మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇల్లు నిర్మిస్తున్న కూలీలకు ఊహించని పరిణామం ఎదురైంది. 150 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి నిధి వారి కంటపడింది ఇంటి నిర్మాణం కోసం (మంగళవారం మార్చి 5న) గుంతలు తవ్వుతున్న కూలీలకు బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు లభ్యమైనాయి. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి వివాదానికి దారి తీసింది.
సంజయ్ పాల్ అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి కూలీలను పెట్టుకున్నాడు. ఈ క్రమంగా అక్కడ తవ్వుతుండగా ఇద్దరు కార్మికుల వెండి నాణేలు లభించాయి. ఈ సంగతి సంజయ్ పాల్ పొరుగువారికి తెలియడంతో వివాదం రేగింది.త మకూ వాటా కావాలని పట్టుబట్టడంతో వాగ్వాదానికి దారి తీసింది. దీంతో సంజయ్ కుమారుడు హరీష్ జంగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాటా అడిగిన ఇంటి పొరుగువారితో పాటు ఇద్దరు కార్మికులను అరెస్టు చేస్తామని చెప్పారు. కొన్ని వెండి నాణేలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయానికి సంబంధించి పురావస్తు శాఖ నుంచి వివరాలను సేకరించి తగిన చర్యలు చేపడతామని పోలీసు అధికారులు ప్రకటించారు.
కాగా ఇంటి పునాదిని తొలగిస్తుండగా నిధి కనిపించిందని, కూలీలకు 40-50 నాణేలు లభించాయని తమకు సమాచారం అందిందనీ, తాము అక్కడికే చేరుకునే సరికి అక్కడ ఎవరూ లేరని, వాటిని కార్మికులో తీసుకుని ఉంటారని హరీష్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment