న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడులు యువ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రిప్ ఇన్వెస్ట్ తెలిపింది. పాక్షిక పెట్టుబడుల్లో (ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్‌మెంట్స్) మిలీనియల్స్ ఇన్వెస్టర్ల సంఖ్య 60 శాతం ఉందని వెల్లడించింది. గ్రిప్ ఇన్వెస్ట్ వేదికగా 26,000 పైచిలుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. ‘మిలీనియల్స్ తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. మొత్తం ఆర్డర్లలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారుల నుండి వచి్చనవి 60 శాతం ఉన్నాయి.
జెన్ ఎక్స్ కస్టమర్లు 20 శాతం మంది ఉన్నారు. 21 ఏళ్లున్న పెట్టుబడిదారులు పాక్షిక అధిక–దిగుబడి ఆస్తులను ఎంచుకుంటున్నారు. గ్రిప్ ఇన్వెస్ట్ ప్లాట్‌ఫామ్‌లోని 77 శాతం మంది కస్టమర్లు డూ–ఇట్–యువర్‌సెల్ఫ్ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఇన్వెస్టర్లు వ్యక్తిగత పరిశోధన ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో భారత్‌లోని మిలీనియల్స్ ఉత్సుకత చూపిస్తూనే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు’ అని గ్రిప్ ఇన్వెస్ట్ వివరించింది. 1981–1996 మధ్య జని్మంచినవారిని మిలీనియల్స్‌గా, 1960 మధ్య కాలం నుంచి 1980 ప్రారంభంలో పుట్టినవారిని జెన్ ఎక్స్‌గా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment