అంటాననరివో: మడగాస్కర్ రాజధాని అంటనానారివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 13 మంది మరణించగా 107 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారని రెడ్‌క్రాస్ తెలిపింది.
రెడ్‌క్రాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్బంగా కనీసం 50,000 మంది బారే స్టేడియానికి తరలిరాగా ఎంట్రన్స్ వద్దే ఈ తొక్కిసలాట జరిగింది. ఒకేసారి జనం ఎంట్రన్స్ వద్దకు దూసుకు రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని రెడ్ క్రాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఆ సమయంలో ప్రారంభోత్సవాలకు హాజరై అక్కడే ఉన్న మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రజోఎలినా అక్కడే మౌనం పాటించాలని కోరారు. సంఘటన తర్వాత స్టేడియంలో ఎక్కడ చూసినా జనం తనవారి కోసం తమ వస్తువుల కొసం వెతుకులాడుతున్న దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఈ దారుణానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు కానీ మృతుల సంఖ్య మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని రెడ్‌క్రాస్ తెలిపింది.
40 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రతి నాలుగేళ్లకు హిందూ మహాసముద్రం పరిసర ద్వీపాల్లో ఒక్కోసారి ఒక్కో ద్వీపంలో నిర్వహిస్తూ ఉన్నారు. గత పర్యాయం ఈ గేమ్స్ మారిషస్‌లో జరగ్గా ఈ సారి వీటిని మడగాస్కర్‌లో నిర్వహించ తలపెట్టారు నిర్వాహకులు.
మడగాస్కర్ స్టేడియానికి విషాదాలు కొత్తేమీ కాదు. 2019లో ఇదే స్టేడియంలో జాతీయ సెలవు రోజున ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆరోజు జరిగిన తొక్కిసలాటలో 16 మంది మృతి చెందారు అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అంతకుముందు 2016లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు చనిపోయారు.
#Breaking | At least 12 people die in a stampede at a stadium in Antananarivo, capital of Madagascar - Prime Minister Christian Ntsay
— Breaking news 24/7 (@aliifil1) August 25, 2023
Follow @aliifil1 for More UPDATES pic.twitter.com/AZDRDvRHI4
ఇది కూడా చదవండి: మలుపుతిప్పిన చంద్రయాన్-3.. ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం
Comments
Please login to add a commentAdd a comment