మనం ఎన్నో రకాల చెట్లను చూసుంటాం. అందులో పొట్టివిగా, పొడవుగా ఏవైనా కావచ్చు. కానీ ఈ వింతరకమైనా చెట్లను ఎప్పుడైనా చూశారా! అచ్చం గజస్తంభాలను పోలిన విధంగా ఉన్నాయి. ఒంటె మెడలలాగా పొడవుగా, ఏనుడు ఆకారంలో భారీగా ఉన్నాయి. అవేంటో చూసేయండి!
నిలువునా స్తంభాల్లా పెరిగే ఈ చెట్లను బేయబాబ్ చెట్లు అని అంటారు. ఇవి ఎక్కువగా మడగాస్కర్‌లోను, అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. బేయబాబ్ చెట్లలో తొమ్మిది రకాలు ఉంటే, వాటిలో ఆరు రకాలు కేవలం మడగాస్కర్‌లో మాత్రమే కనిపిస్తాయి.
మిగిలిన వాటిలో రెండు రకాలు అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, మరో రకం ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. వీటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇవి నిట్ట నిలువుగా పెరుగుతాయి. కాండానికి చిట్టచివర మాత్రమే కొమ్మలు ఉంటాయి. ఈ చెట్లు ఒంటెల్లాంటివి. వీటి కాండం చుట్టుకొలత 23 అడుగుల నుంచి 36 అడుగుల వరకు ఉంటుంది.
ఆకురాలే కాలంలో కూడా ఈ చెట్లు తమ కాండంలో లీటర్ల కొద్ది నీటిని నిల్వ ఉంచు కుంటాయి. ఈ చెట్లు వెయ్యేళ్ల నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్ది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో బేయబాబ్ చెట్లు పెద్ద సంఖ్యలో మరణించాయి. అయితే, అవి చీడపీడల వల్ల కాకుండా, నీటి కొరత కారణంగానే మరణించినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.
ఇవి చదవండి: తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా!
Comments
Please login to add a commentAdd a comment