Gwalior
-
కొత్త స్టేడియంలో....14 ఏళ్ల తర్వాత...
2010లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో చరిత్ర సృష్టించింది గ్వాలియర్లోనే. అయితే ఆ మ్యాచ్ జరిగిన రూప్ సింగ్ స్టేడియంలో అదే ఆఖరి మ్యాచ్. గ్వాలియర్ మున్సిపల్ శాఖకు చెందిన రూప్ సింగ్ స్టేడియంలో ఆ మ్యాచ్ తర్వాత మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. ఇక్కడ మొత్తం 12 వన్డేలు జరిగాయి. దీని తర్వాత మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తమ సొంత స్టేడియం నిర్మాణం వైపు మొగ్గింది. నగర శివార్లలో 30 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా స్టేడియాన్ని నిర్మించింది. అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 30 వేల సామర్థ్యం గల ‘శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’ను ఇటీవలే ప్రారంభించారు. నేటి మ్యాచ్ ఇదే మైదానంలో జరగనుంది. 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్ అంతర్జాతీయ పోరుకు వేదిక కానుంది. స్టేడియంను ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా నిర్వహించలేదు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ పోటీలు మాత్రం జరిగాయి. కొత్త స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. -
భారత్-బంగ్లా తొలి టీ20.. స్టేడియం వద్ద మూడంచెల భద్రత
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్ కన్నేసింది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్‌కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి.అయితే మొదటి టీ20కు ఇవ్వనున్న గ్వాలియర్ ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు బస చేసే హోటల్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.కాగా మ్యాచ్ జరిగే అక్టోబర్ 6న హిందూ మహాసభ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందుస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ మహాసభ ఆదివారం నల్లజెండాలతో ర్యాలీని నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీంతో ఎటువంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రతమత్తమయ్యారు.తుది జట్లు అంచనాభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్ -
Independence Day 2024: 16 రాష్ట్రాలకు గ్వాలియర్ త్రివర్ణ పతాకాలు
కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్‌లో తయారైన త్రివర్ణ పతాకాలను 16 రాష్ట్రాల్లో ఎగురవేయనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి 14 రాష్ట్రాలకు అందించేందుకు త్రివర్ణ పతాకాలను తయారు చేసేవారు. ఇప్పుడు కేరళ, కర్నాటక రాష్ట్రాలకు అందించేందుకు కూడా ఇక్కడే జాతీయ జెండాలను తయారుస్తున్నారు. గ్వాలియర్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎనిమిది వేల త్రివర్ణ పతాకాలను పంపించారు.తాజాగా మరో రెండు వేల త్రివర్ణ పతాకాలకు ఆర్డర్లు అందాయి. ఈ సందర్భంగా కేంద్ర భారత ఖాదీ యూనియన్ కార్యదర్శి రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం అనే ప్రభుత్వ నినాదం చురుగ్గా సాగుతున్నదన్నారు. గ్వాలియర్‌కు చెందిన 196 మందితో కూడిన బృందం త్రివర్ణ పతాకాలను రూపొందిస్తోంది. -
కుటుంబాన్ని మింగేసిన అగ్ని కీలలు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. మంటలు భారీగా చెలరేగడంతో 13 అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలకు అదుపులోనికి తీసుకువచ్చాయి. ఈ ఘటన గ్వాలియర్‌లోని బహోదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో విజయ్ అలియాస్ బంటీ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు దీనిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే విజయ్, అతని కూతుళ్లు అన్షిక అలియాస్ మినీ (15), యాషిక అలియాస్ జీసస్ (14) సజీవదహనమయ్యారు. మంటలు చెలరేగిన భవనంలో కింది అంతస్తులో ఒక ప్రవేశ ద్వారం మాత్రమే ఉంది. దీంతో వారు ఇంటిలో నుంచి బయటకు రాలేకపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపుచేసింది. ఈ భవనపు కింది భాగంలో డ్రై ఫ్రూట్స్ దుకాణం, రెండవ అంతస్తులో ఒక గొడౌన్ ఉంది. -
రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రమోద్ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు. తన పాన్ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్‌కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
150 ఏళ్ల నాటి నిధి, వాటాలకోసం జగడం..చివరికి..?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇల్లు నిర్మిస్తున్న కూలీలకు ఊహించని పరిణామం ఎదురైంది. 150 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి నిధి వారి కంటపడింది ఇంటి నిర్మాణం కోసం (మంగళవారం మార్చి 5న) గుంతలు తవ్వుతున్న కూలీలకు బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు లభ్యమైనాయి. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి వివాదానికి దారి తీసింది. సంజయ్ పాల్ అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి కూలీలను పెట్టుకున్నాడు. ఈ క్రమంగా అక్కడ తవ్వుతుండగా ఇద్దరు కార్మికుల వెండి నాణేలు లభించాయి. ఈ సంగతి సంజయ్ పాల్ పొరుగువారికి తెలియడంతో వివాదం రేగింది.త మకూ వాటా కావాలని పట్టుబట్టడంతో వాగ్వాదానికి దారి తీసింది. దీంతో సంజయ్ కుమారుడు హరీష్ జంగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాటా అడిగిన ఇంటి పొరుగువారితో పాటు ఇద్దరు కార్మికులను అరెస్టు చేస్తామని చెప్పారు. కొన్ని వెండి నాణేలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయానికి సంబంధించి పురావస్తు శాఖ నుంచి వివరాలను సేకరించి తగిన చర్యలు చేపడతామని పోలీసు అధికారులు ప్రకటించారు. కాగా ఇంటి పునాదిని తొలగిస్తుండగా నిధి కనిపించిందని, కూలీలకు 40-50 నాణేలు లభించాయని తమకు సమాచారం అందిందనీ, తాము అక్కడికే చేరుకునే సరికి అక్కడ ఎవరూ లేరని, వాటిని కార్మికులో తీసుకుని ఉంటారని హరీష్ తెలిపాడు. -
‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌వాసులను గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి గజగజ వణికిస్తోంది. ఈ ప్రాంతంలో ‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’ అని స్థానికులు చెబుతున్నారు. పొద్దస్తమానం ఉండే చలి కారణంగా జనజీవనం స్తంభించింది. చలి నుంచి రక్షించుకునేందుకు స్థానికులు రగ్గుల కింద తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన జిల్లా యంత్రాంగం గ్వాలియర్‌లో జనవరి 6న అన్ని ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చలి తీవ్రత కారణంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు నడుస్తున్న అన్ని పాఠశాలలకు జనవరి 6వ తేదీ శనివారం సెలవు ప్రకటించినట్లు గ్వాలియర్ కలెక్టర్ అక్షయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆరు నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసులను మునుపటిలానే నిర్వహిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్వాలియర్‌లో గత వారం రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది. జనవరి 2 నుండి రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుండి 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్ ప్రజలు సూర్యుడిని చూసేందుకు మరో రెండు మూడు రోజులు వేచి చూడాల్సివుంటుంది. ప్రస్తుతం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకటి రెండు రోజుల్లో చినుకులు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్వాలియర్-చంబల్‌లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. -
గుడ్‌బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ..
కొద్దిరోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతోంది. ఆశలు రేకెత్తిస్తూ.. 2024 మన ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆనందాన్ని అందించబోతోంది. అయితే 2023 దేశ ప్రజలకు కొన్ని మంచి, కొన్ని చెడు జ్ఞాపకాలను అందించింది. 2023 జనవరి 28న గగనతలంలో ఊహకందని ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్-2000 ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఈ రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్‌లోని మహారాజ్‌పురా ఎయిర్‌బేస్ నుండి సాధారణ శిక్షణ కోసం బయలుదేరాయి. ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని మోరెనాలోని పహర్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మన్పూర్ మహాదేవ్ అడవిలో మిరాజ్ యుద్ధ విమానం కూలిపోయింది. సుఖోయ్‌కు చెందిన రెక్కలు మోరెనాలోని పహర్‌ఘర్ ప్రాంతంలో పడిపోయాయి. మిగిలిన విమానం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని ఉచైన్ పోలీస్ స్టేషన్‌లోని నాగ్లా బిజా గ్రామ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మిరాజ్ పైలట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి మృతి చెందగా, సుఖోయ్ పైలట్లిద్దరూ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిరాజ్-2000 చాలా కాలంగా భారత వైమానిక దళంలో భాగంగా ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించారు. భారత వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానాలు.. విమాన శిక్షణ మిషన్‌లో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, ఇద్దరు పెలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం! -
Madhya Pradesh Elections: సింధియాకు అగ్నిపరీక్ష
అసెంబ్లీ ఎన్నికలు ఇంకా వారం కూడా లేని వేళ మధ్యప్రదేశ్‌లో కీలకమైన గ్వాలియర్–చంబల్ ప్రాంతం అధికార బీజేపీకి తలనొప్పిగా మారుతోంది. పార్టీలోని పాత నేతలకు, మూడేళ్ల కింద కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయులకు అస్సలు సరిపడకపోవడం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఈ ప్రాంతంలో 34 కీలక అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ మంచి ఫలితాలు సాధించడం కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ చాలా కీలకం. అలాంటి ప్రాంతంలో పాత, కొత్త నేతలు సయోధ్యకు ససేమిరా అంటుండటం పార్టీ నాయకత్వంతో పాటు సింధియాకు కూడా ఇబ్బందికరంగానే మారింది. పైగా శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై జనంలో నెలకొన్న వ్యతిరేకత కూడా దీనికి తోడయ్యేలా కని్పస్తుండటం మరింత గుబులు రేపుతోంది. ఈసారి గ్వాలియర్ ప్రాంతంలో బీజేపీ సాధించబోయే సీట్ల సంఖ్యపై పారీ్టలో సింధియా భవితవ్యం కూడా చాలావరకు ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది... అది గ్వాలియర్‌లోని హజీరా ప్రాంతం. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఇంధన మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఓటెయ్యాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాత్రం కాంగ్రెస్‌కు ఓటెయ్యాల్సిందిగా కోరారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన అనంతరం యువ నేత జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న 16 మంది ఎమ్మెల్యేల్లో తోమర్ ఒకరు. ఆయన రాకతో కినుక వహించిన స్థానిక బీజేపీ నేతలు ఇప్పుడాయనకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. దాంతో ఒకరకంగా ఆయనది ఒంటరి పోరుగానే మారింది. ఆయనకు మాత్రమే కాదు, బీజేపీ టికెటిచ్చిన సింధియా వర్గానికి చెందిన మరో 17 మంది నాయకులకూ దాదాపుగా ఇదే పరిస్థితి ఎదురవుతోంది! అంతేగాక ఓటర్లు కూడా వారిపట్ల నిరాసక్తతే చూపుతున్నారు. ‘‘వారికే పరస్పరం కుదరడం లేదు. అలాంటి వాళ్లకు మా మంచీ చెడూ గురించి ఆలోచించేంత సమయం ఎక్కడుంటుంది?’’ అని ప్రశ్నిస్తున్నారు! బీజేపీ వర్సెస్ సింధియా వర్గం 2020 మార్చిలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి సింధియా బీజేపీలో చేరారు. దాంతో కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. వారంతా రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలొచ్చాయి. గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో ఇలా రాజీనామా చేసిన 16 మందిలో 9 మంది తిరిగి నెగ్గారు. దాంతో అక్కడ బీజేపీ బలం 16కు పెరిగింది. ఈసారి ఆ స్థానాలన్నింటినీ నిలుపుకోవడంతో పాటు మరిన్ని చోట్ల నెగ్గాల్సిన కఠిన పరీక్ష సింధియా ముందుంది. కానీ పరిస్థితులు ఆయనకు అంత సానుకూలంగా కనిచడం లేదు. ఆ ప్రాంత ప్రజల్లో మెజారిటీ సింధియా నిర్ణయాన్ని తప్పుబడుతుండటం విశేషం. ఆయనసలు కాంగ్రెస్‌ను వీడాల్సిందే కాదన్నది వారి నిశి్చతాభిప్రాయం. దీనికి తోడు సింధియా వర్గానికి చెందిన 18 మందికి బీజేపీ నాయకత్వం టికెట్లివ్వడం కూడా పార్టీలో విభేదాలకు కారణమైంది. పలువురు ఆశావహులు పార్టీలు మారి బరిలో దిగి సవాలు విసురుతున్నారు. మోరెనా అసెంబ్లీ స్థానంలో సింధియా వర్గం ఎమ్మెల్యే రఘురాయ్ కన్సానాకు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాకేశ్ రుస్తుం సింగ్ బీజేపీని వీడారు. బీఎస్పీ టికెట్‌పై బరిలో దిగి సవాలు విసురుతున్నారు. బీజేపీ ఓటు బ్యాంకును ఆయన గణనీయంగా చీల్చడం ఖాయమంటున్నారు. పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి! దీన్ని గమనించే బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్టోబర్ 30 నుంచి వారంలోపే ఏకంగా రెండుసార్లు గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో పర్యటించారు. అసంతృప్త పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరిపి బుజ్జగించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.‘‘అసలు బీజేపీ నేతల్లోనే చాలామంది సింధియాను వ్యతిరేకిస్తున్నారు. ఇది ఈసారి ఆ పారీ్టకి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది’’ అని రాజకీయ, మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి గ్వాలియర్ రాజ వంశీకునిగా సింధియాపై ఈ ప్రాంతవాసులకు చెప్పలేనంత అభిమానముంది. కానీ ఆయన పార్టీ మారిన తీరు వారికి పెద్దగా నచ్చలేదు. వ్యతిరేక పవనాలు...! అంతేగాక మధ్యలో ఓ ఏడాదిన్నర మినహా రాష్ట్రంలో 18 ఏళ్లుగా బీజేపీ పాలనే సాగుతుండటంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా సింధియాకు ప్రతికూలంగా మారుతోంది. ‘‘నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మాకొచ్చే రోజువారీ కూలీ ఏ మూలకూ చాలడం లేదు. పోయినసారి బీజేపీకి ఓటేశాం. ఈసారి మాత్రం కాంగ్రెస్‌కే వేసి చూద్దామనుకుంటున్నాం’’ అన్న మాలతీ కిరార్, ఆమె సోదరుడు యోగేంద్ర మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసినా తనకిప్పటికీ ఉద్యగం దొరకలేదని భగవాన్ దాస్ అనే యువకుడు వాపోయాడు. ‘‘మూడేళ్లుగా ప్రభుత్వోద్యోగాల భర్తీయే లేదు. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?’’ అన్న ఆయన ప్రశ్న యువతలో కూడా కమలం పార్టీకి సానుకూలంగా లేదనేందుకు రుజువేనంటున్నారు. -
భద్రాద్రి మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నలువైపులా మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇటీవల జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు దంపతులు స్వామివారి దర్శనానికి భద్రాచలం రాగా, భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో శాశ్వత ప్రాతిపదికన గ్వాలియర్ షీట్లతో పందిరి నిర్మాణానికి సహకరించాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు. దీంతో ప్రతిపా దనలు రూపొందించేందుకు జీఎంఆర్ సంస్థ ఇంజనీరింగ్ అధికారులను శనివారం భద్రాచ లం పంపించగా.. ఆలయ ఈఈ రవీందర్, ఏఈవోలతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. నాలుగు వైపులా 80 వేల చదరపు అడు గుల పందిరి నిర్మాణానికి రూ.8 కోట్లు ఖర్చవు తుందని అంచనా వేశారు. కాగా దక్షిణ భాగం నుంచి తూర్పు మెట్లు, వైకుంఠ ద్వారం వరకు తొలి విడతగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట వెలుగుచూసింది. సిద్ధి జిల్లాలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను మరవకమునుపే ఈ ఘటన బయటకు వచ్చింది. కదులుతున్న వాహనంలో ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అరికాళ్లు నాకించారు. వ్యక్తిగత వైరం నేపథ్యంలో జరిగిన తాజా ఘటనపై పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కదులుతున్న వాహనంలో గోలూ గుర్జర్ అనే వ్యక్తి మరో వ్యక్తిని పదేపదే కొట్టడం, దూషిస్తూ అతడితో బలవంతంగా అరికాళ్లు నాకించడం ఉన్నాయి. అతడు చెప్పినట్లుగానే గోలూ గుర్జర్‌ను బాధితుడు పొగిడాడు. మరో వీడియో క్లిప్‌లో గోలూ గుర్జర్ చెప్పుతో బాధితుడి మొహంపై కొడుతున్నట్లుగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి కుటుంబం ఫిర్యాదు మేరకు గోలూ గుర్జర్, సుదీప్ గుర్జర్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు, బాధితుడు దబ్రా పట్టణానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. బాధితుడు మొహ్సిన్ ఖాన్ మే 21వ తేదీన గోలూ గుర్జర్‌ను కొట్టాడని గ్వాలియర్ పోలీసుఅధికారి రాజేశ్ చందేల్ చెప్పారు. దాడిపై గోలూ డబ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. కక్ష గట్టిన గోలూ గుర్జర్ తన వారితో కలిసి జూన్ 30న ఖాన్‌ను నిర్బంధించి, దాడికి దిగినట్లు చెప్పారు. -
గగన పోరాటంలో వరుణ్ తేజ్
దేశంలో జరిగిన వైమానిక దాడుల్లో మన సైనికులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఎంతటి వీరోచితంగా పోరాడతారో వరుణ్ తేజ్ చూపించనున్నారు. దేశంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా భారతీయ వైమానిక దళ పైలెట్‌గా వరుణ్ తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. ‘‘ఇప్పటివరకు చూడని భీకర వైమానిక దాడుల్లో మన వీరుల పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాం. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం గ్వాలియర్‌లో షూటింగ్ చేశాం. అక్కడి షెడ్యూల్ పూర్తయింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
చీరకట్టులో ఫుట్‌బాల్ ఇరగదీసిన మహిళలు.. వీడియో వైరల్..
భోపాల్: మహిళలు చీరకట్టులో ఫుట్‌బాల్ ఆడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో 'గోల్ ఇన్ శారీ' పేరుతో ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించారు. 20-72 ఏళ్ల మధ్య వయసున్న 8 మహిళా జట్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. మహిళలు సంప్రదాయ చీరకట్టులోనే తమ నైపుణ్యాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సీనియర్ మెంబర్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. చైత్ర నవ్రాత్ర ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈపోటీలు నిర్వహించారు. ఇంత మంది మహిళలు చీరలు ధరించి ఫుట్‌బాల్ ఆడటం దేశంలో బహుశా ఇది తొలిసారి అని నెటిజన్లు అంటున్నారు. చీరకట్టులోనూ ఫుట్‌బాల్ ఆడి సత్తాచాటారని కొనియాడారు. म्हारी महिलायें क्या #मेसी से कम हैं.. ग्वालियर में महिलाओं ने साड़ी वेशभूषा में फुटबॉल खेली। pic.twitter.com/Hi6PmTJp2i — Brajesh Rajput (@brajeshabpnews) March 27, 2023 ఈ వీడియోను చూసిన వారు బెండ్ ఇట్ లైక్ బెక్హాం మూవీలో ఓ యువతి క్యారెక్టర్ గుర్తుకువస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా యువతికి ఫుట్‌బాల్ ఆడాలని కలలు కంటుంది, కానీ సంప్రదాయ కుంటుంబానికి చెందిన పెద్దలు అందుకు ఒప్పుకోరు. కానీ సంప్రదాయ పద్ధ తులను పాటిస్తూనే యువతి తన కలను నెరవేర్చుకునే విధానం ఇన్స్పైరింగ్గా ఉంటుంది. చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..! -
చీరకట్టులో.. చెంగు చెంగున గోల్స్
-
పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్
కొన్ని ప్రభుత్వాస్పత్రులు పేరుకే పెద్ద ఆస్పత్రులు గానీ అందులో సౌకర్యాలు మాత్రం నిల్. దీంతో చికిత్స కోసం వచ్చే రోగులు పడే ఇబ్బందులు అంత ఇంత కాదు. చిన చితక పనులు చేసుకునే పేదలకు ఆ ఆస్పత్రులే గతి. దీంతో అక్కడ ప్రభుత్వోద్యోగులు వీళ్లపట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. అచ్చం అలాంటి పరిస్థితి ఓ ప్రభుత్వాస్పత్రిలో వృద్ధుడు ఎదుర్కొన్నాడు. కనీసం రోగిని తీసుకువెళ్లేందకు స్ట్రెచర్లు లేక అతని తీసుకువెళ్తున్న విధానం చూస్తే ఆ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం రాక మానదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్‌లో సుమారు వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రికి ఓ వృద్ధుడు వచ్చాడు. అతని కాలు విరిగిపోవడంతో చికిత్స కోసం తన కోడలితో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. ఐతే అక్కడ ఆర్థోపెడిక్ విభాగంలోని శ్రీకిషన్ ఓజా(65)ను ట్రామా విభాగానికి తరలించాలని సూచించారు. ఐతే అతన్ని తీసుకువెళ్లేందు కోసం స్ట్రెచర్ కోసం వెళ్లింది కానీ వాటికి చక్రాలు లేవు. దీంతో తన మామను ఒక తెల్లటి క్లాత్‌లో కూర్చొబెట్టి లాక్కుని వెళ్లింది. అక్కడ నుంచి ఆటో తీసుకుని ట్రామాకేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఐతే అక్కడ రోగులు స్ట్రెచర్లు ఉన్నాయే కానీ పనిచేయనవని చెబతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. Video: No Hospital Stretcher, Elderly Man With Broken Leg Dragged On Cloth In Gwalior Hospital https://t.co/2NAOIfdZ6W pic.twitter.com/F0uWTMiPk3 — NDTV (@ndtv) March 25, 2023 (చదవండి: మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్) -
మహాత్మాగాంధీ డిగ్రీ కూడా చేయలేదు! గవర్నర్ షాకింగ్ వ్యాఖ్యలు
భారత జాతీయ కాంగ్రెస్ మాజీ నాయకుడు మహాత్మాగాందీ ఎలాంటి డిగ్రీలు చేయలేదని జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సిన్హా గాల్వియర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..డిగ్రీ పోందడం విద్య కాదని చెబుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీకి న్యాయశాస్త్రంలో డిగ్రీ లేదని, ఆయన ఏ ఒక్క యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేయలేదని చెప్పారు. గాంధీజీ చదువుకోలేదని ఎవరూ అనరు. అలా చెప్పరు కూడా. కానీ ఆయన కేవలం హైస్పూల్ డిప్లొమాలో మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఆయనకు ఎటువంటి డిగ్రీ లేదు. అయితే చాలామంది ఆయన న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశాడనుకుంటారు కానీ ఆయన లా చేసేందుకు అర్హత సాధించాడే తప్ప డిగ్రీ లేదు. కానీ ఆయన ఎంత చదువుకున్నాడంటే దేశానికి జాతిపిత అయ్యేంతగా జ్ఞానాన్ని సముపార్జించాడు. డిగ్రీలు చేశామనే దర్పంలో మునిగిపోకండి. డిగ్రీ పొందడం చదువు కాదు. అలాగే మార్క్‌ట్వైన్ అనే కలం గురించి వినే ఉంటారు. ఆ కలంతో పుస్తకాలు రచించిన శామ్యూల్ లాంఘోర్న్ క్లెమెన్స్‌కు కూడా పెద్దగా చదుదుకోలేదు. కానీ అతను 12 ఏళ్ల వయసులోనే పాఠశాలను విడిచిపెట్టి పబ్లిక్ లైబ్రరీలలో చదువుకున్నాడన్నారు. కేవలం డిగ్రీలు చేస్తే అది విద్య కాదని తన ఎదుగదలకు, దేశ భవితవ్యానికి ఉపయోగపడేదే నిజమైన విద్య అని చ్పెపారు. అందుకు సబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. Modi’s representative in Kashmir says Mahatma Gandhi had no academic degree. These guys to justify Modi’s fake degrees can even insult Mahatma. Gandhi had a law degree from University College London. pic.twitter.com/kbkmATCBOP — Ashok Swain (@ashoswai) March 24, 2023 (చదవండి: ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత) -
ఏవండీ.. ఆవిడొచ్చింది! అంటే చెల్లుతుందా?
సినిమా వేరు.. నిజ జీవితం వేరు. సినిమాల్లో మాదిరి చేద్దామనుకుంటే చట్టాలు తొక్కిపడేస్తాయి. కాదని ముందుకు వెళ్తే.. కఠిన చర్యలకు, శిక్షలకు దారి తీస్తాయి. అలా చట్టాన్ని పట్టించుకోకుండా ముందుకు అడుగేసిన ఇద్దరు భార్యల ముద్దుల మొగుడి వాస్తవ గాథే ఇది. ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన ఏవండి.. ఆవిడవచ్చింది చిత్రం గుర్తుందా? అందులో ఇద్దరు పెళ్లాల ముద్దుల భర్తగా సోగ్గాడు శోభన్‌బాబు, భార్యలుగా వాణిశ్రీ, శారదలు ప్రేక్షకులను అలరించారు. వారంలో చెరో మూడు రోజులు భార్యల దగ్గర.. మరో రోజు ప్రశాంతంగా తల్లిదండ్రుల దగ్గర గడిపే వెసులుబాటు ఉంటుంది ఆ సినిమాలో హీరోకి. కానీ, రియల్ లైఫ్‌లో అలా చేస్తామంటే కుదురుతుందా? అలాంటి పరస్పర ఒప్పందాలు చట్టప్రకారం చెల్లుతాయా? గురుగ్రామ్‌కు చెందిన ఓ ఇంజినీర్.. 2018లో గ్వాలియర్‌కు చెందిన ఓ మహిళను పెళ్లాడాడు. రెండేళ్లు కాపురం చేశారు వాళ్లు. అయితే.. కరోనా టైంలో(2020లో) వైరస్ భయానికి ఆమెను పుట్టింటికి పంపాడు. అయితే వైరస్ ఉధృతి తగ్గాక మళ్లీ ఈమెను తీసుకెళ్లేందుకు పోనేపోలేదు ఆ వ్యక్తి. రెండేళ్లపాటు రకరకాల సాకులు చెబుతున్న భర్త తీరుపై ఆమెకు అనుమానం కలిగింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉన్నపళంగా ఒక్కతే గురుగ్రామ్‌కు వెళ్లింది. అలా వెళ్లిన ఆమెకు పెద్ద షాకే తగిలింది. కరోనా టైంలోనే ఆఫీస్‌లో ఓ కొలీగ్ అమ్మాయిని ప్రేమించి-పెళ్లి చేసుకోవడమే కాదు.. ఏకంగా ఆ టైంలో ఆమె ద్వారా ఓ బిడ్డను కూడా కనేశాడు ఆ ప్రబుద్దుడు. దీంతో ఆమె ఆఫీస్ వద్దే నిరసనకు దిగింది. ఆపై తనకు న్యాయం కావాలంటూ గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టుకు ఆశ్రయించింది. దీంతో సమన్లు జారీ చేసిన ఫ్యామిలీ కోర్టు.. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు యత్నించింది. అయినా కూడా రెండో భార్యను విడిచిపెట్టేందుకు అతను ససేమీరా అన్నాడు. దీంతో.. ఈసారి ఆ ఇద్దరు భార్యలను కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, వాళ్లు కూడా పరిస్థితిని అర్థం చేసుకోలేదు. చివరికి.. ఆ ముగ్గురు ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చారు. వారంలో మూడు రోజులు ఒకరి దగ్గర, మూడు రోజులు మరొకరి దగ్గర గడపడం.. మిగిలిన ఆదివారం ఒక్కరోజును ఆ భర్త ఛాయిస్‌కు వదిలేశారు. ఇక ఒప్పందంలో భాగంగా.. ఇద్దరికీ ఉండేందుకు చెరో ఫ్లాట్‌ను ఇవ్వడంతో పాటు జీతం చెరిసమానంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. ఈ ఒప్పందం చట్టప్రకారం చెల్లుబాటు కాదంటున్నారు వాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన న్యాయవాది హరీష్ దివాన్. ఇది పరస్పర అంగీకారంతో ముగ్గురు చేసుకున్న ఒప్పందం. ఇందులో కోర్టు పాత్రగానీ, కౌన్సిలర్ ప్రమేయంగానీ ఏమీ లేదు. ఈ ముగ్గురు హిందువులు. హిందూ చట్టాల ప్రకారం.. ఇలాంటి ఒప్పందం చెల్లదు. చట్టం ప్రకారం.. ఒక హిందువు ఒక భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే మరోకావిడను వివాహం చేసుకుంటేనే చెల్లుతుంది. కానీ, వీళ్లు తమ మానానా తాము ఒప్పందం చేసుకున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ల మీద చర్యలు ఉండొచ్చు అని చెప్పారు. -
అచ్చం అరవింద్ కేజ్రీవాల్‌లా..కానీ, చాట్ అమ్ముతూ..
మనుషులను పోలిన వాళ్లు ఏడుగురు ఉంటారని ఆర్యోక్తి. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ని పోలిన మరో వ్యక్తి చాట్ అమ్ముతూ కనిపించాడు. మద్యప్రదేశ్‌లోని గాల్వియర్‌లో కేజ్రీవాల్‌లా క్యాప్ ధరించి, ఆయన మాదిరి వేషధారణలో ఉన్నాడు. చూస్తే అరవింద్ కేజ్రీవాలే అని అనుకుంటారు. అంతలా ఉంది అతని వేషధారణ. అతను ఒక బిజీ రోడ్డుపై చాట్బండితో కనిపించాడు. తన మెనుని అక్కడే ఉన్న చెట్టుకి వేలాడదీశాడు. పైగా అతని వద్ద సమోసా, చాట్, గులాబ్ జామ్ వంటి అన్ని రకాల స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. పైగా వాటి ధర కేవలం రూ. 10 నుంచి మొదలై రూ. 30 వరకు మాత్రమే ఉంది. తాను నాణ్యతను నమ్ముతానని, తన దగ్గర మంచి నాణ్యతతో లభించే ఆహార పదార్థాలే ఉంటాయని, ఇలాంటివి మరెక్కడ ఉండవని చెబుతున్నాడు. ఈ మేరకు విశాల్ శర్మ అనే ఫుడ్ బ్లాగర్ గాల్వియర్‌లో చాట్ అమ్ముతున్న కేజ్రీవాల్ అనే క్యాప్షన్ జోడించి మరీ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ చేశాడు. అంతేగాదు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీలో అన్ని ఉచితంగా ఇస్తే, ఈయన నాణ్యతను నమ్మతారు కాబోలు అని వీడియోలో చమత్కరించాడు. దీంతో నెటిజన్లు బహుశా అతని వ్యాపారానికి ప్రభుత్వ లైసెన్సు లభించొచ్చు అని ఒకరూ, చాలా తక్కువ ధరలో మంచి స్నాక్స్ అందిస్తున్నాడు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by vishal sharma (@foodyvishal) (చదవండి: వీడియో: బెంజ్ కారులో వచ్చి డబ్బులు నేలకేసి కొట్టాడు.. ఆమె ఏం చేసిందో చూడండి) -
సుఖోయ్, మిరాజ్ ఢీ.. పైలట్ మృతి
న్యూఢిల్లీ/భరత్పూర్/మొరెనా: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)నకు చెందిన సుఖోయ్ 30ఎంకేఐ, మిరాజ్–2000 యుద్ధ విమానాలు ఢీకొన్న అరుదైన ఘటనలో ఒక పైలెట్ మృతి చెందారు. మరో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఏఎఫ్ బేస్‌గా ఉన్న గ్వాలియర్ విమానాశ్రయం నుంచి ఈ రెండు విమానాలు రోజువారీ సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరాయి. మొరెనా జిల్లా పహర్‌గఢ్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అవి ప్రమాదవశాత్తు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఘటనలో సింగిల్ సీటర్ మిరాజ్–2000 పైలెట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి చనిపోగా ట్విన్ సీటర్ సుఖోయ్ ఫ్లయిట్‌లోని ఇద్దరు పైలెట్లు ఎజెక్ట్ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వింగ్ కమాండర్ శరీర భాగాలు పహార్‌గఢ్ ప్రాంతంలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. విమాన శకలాలు కొన్ని పొరుగునే ఉన్న రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లాలోనూ పడిపోయాయి. దీనిపై ఐఏఎఫ్ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఫ్లయిట్ డేటా రికార్డుల విశ్లేషణ అనంతరమే ఘటనకు దారి తీసిన కారణాలు తెలుస్తాయన్నారు. ఐఏఎఫ్ చరిత్రలో మిరాజ్, సుఖోయ్ ఢీకొనడం ఇదే తొలిసారి. దేశంలో గత 70 ఏళ్లలో ఇలాంటి 64 ప్రమాదాల్లో 39 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారని వైమానిక నిపుణుడు అంచిత్ గుప్తా తెలిపారు. -
దారుణం.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కడతేర్చిన కూతురు..
భోపాల్: యువకుని ప్రేమ మాయలో పడి కన్నతల్లినే కడతేర్చింది ఓ యువతి. ప్రియుడితో కలిసి ఆమెను దారుణంగా హత్య చేసింది. కత్తిపోట్లతో విరుచుకుపడి క్రూరంగా చంపేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఆదివారం జరిగింది. నిందితురాలు మైనర్(17). ఆమె బాయ్‌ఫ్రెండ్ వయసు 25 ఏళ్లు. ఇద్దరినీ పోలీసులు సోమవారం అరేస్టు చేశారు. అయితే నిందితులిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మాయి తల్లి వీరిద్దరి రిలేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. అతన్ని కలవొద్దని చెప్పింది. కానీ రెండు నెలల క్రితం ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది అమ్మాయి. ఆమె మైనర్ అయినందున తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీంతో పోలీసులు ప్రియుడ్ని అరెస్టు చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలై మళ్లీ అమ్మాయిని తరచూ కలుస్తున్నాడు. దీంతో తల్లి హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తన ప్రేమకు తల్లే అడ్డుపడుతోందని భావించిన అమ్మాయి ఆమెపై కక్ష పెంచుకుంది. పథకం పన్ని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. చివరకు కటకటాల పాలైంది. చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
చదివింది ఎనిమిదో తరగతి..డజను మంది మహిళలకు టోకరా
న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తి ఏకంగా డజను మంది మహిళలను మోసం చేసి లక్షల్లో డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...వికాస్ గౌతమ్ అనే మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్ నివాసి వికాస్ యాదవ్ అనే పేరుతో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ ట్విట్టర్లలో ఐడీ క్రియేట్ చేశాడు. ఆఖరికి ప్రోఫైల్ పోటో కూడా ఒక గవర్నమెంట్ కారు పక్కన నిలబడి తీసుకున్న ఫోటోను పెట్టడంతో పలువురు సులభంగా అతని చేతిలో మోసపోయారు. ఈ మేరకు ఢిల్లీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక మహిళ వైద్యురాలు ఆన్లైన్లో అతడితో ఒక రోజు చాటింగ్ చేసింది. ఆ తర్వాత అతడిపై నమ్మకం ఏర్పడటంతో తన వివరాలన్ని చెప్పింది. దీన్నే అవకాశంగా ఉపయోగించుకుని ఏకంగా రూ. 25 వేలు బ్యాంకు నుంచి డ్రా చేశాడు. దీన్ని గమనించిన సదరు మహిళా డాక్టర్ ఆ వ్యక్తిని ఫ్రాడ్‌గా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంది. ఐతే ఆ వ్యక్తి తాను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పడంతో రాజకీయనాయకుల అండదండ ఉండి ఉంటుందని భావించి తొలుత వెనక్కు తగ్గింది. ఎట్టకేలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వికాస్ గౌతమ్ అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అతను విచారణలో డజను మంది మహిళల నుంచి లక్షల్లో డబ్బు కాజేసినట్టు తేలింది. అతను ఎనిమిదో తరగతి మాత్రమే చదివాడని, ఆ తర్వాత అతను ఇండస్ట్రీయల్ కోర్సు కూడా పూర్తి చేసినట్లు పోలీసులుల తెలిపారు. నిందితుడు వికాస్ ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని ఓ రెస్టారెంట్లో కూడా పనిచేసేవాడని తెలిపారు. అది సివిల్ కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన ప్రాంతం అని, అక్కడ కోచింగ్ తీసుకునే విద్యార్థులను చూసి ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తాడని చెప్పారు. పోలీసులు వికాస్ నేర చరిత్రను తిరగదోడారు. అతడు గతంలో ఉత్తప్రదేశ్, గాల్వియర్లలో పలు ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే..హిందీతోనే వర్క్ ఔట్ అవ్వదు! రాహుల్ కీలక వ్యాఖ్యలు) -
షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్..
భోపాల్: మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఆర్తి కుశ్వాహా అనే మహిళకు జన్మించిన ఆడ శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. చిన్నారి 2.3 కేజీల బరువు ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కమ్లా రాజా ఆస్పత్రిలో ఆర్తి కుశ్వాహ బుధవారం ప్రసవించింది. అయితే పుట్టిన బిడ్డకు నాలుగు కాళ్లు ఉండటం చూసి వైద్యులు షాక్ అయ్యారు. విషయం తెలియగానే జయారోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్ డా.ఆర్కే ధాకడ్.. వైద్య బృందంతో వెళ్లి చిన్నారిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ఆమెకు శారీరక వైకల్యం ఉంది. కొన్ని పిండాలు అదనంగా ఏర్పడుతాయి. దీనిని వైద్య శాస్త్ర భాషలో చెప్పాలంటే ఇస్కియోపాగస్ అంటారు. పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు శరీరం రెండు చోట్ల అభివృద్ధి చెందుతుంది. ఈ ఆడ శిశువు నడుము కింది భాగం రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందింది. కానీ ఆ కాళ్లు క్రియారహితంగా ఉన్నాయి. అని డా. ధాకడ్ వివరించారు. శిశువుకు ఇంకా వేరే శరీర భాగాల్లో వైకల్యం ఉందా? అని పరిశీలించిన అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉంటే ఇన్‌యాక్టివ్‌గా ఉన్న రెండు కాళ్లను శస్త్ర చికిత్స చేసి తొలగిస్తామని ధాకడ్ చెప్పారు.అప్పుడు చిన్నారి సాధారణ జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
Viral Video: గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీస్
భోపాల్: రోడ్డుపై గుండెపోటు వచ్చిన వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది మహిళా ఎస్ఐ. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళా పోలీస్ సమయస్ఫూర్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు. మహిళా ఎస్ఐ పేరు సోనం పరషార్. రొటీన్ చెకింగ్‌లో భాగంగా రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి సడెన్‌గా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతని వద్దకు వెళ్లిన సోనం.. అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అయితే అతడు తీవ్రంగా ఇబ్బందిపడటం చూసి సీపీఆర్ చేసింది. ఈలోగా అంబులెన్స్ వచ్చింది. హుటాహుటిన అతడ్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. ग्वालियर: "राहगीर को आया हार्ट अटैक, लेडी पुलिस ने CPR दे बचाई जान।" लोग ट्रैफिक सूबेदार सोनम पराशर की कर रहे जमकर तारीफ।#gwalior #CPR #heartattack pic.twitter.com/qhrrSF2mwh — The Hint News (@TheHintNews) December 13, 2022 అయితే సదరు వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ఉండకపోతే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం అయ్యేదని వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
స్నేహం ముసుగులో మైనర్‌పై అత్యాచారం, లైవ్ స్ట్రీమింగ్
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో అమానుషం దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్ నగరంలో స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేగాక లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలను తమ మిత్రునికి లైవ్‌లో స్ట్రీమ్ చేసి రాక్షస ఆనందం పొందారు. ఏడాదిగా బాలికపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించడంతో బాలిక భయపడిపోయింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే బాధితురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థమైంది. దీనిని అదునుగా భావించిన నిందితులు అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి పంపించారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది. బాలిక తల్లిదండ్రులు తన కూతురికి జరిగిన అన్యాయంపై ఝాన్సీ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మొదటగా 2021 జూన్ 2న ఓ హోటల్‌కు తీసుకెళ్లి తనపై అఘాయిత్యం చేశారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. లైంగికదాడి సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను తర్వాత వాళ్లు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని తెలిపింది. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపింది. శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. చదవండి: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. మాట్లాడాలని పిలిచి మూడు రోజులు.. -
భార్య దారుణంగా మోసం చేసిందన్న భర్త.. ఇదొక విచిత్రమైన కేసు!
పెళ్లయిన కొత్తలోనే భర్తకు భార్య, భార్యకు భర్త షాకిచ్చిన ఉదంతాలు, మోసపోయిన కథనాల గురించి వినే ఉంటారు. అయితే ఇక్కడో భర్త.. భార్య మీద అనూహ్యమైన ఆరోపణలకు దిగాడు. తన భార్య అసలు ఆడదే కాదని.. తనను మోసం చేసి అంటగట్టారంటూ వైద్య నివేదికలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన భార్యకు పురుషాంగం ఉందని.. తనను మోసం చేసి పెళ్లి చేశారంటూ ఓ వ్యక్తి ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ తొలుత ఈ పిటిషన్ స్వీకరించేందుకు తొలుత నిరాకరించింది. అయితే వైద్య పరీక్షల రిపోర్టులన్నీ పరిశీలించాక.. శుక్రవారం సదరు యువతితో పాటు ఆమె తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా నోటీసులపై స్పందించాలని ఆదేశించింది. తొలి రాత్రే షాక్.. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన వ్యక్తికి 2016లో వివాహం జరిగింది. ఆ తర్వాత చాలాకాలం పాటు ఆ అమ్మాయి కార్యానికి సహకరించలేదు. పీరియడ్స్, ఆరోగ్యం బాగోలేదంటూ వాయిదా వేస్తూ పోయారు అమ్మాయి తరపు ఇంటివాళ్లు. చాలా కాలం ఓపిక పట్టిన ఆ యువకుడు.. చివరకు తన తల్లిదండ్రులను రంగంలోకి దించి.. ఓ ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. చివరకు ఆ రాత్రి.. భార్యకు పురుషాంగం ఉందంటూ రచ్చ చేశాడు. తాను మోసపోయానని, అమ్మాయిని కాకుండా అబ్బాయిని తనకు కట్టబెట్టారని ఆ రాత్రే పెద్దలను పిలిచి పంచాయితీ పెట్టాడు. జెనెటిక్ లోపం.. Imperforate Hymen ఇంపర్‌ఫోరేట్ హైమన్.. ఇదొక జెనెటిక్ లోపం. పుట్టుకతో అండాశయాలతో స్త్రీగానే ఉన్నా.. బాహ్యంగా మాత్రం పురుషాంగం చిన్నసైజు పరిమాణంలో ఉంటుందని డాక్టర్లు తెలిపారు.ఆ అమ్మాయికి అదే సమస్య ఉంది. ఇది సర్జరీతో సరి చేయొచ్చు. కానీ, పిల్లలు పుట్టే అవకాశాలు చాలా చాలా తక్కువ!. ఆ యువతిని పరిశీలించిన వైద్యులు ఈ విషయమే ఆమె భర్తకు చెప్పారు. పుట్టుకతో వచ్చిన అడ్రినల్ హైపర్ప్లాసియా అనే జన్యుపరమైన రుగ్మతగా వెల్లడించారు. ఈ విషయం తెలిశాక.. ఆ యువతిని ఆ వ్యక్తి పుట్టింటికి పంపించేశాడు. సర్జరీ చేయించి.. తిరిగి ఆమె భర్త ఇంట్లో దిగబెట్టి వెళ్లాడు ఆమె తండ్రి. అయితే మోసం చేసి వివాహం చేయడం, పిల్లలు పుట్టే అవకాశాలు లేకపోవడంతో విడాకులకు పట్టుబట్టాడు ఆ యువకుడు. దీంతో బెదిరింపులకు దిగింది ఆ యువతి కుటుంబం. ఈ క్రమంలోనే.. సదరు వ్యక్తి స్థానిక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ కొనసాగుతున్న సమయంలో ట్రయల్ కోర్టు సదరు యువతికి నోటీసు జారీ చేసింది. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు మాత్రం.. ఆ వ్యక్తి ఆరోపణలకు తగిన ఆధారల్లేవంటూ కేసును కొట్టేసింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన యువకుడు.. న్యాయం కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో.. భర్త ఆరోపణలపై స్పందించాలంటూ ఆ యువతికి.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.