in india
-
దేశంలో పెరిగిపోతున్న ఘోస్ట్ మాల్స్.. ఏంటివి?
దేశంలోని ప్రధాన నగరాల్లో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరిగిపోతున్నాయి. 40 శాతం కంటే ఎక్కువగా ఖాళీలు ఉండే షాపింగ్ మాల్స్‌ను ఘోస్ట్ మాల్స్ అంటారు. అటువంటి మాల్స్ సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక, 'థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024' సూచిస్తోంది.నివేదిక ప్రకారం.. ఘోస్ట్ షాపింగ్ మాల్స్ సంఖ్య 2023లో 64కి పెరిగింది. ఇది 2022లో 57గా ఉండేది. ఇది రిటైల్ రంగంలో ఒడిదుడుకుల ధోరణిని ప్రతిబింబిస్తోంది. 2023లో మొత్తం 13.3 మిలియన్ చదరపు అడుగుల స్థూల లీజు విస్తీర్ణంలో 64 షాపింగ్ మాల్స్.. 'ఘోస్ట్ షాపింగ్ సెంటర్స్'గా వర్గీకరించినట్లు నివేదిక వెల్లడించింది. ఇది గత సంవత్సరంతో పోల్చితే విస్తీర్ణంలో 58 శాతం పెరుగుదలను సూచిస్తుంది.నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ఢిల్లీలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ సంఖ్య అత్యధికంగా ఉంది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఘోస్ట్ షాపింగ్ సెంటర్ స్టాక్‌లో 19 శాతం క్షీణత నమోదు కావడం విశేషం.విలువపై ప్రభావం:ఘోస్ట్ షాపింగ్ సెంటర్ల పెరుగుదల కారణంగా 2023లో దాదాపు రూ. 6,700 కోట్లు లేదా 798 మిలియన్ డాలర్ల విలువను కోల్పోవచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. ఇది రిటైల్ రంగంపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని సూచిస్తుంది. భూ యజమానులు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేస్తోంది.దుకాణదారులకు మెరుగైన రిటైల్ అనుభవం ప్రాముఖ్యతను నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ నొక్కి చెప్పారు. "గ్రేడ్ ఏ మాల్స్ ముఖ్యంగా రాణించాయి, బలమైన ఆక్యుపెన్సీ, ఫుట్ ట్రాఫిక్, కన్వర్షన్ రేట్లను సాధిస్తున్నాయి. తద్వారా తమ వినియోగదారులకు విలువను అందిస్తున్నాయి" అన్నారు.మరోవైపు దేశవ్యప్తంగా 8 కొత్త రిటైల్ కేంద్రాలను చేర్చినప్పటికీ, 2023లో 16 షాపింగ్ కేంద్రాలు మూసివేయడంతో, టైర్1 నగరాల్లో మొత్తం షాపింగ్ కేంద్రాల సంఖ్య 263కి తగ్గింది. డెవలపర్లు నివాస లేదా వాణిజ్యపరమైన అభివృద్ధిని చేపట్టడం వంటి వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉండే, ఆదాయం లేని షాపింగ్ కేంద్రాలను కూల్చివేశారు. కొన్నింటిని శాశ్వతంగా మూసివేశారు. -
ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు..
ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. నియామకాలు బాగా నెమ్మదించాయి. భారత్‌లో ముఖ్యంగా ఐటీ హబ్‌లు వెలవెలబోతున్నాయి. దేశంలో ఉద్యోగాల క్షీణతకు సంబంధించి తాజాగా ఓ నివేదిక వెల్లడైంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్ వంటి భారతీయ ఐటీ హబ్‌లలో గడిచిన అక్టోబర్ నెలలో ఉద్యోగాల క్షీణత కనిపించిందని నివేదిక వెల్లడించింది. మొత్తం మీద అక్టోబర్‌లో ఇతర రంగాల కంటే ఐటీ రంగంలో నియామకాలు అత్యధికంగా పడిపోయాయి. మరోవైపు, చమురు, గ్యాస్, విద్యుత్ రంగాల్లో అత్యధిక వృద్ధి కనిపించింది. ఐటీ నియామకాల్లో 14% క్షీణత నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఐటీ రంగం నియామకాల్లో 14 శాతం క్షీణతను చూసింది. నౌకరీ డాట్ కామ్ రెజ్యూమ్ డేటాబేస్‌పై ఈ నెలవారీ నివేదిక విడుదలైంది. ఇతర నగరాల్లో వృద్ధి కోల్‌కతాతో పాటు ఐటీ పరిశ్రమ కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నియామకాల్లో 6 నుంచి 11 శాతం క్షీణత ఉండగా మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై నగరాల్లో మాత్రం కొత్త జాబ్ ఆఫర్లలో వరుసగా 5, 4 శాతాల చొప్పున వృద్ధి నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇక చెన్నైలో అత్యధికంగా 11 శాతం, బెంగళూరులో 9 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నియామకాలు పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో పుణె, కోల్‌కతాలో నియామకాలు 6 శాతం తగ్గాయి. చిన్న నగరాల విషయానికి వస్తే.. కొచ్చిలో 18 శాతం, కోయంబత్తూరులో 7 శాతం తగ్గింది. మరోవైపు మెట్రో నగరాలైన ఢిల్లీ 5 శాతం, ముంబై 4 శాతం వృద్ధిని సాధించాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వడోదరలో అత్యధికంగా 37 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 22 శాతం, జైపూర్‌లో 10 శాతం నియామకాల్లో వృద్ధి నమోదైనట్లు నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ పేర్కొంది. ఈ రంగాల్లో జోష్ ఐటీ రంగంలో నియామకాల్లో క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లో మాత్రం కొత్త నియామకాల్లో జోష్ కనిపించినట్లు తాజా వివేదిక తెలిపింది. చమురు & గ్యాస్/పవర్ రంగం అత్యధికంగా 24 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాత ఫార్మా పరిశోధన, అభివృద్ధి (19 శాతం), బ్యాంకింగ్/ఫైనాన్స్/బ్రోకింగ్ (13 శాతం) ఉన్నాయి. ఇక నియామకాల్లో క్షీణత అత్యధికంగా ఉన్న రంగాలలో ఐటీ తర్వాత విద్య (10 శాతం), టెలికాం (9 శాతం) ఉన్నాయి. భారత్‌లో వైట్ కాలర్ నియామకానికి సంబంధించిన ఇండెక్స్ విలువ ఈ ఏడాది అక్టోబర్‌లో 2484గా ఉంది. ఇది గతేడాది అక్టోబర్‌లో 2455గా నమోదైంది. -
దీపావళికి కొత్త స్కూటర్ కొనాలా? బెస్ట్ మోడల్స్ ఇక్కడ చూడండి!
భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే మొదలైపోయింది. ఈ తరుణంలో చాలా మంది కొత్త కార్లు లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో దేశీయ విఫణిలో కొనుగోలు చేయడానికి ఉత్తమమైన ఐదు స్పోర్టీ స్కూటర్లను గురించి తెలుసుకుందాం. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125) ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణపొందిన 'టీవీఎస్ మోటార్' కంపెనీకి చెందిన 'ఎన్‌టార్క్ 125' పండుగ సీజన్లో కొత్త స్కూటర్ కొనాలనుకునే వారికి మంచి ఎంపిక. ఈ స్కూటర్ బేస్ మోడల్ ధర రూ.84636, టాప్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్ కలిగి 7000 ఆర్పీఎమ్ వద్ద 9.25 బీహెచ్పీ పవర్, 5500 ఆర్పీఎమ్ వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సీవీటీ యూనిట్‌తో లభించే ఈ స్కూటర్ మంచి పనితీరుని అందిస్తుంది. సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125) సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఉత్తమ స్కూటర్లలో ఒకటి అవెనిస్ 125. రూ. 89900 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 124.3 సీసీ ఇంజిన్ కలిగి 6750 ఆర్పీఎమ్ వద్ద 8.58 బీహెచ్పీ పవర్, 5500 ఆర్పీఎమ్ వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా గ్రాజియా 125 (Honda Grazia 125) హోండా గ్రాజియా 125 మంచి డిజైన్ కలిగి రూ. 82520 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఉత్తమ స్కూటర్లలో ఒకటి. ఇందులో 6000 ఆర్పీఎమ్ వద్ద 8.14 బీహెచ్పీ పవర్, 5000 ఆర్పీఎమ్ వద్ద 10.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సీవీటీ యూనిట్‌తో లభించే ఈ స్కూటర్ పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన యమహా అనేక స్టైలిష్ బైకులు విడుదల చేసి మంచి అమ్మకాలు పొందుతోంది. కంపెనీకి చెందిన 'రే జెడ్ఆర్ 125' మన జాబితాలోని ఉత్తమ స్కూటర్లలో ఒకటి. రూ. 84730 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ వెహికల్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి 8.04 బీహెచ్పీ పవర్, 10.3 టార్క్ అందిస్తుంది. ఇదీ చదవండి: అందుకే 'రోహన్ మూర్తి' ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసాడు! ఏప్రిలియా ఎస్ఆర్ 125 (Aprilia SR 125) మన జాబితాలో ఖరీదైన స్కూటర్ ఏప్రిలియా ఎస్ఆర్ 125. దీని ధర రూ. 1.23 లక్షలు (ఎక్స్ షోరూమ్). 124.45 సీసీ ఇంజిన్ కలిగిన ఈ స్కూటర్ 7300 ఆర్పీఎమ్ వద్ద 9.97 బీహెచ్పీ పవర్, 5500 ఆర్పీఎమ్ వద్ద 10.33 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ స్కూటర్ రైడర్లకు అవసరమైన లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో కలిగి ఉంటుంది. -
చెన్నై టూ సింగపూర్.. వయా వైజాగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విహార ప్రపంచానికి విశాఖ సరికొత్తగా కనిపించబోతోంది. విశాఖ మీదుగా పర్యాటక రంగంలో సేవలందించేందుకు రెండు క్రూయిజ్ షిప్పులు క్యూ కడుతున్నాయి. సాగర జలాల్లో హాయిగా విహరిస్తూ.. విశాఖ నుంచి ప్రపంచంలోని పలు నగరాలకు సర్విసులు నడిపేందుకు లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సిద్ధమవుతోంది. విశాఖలో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ మీదుగా డిసెంబర్ నుంచి తొలి సర్విస్ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. చెన్నై నుంచి సింగపూర్‌కి తొలి సర్విసు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన లిట్టోరల్.. ఈ క్రూయిజ్‌ని విశాఖ మీదుగా నడపాలని నిర్ణయించింది. మరోవైపు భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో విహరించేలా మరో క్రూయిజ్ సర్విస్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే టూరిస్ట్ క్రూయిజ్ షిప్‌ల ప్రతినిధులు విశాఖపట్నం పోర్టు అథారిటీ అధికారులతోపాటు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖతో సంప్రదింపులు జరిపారు. అనుమతులు ఇచ్చేందుకు పోర్టు అంగీకారం తెలిపింది. త్వరలోనే సర్విసుల వివరాల్ని ప్రకటించేందుకు చెన్నైకి చెందిన లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖతో చర్చలు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, విశాఖ పోర్టు అథారిటీ సంయుక్తంగా విశాఖలో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. టెర్మినల్ అందుబాటులోకి రావడంతో.. క్రూయిజ్‌లో విహరించే వారికి సౌకర్యాలుంటాయన్న కారణంతో ఈ సర్విస్‌ని విశాఖ మీదుగా నడపాలని భావించారు. ముంబైలో ఇటీవల ముగిసిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (జీఎంఐఎస్)–2023లో లిట్టోరల్ క్రూయిజెస్ లిమిటెడ్ ప్రమోటర్ రాజా వైజ్‌తోపాటు చెన్నైకి చెందిన వోక్ పోర్టు అథారిటీ, ట్యుటికోరిన్ పోర్టు ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించి విశాఖపట్నం పోర్టు ప్రతిని«ధులతో సంప్రదింపులు కూడా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో లిట్టోరల్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. చెన్నైని హోం పోర్ట్‌గా చేసుకుని రెండు విలాసవంతమైన నౌకలకు సంబంధించిన నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత్–శ్రీలంక– మాల్దీవులకు మరో సర్విసు రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్–శ్రీలంక–మాల్దీవుల మధ్య మరో లగ్జరీ క్రూయిజ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సర్విసును కూడా లిట్టోరల్ సంస్థ నడపనుంది. వీలైనంత త్వరగా ఈ సర్విసు కూడా విశాఖ మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు షిప్పులు పూర్తి లగ్జరీగా ఉంటాయని విశాఖపట్నం పోర్టు ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్కొక్కటి 10 అంతస్తులుండే ఈ భారీ షిప్లో ఒకేసారి 1,200 నుంచి 1,500 మంది వరకూ ప్రయాణించవచ్చు. ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్‌షో ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న వారందరికీ షిప్‌లోని క్యాసినో వరల్డ్‌కు ఎంట్రీ ఉచితం. దీంతో పాటు లిక్కర్, ఇతర సర్విసులకు అదనపు చార్జీలు ఉంటాయి. -
80 శాతం సైబర్ నేరాలు 10 జిల్లాల నుంచే..
నోయిడా: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. దేశంలో ఇలాంటి నేరాల్లో 80 శాతం నేరాలు కేవలం 10 జిల్లాల నుంచే జరుగుతున్నట్లు ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎఫ్‌సీఆర్‌ఎఫ్) అనే స్టార్టప్ కంపెనీ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాజస్తాన్‌లోని భరత్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, జార్ఖండ్‌లోని జామ్తారా, హరియాణాలోని నూహ్ జిల్లాల్లో సైబర్ నేరగాళ్లు అధికంగా తిష్ట వేశారని అధ్యయనం తెలియజేసింది. ప్రధానంగా భరత్పూర్, మధుర జిల్లాలు కేటుగాళ్లకు హాట్స్పాట్లుగా మారాయని పేర్కొంది. భరత్పూర్ నుంచి 18 శాతం, మధుర నుంచి 12 శాతం సైబర్ నేరాలు జరగుతున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు దేవగఢ్, గురుగ్రామ్, అల్వార్, బొకారో, కర్మాటాండ్, గిరిదీ జిల్లాల నుంచి సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇవన్నీ ప్రధాన నగరాలకు సమీపంలో ఉన్నాయని, ఆయా జిల్లాల్లో సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు పెద్దగా లేవని ఎఫ్‌సీఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు హర్షవర్దన్ సింగ్ చెప్పారు. -
చాలా మంది అప్పడు పుట్టినవాళ్లే! భారత్‌లో ఉద్యోగులపై ఆసక్తికర రిపోర్ట్
భారతదేశంలోని 10 మంది ఉద్యోగుల్లో ఏడుగురు (సుమారు 70 శాతం) మిలీనియల్స్ (1981 నుంచి 1996 మధ్య పుట్టిన వారు) ఉన్నట్లు తాజా నివేదిక ఒకటి పేర్కొంది. వీరిలోనూ 22 శాతం మంది మహిళలు కావడం గమనార్హం. ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా’ నివేదిక ప్రకారం 87 శాతం మంది మిలీనియల్స్ తమ ప్రస్తుత కంపెనీలను గొప్ప కార్యస్థలంగా భావిస్తున్నారు. మిలీనియల్స్‌లో 39 శాతం మంది మేనేజర్ స్థాయికి ఎదిగారని, ఈ కంపెనీలు అనుసరిస్తున్న ప్రగతిశీల నాయకత్వ అభివృద్ధి వ్యూహాలకు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. మిలీనియల్స్‌లో దాదాపు 52 శాతం మంది తమ యాజమాన్యాల నిర్ణయాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిదింట నాలుగు రంగాల్లో మిలీనియల్స్ బలమైన సానుకూలతను కలిగి ఉన్నారు. అయితే దీనికి విరుద్ధంగా యాజమాన్యాల పక్షపాత వైఖరి, లాభాల పంపిణీ వంటి విషయాల్లో మాత్రం అంత సానుకూలత లేదని నివేదిక పేర్కొంది. మిలీనియల్స్ కీలక రంగాలలో గణనీయమైన శాతంలో ఉన్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌లో 75 శాతం, హెల్త్‌కేర్‌లో 75 శాతం, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాలలో 72 శాతం వీరే ఉన్నారు. కార్య క్షేత్రంలో 45 శాతం మిలీనియల్స్‌కు విస్తారమైన ఆవిష్కరణ అవకాశాలు లభిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: ఆ ఉద్యోగాలకు ముప్పే.. ఐబీఎం సీఈవో కీలక వ్యాఖ్యలు -
దేశంలో యూట్యూబ్ తోపులు వీళ్లే!
యూట్యూబ్ ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూట్యాబ్‌ను వీక్షిస్తున్నారు. భారతదేశంలోనూ కోట్ల మంది యూట్యూబ్ వీక్షకులు ఉన్నారు. ఇందుకు తగినట్లే యూట్యూబర్లు, యూట్యాబ్ ఛానళ్లు సైతం ఇటీవల పెద్ద సంఖ్యలో పెరిగాయి. యూజర్లు కంటెంట్‌ని వినియోగించే విధానంలో యూట్యాబ్ విప్లవాత్మక మార్పులు చేసింది. దేశంలో ఈ ప్లాట్‌ఫారమ్ కొత్త తరం డిజిటల్ సెలబ్రిటీలకు జన్మనిచ్చింది. కామెడీ స్కెచ్‌ల నుంచి టెక్నికల్ రివ్యూల వరకు దేశంలోని ఈ టాప్ యూట్యూబర్లు దూసుకుపోతున్నారు. 2008లో భారతదేశంలో యూట్యూబ్ అరంగేట్రం కొత్త శకానికి నాంది పలికింది. ప్రారంభంలో మ్యూజిక్ వీడియోలకే పరిమితమైన యూట్యూబ్ అనతి కాలంలోనే దేశంలోని యూట్యూబర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అతిపెద్ద వేదికగా మారింది. వర్ధమాన చిత్రనిర్మాతల నుంచి గృహిణుల వరకు యూట్యూబ్ కోట్లాది మంది గొంతుగా మారింది. 2023లో దాదాపు 467 మిలియన్ల మంది యూజర్లతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యూట్యూబ్ సబ్స్క్రైబర్లను దేశంగా భారత్ నిలిచింది. దేశంలోని టాప్ 10 యూట్యూబర్లు భారతదేశంలో డిజిటల్ సూపర్స్టార్లు ఈ టాప్ 10 యూట్యూబర్లు. యూట్యూబ్‌లో యూజర్లను పెంచుకోవడం మామూలు విషయం కాదు. యూట్యూబ్ అల్గారిథంను అవపోసన పట్టి యూజర్ల నాడిని తెలుసుకుని అందుకు తగిన కంటెంట్‌ను క్రియేట్ చేసే వాళ్లే ఇక్కడ టాప్‌లో నిలుస్తారు. అలా యూజర్లపరంగా టాప్ 10లో ఉన్న యూట్యాబర్లు, వారి చానళ్లు, ఏ రకమైన కంటెంట్ అందిస్తున్నారో తెలుసుకుందాం.. క్యారీమినాటి, 39.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, రోస్టింగ్, కామెడీ కంటెంట్ టోటల్ గేమింగ్, 35.7 మిలియన్ సబ్స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్ టెక్నో గేమర్స్, 34.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్ మిస్టర్ ఇండియన్ హ్యాకర్, 32.1 మిలియన్ సబ్స్క్రైబర్లు, లైఫ్ హ్యాక్స్, ప్రయోగాలు రౌండ్2హెల్, 30.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ స్కిట్లు ఆశిష్ చంచలానీ, 29.8 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ స్కిట్లు, వ్లాగ్‌లు సందీప్ మహేశ్వరి, 27.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, మోటివేషనల్ స్పీకింగ్ బీబీకి వైన్స్, 26.3 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ, వినోదం అమిత్ భదానా, 24.3 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ, వినోదం టెక్నికల్ గురూజీ, 23.1 మిలియన్ సబ్స్క్రైబర్లు, టెక్నాలజీ రివ్యూస్ -
స్వాతంత్య్రానికి ముందే వందలాది బ్యాంకులు! ఘనమైన మన బ్యాంకింగ్ చరిత్ర
బ్యాంకులు చాలా కాలంగా మన జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. బ్యాంకింగ్ రంగం మన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్ర చాలా దశలు, సంస్కరణలను చూసింది. అప్పటి నుంచి నిరంతరం అభివృద్ధి చెందుతోంది. 1949 బ్యాంకింగ్ కంపెనీల చట్టం ప్రకారం, బ్యాంకింగ్ అనేది ప్రజల నుంచి రుణాలు లేదా పెట్టుబడి కోసం డిపాజిట్లను తీసుకునే ఆర్థిక సంస్థగా నిర్వచించారు. ఖాతాదారులకు అవసరమైనప్పుడు డిపాజిట్లను బ్యాంకులు తిరిగి చెల్లిస్తాయి. ప్రాథమికంగా బ్యాంకులు అందించే సేవలు ఇవే అయినప్పటికీ కాలానుగుణంగా బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. (మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!) భారతీయ బ్యాంకింగ్ చరిత్ర వేద కాలం నుంచి భారతదేశంలో బ్యాంకింగ్ ప్రాబల్యం ఉంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రను మూడు దశలుగా వర్గీకరించవచ్చు. 1947 స్వాతంత్య్రానికి ముందుది మొదటి దశ, 1947 నుంచి 1991 వరకు రెండో దశ, 1991 తర్వాతది మూడో దశ. 600లకు పైగా బ్యాంకులు స్వాతంత్ర్య పూర్వ దశలో భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రలో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ దశలో దేశంలో 600 కంటే ఎక్కువ బ్యాంకులు ఉండేవి. భారతదేశంలో మొదటి బ్యాంక్ 1770లో ఏర్పాటైంది. అదే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. తద్వారా భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పునాదిగా మారింది. మొదటి దశలో దేశంలో మూడు బ్యాంకులు విలీనం అయ్యాయి. అవి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. అవన్ని విలీనమై తర్వాత ఇంపీరియల్ బ్యాంక్‌గా ఉనికిలోకి వచ్చాయి. తరువాత 1955లో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇదే కాలంలో మరికొన్ని ఇతర బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయి. అలహాబాద్ బ్యాంక్ 1865లో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో, బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో ఏర్పాటయ్యాయి. -
దేశంలో అత్యంత సంపన్న మహిళలు వీళ్లే.. (ఫొటోలు)
-
ఇండియాలో అక్కడ నివాసం చాలా కాస్ట్లీ - హైదరాబాద్ స్థానం ఏంటంటే?
న్యూఢిల్లీ: ప్రవాసులకు భారత్‌లో నివాస వ్యయాల పరంగా ముంబై ఖరీదైన పట్టణంగా ఉన్నట్టు మెర్సర్ 2023 జీవన వ్యయ సర్వే నివేదిక వెల్లడించింది. ముంబై తర్వాత ఖరీదైన పట్టణాలుగా న్యూఢిల్లీ, బెంగళూరు నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే ముంబై ర్యాంక్ (నివాస వ్యయాల పరంగా) 147గా ఉంది. న్యూఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్‌కతా 211, పుణె 213 ర్యాంకులతో ఉన్నాయి. ముంబైతో పోలిస్తే హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా పుణెలో ప్రవాసులకు వసతి వ్యయాలు సగమే ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దేశంలో కోల్‌కతా అతి తక్కువ వ్యయాలతో ఉన్నట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 227 పట్టణాలను సర్వే చేసి మెర్సర్స్ ఈ నివేదికలో ర్యాంకులు కేటాయించింది. అంతర్జాతీయంగా హాంగ్‌కాంగ్, సింగపూర్, జ్యూరిచ్ ప్రవాస ఉద్యోగులకు అత్యంత ఖరీదైన పట్టణాలుగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అతి తక్కువ వ్యయాలతో కూడిన పట్టణాలుగా హవానా, కరాచీ, ఇస్లామాబాద్ ఉన్నాయి. నివాసం, రవాణా, ఆహారం, వస్త్రాలు, ఇంటి వస్తువులు, వినోదానికి అయ్యే ఖర్చు ఇలా 200 వస్తువులకు అయ్యే వ్యయాల ఆధారంగా మెర్సర్ ఈ అంచనాలను రూపొందించింది. ఇతర ప్రాంతాల్లో కరెన్సీ విలువల్లో అస్థిరతలు, వస్తు సేవల ధరలపై ద్రవ్యోల్బణ ప్రభావం వంటివి భారత పట్టణాల ర్యాంకులు దిగువకు మారేలా కారణమైనట్టు మెర్సర్ ఇండియా మొబిలిటీ లీడర్ రాహుల్ శర్మ తెలిపారు. (ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు) ఢిల్లీ, ముంబై అనుకూలం బహుళజాతి సంస్థలు విదేశాల్లో కార్యకలాపాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఢిల్లీ, ముంబై వ్యయాల పరంగా అనుకూలమైన వేదికలుగా ఉన్నట్టు మెర్సర్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇక్కడ నివాస వ్యయాలు తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. -
భారత్ లో ట్విట్టర్ ఆఫీసులు బంద్
-
ఎక్కడ..2 వేల నోట్లు ..?
-
భారత్ లో ఫుట్ బాల్ ఎందుకు పాపులర్ కాలేదు..?
-
టాప్ గేర్ లో గేమింగ్.. లక్షల్లో ఉద్యోగాలు..
-
డిసెంబర్ 12 వరకు ఊరూరా పెళ్లి సందడి..
-
ఇంతకు మించి బంగారం ఇంట్లో ఉంటే చిక్కులు తప్పవు
-
5G సేవలు ఎన్నో అవకాశాలు కల్పిస్తాయి : ప్రధాని నరేంద్ర మోదీ
-
భారత్‌లో ఉగ్రదాడులకు అవకాశం
వాషింగ్టన్: భారత్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా వెల్లడించింది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు నిర్ణయాలతో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత సరిహద్దుల వద్ద దాడులకు తెగబడే అవకాశం ఉందని పేర్కొంది. మిలిటెంట్ గ్రూపులను పాక్ కట్టడి చేయని పక్షంలో భారత్‌పై ఉగ్రమూకలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపింది. ఈ విషయంలో చైనా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం లేదని తాము భావిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ఇండో పసిఫిక్ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ శ్రీవర్ వెల్లడించారు. కశ్మీర్ విషయంలో కేవలం దౌత్య, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై మాత్రమే పాక్‌కు చైనా అండగా ఉంటుందని శ్రీవర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికలపై పాక్‌కు చైనా మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్
న్యూఢిల్లీ: భారత్‌లోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఐఐటీ–మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర సాంకేతిక విద్యాసంస్థల పనితీరు ఆధారంగా రూపొందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానం దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో 3,127 విద్యా సంస్థలు పాల్గొన్నాయి. విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలిస్థానంలో నిలవగా, జేఎన్‌యూ, బీహెచ్‌యూ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే కళాశాల విభాగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని మిరండా కాలేజీ అగ్రస్థానం దక్కిచుకుంది. మరోవైపు అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యాసంస్థలు సత్తా చాటాయి. టాప్–10లో ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–ముంబై తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మేనేజ్మెంట్ విద్యాసంస్థల జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) తొలి 10 స్థానాల్లో ఆరింటిని దక్కించుకున్నాయి. వీటిలో ఐఐఎం–బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా, ఐఐఎం–ఢిల్లీ, ఐఐఎం–ముంబై, ఐఐఎం–రూర్కీ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఉన్నతవిద్య విషయంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంపై రాష్ట్రపతి కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. -
పర్యాటకానికి దేశం ఎంతో అనువైనది
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : పర్యాటకరంగానికి మన దేశం ఎంతో అనువైనదని, ఇక్కడ ప్రకృతి సంపదకు కొదవే లేదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు అన్నారు. యూనివర్సిటీలో డిపార్టుమెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. విదేశాలను తలదన్నే రీతిలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వనరులూ మన దేశంలో ఉన్నాయని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రమేష్ అన్నారు. పర్యాటకరంగం ఆవశ్యకత, ప్రాముఖ్యం, అభివృద్ధి తదితర అంశాల గురించి విభాగాధిపతి డాక్టర్ ఎన్.ఉదయ్‌భాస్కర్ వివరించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంపై విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, పోస్టర్ ప్రజెంటేషన్లు నిర్వహించి, విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు. ఫొటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పర్యాటకరంగ అధ్యాపకులు కె.సాయిబాబా, ఐఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచంలో ఇస్రోది నాలుగో స్థానం
డిప్యూటీ మేనేజర్ వీఆర్‌కేఎస్ వరప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ) : అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఇస్రో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని ఆ సంస్థ డిప్యూటీ మేనేజర్ వీఆర్‌కేఎస్ వరప్రసాద్ తెలిపారు. కాకినాడ ఆదిత్య అకాడమీకి శుక్రవారం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. సాక్షి : ఇప్పటివరకూ ఇస్రో ఎన్ని పరిశోధనలు చేసింది? వరప్రసాద్ : ఇప్పటివరకూ 36 రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగా వాటిలో 34 విజయవంతమయ్యాయి. సాక్షి : కొత్తగా ప్రాజెక్టుల గురించి.. వరప్రసాద్ : ఈ నెల 26న పీఎస్ఎల్వీ–35 ద్వారా ఫారిన్ శాటిలైట్ రిమోట్ సిస్టమ్‌ను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నాము. సాక్షి : అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పద్ధతులు ఏమైనా అవలంబిస్తున్నారా? వరప్రసాద్ : పర్యావరణానికి ముప్పు కలగకుండా, జీవరాశులకు నష్టం వాటిల్లకుండా సమాజంలో సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి : శాంతి ప్రయోజనాల కోసమే ప్రయోగాలన్నది ముఖ్య ఉద్దేశ్యమా? వరప్రసాద్ : శాంతి ప్రయోజనాల కోసమే ప్రయోగాలన్నది ఐక్యరాజ్య సమితి ముఖ్య ఉద్దేశ్యం. దానికోసం 1967 అక్టోబర్ 10న ఒప్పందం జరిగింది. సాక్షి : అంతరిక్ష వారోత్సవాల ఉద్దేశ్యమేమిటి? వరప్రసాద్ : నేటికీ చాలామందికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే ఉపగ్రహాల పనితీరు, వాటి ఉపయోగాల గురించి తెలీదు. సామాన్య మానవుడికి సహితం అర్థమయ్యే రీతిలో అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు వీడియోలు ప్రదర్శిస్తాం. వీటికి జిల్లాలవారీగా విద్యాసంస్థలను ఎంచుకుని ఆ ప్రాంత ప్రజలను, విద్యార్థులను చైతన్యవంతం చేస్తాము. -
రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న అవినీతి
కేంద్రం నిధులతో ‘బాబు’ ప్రచారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి బోట్‌క్లబ్ ( కాకినాడ) : రాష్ట్రంలో రోజురోజుకీ అవినీతి పేరుకుపోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య విమర్శించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా అనేక నిధులు మంజూరు చేస్తోందని, కేంద్ర నిధులు తెచ్చుకొని వాటికి చంద్రబాబు పేర్లు పెట్టుకోవడం దారుణమని అన్నారు. ఎక్కడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వం పేరు ప్రస్తావించకపోవడాన్ని తప్పు పట్టారు. మిత్రపక్షంగా ఉండి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇచ్చే విధంగా ఒక పక్క చర్చలు జరుపుతూనే ఇలాంటి విమర్శలు తగవన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలు చేస్తున్నాయని, ఇటువంటి తరుణంలో మిత్రపక్షమైన టీడీపీ నాయకులు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, సహకరించడం లేదని చెప్పడం బాధాకరమన్నారు. సమావేశంలో బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ పెద్దిరెడ్డి రవికిరణ్ , నగర కన్వీనర్ మచ్చా గంగాధర్, జిల్లా మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు తదతరులు పాల్గొన్నారు. -
పల్లె నుంచి వలసతో విపరిణామాలు
గ్రామ వికాసమే దేశ వికాసం : సీతారాంజీ ∙ జిల్లాలో ప్రవేశించిన భారత పరిక్రమ పాదయాత్ర తుని రూరల్ : గ్రామీణులు పట్టణాలకు వలస పోతున్నందు వల్ల పెక్కు విపరిణామాలు సంభవిస్తున్నాయని పూజ్య సీతారాంజీ ఆవేదన వ్యక్తం చేశారు. వలసలతో గ్రామ జీవనం, భూమి, నీరు, అడవులు, ప్రాణులు, ప్రకృతి, గ్రామీణ సంస్కృతులు అస్తవ్యస్తమవుతున్నాయన్నారు. దేశం అభివృద్ధి సాధించాలంటే గ్రామ జీవనం సురక్షితంగా ఉండాలని, ఒకే కుటుంబంగా సామరస్య పూర్వకంగా కలసి జీవించాలని పేర్కొన్నారు. ఈ లక్ష్యసాధనకే ప్రజలను, చేతివృత్తిదారులను చైతన్యం చేసేందుకు భారత పరిక్రమ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న భారత పరిక్రమ పాదయాత్ర బుధవారం జిల్లాలో ప్రవేశించింది. రాముడి నుంచి కలాం వరకూ అదే చెప్పారు.. ఈ సందర్భంగా తుని మండలం డి.పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఆలయ ప్రాంగణంలో వేర్వేరుగా విద్యార్ధులు, ప్రజలతో సీతారాంజీ సమావేశమయ్యారు. గ్రామ వికాసంతోనే దేశ వికాసం సాధ్యమవుతుందన్నారు. ఇందుకు మనస్సులో శ్రద్ధ కలగాలని స్వామి వివేకానంద ఉద్బోధించారని, ప్రతి వ్యక్తీ తన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ అన్నారని చెప్పారు. త్రేతాయుగం నుంచి కలియుగం వరకూ; రాముడి నుంచి అబ్దుల్ కలాం వరకూ గ్రామాన్ని రక్షించాలని ఆకాంక్షించారన్నారు. ‘గ్రామాలను దర్శిద్దాం, గోవులను సంరక్షిద్దాం, ప్రకృతిని కాపాడుదాం’ అని ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలో మొక్కలను నాటారు. చేతివృత్తిదారుల ఇళ్లను సందర్శించి వారి స్థితిగతులను అడిగితెలుసుకున్నారు. కాగా సీతారాంజీ రాత్రికి గ్రామంలోనే బస చేసి గురువారం చామవరంలో సందేశం కార్యక్రమం నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. సాదర స్వాగతం పాదయాత్రగా వచ్చిన సీతారాంజీకి ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండారెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి చోడ్రాజు సత్య కృష్ణంరాజు, ఓలేటి సత్యనారాయణ, ఎం.వి.కుమార్, డాక్టర్ పలకా సోమేశ్వరరావు, చదరం నరసింహమూర్తి, వాడబోయిన సాంబయ్య స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.