History Of The Indian Rupee: భారతదేశానికి స్వాతంత్యం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. అయితే 1947 నుంచి ఇండియన్ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఎలా ఉండేది? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ. 3.30గా ఉండేది. అయితే ఈ విలువ క్రమంగా ప్రతి సంవత్సరం పడిపోతూ వచ్చింది. ఇప్పుడు అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 82.73 రూపాయలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మన కరెన్సీ విలువ ఎంతగా తగ్గిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. కాగా 1949 నుంచి 1966 వరకు USD-INR ఎక్సేంజ్ రేటు రూ. 4.76 వద్ద కొనసాగింది. ఆ తరువాత క్రమంగా పడిపోతూ వచ్చింది.
1947 నుంచి 2023 వరకు ఇండియన్ రూపాయి హిస్టరీ..
సంవత్సరం - ఎక్సేంజ్ రేట్(USD/INR)
- 1947 3.30
- 1949 4.76
- 1966 7.50
- 1975 8.39
- 1980 7.86
- 1985 12.38
- 1990 17.01
- 1995 32.427
- 2000 43.50
- 2005 (జనవరి) 43.47
- 2006 (జనవరి) 45.19
- 2007 (జనవరి) 39.42
- 2008 (అక్టోబర్) 48.88
- 2009 (అక్టోబర్) 46.37
- 2010 (జనవరి) 46.21
- 2011 (ఏప్రిల్) 44.17
- 2011 (సెప్టెంబర్) 48.24
- 2011 (నవంబర్) 55.39
- 2012 (జూన్) 57.15
- 2013 (మే) 54.73
- 2013 (సెప్టెంబర్) 62.92
- 2014 (మే) 59.44
- 2014 (సెప్టెంబర్) 60.95
- 2015 (ఏప్రిల్) 62.30
- 2015 (మే) 64.22
- 2015 (సెప్టెంబర్) 65.87
- 2015(నవంబర్) 66.79
- 2016(జనవరి) 68.01
- 2016(జనవరి) 67.63
- 2016(ఫిబ్రవరి) 68.82
- 2016 (ఏప్రిల్) 66.56
- 2016 (సెప్టెంబర్) 67.02
- 2016 (నవంబర్) 67.63
- 2017 (మార్చి) 65.04
- 2017 (ఏప్రిల్) 64.27
- 2017 (మే) 64.05
- 2017 (ఆగస్టు) 64.13
- 2017 (అక్టోబర్) 64.94
- 2018 (మే) 64.80
- 2018 (అక్టోబర్) 74.00
- 2019 (అక్టోబర్) 70.85
- 2020 (జనవరి) 70.96
- 2020 (డిసెంబర్) 73.78
- 2021 (జనవరి) 73.78
- 2021 (డిసెంబర్) 73.78
- 2022 (జనవరి) 75.50
- 2022 (డిసెంబర్) 81.32
- 2023 (జనవరి) 82.81
- 2023 (జూన్) 83.94
నిజానికి 1950 లలో ఒక రూపాయికి 16 అణాలు, 64 పైసలుగా విభజించారు. ఆ తరువాత 1 రూపాయికి 100 పైసలుగా ఫిక్స్ చేశారు. కాలక్రమంలో రూపాయి మాదిరిగానే అమెరికన్ డాలర్ కూడా ద్రవ్యోల్భణ ప్రభావానికి గురైంది.
కొన్ని నివేదికల ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో రూపాయి & డాలర్ రెండూ సమానమే అని నమ్మేవాళ్ళు. దీనిపైనా అనేక వాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో మెట్రిక్ సిస్టం వంటివి లేదు కాబట్టి అన్ని కరెన్సీలు ఒక విలువను కలిగి ఉండేవని భావించేవారు. అధికారిక రికార్డుల ప్రకారం ఇది ఎప్పటికి సమానం కాదని తెలుస్తోంది.
ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా..
1947కి ముందు భారతదేశం బ్రిటిష్ పాలిత రాష్ట్రంగా ఉండేది, కాబట్టి పౌండ్ విలువ ఎక్కువగా ఉన్నందున INR విలువ ఎక్కువగా ఉండేది. ఇక్కడ 1947లో 1 పౌండ్ 13.37 రూపాయలకు సమానమని నమ్మేవారు. 1944లో బ్రిటన్ వుడ్స్ ఒప్పందాన్ని ఆమోదించినప్పటి నుంచి చరిత్ర ప్రధానంగా ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందం ప్రపంచంలోని ప్రతి కరెన్సీ విలువను నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment