ఈ ఫెస్టివల్ సీజన్‌లో బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్నారా? ఫిజికల్ గోల్డ్‌తో పాటు అంతే విలువ గల సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ)లను కొనుగోలు చేయొచ్చు. ఎస్‌జీబీ గోల్డ్ కోసం ఈ నెల 11 నుంచి 15 వరకు దరఖాస్తు చేస్తున్న వారికి భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాండ్లు జారీ చేస్తుంది.
20 కిలోల వరకూ కొనుగోలు
గోల్డ్ సావరిన్ బాండ్లు కొనుగోలు చేసేవారు ఒక గ్రామ్ – ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు అత్యధికంగా నాలుగు కిలోలు, ట్రస్టులు 20 కిలోల వరకూ కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ గడువు ఎనిమిదేండ్లు ఉంటుంది. ఐదేండ్ల తర్వాత అవసరమనుకుంటే బాండ్ల కొనుగోలుదారులు తప్పుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు అమలులో ఉన్న ‘కేవైసీ’ నిబంధనలే బాండ్ల కొనుగోలుకు కూడా వర్తిస్తాయి.
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 2
భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌పై జూన్ 14,2023న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 - సిరీస్ 2 సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగనుంది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ కోసం ధర ఖాస్తు చేసుకున్న వారికి భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాండ్లు జారీ చేస్తుంది. అంటే సెప్టెంబర్ 06, సెప్టెంబర్ 07, మరియు సెప్టెంబర్ 08, 2023 నాటికి గ్రాము బంగారంపై రూ. 5,923/- అని సెప్టెంబర్ 8 నాటి ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది.
ఆన్‌లైన్‌లో బాండ్లు కొనుగోలు చేసే వారికి గ్రామ్‌పై రూ.50 రాయితీతో జారీ చేసే ఇష్యూ ధర రూ.5873 అవుతుంది. అటువంటి పెట్టుబడిదారులకు, గోల్డ్ బాండ్ ఇష్యూ ధర రూ. 5,873/- ఒక గ్రాము బంగారం ధర అని ఆర్బీఐ వెల్లడించింది.
ఎస్‌బీజీ బాండ్స్‌ను ఎక్కడ కొనుగోలు చేయొచ్చు.
కమర్షియల్ బ్యాంకుల్లో ఈ సావరిన్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (shcil), క్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్), పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్ఛేంజ్ సంస్థలు అంటే నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లలో కొనుగోలు చేయొచ్చు.
ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను ఎలా కొనుగోలు చేయాలంటే?
స్టెప్1: ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి.
స్టెప్2: మెయిన్ మెనూలో ‘ఈ-సేవ'పై క్లిక్ చేయాలి
స్టెప్3: 'సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్'పై క్లిక్ చేయండి
స్టెప్4: మీరు మొదటి సారిగా ఎస్‌బీఐలో సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లైతే మీ వివరాల్ని నమోదు చేయాలి. హెడర్ ట్యాబ్ నుండి 'రిజిస్టర్' ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. అనంతరం 'నిబంధనలు - షరతులు,' ఆపై 'కంటిన్యూ.' పై క్లిక్ చేయాలి.
స్టెప్5: మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఎన్‌ఎస్‌డీఎల్ లేదా సీడీఎస్‌ఎల్ డిపాజిటరీ పార్టిసిపెంట్‌ని ఎంచుకోండి.
స్టెప్6: డీపీ ఐడీ , క్లయింట్ ఐడీని క్లిక్ చేయాలిన అనంతరం సబ్మిట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్7: మీ వివరాలను నిర్ధారించి, 'సబ్మిట్' ట్యాబ్‌ను క్లిక్ చేయండి. అనంతరం మీరు సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment