Madagascar
-
ఒంటెల్లాంటి చెట్లు! ఇవి కేవలం అక్కడ మాత్రమే..
మనం ఎన్నో రకాల చెట్లను చూసుంటాం. అందులో పొట్టివిగా, పొడవుగా ఏవైనా కావచ్చు. కానీ ఈ వింతరకమైనా చెట్లను ఎప్పుడైనా చూశారా! అచ్చం గజస్తంభాలను పోలిన విధంగా ఉన్నాయి. ఒంటె మెడలలాగా పొడవుగా, ఏనుడు ఆకారంలో భారీగా ఉన్నాయి. అవేంటో చూసేయండి!నిలువునా స్తంభాల్లా పెరిగే ఈ చెట్లను బేయబాబ్ చెట్లు అని అంటారు. ఇవి ఎక్కువగా మడగాస్కర్లోను, అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. బేయబాబ్ చెట్లలో తొమ్మిది రకాలు ఉంటే, వాటిలో ఆరు రకాలు కేవలం మడగాస్కర్‌లో మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన వాటిలో రెండు రకాలు అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, మరో రకం ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. వీటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇవి నిట్ట నిలువుగా పెరుగుతాయి. కాండానికి చిట్టచివర మాత్రమే కొమ్మలు ఉంటాయి. ఈ చెట్లు ఒంటెల్లాంటివి. వీటి కాండం చుట్టుకొలత 23 అడుగుల నుంచి 36 అడుగుల వరకు ఉంటుంది.ఆకురాలే కాలంలో కూడా ఈ చెట్లు తమ కాండంలో లీటర్ల కొద్ది నీటిని నిల్వ ఉంచు కుంటాయి. ఈ చెట్లు వెయ్యేళ్ల నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్ది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో బేయబాబ్ చెట్లు పెద్ద సంఖ్యలో మరణించాయి. అయితే, అవి చీడపీడల వల్ల కాకుండా, నీటి కొరత కారణంగానే మరణించినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.ఇవి చదవండి: తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా! -
మడగాస్కర్ స్టేడియంలో తొక్కిసలాట.. 13 మంది మృతి
అంటాననరివో: మడగాస్కర్ రాజధాని అంటనానారివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 13 మంది మరణించగా 107 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారని రెడ్‌క్రాస్ తెలిపింది. రెడ్‌క్రాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్బంగా కనీసం 50,000 మంది బారే స్టేడియానికి తరలిరాగా ఎంట్రన్స్ వద్దే ఈ తొక్కిసలాట జరిగింది. ఒకేసారి జనం ఎంట్రన్స్ వద్దకు దూసుకు రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని రెడ్ క్రాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ సమయంలో ప్రారంభోత్సవాలకు హాజరై అక్కడే ఉన్న మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రజోఎలినా అక్కడే మౌనం పాటించాలని కోరారు. సంఘటన తర్వాత స్టేడియంలో ఎక్కడ చూసినా జనం తనవారి కోసం తమ వస్తువుల కొసం వెతుకులాడుతున్న దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఈ దారుణానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు కానీ మృతుల సంఖ్య మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని రెడ్‌క్రాస్ తెలిపింది. 40 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రతి నాలుగేళ్లకు హిందూ మహాసముద్రం పరిసర ద్వీపాల్లో ఒక్కోసారి ఒక్కో ద్వీపంలో నిర్వహిస్తూ ఉన్నారు. గత పర్యాయం ఈ గేమ్స్ మారిషస్‌లో జరగ్గా ఈ సారి వీటిని మడగాస్కర్‌లో నిర్వహించ తలపెట్టారు నిర్వాహకులు. మడగాస్కర్ స్టేడియానికి విషాదాలు కొత్తేమీ కాదు. 2019లో ఇదే స్టేడియంలో జాతీయ సెలవు రోజున ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆరోజు జరిగిన తొక్కిసలాటలో 16 మంది మృతి చెందారు అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అంతకుముందు 2016లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు చనిపోయారు. #Breaking | At least 12 people die in a stampede at a stadium in Antananarivo, capital of Madagascar - Prime Minister Christian Ntsay Follow @aliifil1 for More UPDATES pic.twitter.com/AZDRDvRHI4 — Breaking news 24/7 (@aliifil1) August 25, 2023 ఇది కూడా చదవండి: మలుపుతిప్పిన చంద్రయాన్-3.. ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం -
తీర ప్రాంతంలో విషాదం.. 34 మంది జలసమాధి
ఆంటనానారివో(మడగాస్కర్): బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులు ప్రమాదవశాత్తు జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్ దేశంలోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరారు. మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపం సమీపంలో హిందూ సముద్రజలాల్లో పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు కాపాడారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్‌లో కంటే మయోటేలో జీవనం కాస్త మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని అధికారులు చెప్పారు. -
మంత్రికి సంతాపం.. కొన్ని గంటలకే చిరంజీవిగా అదే మంత్రి!!
మడగాస్కర్: హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో మడగాస్కర్ దేశ మంత్రి సెర్జ్ గెలె ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన సాహసంతో సుమారు 12గంటల పాటు పోరాడి సముద్రంలో ఈదుకుంటూ బయటపడ్డారు. తాను మరణించలేదని బతికే ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం ఐలాండ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ మునక ప్రమాదంలో 39మంది చనిపోయిట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి మంత్రి బృందం అక్కడికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో ఉన్న మంత్రితో పాటు మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన పట్ల దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రితో పాటు మిగతా ఇద్దరు అధికారులు మరణించారని ఆయన నివాళులు అర్పించారు. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతమైన మహాంబోకు చేరుకున్నారు. హెలికాప్టర్ కూలిపోవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత తాను రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు సముద్రంలో ఈదుకుంటూ వచ్చినట్లు మంత్రి గెలె తెలిపారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బతికే ఉన్నానని మహాంబో గ్రామస్తులకు చెప్పారు. ఆయన హెలికాప్టర్‌లోని ఒక సీటును సుముద్రం నీటిపై తేలడానికి ఉపయోగించుకున్నారని పోలీస్ చీఫ్ జఫిసంబత్రా రావోవీ పేర్కొన్నారు. ఆయన క్రీడల్లో ఎల్లప్పుడూ గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించేవారని, 30 ఏళ్ల వ్యక్తిలా బతకడానికి పోరాడారని రావోవీ ప్రశంసించారు. -
మాస్కు పెట్టుకుంటారా? చీపురు పట్టుకుంటారా?
కరోనా వైరస్ పుణ్యమాని మనుషుల మధ్య దూరం పెరిగింది. ముఖం కూడా సరిగా కనిపించకుండా మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పొరపాటున మాస్కు లేకుండా వెళ్లామో.. జేబుకు చిల్లు పడక తప్పదు, లేదా పోలీసుల చేతిలో చీవాట్లు తప్పవు. అయితే ఓ దేశం మాత్రం తప్పు చేసినవారికే బుద్ధి వచ్చేలా తగిన గుణపాఠం చెబుతోంది. అందుకోసం బలవంతంగా వారితో రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమానికి పూనుకుంది. వివరాల్లోకి వెళితే.. మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజొలీనా కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశంలోని పలు నగరాల్లో ఫేస్ మాస్కు ధరించడం తప్పనిసరి చేశాడు. ఈ కొత్త నిబంధన సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ కొంతమంది ఈ మాటలను పెడచెవిన పెట్టి దర్జాగా రోడ్ల మీదకు వచ్చారు. (కరోనా: 189 మంది వలస కార్మికుల మృతి) ఇంకేముందీ పోలీసులు వారిని రౌండప్ చేసి చేతికి చీపురిచ్చారు. "మమ్మల్ని వదిలేయండి, ఇంకోసారి మాస్కు లేకుండా బయటకు రాబోమ"ని చెప్పినప్పటికీ వదల్లేదు. దీంతో చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుంటూ భారంగా ఓ నిట్టూర్పు వదులుతూ రోడ్లపై ఊడ్చే కార్యక్రమానికి దిగారు. ఇలా ఒకరిద్దరికి కాదు.. 25 మందికి దుమ్ము దులిపే శిక్షను విధించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా వుండగా ఈ దేశంలో ఇప్పటివరకు 128 కరోనా వైరస్ కేసులు నమోదవగా 75 మంది కోలుకున్నారు. ఇంతవరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. (సముద్ర వీరుల ప్రపంచ రికార్డు) -
మృత్యువుతో పందెం వేసుకోవడమే!
అట్లాంటిక్ సముద్రంలో ఆ రూటు అత్యంత ప్రమాదకరమైనది. జలాలు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటాయి. 40 అడుగుల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగిసి పడుతుంటాయి. తుపాన్లు తరచుగా వస్తుంటాయి. పెద్ద పెద్ద సొరచేపలు ఆవురావురుమంటూ నరమాంసం కోసం తిరుగుతూ ఉంటాయి. చిన్న మర పడవలను కూడా బోల్తా కొట్టేంచే శక్తి వాటి సొంతం. ఆకాశాన చుక్కలు కూడా లేని చిమ్మ చీకటిలో అణు క్షణం ఈ ప్రమాదాలు ఎదుర్కొవాలి. అదే రూటులో తరచుగా వచ్చే పెద్ద సరకు రవాణా ఓడల బారిన పడకుండా తప్పించుకోవాలి. మర పడవ కాకుండా రోయింగ్ పడవలో ప్రయాణం చేయడమంటే సాహసం చేయడం కాదు, ప్రాణాలను పణంగా పెట్టడం. తెడ్ల వేసుకుంటూ మూడువేల మైళ్లు ప్రయాణించడమంటే మృత్యువుతో పందెం వేసుకోవడమే! అలా ముగ్గురు సోదరులు ఎవాన్ 27, జమీ 26, లచ్లాన్ 21 కలిసి డిసెంబర్ 12వ తేదీన ఈ సాహసానికి ఒడిగట్టారు. దాదాపు ఐదు లక్షల రూపాయలు విలువైన 28 అడుగుల రోయింగ్ (తెడ్లతో నడిపే) పడవలో అట్లాంటిక్ సముద్రంలో కానరీ దీవుల్లోని లా గొమెరా నుంచి మూడు వేల మైళ్ల దూరంలోని కరీబియన్‌లోని ఆంటిగ్వా నెల్సన్స్ హార్బర్‌కు గురువారం చేరుకున్నారు. ఇందుకు వారికి సరిగ్గా 35 రోజుల, తొమ్మిది గంటల, తొమ్మిది నిమిషాలు పట్టింది. ముగ్గురు సోదరులకు ప్రయాణంలో ‘సీ సిక్నెస్’ వచ్చింది. ఒంటి నిండా కురుపులు, దద్దులు లేచాయి. వాటికి ఎప్పటికప్పుడు యాంటీ బయాటిక్స్ పూసుకుంటూ, నిద్రలేమి రాత్రులు గడుపుతూ వారు ఈ సాహసాన్ని పూర్తి చేశారు. ఏ సాహసం చేయాలన్నా అందుకు ఓ లక్ష్యం ఉండాలి. అందుకని ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతూనే ప్రపంచంలో దారిద్య్రాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్న ‘ఫీడ్‌బ్యాక్ మడగాస్కర్’తో పాటు ‘చిల్డ్రన్ ఫస్ట్’ చారిటీ సంస్థకు రెండున్నర కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆర్జించేందుకు వారు కొత్త ప్రపంచ రికార్డును సష్టించారు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్టలేదట. స్వతహాగా అన్నదమ్ములం అవడం వల్ల ఆ అనుబంధం, పరస్పర స్ఫూర్తితో ఈ విజయాన్ని సాధించామని, ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని వారు తమదైన శైలిలో చెప్పారు. -
ఇది మొసళ్లకే రాజానా!
మొసలి లాంటి శరీరం.. రాక్షస బల్లుల సైజులో దేహం.. కోటానుకోట్ల ఏళ్ల క్రితం ఆఫ్రికా ఖండం పక్కనే ఉన్న మడగాస్కర్ ప్రాంతంలో తిరిగిన భయంకర జీవి వర్ణన ఇది. ‘రాజానా’అని ముద్దుగా పిలుస్తున్న ఈ జీవి ఏకంగా 23 అడుగుల పొడవు ఉండేదని, వెయ్యి కిలోల బరువు తూగేదని.. ఇటలీకి చెందిన పాలియంటాలజిస్ట్ట్ క్రిస్టియానో డాల్ సాసో అంటున్నారు. రాజానా అవశేషాలు ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే బయటపడ్డాయి. అయితే వీటిని కొంతమంది వ్యక్తులు తమ అధీనంలో ఉంచుకోవడంతో ఇప్పటివరకూ విశ్లేషించడం సాధ్యం కాలేదు. రాక్షస బల్లుల మాదిరే రాజానా కూడా ఇతర జంతువులను వేటాడేదని, దీని ఒక్కో పన్ను దాదాపు 15 సెంటీమీటర్ల పొడవు ఉంటుండేదని క్రిస్టియానో అంటున్నారు. పుర్రె ఎముకలను బట్టి దీని శరీర నిర్మాణం ఇప్పటి మొసళ్ల కంటే భిన్నంగా ఉందని, హైనా మాదిరిగా ఇది కూడా జిత్తులమారి జంతువయ్యేందుకు అవకాశముందని వివరించారు. వేగంగా పరుగెత్తే సామర్థ్యం లేకపోయినప్పటికీ కాపుకాచి వేటాడటం, లేదా ఇతర జంతువులు వేటాడి వదిలేసిన ఆహారాన్ని తీసుకునేదని అంచనా వేస్తున్నారు. రాక్షస బల్లుల తరహాలోనే భారీ జంతువైన రాజానా సుమారు 17 కోట్ల ఏళ్ల క్రితం భూమ్మీద మనుగడ సాగించిందని అంచనా. -
మడగాస్కర్‌లో ప్రమాదం... 47 మంది మృతి
అంటనానారివో: మడగాస్కర్‌లో ఆదివారం ఓ పెళ్లి వాహనం ప్రమాదవశాత్తూ నదిలో పడింది. ఈ ప్రమాదంలో నూతన వధూవరులు, 10 మంది చిన్నారులు సహా 47 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాజధానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ జోజొరోబ్ పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు చెప్పారు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. -
దెయ్యం పామును ఎప్పుడైనా చూశారా?
న్యూయార్క్: సాధారణంగా పాములంటేనే భయపడతాం. అలాంటిది దెయ్యం పాము ఎదురుపడితే...? ఇంకేముందీ.. అది కాటేయకముందే ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. ఇంతకీ దెయ్యం పాములు కూడా ఉంటాయా..? ఇదే ప్రశ్న శాస్త్రవేత్తలను అడిగితే.. ఇదిగో ఇక్కడ కనిపించే ఫొటో చూపిస్తూ.. ఇదే దెయ్యం పాము అని చెబుతున్నారు. ఇప్పటికే వేల రకాల పాములను గుర్తించిన శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని మడగాస్కర్ అడవుల్లోగల అంకారానా నేషనల్ పార్కులో ఈ పామును గుర్తించారట. బూడిద రంగులో ఉండి.. మిగతా పాములతో పోలిస్తే భిన్నమైన చారలతో చూడ్డానికి అతి భయంకరంగా ఉందట. దీని శరీరంపై నిలువు చారలుండడం దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. దీని కణజాలాన్ని సేకరించడంతోపాటు డీఎన్ఏ పరీక్షలు చేయగా ఇది ప్రత్యేకమైన జాతికి చెందిన పాము అని, ఇలాంటివి సాయంత్రం, రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తాయని చెప్పారు. ఈ లక్షణం ఉన్నందునే దీనికి ‘గోస్ట్ స్నేక్’(దెయ్యం పాము) అని పేరు పెట్టామంటున్నారు. -
ట్యాక్సీలోకి చొరబడి 31మంది హత్య
అంటాననారివో: మడగాస్కర్‌లో దారుణం చోటుచేసుకుంది. 31మంది ప్రయాణీకులను బందిపోట్లు అతి దారుణంగా హత్య చేశారు. ప్రయాణిస్తున్న వారిని దారి మధ్యలో అడ్డుకొని ఈ ఒళ్లుగగుర్పొడిచే సంఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బుష్ ట్యాక్సీలో తోలియారా అనే ప్రాంతం నుంచి బెరోరోహ అనే ప్రాంతానికి 32మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తుండగా ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా 20మంది బందిపోట్లు రోడ్డు మధ్యలో అడ్డంకి సృష్టించారు. అయితే, వారిని తప్పించేందుకు డ్రైవర్ శతవిధాల ప్రయత్నించినప్పటికీ వారు తుపాకీతో ముందు టైరు పేల్చి వాహనాన్ని నిలిపేశారు. అనంతరం అందులోకి చొరబడి అత్యంత పాశవికంగా హత్య చేశారు. చనిపోయినవారిలో పదిమంది చిన్నారులు కూడా ఉన్నారు. ఒకే ఒక్కరు తీవ్రంగా గాయాలపాలై కొన ఊపిరితో ఉన్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. -
ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువుండాలని..
ఆంట్యానెన్యారివొ: 17 ఏళ్ల యువతి జెన్నీ(పేరు మార్చాం)కి ఫేస్బుక్లో ఎక్కువ మంది మిత్రులుండాలని కోరిక. ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వారి సంఖ్య 310. ఎలాగైనా ఇంకా ఎక్కువ మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉండాలని భావించి.. అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది. అంతే కిడ్నాప్‌కు గురై రెండు నెలలపాటు లైంగికదాడిని ఎదుర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్రికాలోని మడగాస్కర్కు చెందిన జెన్నీ ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి చేతిలో కిడ్నాప్‌కు గురైంది. ఫేస్బుక్లో ఆరునెలల పాటు చాటింగ్ చేసిన 28 ఏళ్ల వ్యక్తి కలుద్దామని చెప్తే నమ్మి వెళ్లి.. అతని ఇంట్లో బందీగా మారింది. రెండు నెలల పాటు తీవ్రమైన లైంగిక దాడిని ఎదుర్కొంది. బందించిన అనంతరం రెండు వారాల పాటు స్పృహలోనే లేకుండా ఆమెకు డ్రగ్స్ ఎక్కించాడు నిందితుడు. తరువాత సైతం తప్పించుకోవాలని చూసిన ప్రతీసారీ మత్తుపదార్థాలను ఆమెపై ప్రయోగించి అణచివేశాడు. నిందితుడి పొరుగింటి వారు జెన్నీని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అతడి బండారం బయటపడింది. పోలీసులు నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం కేసులను నమోదు చేశారు. ప్రస్తుతం జెన్నీ కోలుకుంటున్నా.. మితిమీరిన డ్రగ్స్ ప్రయోగించడం వల్ల ఆమె జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎక్కువ మంది ఉండాలన్న తన కోరికే తన ఈ స్థితికి కారణమని జెన్నీ పోలీసుల వద్ద వాపోయింది. -
మడగాస్కర్
ప్రపంచవీక్షణం నైసర్గిక స్వరూపం వైశాల్యం : 5,87,041 చదరపు కిలోమీటర్లు జనాభా : 2,37,52,887 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని : అంటనానారివో కరెన్సీ : మలగాసీ అరియారీ ప్రభుత్వం : యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ భాషలు : అధికార భాష-మలగాసీ, ఫ్రెంచ్ భాషలు మతం : {Mైస్తవులు 40 శాతం, ముస్లిములు 7 శాతం, షెడ్యూల్డ్ తెగలు 50 శాతం. వాతావరణం : సాధారణంగా చల్లగా ఉంటుంది. జులైలో 9 నుండి 20 డిగ్రీలు , డిసెంబర్లో 16 నుండి 27 డిగ్రీలు ఉంటుంది. పంటలు : వరి, కస్సావా, మామిడి, బంగాళదుంపలు, అరటి, చెరకు, మొక్క జొన్న, కాఫీ, మిరియాలు. పరిశ్రమలు : వస్త్ర, సముద్ర ఉత్పత్తులు, పొగాకు, చక్కెర, ప్లాస్టిక్, ఫార్మా, తోలు వస్తువుల పరిశ్రమలు మొదలైనవి. సరిహద్దులు : నలువైపులా హిందూమహాసముద్రం ఉంది. ఆఫ్రికా ఖండానికి సమీపంలో ఉంది. స్వాతంత్య్రం : 26 జనవరి, 1960 చరిత్ర: తూర్పు ఆఫ్రికాకు 400 కిలోమీటర్లు దూరంలో ఉన్నా కూడా ఈ మడగాస్కర్ దీవి దేశం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోనేషియా దేశపు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందూమహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం మడగాస్కర్. ఈ దీవిలో పూర్వం ఆసియా దేశస్థులే వలసవెళ్లి ఉండడం వల్ల ఇప్పటికీ అక్కడ ఆసియా ప్రజల ఛాయలే ఉన్నాయి. దీవిలో మొత్తం 18 రకాల తెగల ప్రజలు ఉన్నారు. తెగలు వేరున్నా అందరూ మాట్లాడేది మలగాసీ భాషనే. ఈ దీవి వైశాల్యంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. క్రీ.శ. 1500లో పోర్చుగీసువారు ఈ దీవిని మొదట కనుగొన్నారు. 18వ శతాబ్దం ఆరంభం నుండి ఫ్రెంచి రాజులు దీనిని పరిపాలించారు. ఈ దీవిలో ప్రాణుల ఉనికి 150 మిలియన్ సంవత్సరాల క్రితం నుండే ఉండేదని శాస్రవేత్తలు పరిశోధించారు. అనేక రకాల ఖనిజాలు ఈ దీవిలో లభ్యమవుతున్నప్పటికీ ప్రపంచంలోని బీదదేశాల జాబితాలో మడగాస్కర్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. జనాభాలో 80 శాతం మంది ప్రజలు కేవలం జీవనం కొనసాగడానికే వ్యవసాయం చేస్తున్నారు. వరిధాన్యం ఈ దీవిలో అధికంగా పండుతుంది. 1960లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మలగాసీ ప్రభుత్వం ఏర్పడింది. అంటనానారివో: రాజధాని అంటనానారివో సందర్శకులను ఆకర్షించే ఒక గొప్ప నగరం. ఈ నగరం సముద్ర మట్టానికి 2643 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నగర ప్రదేశమంతా కొండలతో ఉండడం వల్ల ఇళ్ళ సముదాయాలు కూడా అలాగే నిర్మించడంతో ఒక కొత్త నిర్మాణశైలి కనబడుతుంది. నగరంలో క్యాథిడ్రిల్లు అనేకం ఉన్నాయి. నగరం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి అప్పర్టౌన్ రెండోది లోయర్టౌన్. నగరంలో ఉన్న జకరండా చెట్లు వేసవికాలంలో గొడుగుల మాదిరిగా ఉండి ఎంతో ఆకర్షణీయమైన ఊదా రంగులో దర్శనమిస్తాయి. మ్యూజియంలు, సాంస్కృతిక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ఇళ్ళ నిర్మాణం విచిత్రమైన శైలిలో ఉంటుంది. నగరంలో 17వ శతాబ్దంలో నిర్మించిన ఇమెరినా రాణి రాజ భవనం ‘రోవా’ చూడదగ్గది. దీనికి సమీపంలోనే ప్రధానమంత్రి భవనం ఉన్నాయి. రాజధాని నగరానికి సమీపంలో అండిసిబె-మంటాడియా, రానోమఫానా, అంకారనా జాతీయ పార్కులు ఉన్నాయి. నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. చూడదగిన ప్రదేశాలు సింగీ రోగ్ ఈ సింగీ రోగ్ ఎర్రమట్టి రెడ్ లాటరైట్‌తో సహజసిద్ధంగా ఏర్పడి పైకి లేచిన ముళ్లమాదిరిగా కనబడతాయి. ఈ ప్రాంతం అంకరానా పట్టణానికి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం భారీవర్షాల కారణంగా మట్టి కోసుకుపోయి, కోపులు కోపులుగా తయారై ఒక వినూత్న డిజైనుగా మారిపోయింది. వేలాది ఏళ్ళ క్రితం ఏర్పడిన ఈ వింత ఆకారాలు ఇప్పుడు కఠినమైన రాతి శిలలుగా మారిపోయాయి. క్రమంగా ఇసుక వీటిమీద చేరిపోయి ఎరుపు రంగుకు చేరుకొని ఇప్పుడవి సహజసిద్ధ నిర్మాణాలుగా మారిపోయాయి. ఇక్కడే చిన్న చిన్న నీటి కొలనులు ఉన్నాయి. సందర్శకులకు ఈ ప్రాంతం ఒక భూమి మీది స్వర్గం మాదిరిగా అనిపిస్తుంది. బావోబాబ్ చెట్లు మడగాస్కర్ దీవిలో చాలా విచిత్రమైన ప్రకృతి కనబడుతుంది. ఎన్నో అగ్నిపర్వతాలు, రహస్యంగా ప్రవహించే వాటర్‌ఫాల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం దీవి అంతా అడవే. బావోబాబ్ చెట్లు ఈ ఒక్కదేశంలోనే కనిపిస్తాయి. వీటిని చూస్తేనే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. వీటి మొదళ్ళు ఎంతో లావుగా ఉండి, మూడు నుండి నాలుగు మీటర్లు పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ కాండం నాలుగైదు కొమ్మలుగా విడిపోయి ఆగిపోతుంది. ఆ కొమ్మలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చివర్లలో కొన్ని ఆకులు ఉంటాయి. కాండం ఎంతో నునుపుగా ఉంటుంది. చూస్తుంటే మానవుని చెయ్యి, అయిదు వేళ్ళు విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. నోసీ బే మడగాస్కర్ దీవికి ఉత్తర ప్రాంతంలో ఈ నోసీ బే ఉంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న దీవులు ఉన్నాయి. కొన్ని దీవులు కొన్ని అడుగుల వెడల్పే ఉండి చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నోసీ బేకి సమీపంలోనే నోస్ సకాటియా, నోసీ టకినేలీ, నోసీ కోంబా, రష్యన్స్ బే, నోసీ ఇరంజా, రదను ద్వీపాలు, నోసీ ఫ్రాలీ, మిట్సియో ఆర్చిసెలాగో మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా స్వర్గధామంగా కనిపిస్తుంది. నోసీ సకాటియాను ఆర్బెడ్ ద్వీపం అంటారు. ఇక్కడ కేవలం 300 జనాభా ఉంది. ఇక్కడే ప్రపంచంలోనే అతి చిన్న కెమిలియన్ కనబడుతుంది. ఈ ఊసరవెల్లి కేవలం ఒక సెంటీమీటరు ఉంది. రాక్షస గబ్బిలాలు కూడా ఇక్కడ ఉంటాయి. నోసీ కోంబా ఒక చిన్నద్వీపం. గుండ్రంగా ఉండి ఆకాశంలోంచి చూస్తే సముద్రానికి బొట్టుపెట్టినట్లు కనబడుతుంది. ఈ ద్వీపంలో మనకు ఎగిరే నక్కలు కనిపిస్తాయి. అలాగే రాక్షస గబ్బిలాలు కూడా కనబడతాయి. ఈ ద్వీపంలో అగ్నిపర్వతం ఉంది. లెబార్ జంతువులు ఎక్కువగా సంచరిస్తాయి. రష్యన్ బే కూడా చిన్న ద్వీపం. ఈ ద్వీపంలో సందర్శకులు రెండు మూడు రోజులు ఉండడానికి వీలుగా హోటళ్ళు ఉంటాయి. సందర్శకులు ఈ దీవిలోని ప్రకృతి రమణీయతని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఇక్కడ తెలుపు రంగులో ఉండే ఇసుక బీచ్‌లు ఉన్నాయి. వివిధ జాతుల పక్షులు, జలచరాలు కనిపిస్తాయి. బవోబాబ్ వృక్షాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఈ ప్రాంతంలో నోసీనింజా, రదమ ఆర్బిపెలాగోలు ఉన్నాయి. ముఖ్య భూభాగంనుండి బోటులో గానీ, హెలికాప్టర్లో కాని వెళ్ళవచ్చు. ప్రజలు- సంస్కృతి - పాలన రీతులు ప్రజలు- సంస్కృతి: ఈ దేశంలో అనేక మానవ తెగలు ఉన్నాయి. ముఖ్యంగా మెరినా, బెట్సి మిసరాకా, బెట్సిలియో, సిమిహేతి, సకలావ, అంటాయసక, అంటన్‌డ్రాయ్ మొదలైన తెగలున్నాయి. జనాభాలో సగభాగం పురాతన సంస్కృతిని అనుసరిస్తున్నారు. వీరంతా క్రైస్తవ మతావలంబకులు. ముస్లిం మతం కూడా ఉంది. భారతీయులు కూడా మడగాస్కర్‌లో ఉన్నారు. వీరు హిందీ, గుజరాతీ భాషలు మాట్లాడతారు. గ్రామాలలో గుడిసెలలాంటి ఇళ్లు నిర్మించుకుంటారు. స్త్రీలు, పురుషులు దాదాపు సమాన భావనతో జీవిస్తారు. పురుషులు కుటుంబాన్ని పోషించేందుకు కావలసిన వనరులను సేకరిస్తారు. వ్యవసాయం స్త్రీలు, పురుషులు కలిసిచేస్తారు. ప్రభుత్వం విద్యాలయాలను నెలకొల్పింది. ముఖ్యంగా క్రిస్టియన్ మిషినరీలు విద్యావ్యాప్తిని బాధ్యతగా కొనసాగిస్తున్నాయి. పరిపాలనరీతులు: మడగాస్కర్ దీవి పరిపాలన సౌలభ్యం కోసం ఆరు ప్రాంతాలుగా విభజింపబడింది. ఈ ఆరు ప్రాంతాలు తిరిగి 22 రీజియన్లుగా విభజింపబడి ఉన్నాయి. ఈ రీజియన్లను ఫరిత్ర అంటారు. అంట్‌సిరనానా, అంటనానారివో, మహజంగ, టోమాసినా, ఫియానారంట్‌సోవా, టోలియారాలు ఆరు ప్రాంతాలు. దేశంలో మొత్తం 119 జిల్లాలు ఉన్నాయి. మడగాస్కర్ దేశంలో పదినగరాలు ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. అవి - అంటనానారికో, టోమాసిన, అంట్‌సిరాబే, ఫియానారంట్‌సోవా, మహజంగ, టోలియారా, అంట్‌సిరనానా, అంటానిఫోట్సీ, అంబోవోంబే, అంపరఫరవోలా.