Silver coins
-
అమెరికా విప్లవం ముందునాటిది.. అదిరిపోయే ధర పలికింది
17వ శతాబ్దంనాటి అత్యంత అరుదైన వెండి నాణెం అది. అందులోనూ అమెరికా విప్లవానికి ముందునాటిది. మరీ ముఖ్యంగా అమెరికాలోనే తయారైంది. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు(యూఎస్ఏ)గా అమెరికా ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించకముందునాటిది. ప్రపంచంలో ఇలాంటిది ఇంకొక్కటి మాత్రమే ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఆ చిన్ని నాణెం ఏకంగా రూ.21.28 కోట్ల ధర పలికిందని స్టేక్స్ బోవర్స్ గ్యాలరీస్ వేలం సంస్థ ప్రకటించింది. తయారుచేసినపుడు దీని ముఖ విలువ మూడు పెన్నీలు మాత్రమే. బోస్టన్ మింట్ ప్రారంభించిన కొద్ది వారాలకే 1652వ సంవత్సరంలో దీనిని ముద్రించారు. నాణేనికి ఒకవైపు న్యూ ఇంగ్లండ్(ఎన్ఈ) అన్న రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు రోమన్ అంకెల్లో మూడు అని రాసి ఉంది. న్యూ ఇంగ్లండ్ ప్రభ పెరుగుతోందని తెలియజేసేందుకు గుర్తుగా మొదట్లో కొన్నింటిని మాత్రమే ఇలా వెండితో ముద్రించారు. ప్రస్తుత మార్కెట్లో నికెల్, వెండి విలువల్లో లెక్కిస్తే దీని ధర కేవలం 1.03 అమెరికన్ డాలర్లు. కానీ అమెరికా స్వాతంత్య్రం ముందునాటిది కావడం, చారిత్రక విశేషాలుండటంతో దీనికి ఎక్కడా లేనంతటి విలువ వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం వెలుగుచూసి.. నెదర్లాండ్స్‌లో 2016లో ఒక పేస్ట్బోర్డ్ పెట్టెలో దీనిని కనుగొన్నారు. దీంతోపాటు ఒక కవర్ ఉంది. దానిపై ‘1798 డిసెంబర్లో క్విన్సీ కుటుంబానికి బోస్టన్ మింట్ నుంచి వచ్చిన సిల్వర్ టోకెన్ ఇది’అని మాత్రమే రాసి ఉంది. అయితే దీని విలువ తెలియని ఆ యజమాని దీని గురించి పట్టించుకోవడం మానేశారట. అయితే అరుదైన నాణెం వార్త అందరి నోటా పడి చివరకు దీని మూలాల గుట్టు తెల్సుకునే పని మొదలైంది. అరుదైన నాణేల ప్రమాణాలను నిర్ధారించే స్వతంత్ర ‘పీసీజీఎస్’విభాగం రంగంలోకి దిగి దీని విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా చేసింది. అయితే గతంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగిందన్న విషయం పీసీజీఎస్ పరిశోధనలో వెల్లడైంది. ఇంగ్లండ్‌కు చెందిన నాణేలను సేకరించే థామస్ బ్రాండ్ అనే పెద్దాయన 1781లో నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారి జాన్ ఆడమ్స్కు ఒక లేఖ రాశారు. ఆడమ్స్ భార్య ఎబిగేల్కు ఈ నాణేనికి ఒక సంబంధం ఉండటమే ఇందుకు కారణం. ఈ నాణేన్ని ముద్రించిన స్వర్ణకారుడు జాన్ హల్కు సవతి సోదరుడి ముని మనవరాలే ఈ ఎబిగేల్. ఇలా ఈ నాణెం ఎప్పుడు ఎక్కడ ముద్రించబడిందనే వివరాలు తెలిశాయి. ఇలాంటి మరో నాణెం గతంలో ఉండేదని మసాచుసెట్స్ హిస్టారికల్ సొసైటీ పేర్కొంది. గతంలో అమెరికాలోని యేల్ కళాశాలలో ప్రదర్శనకు ఉంచగా చోరీకి గురైంది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ‘‘నాణెం వేలం మొదలెట్టిన కేవలం 12 నిమిషాల్లోనే ఊహించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది’అని వేలంపాట నిర్వహకుడు బెన్ ఒరోజీ చెప్పారు. గతంలోనూ కొన్ని అమెరికా నాణేలు రికార్డ్ ధరలకు అమ్ముడుపోయాయి. 2013లో 1794నాటి వెండి డాలర్ నాణెం ఒక కోటి డాలర్లకు అమ్ముడుపోయింది. 1933లో ముద్రించిన డబుల్ ఈగిల్ బంగారు నాణెం మూడేళ్ల క్రితం ఒక వేలంపాటలో 1.89 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..
నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లు 'ధన త్రయోదశి' సందర్భంగా బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి సిద్దమయ్యాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటివి కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు నాణేలను అందించనున్నట్లు సమాచారం.ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలును చాలామంది శుభప్రదంగా భావిస్తారు. అయితే జ్యువెలరీకి వెళ్లి షాపింగ్ చేసే ఓపిక, సమయం లేనివారు.. ఇప్పుడు గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, తనిష్క్ మొదలైనవి ఈ యాప్‌లతో జతకట్టాయి.ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 24 క్యారెట్ల 0.1 గ్రా, 0.25 గ్రా, 1 గ్రా సాధారణ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 5గ్రా, 11.66 గ్రా, 20 గ్రా స్వచ్ఛమైన వెండి నాణేలను కూడా ఈ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. 24 క్యారెట్ల లక్ష్మీ గణేష్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్లు కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్ ద్వారా బంగారు, వెండి నాణేలను కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు ఏ జ్యువెలరీ ఎలాంటి నాణేలను అందిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి యాప్‌లని తనిఖీ చేయవచ్చు. కస్టమర్లు తప్పకుండా అధికారిక యాప్‌లను మాత్రమే తనిఖీ చేయాలి. లేకుంటే నకిలీ యాప్‌లు మోసం చేసే అవకాశం ఉంటుంది. -
సినిమా చూసి విలన్ని కనిపెడితే వెండి కాయిన్ గిఫ్ట్
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ రావణ్'. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. వెంకట సత్య దర్శకుడు. తెలుగు తమిళ జూలై 26న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే సినిమా చూడాలనుకుంటున్న ప్రేక్షకుల కోసం చిన్న కంటెస్ట్ పెట్టారు. గెలిస్తే వెండి నాణెల్ని బహుమతిగా ఇస్తామని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)ఈ సినిమాలో మాస్క్ మ్యాన్ సైకో క్యారెక్టర్ కీలకంగా ఉండనుంది. సినిమా ప్రారంభమైన గంటలోపు ఆ సైకో పాత్రధారి ఎవరనేది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని చిత్రబృందం ప్రకటించింది. అలా 1000 మందికి ఈ బహుమతిని ఇవ్వబోతున్నారు. "ఆపరేషన్ రావణ్" సినిమా చూస్తున్న ప్రేక్షకులు థియేటర్ లో నుంచి తమ ఫొటో, టికెట్, ఎవరు సైకో అనే సమాధానాన్ని 9573812831 నంబర్‌కు వాట్సాప్ చేయాలి. ఇలా పంపిన వారిలో వెయ్యి మంది ప్రేక్షకులకు ఒక్కొక్కరికి ఒక్కో సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు.(ఇదీ చదవండి: Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ) -
150 ఏళ్ల నాటి నిధి, వాటాలకోసం జగడం..చివరికి..?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇల్లు నిర్మిస్తున్న కూలీలకు ఊహించని పరిణామం ఎదురైంది. 150 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి నిధి వారి కంటపడింది ఇంటి నిర్మాణం కోసం (మంగళవారం మార్చి 5న) గుంతలు తవ్వుతున్న కూలీలకు బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు లభ్యమైనాయి. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి వివాదానికి దారి తీసింది. సంజయ్ పాల్ అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి కూలీలను పెట్టుకున్నాడు. ఈ క్రమంగా అక్కడ తవ్వుతుండగా ఇద్దరు కార్మికుల వెండి నాణేలు లభించాయి. ఈ సంగతి సంజయ్ పాల్ పొరుగువారికి తెలియడంతో వివాదం రేగింది.త మకూ వాటా కావాలని పట్టుబట్టడంతో వాగ్వాదానికి దారి తీసింది. దీంతో సంజయ్ కుమారుడు హరీష్ జంగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాటా అడిగిన ఇంటి పొరుగువారితో పాటు ఇద్దరు కార్మికులను అరెస్టు చేస్తామని చెప్పారు. కొన్ని వెండి నాణేలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయానికి సంబంధించి పురావస్తు శాఖ నుంచి వివరాలను సేకరించి తగిన చర్యలు చేపడతామని పోలీసు అధికారులు ప్రకటించారు. కాగా ఇంటి పునాదిని తొలగిస్తుండగా నిధి కనిపించిందని, కూలీలకు 40-50 నాణేలు లభించాయని తమకు సమాచారం అందిందనీ, తాము అక్కడికే చేరుకునే సరికి అక్కడ ఎవరూ లేరని, వాటిని కార్మికులో తీసుకుని ఉంటారని హరీష్ తెలిపాడు. -
136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధి..పోలీసులకు అప్పగించిన కూలీ
ఒక దినసరి కూలీ 136 ఏళ్ల బ్రిటీస్ కాలం నిధిని పోలీసులకు అప్పగించాడు ఓ కార్మికుడు. అయితే అతను తన స్థలం నుంచి చెప్పకుండా పట్టుకెళ్లాడని ఆరోపించింది ఆ భూ యజమాని. విషయం తెలుసుకున్న పోలీసులకు అక్కడకు వెళ్లితే మరో విషయం బయటపడింది. ఈ ఘటన మధ్యప్రధేశ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..మధ్యప్రదేశ్‌లోని ఓ దినసరి కూలీ కి ఓ ఇంటి కింద 136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధిని కనుగొన్నాడు. ఆ కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హలీ అహిర్వార్లోని దామోహ్ జిల్లాలోని ఇంటి తవ్వకంలో ఈ నిధిని గుర్తించాడు. అందులో సుమారు 240 వెండి నాణేలను కనుగొన్నాడు. వాటి విలు సుమారు రూ. 1.92 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆ కూలీ తొలుత తన ఇంటికి తీసుకెళ్లి.. చివరికి బాగా ఆలోచించి పోలీసులకు అప్పగించేశాడు. ఐతే ఆ స్థలం యజమానురాలు మీనాక్షి ఉపాధ్యాయ్ మాత్రం ఆ నిధిని తన స్థలంలోనే బయటపడిందని, ఆ కూలి తనకు చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు చేసింది. తాను ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపి వేయించారు. పురావస్తు శాఖకు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ నాణేలను అప్పగించారు. అంతేగాదు ఆ స్థలంలో తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ..అక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు గుర్తించింది. అక్కడ ఇంకా తవ్వకాలు జరిపి నిశితంగా దర్యాప్తు చేస్తే.. విలువైన వస్తువులు బయటపడే అవకాశం ఉందంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, ఎవరైనా పురాతన వస్తువు లేదా నిధిని కనుగొన్న వ్యక్తి దానిని 24 గంటలలోపు భారత పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్ లేదా అధీకృత అధికారికి నివేదించాలి. అలా చేయనట్లయితే ఆ వ్యక్తికి జైలు శిక్ష లేదా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. (చదవండి: దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్‌గేమ్': న్యాయశాఖ మంత్రి) -
కేంద్రం బంగారం అమ్ముతోంది.. ఇలా కొనుగోలు చేయండి!
హిందూ పురాణాల ప్రకారం, అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకనే రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పలు మింట్ కార్యాలయాల్లో సామాన్యులు బంగారం, వెండి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా ఎవరైనా గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్లను కొనుగోలు చేయాలంటే కేంద్రం ఏర్పాటు చేసిన మింట్ కేంద్రాలను సందర్శించవచ్చు. మింట్ ఔట్లెట్లలో 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాములు ఇలా ఫిజికల్‌గా, లేదంటే ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. India Government Mint Wishes you a very happy Akshaya Tritya. On this auspicious day of Akshaya Tritiya, don't forget to purchase some gold and pray to Lord Vishnu. Buy now- https://t.co/DcRBC0Ukya#akshayatritiya #BuyGold #auspacious pic.twitter.com/V0HJYLKHLm — India Government Mint (@SPMCILINDIA) April 22, 2023 మింట్ అంటే ఎమిటీ? దేశంలో డబ్బులను తయారు చేసే కేంద్రాలను మింట్ కేంద్రాలు అని పిలుస్తారు. దేశ వ్యాప్తంగా 5 మెట్రో నగరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మింట్ కేంద్రాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే? భారత ప్రభుత్వం, ఆర్బీఐ ఆధ్వర్యంలో మింట్ కార్యాలయాల్లో నోట్లు, కాయిన్స్ తయారవుతాయి. ♦ఢిల్లీలో జవహార్ వాయిపర్ భవన్ జన్ పథ్, న్యూఢిల్లీ ♦నోయిడా డీ-2 సెక్టార్ 1 ♦ముంబైలో షాహిద్ భగత్ సింగ్ రోడ్డు ♦హైదరాబాద్‌లో ఐడీఏ ఫేజ్ 2, చర్లపల్లి ♦కోల్‌కతా అలిపోరిలో ఉత్పత్తి కొనసాగుతుంది. మింట్ కేంద్రాల్లో బంగారం, వెండి ఎలా కొనుగోలు చేయాలంటే ఎవరైనా సిల్వర్, గోల్డ్ కొనుగోలు చేయాలంటే పైన పేర్కొన్న కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అయితే www.indiagovtmint.in.లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ కొనుగోళ్లను క్యాష్, డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు చెల్లించి మీకు కావాల్సిన మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. బీఐఎస్ హాల్ మార్క్‌తో సహా కేంద్రం మింట్ అవుట్లెట్లలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) హాల్ మార్క్ పొందినగోల్డ్ కాయిన్స్ మాత్రమే విక్రయాలు జరుపుతున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాదు కాయిన్స్ 24క్యారెట్ల గోల్డ్‌తో 99.9 శాతం స్వచ్ఛమైందని పేర్కొంది. గోల్డ్‌పై లోన్ కూడా దశాబ్దాల తర్వాత కూడా బంగారు నాణేలు వాటి మెరుపును కోల్పోవు. వాటి మార్కెట్ విలువ వాటి వయస్సుతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉందని భారత ప్రభుత్వ మింట్ ట్విట్టర్లో పేర్కొంది. బంగారు నాణేలను సులభంగా విక్రయించవచ్చు. లేదా బంగారు రుణాల కోసం తాకట్టుగా ఉపయోగించవచ్చు’ అని వెల్లడించింది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి! -
'మేజర్' టీమ్‌కు వెండి నాణేన్ని బహుకరించిన సీఎం
UP CM Yogi Adityanath Meets And Blesses Team Major: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. తాజాగా ఇలాంటి గొప్ప సినిమాను రూపొందించినందుకు చిత్రబృందాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ అభినందించారు. 'మేజర్' మంచి విజయం సాధించిన సందర్భంగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు మూవీ యూనిట్‌ను కలిసి ప్రశంసించారు. తర్వాత సినిమాలో 10 నిమిషాలను సీఎంకు చూపించి పూర్తి చిత్రాన్ని వీక్షించాలని వారు కోరారు. చిత్ర విశేషాలను సుధీర్ఘంగా చర్చించిన తర్వాత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరును ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తాని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం చిత్రబృందానికి, మేజర్ సందీప్ తల్లిదండ్రులకు శాలువ కప్పి, వెండి నాణేన్ని జ్ఞాపికగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు హీరో అడవి శేష్, నిర్మాత శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ) ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అడవి శేష్ పంచుకున్నారు. కాగా ఇటీవల మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఫండ్‌కు సంబంధించిన విషయం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చిత్ర యూనిట్ సమావేశమైంది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే సీడీఎస్, ఎన్డీఏ ఆశావహులకు శిక్షణ కోసం ఉపయోగిస్తామని తెలిపింది. దీంతో దేశానికి సేవ చేయాలనే వారి కలలు సాకారం అవుతాయని చిత్రబృందం పేర్కొంది. చదవండి:కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్‌షాట్స్ వైరల్ స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
CM YS Jagan Mohan Reddy Birthday: అభిమానం.. అపు'రూపం'
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా తమ అభిమానాన్ని పలువురు వినూత్నంగా చాటుకున్నారు. వెండి నాణెంపై, రావి ఆకుపై, కోడి గుడ్డుపై, విభిన్న పూలతో సీఎం జగన్ రూపాన్ని చిత్రీకరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన ఆయా చిత్రాలు ఆకర్షిస్తున్నాయి. – రాజాం సిటీ/ జగ్గయ్యపేట అర్బన్/కడియం/శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) వెండి నాణెంపై.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయన తల్లి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆప్యాయంగా అభినందించిన చిత్రాన్ని వెండి నాణెంపై చెక్కి ఔరా అనిపించారు శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన స్వర్ణకారుడు, మైక్రో ఆర్టిస్ట్ ముగడ జగదీశ్వరరావు. 3 గ్రాముల వెండిపై 60 నిమిషాల్లో దీన్ని చెక్కినట్టు ఆయన తెలిపారు. పుష్పాభిషేకం తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం వివిధ రకాల పూలతో సీఎం వైఎస్ జగన్ రూపాన్ని తీర్చిదిద్దింది. చిట్టిబంతి, చామంతి, గులాబీలను వినియోగించినట్టు సత్యనారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యం, గణపతి చెప్పారు. రావి ఆకుపై.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిత్రకారుడు అల్లి చంద్రశేఖర్.. పెన్సిల్ షేడ్స్‌తో, బియ్యం గింజలు, రాగులతో రావి ఆకుపై సీఎం జగన్ రూపాన్ని చిత్రీకరించారు. నవరత్నాలు వెరీ‘గుడ్’ నవరత్నాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళానికి చెందిన పొట్నూరి శ్రీనివాస్. కోడి గుడ్లపై నవరత్నాలతో పాటు, సీఎం జగన్ రూపాన్ని చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. -
వెండి నాణేలు: ఎగబడ్డ జనం, ఎక్కడంటే?
Silver Coins In Sindh River: ఒక్కపక్క భారీ వరదలతో మధ్యప్రదేశ్‌లో అతలాకుతలమైంది. భారీ వర్షాలు ప్రజల జీవితాల్లో బీభత్సం సృష్టించాయి. కానీ కొందరి జీవితాల్లో మాత్రం నాణేల పంట పండింది. ముఖ్యంగా వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన గుణ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక్కడి సింధు నది ఒడ్డున ఇసుకలో వెండి నాణేలు దర్శనమివ్వడంతో వాటికోసం జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆదివారం నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్న కొంతమందికి వెండి నాణెం దొరికింది. వాటిని వెతుక్కుంటూ వెళ్లిన వారికి కొన్ని నాణేలు దొరికాయి. దీంతో వార్త గ్రామం అంతటా వ్యాపించింది. ఈ నాణేలు బ్రిటిష్ రాణి విక్టోరియా కాలం నాటివిగా తెలుస్తోంది. మరికొన్ని1862 కాలం నాటివి కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో దాచిపెట్టుకున్నవి, వరదలు కారణంగా కొట్టుకుని వచ్చాయా? నదిలోకి నాణేలు ఎలా వచ్చాయి అనేదానిపై స్పష్టత లేదు. గుణ, అశోక్ నగర్ జిల్లాల్లో ఇటీవలి భారీ వర్షాల కారణంగా సింధ్ నది ఉధృతంగా మారింది. అయితే ఆదివారం పంచవాలి గ్రామంలోని సింధ్ నది వరద ఉధృతి తగ్గిన తర్వాత వెండి నాణేలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఈ వార్తలు గ్రామం మొత్తం పాకడంతో మరింత సందడి నెలకొంది. యువకులు సహా పలువురు తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరి నాణేలు సేకరించిన వారిని విచారించారు. అయితే నాణేల సేకరణపై ఎలాంటి ఆధారాలు సంబంధిత అధికారి అమర్నాథ్ తెలిపారు. సమగ్ర విచారణ అనంతరం చర్యలు చేపడతామన్నారు. -
ఇంటి పునాదిలో వెండి నాణేల కలకలం
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని యు.కొత్తపల్లి మండలంలోని కోనపాపపేటలో వెండి నాణేలు లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తీవ్ర ఉంపన్ తుపాన్ కారణంగా సముద్రంలోని అలల తాకిడికి కోనపాపపేట తీరంలో పలు ఇళ్లు నేల కూలిపోయాయి. అయితే ఓ ఇంటి పునాది గోడ కూలటంతో వెండి నాణేలు బయటకు రాలిపడ్డాయి. ఈ నాణేలు బ్రిటిష్ కాలం నాటివని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. (బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం) ఇక ఈ వెండి నాణేల కోసం స్థానిక ప్రజలు బుధవారం రాత్రి నుంచి తీరంలో వెతకటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా పెద్ద ఎత్తున కొంతమందికి వెండి నాణేలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్వం బొందు అమ్మోరియ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబం వారు చాలా ధనవంతులని, ఇంటి గోడలో వారు ఈ వెండి నాణేలు దాచిపెట్టి ఉన్నారేమో అని ప్రచారం కొనసాగుతోంది. బయటపడ్డ ఈ వెండి నాణేల విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇక పశ్చిమబెంగాల్లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఉంపన్’ తీరం దాటిన విషయం తెలిసిందే. -
వ్యవసాయ పొలంలో వెండి నాణేలు
ఆత్మకూర్: ఓ రైతు వ్యవసాయ పొలాన్ని చదును చేస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. విషయం తెలిసిన గ్రామస్తులు గుంపులుగుంపులుగా చేరి తవ్వకాలు జరిపారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని కత్తెపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండారెడ్డికి చెందిన పొలాన్ని సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి, ఆయన ద్వారా నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారం క్యాంపు గ్రామానికి చెందిన నారాయణరావు 22 ఎకరాల పొలాన్ని నెల క్రితం కొనుగోలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం సర్వే 123/ ఈలో ని పిల్లిగుట్ట వద్ద పొలాన్ని సాగు కోసం చదును చేస్తున్నాడు. ఈ సందర్భంగా తవ్వకాల్లో వెండి నాణేలు లభ్యం కావడంతో వ్యవసాయ కూలీల ద్వారా గ్రామస్తులకు సమాచారం చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో పొలం వద్దకు చేరుకుని తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు దొరికినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఆత్మకూర్ సీఐ బండారి శంకర్ నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులు, రైతుకు దొరికిన 17 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణేలు నిజాం కాలం నాటివిగా గుర్తించారు. అనంతరం తహసీల్దార్ జెకె.మోహన్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించగా. నాణేలను కలెక్టర్‌కు అందచేయనున్నట్లు తెలిపారు. కాగా, తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు బయటపడ్డాయనే ప్రచారం సాగుతోంది. -
చందుపట్లలో వెండి నాణేలు లభ్యం
- చివరి నిజాం కాలం నాటి నాణేలుగా గుర్తింపు - బంగారు నాణేలూ లభించాయని పుకార్లు - నాణేల సేకరణకు రంగలోకి దిగిన అధికారులు భువనగిరి: భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో వెండి నాణేలు బుధవారం బయటపడ్డాయి. అవి నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్జా బహద్దూర్ 7వ రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కాలానికి సంబంధించిన నాణేలుగా భావిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సంబరాలు జరుగుతున్న రోజున యాదృచ్ఛికంగా నిజాం చివరి నవాబు కాలానికి చెందిన నాణేలు లభించడం విశేషం. వివరాలు.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మాయ స్వామి తన పాత ఇంటిని రెండు సంవత్సరాల క్రితం కుర్మ సంఘానికి విక్రయించాడు.యాదగిరిగుట్ట మండలం మూటకొండూరులో కాపురం ఉంటున్నాడు. కాగా స్వామి వద్ద ఇంటిని కొనుగోలు చేసిన సంఘం ప్రతిని ధులు పాత భవనాన్ని 15 రోజుల క్రితం జేసీబీతో కూల్చివేశారు. ఇల్లు కూలగొట్టిన చోట చిన్న పిల్లలు ఆడుకుంటుండగా ఒక బాలుడికి కొన్ని నాణేలు దొరికాయి. వాటిని జేబులో వేసుకుని వెళ్తుండగా చూసిన గ్రామానికి చెం దిన రాములు అనే వ్యక్తి పిల్లవాడిని పిలిచి అడగడంతో అతను సమాధానం చెప్పకుండా పరు గు తీశాడు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీశాడు.ఈలోగా ఈ నోటా ఆనో టా ఊరంతా పాకింది. కొన్ని నాణేలను పరిశీలించి చూడగా వెండి నాణేలు అని తేలడంతో వెంటనే ఎవరికి వారే మంగళవారం రాత్రి నుంచి ఆ స్థలంలో మట్టిని తొలగిస్తూ నాణేల కోసం వెతకడం ప్రారంభించారు. కొం దరికి నాణేలు లభించాయి. అయితే ఇల్లు కూల్చిన సమయం లో తొలగిం చిన గోడల మట్టిలో కూడా నాణేలు ఉండవచ్చునని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెండు రోజులుగా ఎవరికి వారే మట్టిని తవ్వి నాణేలు తీసుకుపోయారని తెలుస్తోంది. అయితే ఇందు లో బంగారం, వెండి నాణాలు లభించి ఉండవచ్చునన్న అనుమానం వ్యక్తమౌతోంది. కాగా విషయం తెలియగానే రెవెన్యూ,పోలీస్ అధికారులు గ్రామాన్ని సందర్శించి నాణాలను అప్పగించాలని గ్రామస్తులను కోరారు. దీంతో రాత్రి వరకు 21 వెండినాణేలను చిన్న పిల్లల తెచ్చి అధికారులకు అప్పగించారు. మరో మూడు నాణేలు గ్రామానికి చెందిన మ రో వ్యక్తి వద్ద ఉన్నాయని అధికారులకు సమాచారం అం దింది. అతను ప్రస్తుతం యాదగిరిగుట్టకు కుటుంబసమేతంగా వెళ్లిన ట్లు గ్రామస్తులు తెలిపారు. శిథిలాల్లో పెద్దఎత్తున బంగా రం, వెండినాణేలు బయటపడ్డాయనిప్రచారం జరుగుతోంది. ఇవి నిజాం చివరి రాజు కాలానికి చెందనవి చందుపట్ల గ్రామంలో బయటపడిన నాణేలు నిజాం ఉల్ ముల్క్అసఫ్జాహి బహుద్దూర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం కాలానికి చెందినవిగా గుర్తించారు. ఒక్కో తులం బరువుకలిగిన ఒక్కో నాణెంపై ఎక్రుపియా(హోలిసి క్కా) అని ఉర్దులో ఉంది. నాణేం మధ్యన ఉన్న చార్మినార్ చిహ్నంలో గల ఐన్ అనే ఉర్దు అక్ష రం అలాగే 7వ నిజాం పరిపాలన కాలం 37 సంవత్సరాల కాలం(18.09,1911 నుంచి 17.09.1948)లో ముద్రించిన నాణేలు ఇవి. నాణేలపై ఉన్న కాలం ఇస్లామిక్ క్యాలెండర్ 1342 సంవత్సరంలో ముద్రించారు. ఆ ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న కాలం 1435 సంవత్సరం. దీని ప్రకారం నాణేలు క్రీస్తు శకం 1921 సంవత్సరంలో ముద్రించబడ్డాయి. అధికారులకు నాణేలు అందించిన గ్రామస్తులు నాణేలు బయటపడ్డ విషయం తెలియగానే తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ భిక్షపతి తమ సిబ్బందితో కలిసి సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు. నాణేలు దొరికిన వారు ప్రభుత్వానికి ఆప్పగించాలని కోరడంతో 21 నాణేలను పలువురు అప్పగించారు. నాణేలు అప్పగించిన వారి వివరాలు ఇప్పటి వరకు 21 గా గుర్తించారు. మొదటగా పూసల రాములు 3, చిన్న నర్సయ్య 1, పన్నీరు గంగయ్య 1, నిలిగొండ మనోజ్ 2, దంతూరి రాజయ్య 2, జూపెల్లి మత్సగిరి 4, సుబ్బురు స్పందన 2, సుబ్బురు శ్రీశైలం 2, దంతూరి లక్ష్మీ వద్ద 4 నాణేలను సేకరించినట్లు గ్రామానికి చెందిన నిలిగొండ బాల్‌రాజు వద్ద 3 నాణేలు రవాల్సి ఉన్నట్లు గ్రామ వీఆర్వో భద్రయ్య తెలిపారు. -
సులువుగా బంగారం కొనొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో సులువుగా వెండి, బంగారం కొనే విధంగా రిద్ధిసిద్ధి బులియన్స్ లిమిటెడ్ పలు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం బులియన్ ఇండియా పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసి, నెలనెలా కొంత మొత్తం కొనే విధంగా సిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పాటు త్వరలో మరో మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ఫిన్‌కర్వ్ బులియన్ ఇండియా డెరైక్టర్ సచిన్ కొఠారి తెలిపారు. ప్రతీ నెలా కనీసం రూ.1,000 మొత్తంతో బంగారం లేదా వెండిని కొనే విధంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని అందిస్తున్నామని, బ్యాంకులు, ఇతర ఆన్లైన్ బంగారంతో పోలిస్తే 5-8 శాతం తక్కువ ధరకే బంగారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం వివరాలు తెలియచేయడానికి మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొఠారి మాట్లాడుతూ ఎటువంటి అదనపు రుసుములు లేకుండా, పూర్తి రక్షణతో ఉచితంగా భద్రపర్చుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇలా కొనుగోలు చేసిన బంగారాన్ని ఐడీబీఐ బ్యాంక్ ట్రస్టీకి చెందిన వాల్ట్‌లో భద్రపరుస్తామని, ఇన్వెస్టర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారాన్ని కొని అమ్ముకోవచ్చన్నారు. ఒక గ్రాముకంటే ఎక్కువగా వున్నపుడు, వినియోగదారులు కోరుకుంటే ఫిజికల్ గోల్డ్‌ను ఇంటికి డెలివరీ చేస్తారు. దీంతో పాటు ప్రతీ నెలా స్థిరమైన పరిమాణంతో బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా గోల్డ్ ఎక్యూమలేట్ పథకాన్ని, అలాగే ప్రస్తుత ధరలో బంగారాన్ని కొని దాన్ని వాయిదా పద్థతుల్లో చెల్లించే విధంగా గోల్డ్ ఇన్స్టాల్మెంట్, అలాగే కొన్న బంగారాన్ని జ్యూవెలరీ సంస్థలకు బదలాయించి ఆభరణాలను కొనుగోలు చేసుకునే విధంగా గోల్డ్ యూనిట్ ట్రాన్సఫర్ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. స్నాప్‌డీల్ ద్వారా సత్యుగ్ గోల్డ్ ఆభరణాలు ప్రముఖ సినిమా నటి, శిల్పాశెట్టికు చెందిన సత్యుగ్ గోల్డ్ సంస్థ ఆభరణాలను స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు సత్యుగ్ గోల్డ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని స్నాప్‌డీల్ తెలిపింది.