద్దమ్మ చెట్టుకింద కూర్చుని కథలు చెబుతుందని చిన్నప్పుడు విన్నాం, పెద్దయ్యాక చంద్రుడిపై ఎలాంటి జీవి పెరిగే వాతావరణం లేనందున చెట్లు లేవని తెలుసుకున్నాం! కానీ ఇప్పటివరకు అసాధ్యమని భావిస్తున్న పనిని తేలిగ్గా చేసినట్లు చైనా ప్రకటించుకుంది. వాతావరణమే ఉండని చంద్రుడిపై చెట్లు పెంచామని, తమ లూనార్ మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగం దిగ్విజయమైందని వెల్లడించింది. చైనా అంతేనండీ, ఏదైనా ఇలా చిటికలో చేసేస్తుంది అని కొందరు మెచ్చుకుంటుంటే, కొందరేమో చైనా మాటలు, వస్తువులు, పనులను నమ్మే వీల్లేదని, ఈ చెట్ల విషయం కూడా అనుమానాస్పదమేనని డౌట్ పడుతున్నారు. ఎవరేమన్నా చైనా సైంటిస్టులు మాత్రం తమ లూనార్ మిషన్‌లో పెంచిన చెట్ల తాలుకూ పిక్చర్లను బయటపెట్టి సంబరపడుతున్నారు. అసలు చంద్రుడిపై వాతావరణమే లేనప్పుడు చెట్లు ఎలా పెంచుతారన్నది బేసిక్ అనుమానం. అంటే నేరుగా చంద్రుడిపై విత్తనాలు నాటి మెలకెత్తించడం కాదు.. ఒక కంటైనర్ లో చెట్లు పెరిగేందుకు కావాల్సిన పోషకాలను ఉంచి కృత్రిమ వాతావరణ వ్యవస్థ ను కంటైనర్‌లో కల్పించి దాన్ని లూనార్ ప్రోబ్‌తో పాటు చంద్రుడిపైకి పంపారు. అక్కడ చంద్ర ఉపరితలంపై ఈ కంటైనర్లను జారవిడిచి పరిశీలిస్తే మొలకలు వచ్చినట్లు గమనించారు. ఓస్.. ఇంతేనా అనకండి, అంతరిక్ష ప్రయోగాల్లో ఇది పెద్ద ముందడుగు. త్వరలో చైనా చంద్రుడిపై ఒక బేస్ కట్టే యోచనలో ఉంది. అందుకు సిద్ధమయ్యే యత్నాల్లో ఇది కూడా ఒక భాగమేనట. ప్రస్తుత విషయానికి వస్తే కొన్ని రోజులు బాగా పెరిగిన ఈ మొలకలు సదరు కంటైనర్‌లో బ్యాటరీ అయిపోగానే చంద్రుడిపై ఉండే తీవ్ర చలి వాతావరణ ప్రభావానికి చనిపోయాయి. కానీ ప్రయోగం సక్సెసని, రాబోయే రోజుల్లో నేరుగా చంద్రుడిపై చెట్లు పెంచేస్తామని చైనా సైంటిస్టులు ధీమాగా ఉన్నారు. -
హరితహారం సామాజిక బాధ్యత
సాక్షి, శంషాబాద్: హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సీఐఎస్ఎఫ్, జీఎంఆర్ ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మొక్కల పెంపకాన్ని అన్ని రంగాలు బాధ్యతగా, సవాలుగా స్వీకరించి హరిత తెలంగాణకు బాటలు వేయాలని సూచించారు. శంషాబాద్ విమానాశ్రయంలో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడ ఉన్న పచ్చదనం దేశంలోని ఏ ఇతర విమానాశ్రయంలో లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వేపతో పాటు వివిధ రకాల ఔషధ గుణాలున్న 600 మొక్కలను నాటారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ తరఫున జీఎంఆర్, సీఐఎస్ఎఫ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ ఫణికర్, ఎయిర్పోర్ట్ ముఖ్య భద్రతాధికారి ఎంకే సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరంతా కిచెన్ గార్డెన్
ప్రకృతిని, ఊరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి 84 ఏళ్ల ఓ బామ్మ పలుగూ, పార చేత బట్టింది. వంటిళ్లని పచ్చని కూరగాయలతో నింపడానికి నిత్యం శ్రమిస్తోంది. రకరకాల కూరగాయల నారుపోసి, మొక్కలను పెంచి, వాటిని ఉచితంగా గ్రామ వాసులకు అందిస్తోంది. బామ్మపనికి ముగ్దులైన ఊరి ప్రజలు ‘సూపర్ మామ్మ’ అంటున్నారు. తమిళనాడుకు చెందిన 84 ఏళ్ల నుంజమాల్ ఈ కరోనా టైమ్‌లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, అది కిచెన్‌లో తయరయ్యే వంటకాల నుంచే వస్తుందని, ఇంటిపంట అలవాటును అందరిలోనూ ప్రోత్సహించడానికి నడుము కట్టింది. రాష్ట్రమంతా కూరగాయల మొక్కలను పంపిణీ చేయాలని ఉందనే ఈ మామ్మ. ‘సొంతంగా కూరగాయలను పండించుకోవడం ద్వారా సేంద్రీయ పద్ధతులను అవలంబిస్తారు. దీనివల్ల పర్యావరణానికీ మేలు కలుగుతుంద’ని చెబుతోంది. ఇప్పుడు నుంజమాల్ అందరిళ్లకు వెళ్లి ఎవరింట్లో ఎన్ని మొక్కలు, ఎలా పెంచుతున్నారు అనే విషయాన్ని స్వయంగా కనుక్కుంటూ తీరికలేకుండా ఉంది. తనే స్వయంగా మొక్కలను నాటి, పాదులు తీసి నీళ్లు పోసి వస్తుంది. ఆమె కృషికి ఏపుగా పెరుగుతున్న కూరగాయల తోటలే నిదర్శనం. ఈ బామ్మ పెరటి తోటలను తయారు చేయడాన్ని మెచ్చుకుంటూ ఒక వార్తాసంస్థ ఆమె ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆ వెంటనే ఈ బామ్మకు మద్దతుగా రీట్వీట్ల వరద మొదలైంది. -
జీవవైవిధ్య తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: జీవవైవిధ్యానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తోంది. అరుదైన పక్షి జాతులు, విభిన్నమైన చేపల రకాలు, సీతాకోకచిలుకల, ఇతర జంతు జాతులు.. ఇలా అనేక ప్రత్యేకతలను రాష్ట్రం సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని పోచారం, మంజీరా, అనంతగిరి, జన్నారం, ఏటీఆర్, ఖ మ్మం, వరంగల్, పాకాల తదితర ప్రాంతాల్లో అద్భుతమైన జీవ వైవిధ్యం అలరారుతోంది. అడవులు, జలవనరులు, ప్రకృతి సేద్యం మధ్య ఒక సమన్వయ బంధం ఏర్పడితే అన్ని జీవరాశులు సుహృద్భావ వాతావరణంలో మెలుగుతాయని ప ర్యావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన కొన్ని రకాల చేపలు, గుడ్లగూబలు, పావురాలు, 400 వరకు రకాల వివిధ పక్షులున్నాయి. జీవవైవిధ్యం పెంపుదలకు పులులు, చిరుత పులుల వంటివి కీలకమైనవే అయినా అవే సర్వస్వం కాదని మొక్కలు, పక్షులు, ఇతర జంతువుల మనుగడ, పురోభివృద్ధి కూడా ముఖ్యమేనని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇటు తెలంగాణలోని 500 నుంచి 600 రకాల ఔషధ మొక్కలూ కీలక భూమికను నిర్వహిస్తున్నాయి. శుక్రవారం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం.. రాష్ట్రంలోని పక్షులు, వృక్షాలు, జంతుజాతులు.. రాష్ట్రంలో 1,900 రకాల వృక్షాలు, మొక్కల జాతులు, 166 రకాల చేపలు, 376 రకాల పక్షులు, 155 సీతాకోకచిలుకలు, 13 రకాల రొయ్యలు, 4 రకాల ఎండ్రకాయలు (పీతలు), 28 రకాల తూనీగలు, 53 రకాల మోథ్స్, 46 రకాల సాలెపురుగులు, 12 రకాల తేళ్లు, 107 రకాల ఇన్వర్టెబ్రేట్స్, 41 రకాల నత్తలు, 17 రకాల కప్ప లు, 60 రకాల పాములున్నాయి. ఇక 376 రకాల పక్షి జాతుల్లో భాగంగా గుడ్లగూబలు, బాతులు, పావురాలు, కొంగలు, రామచిలుకలు, పిట్టలు, రాబందులు.. 70 రకాల జంతువుల్లో భాగంగా పులులు, చిరుతపులులు, వివిధ జాతుల కోతులు, జింకలు, ఎలుకలు, ముంగిసలు, నీల్గాయిలు, నక్కలు వంటివి ఉన్నాయి. రాష్ట్రంలో జీవవైవిధ్యానికి నెలవులు... ►రాష్ట్రంలో 8 వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి. ప్రాణహిత, శివరం, ఏటూరునాగారం, నాగార్జున సాగర్–శ్రీశైలం, పాకాల, కిన్నెరసాని, మంజీరా, పోచారం.. వీటిల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, పులులు, నక్కలు, మొసళ్లు, కొండచిలువలు ఇతర జంతువులున్నాయి. ►ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్–2,166 చదరపు కి.మీ., కవ్వాల్ టైగర్ రిజర్వ్–892 చదరపు కి.మీ. మేర పులుల అభయారణ్యాలు విస్తరించి ఉన్నాయి. ► జాతీయపార్కులు.. (కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, మృగవాణి నేషనల్ పార్కు, మహావీర్ హరిత వనస్థలి జాతీయపార్కు) ►హైదరాబాద్‌లో జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కు, వరంగల్‌లో వన విజ్ఞానకేంద్రం (మినీ జూ) ఉన్నాయి. ►సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అమీన్‌పూర్‌చెరువు బయో డైవర్సిటీ హెరిటేజ్‌సైట్‌గా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి.. ‘తెలంగాణకు ఘనమైన జీవవైవిధ్య వారసత్వ సంపద ఉంది. రకరకాల మొక్కలు, వృక్షాలు, జంతువుల జాతులతో వైవిధ్యమైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. వీటిని పరిరక్షించుకునే విషయంలో సాధారణ ప్రజల్లో అవగాహనను పెంచాలి. పర్యావరణం, ప్రకృతి, జీవవైవిధ్యం నుంచి మనం ఏమి పొందుతున్నాం.. వాటి వల్ల ప్రయోజనాలు కొనసాగాలంటే ఏవిధంగా వాటిని సురక్షితంగా ఉంచుకోవాలన్నది వారు తెలుసుకోగలగాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. స్థానికంగా పండించే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు వంటి వాటిని ప్రోత్సహించాలి. ఔషధ మొక్కల వల్ల ఆరోగ్య పరిరక్షణకు అవకాశం ఏర్పడుతోంది. వాటి ప్రాముఖ్యతను గుర్తించాలి..’ – ఫరీదా తంపల్, వరల్డ్ వైడ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) స్టేట్ డైరెక్టర్ -
ప్రకృతి నుంచే పాఠం...
కోవిడ్–19 (కరోనా) మహమ్మారి మానవాళిని కబళిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వైపరీత్యం శాశ్వతంగా ఉండదు.. ముందుంది మంచి కాలం అని ప్రకృతి మరోసారి మానవాళికి ధైర్యం చెప్పేలా ఉన్న చిత్రాలు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ పరిధిలోని దూలపల్లి–బహదూర్‌పల్లి రహదారిలో ఈ దృశ్యాలను ‘సాక్షి’ సేకరించింది. మార్చిలో లాక్డౌన్ ప్రారంభానికి ముందు రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు ఆకులన్నీ రాలి మోడువారాయి. అవే చెట్లు ప్రస్తుతం పచ్చని ఆకులు.. ఎర్రని పూలతో కనువిందు చేస్తూ భవిష్యత్ అంతా పచ్చగా ఉంటుందనే సంకేతాన్నిస్తున్నాయి. -
ఒక్కో మొక్కకు రూ.5,000
సాక్షి, హైదరాబాద్: ‘చెట్ల దత్తత’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఒక్కో పెద్ద మొక్క/చెట్టును రూ.5 వేలు చెల్లించి దత్తత తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఏనుగులు మొదలుకుని చిన్న జంతువుల వరకు కార్పొరేట్ కంపెనీలు జంతు ప్రేమికులు, దత్తత తీసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో భాగంగా ఆయా జంతువులను ఏడాది పాటే దత్తత తీసుకునే వీలుంది. ఒక సంవత్సరం పాటు ఆ జంతువులæ ఆహారం, పరిరక్షణకు అయ్యే ఖర్చును దత్తత తీసుకునే వారు భరించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా చెట్లను దత్తత తీసుకునే వారి పేరిట ఒక పెద్ద మొక్కను నాటి, అది పెరిగి పెద్దదయ్యే వరకు సంరక్షించే బాధ్యతను ఈ సంస్థ తీసుకుంటుంది. ఆ చెట్టుకు వారి పేరు పెట్టి, ఎప్పుడైనా సందర్శించి దానిని చూసుకునే వీలు కల్పిస్తోంది. ఈ మొక్కలను దత్తత ప్రక్రియ పూర్తయ్యాక తమ నర్సరీల్లో 12 నుంచి 15 అడుగుల ఎత్తున్న పెద్ద మొక్కలను నాటుతారు. ప్రస్తుతం ఈ కార్యక్ర మం కింద కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్ పార్కు, కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్లో మొక్కలు నాటి, సంరక్షించే కార్యక్రమాన్ని ఈ సంస్థ కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని కెనరా బ్యాంక్ మాసబ్‌ట్యాంక్ బ్రాంచ్ 200 పెద్ద మొక్కలను దత్తత తీసుకుంది. ఈ మొక్కల నిర్వహణ, పరిరక్షణ కోసం రూ.5 లక్షల మొత్తాన్ని కూడా విడుదల చేసింది. ఐటీ రంగానికి చెందిన పలువురు ఉద్యోగులు ఈ మొక్కలను దత్తత తీసుకునేందుకు ఈ సంస్థకు హామీ (ప్లెడ్జ్లు) పత్రాలిచ్చినట్టు అధికారులు తెలిపారు. దత్తతకు 3,500 అందుబాటులో.. ‘‘ప్రస్తుతం 3,500 మొక్కలు వెంటనే దత్తత తీసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. దత్తత తీసుకున్న మొక్కలను ఎంపిక చేసిన పార్కుల్లో నాటుతాం. ఒక క్యూబిక్ మీటర్ లోతులో ఎరువులు, ఎర్రమట్టి, ఇతర జాగ్రత్తలు తీసుకుని మొక్కలు నాటుతాం. దత్తత తీసుకున్న వారు అప్పుడప్పుడు వచ్చి మొక్కలను చూసుకోవచ్చు. 12 నుంచి 15 అడుగుల ఎత్తున పెద్ద మొక్కలు నాటుతున్నందున త్వరగా అవి పెరగడంతో పాటు మంచి ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. – ‘సాక్షి’తో అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ పి.రఘువీర్ -
ఆ ఇల్లేఓ బృందావనం
మూసాపేట: ఎటు చూసినా పచ్చదనం పరిచినట్లుగా...రంగు రంగుల పూలు మనసును పులకరింపజేస్తూ... ఎన్నో రకాల, అరుదైన మొక్కలు మనకు స్వాగతం చెబుతాయి. అక్కడికి వెళితేఇంటికి వచ్చామా..?పార్కుకా.. అన్నట్లు ఉంటుంది. రాత్రిళ్లు వికసించే పూల మొక్కలు, ఉదయం 11గంటల వరకు పరిమళం వెదజల్లే పుష్పాలు, పూల సువాసనలతోనే నిద్రలేపే మొక్కలు ఇలా ఎన్నో రకాల మొక్కలు ఆ ఇంటిలో కొలువై ఉన్నాయి. ప్రకృతిపై ప్రేమతో లక్షలు ఖర్చుపెట్టి ఇంటినే మొక్కలపై పరిశోధనలు చేసే ల్యాబ్‌లా మార్చేశాడు మూసాపేటలోని ఆంజనేయనగర్కాలనీకి చెందిన పాండు గౌడ్. వ్యాపారంలో బిజీగా ఉన్నా మొక్కల కోసం రోజూ సమయం కేటాయిస్తున్నాడు. కట్టిపడేస్తున్న పూల మొక్కలు... ఇంటిలోకి అడుగుపెట్టడంతోనే మొక్కల మధ్యలో గణపతి విగ్రహం ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. బాల్కనీలో, ఇంటి ముందు, గోడలకు, గుమ్మాలకు బెడ్రూంలు, కిచెన్, హాల్, వాటర్ ట్యాంక్ పైన ఇలా ఖాళీ స్థలం కన్పించకుండా మొక్కలతో నింపేశాడు. చివరికి బాత్రూంలో కూడా వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాడంటే మొక్కలపై అతనికున్న మమకారం అర్థం చేసుకోవచ్చు. రకరకాల రంగుల పుష్పాలు, రాతికి రాణి, మార్నింగ్ గ్లోరి, సన్రైస్, సంక్రాంతి చెట్లు, బోగిన్విలియా, బోస్లే మొక్కలతో పాటు ఔషద, పండ్లు జామ, దానిమ్మ, ఇంటికి అవసరమైన ఆకుకూరలు, పచ్చిమిర్చి ఇలా ఎన్నో రకాల మొక్కలు మనల్ని కట్టిపడేస్తాయి. ఒకసారి ఆ ఇంటికి వెళ్లామంటే అక్కడే ఉండిపోవాలి అని మనస్సు కోరుకుంటుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ ఇంటి వాతావరణం చూసిన ఎవరైనా మేం కూడా ఇలాగే మొక్కలు పెంచుకోవాలనిస్తుదంటారు. కాంక్రీట్ జంగిల్లో మొక్కలు పెంచుకోవాలని ఆసక్తి ఉన్నా స్థలం లేదు అన్న వారికి ఆ ఇల్లు ఓ ఆదర్శం. 150 రకాల మొక్కలు, 600 కుండీలలో ఏర్పాటు చేసి వాటి సంరక్షణ చూస్తున్నాడు. మొక్కల ఏర్పాటుకే రూ.10 లక్షల వరకు ఖర్చు చేశానని చెబుతున్నాడు. కొన్ని రకాల మొక్కలను ఒక్కో మొక్కకు రూ. 5వేల వరకు ఖర్చుపెట్టి కొనుగోలు చేశాడు. కొన్ని సీజన్లో వచ్చే పూలు వచ్చాక వాటి స్థానంలో కొత్త మొక్కలను పెంచుతుంటాడు. చిన్నతనంనుంచే ప్రకృతిపై మమకారం.... పాండుగౌడ్‌కు చిన్నప్పటి నుంచే మొక్కలు, ప్రకృతిపై మమకారం ఎక్కువ. పదవ తరగతి నుంచే ప్రకృతిపై ప్రేమ పెంచుకున్నాడు. 12 సంవత్సరాల క్రితమే సేంద్రియ వ్యవసాయంపై టెర్రస్ గార్డెన్ చేసి తన ఇంటికి కావాల్సిన కూరగాయాలను పండించాడు. నగరంలోని తన తోటి మిత్రులకు, బంధువులకు సేంద్రియ పంటను అందించాడు. ఎక్కడ వెరైటీ మొక్కలు కన్పించినా పరిశీలించి ఇంటికి తెచ్చుకుంటాడు. ఎవరైనా ఎంజాయ్ అంటూ పార్టీలు..., బీచ్‌లు, మంచు పర్వతాల వెంట వెళ్తారు. కానీ పాండుగౌడ్ అడవులు, వనాలుగా ఉన్న రీసార్ట్లోనే ఎంజాయ్ ఉంటుందని అంటున్నాడు.ఆ ప్రేమే ఇంటిని పూలవనంగా మార్చాడు. -
విద్యుత్ సిబ్బంది వికృత హాసం..వృక్ష విలాపం!
హుద్‌హుద్ విపత్తు వేళా మేం ఇంతలా బాధపడలేదు. ప్రకృతి విలయ తాండవం చేసిన సమయంలో కూకటి వేళ్లతో సహా నేలకొరిగాం. కొన్నాళ్లకే మళ్లీ సగర్వంగా లేచి నిలబడ్డాం. కానీ.. ఇప్పుడు మమ్మల్ని ఖండ ఖండాలు చేస్తున్న తీరుతో తీవ్రంగా కుంగిపోతున్నాం.వసంత రుతువులో చిగురించాం.. గ్రీష్మంలో చల్లదనాన్ని పంచాం. అదే సమయంలో పచ్చని చెట్లు– ప్రగతికి మెట్లు, హరిత విశాఖ అన్న నినాదాలు వినిపిస్తుంటే.. మాపై మనుషులకు గౌరవం పెరిగిందని సంబర పడ్డాం. లేలేత చిగుళ్లన్నీ ఇప్పుడిప్పుడే ఆకులుగా మారుతున్న తరుణంలో పచ్చదనంతో పరవళ్లు తొక్కుతూ.. పది మందికి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుదామనుకున్నాం.ఇంతలోనే విద్యుత్ తీగలకు అడ్డుతగులుతున్నామన్న సాకుతో.. పెంచిన చేతులతోనే మా అంగాంగాలను తెగ నరుకుతున్నారు. ఆక్సిజన్‌తో పాటు నీడనిస్తున్న మమ్మల్ని మోడుల్లా మార్చేస్తున్నారు. మళ్లీ చిగురించి నిలదొక్కుకుంటున్నాం. ఆ ఆనందాన్నీ ఎంతో కాలం అనుభవించనీయకుండా మళ్లీ మళ్లీ మోడులుగా మార్చేస్తున్నారు. ప్రతి రెండు మూడు నెలలకోసారి విద్యుత్ సిబ్బంది వికృత చేష్టలకు బలైపోతున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మేము చేసిన పాపమా..? పర్యావరణాన్ని పరిరక్షించడమే మా పాలిట శాపమా..??..నగరంలో జాతీయ రహదారితో పాటు వివిధ ప్రాంతాల్లో ఏళ్ల వయసున్న వృక్షాల విలాపమిదీ! సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా నీడనిస్తున్న చెట్లను నరకొద్దని స్థానికులు వారిస్తున్నా విద్యుత్ సిబ్బంది మెయింటెనెన్స్ పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. హరిత విశాఖను నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నా.. తమకేమీ పట్టదన్నట్లుగా ఈపీడీసీఎల్ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు నగరంలోని చెట్లను నరికేస్తున్నారు. జీవీఎంసీ లేఖలు రాసినా... ఓవైపు పచ్చదనాన్ని పెంచి.. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఈపీడీసీఎల్ ఇలా పర్యావరణాన్ని ఛిద్రం చేస్తుండటంపై జీవీఎంసీ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మూడేళ్లుగా ఈపీడీసీఎల్ ఇంజినీరింగ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలితం శూన్యమనే చెప్పాలి. 2017 నుంచి ఈ విషయంలో జీవీఎంసీతో సమన్వయం చేసుకొని పనిచేయాలని అప్పటి కమిషనర్ హరినారాయణన్ విద్యుత్ అధికారులకు పలుమార్లు లేఖలు రాశారు. గత ఏడాది ఆగస్టులో ప్రస్తుత కమిషనర్ సృజన సైతం అధికారులకు విజ్ఞప్తి చేశారు. హుద్‌హుద్ విలయంతో విశాఖలో పచ్చదనం 23 శాతం నుంచి 14 శాతానికి పడిపోయిందనీ.. ఇప్పుడిప్పుడే దాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నామంటూ అధికారులకు వివరించినా ఫలితం లేకపోయిందని జీవీఎంసీ ఉద్యానవన విభాగం అధికారులు వాపోతున్నారు. వాల్టా చట్టం ఏం చెబుతోంది..? పర్యావరణ పరిరక్షణకు 2002లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాల్టా చట్టంపై అదే ప్రభుత్వ సంస్థలు గొడ్డలి వేటు వేస్తున్నాయి. వాల్టా చట్టం సెక్షన్–2 ప్రకారం నగరాలు, పట్టణాల్లో స్థానిక సంస్థలు మొక్కలు నాటాలి. ఉన్న వాటిని సంరక్షించాలి. కానీ ఆ సెక్షన్లను కాలరాస్తూ దశాబ్దాలుగా నీడనిస్తూ.. పర్యావరణాన్ని కాపాడుతున్న భారీ వృక్షాలను నరికేస్తున్నారు. విద్యుత్, టెలికాం, రహదారులు – భవనాలు వంటి శాఖలు విధి నిర్వహణ పేరుతో చెట్లు, వాటి కొమ్మలను ఇష్టారాజ్యంగా నరికేయకూడదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరంటూ వాల్టా చట్టంలోని సెక్షన్–29 చెబుతోంది. ఒక చెట్టును కొట్టాల్సి వస్తే.. దానికి ప్రత్యామ్నాయంగా రెండు మొక్కలు నాటాల్సి ఉంది. వాటి సంరక్షణకు అవసరమైన ఖర్చును సంబంధిత శాఖలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఎవరికి నచ్చినట్లు వారు పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు. ఇటీవలే జీవీఎంసీ జోన్–3 పరిధిలో దుకాణానికి అడ్డంగా ఉందని చెట్టును నరికేయడంతో సదరు షాపును అధికారులు సీజ్ చేశారు. కానీ ప్రభుత్వ సంస్థ విషయంలో మాత్రం జీవీఎంసీ ఆ తరహా సాహసం చేయలేకపోతోంది. అయితే గతంలో ఇదే తరహాలో చెట్లను నరికివేయడాన్ని సహించలేకపోయిన జీవీఎంసీ అధికారులు.. నరికేసిన కొమ్మలను ఈపీడీసీఎల్ కార్యాలయాల్లోనే పడేశారు. అయినా వారిలో మార్పు రావట్లేదని జోనల్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమన్వయంతో మెయింటెనెన్స్ పనులు చేపడితే.. పర్యావరణానికి విఘాతం కలగకుండా నిర్వహించవచ్చని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. తరచూ ఇదే తంతు.. చెట్లు పెరిగి.. వాటి కొమ్మలు విద్యుత్ తీగలను తాకితే ప్రమాదాలు సంభవిస్తాయనే ఉద్దేశంతో ఏటా మూడు నాలుగుసార్లు ఈపీడీసీఎల్ అధికారులు మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నారు. కరెంటు తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను గుర్తించి వాటిని కత్తిరించాలి. వాస్తవంగా అయితే.. కరెంట్ తీగలకు 6 నుంచి 10 అడుగుల దిగువ వరకు కొమ్మలను నరికాలి. కానీ నగరంలో మాత్రం నేల నుంచి 3–5 అడుగుల వరకు ఉంచి.. మిగిలిన చెట్టు కొమ్మలన్నింటినీ నరికేస్తున్నారు. దీంతో ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడిన చెట్లన్నీ మోడులవుతున్నాయి. గుండె తరుక్కుపోతోంది సీఎం ఆశయాలకు అనుగుణంగా నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. ప్రతి మొక్కను ప్రాణంగా పెంచుతున్నాం. అయితే మెయింటెనెన్స్ పేరుతో ఆ చెట్లను ఛిద్రం చేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. విద్యుత్ అధికారులు జీవీఎంసీకి ఈ బాధ్యత అప్పగించాలి. లేదంటే సమన్వయంతో పనిచేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.– దామోదరరావు,ఉద్యానవన విభాగాధిపతి, జీవీఎంసీ -
మా భవిష్యత్తుకు ఏం హామీ ఇస్తారు?
సాక్షి, బెంగళూరు: చిప్కో ఉద్యమం అందరికీ తెలిసే ఉంటుంది. జనాలు గుంపులుగా చేరి ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటూ చెట్లను ఆలింగనం చేసుకుని వాటిని నరకకుండా రక్షిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే గురువారం కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. బెంగళూరు శివారు ప్రాంతమైన సర్జపూర- అట్టిబెలె మార్గంలో ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేపట్టాలని ప్రణాళికలు రచించింది. అందుకోసం టెండర్లు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో కాంట్రాకర్లు ఆ ప్రాంతానికి రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న చెట్లను నరికేందుకు మార్కింగ్ చేసుకోగా సుమారు 1800 చెట్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన స్థానికులు, విద్యార్థులు గురువారం సాయంత్రం అంతా ఏకమై చెట్లను నరకడానికి వీల్లేదంటూ మానవహారం చేపట్టారు. ‘చెట్లను నరకవద్దు’ అంటూ నినాదాలిచ్చారు. ‘ఇప్పటికే రోడ్లు వెడల్పుగా ఉన్నందున ఈ పనులు అనవసరం. కాలుష్య కోరల్లో చిక్కుకున్న బెంగళూరు జీవించడానికి వీల్లేని నగరంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఉన్న కొన్ని చెట్లను కూడా నరికేసి మా భవిష్యత్తుకు ఏం హామీ ఇవ్వగలరు?’ అని ప్రశ్నించారు. (నిరసనలతో అరాచకం) చెట్లు.. బాహ్య ఊపిరితిత్తులు రోడ్డు వెడల్పు.. పర్యావరణాన్ని నాశనం చేస్తుందే తప్ప ట్రాఫిక్ సమస్యను పరిష్కరించదని నిరసనకారులు పేర్కొన్నారు. ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరారు. సబర్బన్ రైళ్లు నడుపడం, బస్ సర్వీసులు పెంచడం ద్వారా ప్రజలకు కార్లు వాడాల్సిన పని తప్పుందన్నారు. బెంగళూరు ఇప్పటికే డేంజర్ జోన్లో ఉందని, కనుక మరిన్ని చెట్లను కోల్పోవడం ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలతో వాతావారణాన్ని క్షీణింపజేయడమే కాక మన ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జపుర గ్రామవాసి దీపాంజలి నాయక్ మాట్లాడుతూ..చెట్లు లేకుండా బతకలేం.. అవి మనకు బాహ్య ఊపిరితిత్తులు. 100యేళ్ల పైబడి వయస్సున్న చెట్లను నరకివేయడం మాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. పైగా ఇలాంటి చెట్లను మళ్లీ నాటడం ఎంతో కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కాంట్రాకర్లు మాత్రం వాళ్లు అవేవీ పట్టించుకోకుండా నిరసన చేస్తున్న సమయంలోనే రహదారి సర్వే చేయడం గమనార్హం. (గుడ్రంగా తిరుగుతున్న మొక్క) -
ట్రీలకూ అంబులెన్స్
తుఫాను గాలికి వేర్లతో సహా చెట్లు పడిపోయాయా? చెదలు పట్టి చెట్టు బలహీనమవుతోందా? నీళ్లు అందక ఎండిపోతోందా? ఒక చోటు నుంచి తీసి ఇంకో చోటుకి మార్చాలా? మొక్కలు నాటాలా? విత్తనాలు కావాలా? చెట్ల గురించి సర్వే చేపట్టాలా? చచ్చిపోయిన చెట్టును తీసేయాలా? గార్డెన్ టూల్స్, ఎరువు, పురుగుల మందు, నీళ్లు కావాలా? అయితే ట్రీ అంబులెన్స్‌కు కబురు పెట్టడమే. క్షణాల్లో వచ్చి చెట్టుకు కావల్సిన చికిత్స చేసి.. సలహాలు, సూచనలు ఇచ్చి మరీ వెళ్తారు అంబులెన్స్ సిబ్బంది. ఆశ్చర్యపోకండి మీరు కరెక్ట్‌గానే చదువుతున్నారు.. నిజాన్నే తెలుసుకుంటున్నారు. అయితే ట్రీ అంబులెన్స్ సౌకర్యం ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు తమిళనాడులో. ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ అబ్దుల్ ఘనీ అండ్ టీమ్ ఈ ట్రీ అంబులెన్స్ సేవను ప్రారంభించారు. డాక్టర్ అబ్దుల్ ఘనీ ఈ పదేళ్లలో దాదాపు యాభై లక్షల మొక్కలు నాటి గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే కీర్తి తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెట్ల బాగోగుల బాధ్యతనూ తీసుకున్నాడు స్వచ్ఛందంగా. ఈ అంబెలెన్స్‌లో ప్లాంట్ ఎక్స్పర్ట్స్, వలంటీర్లూ ఉంటారు. ఈ అంబులెన్స్ సర్వీస్ ద్వారా దేశం మొత్తాన్ని పచ్చగా మార్చాలనుకుంటున్నాడు డాక్టర్ అబ్దుల్ ఘనీ. ప్రస్తుతం తమిళనాడులో మొదలైన గ్రీన్ సర్వీస్ ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుడుతూ ఢిల్లీ బాట పడ్తుంది. దార్లో ఉన్న చెట్లకు సర్వీస్ చేస్తూ! -
మొక్కల విప్లవానికి..సాంకేతిక రెక్కలు
టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తి...యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల విషయమూ ఇంతే! అబ్బే.. వాటితో నష్టమే ఎక్కువగానీ.. లాభాలేమున్నాయ్ అంటారా? చాలానే ఉన్నాయి. తాజా ఉదాహరణ... కొంతమంది యూట్యూబర్లు కలిసికట్టుగా భూమ్మీద పచ్చదనం పెంచేందుకు చేస్తున్న ప్రయత్నం. అలా మొదలైంది... 2019 మే నెలలో జిమ్మీ డొనాల్డ్సన్ అలియాస్ మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ వినియోగదారుల సంఖ్య రెండు కోట్లకు చేరింది. ఈ సందర్భంగా చాలామంది ఛానల్ సబ్స్క్రైబర్లు ఆయనకు సరదాగా ఓ సవాలు విసిరారు. ‘ఛానల్లో స్టంట్లు గట్రా చూపించడం కాదు.. ఓ రెండు కోట్ల మొక్కలు నాటి చూపించు’అని ట్విట్టర్, రెడ్డిట్, ఫేస్బుక్వంటి అనేక సామాజిక మాధ్యమాల్లో వెంట పడ్డారు. ‘‘అఫ్కోర్స్ భేషుగ్గా చేసేస్తా. చూస్తూ ఉండండి’’అని మిస్టర్ బీస్ట్ అంగీకరించడంతో కథ మొదలైంది. ‘ఎవరో ఒకరు... ఎప్పుడో అపుడు’అంటూ ముందుకు నడుస్తూ.. కొద్ది రోజుల్లోనే తనలాంటి యూట్యూబర్లు సుమారు 600 మందిని పోగేశాడు. అందరి లక్ష్యం ఒక్కటే.. రెండు కోట్ల మొక్కలు నాటాలి! సంకల్పం చెప్పుకున్నదే తడవు.. అందరూ తమతమ ఛానళ్ల సబ్స్క్రైబర్లకు విజ్ఞప్తులు పెట్టడం మొదలుపెట్టారు. మీరిచ్చే ఒక్కో డాలర్ విరాళానికి ఒక్కో మొక్క నాటేస్తాం. ఒక్క అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ దేశాల్లో పచ్చదనాన్ని పెంచేస్తామన్న యూట్యూబర్ల వినతులకు స్పందించి ఇప్పటికే దాదాపు 80 లక్షల డాలర్లు విరాళాలుగా వచ్చేశాయి కూడా! జనవరి ఒకటి విడుదల... టీమ్ ట్రీస్ ప్రాజెక్టు వచ్చే జనవరి ఒకటవ తేదీన ప్రారంభం కానుంది. ఇందుకోసం అమెరికాలో యాభై ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్బర్ డే ఫౌండేషన్ సహకారం తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటిన ఈ స్వచ్ఛంద సంస్థ రెండేళ్లలో ట్రీమ్ ట్రీస్ ప్రాజెక్టునూ పూర్తి చేయాలని భావిస్తోంది. నాటిన ప్రతి మొక్క బతికి... ఏపుగా పెరిగేందుకు ఈ సంస్థ ఆయా దేశాల అటవీ శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయనుంది. అమెరికాలో నేషనల్ పార్క్ సర్వీస్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ఫారెస్టర్స్లు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో పెరిగే మొక్కలను మాత్రమే నాటుతామని, ఒకే రకమైన మొక్కలు కాకుండా.. జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు వీలైనన్ని ఎక్కువ జాతులను పెంచడం తమ లక్ష్యమని ఆర్బర్ డే ఫౌండేషన్ చెబుతోంది. అంతేకాదు.. అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో మొక్కల విత్తనాలను వేగంగా... ఎక్కువ విస్తీర్ణంలో వెదజల్లేందుకు టీమ్ ట్రీస్ ‘డ్రోన్ సీడ్’అనే సంస్థ సేవలూ వినియోగించుకుంటోంది. చిన్న డ్రోన్లతో భూమిని సర్వే చేయడం.. ఆ తరువాత పెద్ద సైజు డ్రోన్లు విత్తనాలు, పోషకాలతో కూడిన సీడ్బాంబ్స్ను ప్రయోగిస్తాయన్నమాట. యువతరం కదం తొక్కితే... ‘‘మా తరంపై చాలామంది జోకులేస్తుంటారు.. మాటల రాయుళ్లే కానీ.. చేతలు అస్సలు ఉండవని. ట్వీట్లను రీట్వీట్ చేయడమే మీ యాక్టివిజమ్ అనీ అంటుంటారు. ఇవన్నీ తప్పని నిరూపించేందుకు ఇదే మంచి సమయం’.. ఇటీవల జిమ్మీ పెట్టిన ఓ వీడియో సారాంశమిది. జిమ్మీ వ్యాఖ్యలు అందరికీ స్ఫూర్తిదాయకమే. ‘రెండు కోట్ల మొ క్కలు నాటితే వాతావరణ మార్పుల సమస్యలన్నీ తీరిపోతాయని మేమేమీ అనుకోవడం లేదు. కాకపోతే ఏమీ లేని దానికంటే ఇది మేలన్నది మా అభిప్రాయం’ అంటారు జిమ్మీ. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఎందరో మహానుభావులు... టీమ్ ట్రీస్ ప్రయత్నాల్లో భాగంగా అక్టోబరు 25న వెబ్సైట్ ప్రారంభమైందో లేదో.. 48 గంటల్లోనే అరవై లక్షల డాలర్ల విరాళాలు వచ్చిపడ్డాయి. ఇందులో 17.5 లక్షలు యూట్యూబ్ సబ్స్క్రైబర్ల నుంచే వచ్చాయి. టెస్లా కార్ల కంపెనీ యజమాని, స్పేస్ఎక్స్ అధిపతి, హైపర్‌లూప్ రవాణా డిజైనర్ కూడా అయిన ఇలాన్ మస్క్, షాపిఫై యజమాని టోబీ లోరాక్స్ ఇంకో 20 లక్షల డాలర్లు అం దించారు. నిధుల సేకరణకు ఐర్లాండ్ యూట్యూబర్ జాక్సెప్టిక్ఐ 8 గంటలపాటు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా 1.5 లక్షల డాలర్లు సేకరించగా.. గేమింగ్ యూట్యూబర్ ఒకరు ఫోర్ట్‌నైట్ గేమ్ టోర్నమెంట్ నిర్వహించి గేమ్‌లో ఒక్కో కిల్కు పది డాలర్లు చొప్పున విరాళం సేకరించా డు. ఓ ఛానల్.. మొక్కలు నాటే ఫిరంగి తయారీ ప్రయత్నాల్లో ఉంది. టీమ్ ట్రీస్ ప్రాజెక్టుకు ఆద్యుడైన మిస్టర్ బీస్ట్ లక్ష డాలర్ల విరాళమివ్వడం కొసమెరుపు! -
చెట్లను చంపేశాడు
కర్ణాటక ,బనశంకరి: పచ్చని చెట్లను ఓ దుండగుడు పొట్టనబెట్టుకున్నాడు. ఐదు చెట్లకు విషపూరిత ఇంజెక్షన్ వేయడంతో చెట్లు ఎండిపోయేలా చేశాడు. రాజరాజేశ్వరినగరలోని పంచశీలనగర నివాసి నరేంద్ర అనే వ్యక్తి తన ఇంటి ముందున్న ఐదు చెట్లకు విషపూరిత సూదులు వేశాడు. అతని భవనానికి ఎదురుగా ఐదు చెట్లు ఇంటి అందానికి అడ్డుగా ఉన్నాయని వాటిని నరికివేయించడానికి యత్నించాడు. స్థానికులు దీనిని వ్యతిరేకించారు. దీంతో ఎలాగైనా చెట్లను తొలగించాలని రాత్రికి రాత్రి విషపు ఇంజెక్షన్ అందించి చెట్లు ఎండిపోయేలా చేశాడని స్థానిక నివాసుల సంఘం నాయకులు బీబీఎంపీ అటవీ విభాగానికి ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి చెట్లను పరిశీలించగా విషపూరిత మందును ఎక్కించాడని ధ్రువీకరించారు. కట్టడం ముందుభాగంలో ఉన్న చెట్లతో తమకు అలర్జీ వస్తుందని నరేంద్ర కట్టుకథలు చెబుతున్నాడని సంఘం నాయకులు ఆరోపించారు. స్వచ్ఛమైన గాలిని అందించే చెట్ల వల్ల ఎలాంటి అలర్జీ ఏర్పడదన్నారు. చెట్లుకు విషం పెట్టిన నరేంద్ర తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ట్రీట్మెంట్ అదిరింది
వనపర్తి టౌన్: గొడ్డలి వేటుకు గురికావాల్సిన 8 చెట్లకు పునరుజ్జీవం వచ్చింది. వనపర్తి జిల్లాలోని నాగవరంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు పక్కనున్న చెట్లను నరికివేయకుండా ట్రీ ట్రాన్స్‌లొకేషన్ ద్వారా మరోచోట నాటాలని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. దీంతో అధికారులు హైదరాబాద్‌కు చెందిన ట్రీ ట్రాన్స్‌లొకేషన్ ఉప్పలయ్యను సంప్రదించారు. మొత్తం 12 చెట్లకు 8 చెట్లు మరోచోట నాటితే బతుకుతాయని చెప్పారు. దీంతో 4 రోజుల క్రితం చెట్ల చుట్టూ 5 అడుగుల గోతి తీసి.. ఫిట్టింగ్ బెల్డ్ సహాయంతో గోనెసంచుల్లో వేర్లు బయటికి రాకుండా మట్టితో బిగుతుగా కట్టి రసాయనిక మందులు పూశారు. అనంతరం శివారులోని ఖాళీ స్థలంలో వాటిని నాటారు. -
చెట్లతో చిప్కో.. కష్టాలు చెప్కో..
చిప్కో అంటే అతుక్కుని ఉండటం లేదా సమీపంలో ఉండటం అని అర్థం. అడవులు, చెట్ల సంరక్షణకు నాడు చేసిన చిప్కో ఉద్యమం మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు కూడా చిప్కో అంటున్నారు.. చెట్లను చుట్టుకో అంటున్నారు. వాటి సంరక్షణ కోసం కాదు.. మన సంరక్షణ కోసం.. మన మనోసంరక్షణ కోసం.. శిన్రిన్–యోకు.. అర్థం కాలేదా.. జపనీస్లెండి.. పైన మనం చెప్పుకున్నదానికీ దీనికీ లంకె ఉంది.. ప్రస్తుతం నగరంలోనూ శిన్రిన్–యోకుకు క్రేజ్ పెరుగుతోంది.. ఇంతకీ ఏంటీ శిన్రిన్–యోకు.. సాక్షి, హైదరాబాద్ : శిన్రిన్–యోకు.. సింపుల్‌గా చెప్పాలంటే.. ఫారెస్ట్ థెరపీ.. నగరవాసుల్లో ఉండే ఒత్తిడి, ఆందోళనకు చికిత్స ప్రకృతే అన్నది ఈ థెరపీ సిద్ధాంతం. ఇది జపాన్‌లో బాగా ప్రాచుర్యం లో ఉంది. చికాకుగా, ఆందోళనగా ఉన్నప్పుడు పచ్చని పరిసరాల్లో నడిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. దీన్నే ఫారెస్టు థెరపీగా జపాన్ అవలంబిస్తోంది. అడవుల్లో చెట్ల మధ్య జపనీయులు చేసే ధ్యాన విధానం ఇది. దీనిని ఆ దేశం తమ జాతీయ ప్రజారోగ్య కార్యక్రమంగా గుర్తించింది. దీంతో కలిగే ఉపశమనం, సానుకూల ప్రభావం దృష్ట్యా చాలా దేశాల్లో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక మన దేశంలో పుణే వర్సిటీలో ఈ తరహా ధ్యానం బాగా ప్రాచుర్యంలో ఉంది. వారాంతాల్లో పచ్చని చెట్ల నీడల్లో వనస్నానాలు చేస్తూ కనిపిస్తున్నారు ఇక్కడి విద్యార్థులు. ఈ థెరపీలో స్వస్థత కలిగించే లక్షణాలున్నాయని వీరు నమ్ముతున్నారు. లాభాలేంటి? ఫారెస్ట్ థెరపీలో నడక, ధ్యానం, వ్యాయమాలు వంటివి ఉంటాయి. జీవన విధానంలో లోటుపాట్ల వల్ల వచ్చే రోగాలను ఈ థెరపీ నిరోధిస్తుంది. అడవిలో ఉండే నిశ్శబ్దమైన వాతావరణం మన శరీరానికి, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఇక ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలై కోలుకున్న వారికి ఈ రకమైన థెరపీ మరింత ఉపయోగకారి. అడవి లేదా వనాల్లో చెట్ల మధ్య చిన్న చిన్న పనులు చేయడం కూడా చక్కటి థెరపీగా పనిచేస్తుంది. ఇక కౌన్సిలింగ్‌కు అడవి మంచి చోటు. అడవిలోని వాతావరణం వల్ల మనసు నిదానించి, సున్నితమైన అంశాలను వినడానికి, అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అంటారు జపాన్ కౌన్సిలర్లు. వివిధ పరిశోధనలు కూడా దీనికే పచ్చజెండా ఊపుతున్నాయి. ప్రకృతిలో గడిపినా, కనీసం ఆ ఫొటోలు చూసినా, మనం సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నాయి. ఒక పరిశోధన ప్రకారం యువత ఒక గంట సేపు పచ్చని పరిసరాల్లో తిరగటం వల్ల వారిలో ఆందోళన స్థాయి తగ్గి, జ్ఞాపకశక్తి పెరిగింది. పచ్చని ప్రకృతి ఫొటోలు చూడటం వల్ల ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని మరో పరిశోధన వెల్లడించింది. చెట్టును చుట్టుకుని సేద తీరితే.. ఇక చెట్టుని చుట్టు కుని సేద తీరితే ఎలా ఉంటుంది, అంటే మీరు చేసి చూస్తే తప్ప ఎవరు చెప్పినా అది అనుభవంలోకి రాదు. మనలో ఉన్న ప్రతికూల భావావేశాలను పక్కకు నెట్టి, ప్రశాంతతను నింపుతుంది ఈ ప్రక్రియ అంటున్నారు నగరానికి చెందిన లైఫ్ కోచ్ శీలా రామ్మోహన్. ఇటీవల కేరళలోని వయనాడ్‌లో ఆమె ఫారెస్ట్ మెడిటేషన్ నిర్వహించారు. మనలో విచ్చలవిడిగా తాండవిస్తున్న నెగటివ్ ఆలోచనలను నియం త్రించేందుకు, పాజిటివ్ ఆలోచనల్ని ఒక దోవలోకి తీసుకురావడానికి ఈ విధమైన మెడిటేషన్ ఉపయోగపడుతుందంటారు ఆమె. ‘‘మనం ప్రకృతిలో భాగమే. ఒక చెట్టుగా మనల్ని మనం భావించి మెడిటేషన్ ప్రారంభించాలి. ఆకాశంలో ఏదైనా ఎటైనా గింగిర్లు తిరుగుతుంది. కానీ చెట్టు వేర్లు భూమిలో పరుచుకుంటాయి. ఒక పెద్ద చెట్టు ఎలా దృఢంగా, సంపూర్ణంగా, విశాలంగా, నీడని, శక్తిని ఇస్తూ, పాజిటివ్‌గా ఉంటుందో అదే విధంగా మన ఆలోచనలు, ఒక దిశలో, బలంగా, పాజిటివ్‌గా మలుచుకునేందుకు దోహదం చేస్తుంది ఫారెస్ట్ మెడిటేషన్. ఇక అడవిలో సహజమైన వాతావరణం, ప్రకృతిలో ఉన్న అపారమైన శక్తి, మనలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తొలగించి, సరికొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ ఫారెస్ట్ థెరపీ అందించే పునరుత్తేజాన్ని పొందేందుకు అడవుల వరకూ వెళ్లలేని వారు, ఇంటి దగ్గర్లో ఉన్న పార్క్‌లు, ఉద్యానవనాల్లోనూ దీనిని ప్రాక్టీస్ చేసుకుంటూ పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చని ’’ అన్నారు. –శీలా రామ్మోహన్, లైఫ్ కోచ్ ఒకలాంటి తన్మయత్వం కలిగింది.. ‘‘జపనీస్ ప్రాక్టీస్ గురించి తెలియదు. కాని ప్రకృతి అన్నా, చెట్లన్నా చాలా ఇష్టం. ఫారెస్ట్ మెడిటేషన్ డిఫరెంట్‌గా అనిపించింది. ఏదో చెట్ల మధ్య కాసేపు సైలెంట్‌గా గడిపి వస్తాం అని అనుకున్నాను. కానీ ఇది చాలా రిలాక్సింగ్ మెథడ్. మనలో నిండిన కోపం, చికాకు, విసుగు లాంటి ప్రతికూల భావనల తీవ్రత తగ్గి ఉపశమనం కలగడాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. నా సెన్సెస్ మీద పాజిటివ్ ప్రభావాన్ని చూపించింది. చెట్టుని వాటేసుకోవటం, తర్వాత ఆ చెట్టు పక్కనే కూర్చోవటం, చెట్టుని తడుతున్నప్పుడు ఒకలాంటి తన్మయత్వం కలిగింది’’ – సునీత గ్రేస్, యోగా థెరపిస్ట్ -
ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఒకపక్క వర్షాభావం, మరో పక్క భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతుండం, అన్నార్థులు, అభాగ్యులు అకారణంగా మత్యువాత పడుతుండడం పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులే కారణమని శాస్త్రవేత్తలు నెత్తి, నోరు మొత్తుకొని చెబుతున్న విషయం విషయం తెల్సిందే. ప్రధానంగా చెట్లను కాపాడుకోలేకపోవడం వల్ల దేశంలో అటవీ ప్రాంతం తగ్గిపోయి కార్బన్‌డై ఆక్సైడ్ పెరిగి భూతాపోన్నతి పెంచడం వల్ల ఈ అకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పర్యావరణ పరిస్థితుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నానని అంతర్జాతీయ వేదికల ముందు బాకా ఊది మరి చెబుతున్న భారత్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దొంగ లెక్కలూ ఉన్నాయి. భారత్‌లో 2005 నుంచి 2017 సంవత్సరాల మధ్య 2,152 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం (వక్ష సంపద) విస్తరించిందని ‘ది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ గతంలో ఓ డేటాను విడుదల చేసింది. వాస్తవానికి 2001 నుంచి 2018 సంవత్సరాల మధ్య భారత్‌లో 16 లక్షల హెక్టార్లలో వృక్ష సంపద నాశనం అయిందని యూనివర్శిటీ ఆఫ్ మేరిలాండ్, గూగుల్, యూఎస్ జియోలోజికల్ సర్వే, నాసాలు సేకరించిన డేటా, ఛాయా చిత్రాలను అధ్యయనం చేయడం ద్వారా లాభాపేక్ష లేని ‘వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్’ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా వెల్లడించింది. భారత్ ప్రభుత్వం దేశంలో వృక్ష సంపద పెరగిందంటే ‘వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్’ తగ్గిందని చెబుతున్నది ఇందులో ఏది సబబు, ఏది కాదు ? దేశంలో అటవి ప్రాంతం విస్తరించిందని చెబుతున్న అటవీ సర్వే మరోపక్క తరుగుతున్న అటవీ ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకోలేదా? గనులు, వివిధ ప్రాజెక్టుల కారణంగా దేశంలో వక్ష సంపద తగ్గిపోతోందంటూ ప్రజాందోళన పెరుగుతున్న నేపథ్యంలో వక్ష సంపద పెరిగిందనడం వారిని బుజ్జగించడం కోసమా? కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అలా ప్రకటించిందా ? ఇక్కడ మరో అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఏది వాస్తవమో, ఏది అబద్ధమో! ఇట్టే తెలిసిపోతుంది. 2030 సంవత్సరం నాటికల్లా భూవాతావరణంలో 250 టన్నుల నుంచి 300 టన్నుల వరకు కార్బన్‌డై ఆక్సైడ్‌ను తగ్గించేందుకు సరిపడా వృక్ష సంపదను పెంచుతామని, అందుకోసం అటవులను అభివద్ధి చేస్తామని 2015, డిసెంబర్లో పారిస్‌లో పర్యావరణ పరిస్థితులపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో తీర్మానంపై భారత ప్రభుత్వం సంతకం చేసింది. ఇందుకోసం 2030 సంవత్సరం నాటికి 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామంటూ ఉదారంగా హామీ కూడా ఇచ్చింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాలకు కేవలం 89.53 కోట్ల రూపాయలను, 2017–18 ఆర్థిక సంవత్సరానికి 47.8 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పార్లమెంటరీ కమిటీ నివేదికనే వెల్లడించింది. అంటే పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఈ మూడేళ్ల కాలంటో 136 కోట్లను మాత్రమే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం రానున్న 12 ఏళ్ల కాలంలో 60 వేల కోట్లలో ఎన్నికోట్లను కేటాయించగలదు? ఒకప్పుడు పండుగలకు, పబ్బాలకు, పిల్లలు పుడితే వారి మీద చెట్లను నాటి, వాటిని పిల్లలతో సమానంగా చూసుకునే సంస్కతి ప్రజల్లో ఉండేది. అది అంతరించడంతో చెట్లు నాటేందుకు ఎక్కడికక్కడ ప్రభుత్వాలే ముందుకు వచ్చాయి. వస్తున్నాయి. అన్నింట్లో అవినీతికి అలవాటుపడ్డ ప్రభుత్వాల వల్ల చెట్లు ఊపిరిపోసుకోవడం లేదు. ఇక అడవులను పెంచడం తమ వల్ల కాదన్న అభిప్రాయానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అడవుల పెంపకం బాధ్యతలను కార్పొరేట్లకు ఇవ్వాలంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై విస్తృతంగా చర్చ జరపాలని కోరుకుంటోంది. -
‘పచ్చ’దనంపై మహా చొరవ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పచ్చదనానికి విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బాలానగర్‌లోని శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం సేకరించిన స్థలంలో 95 చెట్లను హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు గుర్తించారు. అయితే పచ్చదనానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో 15 భారీ చెట్లను ట్రాన్స్‌లోకేషన్ (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం) చేయాలని, మరో 34 చెట్లను నరికివేయాలని, మిగిలిన 46 చెట్లను యథాతథంగానే కొనసాగించాలని గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం 15 చెట్లను ప్రణాళికాబద్ధంగా చుట్టూరా గుంతలు తీసి జేసీబీల సహాయంతో వేళ్లతో సహా భారీ వాహనాల్లో ఎక్కించి గండిమైసమ్మలోని హెచ్ఎండీఏ నర్సరీకి తరలించి మళ్లీ పెట్టారు. ట్రాన్స్‌లొకేషన్ ద్వారా తొలగించిన చెట్లను తొలుత సమీపంలోని ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి తరలించాలని భావించినా అక్కడ ఉన్న వస్తువు నిల్వల వల్ల హెచ్ఎండీఏ నర్సరీకి తీసుకెళ్లినట్లు హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ట్రాన్స్‌లొకేషన్ పనులను వేగవంతం చేశామని, 15 చెట్లను తరలించాలని తొలుత భావించినా, మరో రెండు చెట్లను కూడా తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు చెట్లను ట్రాన్స్‌లొకేషన్ చేసి కాపాడుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చెట్లను కొట్టివేయాల్సి వస్తోందన్నారు. ‘ బాలానగర్ ఫ్లైవర్కు అడ్డంకిగా ఉన్న 95 చెట్లలో 46 చెట్లను యథావిధిగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రాన్స్‌లొకేషన్ చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చుట్టూ గుంతలు తవ్వినా చెట్ల వేళ్లు ఎక్కువగా తారుతో కప్పబడి ఉన్నాయి. కొన్ని చెట్లు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, వాటర్ పైపులు, టెలికామ్ కేబుల్స్ ఉండటంతో వీటన్నిటింటిని జాగ్రత్తగా గమనిస్తూ చెట్లను ట్రాన్స్‌లొకేషన్ చేస్తున్నాం. వేరే ప్రాంతానికి తీసుకెళ్లిన ఈ చెట్టుకు నీళ్లుపోయడం, నిర్వహణ కూడా సమస్యగా మారింద’ని తెలిపారు. అటవీ శాఖ అధికారులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులతో కూడిన చెట్ల పరిరక్షణ కమిటీ ఆమోదముద్ర వేసిన తర్వాతే ట్రాన్స్‌లొకేషన్ పనులు చేపట్టామని హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. అయితే అన్ని చెట్లు ట్రాన్స్‌లోకేషన్ చేద్దామనుకున్నా వాటి జీవితకాలం తక్కువగా ఉండటంతో కూల్చివేయాలని నిర్ణయించామని, చెట్ల పరిరక్షణ కమిటీ ఆమోదంతోనే ఇందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా బాలానగర్‌లోని శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవునా ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఎనిమిది ఎకరాల 20 గుంటలు (33,175 చదరపు మీటర్ల) స్థలంలో 357 ప్రాపర్టీలకు నష్టం కలుగుతోంది. ఈ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.104.53 కోట్లు కాగా, భూసేకరణ కోసం రూ.265 కోట్లను హెచ్ఎండీఏ చెల్లిస్తోంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల టెండర్‌ను దక్కించుకున్న బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పనులు చేపట్టింది. -
లక్షలాది చెట్లను బ్యాలెట్ బాక్స్‌ల్లో వేసేశాం!
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ఒకప్పుడు ఎన్నికల నిర్వహణ అంతా బ్యాలెట్ పత్రాలపైనే జరిగేది. 1999 ముందు వరకు ఈ విధానమే నడిచింది. ఎన్నికలకు మూడు నెలలకు ముందే ప్రధాన పార్టీలకు చెందిన బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేది. దేశవ్యాప్తంగా ఒకసారి జరిగే ఎన్నికలకు 7,700 టన్నుల బ్యాలెట్ పత్రాలను వినియోగించేవారు. టన్ను పేపరును ఉత్పత్తి చేయడానికి సుమారు 140 చెట్లను కోల్పోవాల్సి వచ్చేది. ఈ లెక్కన ఒక్కో ఎన్నికకు ఎన్ని లక్షల చెట్లను మనం బ్యాలెట్ బాక్సుల్లో వేశామో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఖర్చులో కూడా ఉద్యోగుల నిర్వహణ తర్వాత ఎన్నికల సంఘం ఎక్కువగా వెచ్చించేది బ్యాలెట్ పత్రాల ముద్రణకే. లెక్కింపులో ఆలస్యం, తేడాలు, గిమ్మిక్కులు ఎక్కువ కావడంతో అభ్యర్థుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకునేవి. దీంతో చాలాచోట్ల రెండోసారి, మూడోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చేది. 2014లో దేశంలో 80 కోట్ల మంది ఓటర్లు ఉండడంతో ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలను తీసుకువచ్చారు. వేల టన్నుల పేపరు వినియోగాన్ని తగ్గించి తక్కువ సమయంలో ఎన్నికల నిర్వహణకు అవకాశాలు మెరుగుపడ్డాయి. దేశంలో తరిగిపోతున్న పచ్చదనాన్ని కాపాడుకునేందుకు ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. -
లక్షలాది చెట్లను బ్యాలెట్ బాక్స్‌ల్లో వేసేశాం!
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ఒకప్పుడు ఎన్నికల నిర్వహణ అంతా బ్యాలెట్ పత్రాలపైనే జరిగేది. 1999 ముందు వరకు ఈ విధానమే నడిచింది. ఎన్నికలకు మూడు నెలలకు ముందే ప్రధాన పార్టీలకు చెందిన బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేది. దేశవ్యాప్తంగా ఒకసారి జరిగే ఎన్నికలకు 7,700 టన్నుల బ్యాలెట్ పత్రాలను వినియోగించేవారు. టన్ను పేపరును ఉత్పత్తి చేయడానికి సుమారు 140 చెట్లను కోల్పోవాల్సి వచ్చేది. ఈ లెక్కన ఒక్కో ఎన్నికకు ఎన్ని లక్షల చెట్లను మనం బ్యాలెట్ బాక్సుల్లో వేశామో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఖర్చులో కూడా ఉద్యోగుల నిర్వహణ తర్వాత ఎన్నికల సంఘం ఎక్కువగా వెచ్చించేది బ్యాలెట్ పత్రాల ముద్రణకే. లెక్కింపులో ఆలస్యం, తేడాలు, గిమ్మిక్కులు ఎక్కువ కావడంతో అభ్యర్థుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకునేవి. దీంతో చాలాచోట్ల రెండోసారి, మూడోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చేది. 2014లో దేశంలో 80 కోట్ల మంది ఓటర్లు ఉండడంతో ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలను తీసుకువచ్చారు. వేల టన్నుల పేపరు వినియోగాన్ని తగ్గించి తక్కువ సమయంలో ఎన్నికల నిర్వహణకు అవకాశాలు మెరుగుపడ్డాయి. దేశంలో తరిగిపోతున్న పచ్చదనాన్ని కాపాడుకునేందుకు ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. -
పచ్చని చెట్లపై గొడ్డలి వేటు!
త్రిపురాంతకం: పచ్చని చెట్లను నిలువునా కూల్చేస్తున్నారు. అనంతపురం–అమరావతి నేషనల్ హైవే విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు రోజురోజకూ కనుమరుగవుతున్నాయి. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం డివిజన్లో అనంతపురం–అమరావతి హైవే సుమారు 135 కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. గిద్దలూరు నుంచి త్రిపురాంతకం మండలం వరకు రోడ్డు విస్తరణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో భారీగా రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. డివిజన్లో 135 కిలోమీటర్ల మేర పనులు జరుగుతుండగా త్రిపురాంతకం మండలంలో నేషనల్ హైవే సుమారు 40 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉంది. ఈ రోడ్డుకు ఇరువైపులా ఏళ్ల తరబడి పెరిగిన వృక్షాలను కూల్చి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా నీడను ఇవ్వడంతో పాటు పర్యావరణం పరిరక్షణకు ఉపయోగపడుతున్న వృక్షాలు కనుమరుగై పోతున్నాయి. ఇది వరకూ రోడ్డుపై ప్రయాణం చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉండేది. అలాంటిది రోడ్లు విస్తరణ, పెరుగుతున్న వాహనాల రాకపోకలు, ప్రమాదాల నివారణ, భవిష్యత్ అవసరాలు దృష్యా కర్నూలు–గుంటూరు రోడ్డును అనంతపురం–అమరావతి నేషనల్ హైవేను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ మేరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. విస్తరణ పనులతో ఏళ్లతరబడి ఉన్న చెట్లు తొలగించక తప్పడం లేదన్న అభిప్రాయాన్ని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. తొలుత విస్తరణ జరుగుతున్న ప్రాంతంలో మొక్కలు నాటి క్రమేణా చెట్లను తొలగించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదా రోడ్డు విస్తరణలో వంపులు తొలగిస్తూ పనులు చేపట్టి ఒక పక్కన కొంతవరకు చెట్లను ఉంచితే నష్టం జరిగేది కాదన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే సరికి పూర్తిగా చెట్ల ఆనవాలు కనిపించే అవకాశం ఉండదు. అందుకు ఇప్పటి నుంచైనా తిరిగి చెట్లు పెంచేందుకు నేషనల్ హైవే అథారిటీ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది. పర్యావరణానికి ముప్పు నేషనల్ హైవేపై రోజూ వేలాది వాహనాలు ప్రయాణం చేస్తున్నందున వాటి నుంచి వచ్చే పొగ కారణంగా కలుషిత వాతావరణం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. చెట్లు ఉంటే వాతావరణానికి ఎలాంటి భంగం కలగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెట్లు కొట్టేయడంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఈ ప్రాంతంలోని చెట్లతో కొంత వరకు ఉపయోగకరంగా ఉంది. ఈ చెట్లన్నీ కూల్చివేతతో రోడ్డు ఎడారిగా కనిపిస్తోంది. తిరిగి రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి ఏళ్ల తరబడి జీవించే అడవి జాతి వృక్షాలతో పాటు తొందరగా పెరిగి పచ్చని వాతావరణం కల్పించే చెట్లు పెంచితే ఉపయోగం ఉంటుంది. ఇప్పటి నుంచే దానికి తగిన విధంగా ప్రయత్నం చేయడంతో పాటు మొక్కలు పెరిగే వరకు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మొక్కలు వేసి వదిలేస్తే అవి బతికే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రేమే సృష్టి
సరే, పిల్లలంతా ఆరుబయట చెట్లు నాటారు, మేము అనుకునేదేమంటే, ఇదంతా కూడాను చదువులో భాగమే, వాటి వేర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం, అలాగే ఒకదాని గురించి బాధ్యతగా ఉండటం, ఒకదాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. చెట్లు అన్నీ చచ్చిపోయాయి. అవి ఆరెంజ్ చెట్లు. అవి ఎందుకు చనిపోయాయో నాకు తెలీదు, కానీ చనిపోయినై. భూమి మట్టితోనే ఏదైనా సమస్య ఉందో, నర్సరీలోంచి వచ్చినవే మంచివి కాదో. దాని గురించి ఫిర్యాదైతే చేశాం. మొత్తం ముప్పై మంది పిల్లలున్నారు, ప్రతి చిన్నారి ఒక్కో మొక్క నాటాలి, చూస్తే ముప్పై చెట్లూ చనిపోయినై. ఆ ఎండిపోయిన కట్టెలను పిల్లలు చూస్తూవుంటే, డిప్రెసింగ్‌గా ఉండింది. మరీ అంత బాధేం ఉండేది కాదుగానీ, ఈ చెట్ల వ్యవహారం జరగడానికి కొన్ని వారాల ముందు పాములన్నీ చచ్చిపోయినై. కనీసం అవి చనిపోవడానికి ఓ కారణం అయితే కనబడింది, బాయిలర్ నాలుగు రోజులు ఆగిపోయింది సమ్మె వల్ల. కనీసం ఇదీ అని పిల్లలకు వివరించి చెప్పొచ్చు. అందుకే పరిస్థితులు మామూలైన తర్వాత పాములను చూసినప్పుడు పిల్లలు మరీ కలత చెందలేదు. ఔషధ మొక్కల గార్డెన్ విషయంలో అయితే అది నీళ్లు మరీ ఎక్కువ పెట్టడం అయివుండాలి, కనీసం పిల్లలకు ఇప్పుడు తెలుసు నీళ్లు ఎక్కువ పోయకూడదని. పిల్లలు ఆ గార్డెన్ మీద మరీ ఎక్కువ పట్టింపుతో ఉండి, అందులో ఎవరైనా మేము చూడనప్పుడు కొన్ని నీళ్లు ఎక్కువ పోసివుంటారు. అనుకోగూడదుగానీ ఎవరైనా కావాలని చేసిందా అన్న ఆలోచన కూడా మాకు రాకపోలేదు. అలా ఎందుకు అనుకున్నామంటే, దీనికంటే ముందు ఎడారి ఎలుకలు చనిపోయినై, తెల్ల చిట్టెలుకలు చనిపోయినై, నలికండ్లపాములు చనిపోయినై... సరే, ఇప్పుడు వాళ్లకు తెలుసు వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకుపోవద్దని. ఉష్ణమండల చేపలు చనిపోతాయని మాత్రం ఊహించాం, అదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. పెద్ద సంఖ్యలో, ఉపరితలానికి వచ్చి, మెలి తిరిగి వెల్లకిలా పడిపోయినాయి. ఆ సమయంలోనే మా పాఠ్య ప్రణాళికలో ఉష్ణమండల చేపలు చూపాలని ఉండింది, కానీ మేము ఏమీ చేయలేకపోయాం. మేము కనీసం ఓ కుక్కపిల్లను ఉంచుకునే వీలు లేకపోయింది. అది చిన్న కుక్కపిల్ల, దాన్ని మర్డోక్ చిన్నారి గ్రిస్టెడె ట్రక్కు కింద చూసింది, ఆ డ్రైవరు అప్పుడే డెలివరీ పూర్తిచేసుకున్నాడు, ఆ ట్రక్కు దాని మీద ఎక్కడ ఎక్కేస్తుందేమో అని తెగ భయపడిందట, వెంటనే దాన్ని తన బ్యాగులో పెట్టుకుని స్కూలుకు తెచ్చేసింది. కానీ దాన్ని చూసిన మరుక్షణం, దేవుడా, అది రెండు వారాలకు మించి బతకదేమో అనిపించింది... చివరకు అదే జరిగింది. నిజానికి అది తరగతి గదిలో ఉండకూడదు కూడా, అట్లా అని పాఠశాల నిబంధనలు ఏవో ఉండినాయి, కానీ పిల్లలతో మీరు కుక్కపిల్లను క్లాసులోకి తేవొద్దని చెప్పలేరు, అది అప్పటికే వచ్చి మీ కళ్లముందు కనబడుతూ, ఈ మూల నుంచి ఆ మూలకు గెంతుతూ కుయ్యికుయ్యిమంటూ ఉన్నప్పుడు. దానికి వాళ్లు ఎడ్గర్ అని పేరు పెట్టారు, నా పేరు మీదుగానే! ఇంక చూడండి, దానితో వాళ్లు చేసే తమాషా, ‘బాగుంది ఎడ్గర్!’, ‘ఇటు చూడు ఎడ్గర్!’ అంటూ ఒకటే అరవడం, ఒకటే నవ్వడం. నేను కూడా సంతోషపడ్డాను, నన్ను ఆటపట్టిస్తుంటే నాకు బానేవుంటుంది. వాళ్లు సామానుల గదిలో దానికో చిన్న ఇల్లు అదీ కూడా కట్టారు. అదెందుకు చనిపోయిందో అంతుపట్టలేదు, కుక్కలకు తగిలే ఏదైనా అంటువ్యాధి అయివుండాలి. బహుశా దానికి టీకాలు వేయించివుండరు. పిల్లలు స్కూలుకు వచ్చేలోపలే దాన్ని తీయించేశాను. ప్రతిరోజు పొద్దుటే నేను ఆ సామాన్ల గదిని చూస్తూ వచ్చాను, ఓ దినచర్యలాగా, ఏం జరిగే ప్రమాదముందో ఒక అంచనావుంది కాబట్టి. దాన్ని కస్టోడియన్‌కు అప్పగించాను. ఆ తర్వాత ఈ కొరియన్ అనాథ, హెల్ప్ ద చిల్డ్రెన్ కార్యక్రమంలో భాగంగా క్లాస్ తరఫున దత్తత తీసుకున్నాం, ప్రతి చిన్నారీ నెలకో పావలా డాలర్ చొప్పన ఇవ్వాలనేది ఆలోచన. ఆ పిల్లాడి పేరు కిమ్, మేము దత్తత తీసుకోవడమే ఆలస్యమైందో ఏమోగానీ దురదృష్టకరమైన సంగతి. అతడి మరణానికి కారణం ఏమిటో మాకు వచ్చిన ఉత్తరంలో పేర్కొనలేదు, కానీ మేము ఇంకో దత్తతకు వెళ్లమని సలహా అయితే ఇచ్చారు, కొన్ని ఆసక్తికరమైన కేసు హిస్టరీలు కూడా పంపారు, కానీ మాకు అప్పటికే గుండెలు జారివున్నాయి. అందరూ మరీ డీలా పడిపోయారు, నాతో ఎవరూ నేరుగా ప్రస్తావించలేదుగానీ, అసలు స్కూలులోనే ఏదో దోషం ఉందని అనుకోసాగారు. నాకేమీ ప్రత్యేకంగా స్కూలులో ఏదో దోషం ఉన్నట్టు కనిపించలేదు, నేను మంచి చూసినవాణ్ని, చెడు చూసినవాణ్ని. ఏదో అదృష్టం బాగాలేదంతే. చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడా చనిపోయారు, ఆ మాటకొస్తే. రెండు గుండెపోట్లు, రెండు ఆత్మహత్యలు, ఒకరు నీటమునిగి, ఇంకో నలుగురు కారు ప్రమాదంలో. ఒకరికి స్ట్రోక్ వచ్చింది. ప్రతి ఏడాదీ తాతలు, బామ్మల మరణాలు మామూలుగానే ఎక్కువే సంభవిస్తుంటాయి, ఈ సంవత్సరం మరీ ఎక్కువున్నట్టున్నాయి. చివరకేమో ఈ దారుణం. దారుణం ఎలా జరిగిందంటే– ఈ మాథ్యూ వెయిన్, టోనీ మావ్‌రోగార్డో ఇద్దరూ ప్రభుత్వ కార్యాలయ భవనం కోసం తవ్వుతున్న పునాదుల దగ్గర అడుకుంటున్నారు. అక్కడే పెద్ద పెద్ద దూలాలు కుప్పవేసి వున్నాయి. వాటిని సరిగ్గా పెట్టలేదని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు, దానిమీద కోర్టు కేసు అయితే రానుంది. ఏది సత్యమో ఏది కాదో నాకైతే తెలీదు, కానీ ఈ సంవత్సరం మాత్రం బాలేదు. ఇంకోటి మరిచిపోయాను, బిల్లీ బ్రాంట్ వాళ్ల నాన్నను ఎవడో ముసుగు తొడుక్కున్న అగంతకుడు కత్తితో దారుణంగా పొడిచాడు, ఇంట్లో జొరబడినప్పుడు వాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు. ఒకరోజు క్లాసులో చర్చ జరిగింది. ఇవన్నీ ఎటు పోయాయని వాళ్లు ప్రశ్నించారు, ఆ చెట్లు, ఆ నలికండ్లపాములు, ఆ ఉష్ణమండల చేపలు, ఎడ్గర్, నాన్నలు, అమ్మలు? మాథ్యూ, టోనీ, వీళ్లు ఎటు పోయారు? నాకు తెలీదు, తెలీదు అని జవాబిచ్చాను. మరి ఎవరికి తెలుసని అడిగారు. ఎవరికీ తెలియదని జవాబిచ్చాను. అప్పుడు వాళ్లు, అంటే ఈ జీవితానికి అర్థాన్ని ఇచ్చేది ఈ మరణమా అని అడిగారు. లేదు, లేదు, జీవితానికి అర్థం కల్పించేది జీవితం మాత్రమే అని చెప్పాను. తర్వాత వాళ్లు ఏమన్నారంటే, కానీ ఈ చావు అనేది లౌకిక ప్రపంచంలో రోజువారీ భరించి తీరవలసిన రొష్టును అధిగమించే దిశలో మనని కొనిపోయే మూలసూత్రంగా పరిగణిస్తారు కదా–– అవును, కావొచ్చు, అన్నాను. మాకు నచ్చలేదు, అన్నారు వాళ్లు. ఊమ్ బాగుంది, అన్నాను. ఎంత సిగ్గుమాలిన విషయం, అన్నారు. ఒప్పుకున్నాను. అయితే మీరు ఇప్పుడు హెలెన్(మా టీచింగ్ అసిస్టెంట్)ను మా ముందు ప్రేమించండి, ఎలా చేయాలో మేము చూస్తాం. మాకు తెలుసు మీకు హెలెన్ అంటే ఇష్టమని అన్నారు వాళ్లు. నాకు హెలెన్ అంటే ఇష్టమే, కానీ అలా చేయలేనని చెప్పాను. మేము దాని గురించి చాలా విన్నాం, కానీ మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు వాళ్లు. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు, పైగా అది ఎవరూ, ఎక్కడా ఇంతకుముందు ప్రదర్శించి చూపలేదని చెప్పాను. హెలెన్ కిటికీలోంచి చూసింది. ప్లీజ్ ప్లీజ్, మీరు హెలెన్‌ను ప్రేమించండి, మాకో విలువ ఉందని నమ్మకం కలిగించండి, మాకు భయమేస్తోంది, అన్నారు వాళ్లు. ఆ విలువ అంతటా ఉందనీ, (నాకూ భయమేస్తున్నప్పటికీ) మీరు భయపడనవసరం లేదనీ చెప్పాను. హెలెన్ వచ్చి నన్ను కౌగిలించుకుంది. ఆమె కనుబొమ్మలను నేను కొన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాను. పిల్లలు కేరింతలు కొట్టారు. ఇంతలో తలుపు దగ్గర ఏదో చప్పుడైంది, వెళ్లి తీశాను, కొత్త ఎడారి ఎలుక లోనికి వచ్చింది. పిల్లలు ఆనందంతో అరిచారు. నాతో ఎవరూ నేరుగా ప్రస్తావించలేదుగానీ, అసలు స్కూలులోనే ఏదో దోషం ఉందని పిల్లలంతా అనుకోసాగారు. సుప్రసిద్ధ అమెరికన్ కథకుడు, నవలాకారుడు డోనాల్డ్ బార్తెల్మె (1931–1989) రాసిన ‘ద స్కూల్’ కథ ఇది. 1974లో న్యూయార్కర్ లో ప్రచురించబడింది. నిరాశామయ, విధ్వంసకర ప్రపంచంలో ఇంకా ప్రేమ అనే ఆశ ఉందని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ ఇది. ముగింపు అసభ్యకరంగా ఉందని విమర్శించినవాళ్లున్నారు. అయినప్పటికీ క్లాసిక్‌గా గుర్తింపు వచ్చింది. సంక్షిప్త అనువాదం: సాక్షి సాహిత్యం డెస్క్. -
పచ్చని చెట్లతో ఆహ్లాదం
వేములవాడఅర్బన్ : వేములవాడ అర్బన్ మండలంలోని నాంపల్లిలోని శాంతినగర్ కాలనీలో 2017లో హరితహారం కార్యక్రమంలో కాలనీవాసులు కాలనీలోని సీసీ రోడ్డుకు ఇరువైపుల గన్నేరు మొక్కలను నాటుకున్నారు. ఎండాకాలంలో కూడా వాటిని ఎవరి ఇంటి ఎదుట వారు నీరు పెట్టుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ చెట్లు పెరిగి ఇప్పుడు ఆ కాలనీలో గన్నేరు పూలతో, పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కాలనీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ చెట్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఇళ్లలో చెట్లు కాదు.. చెట్ల మధ్య ఇళ్లుండాలి
సాక్షి, తిరుపతి: ‘ఇళ్లలో చెట్లు కాదు.. చెట్ల మధ్యలో ఇళ్లు ఉండాలి. ఊర్లో చెట్లు కాదు.. చెట్ల మధ్యలో ఊర్లు ఉండాలి. ఒకప్పుడు టెక్నాలజీని ప్రమోట్ చేశాను. ఇప్పుడు ప్రకృతిని ప్రమోట్ చేస్తున్నాను. మీరు తినే తిండి యూరియా. ఆ తిండితో అనారోగ్యం పాలువుతున్నారు. భూములు నిస్సారమయ్యాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఆయన అలిపిరి మార్గంలోని కపిలతీర్థం వద్ద నిర్మించిన నగర వనాన్ని ప్రారంభించి మొక్కను నాటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మహతి ఆడిటోరియానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ‘పచ్చదనం పరిశుభ్రత’ను కాంక్షిస్తూ నెహ్రూ మున్సిపల్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. మధ్యలో నెహ్రూ నగర్ వద్ద డిజిటల్ డోర్ నెంబర్లకు శ్రీకారం చుట్టారు. అనంతరం మున్సిపల్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. మెడికల్, ఎడ్యుకేషన్ హబ్‌గా తిరుపతి డిజిటల్ డోర్ నెంబర్ల వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలున్నాయని.. ప్రభుత్వ సేవలు ఏ సమయానికి ఎలా అందుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరుపతిలో అమలుచేస్తామని తెలిపారు. తిరుపతిని ఒక మెడికల్, ఎడ్యుకేషన్ హబ్‌గా తయారుచేసి దేశంలోనే నంబర్–1గా తీర్చిదిద్దుతానన్నారు. అలాగే, తిరుపతిని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాయలసీమకు కేంద్రంగా దీనిని తయారుచేస్తానన్నారు. త్వరలో తిరుమలకు ఎలక్ట్రికల్ వాహనాలు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. జపాన్‌లో ఎవరూ రోడ్లపై కాగితాలు వేయరని, ఇక్కడ మాత్రం కాగితాలు, ఇతర చెత్త ఇష్టా రాజ్యంగా వేస్తున్నారన్నారు. ప్రకృతి సేద్యంతో లాభాల పంట ప్రకృతి సేద్యం ద్వారా ఆరోగ్యంతో పాటు పంట దిగుబడి లాభాలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని అక్టోబరు 2న ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అమరనాథ్‌రెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జెడ్పీ చైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ట్రీ అంబులెన్స్
రోడ్డు ప్రమాదం జరిగినా లేదా అత్యవసర వైద్య సహాయం అవసరమైనా వెంటనే మనకు అంబులెన్స్ గుర్తుకు వస్తుంది. రోగిని ఆస్పత్రికి తరలించే లోపు ప్రాథమిక చికిత్సను అంబులెన్స్‌లో ఉన్న వైద్య సిబ్బంది అందిస్తారు. ఫలితంగా చాలా మంది రోగులు ప్రాణాప్రాయస్థితి నుంచి బయటపడిన సందర్భాలు ఉన్నాయి. అదే మొక్కలకు రోగం వస్తే? అత్యవసర చికిత్స అవసరమైతే? అందుకే ఇప్పుడు కొత్తరకం అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. అదే ట్రీ అంబులెన్స్. మొక్కలకు అవసరమైన చికిత్సలు అందించడం, వాటిని సంరక్షించడం దీని బాధ్యత. మధ్యప్రదేశ్ ఛత్తర్పూర్ జిల్లాలోని బుందేల్‌ఖండ్ రీజియన్‌లో ఈ అంబులెన్స్‌ను ఇటీవల ప్రారంభించారు. ఢిల్లీలో ఇప్పటికే ఇలాంటి అంబులెన్స్ అందుబాటులో ఉంది. ఈ అంబులెన్స్‌లో మొక్కల నిపుణుడు, సహాయ సిబ్బంది, మొక్కలు నాటడానికి అవసరమైన పరికరాలు, నీళ్లు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంటాయి. బుందేల్‌ఖండ్ రీజియన్‌లో పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షకు కృషి చేస్తున్న కొంతమంది వ్యక్తులు కలిసి సేవాలయ గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఎవరికైనా మొక్కల పెంపకంలో ఇబ్బందులు ఉంటే ఈ ట్రీ అంబులెన్స్ ద్వారా వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. పర్యావరణం పరిరక్షణ పచ్చదనం కోసం చాలామంది మొక్కలు నాటుతారు..’అయితే వాటిలో 60 నుంచి 70 శాతం మొక్కలు వివిధ రకాల జబ్బుల బారిన పడుతున్నాయి.. వీటిని ఎలా సంరక్షించాలో వారికి తెలియకపోవడం వల్ల అవి చనిపోతున్నట్లుగా తాము గుర్తించామని’ గ్రూప్ నిర్వాహకుడొకరు తెలిపారు. ఈ ట్రీ అంబులెన్స్ ద్వారా అవసరమైన సేవలను ఉచితంగానే అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రీ అంబులెన్స్‌ను కొన్నేళ్ల క్రితమే ప్రారంభించారు. వందల ఏళ్లనాటి చెట్లను రక్షించడంతో పాటు మొక్కలకు వచ్చే జబ్బుల నివారణకు ఈ ట్రీ అంబులెన్స్ ద్వారా కృషి చేస్తున్నారు. -
విరిగి పడితే ప్రమాదమే!
సత్తుపల్లి : ఖమ్మం–సత్తుపల్లి వరకు రాష్ట్రీయ రహ దారి పక్కన వందల సంఖ్యలో పెద్దపెద్ద వృక్షాలు ఎండిపోయి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి గాలిదుమారానికే విరిగి పడే పరిస్థితిలో ఆ చెట్లు ఉన్నాయి. అసలే వర్షాకాలం అయి నందున ఎప్పుడు చెట్లు పడిపోతాయోనని ప్రయా ణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలుమార్లు విరిగిపడిన చెట్లతో గంటల తరబడి ట్రాఫి క్ జామ్ అయిన సంఘటనలు ఉన్నాయి. ఈ రహదారిపై గంటకు 500లకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చిన్నపాటి అంతరా యం కలిగిన ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడా ల్సి వస్తోంది. గత వారంలో వైరా బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ జామ్ కావడంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కూలేందుకు సిద్ధంగా ఉన్న వృక్షాలు...: ∙తనికెళ్ల వద్ద ఎండిపోయిన చెట్లు విరగటానికి సిద్ధంగా ఉన్నాయి.. ∙వైరా శివారులోని పాఠశాల వద్ద చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙తల్లాడ–పినపాక సమీపంలో చెట్లు ఎండిపోయిన ఉన్నాయి. ∙తల్లాడ మండలం మిట్టపల్లి శివారులోని చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙కల్లూరు–హనుమన్తండా–కొత్తనారాయణపురం గ్రామాల మధ్య చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙పెనుబల్లి మండలం టేకులపల్లి వద్ద చెట్లు ఎండిపోయిన ఉన్నాయి. ∙వి.ఎం.బంజరు శివారులో చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙పెనుబల్లి మండాలపాడులో చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙కొత్తలంకపల్లి–కిష్టారం మధ్యలో చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ఈ విషయమై ఆర్అండ్బీ ఈఈ హేమలతను వివరణ కోరగా ఎండిపోయిన చెట్లను తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న ఎండిపోయిన చెట్లను తొలగిస్తాం. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామన్నారు. -
వైవిధ్య వనం
పెదవాల్తేరు (విశాఖతూర్పు) : మొక్కలు అందరూ పెంచుతారు. అంతరించిపోతున్న వృక్షజాతులను సంరక్షించేవారు కొందరే ఉంటారు. ఇలాంటి వారి ఆలోచనల నుంచి పుట్టిందే జీవ వైవిధ్య పార్కు. నగరంలోని పెదవాల్తేరు రాణీచంద్రమణీదేవి ఆస్పత్రి ఆవరణలోని జీవవైవిధ్య ఉద్యానవనానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అర్బన్ కార్పొరేషన్ ఈ పార్కుకు స్పెషల్జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆర్సీడీ ఆస్పత్రి ఆవరణలోని మూడు ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు విస్తరించి ఉంది. ఇక్కడ రెండువేల రకాల వృక్షజాతులను పెంచుతున్నారు. చాలావరకు అంతరించిపోతున్న వృక్షజాతులను ఇక్కడ చూడొచ్చు. వుడా, డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జీవ వైవిధ్య పార్కు పచ్చదనంతో కళకళలాడుతోంది. ఈ పార్కుకు పలురకాల వలస పక్షలు వస్తుంటాయి. ఇంకా 130 రకాల సీతాకోక చిలుకలు ముచ్చటగొలుపుతుంటాయి. సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. రామమూర్తి పర్యవేక్షణలో ఈ పార్కు దినదినప్రవర్థమానంగా వెలుగుతోంది. బోటనీ విద్యార్థులకు ఈ పార్కు ఓ ప్రయోగశాలగా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్ తరాలకు తెలియాలనే... దేశంలో దాదాపుగా 400 వరకు అంతరించిపోతున్న వృక్షజా తులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా పది జా తులుగా విభజించి మొక్కలు పెంచుతున్నారు. ఔషధ, సుగం« ద, ముళ్ల, నీటిమొక్కలు, సజీవ శిలాజం, పవిత్రవృక్షాలు, గాలిమొక్కలు, ఆర్కిడ్స్, ఎడారి మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఆకట్టుకుంటున్న గ్రీన్హౌస్ బయోడైవర్సిటీ పార్కులో గ్రీన్‌హౌస్‌ను ఒక ప్రత్యేకతగా> చెప్పుకోవచ్చు. ఇక్కడ గాల్లో తేలియాడేలా కుండీలలో మొక్కలు పెంచుతున్నారు. పలురకాల మొక్కలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఈ పార్కు చక్కని ప్రయోగశాలగా ఉపయోగపడుతోంది. వాతవరణ పరిరక్షణ, అధ్యయన, పరిశోధన, అవగాహన కార్యక్రమాలకు డాల్ఫిన్ నేచర్సొసైటీ వేదికగా నిలవడం విశేషం. నగరంలోని బయోడైవర్సిటీ పార్కుకు ప్రభుత్వ స్పెషల్జ్యూరీ అవార్డు రావడంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చెట్ల నరికివేతపై ఢిల్లీలో ఆందోళన
-
ఢిల్లీ వేదికగా మరో ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీ మరో ఉద్యమానికి వేదిక కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఎన్నో పర్యవరణ ఉద్యమాలను నిర్వహించిన చిప్కో ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమానికి సిద్ధమైంది. అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం చెపట్టిన చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే మూడు వేలకు పైగా చెట్లను నరికి వేసిందని, సరోజినీ నగర్లో మరో 16,500 చెట్లను తొలగించుటకు సిద్ధంగా ఉందని చిప్కో ఉద్యమకారుడు విక్రాంత్ తొంగాడ్ తెలిపారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీ వ్యాప్తంగా చిప్కో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ కారణంగా వాతావరణ కాలుష్యంగా మారి ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్రం చేపట్టిన ఎన్బీసీసీ కంపెనీ నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చిప్కో ఉద్యమకారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 16,500 చెట్లను నరికివేతకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చిందని, దీనికి వ్యతిరేకంగా ఆదివారం సరోజినీ నగర్లో భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం చెట్లను కౌగిలించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నట్లు పర్యవరణ ఉద్యమకారిణి చావీ మేథి తెలిపారు. దీనిపై తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ని కూడా ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. ఈ ఉద్యమానికి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. -
కనువిందు చేస్తున్న.. ఏనుగుదంతం చెట్లు
పర్లాకిమిడి : మహేంద్రతనయ వద్ద ఉన్న బృందావన ప్యాలెస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న అతి పురాతన ఏనుగుదంతం చెట్లు చూపరులు, వ్యాయామానికి వెళ్లే పాదచారులకు కనువిందు చేస్తున్నాయి. అప్పట్లో కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ జమిందారీ హయాంలో ఈ ఏనుగుదంతం మొక్కలను బీఎన్.ప్యాలెస్ రోడ్డుకు ఇరువైపులా నాటించారు. 160 ఏళ్లకు పైగానే ఈ చెట్లు జీవించాయి. ప్రపంచంలో అతి ఎక్కువ కాలం జీవించే చెట్టు ఇదే. ఈ చెట్టుకు కాయలు కాస్తాయి. వాటిలో పుష్కలంగా విటమిన్స్, ఐరన్ ఉంటాయి. ఈ కాయల్లో లభించే పప్పు అతి ఎక్కువగా తినరాదని బొటానికల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో కొన్ని చెట్లు నేలకొరగగా మరికొన్ని చెట్లు ఇప్పుటికీ జీవించేఉన్నాయి. రాజావారి కోట ఎడమ వైపున సంస్థానం గుర్రపుశాల ప్రాంగణంలో కూడా ఏనుగుదంతం చెట్లు ఉన్నాయి. ఎటువంటి గాలివానలనైనా తట్టుకుని నిలబడే ఈ చెట్లు భూమిలో చాలా మీటర్ల లోతుకు వీటి వేర్లు పాతుకుపోతాయి. పాదచారులకు నీడనివ్వడమే కాకుండా కాయలు కూడా ఇస్తున్నాయి. బృందావనం ప్యాలెస్‌లో ఇలాంటి అరుదైన చెట్లు పదులకొద్దీ ఉన్నాయి. వాటి ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో కొందరు దుండగులు చెట్లను నరికి తీసుకుపోతున్నారు. బృందావనం ప్యాలెస్ చుట్టూ ఇప్పుడిప్పుడే కంచె వేయడంతో చెట్ల నరికివేతను కొంతవరకు అరికడుతున్నారు. ప్రస్తుతం టూరిస్టులకు, ఒడియా చలనచిత్ర దర్శక నిర్మాతలను షూటింగ్‌ల నిమిత్తం బృందావన ప్యాలెస్‌లోకి అనుమతిస్తున్నారు. -
నవ దంపతుల వినూత్న ఆలోచన
తమిళనాడు, పళ్లిపట్టు: వారిద్దరూ నవదంపతులు.. కల్యాణ వేదిక సాక్షిగా తమను ఆశీర్వదించేందుకు వచ్చిన వారికి మొక్కలు పెంపకంపై అవగాహన కల్పించారు. తిరుత్తణి గాంధీరోడ్డు మార్గం వీధిలో నివాశముంటున్న వినాయకం అన్నాడీఎంకే కార్యకర్త. చిన్న వయస్సు నుంచే సమాజ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గనేవారు. ఐదుగురు తోబుట్టువులు, అక్క చెళ్లెలు ఉండడంతో ఆలస్యంగా వివాహం కుదిరింది. నాలుగు రోజుల కిందట సుందరవల్లితో వివాహం జరిగింది. తమ కల్యాణోత్సవం ద్వారా ప్రజలకు మంచి విషయం చెప్పాలని వినాయకం నిర్ణయించుకున్నారు. అదేతడవుగా వేదికపైన నవ దంపతులను ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులకు ‘మెక్కలు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం’ అని రాసిన బ్యాగ్‌లను అందజేశారు. వేడుకకు హాజరైన ఎమ్మెల్యే నరసింహన్ వారి ఆలోచనను ప్రోత్సహించి సత్కరించారు. వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం సైతం శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. -
ఇక్కడ ఆడపిల్ల పుడితే మొక్కలు నాటుతారు.!
జైపూర్: ఆడపిల్ల పుడితే చాలు అన్నీ బాధలే అనుకునే సమాజం ఇది. ఆడశిశువును చెత్తబుట్టల్లో పడేసే కర్కశులూ లేకపోలేరు. భ్రూణ హత్యలకు పాల్పడే మూర్ఖులు చాలా మంది నేటి సమాజంలో ఉన్నారు. కానీ ఓ గ్రామం మాత్రం వీటికి దూరంగా ఉంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ ఆడపిల్ల జన్మిస్తే అక్కున చేర్చుకుంటారు. ఊరంతా కలిసి పండుగ జరుపుతారు. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు. ఇలా నాటిన ప్రతి మొక్కని కన్న బిడ్డలా చూసుకుంటారు. ఇంత గొప్ప పనికి శ్రీకారం చుట్టింది రాజస్థాన్‌లోని పిప్లాన్‌ట్రీ అనే గ్రామం. ఇటు స్త్రీ నిష్పత్తిని పెంచుతూ.. అటూ పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నారు సదరు గ్రామస్తులు. ఇంత గొప్ప ఆచారాన్ని గత 11 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఓ వైపు సమాజంలో ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. చాలా చోట్ల వెయ్యి మంది పురుషులకు 985 మంది స్త్రీలే ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో పిప్లాన్‌ట్రీ గ్రామస్తులు చేస్తున్న కార్యక్రమం నిజంగా సమాజానికి మేల్కొలుపు లాంటిదే. ఇటీవల ఆ గ్రామంపై ఓ ఆంగ్ల వార్తా సంస్థ డ్యాక్యుమెంటరీ రూపొందించి ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆ గ్రామ ప్రజలు నాటిన మొక్కలు, వారు మొక్కలపై తీసుకుంటున్న శ్రద్ధను తెలియజేశారు. ఆడశిశువు జన్మను ప్రొత్సహిస్తూ, పర్యావరణాన్ని సంరక్షిస్తూ పిప్లాన్‌ట్రీ గ్రామస్తులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఆడపిల్ల పుడితే ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు
-
వేర్వేరు ప్రాంతాల్లో చెట్లు దగ్ధం
కొండాపురం: గుర్తుతెలియని ఆకతాయిలు చేసిన పనికి మండలంలోని సత్యవోలు పంచాయతీ లింగనపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు వెంబడి ఉన్న జామయిల్, టేకు, మామిడి, తాటి చెట్లు దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఆకతాయిలు నిప్పు వేయండంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న కర్రతుమ్మ, తాటి చెట్లు సుమారు 1.50 కిలోమీటర్ వరకు పూర్తిగా బూడిదయ్యాయి. అలాగే జామయిల్, మామిడి, టేకు చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. వింజమూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. నిమ్మతోట వింజమూరు: స్థానిక బీసీకాలనీకి చెందిన లక్కు రమణయ్య అనే వ్యక్తి నిమ్మతోట ఆదివారం అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని బాధితుడు తెలిపారు. తోటలోని డ్రిప్‌పైపులు, స్టార్టరు, 20 నిమ్మ చెట్లు కాలిపోయాయి. చుట్టుపక్కల పొలాల్లోని కూలీలు గుర్తించి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.50,000 ఆస్తి నష్టం వాటినిట్లు బాధితుడు తెలిపాడు. మామిడి తోట సీతారామపురం: మండలంలోని నాగరాజుపల్లిలో 15 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎస్.రమాదేవి. పి.పిచ్చమ్మ, కె.సుబ్బమ్మ, ఎన్.రత్తమ్మ, ఎం.రత్తమ్మ, పి.పెదవెంగమ్మకు 2.50 ఎకరాల చొప్పున భూమిని ఏడు సంత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసింది. హార్టికల్చర్ కింద వారు మామిడి మొక్కలు నాటారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు వేయడంతో మామిడితోట దగ్ధమైంది. రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. జామాయిల్ తోట అనుమసముద్రంపేట(ఆత్మకూరు): ఆత్మకూరు మున్సిపాలిటీలోని నెల్లూరుపాళెం విజయా డెయిరీ సమీపంలో ఆదివారం జామాయిల్ తోట దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. డెయిరీకి సమీపంలో ఆత్మకూరుకు చెందిన మన్నెం సుబ్బారెడ్డి, డాక్టర్ వసుందరమ్మలు సుమారు 75 ఎకరాల్లో జామాయిల్ వేశారు. ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సుమారు 15 ఎకరాల్లో జామాయిల్ దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక అధికారులు పి.సుధాకరయ్య, కె.పెంచలయ్య, ఖాజామొహిద్దీన్ తదితరులు పాల్గొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
‘చెట్టు’పట్టాల్ వేసుకోవిక్కడ..
ఏంరోయ్.. దగ్గరకు వస్తున్నావు.. నన్ను ముట్టుకోవద్దన్నానా.. చల్.. అలా జరుగు.. దూరంగా ఉండు.. డోంట్ టచ్.. ఇది మన వాయిస్ కాదు.. ఈ చెట్ల ఇన్నర్ వాయిస్! వీటిపై ఓసారి లుక్కేసుకోండి. విషయం మీకే తెలుస్తుంది.. రేవులో తాటిచెట్టులా అంతెత్తున పెరిగాయి. కానీ ఎక్కడన్నా టచ్ అయ్యాయా? పై భాగంలో ఉన్న వాటి ఆకులు, కొమ్మలు అన్నిటి మధ్య అంతరం ఉంది గమనించారా.. కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని రకాల వృక్ష జాతుల్లో.. ముఖ్యంగా ఒకే ఎత్తు ఉన్నవాటిల్లో ఈ చిత్రమైన విషయాన్ని మనం గమనించొచ్చు. కొన్నిసార్లు వేర్వేరు వృక్ష జాతుల్లోనూ ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని ‘క్రౌన్ షైనెస్’అంటారు. ఇలా జరగడం వెనకున్న అసలైన కారణం పూర్తిగా తెలియనప్పటికీ.. తుపానులు లేదా బలమైన గాలులు వీచినప్పుడు ఈ చెట్ల కొమ్మలు ఒకదాన్ని ఒకటి ఢీకొని.. విరిగిపోవడం జరుగుతుందని.. తద్వారా ఆ గ్యాప్ ఏర్పడుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ తరహా పరిణామం చోటుచేసుకుంటున్న వృక్ష జాతులను పరిశీలిస్తే.. అవి బాగా ఎదిగిన తర్వాతే.. అంటే.. గాలికి ముందుకు వెనక్కు ఊగే స్థాయికి చేరుకున్నప్పుడే ఇలా జరుగుతోందని.. చిన్నగా ఉన్నప్పుడు తొలి దశల్లో ఈ ‘క్రౌన్ షైనెస్’ఉండటం లేదని పేర్కొంటున్నారు. ఇంక కొంతమందైతే.. ఆకులను తినే లార్వా మరింత ప్రబలకుండా ఉండేందుకు ఆయా చెట్లే సహజసిద్ధంగా తమ విస్తృతిని పరిమితం చేసుకుంటాయని చెబుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి వృక్ష జాతులు ఉన్న ప్రాంతాలు చాలా పరిమితంగా ఉన్నాయి. అందులో ఒకటి కౌలాలంపూర్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ చిత్రం అక్కడిదే. ఈ వృక్షాలు కర్పూరం చెట్లలో ఒక రకానికి చెందినవి. ఇవి ఒకదాన్ని ఒకటి ముట్టుకోవడానికి అస్సలు ఒప్పుకోవట. – సాక్షి, తెలంగాణ డెస్క్