Buy Gold, Silver Coins Directly From Govt Mint - Sakshi
Sakshi News home page

కేంద్రం బంగారం అమ్ముతోంది.. ఇలా కొనుగోలు చేయండి!..లోన్‌ కూడా పొందొచ్చు!

Published Sat, Apr 22 2023 3:23 PM | Last Updated on Sat, Apr 22 2023 5:01 PM

Buy Gold, Silver Coins Directly From Govt Mint - Sakshi

హిందూ పురాణాల ప్రకారం, అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకనే రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. 

అయితే అక్షయ తృతీయ సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పలు మింట్‌ కార్యాలయాల్లో సామాన్యులు బంగారం, వెండి కొనుగోలు చేసేలా ఏర్పాట‍్లు చేసింది. తద్వారా ఎవరైనా గోల్డ్‌ కాయిన్‌, సిల్వర్‌ కాయిన్‌లను కొనుగోలు చేయాలంటే కేంద్రం ఏర్పాటు చేసిన మింట్‌ కేంద్రాలను సందర్శించవచ్చు. మింట్‌ ఔట్‌లెట్‌లలో 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాములు ఇలా ఫిజికల్‌గా, లేదంటే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు.  

మింట్‌ అంటే ఎమిటీ? 
దేశంలో డబ్బులను తయారు చేసే కేంద్రాలను మింట్‌ కేంద్రాలు అని పిలుస‍్తారు. దేశ వ్యాప్తంగా 5 మెట్రో నగరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 

మింట్‌ కేంద్రాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే?
భారత ప్రభుత్వం, ఆర్‌బీఐ ఆధ్వర్యంలో మింట్‌ కార్యాలయాల్లో నోట్లు, కాయిన్స్‌ తయారవుతాయి.

ఢిల్లీలో జవహార్‌ వాయిపర్‌ భవన్‌ జన్‌ పథ్‌, న్యూఢిల్లీ

నోయిడా డీ-2 సెక్టార్‌ 1

ముంబైలో షాహిద్‌ భగత్‌ సింగ్‌ రోడ్డు

హైదరాబాద్‌లో ఐడీఏ ఫేజ్‌ 2, చర్లపల్లి

కోల్‌కతా అలిపోరిలో ఉత్పత్తి కొనసాగుతుంది. 
 
మింట్‌ కేంద్రాల్లో బంగారం, వెండి ఎలా కొనుగోలు చేయాలంటే
ఎవరైనా సిల్వర్‌, గోల్డ్‌ కొనుగోలు చేయాలంటే పైన పేర్కొన్న కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా అయితే www.indiagovtmint.in.లో ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. ఈ కొనుగోళ్లను క్యాష్‌, డెబిట్‌కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా నగదు చెల్లించి మీకు కావాల్సిన మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. 

బీఐఎస్‌ హాల్‌ మార్క్‌తో సహా
కేంద్రం మింట్‌ అవుట్‌లెట్‌లలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (బీఐఎస్‌) హాల్ మార్క్‌ పొందినగోల్డ్‌ కాయిన్స్‌ మాత్రమే విక్రయాలు జరుపుతున్నట్లు ట్వీట్‌ చేసింది. అంతేకాదు కాయిన్స్‌ 24క్యారెట్ల గోల్డ్‌తో 99.9 శాతం స్వచ్ఛమైందని పేర్కొంది.

గోల్డ్‌పై లోన్‌ కూడా
దశాబ్దాల తర్వాత కూడా బంగారు నాణేలు వాటి మెరుపును కోల్పోవు. వాటి మార్కెట్ విలువ వాటి వయస్సుతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉందని భారత ప్రభుత్వ మింట్ ట్విట్టర్‌లో పేర్కొంది. బంగారు నాణేలను సులభంగా విక్రయించవచ్చు. లేదా బంగారు రుణాల కోసం తాకట్టుగా ఉపయోగించవచ్చు’ అని వెల్లడించింది. 


చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్‌ కుక్‌కు ఇంతకన్నా ఏం కావాలి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement