Arabian camel
-
ఒంటెల్లాంటి చెట్లు! ఇవి కేవలం అక్కడ మాత్రమే..
మనం ఎన్నో రకాల చెట్లను చూసుంటాం. అందులో పొట్టివిగా, పొడవుగా ఏవైనా కావచ్చు. కానీ ఈ వింతరకమైనా చెట్లను ఎప్పుడైనా చూశారా! అచ్చం గజస్తంభాలను పోలిన విధంగా ఉన్నాయి. ఒంటె మెడలలాగా పొడవుగా, ఏనుడు ఆకారంలో భారీగా ఉన్నాయి. అవేంటో చూసేయండి!నిలువునా స్తంభాల్లా పెరిగే ఈ చెట్లను బేయబాబ్ చెట్లు అని అంటారు. ఇవి ఎక్కువగా మడగాస్కర్లోను, అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. బేయబాబ్ చెట్లలో తొమ్మిది రకాలు ఉంటే, వాటిలో ఆరు రకాలు కేవలం మడగాస్కర్లో మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన వాటిలో రెండు రకాలు అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, మరో రకం ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. వీటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇవి నిట్ట నిలువుగా పెరుగుతాయి. కాండానికి చిట్టచివర మాత్రమే కొమ్మలు ఉంటాయి. ఈ చెట్లు ఒంటెల్లాంటివి. వీటి కాండం చుట్టుకొలత 23 అడుగుల నుంచి 36 అడుగుల వరకు ఉంటుంది.ఆకురాలే కాలంలో కూడా ఈ చెట్లు తమ కాండంలో లీటర్ల కొద్ది నీటిని నిల్వ ఉంచు కుంటాయి. ఈ చెట్లు వెయ్యేళ్ల నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్ది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో బేయబాబ్ చెట్లు పెద్ద సంఖ్యలో మరణించాయి. అయితే, అవి చీడపీడల వల్ల కాకుండా, నీటి కొరత కారణంగానే మరణించినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.ఇవి చదవండి: తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా! -
ఒంటె మూపురంలో ఏముంటుంది?
జంతుప్రపంచం అరేబియన్ ఒంటెలకు ఒకటే మూపురం ఉంటుంది కానీ ఆసియా ఒంటెలకు రెండు మూపురాలు ఉంటాయి! ఒంటె తన మూపురంలో నీటిని దాచుకుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇవి మూపురంలో కొవ్వును దాచుకుంటాయి ఒంటెలు. శరీరంలోని కొవ్వు అంతా మూపురంలోకి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. దానివల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. అందుకే ఎడారుల్లాంటి వేడి ప్రదేశాల్లో తిరిగినా, మంచి నీరు లేకపోయినా ఇవి ఏ ఇబ్బందీ లేకుండా జీవిస్తాయి! * నీళ్లు లేకపోయినా ఇవి చాలా రోజులు ఉండగలవు. అయితే నీళ్లు దొరికాయంటే మాత్రం ఒక్కసారి నలభై గ్యాలన్లు ఆపకుండా తాగేస్తాయి! * ఒంటెల కనుగుడ్లకు, కను రెప్పలకు మధ్య ఒక సన్నని పొరలాంటిది ఉంటుంది. ఎడారుల్లో తిరిగినప్పుడు ఇసుక కళ్లలో పడకుండా ఈ పొరే కాపాడుతుంటుంది! వీటి నోటి లోపలి భాగాలు ఎంత దృఢంగా ఉంటాయంటే... ముళ్ల చెట్లను, కాయలను తిన్నాసరే, చిన్న గాయం కూడా అవ్వదు! * ఇసుక, దుమ్ము రేగినప్పుడు తమ నాసికారంధ్రాలను మూసుకోగలిగే శక్తి ఒంటెలకు ఉంది! * ఆవుపాలలో కంటే ఒంటె పాలలో కొవ్వు, చక్కెర శాతం తక్కువగా ఉంటాయి. అయితే ఇవి తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి చాలా చిక్కగా ఉండటం వల్ల కడుపులో తిప్పడం, వాంతులు అవ్వడం జరగవచ్చు! * వీటికి చెమట అంత త్వరగా పట్టదు. పట్టాలంటే ఉష్ణోగ్రత నలభయ్యొక్క డిగ్రీలు దాటాల్సిందే! * ఇవి నీళ్లు లేని ప్రదేశాల్లో జీవిస్తాయి. అయినా వీటికి ఈత ఎలా వస్తుందో తెలియదు కానీ... అద్భుతంగా ఈదగలవు!