భారతదేశంలోని 10 మంది ఉద్యోగుల్లో ఏడుగురు (సుమారు 70 శాతం) మిలీనియల్స్ (1981 నుంచి 1996 మధ్య పుట్టిన వారు) ఉన్నట్లు తాజా నివేదిక ఒకటి పేర్కొంది. వీరిలోనూ 22 శాతం మంది మహిళలు కావడం గమనార్హం.
‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా’ నివేదిక ప్రకారం 87 శాతం మంది మిలీనియల్స్ తమ ప్రస్తుత కంపెనీలను గొప్ప కార్యస్థలంగా భావిస్తున్నారు. మిలీనియల్స్‌లో 39 శాతం మంది మేనేజర్ స్థాయికి ఎదిగారని, ఈ కంపెనీలు అనుసరిస్తున్న ప్రగతిశీల నాయకత్వ అభివృద్ధి వ్యూహాలకు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది.
మిలీనియల్స్‌లో దాదాపు 52 శాతం మంది తమ యాజమాన్యాల నిర్ణయాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిదింట నాలుగు రంగాల్లో మిలీనియల్స్ బలమైన సానుకూలతను కలిగి ఉన్నారు. అయితే దీనికి విరుద్ధంగా యాజమాన్యాల పక్షపాత వైఖరి, లాభాల పంపిణీ వంటి విషయాల్లో మాత్రం అంత సానుకూలత లేదని నివేదిక పేర్కొంది.
మిలీనియల్స్ కీలక రంగాలలో గణనీయమైన శాతంలో ఉన్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌లో 75 శాతం, హెల్త్‌కేర్‌లో 75 శాతం, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాలలో 72 శాతం వీరే ఉన్నారు. కార్య క్షేత్రంలో 45 శాతం మిలీనియల్స్‌కు విస్తారమైన ఆవిష్కరణ అవకాశాలు లభిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
ఇదీ చదవండి: ఆ ఉద్యోగాలకు ముప్పే.. ఐబీఎం సీఈవో కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment