stadium
-
కొత్త స్టేడియంలో....14 ఏళ్ల తర్వాత...
2010లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో చరిత్ర సృష్టించింది గ్వాలియర్లోనే. అయితే ఆ మ్యాచ్ జరిగిన రూప్ సింగ్ స్టేడియంలో అదే ఆఖరి మ్యాచ్. గ్వాలియర్ మున్సిపల్ శాఖకు చెందిన రూప్ సింగ్ స్టేడియంలో ఆ మ్యాచ్ తర్వాత మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. ఇక్కడ మొత్తం 12 వన్డేలు జరిగాయి. దీని తర్వాత మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తమ సొంత స్టేడియం నిర్మాణం వైపు మొగ్గింది. నగర శివార్లలో 30 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా స్టేడియాన్ని నిర్మించింది. అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 30 వేల సామర్థ్యం గల ‘శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’ను ఇటీవలే ప్రారంభించారు. నేటి మ్యాచ్ ఇదే మైదానంలో జరగనుంది. 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్ అంతర్జాతీయ పోరుకు వేదిక కానుంది. స్టేడియంను ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా నిర్వహించలేదు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ పోటీలు మాత్రం జరిగాయి. కొత్త స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. -
ప్రపంచంలోనే అతిపెద్ద, ఐకానిక్ స్టేడియం రెప్పపాటులో నేలమట్టం
మలేషియా నగరంలోని ఐకానిక్ షా ఆలం స్టేడియం చరిత్రలో కలిసి పోయింది. 80వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాన్ని అక్కడి ప్రభుత్వం కూల్చి వేసింది. ఈకూల్చివేతకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా షేర్ చేసింది. అంతే ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.ఒకప్పుడు 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న ఈ స్టేడియం 30 ఏళ్ల నాటిది. 2020లో నిర్మాణ పరంగా సరిగ్గా లేదని ప్రకటించారు. దీని స్థానంలో 45వేల మంది సామర్థ్యంతో మలేషియా ప్రభుత్వం కొత్త, ఆధునిక స్టేడియంను నిర్మించాలని యోచిస్తోంది.Así derribaron el techo del Shah Alam Stadium de Malasia 🇲🇾Recordemos que este estadio esta en proceso de remodelación pic.twitter.com/lOBZayr7bE— Manytops Stadiums (@Manytops) September 19, 2024 ఈ స్టేడియం నిర్మాణం 1990 జనవరి 1న ప్రారంభం కాగా అధికారికంగా 1994, జూలై 16, ప్రారంభించారు. ఇది జాతీయ జట్టుకు హోమ్ స్టేడియంగా ఉండేది. -
పటిష్ట జట్టుతో పోటీ అంటే సవాలే: భారత కెప్టెన్
ఢిల్లీలో హాకీ మ్యాచ్ ఆడనుండటం ఎంతో సంతోషంగా ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. ఇది కేవలం రెండు జట్ల మధ్య పోటీ కాదని.. దేశ రాజధానిలోని యువత హాకీ వైపు ఆకర్షితులయ్యేలా స్ఫూర్తి నింపేందుకు తమకు దక్కిన గొప్ప అవకాశమని పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జర్మనీ హాకీ జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది. ప్యారిస్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 23, 24న ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా దాదాపు దశాబ్ద కాలం తర్వాత తొలిసారి ఢిల్లీ అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. ప్రపంచ హాకీలో జర్మనీ అగ్రశ్రేణి జట్టుఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘దేశ రాజధానిలో.. చారిత్రాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ఆడనుండటం మాకు దక్కిన గొప్ప గౌరవం. ఎంతో ప్రత్యేకం కూడా! దేశ రాజధానిలో మరోసారి హాకీ స్ఫూర్తిని జ్వలింపచేసే అవకాశం రావడం.. ఆ జట్టుకు నేను సారథిగా ఉండటం నా అదృష్టం.ప్రపంచ హాకీలో జర్మనీ అగ్రశ్రేణి జట్టుగా ఉంది.వారితో పోటీ పడటం అంటే కఠిన సవాలుకు ఎదురీదడమే. అయితే, ప్రత్యర్థి ఎంత పటిష్టంగా ఉంటే మాలోని అత్యుత్తమ ప్రదర్శన అంతగా బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాడు. కాగా భారత హాకీ జట్టు ఇటీవలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.హాకీలో ఇరు జట్లకు గొప్ప వారసత్వం ఉంది‘భారత్, జర్మనీ హాకీ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించనున్నాం. ఇది ఆట ఉన్నతితో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యేందుకు తోడ్పడుతుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య సమరం రసవత్తరంగా సాగడం ఖాయమని హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్ పేర్కొన్నాడు. ‘భారత్, జర్మనీ మధ్య హాకీ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తికరమే. హాకీలో ఇరు జట్లకు గొప్ప వారసత్వం ఉంది. జర్మనీ వంటి పటిష్ట జట్టుతో తలపడేందుకు టీమిండియా ప్లేయర్లు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు’ అని భోళానాథ్ సింగ్ అన్నాడు.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
అనంతపురంలో దులిప్ ట్రోఫీ: రెండో రోజు హైలైట్ ఫొటోలు
-
హెజ్బొల్లా దాడిలో చిన్నారులు సహా... 12 మంది దుర్మరణం
టెల్అవీవ్: ఇజ్రాయెల్ ఆక్రమిత గొలాన్ హైట్స్ లోని ఫుట్‌బాల్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో చిన్నారులు, టీనేజర్లు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ల పనేనని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌లోని మిలటరీ ప్రాంతాలే లక్ష్యంగా తాము రాకెట్లను ప్రయోగించిన మాట వాస్తవమేనని హెజ్బొల్లా పేర్కొంది. అయితే, ఫుట్‌బాల్ మైదానంపై జరిగిన దాడికి బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది. -
106 రోజుల్లో నిర్మాణం... మరికొన్ని రోజుల్లో నేలమట్టం!
న్యూయార్క్: ప్రస్తుత టి20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్‌లో కేవలం 106 రోజుల్లో శరవేగంగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. ఆ్రస్టేలియా (అడిలైడ్)లో తయారు చేసిన ‘డ్రాప్ ఇన్’ పిచ్‌లతో న్యూయార్క్‌లో నాసా స్టేడియాన్ని 34 వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలికంగా నిర్మించింది. వెస్టిండీస్‌తో కలిసి మెగా ఈవెంట్‌కు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్ వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. కేవలం ఇక్కడ లీగ్ దశనే జరుగుతుంది. న్యూయార్క్‌లోని నాసా స్టేడియం 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఇండో–అమెరికన్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఇక్కడ భారత్... బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ సహా నాలుగు మ్యాచ్‌ల్ని ఆడింది. 9న భారత్, పాక్ సమరం ఇక్కడే జరిగింది. ఐసీసీ ఊహించినట్లుగానే భారత అభిమానుల కోలాహలంతో స్టేడియం నిండిపోయింది. ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణ పూర్తి కావడంతో నేటి నుంచి కూల్చివేత పనులు ప్రారంభించి ఆరు వారాల్లో గతంలో ఎలా ఉందో అలాంటి యథాతథస్థితికి తీసుకొస్తారు. ఇక వేదిక విషయానికొస్తే ఆగమేఘాల మీద నిర్మించిన ఈ స్టేడియం పిచ్ అత్యంత పేలవం. టి20లకు ఏమాత్రం కుదరని పిచ్‌లపై బ్యాట్ డీలా పడటంతో మెరుపులు, ధనాధన్ లేక టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లే చిన్నబోయేలా చేసింది. క్రికెటర్లు, మాజీలే కాదు... విశ్లేషకులు, వ్యాఖ్యాతలు అంతా ఈ పిచ్‌పై దుమ్మెత్తి పోశారు. కొసమెరుపు ఏమిటంతే ఈ నెల 1న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌తో ప్రారంభోత్సవం జరిగిన ఈ స్టేడియానికి 14 (నేటి)తో కాలం చెల్లబోతుంది. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి
బ్రజ్జావిల్లే: కాంగో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో అపశ్రుతి చొటుచేసుకుంది. ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని ఓర్నానో స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను అధికారులు నిర్వహించారు. నవంబర్ 14 నుంచి ర్యాలీ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం వేలాది మంది యువత ర్యాలీకి హాజరయ్యారు. యువత గుంపులుగా రావడంతో పరిస్థితిని సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో ఒకరిపై మరొకరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న స్టార్ అభిమాని
వినూత్నంగా ఆలోచించేవారు నలుగురిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. సందర్భం ఏదైనా తమదైన శైలితో కోట్లమందిలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ప్రస్తుతం వాజ్మా అయూబీ కూడా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుని స్టార్ అభిమానిగా ట్రెండ్ అవుతోంది. రేపటి ఫైనల్ మ్యాచ్‌తో ముగియనున్న వరల్డ్ కప్‌లో ఇండియా టీమ్ ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయకేతనం ఎగరవేసి, దాదాపు కప్పు ఇండియాదే అని చెప్పకనే చెబుతూ.. ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని తనవైపు తిప్పుకుంది. ఇండియా టీమ్‌కు మద్దతు తెలుపుతూ అభిమానుల చూపులు తనపై నిలుపుకుని సోషల్ మీడియా స్టార్‌గా మారింది వాజ్మా అయూబీ. అఫ్ఘనిస్తాన్కు చెందిన 28 ఏళ్ల వాజ్మా అయూబీకి రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌పైనే అందరి కంటే ఇంకాస్త ఎక్కువ ఆసక్తి. ప్రత్యర్థి టీమ్ అయిన భారత్ జట్టు గెలుపును ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టడం ద్వారా మన వాళ్లందరి అభిమానాన్నీ చూరగొంది ఈ సుందరి. ఉత్తర ఆఫ్ఘన్ ప్రావిన్స్‌లోని కుందుజ్‌లో పుట్టింది వాజ్మా. చిన్నతనంలో కుటుంబం అమెరికా వెళ్లడంతో కొలరాడోలోనే పెరిగింది. స్కూలు విద్యాభ్యాసం అయిన తరువాత గ్లోబల్ మేనేజ్మెంట్ అండ్ లీడర్ షిప్లో మాస్టర్స్ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ఫ్యాషన్ మీద ఆసక్తితో ‘లామన్’ పేరుతో క్లాత్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్‌గా కూడా రాణిస్తోంది. ఒక పక్క తన వ్యాపారంతో పాటు ఒక్కగానొక్క కొడుకుని చూసుకుంటూనే చైల్డ్ఫండ్ ప్రచార కర్తగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. మిస్టరీ గర్ల్... క్రికెట్‌ను ఆరాధించే వాజ్మా గతేడాది జరిగిన టీ20 ఆసియా కప్‌లో తొలిసారి మెరిసింది. అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరై స్టేడియంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ మ్యాచ్‌ను టీవీల్లో చూసినవారు కూడా ఎవరీ ఈ అందాల రాశి అంటూ ఆసక్తిగా చూశారు. ఆ తరువాత ఈ మ్యాచ్‌లో గెలిచిన అఫ్ఘానిస్థాన్‌కు ‘‘కంగ్రాట్స్ బ్లూ టైగర్స్’’ అని అప్పట్లో ట్విటర్లో పోస్టుపెట్టింది. ఆ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది. అప్పటిదాకా మిస్టరీ గర్ల్‌గా ఉన్న వాజ్మా అందమైన క్రికెట్ అభిమానిగా క్రికెట్ ప్రపంచానికి పరిచయం అయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విరాట్ కోహ్లి సంతకం చేసిన జెర్సీ వేసుకుని స్టేడియంలో కనిపించింది. ఆ రోజు జరిగిన మ్యాచ్‌లో అప్ఘాన్ టీమ్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. సొంత టీమ్ కాకుండా ప్రత్యర్థి టీమ్‌కు మద్దతు తెలపడం చిత్రంగా అనిపించింది. అప్పటి నుంచి ఇండియా టీమ్ అభిమానిగా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది వాజ్మా. This is @MdShami11's award as the highest wicket-taker in IPL 2023.#MohammadShami #INDvsNZ pic.twitter.com/htgX8hx4T7 — Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) November 15, 2023 ప్రస్తుతం వరల్డ్‌కప్ చూసేందుకు ఇండియా వచ్చిన వాజ్మా సొంత టీమ్ కాకుండా ఇండియా టీమ్‌కే సపోర్ట్‌గా నిలుస్తూ సోషల్ మీడియా స్టార్ అభిమానిగా మారింది. విరాట్ కోహ్లీ, మొహమ్మద్ షమీకి వీరాభిమాని అయిన వాజ్మా ఇటీవల మ్యాచ్‌లో మొహమ్మద్ షమీ తీసిన ఏడు వికెట్లకు తెగ సంబరపడి పోయి షమీని అభినందనలతో ముంచెత్తింది. ఒక ఆఫ్ఘనీ అమ్మాయి అయ్యిండి ఇండియా టీమ్‌ను ఫేవరెట్‌గా భావిస్తూ స్టార్ అభిమానిగా పాపులర్ అయ్యింది. -
భారత్-పాక్ మ్యాచ్: స్టేడియంలో అభిమానుల సందడి (ఫొటోలు)
-
నేటి నుంచి జాతీయ చెస్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్: జాతీయ అండర్–11 చెస్ చాంపియన్‌షిప్ ఆదివారం విశాఖ పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆంధ్ర చెస్ సంఘం, ఆల్ విశాఖ చెస్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన ఫిడే రేటింగ్ చిన్నారులు పోటీపడనున్నారు. పదకొండు రౌండ్ల పాటు సాగే ఈ పోటీలు 7వ తేదీతో ముగుస్తాయని ఆంధ్ర చెస్ సంఘం అధ్యక్షుడు కె.వి.వి.శర్మ తెలిపారు. విజేతకు రూ.70 వేల ప్రోత్సాహకం అందించనుండగా ఏడు నుంచి ఇరవై స్థానాల్లో నిలిచిన బాల బాలికలకు సైతం రూ.పదేసి వేల ప్రోత్సాహకం అందించనున్నామన్నారు. 386 మంది అండర్ 11 బాలబాలికలు పోటీ పడుతున్నారు. టోర్నీ టాప్ రేటింగ్‌తో కర్ణాటకకు చెందిన అపార్ పోటీ పడుతుండగా ఏపీ తరఫున అందాలమాల 17వ ర్యాంక్‌తో ఎత్తులు ప్రారంభించనున్నారు. -
మడగాస్కర్ స్టేడియంలో తొక్కిసలాట.. 13 మంది మృతి
అంటాననరివో: మడగాస్కర్ రాజధాని అంటనానారివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 13 మంది మరణించగా 107 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారని రెడ్‌క్రాస్ తెలిపింది. రెడ్‌క్రాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్బంగా కనీసం 50,000 మంది బారే స్టేడియానికి తరలిరాగా ఎంట్రన్స్ వద్దే ఈ తొక్కిసలాట జరిగింది. ఒకేసారి జనం ఎంట్రన్స్ వద్దకు దూసుకు రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని రెడ్ క్రాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ సమయంలో ప్రారంభోత్సవాలకు హాజరై అక్కడే ఉన్న మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రజోఎలినా అక్కడే మౌనం పాటించాలని కోరారు. సంఘటన తర్వాత స్టేడియంలో ఎక్కడ చూసినా జనం తనవారి కోసం తమ వస్తువుల కొసం వెతుకులాడుతున్న దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఈ దారుణానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు కానీ మృతుల సంఖ్య మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని రెడ్‌క్రాస్ తెలిపింది. 40 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రతి నాలుగేళ్లకు హిందూ మహాసముద్రం పరిసర ద్వీపాల్లో ఒక్కోసారి ఒక్కో ద్వీపంలో నిర్వహిస్తూ ఉన్నారు. గత పర్యాయం ఈ గేమ్స్ మారిషస్‌లో జరగ్గా ఈ సారి వీటిని మడగాస్కర్‌లో నిర్వహించ తలపెట్టారు నిర్వాహకులు. మడగాస్కర్ స్టేడియానికి విషాదాలు కొత్తేమీ కాదు. 2019లో ఇదే స్టేడియంలో జాతీయ సెలవు రోజున ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆరోజు జరిగిన తొక్కిసలాటలో 16 మంది మృతి చెందారు అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అంతకుముందు 2016లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు చనిపోయారు. #Breaking | At least 12 people die in a stampede at a stadium in Antananarivo, capital of Madagascar - Prime Minister Christian Ntsay Follow @aliifil1 for More UPDATES pic.twitter.com/AZDRDvRHI4 — Breaking news 24/7 (@aliifil1) August 25, 2023 ఇది కూడా చదవండి: మలుపుతిప్పిన చంద్రయాన్-3.. ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం -
విశాఖలో 25 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
విశాఖ స్పోర్ట్స్: రానున్న నాలుగైదు నెలల్లోనే విశాఖలో 25 ఎకరాల్లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించుకునేందుకు అనువుగా ఇంటిగ్రేటేడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు విశాఖలో తగిన స్థలం కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏపీఎల్ (ఆంధ్రా ప్రీమియర్ లీగ్) జరగనున్న నేపథ్యంలో ఏసీఏ ఆధ్వర్యంలో విశాఖ బీచ్‌రోడ్‌లో ఆదివారం 3కే రన్ నిర్వహించారు. కాళీమాత ఆలయం చెంత ఈ పరుగును సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మన ఏపీఎల్ మన ఆంధ్రా’ పేరిట ఏపీఎల్ రెండో సీజన్ బ్రాండింగ్‌లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు 3కే రన్ నిర్వహించినట్లు చెప్పారు. ఏపీఎల్‌లో ప్రతిభ చూపిన క్రికెటర్లు ఐపీఎల్‌కు ఆడే అవకాశం ఉందన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ , ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, మేయర్, కలెక్టర్ పాల్గొన్నారు. చదవండి టీటీడీ కీలక నిర్ణయం.. నడక మార్గంలో చిన్నారులకు 2 గంటల వరకే అనుమతి.. -
ధోని చివరి మ్యాచ్ వాన గండం తప్పదా...!
-
చెన్నై స్టేడియం లో ధోని చేసిన పనికి ...
-
ధోని కప్.. గిల్ సెంచరీ.. ఫైనల్ పై ఉత్కంఠ..
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ ఫుట్‌బాల్ స్టేడియంస్
-
ధోనీ రాకతో దద్దరిల్లిన స్టేడియం
-
హైదరాబాద్ యువ డిక్లరేషన్‌ను ప్రకటించనున్న ప్రియాంక గాంధీ
-
ప్రియాంక ‘యువ సంఘర్షణ సభ’.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా: రానున్న ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోమవారం ‘యూత్ మేనిఫెస్టో’ప్రకటించనుంది. గత ఏడాది వరంగల్‌లో నిర్వహించిన సభలో రాహుల్‌గాంధీ ‘రైతు డిక్లరేషన్’ప్రకటించిన విధంగానే.. సోమవారం సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే ‘యువ సంఘర్షణ సభ’లో ప్రియాంకా గాంధీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించనున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.4వేల చొప్పున భృతి ఇస్తామని ప్రకటించనున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య నిరుద్యోగులు 60 లక్షల మంది ఉంటారని.. అందులో 25 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉంటారనే అంచనా మేరకు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ప్రకటనలు చేయాలని నిర్ణయించామని వెల్లడించాయి. విద్య–ఉత్పాదకత సృష్టి ద్వారా చదువుకున్న అందరికీ వారి విద్యార్హతల మేరకు ఉపాధి కల్పింస్తామనే హామీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నా యి. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పనితీరును తీర్చిదిద్దుతామని, ఏటా జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని భరోసా కల్పించనున్నట్టు తెలిపాయి. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు టెలి కమ్యూనికేషన్స్ మాజీ ఇంజనీర్ శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘నాలెడ్జ్ సొసైటీ’అధ్యయన నివేదిక మేరకు.. విద్య, ఉపాధి రంగాల్లో రాష్ట్ర యువతకు పలు వరాలు ప్రకటిస్తామని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. విద్యా రంగంలోనూ ‘భరోసా’ ఉపాధి కల్పనతోపాటు విద్యా రంగంలో భరో సా ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీ, ఈబీసీలకు పూర్తిస్థాయి లో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని.. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఐఐటీ ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించనుంది. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో సర్వేల్ గురుకులాన్ని ఏర్పాటు చేసి.. రెసిడెన్షియల్ విద్యకు శ్రీకారం చుట్టినది కాంగ్రెస్ పారీ్టనేనని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ గురుకుల వ్యవస్థను మెరుగైన సౌకర్యాలతో నడిపిస్తామని హామీ ఇవ్వనున్నట్టు తెలిపాయి. మొత్తమ్మీద యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకునే దిశలో ప్రియాంకా గాంధీ ‘యూత్ మేనిఫెస్టో’ప్రకటించనున్నట్టు వెల్లడించాయి. అమరవీరుల కుటుంబాలకు పింఛన్లు తెలంగాణ కోసం తనువు చాలించిన అమరవీరుల కుటుంబాలకు ప్రియాంకా గాంధీ సభలో భరోసా కలి్పంచనున్నట్టు టీపీసీసీ నేతలు చెప్తు న్నారు. తొలి, మలిదశ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి నెలవారీ పింఛన్ ఇస్తామని హామీనివ్వనున్నట్టు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటలకు రానున్న ప్రియాంక కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4కి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 4:45 గంటలకు సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకుంటారు. 5:45 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి.. 6.30 సమయంలో ఢిల్లీ బయలుదేరుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. సభకు ఏర్పాట్లు పూర్తి.. సభ కోసం టీపీసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువ నాయకులు మానవతారాయ్, చరణ్ కౌశిక్, మహ్మద్ రియాజ్, చెనగోని దయాకర్, బాలలక్ష్మి, చారగొండ వెంకటేశ్ రెండురోజులు గా సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం మాణిక్‌రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరు లు సభ ఏర్పాట్లను పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి దేప భాస్కర్‌రెడ్డి సభా వేదిక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 50మంది కూర్చొనేలా విశాల వేదికను ఏర్పాటు చేశారు. స్టేజీ ముందు భాగంలో వీఐపీలకు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ‘నిరుద్యోగ ర్యాలీ’.. ట్రాఫిక్ మళ్లింపులు వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు కాంగ్రెస్ ‘నిరుద్యోగ జంగ్ సైరన్’ర్యాలీ నిర్వహించనుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఈ ర్యాలీలో, సరూర్‌నగర్ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరూర్నగ ర్, ఎల్బీనగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నా యి. విజయవాడ హైవే, సాగర్‌రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఇటు చంపాపేట వైపు, అటు నాగోల్ వైపు మళ్లించనున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలను చైతన్యపురి సిగ్నల్ నుంచి నాగోల్ వైపు మళ్లిస్తారు. -
SRH vs KKR : ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు సందడి (ఫొటోలు)
-
మరోసారి సమన్వయ లోపం.. కాంగ్రెస్‌లో ‘ఎంపీలాట’! నల్లగొండ సభ వాయిదా
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ సభల నిర్వహణ విషయంలో కాంగ్రెస్‌లో సమన్వయ లోపం మరోసారి కనిపించింది. నల్లగొండ సభ విషయంలో ముఖ్యనేతల మధ్య వివాదం తలెత్తడంతో.. అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి శుక్రవారమే జరగాల్సిన ఈ సభ 28వ తేదీకి వాయిదా పడింది. టీఎస్పీఎస్సీ పరీక్షల లీకేజీ, నిరుద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై నిరసనలు చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ సభలతోపాటు వచ్చేనెల మొదటి వారంలో పార్టీ ముఖ్యనేత ప్రియాంకా గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. నల్లగొండలో శుక్రవారం నిరుద్యోగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండలో నిర్వహించే సభ గురించి తనకు సమాచారం లేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక రేవంత్ తీసుకునే నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉంటాయని కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానానికి ఇన్చార్జిగా ఉండి కూడా.. నల్లగొండ సభ విషయంలో సైలెంట్ అయిపోయారు. ఇలా ముగ్గురు కీలక నేతల మధ్య నల్లగొండ సభ జగడం పార్టీలో గందరగోళానికి దారితీసింది. దీనితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వారు ఎంపీలతో చర్చించి 21న జరగాల్సిన నల్లగొండ సభను 28కి వాయిదా వేయించారు. మిగతా జిల్లా కేంద్రాల్లో ప్రకటించిన నిరుద్యోగ సభలు యథాతథంగా జరగనున్నాయి. 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, 28న నల్లగొండ, 30న పాలమూరు, మే 1న రంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగ సభలు జరుగుతాయి. మే 4న లేదా 5న తేదీల్లో ప్రియాంక సభ నిరుద్యోగ సభల అనంతరం మే 4న లేదా 5న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో సభ నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఆ సభకు పార్టీ కీలకనేత ప్రియాంకా గాంధీ హాజరుకానున్నారు. అయితే ఏ రోజున ప్రియాంక పర్యటన ఉంటుందన్నది ఒకట్రెండు రోజుల్లో ఖరారు అవుతుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ప్రియాంక సభతో రాష్ట్రపార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. -
స్టేడియంలో కానిస్టేబుల్ రాతపరీక్ష.. నిరుద్యోగానికి నిదర్శనం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనమీ చిత్రం. 1,667 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టేడియంలో రాత పరీక్ష జరిగింది. ఏకంగా 32,000 మంది అభ్యర్థులు తరలివచ్చారు. అప్పుల కారణంగా ఖర్చును భరించే పరిస్థితి లేక అధికారులు అందరినీ ఒకేచోటుకి పిలిపించి పరీక్ష నిర్వహించారు. పాకిస్తాన్ యువతలో 31 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారు. ఇస్లామాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30వేల మంది పురుష, మహిళ అభ్యర్థులు స్టేడియంలో నేలపైనే కూర్చుని పరీక్ష రాశారు. గత ఐదేళ్లుగా సుమారు 1,667 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇటీవలే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. పోలీసు నియామక పరీక్షలకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దేశంలోని నిరుద్యోగ పరిస్థితిపై చర్చ మొదలైంది. దేశంలో నిరుద్యోగ సమస్య గరిష్ఠస్థాయికి చేరుకుంది. పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవెలప్మెంట్ ఎకనామిక్స్(పీఐడీఈ) ప్రకారం దేశంలో 31 శాతం మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో 51 శఆతం మంది మహిళలు, 16 శాతం మంది పురుషులు ప్రొఫెషనల్ డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు. పాకిస్థాన్ జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు వారే ఉండగా.. నిరుద్యోగ రేటు 6.9 శాతంగా ఉంది. ఇదీ చదవండి: ప్రమాదకరంగా పైపైకి -
స్టేడియంలో క్రికెట్ ఆడిన తెలంగాణ మంత్రులు
-
నేడు ‘వీర్ బాల్ దివస్’.. పాల్గొననున్న ప్రధాని, కేంద్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: సిక్కుల పదవ గురువైన గురుగోవింద్ సింగ్ ఇద్దరు చిన్న కుమారులైన (సాహెబ్‌జాదేలు) బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగల్ ధైర్య, సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ.. ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న ‘వీర బాల్ దివస్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఇందులో భాగంగా.. నేడు (డిసెంబర్ 26 , సోమవారం) ఢిల్లీలో.. వీర బాల్ దివస్ ను పురస్కరించుకుని ఘనంగా ‘షాబాద్ కీర్తన్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దాదాపు 3 వందల మంది బాల కీర్తనీలు ‘షాబాద్ కీర్తన్’ను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. అనంతరం దాదాపు 3వేల మంది చిన్నారుల ఆధ్వర్యంలో జరిగే మార్చ్ పాస్ట్ ను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు.షాహెబ్‌జాదేల ధైర్య సాహసాలను, త్యాగాలను గుర్తుచేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా, విద్యార్థుల కోసం పాఠశాలలు, కాలేజీల్లో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. రైల్వే స్టేషన్లు, పెట్రోల్ పంపులు, విమానాశ్రయాల్లో డిజిటిల్ ప్రదర్శనలను ఏర్పాటుచేయనున్నారు. ఇక 2022 జనవరి 9న శ్రీ గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 1704వ సంవత్సరంలో మొగలు నవాబ్ అయిన వజీర్ ఖాన్.. మతం మారాలంటూ ఇద్దరు షహజాదేలను చిత్రహింసలు పెట్టారు. అయినా ధర్మాన్ని మార్చుకునేందుకు 9 ఏళ్ల జోరావర్ సింగ్, 7 ఏళ్ల ఫతేసింగ్ నిరాకరించారు. 1704 డిసెంబర్ 26న వీరిద్దరు బలిదానం చెందారు. వీరి త్యాగాన్ని, ధైర్య, సాహసాలను స్మరించుకుంటూ కేంద్రం ఈ ఏడాది నుంచి డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించనుంది. చదవండి: Roundup 2022: మెరుపులు..మరకలు -
ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు..
సాక్షి, మైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. పలువురికి అవార్డులను అందజేయడంతో పాటు క్రైస్తవులతో కలిసి సీఎం కేసీఆర్ డిన్నర్ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు వాణీదేవి, రాజేశ్వర్‌రావు, నగర మేయర్ విజయలక్ష్మి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజుసాగర్, నగర సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. పూల ఆంథోనికి మంత్రి కొప్పుల ఆహ్వానం.. రాంగోపాల్‌పేట్: క్రిస్మస్ వేడుకలకు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ బిషప్, కార్డినల్ పూల ఆంథోనిని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. మంగళవారం ఎస్పీ రోడ్‌లోని బిషప్ హౌజ్‌లో ఆయనను మంత్రి కలిశారు. -
వెలుగుల మాటున నలిగిన బతుకులు
సాక్షి, నిజామాబాద్/జగిత్యాల: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్‌వాసి కల్లెడ రమేశ్(50) ఖతర్‌లోని బూమ్ ఇంటర్నేషనల్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తూ 2016లో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు. ఫుట్‌బాల్ కప్(ఫిఫా) టోర్నీకి సంబంధించిన విధుల్లో పనిగంటలను విపరీతంగా పెంచడంతో తీవ్ర ఒత్తిడికి గురికావడమే కారణం. రమేశ్ కుటుంబానికి ఖతర్ ప్రభుత్వం, కంపెనీ పరిహారం చెల్లించలేదు. ఇతని మృతితో కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్‌కు చెందిన సురకంటి జగన్(32) 2021 నవంబర్ 11లో ఖతర్‌లో ఫుట్‌బాల్ స్టేడియంలో పైప్‌లైన్ పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు కూలి సమాధి అయ్యాడు. అతని భార్య, కూతురు, కొడుకులు పెద్ద దిక్కును కోల్పోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకూ ఆధారం లేకుండా పోయింది. జగిత్యాల్ జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లికి చెందిన నరుకుల్ల శ్రీనివాస్(30) 2020 జనవరి 4న ఖతర్ ఫుట్‌బాల్ స్టేడియంలో టవర్ క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా మరణించాడు. అతని మరణంతో భార్య అనిత, ఇతర కుటుంబసభ్యులు కుంగిపోతున్నారు. ఫిఫా పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టులో పని కోసం వెళ్లి ప్రమాదాలు, పని ఒత్తిడితో తీవ్ర అనారోగ్యానికి గురికావడం, అనుమానాస్పద స్థితిలో మరణించిన మన దేశ వలస కార్మికుల సంఖ్య 2,800 వరకు ఉంటుందని అంచనా. నరుకుల్ల శ్రీనివాస్ అంతిమయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న గల్ఫ్ జేఏసీ నాయకులు ఆసియా దేశాలకు సంబంధించిన వలస కార్మికులు ఖతర్‌లో గడచిన పదేళ్లలో 6,500 మంది మరణించారని వలస కార్మికుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఫుట్‌బాల్ కప్(ఫిఫా) పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం దాదాపు రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. స్టేడియంలు, క్రీడాకారులు, క్రీడాభిమానుల సౌకర్యాల కోసం ఎన్నో నిర్మాణాలను చేపట్టింది. పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసినా వలస కార్మికుల కుటుంబాలకు మాత్రం పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిని సహజ మరణాలుగానే ధ్రువీకరించడం గమనార్హం. ఫిఫా పనుల కోసం ఖతర్ ప్రభుత్వం వివిధ కంపెనీలకు పదేళ్ల కిందనే కాంట్రాక్టులు ఇచ్చింది. ఖతర్ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి ఖతర్‌లో ఫిఫా పనుల కోసం ఉపాధి పొందుతూ ఏ కారణంతో మరణించినా అలాంటి వలస కార్మికుల కుటుంబాలను అక్కడి ప్రభుత్వం ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఖతర్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. – గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ చైర్మన్ -
.. అయితే మోదీని మార్చడం కష్టమంటారా!
.. అయితే మోదీని మార్చడం కష్టమంటారా! -
ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్ స్టేడియం సమీపంలో భారీ పేలుడు సంభవించి 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్యారేజ్‌లో పేలుడు పదార్థాలున్న వాహనం పేలి మంటలు పక్కనే ఉన్న గ్యాస్ ట్యాంకర్‌కు వ్యాపించడంతో అది కూడా పేలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా రోజూ ఫుట్‌బాల్ ఆడేందుకు స్టేడియానికి వచ్చే యువకులే అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఇరాక్ సైన్యం ప్రకటనలో తెలిపింది. పేలుడుకు గల కరాణాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. చదవండి: ఆస్పత్రులూ ఖాళీ.. ఖేర్సన్ నుంచి రష్యా సేనల పలాయనం -
Indonesia: మైదానంలో విషాద క్రీడ
మలాంగ్(ఇండోనేషియా): ప్రపంచ క్రీడా చరిత్రలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సాకర్ స్టేడియంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు పోలీసులు సహా 125 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఓడిపోయిన జట్టు మద్దతుదారులు క్రీడా స్ఫూర్తిని మర్చిపోయి ఆగ్రహావేశాలతో ఘర్షణకు దిగడం రణరంగానికి దారితీసింది. ఇండోనేషియాలో తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలాంగ్ సిటీలో కంజురుహాన్ స్టేడియంలో శనివారం ఈ దారుణం జరిగింది. ఇప్పటిదాకా 125 మంది మృత్యువాత పడ్డారు. తొక్కిసలాటలో మరో 100 మందికిపైగా ప్రేక్షకులు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భాష్పవాయువు ప్రయోగంతో అలజడి కంజురుహాన్ స్టేడియంలో తూర్పు జావాకు చెందిన అరెమా ఎఫ్ఎస్ జట్టు, సురబయాకు చెందిన పెర్సిబయా జట్టుకు మధ్య శనివారం సాయంత్రం ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. 32,000 మంది ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వీరంతా అతిథ్య జట్టు అరెమా ఎఫ్ఎస్ మద్దతుదారులే. పెర్సిబయా జట్టు చేతిలో అరెమా జట్టు 3–2 తేడాలో ఓటమి పాలయ్యింది. ఈ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. క్రీడాకారులపై, సాకర్ అధికారులపై నీళ్ల సీసాలు, చేతిలో ఉన్న వస్తువులు విసిరారు. దాదాపు 3,000 మంది బారికేడ్లు దాటుకొని ప్రధాన మైదానంలోకి ప్రవేశించారు. అరెమా జట్టు మేనేజ్మెంట్తో ఘర్షణకు దిగారు. సొంత గడ్డపై 23 ఏళ్లుగా విజయాలు సాధిస్తున్న అరెమా టీమ్ ఇప్పుడెందుకు ఓడిపోయిందో చెప్పాలంటూ నిలదీశారు. అరుపులు కేకలతో హోరెత్తించారు. మరికొందరు స్టేడియం బయటకువెళ్లి, అక్కడున్న పోలీసు వాహనాలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. భాష్పవాయువు గోళాలు స్టేడియంలోకి సైతం దూసుకెళ్లాయి. స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు భయాందోళనకు గురయ్యారు. బాష్పవాయువును తప్పించుకోవడానికి అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట మొదలయ్యింది. ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడని పరిస్థితి. స్టేడియంలోనే 34 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రులకు తరలిస్తుండగా కొందరు, చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనతో ఇండోనేషియా సాకర్ అసోసియేషన్ ప్రీమియర్ సాకర్ లీగ్ లిగా–1ను నిరవధికంగా వాయిదా వేశారు. ఇదే చివరి విషాదం కావాలి: జోకో విడోడో ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరగడం, 125 మంది మరణించడం పట్ల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఇదే చివరి క్రీడా విషాదం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాటి దారుణాలు జరగకూడదని కోరుకుంటున్నట్లు వివరించారు. ప్రజలంతా క్రీడాస్ఫూర్తిని పాటించాలని, మానవత్వం, సోదరభావాన్ని కలిగి ఉండాలని కోరారు. మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కీడ్రలు, యువజన శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు జోకో విడోడో ఆదేశాలు జారీ చేశారు. ఇండోనేషియా సాకర్ ప్రతిష్టకు మచ్చ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాకర్ మ్యాచ్‌లకు తాము సన్నద్ధం అవుతున్న తరుణంలో స్టేడియంలో అభిమానులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఇండోనేషియా క్రీడలు, యువజన శాఖ మంత్రి జైనుదిన్ అమాలీ చెప్పారు. ఈ ఘటన తమ దేశ సాకర్ క్రీడా ప్రతిష్టను మసకబార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మే 20 నుంచి జూన్ 11 వరకు జరిగే ఫీఫా యూ–20 ప్రపంచ కప్‌నకు ఇండోనేషియా అతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు సైతం ప్రారంభించింది. నిజానికి ప్రపంచ సాకర్ క్రీడా సమాఖ్య ‘ఫిఫా’ నిబంధనల ప్రకారం స్టేడియంలో బాష్పవాయువు ప్రయోగించకూడదు. దేశీయంగా జరిగే క్రీడలపై ఫిఫా నియంత్రణ లేకపోవడం కొన్నిసార్లు పరిస్థితి అదుపు తప్పుతోంది. ఆట చూసేందుకు వచ్చి అనంత లోకాలకు.. ప్రపంచ క్రీడాలో చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నో విషాదాలు చోటుచేసుకున్నాయి. మైదానాలు రక్తసిక్తమయ్యాయి. ఆట చూసి ఆనందించేందుకు వచ్చిన అభిమానులు విగతజీవులయ్యారు. ఎంతోమంది క్షతగాత్రులుగా మారారు. విషాదాలు కొన్ని.. 1979 డిసెంబర్ 3: అమెరికాలోని సిన్సినాటీలో రివర్‌ఫ్రంట్ మైదానంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది మృతి చెందారు. 1980 జనవరి 20: కొలంబియాలోని సిన్సిలెజె పట్టణంలో బుల్‌ఫైట్ కోసం తాత్కాలికంగా కర్రలతో నిర్మించిన నాలుగు అంతస్తుల స్టేడియం కూలిపోయింది. ఈ ఘటనలో 200 మంది బలయ్యారు. 1988 మార్చి 13: నేపాల్‌లోని ఖాట్మాండు స్టేడియంలో సాకర్ మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా వడగళ్ల వాన మొదలయ్యింది. స్టేడియంలో తొక్కిసలాట జరిగి 93 మంది చనిపోయారు. 1989 ఏప్రిల్ 15: ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌లో హిల్స్‌బరో స్టేడియంలో అభిమానుల నడుమ ఘర్షణ జరిగింది. 97 మంది మరణించారు. 1996 అక్టోబర్ 16: గ్వాటెమాలాలోని గ్వాటెమాలా సిటీలో సాకర్ ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్వాటెమాలా, కోస్టారికా అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 84 మంది విగత జీవులుగా మారారు. 2001 మే 9: ఘనా రాజధాని అక్రాలో స్టేడియంలో ఘర్షణ, అనంతరం తొక్కిసలాట. 120 మందికిపైగా ప్రేక్షకులు బలయ్యారు. -
ఇండోనేషియా ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట,,, దాదాపు 180 మంది మృతి
-
స్టేడియంలో అధికారి కుక్క వాకింగ్ కోసం.. విమర్శలు
ఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్‌పై.. సోషల్‌మీడియాలో తాజాగా కొందరు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ అధికారి తన కుక్కతో వాకింగ్ చేసేందుకు వీలుగా స్టేడియం వేళల్ని సవరించినందుకు మండిపడుతున్నారు. ఢిల్లీలో స్టేడియాల వేళల్ని పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. రాత్రి పది గంటలకు వరకు అథ్లెట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాల జారీ వెనుక ఉన్న వ్యవహారమే విమర్శలకు దారి తీస్తోంది. ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో ఓ ఐఏఎస్ అధికారి పెంపుడు కుక్కతో నిత్యం వాకింగ్‌కు వస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన కోసం స్టేడియం నిర్వాహకులు.. అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే సమయం తగ్గించారు. త్వరగా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తగా.. రాత్రి పది గంటల వరకు స్టేడియాలను తెరిచి ఉంచాలని తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Delhi CM Arvind Kejriwal has directed that all Delhi Govt sports facilities will stay open for sportspersons till 10pm (File pic) pic.twitter.com/a7d0IyodXH — ANI (@ANI) May 26, 2022 ఢిల్లీ రెవెన్యూ సెక్రెటరీ సంజీవ్ ఖీర్వార్ తన పెంపుడు కుక్కతో ఈ స్టేడియంలోనే వాకింగ్ చేస్తున్నారు. ఈయన కోసమే అథ్లెట్లను బయటకు పంపించి వేస్తున్నారంటూ.. ఫొటో ఆధారాలతో సహా విమర్శిస్తున్నారు కొందరు. అయితే స్టేడియం నిర్వాహకుడు అనిల్ చౌదరి మాత్రం విమర్శలను ఖండిస్తున్నారు. స్టేడియం అధికారిక టైమింగ్ రాత్రి ఏడువరకే. ఆ తర్వాత ఎవరినీ ఎవరూ బయటకు వెళ్లిపోమనట్లేదు. స్వచ్చందంగా అథ్లెట్లు వెళ్లిపోతున్నారంటూ చెప్పారు. మరి సంజీవ్ ఈ స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు. Delhi Staduim Dog Walk Row ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో .. ఇప్పుడు స్టేడియం వేళల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కేజ్రీవాల్. -
పుణేలో కాదు.. ముంబైలో ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్
ముంబై: కోవిడ్ కేసులతో తల్లడిల్లుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేడు పంజాబ్ కింగ్స్‌తో పుణేలో ఆడాల్సిన మ్యాచ్‌ను ముంబైకి తరలించారు. అయితే ముందుగా బుధవారం ఉదయం ఢిల్లీ ఆటగాళ్లందరికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్టులన్నీ నెగెటివ్‌గా వస్తే ఏ సమస్యా ఉండదు. ఏ ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా... మ్యాచ్‌ను వాయిదా వేసి ఆటగాళ్లందరినీ ఐసోలేషన్‌లో ఉంచేస్తారు. తద్వారా ఢిల్లీ ఫ్రాంచైజీకి సోకిన వైరస్‌ను అక్కడితోనే అంతం చేస్తారు. క్యాపిటల్స్ బృందంలోని ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష, డాక్టర్ అభిజిత్ సాల్వి, మసాజ్ థెరపిస్ట్ చేతన్ కుమార్‌లకు వైరస్ సోకగా... తాజాగా సోషల్ మీడియా కంటెంట్ సభ్యుడు ఆకాశ్ మనే కోవిడ్ బారిన పడ్డారు. దీంతో కరోనా పేషెంట్ల సంఖ్య ఐదుగురికి చేరడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. మ్యాచ్ కోసం పుణేకు వెళ్లకుండా జట్టు ప్రస్తుతం బస చేసిన చోటే (ముంబై) ఉంచి వైరస్ సంక్రమణ నిరోధక చర్యలు చేపట్టింది. మంగళవారం చేసిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలన్నీ నెగెటివ్‌గా వచ్చినా.. బుధవారం నాటి టెస్టులే కీలకమని బీసీసీఐ వైద్య బృందం భావిస్తోంది. -
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. ఆర్మీ స్టేడియానికి అతని పేరు
పుణే: అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ (ఏఎస్ఐ)కు నీరజ్ పేరు పెట్టారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న డిఫెన్స్ రంగానికి చెందిన క్రీడాకారులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాజ్‌నాథ్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నీరజ్ చోప్రాతో పాటు తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ (ఆర్చరీ), అమిత్, మనీష్ కౌషిక్, సతీష్ కుమార్ (బాక్సింగ్), వారి కోచ్‌లను సన్మానించారు. చోప్రాకు జావెలిన్‌ను బహుకరించిన కేంద్ర మంత్రి.. ఏఎస్ఐ పేరును నీరజ్ చోప్రా స్టేడియంగా మార్చుతున్నట్టు ప్రకటించారు. ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం భారత్‌కు రావాలనేది తన ఆకాంక్ష అని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ అన్నారు. చదవండి: Tokyo Paralympics:టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌కు భవీనాబెన్ -
స్టేడియం లో కాల్పుల మోత : అమెరికా
-
నాణ్యత లోపం వల్లనే గ్యాలరీ కూలిపోయిందని అంచనా
-
జాతీయ కబడ్డీ పోటీల్లో.. కుప్పకూలిన గ్యాలరీ
సూర్యాపేట: స్టేడియంలో ఏడు వేల మంది ప్రేక్షకులు.. ఫ్లడ్‌లైట్ల వెలుగులు.. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 30 జట్ల క్రీడాకారులు.. ప్రారంభ వేడుక స్టేజీ మీద నాయకులు, అధికారులు.. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు.. కొద్దినిమిషాల్లో వేడుకలు మొదలవుతాయనగా ఒక్కసారిగా పెద్ద శబ్దం.. వేదిక ఎదురుగా ఉన్న ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలింది. వందల మందికి గాయాలు, క్షతగాత్రుల అరుపులతో భీతావహ వాతావరణం నెలకొంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి 47వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల చాంపియన్ షిప్– 2021 కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ఈ దుర్ఘటన జరిగింది. 150మందికిపైగా గాయపడగా.. 30మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. భారీ స్థాయిలో ఏర్పాట్ల మధ్య.. మంత్రి జగదీశ్‌రెడ్డి మాతృమూర్తి జి.సావిత్రమ్మ స్మారకార్థం.. సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న మైదానంలో 47వ జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీల కోసం దీనిని ఇండోర్ స్టేడియం తరహాలో మార్చారు. మూడు వైపులా ప్రేక్షకులు, మరోవైపు వీఐపీలకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు పోటీలు ప్రారంభం కావాల్సి ఉంది. సాయంత్రం 6.30 గంటల వరకు మొదలుకాలేదు. అప్పటికే స్టేడియం జనంతో నిండిపోయింది. మూడు గ్యాలరీలను సుమారు 15వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. అందులో వేదికకు ముందు భాగంలో 20 అడుగుల ఎత్తు, 240 ఫీట్ల పొడవుతో ఇనుప గ్యాలరీ ఏర్పాటు చేశారు. దీనిపై సుమారు 2వేల మంది కూర్చున్నారు. స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాలరీ కుప్పకూలింది. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ భాస్కరన్, పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి.. పోలీసు బస్సు, వాహనాల్లోనే పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. సోమవారం సూర్యాపేటలో కబడ్డీ జాతీయ పోటీల ప్రారంభోత్సవంలో కూలిన గ్యాలరీ ఇనుప రాడ్ల మధ్య చిక్కుకుని.. గ్యాలరీ కూలడంతో ఇనుప రాడ్ల మధ్య చిక్కుకొని 150మందికి గాయాలయ్యాయి. వీరిలో 30మందికి కాళ్లు, చేతులు, నడుము విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డవారంతా సూర్యాపేట పట్టణంతోపాటు అనంతారం, పెన్‌పహాడ్, బాలెంల, గుంజలూరు, తాళ్ల ఖమ్మం పహాడ్, కేసారి, కాసరబాద, కుడకుడ, హుజూర్నగర్, నల్లగొండ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. గ్యాలరీ నిర్మాణలోపంతోనే.. ప్రమాదానికి గ్యాలరీ నిర్మాణలోపమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ఐదు గ్యాలరీలు (మూడు పెద్దవి, రెండు చిన్నవి) నిర్మించారు. సూర్యాపేటకు చెందిన శివసాయి ఫ్లవర్ డెకరేషన్స్‌కు రూ.50 లక్షలతో నిర్మాణ బాధ్యత అప్పగించారు. వెయ్యి మందికిపైగా కూర్చునే గ్యాలరీ నిర్మించాలంటే అన్నీ ఇనుప పిల్లర్లు వాడాలి. భూమిలో రెండు ఫీట్లలోతు గుంతలు తవ్వి పిల్లర్లు పాతి.. వాటిపై గ్యాలరీ నిర్మించాలి. కానీ ఇక్కడ ఇనుప పిల్లర్లకు బదులు కర్రలు వాడారు. అదికూడా లోతుగా గుంతలు తవ్వకుండానే నిలబెట్టారని అంటున్నారు. స్టేజీ కదలకుండా బిగించడంలోనూ నిర్లక్ష్యం జరిగినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల బరువు తట్టుకోలేక గ్యాలరీ కూలినట్టు అంచనా వేస్తున్నారు. వైద్య ఖర్చులను భరిస్తా: మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చినవారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని వైద్యుల అసోసియేషన్‌కు సూచించామని.. వారు కోలుకునే వరకు వైద్యఖర్చులను తానే భరిస్తానని ప్రకటించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, అధికారులు ఉన్నారు. ప్రమాదంపై గవర్నర్ దిగ్బ్రాంతి సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ప్రమాదంపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వందల మంది గాయపడటం ఆందోళనకరమన్నారు. వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. -
బ్యాట్ పట్టిన బాలికా దండు
22 అనేది చాలా చిన్న నంబర్ అనిపించొచ్చుగాని అటు 11 మంది ఇటు 11 మంది ఉండేలా 22 మందితో రెండు ఆడపిల్లల క్రికెట్ టీమ్‌లు ఏర్పాటు కావడానికి ఆ ఊరిలో పెద్ద ప్రతిఘటన చేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ సమీపంలోని మురైలాపూర్లో 10–18 సంవత్సరాల మధ్య ఉన్న ఆడపిల్లలు క్రికెట్ ఆడాలనుకున్నారు.వంట గది గ్రౌండుగా,అంట్లే ఆటవస్తువులుగా పెరిగే అక్కడి ఆడపిల్లలు ఇలా అడగడం గ్రౌండ్లో కనిపించడం వింత.‘మగవాళ్ల ఆట’ అయిన క్రికెట్ ఆడటం ఇంకా వింత.కాని బాలికలు దానిని సాధించారు. ఇప్పుడు ఊరే వారికి గ్రౌండ్ శుభ్రం చేసి ‘ఆడుకోండి తల్లులూ’ అంటోంది. ఆమిర్ ఖాన్ ‘లగాన్’ సినిమాలో ఫక్తు పల్లెటూరి భారతీయులు క్రికెట్ తెలిసిన ఇంగ్లిష్ వారిని క్రికెట్లో ఓడిస్తారు పట్టుదలతో. ఆ సినిమా ఒక సంచలనం. ఇటీవల తమిళంలో నిర్మితమై, తెలుగులో రీమేక్ అయిన ‘కౌసల్యా కృష్ణమూర్తి’లో ఒక రైతు కూతురు భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు సంపాదించి ఇంటర్నేషనల్ మేచ్ ఆడే స్థాయికి ఎదగడానికి సంఘర్షణ చేయడం కథ. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోని మురైలాపూర్ అనే కుగ్రామంలో ఆడపిల్లలు చేస్తున్నది అంతకు తక్కువ కథ కాదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో ఉన్న చైతన్య స్థాయి అలాంటిది, ఆడపిల్లల పట్ల వివక్ష అలాంటిది. అత్తింటి కోసం శిక్షణ ఉత్తరప్రదేశ్ పటానికి పాదాల దగ్గర ఉండే మిర్జాపూర్కు గంట దూరంలో ఉండే మురైలాపూర్ అనే ఏముంది అలాంటి సవాలక్ష గ్రామాల్లో ఆడపిల్లల గురించి ఒకటే ఆలోచన. ఆమెను పెద్ద చేసి అత్తారింటికి పంపడం ఎలా? అనేదే. వంట, అంట్లు, ఊడ్చడం, బట్టలు ఉతకడం, తమ కంటే వయసులో చిన్న అయిన తమ్ముణ్ణో చెల్లెల్నో చూసుకోవడం ఇవి మాత్రమే అక్కడ ఆడపిల్లలు నేర్పిస్తారు. స్కూళ్లకు దాదాపు పంపరు. పంపినా 5వ తరగతి తర్వాత ఆపేస్తారు. అలాంటి ఊళ్లలో కొన్ని ఎన్.జి.ఓలు బాలికా వికాసానికి ప్రయాత్నాలు చేయడం, ప్రభుత్వం కూడా వాటిని ప్రోత్సహించడం జరుగుతోంది. ఢిల్లీలోని ‘బ్రేక్‌త్రూ’ అనే సంస్థ ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాలను ఎంచుకుని అక్కడ లైంగిక వివక్ష గురించి, గృహ హింస గురించి, బాలికా విద్య గురించి, బాలికల సంపూర్ణ వికాసం గురించి చైతన్యవంతమైన కార్యక్రమాలు మొదలెట్టింది. అది మెల్లగా ఫలితాలు ఇవ్వడం మొదలెట్టింది. తల్లులతో మొదలు ఇంటి ఆడపిల్ల స్కూలుకు వెళ్లాలంటే మొదట తల్లిని ఒప్పించాలి. ఆ తల్లి తండ్రిని ఒప్పించాలి. అప్పుడే సాధ్యం. కాని తల్లి సాధారణంగా ఒప్పుకోదు. ఎందుకంటే ఇంట్లో ఉండే చాకిరిని ఇంటి ఆడపిల్ల కొద్దో గొప్పో పంచుకుంటుంది. పిల్ల స్కూల్‌కి వెళితే తను అవస్థ పడుతుంది. అది గమనించిన ఎన్.జి.ఓ కార్యకర్తలు పిల్లలు తల్లుల కోసం చేయాల్సిన పనిని చేసేకే స్కూళ్లకు రమ్మని కోరారు. అలా పిల్లలు మెల్లగా స్కూళ్లకు వచ్చారు. పాఠాలు బుద్ధికి. మరి శరీరానికి? వ్యాయామం కావాలి. ‘ఏవో ఒక ఆటలు ఆడండి’ అంటే ఆ ఊరి ఆడపిల్లలు మాకు క్రికెట్ ఇష్టం. క్రికెట్ ఆడతాం అన్నారు. క్రికెట్ నేర్పించడానికి ఎన్.జి.ఓ కార్యకర్తలు ఉన్నారు. కాని ఆడటానికి ఊరి వాళ్లతోనే సమస్య. మగవాళ్ల ఆట మీకెందుకు ఊరి ఆడపిల్లలు దాపున ఉన్న ఖాళీ చేలలో క్రికెట్‌కు దిగారు అని ఊళ్లో తెలిసిన వెంటనే తండ్రులు, అన్నయ్యలు రంగంలోకి దిగారు. ‘ఆడపిల్లలు ఈ ఆట ఎందుకు’ అని తండ్రులు అంటే ‘గ్రౌండ్లో దిగితే కాళ్లు విరగ్గొడతాం’ అని ఆ ఆడపిల్లల అన్నయ్యలు బెదిరించారు. ‘అబ్బాయిలు ఆడుతున్నారు కదా మేమెందుకు ఆడకూడదు’ అని అమ్మాయిలు అడిగారు. అంతేనా? తండ్రులకు అన్నయ్యలకు బెదరక అచ్చు సినిమాల్లో లాగా ఒక్కో అమ్మాయిని కలుపుకుంటూ టీమ్‌లు తయారు చేశారు. అయితే రెండు టీములకు అవసరమైన 22 మంది అమ్మాయిలు దొరకలేదు. ఇద్దరు ముగ్గురు తగ్గారు. ఆట ముఖ్యంకాని టీమ్ సంఖ్యదేముంది అని ఉన్నవాళ్లనే రెండు టీమ్‌లకు పంచారు. ఊరి మొత్తం టీమ్‌కు ‘మోర్ని క్రికెట్ టీమ్’ అని పేరు పెట్టారు. మోర్ని అంటే ఆడ నెమలి. ఊరి అమ్మాయి సంజనా చౌహాన్ ఆ టీమ్‌కు కెప్టెన్ అయ్యింది. ఆట చూసి... ‘మేము గ్రౌండ్లో ఆడతాం. చూసి వద్దంటే చెప్పండి’ అని అడిగారు ఆడపిల్లలు తమ అన్నయ్యలని, తండ్రులని. బ్యాట్లు, వికెట్లు పట్టుకుని, క్రీజ్‌ను గీసి, ఆటకు అనువైన బట్టలు తొడుక్కుని వాళ్లు ఆడుతుంటే చూసిన తండ్రులు, అన్నయ్యలు సంతోషపడ్డారు. తమ ఇంటి ఆడపిల్లల లోపల ఇంత శక్తి, ఆసక్తి, నైపుణ్యం ఉంటుందని వారు అర్థం చేసుకున్నారు. పూర్తిగా ఆడపిల్లలే ఆడుతున్నారు కనుక ఒకరి మధ్య ఒకరికి పోటీ ఏర్పడి ఇంకా బాగా ఆడటం, దాని వల్ల వారి శరీరాలు ఫిట్‌గా మారుతుండటం కూడా గమనించారు. ఇప్పుడు ఆ ఊరి తల్లిదండ్రులు ఈ ఆడపిల్లల ఆటను ఒప్పుకోవడమే కాదు చదువును కూడా అంగీకరిస్తున్నారు. ‘పెళ్లికి తొందరేముంది. చదివేంతగా చదివిద్దాం’ అంటున్నారు.] ఇప్పుడు మురైలాపూర్ ఆడపిల్లలు చదువుకోడమే కాదు క్రికెట్‌కు సంబంధించి ప్రొఫెషనల్ అకాడమీలలో కూడా చేరాలనుకుంటున్నారు. ‘ఒకరోజు మేము దేశానికి ఆడతాం’ అని ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. చిన్న ఊళ్ల నుంచి ఎదిగిన పురుష క్రికెట్ ప్లేయర్ల గాథలు విన్నాం. ఒకనాడు మనం ఈ మోర్ని క్రికెట్ టీమ్ బయోపిక్ కూడా తప్పక చూస్తాం. వారి బ్యాట్ విసురు, బౌలింగ్ గురి అలా ఉంది మరి. – సాక్షి ఫ్యామిలి -
కేఆర్ స్టేడియం పనులపై ఆరా
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకే తలమానికమైన కోడి రామ్మూర్తి స్టేడియం ఆధునికీకరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కలెక్టర్ జె.నివాస్‌తో కలిసి మంగళవారం ఆయన స్టేడియం పనుల ను స్వయంగా పరిశీలించారు. పనుల తీరు తెన్నులను చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్‌కుమార్, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మైదానం బ్లూప్రింట్, స్టేడియం డిజైన్‌ను పరిశీలించారు. స్టేడియంలో నిర్మితమవుతున్న రెండు ఫోర్లలో పలు ఇండోర్ క్రీడాంశాల్లో ఆటలు ఆడేందుకు వీలుగా డిజైన్ చేసినట్టు చీఫ్ కోచ్ వివరించారు. ఈ స్థలానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణానికి ఎంతో ప్రత్యేకత ఉందని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. ఇక్కడే ఎంతోమంది క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అద్భుతమై న ఫలితాలు సాధించారని గుర్తుచేశారు. తాను కూడా ఓ జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడిని కావడంతో క్రీడల లోటుపాట్లు, క్రీడాకారుల సమస్యలు, క్రీడాసంఘాల ఇబ్బందులు తనకు తెలుసునని పేర్కొన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అ సోసియేషన్ అధ్యక్షుని హోదాలో ఎప్పటికప్పుడు క్రీడా సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నానని అన్నారు. నిధుల రాకలో జాప్యం.. కోడి రామ్మూర్తి స్టేడియం పనుల జాప్యంపై కృష్ణదాస్ ప్రతిస్పందించారు. రూ.15 కోట్ల నిధులతో స్టేడియం పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వాస్తవానికి ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. అయితే స్టేడియం రీ డిజైనింగ్, ఉడా నుంచి రావాల్సిన నిధుల జాప్యం వల్ల ప నులు ఆలస్యంగా జరుగుతున్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఉడా కాస్త సుడాగా మారడంతో నిధులు జాప్యానికి కారణం అయిందన్నారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.. త్వరలో అన్ని సమస్యలను అధిగమించి, అంతర్జాతీయ హంగులతో పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా కేఆర్ స్టేడియాన్ని ప్రారంభించేందుకు యోచిస్తున్నట్టు కృష్ణదాస్ చెప్పారు. త్వరలో క్రీడా సంఘాలతో చర్చించేందుకు భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తద్వారా క్రీడల అభివృద్ధికి అన్ని క్రీడా సంఘాలను కలుపుకునిపోయేందుకు సరికొత్త కార్యాచరణకు మార్గం ఏర్పడుతుందన్నారు. ఒలింపిక్ భవన్ కోసం రూ.లక్ష అందజేత ఒలింపిక్ భవన్ కోసం ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు వ్యక్తిగతంగా అందజేస్తానని గతంలో కృష్ణదాస్ హామీ ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన హామీ మేరకు మంగళవారం ఒలింపిక్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు మాస్టారుకి లక్ష రూపాయల నగదును అందజేశారు. కార్యక్రమంలో సెట్‌శ్రీ సీఈఓ జి.శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ శ్రీనివాస్‌కుమార్, పీఈ టీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమణ, హ్యాండ్‌బాల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్, జూడో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మెంటాడ స్వరూప్, వైఎస్సార్ సీపీ నా యకులు ఎన్ని ధనుంజయరావు, క్రీడాసంఘాల ప్రతినిధు లు, శాప్ డీఎస్ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా వారి న్యాయపరమైన డిమాండ్లను వివరిస్తూ కోచ్‌లు డిప్యూటీ సీఎంకు కృష్ణదాస్‌కు వినతిపత్రాలు అందజేశారు. -
యూఎస్ ఓపెన్ ఎరీనా ఇప్పుడు హాస్పిటల్!
న్యూయార్క్: ప్రతియేటా ఆఖరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు వేదికయ్యే యూఎస్ ఓపెన్ ఎరీనా ఇప్పుడు కరోనా ఆసుపత్రిగా మారనుంది. అమెరికాలో 2 లక్షలకు పైగానే కరోనా బారిన పడ్డారు. దీంతో న్యూయార్క్ సిటీలోని యూఎస్ ఓపెన్ స్టేడియం ఇండోర్ సౌకర్యాలను 350 పడకల హాస్పిటల్‌గా మార్చాలని అక్కడి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఆఫీస్ నిర్ణయించింది. లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియాన్ని పాకశాలగా మార్చనున్నారు. ఇందులో రోజూ డాక్టర్లు, ఇతర సహాయక సిబ్బందితో కలిపి మొత్తం 25 వేల మందికి భోజనాలు పెడతారు. -
వైరల్‌గా మారిన మొతేరా స్టేడియం ఫోటోలు..
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఖ్యాతికెక్కిన అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం ఏరియల్ వ్యూ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం ఏకంగా 1,10,000 కావడం గమనార్హం. బీసీసీఐ ఈ స్టేడియం ఏరియల్ వ్యూ ఫొటోలను షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యక్రమానికి ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ట్రంప్ పర్యటన నేపథ్యంలో మైదానాన్ని నిర్వహకులు అత్యంత సుందరంగా తీర్చదిద్దారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ పర్యటించనున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రికార్డు సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియం రికార్డును బ్రేక్ చేస్తూ.. అత్యంత విశాలమైన స్టేడియంగా మొతేరా స్టేడియం నిర్మితమైంది. #MoteraStadium gearing up for #NamasteTrump !! Witness the world's biggest cricket stadium host the oldest and biggest democracies of the world! Watch all the action only on @DDNewslive @DDNewsHindi @DDIndialive @PBNS_India @shashidigital @Chatty111Prasad pic.twitter.com/q2Wevmd72Z — Meghna Dev (@DevMeghna) February 18, 2020 -
మ్యాచ్ చూడటానికి వస్తే.. గెంటేశారు
టెహ్రాన్: తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన యువతిని స్టేడియం నుంచి బయటకు గెంటేశారు. ఈ సంఘటన ఇస్లామిక్ సిద్దాంతాలు, ఆచారాలు ఎక్కువగా పాటించే ఇరాన్లో చోటు చేసుకుంది. వారి దేశంలో పురుషుల మ్యాచ్‌లకు మహిళలు హాజరుకావడం నిషేధం. అయితే ఫుట్‌బాల్‌పై ఉన్న మక్కువతో స్థానిక స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ను వీక్షించడానికి జినాబ్ పెర్సపొలిసి మగ వేష ధారణతో వెళ్లింది. అయితే జినాబ్ మహిళగా గుర్తించిన నిర్వాహకులు, పురుష అభిమానులు స్టేడియం నుంచి బయటికి పంపించేశారు. దీంతో తాను బాధ పడుతున్న పోటోతో పాటు తనకు జరిగిన అవమానాన్ని, తాను ఎదుర్కొన్న పరిస్థితులను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రసుతం జినాబ్ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై క్రీడా అభిమానులు ఆగ్రహించారు. మహిళలు కూడా పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేలా అనుమతిని ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో కూడా.. ఇరాన్ గడ్డపై జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ లకు కేవలం పురుషులు మాత్రమే హాజరుకావడం చూస్తుంటాం. పురుషుల పోటీలకు మహిళలు హాజరుకావడం అక్కడి చట్టాల ప్రకారం నేరం. కఠినమైన శిక్షలు సైతం ఉంటాయి. అయితే ఆ చట్టాలను ఎత్తివేయాలని, తమను ఫుట్ బాల్ మ్యాచ్‌లకు అనుమతినివ్వాలని ఇరానీ యువతులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోగా.. నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వారికి అనుమతి ఇవ్వటంలేదు. పురుషుల మ్యాచ్ లకు తాము హాజరుకావడం పై నిషేధం ఉందని తెలిసినా.. కొందరు ఇరానీ యువతులు మీసాలు, గడ్డాలు ధరించి మరీ ఫుట్ బాల్ మ్యాచ్ లకు హాజరయ్యారు. రష్యా వేదికగా జరిగిన సాకర్ సమరంలోనూ ఇరాన్లో మహిళా ఫుట్‌బాల్ అభిమానులపై ఉన్న అంక్షలను ఎత్తివేయాలని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. -
కోడెల ‘ప్రైవేట్’ వసూళ్లు
సాక్షి, అమరావతి : బాధ్యత కలిగిన రాజ్యాంగ పదవిలో ఉన్నవారే అనైతికంగా వ్యవహరిస్తే ఇక సమాజంలో నీతికి విలువ ఉంటుందా? రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ నిధులతో తన పేరిట నిర్మించిన స్టేడియాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటూ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం జారీ చేశారు. 2015 నవంబర్ నుంచి ఈ వసూళ్ల దందా కొనసాగుతోంది. డబ్బులు ఇవ్వకపోయినా, దీని గురించి బయట ఎవరికైనా చెప్పినా విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తామని, కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. కోడెల తనయుడి జేబులోకే నిధులు.. గుంటూరు జిల్లాలో నర్సరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో కోడెల శివప్రసాదరావు తన పేరుతోనే క్రీడా మైదానాన్ని నిర్మించారు. రూ.వందల కోట్ల ప్రభుత్వ నిధులతో ‘కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం’ను నిర్మించారు. ఈ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను తెనాలి, నర్సరావుపేట నియోజకవర్గాల్లోని ప్రైవేట్ సూళ్లు, కాలేజీల నుంచి ప్రతినెలా వసూలు చేయాలని స్పీకర్ కోడెల, తెనాలి ఎమ్మెల్యే నిర్ణయానికి వచ్చారు. నర్సరావుపేట, తెనాలి నియోజకవర్గాల్లో క్రీడా మైదానాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై 2015 అక్టోబర్ 3న స్పీకర్ కోడెల గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కోసం నర్సరావుపేట, తెనాలి నియోజకవర్గాల్లో ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి నిధులు వసూలంటూ హుకుం జారీ చేశారు. ఈ మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి నెలకు ఇంత చొప్పున నిధులు వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చేశారు. వసూలు చేసే నిధులు స్టేడియాల అభివృద్ధికి కాకుండా నేరుగా కోడెల తనయుడి జేబులోకి వెళ్తున్నాయని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు చెబతున్నాయి. ఇప్పటిదాకా వసూలు చేసిన సొమ్ముతో చేసిందేమీ లేదని విమర్శిస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాల్లో ఏముందంటే... నర్సరావుపేట, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్లే స్కూళ్లు మొదలుకొని ఆరో తరగతి వరకు గల ప్రైవేట్ పాఠశాలల నుంచి నెలకు రూ.2,500 చొప్పున సంవత్సరానికి రూ.30,000 వసూలు చేయాలి. ప్లే స్లూళ్లు మొదలుకొని పదో తరగతి వరకు గల ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి నెలకు రూ.5,000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 వసూలు చేయాలి. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల నుంచి నెలకు రూ.7,500 చొప్పున సంవత్సరానికి రూ.90,000 వసూలు చేయాలి. స్పీకర్ కోడెల పేరుతో నిర్మించిన స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు.. నర్సరావుపేట, తెనాలి నియోజకవర్గాల పరిధిలోని పాఠశాలల్లో డబ్సులు వసూలు చేయాలంటూ గుంటూరు కలెక్టర్ ఇచ్చిన అదేశాలు -
‘వరల్డ్ కప్ సరైన వేదిక కాదు’
కజాన్ : అరబ్ దేశాల చట్టాలు...మరీ ముఖ్యంగా ఆడవారికి సంబంధించిన చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిన విషయమే. మగ క్రీడాకారులు ఆటలు ఆడే సమయంలో ఆడవారు స్టేడియంలోకి రాకుడదనేది అటువంటి కఠిన చట్టాల్లో ఒకటి. 1979 విప్లవం సందర్భంగా వచ్చిన ఈ చట్టాన్ని ఎత్తివేయాలని ఇరాన్ మహిళలు కొంతకాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇలా అయితే లాభం లేదని, తమ నిరసనను ప్రపంచం మొత్తం తెలియజాలనుకున్నారు. రష్యాలో జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్’ను అందుకు వేదికగా ఎంచుకున్నారు. ఫిఫా షెడ్యూల్ ప్రకారం బుధవారం నాడు(అంటే ఈ రోజే) ఇరాన్, స్పెయిన్‌తో తలపడనుంది. తమ నిరసనను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి ఇదే మంచి అవకాశం అని భావించారు ఇరానీ మహిళలు. అందుకే కజాన్ ఎరినాలో ‘ఆడవారిని నిషేధించకూడదు (#NoBan4Women), ‘ఇరానీ మహిళలు స్టేడియంలోకి వచ్చేందుకు మద్దతు తెలపండి’ (Support Iranian women to attend stadiums) అని రాసివున్న ప్లకార్డులను పట్టుకుని జనాల మధ్య నిల్చున్నారు. అయితే ఇరానీ మహిళలు చేస్తున్న నిరసన గురించి ఆ దేశ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ మసౌద్ షోజాయి ‘ఇరాన్ మహిళల సమస్యల గురించి చర్చించడానికి ఈ టోర్నమెంట్ సరైన వేదిక కాదు. మనమంతా ఒకే కుటుంబం...మన సమస్యల గురించి మనం మన ఇంటిలోపలో చర్చించుకోవాలి. కానీ మైదానంలో ఉన్నప్పుడు మనమంతా ఒకే దేశం. కాబట్టి ఈ విషయం గురించి మనం తర్వాత చర్చిద్దాం’ అని అన్నారు. 1979 విప్లవం తర్వాత ఇరాన్లో మహిళలను అన్ని క్రీడాకార్యక్రమాలకు హాజరవటాన్ని నిషేధించారు. అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్న వారిలో షౌజాయి కూడా ఉన్నారు. -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లు!
పియాంగ్ చాంగ్ : వందల కోట్ల ఖర్చుతో నిర్మితమైన భారీ స్టేడియం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు వేడుకల తర్వాత నిర్వీర్యంగా మారనుందా అంటే అవుననే చెప్పాలి. కొత్త హంగులతో, అద్భుతంగా నిర్మించిన కట్టడం చరిత్రలో కలిసిపోనుంది. శీతాకాల ఒలింపిక్స్-2018 కోసం పియాంగ్ చాంగ్ (దక్షిణ కోరియా) ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ వేడుకలను అట్టహాసంగా జరపాలని ఉద్దేశంతో పియాంగ్ చాంగ్ లో భారీ స్టేడియాన్ని నిర్మించారు. కానీ ఆ తర్వాత తాము చేసిన పనికి అధికారులు తలలు పట్టుకున్నారు. అదేంటి స్డేడియాన్ని నిర్మించడం తప్పేమి కాదుగా.. ఎందుకీ అవస్థ అంటారా. ఆ స్టేడియం నిర్మాణానికి అక్షరాల వంద మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 635కోట్లు) ఖర్చు చేసింది. ఒకేసారి 35000 మంది వీక్షించే సదుపాయం కలదు. ఇంత భారీ ఖర్చుతో నిర్మించిన స్టేడియాన్ని కేవలం నాలుగంటే నాలుగు సార్లు మాత్రమే ఉపయోగిస్తారు. శీతాకాల ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలకు మాత్రమే వేదిక కానుంది. ఆ తర్వాత స్టేడియాన్ని ఏ అవసరాలకు వినియోగించాలో అర్థంకాక అధికారులు తికమక పడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఒలింపిక్స్ స్టేడియాల పరిస్థితి ఇలానే ఉన్నాయి. రియో, అట్లాంట ఒలింపిక్స్ స్టేడియాలు శిథిలావస్థకు చేరగా, మరికొన్ని స్టేడియాలు ఆటగాళ్ల వసతులకు ఉపయోగపడుతున్నాయి. పియాంగ్ చాంగ్ లో స్డేడియం సామర్థ్యం కంటే కేవలం 10 వేల మంది ఎక్కువ ప్రజలు ఉన్న దేశంలో భవిష్యత్తులో దాని నిర్వహణకు చేసే ఖర్చు తలుచుకుంటే అధికారులకు వారి తప్పిదం అర్థమవుతోంది. -
సత్వరమే పనులు పూర్తి చేయండి
- క్రీడా సముదాయాల నిర్మాణంపై ఒలింపిక్ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్సు ఆథారిటి స్టేడియంలో రూ. 6 కోట్లతో చేపడుతున్న క్రీడా సముదాయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఒలింపిక్ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు ప్రభుత్వానికి విన్నవించారు. ఆదివారం స్థానిక స్టేడియం ప్రాంగణంలో నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. క్రీడా సముదాయాల నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం పూర్తి కావాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల జాప్యం జరిగిందన్నారు. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, వాలీబాల్ లాంటి క్రీడాంశాల సాధనకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. అలాగే బాక్సింగ్, రెజ్లింగ్, తైక్వాండో, చెస్, క్యారమ్స్, రైఫిల్ షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ క్రీడాంశాలకు వినియోగించుకోవచ్చన్నారు. స్పోర్ట్సు అథారిటి స్టేడియం అధికారులు తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. -
మినీ స్టేడియం నిర్మాణానికి మోక్షమెప్పుడో...?
క్రీడా మైదానాలు కరువు ఇబ్బందుల్లో క్రీడాకారులు నిధులున్నా నిర్మాణానికి చోచుకోని వైనం చెన్నూర్ : అన్నీ ఉన్నా అల్లుని నోట్ల శని అన్న చందంగా మారింది చెన్నూర్ క్రీడాకారుల పరిస్థితి. జిల్లాలోనే చెన్నూర్ క్రీడాకారులకు పెట్టింది పేరు. ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపారు. క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు లేక పోవడంతో వారు పడరాని పట్లు పడుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉంటే అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్న క్రీడాకారులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైనా... మోక్షం లేదు క్రీడాకారుల సౌకర్యార్థం ప్రభుత్వం 2013లో నియోజకవర్గానికో మినీ స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందు కోసం రూ. 1.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. స్టేడియం నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు జాతీయ రహదారి సమీపంలో స్థలాన్ని కేటాయించారు. దీంతో ఈ ప్రాంత క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. మినీ స్టేడియం నిర్మాణం అయితే అన్ని రకాల క్రీడలు సాధన చేసేందుకు అనుకూలంగా ఉంటుందని, ఏడాదిలోగా స్టేడియం నిర్మాణం పూర్తి అవుతుందని సంబర పడ్డారు. స్టేడియానికి కేటాయించిన స్థలాన్ని ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఈ స్థలంలో మినీ స్టేడియం నిర్మాణానికి రూ. 1.25 కోట్లు సరిపోవని సుమారు రూ. 2 కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు. అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి తిరిగి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పినప్పటికీ ఫలితం లేదు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి మూడేళ్లు అవతున్నా నేటికి నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని స్టేడియం నిర్మాణం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానమే దిక్కు క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం ఒక్కటే దిక్కైయింది. నియోజకవర్గ కేంద్రంలో ఒక్కటే మైదానం ఉండడంతో కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు క్రీడాకారులందరూ ఒకే చోట సాధన చేయాల్సిన దుస్థితి నెలకొంది. క్రీడాకారులందరూ ఉదయం, సాయంత్రం సమయాల్లో ఒకే సారి రావడంతో స్థలం కొరత స్పష్టంగా ఏర్పడుతోంది. దీంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా పట్టణంలోని ఉద్యోగులు, వ్యాపారులు ఉదయం వేళ్లలో వాకింగ్ చేసేందుకు ఇదే మైదానానికి వస్తుంటారు. దీంతో మైదానం వివిధ రకాల క్రీడాలను ప్రాక్టీస్ చేయడంలో ఏకాగ్రతను కోల్పోవల్సి వస్తోందని సీనియర్ క్రీడాకారులు పేర్కొంటున్నారు. మినీ స్టేడియం నిర్మించినట్లయితే క్రీడాకారులకు సౌకర్యంగా ఉంటుందని క్రీడాకారులు సంపత్, సాగర్, సంతోశ్లు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్రీడాకారుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని స్టేడియం నిర్మాణానికి కృషి చేయాలని కోరుతున్నారు. -
క్రీడా కేంద్రంగా సింహపురి
మొగళ్లపాళెం వద్ద స్టేడియం నిర్మాణం శాప్‌కు 150 ఎకరాలను కేటాయించిన ప్రభుత్వం రీజినల్ స్పోర్ట్స్ అకాడమీ వైపుగా అడుగులు క్రీడాకారుల్లో వ్యక్తమవుతున్న హర్షం నెల్లూరు(బృందావనం) : సింహపురి క్రీడా కేంద్రంగా మారనుంది. నెల్లూరు సమీపంలోని మొగళ్లపాళెం వద్ద స్టేడియం నిర్మాణానికి 150 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సింహపురి క్రీడా ముఖచిత్రం రెండు మూడేళ్లలో మారనుంది. నగరానికి సమీపంలోని మొగళ్లపాళెం వద్ద సర్వేనంబరు 55లో 150 ఎకరాల స్థలాన్ని ‘శాప్’కు ముందస్తుగా అప్పగించాలని కలెక్టర్‌కు రెవెన్యూ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్రీడామౌలిక సదుపాయాలతో స్పోర్ట్సు కాంప్లెక్స్ నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక ఆలోచనకు వచ్చాయి. దీంతో దక్షిణ భారతదేశంలో రీజనల్ స్పోర్ట్సు అకాడమీ వైపు అడుగులు పడనున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భారత క్రీడాప్రాధికార సంస్థ(శాయ్) నుంచి రాష్ట్రానికి సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత రాష్ట్ర, కేంద్ర అధికారులను పురమాయిస్తున్నారు. దీంతో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు 150 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా సమాచారం. ఇందుకు సంబం«ధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా వేగవంతం చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తన వంతుగా మొగళ్లపాలెం స్పోర్ట్సు కాంప్లెక్స్‌కు అవసరమైన రోడ్లు, భూమి చదనుకు మరో రూ.4కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం. డీపీఆర్‌కు అధికారుల సన్నాహాలు స్పోర్ట్సు కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర అధ్యయన బృందం డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను తయారుచేయనుంది. మొగళ్లపాళెంలో నిర్మితం కానున్న స్పోర్ట్సుకాంప్లెక్స్ కోసం పొదలకూరు రోడ్డు నుంచి 100అడుగుల రహదారిని నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్న 150 ఎకరాలను ఈ ఏడాది ఫిబ్రవరి 18న రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పరిశీలించారు. జిల్లా, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు చెందిన యంత్రాంగానికి సూచనలు చేశారు. స్టేడియం నిర్మాణానికి సేకరించనున్న భూములకు సంబంధించిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం రూ.6 కోట్లు పరిహారంగా అందించింది. క్రీడా రంగానికి మహర్దశ: ఎం.రవీంద్రబాబు, శాప్ డైరెక్టర్ మొగళ్లపాళెంలో చేపట్టనున్న స్టేడియం నిర్మాణంతో రాష్ట్ర క్రీడారంగానికి మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ కేంద్రంగా క్రీడాప్రగతి జరిగి రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయాం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం స్టేడియం నిర్మాణాకిని 150 ఎకరాలను కేటాయించడం సంతోషకరం. భవిష్యత్తులో నెల్లూరు జాతీయ క్రీడలకు వేదిక కావడం ఖాయం. -
నవయువం: స్టైల్ స్టైల్‌రా... హెయిర్ స్టైల్‌రా!
ఆట కోసం వారు స్టేడియంలోకి దిగితే అది ర్యాంప్ అవుతోంది. ఫ్యాషన్కొక ట్రెండ్‌ను నేర్పుతుంది. యువతకు ఒక గైడ్ అవుతుంది. వెరైటీ హెయిర్ స్టైల్ అవుతుంది! ఆకట్టుకునే ఆట తీరే కాదు.. ఆకర్షించే స్టైల్ కూడా వారి సొంతం. వ్యక్తిగత ప్రతిభ వారిని స్పోర్ట్స్ స్టార్స్‌గా నిలిపితే... వ్యక్తిగత ఆసక్తులు స్టైల్స్టార్లను చేస్తున్నాయి. స్పెషల్‌గా నిలుపుతున్నాయి. యూత్‌కు స్టైల్ గైడ్స్‌ని ఇస్తున్నాయి. అందరిలోకి భిన్నంగా కనిపించడమే ఫ్యాషన్. అందరినీ ఆకట్టుకునేదే స్టైల్... ఆటతోనే కాక తమ స్టైల్స్‌తో కూడా యువతను ఆకట్టుకునే ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ప్రత్యేకించి నిత్యం హెయిర్ స్టైల్స్‌ను మారుస్తూ ఆకట్టుకునేవాళ్లు కూడా ఉన్నారు. అలా యువతను ప్రభావితం చేస్తున్న క్రీడాకారుల గురించి... ధనాధన్ హెయిర్ స్టైల్... భారత యువతకు బాగా ఇష్టమైన ఆట క్రికెట్. ప్రస్తుతం బాగా ఇష్టమైన ఆటగాడు ధోనీ. బాగా ఆసక్తిని రేపుతున్నది ధోనీ హెయిర్ స్టైల్. హెయిర్‌స్టైల్ విషయంలో అరంగ్రేటం నుంచే అదుర్స్ అనిపిస్తున్నాడు ఈ రాంచీ రాక్‌స్టార్. కెరీర్ తొలినాళ్లలో ధోనీ హెయిర్ స్టైల్‌ను చూసి ముషారఫ్ ముచ్చటపడ్డాడు. దేశీయ యువత ఇష్టపడ్డారు. ఇంకేముంది ధోనీ క్రికెట్ స్టైల్ మాత్రమేకాక హెయిర్ స్టైల్ కూడా ఫేమస్ అయ్యింది. ఆదిలో వచ్చిన ఇమేజ్‌కు అనుగుణంగా ఇప్పటికీ ధోనీ విభిన్నమైన స్టైల్స్‌ను కొనసాగిస్తున్నాడు. అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ధోనీ తన ‘మొహాక్ హెయిర్‌స్టైల్’ తో వార్తల్లోకి వచ్చిన విషయం కూడా తెలిసిందే. దీన్ని అనుకరించేవారు కొంచెం తక్కువమందే ఉండవచ్చు కానీ ఆకర్షణీయంగా ఉందంటూ ఆసక్తిగా గమనించేవాళ్లు మాత్రం ఎంతోమంది. ప్రపంచం ఫాలో అవుతుంది... ఫుట్‌బాల్ మ్యాచ్‌ల విషయంలో సీజన్లు ఎలా మారుతుంటాయో, బెక్‌హమ్ హెయిర్‌స్టైల్స్ కూడా అలాగే మారుతుంటాయి. దేశీయ యువతకు హెయిర్‌స్టైల్ విషయంలో కొత్త స్టైల్స్‌ను పరిచయం చేసింది ధోనీ అయితే ధోనీకి ముందు దశాబ్దం నుంచే ఇంగ్లండ్ సాకర్ హీరో బెక్‌హమ్ హెయిర్ స్టైల్స్ విషయంలో స్టైలిష్ అన్న పేరు పొందాడు. బహుశా.. బెక్ మార్చినన్ని హెయిర్ స్టైల్స్ మరే స్పోర్ట్స్ పర్సన్ కూడా మార్చలేదేమో! పాశ్చాత్య ప్రపంచంలో బెక్ హెయిర్ డ్రస్సింగ్‌ను అనుకరించినవారు కూడా ఎంతోమంది. టార్జాన్ స్టైల్ నుంచి గుండు వరకూ... ఇప్పుడైతే అగస్సీ పూర్తి గుండుతో కనిపిస్తున్నాడు కానీ.. ఒకప్పుడు తన హెయిర్ స్టైల్‌తో అబ్బాయిలకు నిద్ర లేకుండా చేశాడు. టార్జాన్ స్టైల్లో తల వెంట్రుకలు పెంచిన అగస్సీ, బ్యాండ్ ధరిస్తే ఎక్కడలేని అల్లరితనం దర్శనమిచ్చేది. విషాదం ఏమిటంటే.. తర్వాతి రోజుల్లో అగస్సీకి హెయిర్ ఫాల్ మొదలైంది. బట్టతల వచ్చింది. టార్జాన్‌లా ఉన్నవాడు కాస్తా అరగుండుతో కనపడలేక ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో కనిపిస్తాడు. ఒకే స్టైల్‌తో మెరిసినవారూ ఉన్నారు.. నిత్యం స్టైల్స్ మారుస్తూ ఆకట్టుకునే వారే గాక ఒకే హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నవారూ ఉన్నారు. తన పొడవాటి హెయిర్ స్టైల్‌తో ఫేమస్ అయ్యాడు స్పెయిన్ టెన్నిస్ కెరటం నాదల్, ఇంకా అర్జెంటీనా సాకర్ హీరో మెస్సీ హెయిర్ స్టైల్ కూడా అభిమానులను సంపాదించుకుంది. యువతలో అటెన్షన్ తీసుకువచ్చింది. ఆ మధ్య సచిన్ టెండూల్కర్ కూడా కొంత భిన్నమైన హెయిర్‌స్టైల్ ట్రై చేశాడు. దానికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా వ్యక్తులు మారుతున్నారు, స్టైల్స్ మారుతున్నాయి. ఆకట్టుకునే హెయిర్ స్టైల్ అయితే వారికి యూత్‌లో ఫాలోయింగ్‌ను పెంచుతుంది.