2010లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో చరిత్ర సృష్టించింది గ్వాలియర్‌లోనే. అయితే ఆ మ్యాచ్ జరిగిన రూప్ సింగ్ స్టేడియంలో అదే ఆఖరి మ్యాచ్. గ్వాలియర్ మున్సిపల్ శాఖకు చెందిన రూప్ సింగ్ స్టేడియంలో ఆ మ్యాచ్ తర్వాత మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు.
ఇక్కడ మొత్తం 12 వన్డేలు జరిగాయి. దీని తర్వాత మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తమ సొంత స్టేడియం నిర్మాణం వైపు మొగ్గింది. నగర శివార్లలో 30 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా స్టేడియాన్ని నిర్మించింది. అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 30 వేల సామర్థ్యం గల ‘శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’ను ఇటీవలే ప్రారంభించారు.
నేటి మ్యాచ్ ఇదే మైదానంలో జరగనుంది. 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్ అంతర్జాతీయ పోరుకు వేదిక కానుంది. స్టేడియంను ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా నిర్వహించలేదు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ పోటీలు మాత్రం జరిగాయి. కొత్త స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు.
Comments
Please login to add a commentAdd a comment