
అంత్యక్రియలు నిర్వహించే అంశంపై కోర్సులు అందిస్తోంది ఈ విచిత్రమైన కాలేజీ. ఇది అమెరికాలోని అట్లాంటాలో ఉంది. అంత్యక్రియల సమయంలో పాటించవలసిన ఆచారాలు, అంత్యక్రియలు నిర్వహించే పద్ధతులు, అంత్యక్రియల్లో పాల్గొనేటప్పుడు పాటించవలసిన మర్యాదలు తదితర అంశాలను ఈ కోర్సుల్లో బోధిస్తోంది.
‘గుప్టన్ జోన్స్ కాలేజ్ ఆఫ్ ఫ్యూనరల్ సర్వీస్’ వంటి కాలేజీ మరెక్కడా లేదు. ఇది క్యాంపస్ విద్యార్థుల కోసం అసోసియేట్ ఆఫ్ సైన్స్, అసోసియేట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ కోర్సులను అందిస్తోంది. అసోసియేట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ కోర్సును దూరవిద్యా విధానం ద్వారా కూడా అందిస్తోంది. శవయాత్రల కోసం వాహనాల సేవలు, ఇతర సేవలు అందించే వారికి ఉపయోగపడటమే కాకుండా, అంత్యక్రియల నిర్వహణకు సంబంధించిన వ్యాపారాలను స్వయంగా ఏర్పాటు చేసుకునే వారికి కూడా ఉపయోగపడేలా ఈ కోర్సులను తీర్చిదిద్దినట్లు ఈ యూనివర్సిటీ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment