Millennials
-
యువతరం ఎకో–యాంగ్జయిటీ! క్లైమెట్ ఛేంజ్’పై ఆందోళన..!
‘ఈ నెట్‌ఫ్లిక్స్, ఐపీఎల్ మ్యాచ్‌ల కాలంలో వాతావరణ మార్పులపై యూత్ దృష్టి పెడుతుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని చెబుతుంది డెలాయిట్ తాజా నివేదిక. ‘డెలాయిట్ 2024 జెన్ జెడ్, మిలీనియల్స్ సర్వే’ ప్రకారం వీరిలో ఎక్కువమంది ‘క్లైమెట్ ఛేంజ్’పై ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత మాట ఎలా ఉన్నా ఎకో–యాంగ్జయిటీ అనేది వారిలో కనిపించే మరో కోణం.ఢిల్లీలో ఒకరోజు...‘ఇల్లుదాటి బయటికి వెళ్లవద్దు అని పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు. అయినా సరే వారి కనుగప్పి ఇంటి నుంచి బయటికి వచ్చి అనుకున్నట్లుగానే అక్కడికి వెళ్లాను’ అంటుంది యశ్న ధృరియా. ఇంతకీ ఇరవై సంవత్సరాల యశ్న వెళ్లింది ఎక్కడికి? ఆరోజే విడుదలైన సినిమాకు కాదు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి కాదు. మహానగరంలో జరుగుతున్న గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్‌లో పాల్గొనడానికి. ‘వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్’ అంటూ పర్యావరణ సంక్షోభం గురించి యశ్న కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులకు ఆశ్చర్యంగా అనిపించింది.‘పరీక్షలో ఫెయిలైనట్లు ఏడుస్తున్నావేమిటి?’ అని అడిగారు ఒకరు. కానీ ఆ ఒకరికి తెలియనిదేమిటంటే వాతావరణానికి సంబంధించిన కీలకమైన పరీక్షను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ సంక్షోభ నేపథ్యంలో యశ్నలాంటి వాళ్లు ఆశాదీపాలై వెలుగుతున్నారు. తాము వెలుగు దారిలో పయనిస్తూ ఎంతోమందిని తమ తోపాటు తీసుకువెళుతున్నారు. ‘తెలిసో తెలియకో, ఏమీ చేయలేకో పర్యావరణ సంక్షోభంలో భాగం అవుతున్నాం’ అనే బాధ. పశ్చాత్తాపం బెంగళూరుకు చెందిన శ్రీరంజనిలో కనిపిస్తుంది. గ్లోబల్ స్ట్రైక్ మూమెంట్ ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్(ఎఫ్ఎఫ్ఎఫ్) ఇండియా’లో భాగంగా ఎన్నో కార్యక్రమాల్లో శ్రీరంజని పాల్గొంది. పర్యావరణ సంక్షోభం తాలూకు ఆందోళన తట్టుకోలేక యూత్ క్లైమెట్ యాక్టివిస్ట్లలో కొందరు ట్రీట్మెంట్కు కూడా వెళుతున్నారు. ఎన్విరాన్మెంట్ యాక్షన్ గ్రూప్ ‘దేర్ ఈజ్ నో ఎర్త్ బి’తో కలిసి పనిచేసిన దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్ అగ్రిమ ఛటర్జీ పర్యావరణ సంక్షోభంపై యూత్ ఆందోళనను దగ్గరి నుంచి గమనించింది. ‘తమ పరిధిలో వారు చేయగలిగింది చేస్తున్నారు. మరోవైపు సమస్య పెద్దగా ఉంది. కొన్నిసార్లు తాము చేస్తున్న ప్రయత్నం అర్థరహితంగా అనిపించి ఆందోళనకు గురవుతున్నారు. నిస్సహాయ స్థితిలోకి వెళుతున్నారు’ అంటుంది అగ్రిమ. బెంగళూరుకు చెందిన సైకోథెరపిస్ట్ మోహినీ సింగ్ ఎంతోమంది యువ క్లైమెట్ యాక్టివిస్ట్‌లతో కలిసి పనిచేసింది. ‘పరీక్షల్లో ఫెయిల్ కావడం, లవ్ ఫెయిల్యూర్స్, బ్రేకప్స్ సందర్భంగా ఇతరుల నుంచి సానుభూతి, ఓదార్పు దొరికినట్లు క్లెమెట్ యాంగ్జయిటీ విషయంలో దొరకదు. ఎందుకంటే అది చాలామందికి అనుభవం లేని విషయం’ అంటుంది మోహిని. శివానీ గోయల్ తన స్వరాష్ట్రం అస్సాంలో వాతావరణ విధ్వంసంపై పరిశోధన చేస్తోంది. పత్రికలకు వ్యాసాలు రాస్తుంది. సోషల్ మీడియాలో కంటెంట్‌ను క్రియేట్ చేస్తుంటుంది. ‘నా ప్రయత్నం ఏ కొంచమైనా ఫలితాన్ని ఇస్తుందా?’ అనేది తనకు తరచుగా వచ్చే సందేహం.‘చేయాల్సింది చాలా ఉంది’ అంటున్న గోయల్ ‘ఇక ఏమీ చేయలేం’ అనే నిస్సహాయ స్థితిలోకి వెళ్లి ఆందోళన బారిన పడి ఉండవచ్చుగానీ దాని నుంచి బయటపడడానికి క్లైమెట్ యాక్టివిస్ట్‌గా తిరిగి క్రియాశీలం కావడానికి ఎంతో సమయం పట్టదు. అలా తొందరగా ఆందోళన నుంచి బయటపడడమే వారి బలం. సమాజానికి వరం.ఐడియాలు ఉండగా ఆందోళన ఏలనోయి!‘పర్యావరణంపై మన ప్రేమ ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న నయన ప్రేమ్‌నాథ్ డే–టు–డే సస్టెయినబుల్ లైఫ్‌స్టైల్ ప్రాక్టీసెస్‌కు సంబంధించిన వీడియోలు, రీల్స్‌ను యువతరం ఇష్టపడుతోంది. ఆచరిస్తోంది. ‘ధరించకుండా మీరు మూలకు పడేసిన దుస్తులతో ఏంచేయాలి?’ ‘పీసీఆర్ ప్లాస్టిక్ గురించి తెలుసుకుందాం’ ‘జీరో–వేస్ట్ లైఫ్ స్టైల్’... మొదలైన వాటి గురించి బెంగళూరు చెందిన నయన ప్రేమ్‌నాథ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పాపులరయ్యాయి. ‘పర్యావరణ పరిరక్షణకు నా వంతుగా కొంత’ అనే భావనకు మద్దతును, బలాన్నీ ఇస్తున్నాయి.పశ్చిమ కనుమల పరిమళంనా మూలాలు పశ్చిమ కనుమలలలో ఉన్నాయి. ఇల్లు బెంగళూరులో ఉంది. ప్రకృతి అంటే ఇష్టం. ‘ఇండియన్ యూత్ క్లైమెట్ మూవ్మెంట్’లో కమ్యూనిటీ ఆర్గనైజర్‌ని. ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్‌తో నా ప్రయాణం మొదలైంది. ‘నేచర్ అండ్ ఫ్లూరివర్శిటీ’కి ఫౌండర్‌ని. అధిక జీతం, పెద్ద సంస్థ అనే దృష్టితో కాకుండా విలువలతో కూడిన ఉద్యోగాలు చేయడం వల్ల ఎకో యాంగ్జయిటీ తగ్గుతుంది. ఎక్కువ జీతం వచ్చే సంస్థలో పనిచేయడం కంటే, పర్యావరణ సంరక్షణకు ఉపయోగపడే సంస్థలో పనిచేస్తున్నందుకు నాకు తృప్తిగా ఉంది. పర్యావరణ సంక్షోభాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... తుఫాను ఒక్కటే. అయితే మనం వేరు వేరు పడవల్లో ఉన్నాం. పర్యావరణ సంక్షోభాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా చేయాల్సింది ఎంతో ఉంది.– శ్రీరంజని రమణ్, క్లైమెట్ యాక్టివిస్ట్ (చదవండి: కేన్స్ ఫెస్టివల్లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..) -
పాక్షిక పెట్టుబడుల్లో మిలీనియల్స్
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడులు యువ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రిప్ ఇన్వెస్ట్ తెలిపింది. పాక్షిక పెట్టుబడుల్లో (ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్) మిలీనియల్స్ ఇన్వెస్టర్ల సంఖ్య 60 శాతం ఉందని వెల్లడించింది. గ్రిప్ ఇన్వెస్ట్ వేదికగా 26,000 పైచిలుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. ‘మిలీనియల్స్ తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. మొత్తం ఆర్డర్లలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారుల నుండి వచి్చనవి 60 శాతం ఉన్నాయి. జెన్ ఎక్స్ కస్టమర్లు 20 శాతం మంది ఉన్నారు. 21 ఏళ్లున్న పెట్టుబడిదారులు పాక్షిక అధిక–దిగుబడి ఆస్తులను ఎంచుకుంటున్నారు. గ్రిప్ ఇన్వెస్ట్ ప్లాట్‌ఫామ్‌లోని 77 శాతం మంది కస్టమర్లు డూ–ఇట్–యువర్సెల్ఫ్ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఇన్వెస్టర్లు వ్యక్తిగత పరిశోధన ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో భారత్‌లోని మిలీనియల్స్ ఉత్సుకత చూపిస్తూనే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు’ అని గ్రిప్ ఇన్వెస్ట్ వివరించింది. 1981–1996 మధ్య జని్మంచినవారిని మిలీనియల్స్‌గా, 1960 మధ్య కాలం నుంచి 1980 ప్రారంభంలో పుట్టినవారిని జెన్ ఎక్స్‌గా పరిగణిస్తారు. -
చాలా మంది అప్పడు పుట్టినవాళ్లే! భారత్‌లో ఉద్యోగులపై ఆసక్తికర రిపోర్ట్
భారతదేశంలోని 10 మంది ఉద్యోగుల్లో ఏడుగురు (సుమారు 70 శాతం) మిలీనియల్స్ (1981 నుంచి 1996 మధ్య పుట్టిన వారు) ఉన్నట్లు తాజా నివేదిక ఒకటి పేర్కొంది. వీరిలోనూ 22 శాతం మంది మహిళలు కావడం గమనార్హం. ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా’ నివేదిక ప్రకారం 87 శాతం మంది మిలీనియల్స్ తమ ప్రస్తుత కంపెనీలను గొప్ప కార్యస్థలంగా భావిస్తున్నారు. మిలీనియల్స్‌లో 39 శాతం మంది మేనేజర్ స్థాయికి ఎదిగారని, ఈ కంపెనీలు అనుసరిస్తున్న ప్రగతిశీల నాయకత్వ అభివృద్ధి వ్యూహాలకు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. మిలీనియల్స్‌లో దాదాపు 52 శాతం మంది తమ యాజమాన్యాల నిర్ణయాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిదింట నాలుగు రంగాల్లో మిలీనియల్స్ బలమైన సానుకూలతను కలిగి ఉన్నారు. అయితే దీనికి విరుద్ధంగా యాజమాన్యాల పక్షపాత వైఖరి, లాభాల పంపిణీ వంటి విషయాల్లో మాత్రం అంత సానుకూలత లేదని నివేదిక పేర్కొంది. మిలీనియల్స్ కీలక రంగాలలో గణనీయమైన శాతంలో ఉన్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌లో 75 శాతం, హెల్త్‌కేర్‌లో 75 శాతం, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాలలో 72 శాతం వీరే ఉన్నారు. కార్య క్షేత్రంలో 45 శాతం మిలీనియల్స్‌కు విస్తారమైన ఆవిష్కరణ అవకాశాలు లభిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: ఆ ఉద్యోగాలకు ముప్పే.. ఐబీఎం సీఈవో కీలక వ్యాఖ్యలు -
మిలీనియల్స్ అబద్ధాల్లో మొనగాళ్లు.. ప్లే స్టార్ సర్వేలో ఆసక్తికర విషయాలు
న్యూయార్క్: అబద్ధాలు ఎవరు చెబుతారు? ఎందుకు చెబుతారు? అనే విషయాలపై జరిగిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మిగతా వారితో పోలిస్తే మిలీనియల్స్ ఎక్కువ అబద్ధాలు చెబుతారట..! అదేవిధంగా, మహిళల కంటే పురుషులే ఎక్కువగా అబద్ధాలు చెబుతారట! ఆఫీసులో అవమానాల నుంచి తప్పించుకునేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతా మంటూ ఎక్కువ మంది సమాధానమివ్వడం విశేషం. ఆన్లైన్ కేసినో ‘ప్లే స్టార్’జరిపిన ఓ సర్వేలో ఇవి వెల్లడయ్యాయి. అమెరికాలోని కొలరాడో, ఇలినాయీ, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టెన్నెస్సీ, విస్కాన్సిన్ రాష్ట్రాలకు చెందిన కొందరిపై ప్లేస్టార్ సర్వే చేపట్టింది. వీరిలో సగం మహిళలు కాగా, మిగతా సగం పురుషులు. పలు వయస్సుల వారు వివిధ సందర్భాల్లో ఎలా అబద్ధాలు చెబుతారో నమోదు చేసింది. ఈ విషయంలో 1981–1996 సంవత్సరాల మధ్య పుట్టిన మిలీనియల్స్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ వయస్సు వారిలో 13 శాతం మంది రోజులో ఒక్కసారైనా అబద్ధం చెబుతామంటూ ఒప్పుకున్నారు. అదే బేబీ బూమర్స్..1946–1964 సంవత్సరాల మధ్య పుట్టిన వారిలో ఇది రెండు శాతమే ఉంది. ఈ విషయంలో 1997–2021ల మధ్య జన్మించిన జనరేషన్ జెడ్, 1965–1980 మధ్య పుట్టిన జనరేషన్ ఎక్స్ వారి ప్రవర్తన ఒకే విధంగా ఉండటం గమనార్హం. ఈ రెండు గ్రూపుల వారిలో కేవలం 5 శాతం మంది రోజూ కనీసం ఒక్కసారి అబద్ధమాడుతామని చెప్పారు. ఎందుకు అబద్ధం? సర్వేలో పాల్గొన్న మిలీనియల్స్‌లో మూడో వంతు మంది ఈ ఏడాదిలో రెజ్యుమెలో వివరాలను తారుమారు చేసినట్టుగా అంగీకరించారు. పని చేసే ప్రాంతంలో అవమానకర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతామంటూ మిలీనియల్స్‌లో ప్రతి అయిదుగురిలో ఇద్దరు అంగీకరించారు. ఇంకా సోషల్ మీడియాలో కూడా. ఎదుటి వారి దృష్టిలో పడేందుకు అబద్ధాలు చెబుతామంటూ మిలీనియల్స్‌లో 23 శాతం మంది, జెడ్ జనరేషన్లో 21 శాతం మంది అంగీకరించారని ప్లే స్టార్ సర్వేలో తేలింది. మిలీనియల్స్‌లో మెజారిటీ మంది దృష్టంతా డబ్బు, కీర్తి ప్రతిష్టల సంపాదనపైనే ఉంటుందని 2012లో పర్సనా లిటీ అండ్ సోషల్ సైకాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం కూడా చెప్పిందని ప్లే స్టార్ గుర్తు చేసింది. అయితే ఇందుకు విరుద్ధంగా, సర్వేలో పాల్గొన్న 79 శాతం మంది ఆన్లైన్లో ఎన్నడూ మోసం చేయలేదని చెప్పుకున్నారని సర్వే తెలిపింది. మిగతా జనరేషన్స్ వాళ్లు మాత్రం నిజాయతీయే ఉత్తమమని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఏడాది పూర్తి స్థాయిలో నిజాయతీగా ఉంటామంటూ జనరేషన్ ఎక్స్‌కు చెందిన ప్రతి 10 మందిలో 9 మంది, బేబీ బూమర్స్ జనరేషన్‌కు చెందిన ప్రతి అయిదు గురిలో నలుగురు సమాధానమిచ్చారు. పురుషులు అబద్ధాల్లో ముందు మహిళలతో పోలిస్తే సోషల్ మీడియాలో పురుషులు 10% ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారని సర్వే గుర్తించింది. రోజులో ఒక్క సారైనా అబద్ధం చెబుతామని మహిళల్లో 23 శాతం మంది ఒప్పుకోగా, అదే పురుషుల్లో ఇది 26 శాతంగా ఉండటం విశేషం. ఎదుటి వాళ్లు చెప్పేది అబద్ధమా కాదా అనే విషయాన్ని 97% మంది వరకు గుర్తించలేక పోతున్నారని కూడా సర్వే గుర్తించింది. అదేవిధంగా, చెప్పిన ప్రతి అబద్ధమూ హానికరం కాదన్న విషయం సర్వేలో వెల్లడైంది. అవమానకర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకంటూ 58 శాతం మంది, గోప్యతను కాపాడుకునేందుకు 42% మంది, ఇతరులకు ఇబ్బంది రాకూడదని 42% మంది అబద్ధమాడుతామని చెప్పడం విశేషం. ఇదీ చదవండి: వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్! -
నిజాయితీ నిల్! మగవాళ్లే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారట!
అబద్ధాలు చెప్పేవాళ్ల సంఖ్య అత్యధికంగా పెరిగిపోతోందట. అందులో మగవాళ్లే, స్త్రీల కంటే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నట్లు తేలింది. 1980 నుంచి 2021మధ్య జన్మించిన వ్యక్తుల వారిగా జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనిలో పెద్ద, చిన్నా తేడా అనే తారతమ్యం లేకుండా అందరూ అబద్ధాలే చెబుతున్నారని, నిజాయితీగా ఉండే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ప్లేస్టార్ అనే ఆన్లైన్ క్యాసినో దాదాపు 1306 మంది చొప్పున యుఎస్‌లోని వివిధ రాష్ట్రాలపై జరిపినలో సర్వేలో తేలిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. వారంతా వివిధ పరిస్థితుల్లో ఎలా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తున్నారో గమనించినట్లు పేర్కొంది. ఈ మేరకు యూస్‌లోని కొలరాడో,ఇల్లనాయిస్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టేనస్సీ, విస్కాన్సిన్లతో సహా అన్ని రాష్ట్రాలలో సుమారు వెయ్యి మంది చొప్పున చేసిన సర్వేలో ఈవిషయం వెల్లడించింది. వారిలో నిజాయితీ లేని వారి సంఖ్య చాలా అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. సుమారు 13 శాతం మంది కనీసం ఒక్కసారైన అబద్ధం చెబుతున్నామని అంగీకరించనట్టు పేర్కొంది. 1965-1980 మధ్య జన్మించిన వ్యక్తులను 'జెడ్‌గా' 1997-2021 మధ్య జన్మించిన వ్యక్తులను ఎక్స్‌గా విభజించి పోల్చి చూస్తే రెండు గ్రూప్‌లలో కేవలం 5 శాతం మంది రోజు అబద్ధాలు చెబుతున్నట్లు అంగీకరించారని తెలిపింది. అలాగే కార్యాలయాల్లో తమ బాస్‌కి రెజ్యుమ్‌లో తప్పుడు సమాచారమే ఇస్తున్నట్లు తేలింది. ప్రతి ఐదు మిలియన్ల మందిలో ఇద్దరూ ఇలా చేస్తున్నట్లు పేర్కొంది. సోష్ల్ మీడియాలో కూడా ఇదే తంతని, అక్కడ ఈ అబద్ధాల చెప్పే వారి సంఖ్య మరి ఎక్కువగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. వారంతా ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ఈ అబద్ధాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అందులో 58 శాతం మంది ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు, ఇక 42 శాతం మంది గోప్యత కోసం, మరో 42 శాతం మంది తాము చులకన అవ్వకుండా ఉండేందుకు, తమ వ్యక్తి గత రక్షణ కోసం చెప్పినట్లు తెలిపారు. చివరిగా సర్వేలో మహిళలతో పోలిస్తే పురుషులే రోజుకు ఒక్కసారైనా అబద్ధం చెప్పకుండా ఉండలేరని , వారు కూడా దీన్ని అంగీకరించారని సర్వే పేర్కొంది. (చదవండి: భార్యను చంపి, ఆమె పుర్రెని యాష్ ట్రేగా..) -
ఫండ్స్‌లోకి భారీగా మిలీనియల్ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లోకి గడిచిన ఐదేళ్లలో (2018–19 నుంచి 2022–23 మధ్య) 84.8 లక్షల మంది మిలీనియల్ ఇన్వెస్టర్లు కొత్తగా అడుగు పెట్టా రు. ఈ వివరాలను క్యామ్స్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. గత ఐదేళ్లలో కొత్త ఇన్వెస్టర్లలో 54 శాతం మంది మిలీనియల్స్ ఉండడం విశేషం. 1980–1990 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్‌గా చెబుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఉత్ప త్తులపై గతంతో పోలిస్తే అవగాహన, ప్రచారం విస్తృతం కావడం తెలిసిందే. ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు ఫలితంగా ఏటాటా కొత్త ఇన్వెస్టర్లలో చక్కని వృద్ధి కనిపిస్తోంది. ఫండ్స్ పెట్టుబడులను ఆన్లైన్లోనే సరళంగా చేసుకునే వెసులుబాటు కూడా ఇందుకు అనుకూలిస్తోంది. 2018–19 నుంచి 2022–23 మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి కొత్తగా 1.57 కోట్ల మంది ఇన్వెస్టర్లు ప్రవేశించారు. 2022–23లో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల నమ్మకం బలంగా ఉందని, సంపద సృష్టికి మిలీనియల్స్ మ్యూచువల్ ఫండ్స్‌ను మెరుగైన సాధనంగా చూస్తున్నట్టు క్యా మ్స్ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రవేశించిన మిలీనియల్ ఇన్వెస్టర్లలో మహిళలు 30%గా ఉన్నారు. మహిళల్లోనూ పెట్టుబడుల పట్ల ఆసక్తి పెరుగుతుందనడానికి ఇది నిదర్శనం. -
అద్దె ఇంట్లో ఉంటే ఒరిగేదేమీ లేదు.. సొంతిల్లు ఇప్పుడే కొనేయండహో..
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనే సామెత తెలుసుగా..అంటే జీవితంలో ఎవరైనా ఈ రెండు పనులు చేయడం అంత వీజీ కాదనేది దాని అర్థం. అపార్ట్మెంట్ కట్టాలన్నా లేక ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకోవాలన్నా ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నదే. ఇందుకు ఎంతగానో డబ్బు కూడా అవసరమవుతుంది. ధరలను నియంత్రించేందుకు గాను ఆర్బీఐ రెపోరేట్లు.. తదనుగుణంగా బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్నాయి. అయినప్పటికీ మిలియనిల్స్ (1980 తర్వాత జన్మించిన వాళ్లు) సొంతింటి వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో పెరిగిపోతున్న వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోళ్లు ప్రభావం చూపుతుందా? మిలియనిల్స్ ఏమనుకుంటున్నారు? అన్న అంశంపై ప్రముఖ రియాల్టీ సంస్థ నోబ్రోకర్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో బెంగళూరు, పూణే, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ - ఎన్సీఆర్ నగరాల నుంచి సుమారు ఇంటి లోన్ తీసుకున్న 2 వేల మంది పాల్గొన్నారు. ♦ ఇక, ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయం ప్రకారం.. 2022 అక్టోబర్ - డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి - మార్చి మధ్య కాలంలో వడ్డీ రేట్లు ఆకాన్నంటుతున్నా.. 42 శాతం హోం లోన్ తీసుకున్నట్లు తెలిపింది. గత ఏడాది ముగిసిన ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2021 సమయంలో ఇళ్ల లోన్ల వృద్ధి 120 శాతం పెరిగింది. ♦ కోవిడ్-19 తెచ్చిన మార్పుల కారణంగా చాలా మందిలో ‘మనకీ ఓ సొంతిల్లు’ ఉంటే బాగుండేదన్న ఆలోచన పెరిగింది. కాబట్టే కోవిడ్-19కి ముందు మిలియనిల్స్ 17శాతం ఉంటే ఇప్పుడు అదికాస్త 27కి పెరిగింది. వారిలో ఎక్కువ మంది 25 - 35 మధ్య వయస్కులే ఉండటం గమనార్హం. ♦ 36 ఏళ్ల వయసు దాటిన తర్వాత గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ‘లేట్ మిలీనియల్స్’ నిలుస్తున్నారు. వీళ్లు సైతం ఇల్లు కొనుగోలు చేసే వారి జాబితాలో ఎక్కువ మంది ఉన్నారని సర్వే హైలెట్ చేసింది. ♦ సొంతింటి కోసం ఎక్కువ మంది కుర్రకారు 10 శాతం డౌన్ పేమెంట్ కోసం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్(ఎన్బీఐఎఫ్సీ) వంటి సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. వాటిల్లో పర్సనల్ లోన్ తీసుకొని వాటి ద్వారా డౌన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. ♦ 78 శాతం మంది హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం లేదు.. అలా అని తక్కువగా ఉన్నాయని చెప్పడం లేదని తేలింది ♦ రుణాలపై ఇళ్లను కొనుగోలు చేసేవారు ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు.. ఆ భారం వల్ల ఎదుర్కొన్నే కష్ట - నష్టాలను పూర్తిగా అర్ధం చేసుకున్నారు. గత 10-12 ఏండ్ల నుంచి పరిశీలిస్తే గత దశాబ్ధ కాలంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు 6 నుంచి 8 శాతం మధ్యే ఉందని పేర్కొన్నారు. ♦ ‘ఇళ్ల రుణాలు సాధారణంగా 20 ఏండ్ల టెన్యూర్ కలిగి ఉంటాయి. మేము ఈ 20 సంవత్సరాల టెన్యూర్ కాలంలో రెపో రేట్ పెంపు, తదుపరి రేటు తగ్గింపు సాధారణంగా సగటున ఉన్నట్లు స్పష్టమవుతుంది’ అని నోబ్రోకర్ సీఈవో అమిత్ కుమార్ అగర్వాల్ అన్నారు. ♦ మిలీనియల్స్ కోసం నిర్వహించిన ప్రత్యేక నోబ్రోకర్ అధ్యయనంలో కొవిడ్‌కు ముందు 49 శాతం మంది మిలియనిల్స్ ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపితే, ఇప్పుడు దాదాపు 63 శాతం మంది సొంతింటి కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారని నో బ్రోకర్ సర్వేలో తేలింది. చదవండి👉 ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్! -
Vivan Marwaha: దేశం చుట్టిన యువకుడు
‘యూత్’ అనేది ఒక పుస్తకం అనుకుంటే.. చాలామందికి ముఖచిత్రం మాత్రమే తెలుసు. పుస్తకం లోపలికి వెళితే ఏ పేజీలో ఏముందో ఎవరికెరుక! ఆ యూత్‌లోనే ఒకరైన 26 ఏళ్ల వివన్ మర్వాహ దేశమంతా తిరిగి యూత్‌ను అన్ని కోణాలలో అర్థం చేసుకునే అద్భుతమైన పుస్తకం రాశాడు. తాజాగా అతడి పేరు ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా’ జాబితాలో చోటుచేసుకుంది... ‘మా జనరేషన్‌కు మీ జనరేషన్‌కు అసలు సంబంధమే లేదు. ఎంతో తేడా కనిపిస్తుంది!’ అంటాడు నాన్న. ‘మారోజుల్లో స్కూల్లో మగపిల్లలతో మాట్లాడడానికి భయపడేవాళ్లం’ అంటుంది అమ్మ. ‘మీ తరానికి ఖర్చు చేయడం తప్ప పొదుపు చేయడం తెలియదు’ అంటాడు తాత. నిజంగా మనకు మిలీనియల్స్ గురించి ఎంత తెలుసు? ఎంత తెలియదు? అసలు వారి ప్రపంచం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు వెదుక్కోవడానికి ఆ మిలీనియల్స్‌లో ఒకరైన వివన్ సుదీర్ఘమైన దూరాలు ప్రయాణం చేశాడు. అలా మొదలైంది... దిల్లీలో పెరిగిన వివన్ పైచదువుల కోసం కాలిఫోర్నియా(యూఎస్)కు వెళ్లాడు. అక్కడ తాను గమనించింది ఏమిటంటే మిలీనియల్స్ మానసిక ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం వివిధ రూపాల్లో నిర్మాణాత్మకమైన కృషి చేయడం. ‘యూత్ ఎక్కువగా ఉన్న మన దేశంలో ఇలాంటి ప్రయత్నం ఎందుకు జరగడం లేదు’ అని ఆశ్చర్యపోయాడు వివన్. కాలేజి చదువు పూర్తయిన తరువాత ‘నెక్స్›్ట ఏమిటీ?’ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ఒక పుస్తకం రాయాలనిపించింది. మనదేశంలోని మిలీనియల్స్ ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నాడు. దీనికి ముందస్తు సన్నాహంగా మన దేశ మిలీనియల్స్‌కు సంబంధించిన సమాచారం కోసం వెదికితే నిరాశే ఎదురైంది. తనకు లభించిన అరకొర సమాచారంతోనే నోట్స్ రాసుకొని అమెరికా నుంచి బయలుదేరాడు. ఇండియాకు వచ్చి నలుదిక్కులలోని 13 రాష్ట్రాలలో 30,000 కి.మీ దూరం ప్రయాణించాడు.‘మిలీనియల్స్ గురించి తెలుసుకోవాలంటే కాలేజిలకు వెళితే సరిపోతుంది’ అనే కాన్సెప్ట్‌ను నమ్ముకోలేదు వివన్. సెల్‌ఫోన్ రిపేర్ చేసేవారి నుంచి సెలూన్లో పనిచేసేవారి వరకు అందరినీ కలిశాడు. వారి అభిప్రాయాల్లో దాపరికాలు, ముసుగులు లేవు. మనసులో ఉన్నది బయటికి స్వేచ్ఛగా మాట్లాడేస్తున్నారు. ‘ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కనిపించే నిరుద్యోగం ఇప్పుడు లేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. నాకు చదువు పెద్దగా అబ్బలేదు. నా ఫ్యూచర్ గురించి ఇంట్లో వాళ్లు బాధ పడ్డారు. ఇప్పుడు నేను సెల్‌ఫోన్ రిపేరింగ్ షాప్ నడుపుతున్నాను. నా సంపాదన ప్రభుత్వ ఉద్యోగి నెలజీతంతో సమానంగా ఉంది’ అంటున్నాడు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అక్షిత్ అనే కుర్రాడు. బెంగాల్‌లోని కోల్‌కతాకు వెళితే... ‘లవ్మ్యారేజ్ని ఇష్టపడతావా? పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటే ఇష్టమా?’ అనే ప్రశ్నకు నీళ్లు నమలకుండా ‘పెద్దలు కుదిర్చిన పెళ్లినే ఇష్టపడతాను’ అన్నాడు ఒక కాలేజి కుర్రాడు. ఇదే అభిప్రాయం చాలా మంది నోటి నుంచి వినిపించింది. ఇంఫాల్(మణిపూర్)లో ఒకచోట...‘మనం ఎక్కడ ఉన్నామనేది సమస్య కాదు. మెగా సీటిలో ఉన్నా మారుమూల పల్లెలో ఉన్నా సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా సాధనాల ద్వారా అనేకానేక విషయాలు తెలుసుకోవచ్చు. మనకు కావాల్సింది ఆసక్తి మాత్రమే’ అంటోంది యూత్. అయితే ఒక అంశంపై అన్ని ప్రాంతాలలోనూ ఒకేరకమైన అభిప్రాయాలు వినిపించడం లేదు. ‘మీ లక్ష్యం ఏమిటి?’ అని దిల్లీ, ముంబై యువతరాన్ని ప్రశ్నిస్తే స్టార్టప్‌ల గురించి చెప్పారు. జబల్పూర్లాంటి పారిశ్రామిక పట్టణాల్లో ప్రభుత్వ ఉద్యోగం, భద్రజీవితమే తమ లక్ష్యం అంటుంది యువతరం. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో పట్టణాలు తిరిగి...కెరీర్, రాజకీయాలు, మతం, కులం, ఆశలు, ఆశయాలు...మొదలైన వాటిపై మిలీనియల్స్ అభిప్రాయాలను లోతుగా తెలుసుకొని ‘వాట్ మిలీనియల్స్ వాంట్’ పేరుతో పుస్తకం రాశాడు వివన్. ఈ పుస్తకానికి ‘ఇండియన్ మిలీనియల్స్ బయోగ్రఫీ’ అంటూ ప్రశంసలు లభించాయి. జీక్యూ ఇండియా ‘టాప్ నాన్ ఫిక్షన్ బుక్ ఫర్ 2021’ జాబితాలో నిలిచింది. ‘అమెరికా, చైనాలతో పోల్చితే ఇండియన్ మిలీనియల్స్ ఏమిటి?’ వివన్ మాటల్లో చెప్పాలంటే...‘1993లో ఇండియా, చైనా జీడిపి ఇంచుమించుగా ఒకేస్థాయిలో ఉండేది. ఆ తరువాత మాత్రం చైనా దూసుకుపోయింది. ఫలితంగా మన మిలీనియల్స్‌తో పోల్చితే చైనా వాళ్లు ఆర్థికస్థిరత్వంతో ఉన్నారు. వారిలో అభద్రతా కనిపించడం లేదు. అమెరికాలో గత తరాలతో పోల్చితే చాలా స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. మనదేశంలో మాత్రం సంప్రదాయాలను గౌరవించే ధోరణి పెరిగింది’ క్షేత్రస్థాయిలోకి వెళితే ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి అని చెప్పడానికి బలమైన ఉదాహరణ...వాట్ మిలీనియల్స్ వాంట్. -
లాభాల కోసం క్రిప్టోల రిస్క్‌లో పడొద్దు
క్రిప్టో మార్కెట్ పట్ల మిలీనియల్స్ (26–41), జనరేషన్ జెడ్ (25 ఏళ్ల వరకు) వారిలో ఆసక్తి పెరిగిపోయింది. యువ ఇన్వెస్టర్లు క్రిప్టో పెట్టుబడుల పట్ల తమకు తెలియకుండానే ఆకర్షితులవుతున్నారు. స్వల్పకాలంలోనే ఊహించలేనంత లాభాలే ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా చెప్పుకోవాలి. పెట్టుబడి కోణంలో క్రిప్టో కరెన్సీలు/ఎన్ఎఫ్టీలకు చోటు ఇస్తున్న వారు కూడా ఉంటున్నారు. కానీ, క్రిప్టోలకు మనదేశంలో చట్టబద్ధతకు అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాభాలపై 30 శాతం పన్ను విధించింది. ప్రతీ లావాదేవీ రూపంలో వచ్చే లాభంపై 1 శాతం టీడీఎస్ నిబంధన తీసుకొచ్చింది. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. క్రిప్టో లాభాల కోసం పరుగులు తీసే ఇన్వెస్టర్లు.. ఈక్విటీ పెట్టుబడులతో పోల్చి చూస్తే క్రిప్టో పెట్టుబడులు ఏ మేరకు అనుకూలం? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలను అందించే కథనమే ఇది. ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రిప్టో మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 2021లో గణనీయంగా పెరిగింది. 2020 నాటికి 4.2 కోట్లుగా ఉన్న ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్య 2021 డిసెంబర్ చివరికి 8 కోట్లను దాటింది. ఒక నివేదిక ప్రకారం క్రిప్టో సాధనాల అనుసరణ విషయంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశీయంగా సుమారు 1.5 కోట్ల వరకు క్రిప్టో ఇన్వెస్టర్లు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ శాతం యువ ఇన్వెస్టర్లే. 32 శాతం 18–24 వయసులోని వారు. మరో 33 శాతం మంది 25–34 వయసు గ్రూపునకు చెందిన వారు. క్రిప్టోలనే కాదు ఎన్ఎఫ్టీలు, ఇతర ఏ రూపాల్లో ఉన్న డిజిటల్ ఆస్తులు (వర్చువల్ అసెట్స్) కూడా 30 శాతం మూలధన లాభాల పన్ను రేటు కిందకు వస్తాయి. ‘‘వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 30 శాతం పన్ను రేటు పడుతుంది. కొనుగోలు వ్యయాన్నే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. మరే ఇతర వ్యయాలను మినహాయింపు కింద క్లెయిమ్ చేసుకోలేరు. పైగా క్రిప్టోలపై వచ్చే లాభాల నుంచి మరే ఇతర నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు అనుమతి లేదు’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుధాకర్ సేతురామన్ తెలిపారు. అనుకూలతలు/రిస్క్ క్రిప్టోలతో పోలిస్తే ఈక్విటీల్లో వ్యయాలు తక్కువ. క్రిప్టోల్లో రిస్క్ చాలా అధికం. త్వరితగతిన లాభాలను చూసే ఇన్వెస్టర్లు ఈ రిస్క్ అంశాన్ని ఆలోచించడం లేదు. ఈక్విటీలు మెరుగైన నియంత్రణ వాతావరణంలో పనిచేస్తుంటాయి. కానీ, క్రిప్టోలన్నవి నియంత్రణ పరిధిల్లో లేని సాధనాలు. రిస్క్, వ్యయాల పరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం అని విశ్లేషకులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు.. క్రిప్టో కరెన్సీల్లో అతిపెద్దది అయిన బిట్‌కాయిన్ విలువ 2021 సంవత్సరంలో గరిష్ట స్థాయి 68,789 డాలర్ల నుంచి, కనిష్ట స్థాయి 28,130 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 సూచీ 14,018 పాయింట్ల నుంచి 17,345 మధ్య ట్రేడ్ అయింది. మరో నిదర్శనం బిట్ కాయిన్ ధర 2021 సెప్టెంబర్ 29న 41,041 డాలర్ల స్థాయి నుంచి నవంబర్ 9న 67,553 డాలర్లకు పెరిగింది. అంటే కేవలం నెలన్నర వ్యవధిలోనే 70 శాతం పెరిగింది. అక్కడి నుంచి మరో నెలన్నర రోజుల్లో డిసెంబర్ 31 నాటికి 47,128 డాలర్లకు పడిపోయింది. 30 శాతానికి పైగా నష్టపోయింది. భారీ అస్థిరతలకు బల మైన నిదర్శనాలు ఇవి. పన్ను ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 10 శాతంగా ఉంది. ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు దీర్ఘకాల మూలధన లాభం (ఏడాదికి మించి కొనసాగిన పెట్టుబడులపై/ఎల్టీసీజీ) గడించినప్పుడు పన్ను ఉండదు. రూ.లక్షకు మించి పొందే లాభంపైనే 10 శాతం పన్ను, 4 శాతం సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. అదే కొనుగోలు చేసి ఏడాది నిండకముందు విక్రయించే ఈక్విటీ పెట్టుబడులపై లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభంగా (ఎస్టీసీజీ) చట్టం పరిగణిస్తోంది. ఈ మొత్తంపై పన్ను 15 శాతంగా అమల్లో ఉంది. కనుక క్రిప్టోలతో పోల్చి చూసినప్పుడు ఈక్విటీలే ఆకర్షణీయమని ఐడీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ హెడ్ అనూప్ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించింది. అంతేకాదు ఈ లాభంపై వెంటనే ఒక శాతాన్ని తగ్గించుకునే టీడీఎస్ నిబంధన కూడా తీసుకొచ్చింది. అంటే ఇన్వెస్టర్ లాభం నుంచి ఒక శాతాన్ని క్రిప్టో ఎక్సేంజ్‌లు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమచేయాల్సి ఉంటుంది. క్రిప్టోల్లో మూలధన లాభం రూ.50లక్షలు మించితే 30 శాతం పన్నుపై సర్‌చార్జ్ కూడా అమలవుతుంది. వర్చువల్ అసెట్స్‌ను బంధువు కాని వారికి బహుమానంగా ఇస్తే, ఇలా ఇచ్చే వాటి విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ లావాదేవీని విక్రయంగానే చట్టం పరిగణిస్తుంది. కనుక ఈ మొత్తంపైనా మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కనుక క్రిప్టోలకు సంబంధించి ప్రతిపాదిత పన్ను పెద్ద ప్రతికూలమని అనూప్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘‘చిన్న ఇన్వెస్టర్లు, సాధారణంగా పన్ను చెల్లించేంత ఆదాయం పరిధిలో లేని వారు సైతం ఇప్పుడు క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది వారిని నిరుత్సాహానికి గురి చేస్తుంది’’ అని క్రిప్టో సలహాదారు అజీత్ ఖురానా పేర్కొన్నారు. కానీ, నష్టాలు వస్తే పరిస్థితి ఏంటి? ఇన్వెస్టర్ల నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినప్పుడు నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం కింద, ఏడాదికి మించిన పెట్టుబడులను విక్రయించగా వచ్చిన నష్టాన్ని దీర్ఘకాల మూలధన నష్టంగా పరిగణిస్తారు. వీటిని ఏడు సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలన్నింటినీ లాభాలతో సర్దుబాటు చేసుకోలేకపోతే.. తర్వాతి ఏడు ఆర్థిక సంవత్సరాల్లో (లావాదేవీ జరిగిన సంవత్సరం సహా మొత్తం ఎనిమిది అసెస్మెంట్ సంవత్సరాలు) వచ్చే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. దాంతో పన్ను పరంగా క్రిప్టో ఇన్వెస్టర్లతో పోలిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఎంతో ప్రయోజనం ఉందని చెప్పుకోవాలి. క్రిప్టో నష్టాలకు ఈ క్యారీ ఫార్వార్డ్ సదుపాయం లేదు. నష్టాలు ఏవైనా అదే ఏడాది క్రిప్టో లాభాలతోనే సర్దుబాటుకు పరిమితం కావాలి. మరే ఇతర మూలధన లాభాల నుంచి మినహాయించి చూపించుకునే వెసులుబాటు కల్పించలేదు. అలాగే, మరే ఇతర మూలధన నష్టాన్ని క్రిప్టో లాభాల నుంచి మినహాయించుకునే అవకాశం కూడా కల్పించలేదు. నియంత్రణలు నియంత్రణపరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం. స్టాక్‌బ్రోకర్, మ్యూచుల్ ఫండ్, మార్కెట్ పార్టిసిపెంట్, ఇంటర్ మీడియరీ ఇలా మార్కెట్ వ్యవస్థలో భాగమైన ప్రతీ సంస్థ కూడా సెబీ నియంత్రణల పరిధిలోనే పనిచేయాలి. అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీనివల్ల రిస్క్ చేయిదాటి పోకుండా సెబీ చర్యలు తీసుకుంటుంది. కానీ, క్రిప్టో కరెన్సీలపై ఈ నియంత్రణ లేదు. ఈక్విటీల విషయంలో లావాదేవీల గురించి, సేవలు, చార్జీల గురించి సెబీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్ల సెక్యూరిటీలను తన పూల్ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని వాటిని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం తెలిసిందే. ఈ అంశంలో సెబీ వెంటనే జోక్యం చేసుకుని తనఖాలో ఉన్న షేర్లను ఇన్వెస్టర్లకు దక్కేలా వేగంగా చర్యలు తీసకుంది. కానీ, క్రిప్టో లావాదేవీల విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రభుత్వం లాభాలపై 30 % పన్ను విధించింది కానీ, నియంత్రణ అంశం జోలికి పోలేదు. ఎందుకంటే క్రిప్టో ఆస్తులన్నవి అంతర్జాతీయంగా ట్రేడ్ అవుతున్నవి. కొనుగోలు చేసిన వర్చువల్ అసెట్స్‌ను ఎక్కడ హోల్డ్ చేస్తున్నారు? సైబర్ మోసాల నుంచి వాటికి రక్షణ ఉంటుందా? పెట్టుబడి పెట్టిన వారికి జరగరానిది జరిగితే, వారి వారసులు ఆ వర్చువల్ ఆస్తులను పొందగలరా? ఇలాంటి అంశాలన్నింటినీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఈక్విటీలకు సంబంధించి ఈ రిస్క్ ఉండదు. లావాదేవీల ట్రాకింగ్ క్రిప్టో లాభాలపై ఒక శాతం టీడీఎస్ అమలు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రతీ లావాదేవీ సమాచారం ఆదాయపన్ను శాఖకు వెళుతుంది. కనుక పన్ను ఎగవేతకు అవకాశం ఉండదనే భావించాలి. ఇప్పటి వరకు క్రిప్టో ఎక్సేంజ్‌లు ఇచ్చిన సమాచారంపైనే ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ, ఇక మీదట టీడీఎస్ నిబంధనతో వివరాలు పక్కాగా తెలుస్తాయి. ‘‘టీడీఎస్ రూపంలో ప్రభుత్వం క్రిప్టో లావాదేవీలను గుర్తించగలదు. డేటాను తీసుకోగలదు. ఇది భవిష్యత్తులో క్రిప్టోల నియంత్రణ విషయంలో సాయపడొచ్చు’’అని క్రిప్టో ఎక్సేంజ్ ‘జెబ్‌పే’ సీఈవో అవినాష్ శేఖర్ తెలిపారు. టీడీఎస్ నిబంధనతో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీలను నియంత్రించగలదని, ఆదాయం రాబట్టుకోగలదని ఫెలిక్స్ అడ్వైజరీ పార్ట్నర్ అమిత్ జిందాల్ పేర్కొన్నారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్ అనే వ్యక్తికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో బిట్ కాయిన్లో ట్రేడింగ్‌పై రూ.6 లక్షలు లాభం వచ్చిందనుకుందాం. అలాగే, ఎథీరియం ట్రేడింగ్‌లో రూ.2 లక్షలు నష్టం వచ్చిందనుకుంటే, అప్పుడు నికర లాభం రూ.4లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై 30 శాతం పన్ను రేటు అమలవుతుంది. లాభం రూ.50లక్షల్లోపు ఉంది కనుక సర్‌చార్జీ లేదు. 30 శాతంపై 4 శాతం సెస్సు అమలవుతుంది. అంటే 1.2 శాతం సెస్సు కూడా కలుపుకుంటే వచ్చిన లాభంపై చెల్లించాల్సిన నికర పన్ను 31.2 శాతం అవుతుంది. -
జెన్ జడ్... క్యాన్సిల్ కల్చర్
ప్రేమ: ‘ఏరా, కాఫీ మానేశావట!!!’ ‘ఎప్పుడైతే కావ్యకు టీ తప్ప కాఫీ నచ్చదు అనే విషయం తెలిసిందో ఇక అప్పటి నుంచి కాఫీ ముఖం ఈ జన్మలో చూడొద్దని డిసైడైపోయాను’ అభిమానం: ‘మీరు ఏమైనా అనుకోండి. మీ హీరో సినిమా ఏమాత్రం బాగలేదు. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి?’ ‘సినిమా ఎందుకు చూడాలి? అనే మాట వాడి చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. అంతపెద్ద మాట అంటావా! ఇక ముందు మీ హీరో సినిమాలను బాయ్‌కాట్ చేస్తున్నాము’ కుటుంబం: ‘నాన్న పలకరించినా ముఖం తిప్పేస్తున్నావట! ఇది మంచి పద్ధతి కాదు. పెద్దవాళ్లు మన బాగు కోసం ఒక మాట అంటే తప్పేమిటి?!’ సామాజికం: ‘మిత్రులారా... ఫలానా షూస్ ఎవరూ వాడవద్దు. వాటిని జంతుచర్మంతో తయారుచేస్తారట’ ∙∙ ‘జెన్ జడ్’ జనరేషన్లో కీలకపాత్ర వహిస్తుంది ‘క్యాన్సిల్ కల్చర్’ దీనికి సోషల్‌మీడియా ప్రధాన వేదిక అయింది. ‘క్యాన్సిల్’ అంటే ఉన్న సాధారణ అర్ధాలలో రెండు.. రద్దు చేయడం, తుడిచివేయడం. ఇక పాప్–కల్చర్ డిక్షనరీ ప్రకారం తమ మనోభావాలను దెబ్బతీశారనే కారణంతో సెలబ్రిటీలు లేదా కంపెనీలను ఏదో ఒక రూపంలో బాయ్‌కాట్ చేయడం. ఈ క్యాన్సిల్ కల్చర్ మూలాలు 2014 ‘లవ్ అండ్ హిప్–పాప్: న్యూయార్క్’ రియాల్టీ షోలో ఉన్నాయి అంటారు. ఆ షోలో ఒక నటుడికి తన గర్ల్‌ఫ్రెండ్‌కు అంతకుముందే కూతురు ఉందనే విషయం తెలిసి ‘యూ ఆర్ క్యాన్సిల్డ్’ అంటాడు. మొదట్లో ‘యూ ఆర్ క్యాన్సిల్డ్’ను సోషల్ మీడియాలో సరదాగా అనుకరించేవారు. అయితే ఈ సరదా కాస్త ఆ తరువాత సీరియస్ రూపంలోకి మారింది. మనలాంటి దేశాల్లోకి కూడా వచ్చేసి చాలామంది యూత్‌ను పట్టేసింది. ట్విట్టర్లో ‘బాయ్‌కాట్’ హ్యాష్‌టాగ్‌లు పెరిగాయి. ఫేస్బుక్లో ఒక కుర్రాడు ఇలా పోస్ట్ పెట్టాడు. ‘జాను లవ్స్ ఆరెంజ్. షీ ఈజ్ క్యాన్సిల్డ్’ యూత్‌లోని ఈ ‘క్యాన్సిల్ కల్చర్’ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అనడం కంటే...‘ఇది సరికాదు’ అనే వారే ఎక్కువ. అమెరికన్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ ‘సౌత్ పార్క్’ ఈ ధోరణిని వెక్కిరించింది. స్టాండప్ కామెడి షో ‘స్పీక్స్ అండ్ స్టోన్స్’ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. ‘కాలేజి క్యాంపస్‌లో ప్రత్యర్థి పక్షం భావాలను వ్యతిరేకించడం... అనే భావన క్యాన్సిల్ కల్చర్‌కు విత్తనంలాంటిది. అది కాస్త సోషల్ మీడియాకు విస్తరించింది’ అంటాడు ‘కోడింగ్ ఆఫ్ ది అమెరికన్ మైండ్’ పుస్తకం రాసిన జోనాధన్. బాయ్కాట్లు, బహిష్కరణలు మన సామాజిక చరిత్రలో కొత్తేమీ కాదు. స్వాతంత్య్ర ఉద్యమంలో ‘విదేశీ వస్తు బహిష్కరణ’ ఎంత కీలక పాత్ర పోషించిందో మనకు తెలిసిందే. అలాంటి ఉద్యమాలకు అర్థం, పరమార్థం, అనంతమైన బలం ఉన్నాయి. అలా కాకుండా చిన్న చిన్న విషయాలు, అల్పమైన విషయాలపై ‘క్యాన్సిల్ కల్చర్’ను ఫాలోకావడం తగదని చెబుతున్నారు విజ్ఞులు. అయితే జెన్ జడ్లో ‘క్యాన్సిల్ కల్చర్’ని తలకెత్తుకుంటున్నవారితో పాటు ‘క్యాన్సిల్ ది క్యాన్సిల్ కల్చర్’ అని నినదిస్తున్నవారు కూడా ఉన్నారు. -
పేటిఎమ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న మిలీనియల్స్
పేటిఎమ్ మనీలో పెట్టుబడి పెట్టే మిలీనియల్స్ పెట్టుబడిదారుల సంఖ్య 2021లో గణనీయంగా పెరిగింది. పేటిఎమ్ మనీ తన వార్షిక నివేదిక 2021ను విడుదల చేసింది. 2021లో పేటిఎమ్ మొత్తం వాటాలో మిలీనియల్స్ పెట్టుబడిదారులు దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నారు. పేటిఎమ్ బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఇటీవల 2021 పేటిఎమ్ మనీ వార్షిక నివేదికను ప్రచురించింది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపిఒలు), ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్ పిఎస్)తో సహా పేటిఎమ్ మనీ అందించే వివిధ ఉత్పత్తుల్లో పెట్టుబడులను ఈ నివేదిక వెల్లడించింది. 2021లో పేటిఎమ్ మనీలో ఎక్కువగా మిలీనియల్స్ పెట్టుబడులు పెట్టారని నివేదిక పేర్కొంది. ఈటిఎఫ్ లను కొనుగోలు చేసే మిలీనియల్స్ నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యింది. మిలీనియల్స్ కొనుగోలు చేసిన ఈటిఎఫ్ సగటు సంఖ్య 50 శాతం పెరిగింది. ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసే మిలీనియల్స్ నిష్పత్తి పరంగా సుమారు 11 శాతం పెరిగారు. 2020లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే వారితో పోలిస్తే 2021లో 35 శాతం పెరిగారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం అనేక మంది మిలీనియల్స్ ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెడుతున్నారు. మహిళా పెట్టుబడిదారుల సంఖ్య 2020 కంటే రెట్టింపు అయింది. పెట్టుబడి పెట్టె మహిళల శాతం 114 వరకు పెరిగింది. దీనికి అదనంగా, ఎక్కువ శాతం మహిళా పెట్టుబడిదారులు పురుషల కంటే అధిక లాభాన్ని 2021లో సంపాదించారు. మిలీనియల్స్ అంటే? 1981-1996 మధ్యలో పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారు. ప్రపంచదేశాలతో పోలిస్తే ఆ జనాభా మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉంది. మొత్తం దేశ జనాభాలో వీరి సంఖ్య 400 మిలియన్లు (40 కోట్లు) ఉంటుంది. (చదవండి: Gold price: మళ్లీ పెరుగుతున్న బంగారం ధర..!) -
సర్వే: యువతకు ఏ కార్లు అంటే ఇష్టం, వాళ్లకి కారు కొనే సామర్ధ్యం ఉందా?!
మిలీనియల్స్!! అంటే దాదాపు 22–37 సంవత్సరాల మధ్య ఉండి సంపాదిస్తున్న యువత. అయితే కోవిడ్ తరువాత ఈ మిలీనియల్స్ గురించి, కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆర్ధిక స్థితి గతులు ఎలా ఉన్నాయి. వాళ్లు ఎలాంటి రంగాల్లో స్ధిరపడ్డారు. కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారా? కొంటే ఎలాంటి కార్లను కొనాలని అనుకుంటున్నారనే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం. మార్కెట్ ప్లేస్, కార్స్ 24 నివేదికల ప్రకారం.. మనదేశంలో మిలీనియల్స్ సెకండ్ హ్యండ్ కార్లు కొనుగోలు చేసే సామర్ధ్యం ఉన్నట్లు తేలింది. ►ప్రీ- ఓన్డ్ కార్ల కొనుగోలులో 80 శాతం మంది ఈ మిలీనియల్స్ ఉన్నారు. వారిలో ఎక్కువగా యాప్, వెబ్ ఆధారిత ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. ►ఇక ఈ ప్రీ ఓన్డ్ కార్లను కొనుగోలు చేసే వారిలో యువకులే కాదు, మహిళల సంఖ్య పెరిగిపోతున్నట్లు తేలింది. ►గత సంవత్సరం ప్రీ ఓన్డ్ కార్ల అమ్మకాలు 10శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడు 50శాతానికి పెరిగింది. ►ఇక 43శాతం మంది హ్యాచ్‌బ్యాక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ►26శాతం మంది ఎస్యూవీ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారంటూ రిపోర్ట్ హైలైట్ చేసింది. కాబట్టే పెట్రోల్, ఇంజిన్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మిలీనియల్స్ అంటే? వయసును బట్టి వ్యక్తుల్ని ఐదు తరాలుగా విభజించచ్చు. వీరిలో తొలితరం సైలెంట్ జనరేషన్. అంటే 1928–1945 మధ్య పుట్టి ఇపుడు 73–90 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో...అంటే 1946–1964 మధ్య జననాల రేటు బాగా ఎక్కువగా ఉండడంతో అప్పుడు పుట్టి ప్రస్తుతం 54–72 ఏళ్ల వయసున్నవారిని ‘బేబీ బూమర్’ జనరేషన్గా పిలుస్తున్నారు. ఆ తరవాత 1965–80 మధ్య పుట్టినవారు జనరేషన్ ఎక్స్. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22–37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్ వై. అంటే మిలీనియల్స్. ఆర్జనపరులైన వీరి సంఖ్య దేశంలో 50 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఆ తరవాత పుట్టిన ‘జనరేషన్ జెడ్’ ఇపుడిపుడే ఉద్యోగాల్లోకి...సంపాదనలోకి వస్తున్నారు. చదవండి: భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ. ప్రయాణం..! -
యువత అభిరుచులపై సర్వే
న్యూఢిల్లీ: పాశ్చాత్య యువత, దేశీయ యువతకు సంబంధించిన అభిరుచులపై మింట్(మీడియా సంస్థ), సీపీఆర్(సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్) సంయుక్తంగా సర్వే నిర్వహించింది. అమెరికా యువత ఎక్కువ అప్పులు, తక్కువ ఆదాయాలు, తక్కువ ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిపింది. కాగా భారతీయ యువత మాత్రం తమ తల్లిదండ్రుల కంటే మెరుగైన జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న పదిలో ఎనిమిది మంది భారతీయులు తమ తల్లిదండ్రుల కంటే మెరుగ్గా ఉన్నామని తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయ యువతకు అత్యున్నత ఉద్యోగాలు లభించాయని.. అనుబంధాల విషయంలోను తమ తల్లిదండ్రుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. మింట్-సీపీఆర్ మిలీనియల్ సర్వేను ఆన్లైన్లో 2020, మార్చి12 నుంచి ఏప్రిల్ 2 మధ్య 184 పట్టణాలు, నగరాల్లో నిర్వహించారు. ఈ సర్వేలో 10,005 మంది పాల్గొన్నారు. వీరిలో 4,957 మంది మిలీనియల్స్(22నుంచి 37సంవత్సరాలు), 2,983 మంది పోస్ట్ మిలీనిలయల్స్(1996 సంవత్సరం తరువాత జన్మించిన వారు) 2,065 ప్రీ-మిలీనియల్స్(40సంవత్సరాల వయస్సు పైబడిన వారు) పాల్గొన్నారు. దేశీయ యువత ఎక్కువగా ఇతర నగరాలు, విదేశాలకు వెల్లడానికి మొగ్గు చూపారని సర్వే పేర్కొంది. కాగా, లక్షకుపైగా జీతాన్ని సంపాదిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న మెజారిటీ యువత తెలిపారు. భారతీయ యువత ఎక్కువగా సొంతింటి బదులు అద్ది ఇంటేకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఆర్థికంగా మెరుగయ్యాకే సొంతింటి కళ గురించి ఆలోచిస్తామని మెజారిటీ యువత పేర్కొన్నారు.(చదవండి: ‘భారత్‌లో మతస్వేచ్ఛ.. ఆందోళనకరం’) -
జనరేషన్ జెడ్‌కు జై...
మన దేశ భవిష్యత్ ఇప్పుడు ఒక కొత్త తరం మీద ఆధారపడి ఉంది. వారే జనరేషన్ జెడ్. 1996–2000 మధ్య పుట్టిన వారిని జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. మిలేనియల్స్‌కి, వీళ్లకి ఎంతో తేడా ఉంది. భారత్‌లో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో అభివృద్ధిలో వారిదే కీలకపాత్ర. జనరేషన్ ఎక్స్(1965–80 మధ్య పుట్టినవారు) తరం తల్లిదండ్రుల చేతుల మీదుగా పెరిగిన వీరి ఆలోచన, అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఇతర తరాలకి ఎన్నో తేడాలున్నాయి. ఈ మధ్య కాలంలో పలు సంస్థలు చేసిన సర్వేల్లో జెనరేషన్ జెడ్ స్వభావాల్ని అంచనా వేశాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం.. ప్రస్తుతం జనరేషన్ జెడ్ జనాభా దాదాపుగా 10 కోట్ల వరకు ఉంటుంది. జెనరేషన్ జడ్లో 25% మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటూ సామాజిక బాధ్యత కలిగి ఉన్నారు. ఆర్థిక మాంద్యం సమయంలో పెరిగి పెద్దవడంతో డబ్బుల్ని పొదుపు చేయాలన్న స్పృహ కలిగి ఉన్నారు. మిగిలిన తరాలతో పోల్చి చూస్తే సహనం ఎక్కువ. ఆచరణ సాధ్యంగా ఉండాలని ప్రయత్నిస్తారు. తమ వ్యక్తిగత ఆసక్తులు, కుటుంబానికి, తాము చేసే పనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వీరిలో మానసిక సమస్యలూ ఎక్కువే. 35 శాతం మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు. -
‘ఆరేడుగురితో డేటింగ్.. ఇంకో లైఫ్ కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ: ‘నేటి యువతరం యమ స్పీడు గురు!’ అని పెద్దలు అనుకోవడం పరిపాటి. వారు ఎవరి గురించి, ఎందుకు ఈ వ్యాఖ్య చేశారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. వారు మాట్లాడుతున్నది సహస్రాబ్దుల గురించి. ముఖ్యంగా ‘దిల్వాలే దుల్హాహానియా లే జాయెంగే’ బాలీవుడ్ సినిమా విడుదలైన 1995 తర్వాత పుట్టిన వారి గురించి. ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరికొకరు అంటుకు తిరగడమే కాకుండా డేటింగ్‌లంటూ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం పట్ల చేస్తున్న వ్యాఖ్య. వారి వ్యాఖ్యలో ఆందోళనకంటే తమకూ అలాంటి అవకాశం లేకుండా పోయెనే అన్న అసూయనే ఎక్కువగా కనిపిస్తుంది. వాట్సప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మీడియాలే కాకుండా డేటింగ్ యాప్‌గా ముద్రపడిన ‘టిండర్’ లాంటి యాప్‌లు యువతీ యువకులు కలిసి తిరగడానికి, సన్నిహితంగా మెలగడానికి పెళ్లికి ముందే లైంగిక అనుభవాలు చవి చూడడానికి దోహదపడుతున్నాయనడంలో సందేహం లేదు. ‘ఈ తరం వారిని చూసి నేను ఎంతో అసూయ పడుతున్నాను. నా జూనియర్ సహచరులు నెలకు ఆరేడుగురితో తిరుగుతున్నారు. నేను పెళ్లికి ముందు ఒక్కసారి కూడా ఎవరితో లైంగిక అనుభం లేదు’ అని ఓ బెంగుళూరులో పనిచేస్తున్న 40 ఏళ్ల ఐఐటీ గ్రాడ్యుయేట్ వాపోయారు. ‘సోషల్ మీడియా, మీటింగ్ యాప్‌లు లేని మా తరంలో ఆడ, మగ కలుసుకునేది చదువుకునే చోట, పనిచేసే చోట మాత్రమే. ఆడ, మగ కలుసుకునే అవకాశం తక్కువగా కూడా ఉండేది. 2000 సంవత్సరంలో మా ఆఫీసులో కలుసుకున్న వారు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాకే అశ్చర్యం కలిగించింది’ అని ‘ఎట్ మేక్ మై ట్రిప్’ సహ వ్యవస్థాపకులు సచిన్ భాటియా వ్యాఖ్యానించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే 2013లో తమ సంస్థ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ‘ట్రూలీమ్యాడ్లీ’ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఒకప్పుడు తమ ఆఫీసులో పపిచేసే స్త్రీలు, పురుషులే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకునే వారని, ఇప్పుడు అలాంటి ఉదంతాలు బాగా తగ్గి పోయాయని, బయట ఇతరులను కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉండడమే అందుకు కారణం కావచ్చని ఆయన అన్నారు. ‘నేటి తరానికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంది. సమాజంలో రిస్కులు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. కెరీర్ విషయంలో, రిలేషన్షిప్లో వారికంటూ ఓ క్లారిటీ ఉంది’ అని ఓ లాజిస్టిక్ సంస్థలో పనిచేస్తున్న 38 ఏళ్ల రాజేష్ చౌదరి అభిప్రాయపడ్డారు. ‘బెడ్రూమ్లో నా పర్సనాలిటీ గురించి నేను ఏదీ దాచకుండా నీకు చెబుతాను’ అని నాలుగంటే నాలుగు రోజుల క్రితమే పరిచయమైన ఓ 28 ఏళ్ల యువతి తనతో చెప్పడం తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని ఢిల్లీకి చెందిన రచయిత్రి అంకిత ఆనంద్ తెలిపారు. ‘మా తరంలో స్నేహానికే సమయం ఉండేది కాదు. కలుసుకునేందుకు కాఫీడేలు కూడా లేవు. ఈ తరాన్ని చూస్తే కొంత అసూయ వేస్తోంది’ అని 36 ఏళ్ల సౌమ్యా బైజాల్ అన్నారు. ఈ తరం సంబంధాలను చూసి అసూయ పడుతున్న ఓ సీనియర్ జర్నలిస్ట్ ‘నాకు ఇంకో జీవితం ఉంటే బాగుండు’ అని వ్యాఖ్యానించగా, ఆయన పక్కనే ఉన్న ఈ తరానికి చెందిన ఆయన కుమారుడు ‘తరం తరానికి తేడా ఎప్పుడూ ఉంటుంది. నా భవిష్యత్ తరాన్ని చూసి నేను కూడా అసూయ పడే రోజు వస్తుంది. అది తప్పదు!’ అని వ్యాఖ్యానించడం సబబే కావచ్చు. -
ఆర్థికమంత్రి వ్యాఖ్యలు : నెటిజనుల దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో మొబైల్ రంగం రోజు రోజుకు సంక్షోభంలోకి జారుకోవడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త వాదన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆటోరంగం మందగమనానికి యువత ఒక కారణమని, ఈ రోజుల్లో యువత ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్ ను ఆశ్రయిస్తున్నారని, సొంతకార్లవైపు మొగ్గు చూపడం లేదని, ఈఎంఐ భారం మోసేందుకు ఇష్టపడటం లేదని, మిలీనియల్స్(యువత) క్యాబ్స్‌లపై ఆసక్తి చూపడంతో ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందన్నారు. దీంతో సోషల్ మీడియాలో సేఇట్ సీతారామన్తాయి లైక్, బాయ్‌కాట్ మిలీనియల్స్ హ్యాష్‌ట్యాగ్‌లు దుమారం రేపుతున్నాయి. ఆర్థికమంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. యువతకు పానీ పూరీ ఇష్టం...అందుకే బీహెచ్ఈఎల్ 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంటూ బాయ్‌కాట్ మిలీనియల్స్ ట్రెండ్స్ హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు నిజమే..సొంత వాహనం ఉంటే డబ్బుల దండగ. డబ్బుని మిగిలించుకోవాలి కదా అనే కమెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా కొత్త మోటారు సవరణ చట్టంపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. డ్రైవింగ్ టెన్షన్స్, నిబంధనల ఉల్లంఘనల చలాన్లు, పార్కింగ్ ఇబ్బందులు ఉండవు. అందుకే వాహనాలు కొనుగోలు చేయటం లేదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. నిరుద్యోగులు ఉద్యోగం చేసేందుకు ఇష్టపడకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. డాలర్‌ను ప్రిఫర్ చేయడం వల్లే రూపాయి విలువ పడిపోతోంది. ‘రోడ్లు బాగా లేవు అందుకే లారీల విక్రయాలు పడిపోయాయి. అంతేకదా మంత్రి గారు’. ప్రతీదానికి యువతనెందుకు ఆడిపోసుకుంటారు...ఇలా ఒకటి కాదు రెండుకాదు, సీతారామన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అప్రతిహతంగా పంచ్ లు పేలుతున్నాయి.. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 రోజుల పాలనముగింపు సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆటో రంగం మందగించడం వెనుక ఒక ప్రధాన అంశం మిలీనియల్స్ మనస్తత్వం మారడమే అని పేర్కొన్నారు. బీఎస్6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతోపాటు యువత ఎక్కువగా క్యాబ్, మెట్రో రైళ్లపై ఆధారపడుతుండటం కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమనానికి కారణమని వ్యాఖ్యానించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు,లారీల విక్రయాలు ఇటీవల రికార్డు స్థాయిలో క్షీణించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటోమొబైల్ రంగంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు మారుతీ సుజుకీ, అశోక్ లేలాండ్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తమ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో తమ ఫ్లాంట్లను తాత్కాలికంగా మూసివేశాయి. అశోక్ లేలాండ్ అయిదు ప్లాంట్లలో 16 రోజుల పాటు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి విషయం తెలిసిందే. చదవండి : పెట్టుబడులపై టాస్క్‌ఫోర్స్ దృష్టి.. దారుణంగా పడిపోయిన అమ్మకాలు : మరింత సంక్షోభం Oxygen crisis will be occur because millennial inhale more oxygen in the morning. #BoycottMillennials pic.twitter.com/0LKxC8u3BW — Muhammd Ali (@alikarwi00) September 11, 2019 BHEL is at its lowest in 15 years because millennials prefer "Paani puri". #BoycottMillennials #SayItLikeNirmalaTai — ERVJ 🇮🇳 (@iam_vjoshi) September 10, 2019 #BoycottMillennials as they are preferring live-in relationships instead of marriages. Result: brahmins, pandits and jyotish, are becoming jobless. — Check_Mate (@IndianScooter) September 10, 2019 The market for 'Gobar' is down, because millennials ain't buying 'no shit'.#SayItLikeNirmalaTai #BoycottMillennials — Anoop Tomer (@anooptomer) September 10, 2019 -
ఇక ఆఫీసులకు సెలవు, ఇంటి నుంచే పని
సాక్షి, న్యూఢిల్లీ : రెండువేల సంవత్సరానికి చెందిన యువతరం ఇంటి వద్ద నుంచే ఆఫీసు పనిచేయాలని కోరుకుంటోంది. రద్దీ ట్రాఫిక్‌లో ప్రయాసపడుతూ పోయి ముక్కుతూ మూలుగుతూ పనిచేసి ఆయాసపడుతూ ఇంటికి చేరుకోవడం అర్థరహితమని వాదిస్తోంది. ఇంటి పట్టునే ఉంటూ వేలకు వేడి వేడి తేనీరు సేవిస్తూ ఎలాంటి ఆఫీసు ఇబ్బందులు లేకుండా ఆఫీసు పనిని చక్కగా చక్కబెట్టవచ్చని చెబుతోంది. ఉద్యోగాలు చూపించే పోర్టల్ ‘షైన్ డాట్ కామ్’ ఇటీవల నిర్వహించిన మూడు వంతల మంది ఈ అభిప్రాయాలను వెల్లడించారు. 22 నుంచి 30 ఏళ్ల లోపు యువత అభిప్రాయాలను సేకరించింది. వారిలో 70 శాతం మంది ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేస్తోన్న వాళ్లుకాగా, పది శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తున్న వాళ్లు, మిగతా వాళ్లు ఆఫీసుకు వెళ్లడంతోపాటు ఇంటి నుంచి పనిచేసే వాళ్లు ఉన్నారు. నాలుగు గోడల మధ్య కాకుండా స్వేచ్ఛగా పనిచేయడం ఇష్టమని 60 శాతం మంది చెప్పగా, ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోవచ్చని, సమయం ఆదా అవుతుందని, ప్రయాణ ఖర్చులు కలిసొస్తాయని ఇతరులు చెప్పారు. ఇంటి నుంచి పనిచేసుకునే వెసలుబాటు వల్ల సంస్థకు లాభం జరగడంతోపాటు ఉద్యోగి ఎక్కడికి పోకుండా ఆ సంస్థకే విధేయుడై పనిచేసే అవకాశం ఉందని ‘షైన్ డాట్ కామ్’ వెల్లడించింది. ఇంటి నుంచి పనిచేయడం వల్ల సంస్థ ఉత్పత్తి బాగా పెరుగుతుందని రెండేళ్ల క్రితం స్టాండ్ఫోర్డ్ కంపెనీ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఆఫీసులకు వెళ్లి ఉద్యోగులకు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుందని, వారు ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఆ ఒత్తిడి తగ్గడమే కాకుండా పని చేయడం పట్ల సంతృప్తి కలుగుతుందని ‘హార్వర్డ్ బిజినెస్ స్కూల్’ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడయిన ఇంటి నుంచి పనిచేయడానికి తమ సంస్థ అనుమతిస్తోందని ప్రతి పది మందిలో ఏడుగురు ఉద్యోగులు తెలిపారు. వీలైతే ఆఫీసుకు లేదంటే ఇంట్లో కూర్చొని పనిచేసుకోవడానికి అవకాశాలు ఉండాలని మూడొంతుల మంది అభిప్రాయగా కచ్చితంగా ఇంటి నుంచి పనిచేసుకునేందుకే నూటికి నూరు శాతం అవకాశం ఉండాలన్న వారు కేవలం ఆరు శాతం. అప్పుడే తమ కర్తవ్యాన్ని తాము పరిపూర్ణం చేయగలగమని అన్నారు. ఇంటి నుంచి పనిచేయడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని సర్వేలో కొంత మంది అభిప్రాయపడ్డారు. తమ ఆఫీసు పనికి ఏ సమయంలో, ఎప్పుడు ఫుల్స్టాప్ పెట్టాలో తెలియక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని వారన్నారు. -
పైసా లేకుండా ప్రపంచ పర్యటనకు వెళ్లొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశ్ మల్హోత్ర గత జూలై, ఆగస్టు రెండు నెలలు ఇండోనేసియాలో ఒంటరిగా పర్యటించారు. కొమడో డ్రాగన్ల (రాక్షస బల్లులు)ను ప్రత్యక్షంగా వీక్షించడంతోపాటు సముద్ర గర్భంలోని అందాలను తిలకించడానికి స్కూబా డైవింగ్ చేశారు. మంటా రేస్‌గా ఆంగ్లంలో పిలిచే షార్క్ జాతికి చెందిన అతి భారీ జలచరం (8 మీటర్ల వెడల్పు దాదాపు 1400 కిలోల బరువు)తో కలిసి సముద్ర గర్భంలో ఈత కొట్టారు. అద్భుతమైన సూర్యోదయాన్ని ప్రత్యక్షంగా చూడడమే కాకుండా దాన్ని కెమెరా కన్నులో బంధించేందుకు మౌంట్ బాటూర్లోని క్రియాశీలక అగ్ని పర్వతాన్ని అధిరోహించారు. దేశ, విదేశాల్లో పర్యటించడం ద్వారా అనూహ్య అనుభవాలను, అనిర్వచనీయ అనుభూతులను పొందవచ్చని భావించే మల్హోత్ర ఈసారి ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఆయన అనుభవాలన్నీ తీపి గుర్తులే కాదు. ఆయన బాలి నగరంలో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. ఓ మాల్ శిథిలాలు కూలుతుంటే అందులోనుంచి అందరితోపాటు ఆయన బయటకు పరుగెత్తికొచ్చారు. 26 ఏళ్ల ఆకాశ్ మల్హోత్రకు ప్రపంచం తిరగడమంటే ఎంతో పిచ్చి. ఆయన గత నాలుగేళ్లలో 34 దేశాలు తిరిగొచ్చారు. రెండు నెలలు భారత్‌లో ఉంటే, నాలుగు నెలలు విదేశాల్లో తిరుగుతుంటారు. ‘డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ’ని నడిపే ఆకాశ్ తన పర్యటన పిచ్చికి అనుకూలంగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా రోజుకు కేవలం నాలుగు గంటలే పనిచేస్తారు. మిగతా సమయమంతా పర్యటనలోనే గడుపుతారు. ఆయన భారత్‌కు వచ్చినప్పుడు మాత్రమే తన క్లైంట్లను నేరుగా కలుసుకుంటారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్లపైనే సలహాలు, సంప్రతింపులు నడుస్తాయి. ఆయన తన పర్యటన ఫొటోలను ఎప్పటికప్పుడు ‘ఇన్స్టాగ్రామ్’లో పోస్ట్ చేయడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. ఏ దేశానికి ఎంత చీప్‌గా వెళ్లవచ్చో, ఏయే ట్రావెల్ ప్యాకేజీలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఎంపిక చేసుకోవచ్చో, ఎక్కడ ఎంత చీప్‌గా ఆనందాన్ని ఆస్వాదించవచ్చో.. కిటికులన్నీ ఆకాశ్‌కు తెలుసు. ఆయన తన ‘వాండర్ విత్ స్కై’ వెబ్సైట్ ద్వారా తనలాంటి పర్యాటకులతో వీటిని షేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త టిమ్ ఫెర్రీస్ రాసిన ‘ది 4–అవర్ వర్క్ వీక్’ పుస్తకాన్ని చదివి తాను స్ఫూర్తి పొందానని ఆయన చెబుతున్నారు. ఆకాశ్లాగా ప్రపంచ దేశాల్లో తిరగాలన్నా ఆసక్తి నేటి యువతరంలో ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో పనిచేస్తే యువతలో ఈ ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. స్కై స్కానర్ ఇండియా నిర్వహించిన ‘ది మిలీనియల్ ట్రావెల్ సర్వే–2017’ నివేదిక ప్రకారం 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యనున్న నేటి తరంలో 62 శాతం మంది ఏడాదికి రెండు నుంచి ఐదు సార్లు దేశ, విదేశాల్లో పర్యటిస్తున్నారు. పది శాతం మంది మాత్రం ఏడాదికి ఆరు నుంచి పది సార్లు పర్యటనలకు వెళుతున్నారు. ఇలా దేశ, విదేశీ పర్యటనలను ఇష్టపడుతున్న యువతలో స్త్రీ, పురుషులు ఆఫీసు సెలవుల్లో ఉన్న వెసలుబాటును బట్టి దగ్గరి ప్రాంతాలు, దూర ప్రాంతాల పర్యటనలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఆకాశ్ లాంటి ప్రపంచ పర్యటనను పిచ్చిగా ప్రేమించే వాళ్లు ఉద్యోగాలు వదిలేసి సొంతంగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ పర్యటిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న టెక్కీలకు దేశ, విదేశాలు తిరిగేందుకు డబ్బులు ఎలా వస్తున్నాయన్నా సందేహం రావచ్చు. కూడబెట్టుకుంటున్న సొమ్ము సరిపోకపోతే వారంతా ట్రావెల్ రుణాలు తీసుకుంటున్నారు. ఇదో కొత్త ట్రెండ్. వారికి ఈ రుణాలు ఇవ్వడం కోసమే ‘క్యూబెరా, ఫింజీ, ఫేర్‌సెంట్, రూబిక్యూ’ లాంటి ఆర్థిక సంస్థలు పుట్టుకొచ్చాయి. కొలాటరల్ గ్యారంటీ, ఈ గ్యారంటీ, ఆ గ్యారంటీ అనే తలనొప్పి షరతులు లేకుండా ఈ సంస్థలు బ్యాంకులకన్నా తక్కువ ఒడ్డీతో ట్రావెల్ రుణాలను అతి సులువుగా మంజూరు చేస్తున్నాయి. అయితే ఆ సంస్థలు రుణాలు మంజూరు చేస్తున్న వారిలో 80 శాతం మంది ఉద్యోగులే ఉంటున్నారు. గత రెండేళ్లలోనే ట్రావెల్ రుణాలు 12 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయని ఉద్యోగులకు, ఇతరులకు వ్యక్తిగత లోన్లను మాత్రమే మంజూరు చేసే సాంకేతిక సంస్థ ‘క్యూబెరా’ తెలిపింది. గతేడాది ట్రావెల్ రుణాలు కావాలంటూ తమ సంస్థకు దాదాపు 1700 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 728 మంది దరఖాస్తుదారులు 28 ఏళ్ల లోపు వారేనని పేర్కొంది. తమ సంస్థ నుంచి రుణాలు కోరుతున్న ఐదు ముఖ్య కారణాల్లో ట్రావెల్ ఒకటని ‘క్యూబెరా’ వ్యవస్థాపకుడు అనుభవ్ జైన్ తెలిపారు. ట్రావెల్ రుణాల్లో రిస్క్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉద్యోగస్థులవడం, అందులో యువకులు అవడం, పర్యటించాలనే ఉత్సాహం ఎక్కువగా ఉండడం వల్ల అంత రిస్క్ తమకు ఎదురు కావడం లేదని ఆయన అన్నారు. తామిచ్యే మొత్తం రుణాల్లో ట్రావెల్ రుణాలు గతేడాది ఐదారు శాతం ఉండగా, ఇప్పుడు 15, 16 శాతానికి చేరుకున్నాయని ఆయన వివరించారు. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తాము 12 శాతం వ్యక్తిగత రుణాలు పర్యటనల కోసం మంజూరు చేశామని ‘ఫింజీ’ సహ వ్యవస్థాపకులు, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అభినందన్ సంఘమ్ తెలిపారు. తాము ట్రావెల్ రుణాలను మంజూరు చేస్తుండడం వల్ల ముందుగా ఎకానబీ క్లాస్‌ను ఎన్నుకున్న పర్యాటకులు ఆ తర్వాత లగ్జరీ క్లాస్‌కు మారుతున్నారని కూడా ఆయన చెప్పారు. తాము కూడా ఆరు శాతం రుణాలను ట్రావెల్‌కే ఇస్తున్నామని, వీరి సంఖ్య గత రెండేళ్లుగా పెరుగుతోందని ‘ఫేర్‌సెంట్’ వెబ్ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రజత్ గాంధీ తెలిపారు. తాము పెళ్లిళ్లకు, హానీమూన్లకు కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. జేబులో పైసా లేకపోయినా ట్రావెల్ రుణాలను, ట్రావెల్ ప్యాకేజీలను సద్వినియోగం చేసుకొని ప్రపంచ దేశాల్లో పర్యటించవచ్చని ఆకాశ్ మల్హోత్ర సూచిస్తున్నారు. -
మిలీనియల్స్‌కు రక్తపోటు ముప్పు
లండన్ : ఆధునిక ప్రపంచాన్ని ముందుకు నడిపించాల్సిన మిలీనియల్స్ ఒత్తిడి ఊబిలో చిత్తవుతున్నారని తాజా అథ్యయనం హెచ్చరించింది. 18 నుంచి 34 ఏళ్ల మధ్యన మిలీనియల్స్‌గా పిలవబడే ఈతరం యువత తీవ్ర ఒత్తడితో సతమతమవుతూ అధిక రక్తపోటు బారిన పడే ప్రమాదం ఉందని తేల్చిచెప్పారు.మిలీనియల్స్‌లో 96 శాతం మంది ఒత్తిడిలో కూరుకుపోయారని, వారితో పోలిస్తే 55 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 66 శాతం మందే తాము ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారని సర్వేలో వెల్లడైందని ప్రముఖ ఐర్లాండ్ వైద్యురాలు, టీవీ వ్యాఖ్యాత డాక్టర్ పిక్సీ మెకెనా వెల్లడించారు. రక్తపోటుకు పోషకాహార లోపం, మద్యపానం వంటి కారణాలతో పాటు ఒత్తిడి ప్రధాన కారణమని మెకెనా చెప్పుకొచ్చారు. రక్తపోటు ఇక ఎంతమాత్రం వయసుపైబడిన వారిలో కనిపించే వ్యాధి కానేకాదని తమ అథ్యయనంలో వెల్లడైందన్నారు. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, మద్యపానం, అధిక బరువు, అధికంగా ఉప్పు తీసుకోవడం వంటి కారణాలతో మిలీనియల్స్‌లో అధిక రక్తపోటు రిస్క్ అధికంగా ఉందని చెప్పారు. తాము నిర్వహించిన సర్వేలో బాధ్యతలు మీదపడుతున్నప్పటికీ మధ్యవయస్కుల్లో ఒత్తిడి స్ధాయి తక్కువగా ఉన్నట్టు వెల్లడైందన్నారు. -
సొంతిల్లు పెద్ద కోరికగా ఉండిపోకూడదు!
మిలీనియల్స్!! అంటే దాదాపు 22–37 సంవత్సరాల మధ్య ఉన్న ఆర్జనపరులైన యువత. మరి వీరికి పొదుపు, ఇన్వెస్ట్మెంట్, ఖర్చులకు సంబంధించిన సూత్రాలపై అవగాహన ఏ మేరకుంది? దీనికి సమాధానం కాస్త ఆశ్చర్యకరమే. ఎందుకంటే తమకన్నా ముందు పుట్టిన వారికన్నా ఈ ‘జనరేషన్–వై’ వ్యక్తులు కాస్త తెలివైనవారు. వీరికి ఇల్లు కొనుగోలు అన్నది చాలా పెద్ద కోరిక. కానీ దానికన్నా అద్దె ఇంట్లో ఉండటానికే ప్రాధాన్యమిస్తారు. అయితే ఇంత తెలివైన వారు కూడా ఆర్థిక మోసాలకు తేలిగ్గా బుక్ అయిపోతుంటారన్నది పీపీఎఫ్ఏఎస్ మ్యూచ్‌వల్ ఫండ్ మార్కెటింగ్ హెడ్ జయంత్పాయ్ అభిప్రాయం. వీరు ఇతర తరాలైన ‘జనరేషన్ ఎక్స్’, ‘జనరేషన్ జెడ్’ కన్నా భిన్నమైన వారన్నది అర్థ యంత్ర సీఈఓ నితిన్ వ్యాకరణం మాట. మరి ఈ మిలీనియల్స్ ఆర్థిక విషయాల్లో ఎలా ఉంటున్నారు? ఏ విషయాల్లో మారాల్సి ఉంది? ఆ వివరాల సమాహారమే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం స్వల్పకాల లక్ష్యాలు... ఖర్చులూ అధికం ‘‘మిలీనియల్స్ దీర్ఘకాల లక్ష్యాల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. చాలా కాలం పాటు వారు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. తక్కువ బాధ్యతలతో అధికంగా ఖర్చు పెట్టే రకం. కనుక వీరిది స్వల్పకాలిక దృష్టి’’ అని నితిన్ వ్యాకరణం పేర్కొన్నారు. కానీ, వీరి కంటే ముందు తరం వారు అయిన జనరేషన్ ఎక్స్ సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుంచే దీర్ఘకాలిక లక్ష్యాలైన ఇల్లు, పిల్లల విద్య, వివాహాలు, రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్నారు. జనరేషన్ వై మాత్రం వీటిని తర్వాత అంటూ వాయిదా వేస్తున్నారు. పొదుపు కంటే కారు, విహార యాత్రలకు వెళ్లటం, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల కోసం ఖర్చు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారట. దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఇల్లు అన్నది మిలీనియల్స్‌కు (జనరేషన్ వై) అతిపెద్ద కోరికగా ఉందని బ్యాంక్ బజార్ సర్వే ‘యాస్పిరేషన్ ఇండెక్స్ 2018’లో వెల్లడైంది. 25–35 మధ్య వయసున్న 1,551 మంందిపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. వీరిలో చాలా మంది అద్దె ఇళ్లలో నివసించేందుకే ఇష్టపడుతున్నారు. సొంతింటి కోసం రుణాలు తీసుకుంటే ఉద్యోగానికి కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. కాకపోతే తమ ఆకాంక్షల కోణంలో ఇలా ఒకే చోట ఉండిపోవాలని వారు అనుకోవడం లేదట. ‘‘నేను, నా శ్రీమతి ఇద్దరం ఉద్యోగాల్లో ఫ్రెషర్లమే. ఒకే ఉద్యోగానికి అతుక్కుపోవాలని అనుకోవడం లేదు’’ అని బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల హర్షవర్ధన్ పేర్కొనడం గమనార్హం. మిలీనియల్స్‌కు రిటైర్మెంట్ గురించి అవగాహన ఉన్నా... ఆర్థిక ప్రణాళిక విషయంలో దానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. చాలా మంది మిలీనియల్స్ దీర్ఘకాలిక లక్ష్యాలకు పొదుపును వాయిదా వేస్తున్న వారే. కానీ, ఇది సరికాదని, తమ ఆదాయంలో కనీసం 10 శాతాన్ని అయినా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఫండ్స్, పాలసీల్లో పెట్టుబడులు... ఇక పెట్టుబడుల విషయానికొస్తే మిలీనియల్స్ తెలిసీ, తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు వద్దంటున్నా వీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే, అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లు తెరవడం లేదా సంప్రదాయ బీమా పాలసీలను కూడా తీసుకుంటున్నారని జయంత్ పాయ్ చెప్పారు. ఉదాహరణకు అహ్మదాబాద్‌కు చెందిన దివ్య (29) ఈక్విటీల్లో 30 శాతం ఇన్వెస్ట్ చేస్తుండగా, డెట్‌లో 70 శాతం పెట్టుబడులు పెడుతోంది. నిజానికి చిన్న వయసులో ఉన్న దివ్య ఈక్విటీలకు మరింత కేటాయించుకోవడం సరైనదిగా నిపుణులు సూచిస్తున్నారు. ఖర్చంతా ప్రయాణాలు, గ్యాడ్జెట్లకే... మిలీనియల్స్ ప్రయాణాలు, గ్యాడ్జెట్లు, వస్త్రాలపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు వీరికి ముఖ్యమైన వ్యాపకంగా ఉంటున్నాయి. వీరి ఆదాయంలో ఎక్కువ భాగం దీనికే కేటాయిస్తున్నారు కూడా. ఈ విధంగా సెలవుల్లో సరదాలనేవి ‘జనరేషన్ ఎక్స్’ మాత్రం నిష్ప్రయోజనకరమైనవిగా భావిస్తుండటం గమనించాల్సిన అంశం. అసలు ఈ మిలీనియల్స్ ప్రయాణాలపై ఎందుకంతగా వెచ్చిస్తున్నారంటే... ఖర్చు చేసేందుకు చేతిలో అధిక ఆదాయం ఉండడంతోపాటు, అదే సమయంలో బాధ్యతలు తక్కువగా ఉండడమే. సులభంగా రుణాలు పొందగలిగే అవకాశం, చేతిలో క్రెడిట్ కార్డులు వీరికి ఖర్చు విషయంలో కొండంత ధైర్యాన్నిస్తున్నాయి. కానీ, ఇది పూర్తిగా మంచిది కాదని, రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని పాయ్ హెచ్చరించారు. సంప్రదాయ పాలసీలతోనే ‘బీమా’ జనరేషన్ ఎక్స్ వారు సంప్రదాయ బీమా పాలసీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కాకపోతే వీటిని రక్షణ కోసం కాకుండా వీటిని తమ జీవిత లక్ష్యాల కోసం తీసుకోవడం కొంచెం ఆశ్చర్యకరమే. జీవితానికి తగినంత రక్షణ లేకపోగా, అదే సమయంలో వీటితో రాబడులు కూడా తక్కువే ఉంటున్నాయి. ఇక మిలీనియల్స్ టర్మ్ పాలసీలను ఎంచుకునేందుకు సిద్ధంగానే ఉన్నారని పాయ్ పేర్కొన్నారు. కానీ వీరిలో ఇప్పటికీ టర్మ్ పాలసీలపై తగినంత అవగాహన లేదని, సమాచార వినిమయం విషయంలో ఫండమెంటల్‌గా వారిలో మార్పు వస్తే తప్ప సంప్రదాయ, యులిప్ పాలసీలను కొనుగోలు చేసే తప్పిదాలను కొనసాగిస్తూనే ఉంటారని నితిన్ అభిప్రాయపడ్డారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ ‘జనరేషన్ వై’గా పిలిచే మిలీనియన్స్కు టెక్నాలజీపై చక్కని అవగాహన ఉంది. స్మార్ట్ఫోన్లను వినియోగిస్తూ వీరు అన్ని రకాల లావాదేవీలను ఆన్లైన్లోనే కానిచ్చేస్తున్నారు. జనరేషన్ ఎక్స్ మాత్రం అంతగా టెక్నాలజీ తెలిసిన వారు కాదు. ఉద్యోగాలు మారటం ఎక్కువే... గత దశాబ్దకాలంలో ఉద్యోగాల స్వరూపంలో ఎంతో మార్పు వచ్చింది. మిలీనియల్స్ ఉద్యోగాల విషయంలో కొత్త ధోరణులకు అలవాటు పడేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఇంటర్నెట్ ఉద్యోగాలు అధికం కావడంతో వాటికి నిర్ణీత పని ప్రదేశం, పనిగంటలతో సంబంధం లేకుండా పోయిందని నితిన్ వ్యాకరణం పేర్కొన్నారు. దీంతో పని పరిస్థితులను బట్టి 30 ఏళ్లకే రెండు మూడు ఉగ్యోగాలు మారిపోతున్నారు. కానీ, వారి తల్లిదండ్రులైతే తమ జీవిత కాలం మొత్తంలోనే రెండు మూడు ఉద్యోగాలు పరిమితం కావడం గమనార్హం. మారుతున్న ధోరణులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని వ్యాకరణం సూచించారు. ఎవరీ మిలీనియల్స్? వయసును బట్టి వ్యక్తుల్ని ఐదు తరాలుగా విభజించచ్చు. వీరిలో తొలితరం సైలెంట్ జనరేషన్. అంటే 1928–1945 మధ్య పుట్టి ఇపుడు 73–90 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో... అంటే 1946–1964 మధ్య జననాల రేటు బాగా ఎక్కువగా ఉండడంతో అప్పుడు పుట్టి ప్రస్తుతం 54–72 ఏళ్ల వయసున్నవారిని ‘బేబీ బూమర్’ జనరేషన్గా పిలుస్తున్నారు. ఆ తరవాత 1965–80 మధ్య పుట్టినవారు జనరేషన్ ఎక్స్. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22–37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్ వై. అంటే మిలీనియల్స్. ఆర్జనపరులైన వీరి సంఖ్య దేశంలో 44 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఆ తరవాత పుట్టిన ‘జనరేషన్ జెడ్’ ఇపుడిపుడే ఉద్యోగాల్లోకి... సంపాదనలోకి వస్తున్నారు. -
ఖరీదైన పీసీయే కావాలి..!!
♦ స్టైల్, అధిక ఫీచర్లకే యువత మొగ్గు ♦ ‘మిలీనియల్స్’ అభిరుచులకు అనుగుణంగా మోడళ్లు ♦ మార్చి త్రైమాసికంలో పీసీల్లో వీటి వాటాయే 30% ♦ అమ్మకాలు తగ్గుతున్నా.. ప్రీమియం మోడల్స్‌లో వృద్ధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చేతిలో స్మార్ట్ఫోనే కాదు. భుజానికుండే ల్యాప్‌టాప్ కూడా ఖరీదైనదే కావాలట!!. ఇదీ నేటి కుర్రకారు ట్రెండ్. పర్సనల్ కంప్యూటర్ను కూడా స్టేటస్ సింబల్‌గా భావించే వారు పెరుగుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. స్టైలిష్‌గా... ఎక్కువ ఫీచర్లతో ఉండే ల్యాప్టాప్లనే యువత ఇష్టపడుతున్నారని, వీటిని నలుగురిలోనూ చూపించడాన్ని స్టైల్ స్టేటస్‌గా భావిస్తున్నారని గణాం కాలు చెబుతున్నాయి. నిజానికి పీసీ మార్కెట్ వృద్ధి రేటు అంతకంతకూ తగ్గుతుండగా ప్రీమియం ఉత్పత్తులు మాత్రం 25-30% వృద్ధిని నమోదు చేస్తున్నాయి. పీసీలను వాడుతున్నవారు హై ఎండ్ మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతుండడమే ఇందుకు కారణ మని చెబుతున్న కంపెనీలు... వీటిపై దృష్టిపెట్టాయి. ప్రీమియం మోడళ్లను తీసుకొస్తున్నాయి. కొద్ది రోజుల వరకు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు నలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారి కలర్‌ఫుల్ కంప్యూటర్లు వచ్చేశాయి. మినీ నోట్‌బుక్స్, అల్ట్రా పోర్టబుల్ ట్యాబ్లెట్స్ వంటి పేర్లతో హల్చల్ చేస్తున్నాయి. డెస్క్టాప్లైతే పెద్ద స్క్రీన్‌తో టూ ఇన్ వన్ల రూపాన్ని సంతరించుకున్నాయి. కొన్ని కంపెనీలైతే ల్యాప్‌టాప్‌లను ట్యాబ్లెట్గా కూడా వాడుకునేలా తయారు చేస్తున్నాయి. 10.4 మిల్లీమీటర్ల మందంతో ప్రపంచంలో అతి పలుచని ల్యాప్‌టాప్‌ను హెచ్‌పీ రూపొందించింది. వినియోగదార్లు వినూత్న డిజైన్, తక్కువ బరువు, అధిక మెమరీ, గట్టిదనం వంటి ఫీచర్లు కోరుకుంటున్నారు. మెట్రోల్లో ఈ ట్రెండ్ అధికం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఇప్పుడిప్పుడే ప్రీమియం ఉత్పత్తుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. యువత అభిరుచే ప్రధానం కంపెనీల నోట ఇప్పుడు మిలీనియల్స్ మాట వినపడుతోంది. 18 నుంచి 34 ఏళ్ల వయసున్న కుర్రకారుకు కంపెనీలు పెట్టుకున్న ముద్దుపేరే మిలీనియల్స్. వీరే కొత్తదనాన్ని కోరుకుంటున్నారని హెచ్‌పీ ఇండియా కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ విభాగం అధిపతి అనురాగ్ అరోరా చెప్పారు. కంప్యూటర్ అక్షరాస్యతతో పాటు వీరికి కొనుగోలు శక్తి కూడా ఉందని చెప్పారాయన. ‘‘భారత్‌లో పీసీల మార్కెట్ గతేడాదితో పోలిస్తే 2016 మార్చి త్రైమాసికంలో 7.4% తిరోగమనం చెందింది. మార్కెట్ ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడి స్థిరపడుతోంది. కాకపోతే రూ.50 వేలు ఆపైన ఉన్న ప్రీమియం విభాగం మాత్రం 25-30 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఇప్పటిదాకా బేసిక్ మోడళ్లు వాడినవారు ప్రీమియం మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు’’ అని అరోరా వెల్లడించారు. సగటు ల్యాప్‌టాప్ ధర రూ.35 వేల నుంచి రూ.38 వేలకు ఎగసినట్లు తెలియజేశారు. కాగా గేమింగ్ డెస్క్‌టాప్‌ల రంగంలో తమ కంపెనీ అగ్ర స్థానంలో ఉన్నట్టు ఆసస్ సంస్థ దక్షిణాసియా హెడ్ పీటర్ చాంగ్ చెప్పారు. రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ పేరుతో భారత్‌లో తాము ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. ఇదీ పీసీ మార్కెట్... ⇒ జనవరి - మార్చి మధ్య దేశంలో అమ్ముడైన డెస్క్‌టాప్, ⇒ ల్యాప్‌టాప్‌లు.. 20 లక్షలు. ⇒ వీటిలో ప్రీమియం పీసీల వాటా 30 శాతం... అంటే 60 వేలు ⇒ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు - నెలకు 2-3వేలు ⇒ గేమింగ్ పీసీల మార్కెట్లో అగ్రస్థానం - అసస్ 30 శాతం. అగ్రస్థానంలో హెచ్‌పీ: గార్ట్నర్ పీసీ వాడకంలో వ్యక్తిగత వినియోగదార్ల వాటా 45%కాగా మిగిలిన 55% ఎంటర్ప్రైజెస్ వాటా. పరిశ్రమలో 25% వాటాతో హెచ్పీదే అగ్రస్థానం. ఆన్‌లైన్‌లోనూ ఈ కంపెనీదే పెత్తనం. డెల్ 23.5%, లెనోవో 19.4% వాటాలు ఉన్నాయి. ఏసర్ వాటాను 10.5 నుంచి 12.2 శాతానికి చేరినట్లు గార్ట్నర్ నివేదిక పేర్కొంది.