ఆశించిన లక్ష్యాలకు భిన్న ఫలితాలు
తగ్గని పసిడి దిగుమతులు
సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్‌జీబీ) పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. ముఖ్యంగా దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్‌వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు ఏ మాత్రం తగ్గలేదు.
ఎస్‌జీబీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎస్‌జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. మరోవైపు బంగారం దిగుమతులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం పెరిగిగి 376 టన్నులకు చేరాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో 325 టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకున్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఊరిస్తున్న రాబడులు
ఎస్‌జీబీలపై రాబడి ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. మొదటి ఎస్‌జీబీ సిరీస్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఎనిమిదేళ్లలో రెట్టింపునకు పైగా రాబడి వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది సెపె్టంబర్‌లో ఒక ఎస్‌జీబీ మెచ్యూరిటీ (గడువు ముగింపు) తీరనుంది. దీనికి సంబంధించి ఎనిమిదేళ్ల క్రితం గ్రాము జారీ ధర రూ.3,007.
నవంబర్‌లో మెచ్యూరిటీ తీరనున్న ఎస్‌జీబీకి సంబంధించి గ్రాము జారీ ధర రూ.3,150. ప్రస్తుతం గ్రాము ధర సుమారు రూ.7వేల స్థాయిలో ఉంది. అంటే ఎనిమిదేళ్లలోనే 130 శాతం రాబడి వచ్చింది. పైగా ఇటీవలే బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ధరలు కొంత దిగొచ్చాయి.
ఎస్‌జీబీలపై చెల్లింపుల భారం తగ్గించుకునేందుకే కేంద్రం సుంకం తగ్గించిందన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమయ్యాయి. పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఒక్క ఎస్‌జీబీ ఇష్యూని కూడా కేంద్రం చేపట్టలేదు. సెపె్టంబర్‌లో తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మరింత స్పందన రావచ్చని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అనలిస్ట్ ఆమిర్ మక్దా అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల దృష్టితో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారు, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి సైతం కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment