Sovereign Gold Bonds
-
గోల్డ్ బాండ్.. రివర్స్!
సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. ముఖ్యంగా దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్‌వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు ఏ మాత్రం తగ్గలేదు. ఎస్జీబీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎస్‌జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. మరోవైపు బంగారం దిగుమతులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం పెరిగిగి 376 టన్నులకు చేరాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో 325 టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకున్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఊరిస్తున్న రాబడులు ఎస్‌జీబీలపై రాబడి ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. మొదటి ఎస్జీబీ సిరీస్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఎనిమిదేళ్లలో రెట్టింపునకు పైగా రాబడి వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది సెపె్టంబర్లో ఒక ఎస్జీబీ మెచ్యూరిటీ (గడువు ముగింపు) తీరనుంది. దీనికి సంబంధించి ఎనిమిదేళ్ల క్రితం గ్రాము జారీ ధర రూ.3,007. నవంబర్‌లో మెచ్యూరిటీ తీరనున్న ఎస్‌జీబీకి సంబంధించి గ్రాము జారీ ధర రూ.3,150. ప్రస్తుతం గ్రాము ధర సుమారు రూ.7వేల స్థాయిలో ఉంది. అంటే ఎనిమిదేళ్లలోనే 130 శాతం రాబడి వచ్చింది. పైగా ఇటీవలే బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ధరలు కొంత దిగొచ్చాయి. ఎస్‌జీబీలపై చెల్లింపుల భారం తగ్గించుకునేందుకే కేంద్రం సుంకం తగ్గించిందన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమయ్యాయి. పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఒక్క ఎస్జీబీ ఇష్యూని కూడా కేంద్రం చేపట్టలేదు. సెపె్టంబర్లో తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మరింత స్పందన రావచ్చని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అనలిస్ట్ ఆమిర్ మక్దా అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల దృష్టితో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారు, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి సైతం కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. -
గోల్డ్ బాండ్లకు ఇన్వెస్టర్ల ఆదరణ...
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ భారీగా పెరిగి రూ.27,031 కోట్లకు చేరింది. పరిమాణంలో ఈ విలువ 44.34 టన్నులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2022–23లో ఈ విలువ, పరిమాణం వరుసగా రూ.6,551 కోట్లు, 12.26 టన్నులుగా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం.. 2015లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 67 విడతల్లో విక్రయాలు జరిగాయి. రూ.72,274 కోట్లు సమకూరగా, పరిమాణంలో 146.96 టన్నులకు ఈ విలువ ప్రాతినిధ్యం వహిస్తోంది. వార్షికంగా పసిడి ధర 10 గ్రామలుకు (పూర్తి స్వచ్ఛత) రూ.62,300 నుంచి రూ.73,200కు ఎగసింది. -
పెట్టుబడికి బదులు బంగారం తీసుకోవచ్చా?
ఎన్పీఎస్ టైర్1 ఖాతాదారులకు అదనంగా రూ.50,000 పెట్టుబడి మొత్తంపై పన్ను ఆదా ఉందని తెలిసింది. నూతన పన్ను విధానంలోనూ దీన్ని వినియోగించుకోవచ్చా? – జయంతి రామన్ నూతన పన్ను విధానం కింద, ఎన్పీఎస్ టైర్1 ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, మీరు అదనంగా రూ.50,000 మొత్తంపై పన్ను ఆదా చేసుకునేందుకు అవకాశం లేదు. పాత పన్ను విధానంలో ఉన్న వారే రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోగలరు. కాకపోతే మీరు పనిచేసే సంస్థలో మీ తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ ఖాతాకు జమ చేస్తున్నట్టు అయితే అప్పుడు అదనపు క్లెయిమ్‌కు అవకాశం ఉంది. మీ మూల వేతనం, డీఏలో గరిష్టంగా 10% మేర పన్ను మినహాయింపును పొందొచ్చు. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మూలవేతనం, డీఏలో 14% పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. నా వద్ద 2016–17 సంవత్సరానికి సంబంధించి 20 యూనిట్ల సావరీన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు) ఉన్నాయి. 2024 నవంబర్ 17తో వీటి గడువు ముగిసిపోతుంది. నగదు బదులు 20 గ్రాముల బంగారం తీసుకోవచ్చా? – వసంత పరిమి సావరీన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడుల కాల వ్యవధి ముగిసిన సమయంలో భౌతిక బంగారాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం లేదు. భౌతిక బంగారాన్ని కలిగి ఉండడానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన సాధనం ఎస్జీబీ. ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల పాటు పెట్టుబడులకు లాకిన్ ఉంటుంది. ఐదేళ్లు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. లాభంపై పన్ను మినహాయింపు కోరుకునే వారు ఎనిమిదేళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ ముగిసే తేదీకి మూడు రోజుల ముందు 24 క్యారట్ల బంగారం సగటు ధర ఆధారంగా చెల్లింపులు చేస్తారు. ఇన్వెస్టర్ ఎస్జీబీ కొనుగోలు సమయంలో ఇచ్చిన బ్యాంక్ ఖాతాతోనే గడువు అనంతరం మెచ్యూరిటీ మొత్తం జమ అవుతుంది. పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఈఎల్ఎస్ఎస్ పథకంలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. వీటిని అదే అస్సెట్ మేనేజ్మెంట్ నిర్వహించే పన్ను ఆదా ప్రయోజం లేని ఇతర ఈక్విటీ పథకంలోకి మార్చుకోవచ్చా? – రవి గుప్తా ఇందుకు అవకాశం లేదు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. కనుక ఈ మూడేళ్ల లాకిన్ పూర్తయిన తర్వాతే సదరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లోని పెట్టుబడులను ఇతర పథకంలోకి మార్చుకునేందుకు వీలుంటుంది. ఒక పథకం నుంచి మరో పథకంలోకి పెట్టుబడులు మళ్లించుకోవడాన్ని స్విచింగ్గా పిలుస్తారు. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. అదే ఏఎంసీకి చెందిన రెండు పథకాల మధ్య పెట్టుబడులను స్విచింగ్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలోకి పంపించుకుని, ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడదు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ గడువులోపు (మూడేళ్లు) స్విచింగ్‌ను అనుమతించడం లేదు. ఒకవేళ ఇన్వెస్టర్ మరణించిన సందర్భంలో.. సంబంధిత పెట్టుబడికి కనీసం ఏడాది ముగిసిన తర్వాతే నామినీ ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుంది. - సమాధానాలు - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గోల్డ్ బాండ్ @ రూ. 6,199
ముంబై: తదుపరి దశ సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్జీబీ)కు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా ధరను ప్రకటించింది. ఒక గ్రాము బాండుకు రూ. 6,199ను నిర్ణయించింది. వీటి సబ్‌్రస్కిప్షన్ ఈ నెల సోమవారం(18న) ప్రారంభమై ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఎస్జీబీ పథకం 2023–24– సిరీస్–3లో భాగంగా ఆర్బీఐ ఈ నెల 18–22 మధ్య పసిడి బాండ్ల సబ్ర్స్కిప్షన్కు తెరతీస్తోంది. స్మాల్, పేమెంట్, గ్రామీణ బ్యాంకులు మినహా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు వీటిని విక్రయిస్తాయి. వీటితోపాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పూర్తి స్వచ్ఛత(999)గల పసిడి సగటు ముగింపు ధర ఆధారంగా గ్రాముకు రూ. 6,199 ధరను నిర్ధారించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐతో చర్చల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకు రూ. 50 చొ ప్పున ఇన్వెస్టర్లకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడంతోపాటు.. డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది. వెరసి గోల్డ్ బాండ్ రూ. 6,149కు లభించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కాగా.. ఎస్జీబీ సిరీస్–4లో భాగంగా వచ్చే (2024) ఫిబ్రవరి 12–16 మధ్య బాండ్లను ఆఫర్ చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. -
బంగారం కొనాలని అనుకుంటున్నారా?
ఈ ఫెస్టివల్ సీజన్లో బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్నారా? ఫిజికల్ గోల్డ్‌తో పాటు అంతే విలువ గల సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లను కొనుగోలు చేయొచ్చు. ఎస్జీబీ గోల్డ్ కోసం ఈ నెల 11 నుంచి 15 వరకు దరఖాస్తు చేస్తున్న వారికి భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాండ్లు జారీ చేస్తుంది. 20 కిలోల వరకూ కొనుగోలు గోల్డ్ సావరిన్ బాండ్లు కొనుగోలు చేసేవారు ఒక గ్రామ్ – ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు అత్యధికంగా నాలుగు కిలోలు, ట్రస్టులు 20 కిలోల వరకూ కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ గడువు ఎనిమిదేండ్లు ఉంటుంది. ఐదేండ్ల తర్వాత అవసరమనుకుంటే బాండ్ల కొనుగోలుదారులు తప్పుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు అమలులో ఉన్న ‘కేవైసీ’ నిబంధనలే బాండ్ల కొనుగోలుకు కూడా వర్తిస్తాయి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 2 భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌పై జూన్ 14,2023న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 - సిరీస్ 2 సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగనుంది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ కోసం ధర ఖాస్తు చేసుకున్న వారికి భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాండ్లు జారీ చేస్తుంది. అంటే సెప్టెంబర్ 06, సెప్టెంబర్ 07, మరియు సెప్టెంబర్ 08, 2023 నాటికి గ్రాము బంగారంపై రూ. 5,923/- అని సెప్టెంబర్ 8 నాటి ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది. ఆన్లైన్లో బాండ్లు కొనుగోలు చేసే వారికి గ్రామ్‌పై రూ.50 రాయితీతో జారీ చేసే ఇష్యూ ధర రూ.5873 అవుతుంది. అటువంటి పెట్టుబడిదారులకు, గోల్డ్ బాండ్ ఇష్యూ ధర రూ. 5,873/- ఒక గ్రాము బంగారం ధర అని ఆర్బీఐ వెల్లడించింది. ఎస్బీజీ బాండ్స్‌ను ఎక్కడ కొనుగోలు చేయొచ్చు. కమర్షియల్ బ్యాంకుల్లో ఈ సావరిన్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (shcil), క్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్), పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్ఛేంజ్ సంస్థలు అంటే నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను ఎలా కొనుగోలు చేయాలంటే? స్టెప్1: ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి. స్టెప్2: మెయిన్ మెనూలో ‘ఈ-సేవ'పై క్లిక్ చేయాలి స్టెప్3: 'సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్'పై క్లిక్ చేయండి స్టెప్4: మీరు మొదటి సారిగా ఎస్బీఐలో సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లైతే మీ వివరాల్ని నమోదు చేయాలి. హెడర్ ట్యాబ్ నుండి 'రిజిస్టర్' ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. అనంతరం 'నిబంధనలు - షరతులు,' ఆపై 'కంటిన్యూ.' పై క్లిక్ చేయాలి. స్టెప్5: మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్ డిపాజిటరీ పార్టిసిపెంట్‌ని ఎంచుకోండి. స్టెప్6: డీపీ ఐడీ , క్లయింట్ ఐడీని క్లిక్ చేయాలిన అనంతరం సబ్మిట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. స్టెప్7: మీ వివరాలను నిర్ధారించి, 'సబ్మిట్' ట్యాబ్‌ను క్లిక్ చేయండి. అనంతరం మీరు సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేయొచ్చు. -
కొత్త గోల్డ్ బాండ్ స్కీమ్.. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే డిస్కౌంట్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ కొత్త ఇష్యూ ఈ నెల 11న (సోమవారం) ప్రారంభం కానుంది. 15వ తేదీ వరకూ అందుబాటులో ఉండే ఈ స్కీమ్ ఇష్యూ ధర గ్రాముకు రూ.5,923. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది రెండవ విడత బాండ్ల జారీ. జూన్ 19న వెలువడిన మొదటి విడత బాండ్ జారీలో ధర గ్రాముకు రూ.5,926. గోల్డ్ బాండ్లు– షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీ–మ్యాట్ అకౌంట్‌తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ చేస్తారు. 2015 నవంబర్‌లో ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్లు.. భౌతిక బంగారం డిమాండ్‌ను తగ్గించడం, బంగారం కొనుగోళ్ల నుంచి దేశీయ పొదుపులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపులకు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. మెచ్యూరిటీపై బాండ్లను నగదు రూపంలో రీడీమ్ చేసుకోవచ్చు. -
గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో విడత సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ 19న ప్రారంభం కానుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఇందులో భాగంగా ఒక గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409 అని ఆర్బీఐ ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు. పెట్టుబడి నాటికి ప్రకటించిన గ్రాము బంగారం విలువ ఆధారంగా వార్షికంగా 2.5 శాతం వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. గడువు తీరిన తర్వాత వచ్చే రాబడి, పెట్టుబడి మొత్తంపై పన్ను ఉండదు. ఒక ఇన్వెస్టర్ కనీసం ఒక గ్రాము నుంచి, గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్ పేమెంట్ చేసిన వారికి ఒక గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. -
సావరీన్ గ్రీన్ బాండ్ల జారీకి ఫ్రేమ్‌వర్క్
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సావరీన్ గ్రీన్ బాండ్లను జారీ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (2022–23 అక్టోబర్–మార్చి) గ్రీన్ బాండ్ల జారీ ద్వారా రూ.16,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం కేంద్ర రుణ సమీకరణలో (రూ.5.92 లక్షల కోట్లు) ఈ నిధులు భాగం కానున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022–23 బడ్జెట్లో సావరీన్ గ్రీన్ బాండ్ల జారీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలపై భారత్ నిబద్ధతను ఈ ఫ్రేమ్‌వర్క్ బలోపేతం చేస్తుందని అన్నారు. అలాగే అర్హతగల గ్రీన్ ప్రాజెక్ట్‌ల్లోకి ప్రపంచ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు. ఫ్రేమ్‌వర్క్‌లో ముఖ్యాంశాలు... ► గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల అవసరాలకు అనుగుణంగా, ఎకానమీలో కార్బన్ తీవ్రత తగ్గింపు లక్ష్యంగా జారీఅయ్యే ఈ రూపాయి డినామినేటెడ్ బాండ్ల సుదీర్ఘ కాల వ్యవధిని కలిగి ఉంటాయి. ► గ్రీన్ బాండ్ల జారీకి గరిష్టంగా 12 నెలల ముందు జరిగిన ప్రభుత్వ వ్యయాలకు ఈ సమీకరణ నిధులు పరిమితమవుతాయి. అలాగే జారీ చేసిన 24 నెలల్లోపు మొత్తం ఆదాయాన్ని ప్రాజెక్టులకు కేటాయించేలా కృషి జరగనుంది. ► గ్రీన్ బాండ్ల జారీ ద్వారా వచ్చే ఆదాయాన్ని శిలాజ ఇంధనాల వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ లేదా అణు విద్యుత్ ప్రాజెక్టులకు వినియోగించరాదు. ► అర్హత కలిగిన పెట్టుబడులు, సబ్సిడీలు, గ్రాంట్–ఇన్–ఎయిడ్స్ లేదా పన్ను మినహాయింపులు లేదా ఎంపిక చేసిన కార్యాచరణ ఖర్చుల రూపంలో గ్రీన్ బాండ్ల ప్రభుత్వ వ్యయాలు ఉంటాయి. -
నేటి నుండి పసిడి బాండ్ల విక్రయం
న్యూఢిల్లీ: తదుపరి విడత సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) విక్రయం సోమవారం ప్రారంభమై అయిదు రోజుల పాటు కొనసాగనుంది. ఇష్యూ ధరను గ్రాము బంగారానికి రూ. 5,091గా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ బాండ్ల విక్రయం చేపట్టడం ఇదే తొలిసారి. ఆన్లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్ విధానంలో చెల్లిస్తే గ్రాముకు రూ. 50 చొప్పున డిస్కౌంటు లభిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2015 నవంబర్‌లో ప్రారంభమైనప్పట్నుంచీ ఈ స్కీము ద్వారా ప్రభుత్వం రూ. 38,693 కోట్లు (సుమారు 90 టన్నుల బంగారం విలువ) సమీకరించింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో (2020–21, 2021–22) ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఏకంగా రూ. 29,040 కోట్ల మేర బాండ్లను కొనుగోలు చేశారు. ఈ స్కీము ద్వారా ఇప్పటిదాకా ప్రభుత్వం సమీకరించిన నిధుల్లో ఇది దాదాపు 75 శాతానికి సమానం కావడం గమనార్హం. -
గోల్డ్ ఈటీఎఫ్, సావనీర్ గోల్డ్ బాండ్ ఏది బెటర్?
ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో నాకు పెట్టబడులు ఉన్నాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా? – శ్రీలలిత మ్యూచువల్ ఫండ్స్ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఇన్వెస్టర్ మరణ ధ్రువీకరణ పత్రం, కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాలి. అన్నింటినీ పరిశీలించిన తర్వాత మ్యూచువల్ ఫండ్ యూనిట్లను నామినీ పేరుమీదకు అప్పుడు బదలాయిస్తారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే నేరుగా వారి పేరుతో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది. అటువంటప్పుడు పిల్లలు మేజర్ అయ్యే వరకు తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులపై సంరక్షకులుగా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్‌తోపాటు, గార్డియన్ కేవైసీ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. మీ పేరిట ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనుకుంటే, పిల్లల వయసు 18 ఏళ్లు నిండి ఉంటే అందుకు మార్గం లేదు. మీ పేరిట ఉన్న పెట్టుబడులను విక్రయించేసి, వచ్చిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత వారి పేరిట కొనుగోలు చేసుకోవాలని సూచించడమే మార్గం. మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) నుంచి పెట్టుబడిని ఫండ్స్ సంస్థలు ఆమోదించవు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనుక బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి నగదు బదిలీ చేసి, కొనుగోలు చేసుకోవాలని సూచించడమే మార్గం. గోల్డ్ ఈటీఎఫ్‌లతో సావరీన్ గోల్డ్ బాండ్లను పోల్చి చూడడం ఎలా? ఎస్‌జీబీలు మెరుగైన ఆప్షనేనా? - జోసెఫ్ బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఈటీఎఫ్‌లతో పోలిస్తే సావరీన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు) మెరుగైన ఆప్షన్ అవుతాయి. ఎస్‌జీబీలో ఇన్వెస్ట్ చేస్తే వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. బంగారం ధరల్లో వృద్ధికి ఇది అదనపు ప్రయోజనం. కానీ, గోల్డ్ ఈటీఎఫ్‌లు అలా కాదు. మార్కెట్ ధరల పరంగా వచ్చిన లాభం ఒక్కటే ప్రయోజనం. ఎస్‌జీబీల్లో వడ్డీని అదనపు ప్రయోజనం కింద చూడాలి. ఎస్‌బీజీలను కొనుగోలు చేయడం వల్ల ఎటువంటి వ్యయాలు, నిర్వహణ చార్జీల్లేవు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఎక్స్పెన్స్ రేషియో పేరిట ఒక శాతం కోల్పోవాల్సి వస్తుంది. పన్నుల పరంగా చూసినా ఎస్‌జీబీలు మెరుగైనవి. ఎస్‌జీబీల్లో బంగారం ధరల వృద్ధి రూపంలో వచ్చే లాభంపై పన్ను లేదు. 8 ఏళ్ల కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఉంచుకుంటేనే ఈ ప్రయోజనం. ఎస్‌జీబీలో పెట్టుబడిపై ఏటా స్వీకరించే 2.5 శాతం వడ్డీ ఆదాయం మాత్రం పన్ను వర్తించే ఆదాయం పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ల ఆదాయం పన్ను పరిధిలో ఉంటేనే ఎస్‌జీబీల లాభంపై పన్ను పడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో లాభం మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. అది కూడా ఈక్విటీయేతర మూలధన లాభాల పన్ను అమలవుతుందని గుర్తుంచుకోవాలి. ఒక్కలిక్విడిటీ విషయంలోనే ఎస్‌జీబీలు ఈటీఎఫ్‌ల కంటే దిగువన ఉంటాయి. ఎస్జీబీలను ఐదేళ్ల తర్వాత నుంచి ఆర్బీఐకి స్వాధీనం చేసి పెట్టుబడిని పొందొచ్చు. ఐదేళ్లలోపు అయితే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో విక్రయించుకోవాలి. ఇక్కడ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు అలా కాదు. వాటికి లిక్విడిటీ తగినంత ఉంటుంది. కనుక గడువులోపు విక్రయించుకోవాల్సిన అవసరం లేని వారికి ఎస్‌జీబీలు మెరుగైనవి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి: కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే.. -
బంగారం ఎలా ఉన్నా మెరుస్తుంది..!
ఏటా పండుగల సమయంలో బంగారం ఆభరణాలను కొనే సంప్రదాయాన్ని కొందరు అనుసరిస్తుంటారు. మరికొందరు కష్టార్జితం నుంచి ఆదా చేసుకున్న మొత్తంతో బంగారం ఆభరణాలను కొని పెట్టుకుంటారు. కొందరు అవసరం లేకపోయినా కానీ, క్లిష్ట సమయాల్లో ఆదుకుంటుందనో.. భవిష్యత్తులో తమ వారసులకు ఆస్తి రూపంలో వెళుతుందన్న ఉద్దేశంతో బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు కూడా చూడాలి. అవసరమైన మేర బంగారం ఆభరణాలను కలిగి ఉండడం తప్పుకాదు. కానీ, పరిమితికి మించి, పెట్టుబడుల కోసమని బంగారాన్ని పోగు చేసుకుంటుంటే.. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన రిస్క్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, పెట్టిన ప్రతీ రూపాయికి తగిన విలువను ఆభరణం రూపంలో పొందుతున్నామా? అని కూడా ప్రశ్నించుకోవాల్సిందే. పెట్టుబడుల కోసం, అత్యవసర సందర్భాల్లో ఆదుకుంటుందన్న భరోసా కోసం బంగారం కొనే వారికి.. భౌతిక బంగారం కాకుండా మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి గురించి సమగ్రంగా తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ బంగారం ఈటీఎఫ్‌లు అన్నవి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అందిస్తున్నవి. ఇవి ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో స్టాక్స్ మాదిరే రోజువారీగా ట్రేడ్ అవుతుంటాయి. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా.. అందుబాటులోని డిజిటల్ మార్గాల్లో ఎస్జీబీ తర్వాత అత్యంత మెరుగైన సాధనం ఇది. ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. కానీ, గోల్డ్ ఈటీఎఫ్‌లకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఎందుకంటే షేర్ల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లు ఇన్వెస్టర్ల ఖాతాలోకి వచ్చి చేరతాయి. డీమ్యాట్ ఖాతా కోసం కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉన్న వారికి ఇది సులభమైన మార్గం అవుతుంది. ఎస్‌జీబీలో మాదిరే ఇక్కడ కూడా ఒక యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఒక యూనిట్ ఒక గ్రాముకు సమానం. గరిష్ట పెట్టుబడుల పరిమితి లేదు. వ్యయాలు: స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడవుతాయి కనుక కొనుగోలుపై బ్రోకరేజీ, ఎక్సేంజ్ చార్జీలు ఉంటాయి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవు. అలాగే, గోల్డ్ ఈటీఎఫ్‌లను మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తుంటాయి కనుక ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. పెట్టుబడుల విలువపై దీన్ని ఫండ్స్ వసూలు చేస్తుంటాయి. ఉదాహరణకు ఎస్బీఐ ఈటీఎఫ్ గోల్డ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.51 శాతంగా ఉంది. ఏ ట్రేడింగ్ రోజైనా గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేసుకోవచ్చు, విక్రయించుకోవచ్చు. ఎస్‌జీబీలో మాదిరే లాభాలపై పన్ను అమలవుతుంది. రిస్క్: ఇన్వెస్టర్ కొనుగోలు చేసే ప్రతీ గోల్డ్ ఈటీఎఫ్‌కు సరిపడా బంగారాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కొనుగోలు చేస్తాయి. వాటిని వాల్ట్‌ల్లో నిల్వ చేస్తాయి. సెబీ నమోదిత కస్టోడియన్లు.. ఇలా గోల్డ్ ఈటీఎఫ్‌లకు సరిపడా బంగారాన్ని ఫండ్స్ సంస్థలు కొనుగోలు చేస్తుందీ, లేనిదీ పర్యవేక్షిస్తాయి. ఆడిటింగ్ కూడా ఉంటుంది. ఈ వివరాలను స్టాక్ ఎక్సేంజ్‌లు, సెబీకి కూడా సమర్పించాల్సి ఉంటుంది. కనుక ఇందులో రిస్క్ దాదాపుగా ఉండదు. కానీ, ఒక అంశాన్ని ఇన్వెస్టర్లు తప్పకుండా గుర్తు ంచుకోవాలి. స్టాక్స్ మాదిరే బంగారం ఈటీఎఫ్ ధరలు కూడా రోజువారీగా అంతర్జాతీయ ధరలను అనుసరించి హెచ్చు, తగ్గులకు గురవుతుంటాయి. కొనుగోలు చేసిన తర్వాత నష్టం కనిపిస్తే విక్రయిం చడం వంటి చర్యలు ఇందులో అనుకూలించవు. లిక్విడిటీ: సుమారు 13 గోల్డ్ ఈటీఎఫ్‌లు ఎన్ఎస్ఈలో లిస్ట్ అయి ఉండగా.. 11 గోల్డ్ ఈటీఎఫ్‌లు బీఎస్ఈలో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటి అన్నింటిలోనూ చురుకైన ట్రేడింగ్ ఉండడం లేదు. కనుక ఎంపిక చేసుకునే ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ పరిమాణం ఆరోగ్యకర స్థాయిలో ఉన్నదీ, లేనిదీ ఇన్వెస్టర్లు ముందుగానే పరిశీలించుకోవాలి. లిక్విడిటీ ఎక్కువగా ఉన్న ఈటీఎఫ్‌ను ఎంపిక చేసుకుంటే విక్రయించుకోవడం సులభం అవుతుంది. నిప్పన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్, హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది. అదే సమయంలో ట్రేడింగ్ కూడా ఎక్కువ పరిమాణంలో నమోదవుతుంటుంది. సార్వభౌమ బంగారం బాండ్ పసిడిని పోగు చేసుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో మార్గాల్లో సౌర్వభౌమ బంగారం బాండ్ (ఎస్జీబీ) అత్యంత మెరుగైనది. ఇందులో పెట్టే ప్రతీ రూపాయికి భారత సర్కారు హామీ ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను ఏటా పలు పర్యాయాలు ఇష్యూ చేస్తుంటుంది. ఈ బాండ్ గ్రాముల రూపంలో లభిస్తుంది. కనీసం ఒక గ్రాము నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. 2015 నవంబర్ నుంచి ఎస్జీబీలను ఆర్బీఐ విడుదల చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు, జనవరి 10 నుంచి 14వరకు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ మధ్య తదుపరి ఇష్యూలు అందుబాటులోకి రానున్నాయి. ఇష్యూ సమయంలో మార్కెట్ రేటు ఆధారంగా ఒక్కో గ్రాము రేటును ఆర్బీఐ ప్రకటిస్తుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి తర్వాత అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా ఇన్వెస్టర్‌కు చెల్లింపులు చేస్తారు. అంతేకాదు. బంగారం పెట్టుబడి పెట్టేనాటి విలువపై 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ ఆదాయం కూడా ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేసిన వారు అందుకోవచ్చు. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. కొనుగోలు మార్గాలు: ఆర్బీఐ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టల్ కార్యాలయాలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌సీఐఎల్) శాఖలు, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్సేంజ్‌లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి నేరుగా, స్టాక్ ఎక్సేంజ్‌ల సభ్యులైన బ్రోకర్ల రూపంలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్బీఐ తాజా ఇష్యూల సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే క్రితం ఇష్యూలకు సంబంధించిన ఎస్‌జీబీలు స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడ్ అవుతుంటాయి. వీటిల్లో ఏ ట్రేడింగ్ రోజైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆర్బీఐ ఇష్యూలో పాల్గొనే వారు.. ఎస్‌జీబీల కొనుగోలుకు పాన్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎస్జీబీలను డిమ్యాట్ ఖాతాలో ఉంచుకోవాలని భావిస్తే.. అప్పుడు డీపీ ఐడీ, క్లయింట్ ఐడీని కూడా దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. చెక్కు, డీడీ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల సాధనాల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నగదుతోనూ కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, రూ.20,000కే ఈ పరిమితి ఉంది. ఇంతకుమించి కొనుగోలు చేయాలనుకుంటే డిజిటల్ మార్గంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 4 కిలోల వరకు బంగారం బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. వ్యయాలు: బంగారాన్ని డెరివేటివ్ మార్గంలో కలిగి ఉండే సాధనమే ఎస్జీబీ. భౌతిక రూపానికి బదులు డాక్యుమెంట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దీనివల్ల పెద్దగా వ్యయాలు ఏవీ ఉండవు. అదే బంగారం ఆభరణాలు అయితే తయారీ చార్జీలు, వెస్టేజీ చార్జీల రూపంలో కొంత నష్టపోవాలి. పైగా తిరిగి అవసరమైనప్పుడు ఆ బంగారాన్ని మార్పిడి చేసుకోవాలన్నా, విక్రయించుకోవాలన్నా మళ్లీ తరుగు తీసేస్తారు. ఈ విధంగా కొంత నష్టం. కొనుగోలు సమయంలో జీఎస్టీ చార్జీలు చెల్లించాలి. ఇటువంటివన్నీ ఎస్‌జీబీలు, ఇతర డిజిటల్ గోల్డ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదా చేసుకోవచ్చు. పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలంటే: ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ముందుగానే పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకుంటే ఐదేళ్లు పూర్తయిన తర్వాత సాధ్యపడుతుంది. ఐదో ఏట ముగిసినప్పటి నుంచి ఏడాదికోసారి ఆర్బీఐ ప్రత్యేక విండో ద్వారా ఇందుకు అవకాశం కల్పిస్తుంది. విండో ప్రారంభానికి ముందు మూడు రోజుల సగటు బంగారం మార్కెట్ ధర ఆధారంగా కొనుగోలు ధరను ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆలోపే వైదొగాలని అనుకుంటే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో విక్రయించుకోవచ్చు. కాకపోతే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ఒక్కోరోజు ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. పన్ను: ఎస్‌జీబీపై ఏటా లభించే 2.5 శాతం ఆదాయం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి పన్ను రిటర్నుల్లో చూపించాలి. ఇన్వెస్టర్ ఆదాయం ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత లభించే మూలధన లాభం (పెట్టుబడిపై సమకూరిన లాభం)పై పన్ను ఉండదు. ఒకవేళ ఎనిమిదేళ్లలోపే ఎస్జీబీని విక్రయిస్తే కనుక అప్పుడు పన్ను బాధ్యత వేర్వేరుగా ఉంటుంది. పెట్టబడి తేదీ నుంచి మూడేళ్లు నిండక ముందే విక్రయించితే.. లాభం స్వల్పకాలిక మూలధన లాభం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. మూడేళ్లు నిండిన తర్వాత విక్రయించిన సమయంలో వచ్చిన లాభం దీర్ఘకాలిక మూలధన లాభం అవుతుంది. అప్పుడు లాభంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్ బంగారాన్ని డిజిటల్ రూపంలో ఫిన్‌టెక్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. బంగారంలో పెట్టుబడులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాధనం ఇది. ఎంఎంటీసీ పీఏఎంపీ, సేఫ్గోల్డ్, అగ్మాంట్ గోల్డ్ అనే మూడు సంస్థలు డిజిటల్ గోల్డ్‌ను నేరుగాను, ఫిన్‌టెక్ సంస్థల ద్వారా అందిస్తున్నాయి. కొనుగోలు చేసిన విలువకు సరిపడా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్ ఖాతాలో ఉంటుంది. దీనికి అంతే విలువైన భౌతిక బంగారాన్ని పైన చెప్పుకున్న మూడు సంస్థలు కొనుగోలు చేసి వాల్టుల్లో ఉంచుతాయి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే.. ఇన్వెస్టర్ తనకు అవసరనుకుంటే బంగారాన్ని భౌతిక రూపంలోడెలివరీ తీసుకోవచ్చు. లేదంటా ఆభరణాలుగానూ మార్చుకోవచ్చు. రిస్క్: ఎస్‌జీబీలపై ఆర్బీఐ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. అలాగే, గోల్డ్ ఈటీఎఫ్‌లపై సెబీ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్‌పై ప్రస్తుతానికి నియంత్రణల్లేవు. ఇటీవలి వరకు స్టాక్‌బ్రోకర్లు, వెల్త్‌మేనేజ్‌మెంట్ సంస్థలు సైతం డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేశాయి. కానీ, దీనికి దూరంగా ఉండాలని సెబీ ఆదేశించింది. డిజిటల్ గోల్డ్‌లో క్రయ, విక్రయ లావాదేవీల సేవలు 2021 సెప్టెంబర్ 10 నుంచి అందించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎంఎంటీసీ పీఏఎంపీ, సేఫ్గోల్డ్, అగ్మాంట్ గోల్డ్ అన్నవి ట్రస్టీలు. భౌతిక బంగారాన్ని ఇవి కొనుగోలు చేసి, నిల్వ చేస్తున్నాయా అన్న దానిపై క్రమం తప్పకుండా ఆడిట్లు నడుస్తుంటాయి. ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే వీటిల్లో రిస్క్ ఎక్కువ. కొనుగోళ్లు: రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈ మూడు సంస్థల వెబ్సైట్ల నుంచి నేరుగాను, వీటితో భాగస్వామ్యం కలిగిన సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గూగుల్‌పే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, కాయిన్‌బజార్ తదితర భాగస్వామ్య సంస్థలు సైతం డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఆయా సంస్థలకు కేవైసీ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సంస్థలు, ఆధార్, పాన్ తప్పనిసరిగా అడుగుతున్నాయి. ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఒక గ్రాము నుంచే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్ అయితే రూపాయితోనూ కొనుగోలు చేసుకోగల సౌలభ్యం ఉంది. సేఫ్గోల్డ్ కనీసం రూ.10 మొత్తంతో కొనుగోలుకు అనుమతిస్తోంది. వ్యయాలు: కొనుగోలు విలువపై 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు కొనుగోలు ధరలో కలసి ఉంటాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ అయితే 2.9 శాతం పేమెంట్ గేట్‌వే చార్జీలను కూడా తీసుకుంటోంది. డిజిటల్ గోల్డ్‌కు మొదటి ఐదేళ్లు స్టోరేజీ చార్జీలు ఉండవు. ఐదేళ్ల తర్వాత నుంచి సేఫ్గోల్డ్ అప్పటి విలువపై 0.24 శాతం, ఎంఎంటీసీ పీఏఎంపీ 0.4 శాతం చొప్పున స్టోరేజీ చార్జీలను వార్షికంగా వసూలు చేస్తున్నాయి. భౌతిక రూపంలో బంగారాన్ని డెలివరీ తీసుకోవాలంటే అందుకు తయారీ చార్జీలు, డెలివరీ చార్జీలను భరించాలి. మరో అంశం.. కొనుగోలు ధర, అమ్మకం ధర మధ్య వ్యత్యాసం ఇక్కడ సాధారణంగా అమలవుతుంటుంది. ఈ రూపంలోనూ ఇన్వెస్టర్లు కొంత నష్టపోవాల్సి ఉంటుంది. కాలవ్యవధి: ఆగ్మంట్ ఐదేళ్లు, సేఫ్గోల్డ్ పదేళ్లను మెచ్యూరిటీ పీరియడ్‌గా అమలు చేస్తున్నాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ ఇటువంటి నిబంధన అమలు చేయడం లేదు. కాల వ్యవధి తర్వాత విక్రయించుకోవవచ్చు. లేదంటే బంగారం బార్లు, కాయిన్లు, లేదా ఈ సంస్థలో ఒప్పందం కలిగిన జ్యుయలర్స్ నుంచి బంగారం ఆభరణాల రూపంలో డెలివరీ తీసుకోవచ్చు. టాటా గ్రూపులో భాగమైన తనిష్క్.. సేఫ్‌గోల్డ్‌తో ఒప్పందం చేసుకుంది. సేఫ్గోల్డ్ వద్ద డిజిటల్ గోల్డ్‌ను కలిగిన వారు.. తమకు కావాలనుకున్నప్పుడు సమీపంలోని తనిష్క్ స్టోర్‌కు వెళ్లి ఆభరణాలుగా మార్చుకోవచ్చు. ఇందుకు తయారీ, ఇతర చార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్‌లోనూ పన్ను బాధ్యత ఎస్‌జీబీల్లో మాదిరే ఉంటుంది. గోల్డ్ ఫండ్స్ ఇవి ఒక రకం మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకని వీటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పోర్టళ్ల నుంచి నేరుగా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. అలాగే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా అయితే డిస్ట్రిబ్యూటర్ల కమీషన్ రూపంలో అదనపు చార్జీని భరించాల్సి వస్తుంది. ఇది విడిగా ఉండదు కానీ, ఎక్స్పెన్స్ రేషియోలోనే కలుస్తుంది. వీటి కొనుగోలుకు పాన్, ఆధార్ నంబర్, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వాలి. ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉంటే తాజాగా కేవైసీ వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ పాన్, ఆధార్ వివరాల ఆధారంగా సెంట్రల్ కేవైసీ డేటాబేస్ నుంచి ఫండ్ సంస్థే వివరాలు తీసుకుంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోలుకు తక్కువలో తక్కువ రూ.4,000కుపైనే పెట్టుబడి అవసరం. కానీ, గోల్డ్ ఫండ్స్ పథకాల్లో రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వ్యయాలు/పన్నులు: ఫండ్ ఆఫ్ ఫండ్ కనుక వ్యయాలు రెండింతలు ఉంటాయి. గోల్డ్ ఫండ్స్ తన నిర్వహణలోని పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక.. అక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఒకటి అమలవుతుంది. తిరిగి గోల్డ్ ఫండ్స్ కూడా ఎక్స్పెన్స్ రేషియో వసూలు చేస్తాయి. పెట్టుబడి పెట్టిన ఏడాదిలోపు విక్రయించితే ఎగ్జిట్ లోడ్ కూడా అమలవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పోర్టళ్ల నుంచే కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. విక్రయించిన తర్వాత మీ రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాకు ఆ మొత్తం జమ అవుతుంది. బంగారంలో పెట్టబడులు అన్నింటికీ పైన ఎస్‌జీబీలో చెప్పుకున్నట్టే పన్ను బాధ్యతలు వర్తిస్తాయి. గోల్డ్ ఫండ్స్‌లో ఉన్న ఒక అనుకూలత ఏమిటంటే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీస సిప్ రూ.100 నుంచి పెట్టుకోవచ్చు. పైగా డీమ్యాట్ ఖాతా కూడా అవసరం లేదు. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడవుతాయి. కనుక విక్రయించుకునేందుకు సరిపడా వ్యాల్యూమ్ అవసరం. అదే గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఈ విధమైన లిక్విడిటీ రిస్క్ లేదు. మీరు ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. ఫండ్స్ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా మీకు చెల్లింపులు చేస్తాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్, ఎస్బీఐ గోల్డ్ ఫండ్లను ఈ విభాగంలో ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం వరకు ఉంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని పథకాలు కనుక సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుంది. -
త్వరపడండి, ప్రారంభమైన గోల్డ్ బాండ్ స్కీమ్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021–22లో నాల్గవ విడత గోల్డ్ బాండ్ల జారీ సోమవారం నుంచీ ప్రారంభమైంది. 16వ తేదీ వరకూ నాలుగు రోజులు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ధర గ్రాముకు రూ.4,807. ఆన్లైన్లో దరఖాస్తుదారులు, డిజిటల్ విధానంలో చెల్లింపుదారులకు ధరలో గ్రాముకు రూ.50 తగ్గుతుంది. అంటే గ్రాముకు ధర రూ.4,757 మాత్రమే. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 2021 వరకూ మొత్తం ఆరు దఫాలుగా గోల్డ్ బాండ్ స్కీమ్ అమలు జరుగుతుంది. దేశంలో బంగారానికి భౌతికంగా ఉన్న డిమాండ్‌ను దేశీయ పొదుపుల్లోకి మార్చడానికి ఉద్దేశించి 2015 నవంబర్‌లో గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈల ద్వారా గోల్డ్ బాండ్ కొనుగోలు చేసుకోవచ్చు. బాండ్ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఒక ఇన్వెస్టర్ లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఒక గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోగ్రాముల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ట్రస్ట్‌లకు ఈ పరిమితి 20 కిలో గ్రాములు. 2015 నవంబర్ నుంచి 2021 మార్చి నాటికి ఈ పథకం కింద 63.32 టన్నుల పరిమాణానికి సంబంధించి బంగారం బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.25,702 కోట్ల సమీకరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ 12 ఇష్యూల్లో భాగంగా రూ.16,049 కోట్ల బాండ్లను (32.35 టన్నులు) జారీ చేసింది. అంటే ఇప్పటి వరకు మొత్తం బంగారం బాండ్ల జారీలో సగానికి పైగా గత ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యాయి. చదవండి: Ola Electric Vehicles : ఏడాది కోటి ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ -
బంగారం ధరలు మరింత తగ్గుతాయా?!
న్యూఢిల్లీ: నేరుగా బంగారాన్ని కొనుగోలు చేయడం కాకుండా.. పెట్టుబడుల కోణంలో సౌర్వభౌమ బంగారం బాండ్లు(ఎస్జీబీ), బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసే ధోరణి విస్తృతమవుతోంది. ఈ ఏడాది ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లను పరిశీలిస్తే ఇదే తెలుస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఎస్జీబీ ఇష్యూల రూపంలో రూ.16,049 కోట్ల నిధులను సమీకరించింది. అంటే 32.4 టన్నులకు సమానమైన ఎస్జీబీలను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. తదుపరి ఎస్జీబీ విక్రయం ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఉండనుంది. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లను కూడా కలిపి చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 46 టన్నుల మేర పేపర్ బంగారం (పత్రాల రూపంలో) కొనుగోళ్లు నమోదయ్యాయి. భౌతికంగా పెట్టుబడి కోణంలో కొనుగోలు చేసే బంగారం ఇప్పటికీ పెద్ద మొత్తంలోనే ఉంటోంది. 2020–21 మొత్తం మీద 135 టన్నుల మేర బంగారం ఈ రూపంలో కొనుగోలుదారులను చేరొచ్చని అంచనా. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి భౌతిక బంగారంలో 102 టన్నుల మేర కొనుగోళ్లు జరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.6,062 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.6,062 కోట్ల మేర (12.9 టన్నులు) పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల రాక పెరగడం వరుసగా ఇది రెండో ఆర్థిక సంవత్సరం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం మీద 14 టన్నుల మేర పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వస్తాయని అంచనా. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) డేటా ప్రకారం ఈటీఎఫ్‌లు పేపర్గోల్డ్ కిందకే వస్తాయి. ‘‘ఎస్‌జీబీలు ఇప్పుడు బంగారం పెట్టుబడుల్లో ప్రధాన సాధనంగా అవతరించాయి. బంగారంలో పెట్టుబడుల ప్రాధాన్యతను కరోనా మహమ్మారి మరోసారి తెరముందుకు తీసుకొచ్చింది. లాక్డౌన్ల వల్ల చాలా మంది బంగారం పెట్టుబడుల కోసం పేపర్ సాధనాలను ఆశ్రయించారు. ఇక ముందూ ఎస్జీబీలకు డిమాండ్ బలంగానే ఉంటుందని అంచనా వేస్తున్నాము’’ అని మెటల్ ఫోకస్ ప్రధాన సలహాదారు చిరాగ్సేత్ తెలిపారు. ఈ నెలలో ఎస్‌జీబీల కొనుగోళ్లు 3.23 టన్నుల మేర నమోదయ్యాయి. గతేడాది ఆగస్ట్ ఎస్జీబీ ఇష్యూలో 6.35 టన్నుల బంగారం బాండ్లను ఆర్బీఐ జారీ చేసింది. ఆ తర్వాత అత్యధిక కొనుగోళ్లు ఈ నెల్లోనే (మార్చి1–5) నమోదయ్యాయి. ఎస్జీబీ పథకం 2015 నవంబర్‌లో ప్రారంభమైన తర్వాత.. 32.4 టన్నులతో అత్యధిక కొనుగోళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21)లోనే నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా మార్చిలో ఎక్కు వ కొనుగోళ్లకు కారణం.. పసిడి ధరలు దిగిరా వడం ఒక కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం. ధరలు మరింత తగ్గుతాయా? బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండడం వ్యాల్యూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్‌లో బాండ్ ఈల్డ్స్ పెరుగుతూ ఉండడం బంగారం ధరలు మరింత తగ్గుతాయన్న ఆందోళనలకు కారణమవుతోందని పేర్కొన్నారు. ‘‘బంగారం ఎన్నో రిస్క్‌లను ఎదుర్కొంటోంది. బిట్‌కాయిన్‌కు ప్రాచుర్యం పెరుగుతుండడం కూడా బంగారానికి ఒక ముప్పు. బాండ్ ఈల్డ్స్ లేదా వడ్డీ రేట్లు పెరిగే ధోరణి బంగారానికి బదులు బాండ్ల పట్ల ఆకర్షణను పెంచొచ్చు’’ అని అమెరికా కేంద్రంగా పనిచేసే అరోరా రిపోర్ట్ వ్యవస్థాపకుడు నిగమ్ ఆరోరా తెలిపారు. బంగారానికి గతంలో మాదిరి ఆకర్షణీయమైన రోజులు ముగిసినట్టేనన్నది బిట్‌కాయిన్ మద్దతుదారుల అభిప్రాయమని ఆరోరా పేర్కొన్నారు. గణనీయమైన పెట్టుబడులు పుత్తడి నుంచి ఇప్ప టికే బిట్‌కాయిన్‌లోకి వెళ్లినట్టు చెప్పారు. ఇకపైనా కొత్త పెట్టుబడుల్లో అధిక భాగం బిట్కాయిన్లలోకి వెళ్లొచ్చన్నారు. సాధారణంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తుంటే బంగారం వన్నె తగ్గడం మామూలే. ఈక్విటీలు బేలచూపులు చూసే సమయంలో పసిడి మెరుస్తుంటుంది. అయితే, బంగారాన్ని కనిష్ట ధరల వద్ద కొనుగోలు చేయొచ్చని ఆరోరా సూచించారు. -
పసిడి పెట్టుబడికి దారేదీ..?
బంగారం అంటే ఎవరికి మోజు ఉండదు చెప్పండి. ఆభరణాల రూపంలో మహిళలు, పెట్టుబడి రూపంలో ఇన్వెస్టర్లు గోల్డ్‌ను కొంటుంటారు. ఈమధ్య కాలంలో ఆన్లైన్లో గోల్డ్ కొనడమూ పెరిగింది. మరి, డిజిటల్ రూపంలో బంగారం కొనడం ఉత్తమమేనా? బంగారంలో పెట్టుబడి భద్రంగా ఉండాలంటే? రెట్టింపు రాబడి రావాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, బంగారం.. ఇవీ భారతీయుల పెట్టుబడి సాధనాలు. గోల్డ్‌లో పెట్టుబడులు అత్యంత భద్రమైనవని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ వ్యాలెట్ ద్వారా బంగారాన్ని డిజిటల్‌గా కొనడం ఒక మార్గం. అయితే ఇలాంటి ఉత్పత్తుల కొనుగోళ్లు రెగ్యులేటరీ పరిధిలోకి రావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణకు సెబీ తరహాలో బంగారాన్ని విక్రయించే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లను పర్యవేక్షించడానికి ఎలాంటి నియంత్రణ సంస్థ లేదు. రెగ్యులేటరీ నిబంధనలు వర్తించే, సురక్షితమైన బంగారు పెట్టుబడులు ఏంటో ఓసారి చూద్దాం... సావరిన్ గోల్డ్ బాండ్స్ సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్జీబీ)లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేస్తుంది. ఒక గ్రాము లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన బాండ్లను ఇస్తుంది. ఎస్జీబీ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. బాండ్ ముఖ విలువపై సంవత్సరానికి 2.5 శాతం కూపన్‌తో సార్వభౌమ హామీని కలిగి ఉంటారు. ఇది బాండ్ మెచ్యూరిటీ విలువ, బంగారం ధరల మీద ఆధారపడి ఉంటుంది. బంగారం రాబడిలో సావరిన్ గోల్డ్ బాండ్స్ క్యాపిటల్ అప్రిసియేషన్గా గుర్తింపు పొందాయి. ఈ బాండ్ల మెచ్యూరిటీ వరకు గనక ఇన్వెస్టర్ వెయిట్ చేస్తే.. వ్యక్తిగత పెట్టుబడిదారులకు మూలధన లాభాల పన్ను మినహాయించబడుతుంది. అయితే మెచ్యూరిటీ సమయం ఎనిమిది సంవత్సరాలుగా ఉంది. ఈ బాండ్లను ఆర్బీఐ తిరిగి కొనుగోలు చేసినప్పుడు ఐదేళ్ల తర్వాత ప్రీ–మెచ్యూర్ ఎగ్జిట్‌కు అనుమతించబడుతుంది. ఒకవేళ మీరు ఈ బాండ్లను ఆర్బీఐకి కాకుండా సెకండరీ మార్కెట్లో విక్రయించినట్లయితే మూలధన లాభాలపై 20 శాతం (ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపి) పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సడెన్‌గా ప్రీ–మెచ్యుర్ కంటే ముందే ఎగ్జిట్ కావాలనుకుంటే మాత్రం.. కూపన్ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు సంబంధిత బ్యాంక్ లేదా బ్రోకర్‌ను సంప్రదించాలి. ఐదేళ్లు పూర్తికాకముందే పెట్టుబడిదారులు ఎస్జీబీలను సెకండరీ మార్కెట్లో విక్రయించవచ్చు. కానీ, సంబంధిత ఇన్వెస్టర్ మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. 36 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం ఉంచినట్లయితే స్లాబ్ రేట్, 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపి 20% క్యాపిటల్ ట్యాక్స్ భరించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీలో ప్రధాన సమస్య ఏంటంటే.. ఎస్‌జీబీల విషయంలో ప్రధాన సమస్య ఏంటంటే.. సెకండరీ మార్కెట్లో కొనడం లేదా అమ్మడం అంత సులువైన అంశం కాదు. పెట్టుబడిదారుడు, బ్రోకర్‌కు ఒకే డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ)తో డిపాజిటరీ అకౌంట్ ఉంటే తప్ప ఎస్‌జీబీల బదిలీ కఠినం. ఎందుకంటే ఇంటర్ డిపాజిటరీ బదిలీని అనుమతించని ఎస్జీబీలను మాత్రమే ప్రభుత్వ సెక్యూరిటీలుగా పరిగణిస్తారు కాబట్టి! ఎస్జీబీలలో ఇంటర్ డిపాజిటరీ బదిలీకి ఆర్బీఐ అనుమతులు ఇచ్చినప్పటికీ.. డిపాజిటరీలు దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పూర్తిగా క్రమబద్ధీకరించలేదు. రిటైల్ పెట్టుబడిదారులకు స్నేహపూర్వక పన్ను విధానం ఉండగా.. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు మాత్రం ఎస్‌జీబీల ఎంట్రీ, ఎగ్జిట్‌లో ప్రతికూలతలున్నాయి.ఎస్జీబీలలో సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ పరిమితం. కొత్త ఆఫర్లు తెరిచినప్పుడు మాత్రమే ఈ బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ బైబ్యాక్ విండోను తెరిచినప్పుడు ఆయా బాండ్లను విక్రయించాల్సి ఉంటుంది. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్లలోని గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. ఈటీఎఫ్‌లు ఎస్‌జీబీల కంటే కొంచెం తక్కువ రాబడిని ఇస్తాయి. కానీ, బంగారం మీద కాగితపు రహిత, దీర్ఘకాలిక పెట్టుబడులకు, స్నేహపూర్వక ఎంపికలకు మాత్రం ఈటీఎఫ్‌లు సరైనవి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) జారీ చేసిన ప్రతి యూనిట్ ఈటీఎఫ్.. భౌతికంగా కొనుగోలు చేసిన బంగారానికి సమానవైన విలువను కలిగి ఉంటుంది. ఏఎంసీలను సెబీ రిజిస్టర్డ్ కస్టోడియన్ ధ్రువీకరిస్తారు. బంగారాన్ని భద్రపరిచే బాధ్యత కస్టోడియన్దే. గోల్డ్ ఈటీఎఫ్‌లను స్వతంత్ర ఖజానా ప్రొవైడర్ నిల్వ చేస్తారు. ఈయన రోజువారీ రికార్డ్లను నిర్వహిస్తుంటాడు. బార్ నంబర్, స్వచ్ఛత ధ్రువీకరణ పత్రాలతో రోజువారీ బంగారం ధరల కదలికలను ట్రాక్ చేస్తుంటాడు కూడా. మొబైల్ వాలెట్స్ జారీ చేసినవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఇష్యూ చేసే గోల్డ్ ఈటీఎఫ్‌ల నెలవారీ వివరాలను సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి బహిర్గత పరచాల్సి ఉంటుంది. ఎంఎఫ్‌ల గోల్డ్ హోల్డింగ్స్‌లకు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఆడిట్ కూడా జరుగుతుంది. ఈటీఎఫ్‌లలో టాస్క్ ఏంటంటే.. ఈటీఎఫ్‌ల ప్రధాన సమస్య ఏంటంటే.. ఎస్‌జీబీలతో పోల్చితే ఈటీఎఫ్‌ల ఖర్చు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎంఎఫ్‌లు ఫండ్ మేనేజ్మెంట్ ఫీజులను విధిస్తాయి. అన్ని బంగారు ఈటీఎఫ్‌లు సెకండరీ మార్కెట్లో చురుకుగా ట్రేడ్ కావు. అలాగే ధరలు అంతర్లీనంగా నికర ఆస్తి విలువల (ఎన్ఏవీ) కంటే దూరంగా ఉంటాయి. అందుకే పెట్టుబడిదారులు తమ ఎన్ఏవీలకు దగ్గరగా కోట్ చేసే ట్రేడింగ్ వాల్యూమ్స్‌తో గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవటం ఉత్తమం. అంతేకాకుండా ఎస్‌జీబీల మాదిరిగా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్‌ల మీద మూలధన లాభాల పన్ను ఉంటుంది. అది భౌతిక బంగారంపై ఎంతైతే పన్ను విధించబడుతుందో అంతే ఉంటుంది. గోల్డ్ ఫ్యూచర్స్... ఇండియాలో అతిపెద్ద సెక్యూరిటీస్ అండ్ కమొడిటీస్ ఎక్స్ఛేంజ్ కంపెనీ మల్టి కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) తీసుకొచ్చిన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే గోల్డ్ ఫ్యూచర్స్. ఎంసీఎక్స్‌లో ఒక గ్రాము విలువ నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఎంసీఎక్స్ సెబీ నియంత్రణలో ఉంటుంది. గోల్డ్ పెటల్ అనేది బాగా సక్సెస్ అయిన రిటైల్ గోల్డ్ ఇన్వెస్టర్ కాంట్రాక్ట్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్), లిక్విడ్ ఆర్డర్ బుక్ చేసే వీలుండటమే రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రధాన కారణాలని ఎంసీఎక్స్ హెడ్ శివాన్షు మెహతా చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో గోల్డ్ పెటల్ ప్రారంభమైంది. 2019–20లో గోల్డ్ పెటల్ కాంట్రాక్ట్‌లో సగటు రోజువారీ టర్నోవర్ రూ.10,163 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇది అత్యధికంగా రూ.54,415 కోట్లుగా ఉంది. ఇతర రకాల గోల్డ్ పెట్టుబడులతో పోలిస్తే.. గోల్డ్ ఫ్యూచర్స్ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. పెట్టుబడిదారులు బంగారం విలువ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ విలువలో ఆరు శాతం మార్జిన్‌ను చెల్లించవచ్చు. లేదా పూర్తి విలువను చెల్లించవచ్చు. కాకపోతే మీరు బంగారాన్ని కూడబెట్టుకోవాలనుకున్నా లేదా డెలివరీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒప్పంద గడువు ముగిసే సమయానికి పూర్తి విలువను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్ట్ ధర, అస్థిరతను బట్టి అదనపు మార్జిన్లను వసూలు చేయవచ్చు. గోల్డ్ ఫ్యూచర్స్‌లో వచ్చే ఆదాయాన్ని కమొడిటీస్ ఇన్‌కమ్‌తో కలుపుతారు. దీనికి స్లాబ్ రేట్‌ను బట్టి పన్ను విధించబడుతుంది. బంగారం... భారతీయులకు బంగారమే భారతీయులకు బంగారం అంటే.. సాంప్రదాయం, సరదా, పెట్టుబడి.. అన్నీ కలిసిన సాధనం. ప్రస్తుతం కరోనా వైరస్‌పరమైన అనిశ్చితి కారణంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. పసిడిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు పలు మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ. 2,400 కోట్ల మేర పెట్టుబడులు రావడం ఫండ్స్‌కి ప్రాచుర్యం పెరుగుతోందనడానికి నిదర్శనం. ఫిజికల్‌గా కనీసం ఒక్క గ్రాము బంగారం నాణేన్ని కొనాలంటే రూ. 5,000 దాకా వెచ్చించాల్సి ఉంటోంది. అలా కాకుండా పసిడి ఈటీఎఫ్‌లలో అత్యంత తక్కువగా రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి కాకపోతే ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి వాటి ద్వారా నెలవారీ కొద్ది కొద్దిగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. – డీపీ సింగ్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ -
గ్రాముకు రూ. 3,119 ధర..
న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేసే పసిడి బాండ్ల సిరీస్‌కు సంబంధించి గ్రాముకు రూ.3,119 ధరను కేంద్రం నిర్ణయించింది. 2018–19 సావరీన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్‌లో నాలుగో సిరీస్ కింద బాండ్ల జారీ డిసెంబర్ 24న ప్రారంభమై 28న ముగుస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారికి, డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిపేవారికి ఇష్యూ ధరలో గ్రాముపై రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన వారికి గ్రాము ధర రూ.3,069గా ఉంటుందని పేర్కొంది. అక్టోబర్‌తో ప్రారంభమైన పసిడి బాండ్ల జారీ వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ప్రతి నెలా ఉంటుంది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సే్చంజీల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. భౌతిక రూపంలో బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు, పసిడి కొనుగోళ్లకు వెచ్చిస్తున్న మొత్తాన్ని ఆర్థిక సాధనాల్లోకి మళ్లించేందుకు 2015 నవంబర్‌లో సావరీన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
గోల్డ్ బాండ్ల ద్వారా రూ.6,030 కోట్లు
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ రూ.6,030 కోట్ల విలువైన పెట్టుబడులను సమీకరించగలిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 28న జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి ట్రేడింగ్ మంగళవారం నుంచి స్టాక్ ఎక్సే్ఛంజీల్లో ప్రారంభమయిన సందర్భంలో ఆర్బీఐ తాజా ప్రకటన విడుదల చేసింది. 2015 నవంబర్ 5న తొలిసారిగా కేంద్రం గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్‌ను తగ్గించడం, ఈ మొత్తాలను పొదుపులుగా మళ్లించి ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయడం ఈ విధాన లక్ష్యం. -
24 నుంచి తాజా గోల్డ్ బాండ్ స్కీమ్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) తాజా సబ్స్క్రిప్షన్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది మొదటి గోల్డ్ బాండ్ స్కీమ్. మార్కెట్ విలువకన్నా గ్రాముకు రూ.50 తక్కువగా బాండ్ విలువ ఉంటుంది. వార్షిక వడ్డీ 2.75 శాతం. తొలి ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రతి ఆరునెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఈ బాండ్లకు ఏప్రిల్ 24–28 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. బాండ్ల కాలపరిమితి ఐదవ ఏడాది నుంచి ‘ఎగ్జిట్’ ఆప్షన్‌తో ఎనిమిది సంవత్సరాలు. ఒక వార్షిక సంవత్సరంలో గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ ఈ బాండ్ల ద్వారా కొనుగోలు చేసే వీలుంది. సబ్‌స్క్రిప్షన్‌కు వారం ముందు (సోమవారం–శుక్రవారం) ఇండియన్ బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ నిర్ణయించిన 999 ప్యూరిటీ గోల్డ్ ధర సగటును బాండ్ ధరగా స్థిరీకరించడం జరుగుతుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్, బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ ద్వారా బాండ్లు అందుబాటులో ఉంటాయి. -
గోల్డ్ బాండ్ల జారీ ఇలా..
ఆర్బీఐ మార్గదర్శకాలు * నేటి నుంచే ఆఫర్.. ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి నిర్వహణా పరమైన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీచేసింది. గోల్డ్ డిపాజిట్ పథకం, గోల్డ్ కాయిన్ అండ్ బులియన్ స్కీమ్‌లతోపాటు సావరిన్ గోల్డ్ బాండ్లను గురువారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్న సంగతి విదితమే. ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం... వాణిజ్య బ్యాంకుల శాఖల్లోనూ, నిర్దేశిత పోస్టాఫీసు శాఖల్లోని బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవొచ్చు. నవంబర్ 5వ తేదీ నుంచీ 20వ తేదీ వరకూ సాధారణ పనివేళల్లో నిర్దిష్ట శాఖలలో బాండ్లకు సంబంధించిన దరఖాస్తును ఇన్వెస్టర్లు సమర్పించాల్సి ఉంటుంది. కావల్సిన అదనపు సమాచారాన్ని అధికారులు అడిగి తెలుసుకుంటారు. * బాండ్లు చేతికి వచ్చే వరకూ ఇన్వెస్టర్ చెల్లించిన నిర్దిష్ట మొత్తంపై సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటును దరఖాస్తుదారుకు చెల్లించడం జరుగుతుంది. దరఖాస్తును దాఖలు చేసిన బ్యాంక్ బ్రాంచీలో సంబంధిత ఇన్వెస్టర్‌కు అకౌంట్ నంబర్ లేకపోతే... సదరు వ్యక్తి అందించిన అకౌంట్ సమాచారం ఆధారంగా ఎలక్ట్రానిక్ ఫండ్ బదలాయింపు ద్వారా వడ్డీ జమవుతుంది. * తమ తరఫున దరఖాస్తులను తీసుకోవడానికి బ్యాంకులు అవసరమైతే ఎన్బీఎఫ్సీ, ఎన్ఎస్సీ ఏజెంట్లు తదితరులను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. * అప్లికేషన్‌ను రద్దుచేసుకునే సౌలభ్యం ఉంది. అయితే ఇష్యూ ముగింపు తేదీ 20 వరకూ ఈ వీలు ఉంటుంది. రద్దును పాక్షికంగా అనుమతించరు. పూర్తిగా రద్దుపర్చుకోవాల్సివుం టుంది. అప్లికేషన్ రద్దు చేసుకుంటే... ఇందుకు సంబంధించి వడ్డీ చెల్లింపు ఉండబోదు. * ఈ బంగారం బాండ్లు 26వ తేదీన జారీ అవుతాయి. బాండ్లపై వడ్డీ రేటు 2.75 శాతం. బాండ్ రేటు గ్రాముకు రూ. 2,684.