న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ భారీగా పెరిగి రూ.27,031 కోట్లకు చేరింది. పరిమాణంలో ఈ విలువ 44.34 టన్నులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2022–23లో ఈ విలువ, పరిమాణం వరుసగా రూ.6,551 కోట్లు, 12.26 టన్నులుగా ఉంది.
అధికారిక సమాచారం ప్రకారం.. 2015లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 67 విడతల్లో విక్రయాలు జరిగాయి. రూ.72,274 కోట్లు సమకూరగా, పరిమాణంలో 146.96 టన్నులకు ఈ విలువ ప్రాతినిధ్యం వహిస్తోంది. వార్షికంగా పసిడి ధర 10 గ్రామలుకు (పూర్తి స్వచ్ఛత) రూ.62,300 నుంచి రూ.73,200కు ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment