మిలీనియల్స్!! అంటే దాదాపు 22–37 సంవత్సరాల మధ్య ఉండి సంపాదిస్తున్న యువత. అయితే కోవిడ్ తరువాత ఈ మిలీనియల్స్ గురించి, కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆర్ధిక స్థితి గతులు ఎలా ఉన్నాయి. వాళ్లు ఎలాంటి రంగాల్లో స్ధిరపడ్డారు. కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారా? కొంటే ఎలాంటి కార్లను కొనాలని అనుకుంటున్నారనే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం.
మార్కెట్ ప్లేస్, కార్స్ 24 నివేదికల ప్రకారం.. మనదేశంలో మిలీనియల్స్ సెకండ్ హ్యండ్ కార్లు కొనుగోలు చేసే సామర్ధ్యం ఉన్నట్లు తేలింది.
►ప్రీ- ఓన్డ్ కార్ల కొనుగోలులో 80 శాతం మంది ఈ మిలీనియల్స్ ఉన్నారు. వారిలో ఎక్కువగా యాప్, వెబ్ ఆధారిత ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది.
►ఇక ఈ ప్రీ ఓన్డ్ కార్లను కొనుగోలు చేసే వారిలో యువకులే కాదు, మహిళల సంఖ్య పెరిగిపోతున్నట్లు తేలింది.
►గత సంవత్సరం ప్రీ ఓన్డ్ కార్ల అమ్మకాలు 10శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడు 50శాతానికి పెరిగింది.
►ఇక 43శాతం మంది హ్యాచ్‌బ్యాక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.
►26శాతం మంది ఎస్‌యూవీ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారంటూ రిపోర్ట్ హైలైట్ చేసింది. కాబట్టే పెట్రోల్, ఇంజిన్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
మిలీనియల్స్ అంటే?
వయసును బట్టి వ్యక్తుల్ని ఐదు తరాలుగా విభజించచ్చు. వీరిలో తొలితరం సైలెంట్ జనరేషన్. అంటే 1928–1945 మధ్య పుట్టి ఇపుడు 73–90 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో...అంటే 1946–1964 మధ్య జననాల రేటు బాగా ఎక్కువగా ఉండడంతో అప్పుడు పుట్టి ప్రస్తుతం 54–72 ఏళ్ల వయసున్నవారిని ‘బేబీ బూమర్’ జనరేషన్‌గా పిలుస్తున్నారు.
ఆ తరవాత 1965–80 మధ్య పుట్టినవారు జనరేషన్ ఎక్స్. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22–37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్ వై. అంటే మిలీనియల్స్. ఆర్జనపరులైన వీరి సంఖ్య దేశంలో 50 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఆ తరవాత పుట్టిన ‘జనరేషన్ జెడ్’ ఇపుడిపుడే ఉద్యోగాల్లోకి...సంపాదనలోకి వస్తున్నారు.
చదవండి: భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ. ప్రయాణం..!
Comments
Please login to add a commentAdd a comment