బ్యాంకులు చాలా కాలంగా మన జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. బ్యాంకింగ్ రంగం మన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్ర చాలా దశలు, సంస్కరణలను చూసింది. అప్పటి నుంచి నిరంతరం అభివృద్ధి చెందుతోంది.
1949 బ్యాంకింగ్ కంపెనీల చట్టం ప్రకారం, బ్యాంకింగ్ అనేది ప్రజల నుంచి రుణాలు లేదా పెట్టుబడి కోసం డిపాజిట్లను తీసుకునే ఆర్థిక సంస్థగా నిర్వచించారు. ఖాతాదారులకు అవసరమైనప్పుడు డిపాజిట్లను బ్యాంకులు తిరిగి చెల్లిస్తాయి. ప్రాథమికంగా బ్యాంకులు అందించే సేవలు ఇవే అయినప్పటికీ కాలానుగుణంగా బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. (మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!)
భారతీయ బ్యాంకింగ్ చరిత్ర
వేద కాలం నుంచి భారతదేశంలో బ్యాంకింగ్ ప్రాబల్యం ఉంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రను మూడు దశలుగా వర్గీకరించవచ్చు. 1947 స్వాతంత్య్రానికి ముందుది మొదటి దశ, 1947 నుంచి 1991 వరకు రెండో దశ, 1991 తర్వాతది మూడో దశ.
600లకు పైగా బ్యాంకులు
స్వాతంత్ర్య పూర్వ దశలో భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రలో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ దశలో దేశంలో 600 కంటే ఎక్కువ బ్యాంకులు ఉండేవి. భారతదేశంలో మొదటి బ్యాంక్ 1770లో ఏర్పాటైంది. అదే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. తద్వారా భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పునాదిగా మారింది.
మొదటి దశలో దేశంలో మూడు బ్యాంకులు విలీనం అయ్యాయి. అవి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. అవన్ని విలీనమై తర్వాత ఇంపీరియల్ బ్యాంక్‌గా ఉనికిలోకి వచ్చాయి. తరువాత 1955లో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇదే కాలంలో మరికొన్ని ఇతర బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయి. అలహాబాద్ బ్యాంక్ 1865లో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో, బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో ఏర్పాటయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment