value
-
సహనం విలువ
బయాజిద్ బిస్తామి ఓ సూఫీ. ఆయనను ‘జ్ఞానవాదుల రాజు‘ అని పిలిచేవారు. ఒకరోజు ఎక్కువసేపు మసీదులో గడిపి ఇంటికి బయలు దేరారు. మార్గమధ్యంలో ఓ తాగుబోతు ఎదురు పడ్డాడు. అతని చేతిలో ఓ సంగీత వాద్యం ఉంది. నోటికొచ్చి నట్టల్లా ఏదో పాడుకుంటూ వస్తు న్నాడు. ఆ దారిన వచ్చిపోతున్న వారిని తిడు తున్నాడు. అదే దారిలో బిస్తామీ వెళుతూ అతని స్థితిని చూసి బాధపడ్డారు. అతని దగ్గరకు వెళ్ళి ‘ఎందుకిలా ఉన్నావు?’ అని జాలిగా అడిగారు. బయటకు వచ్చిన ప్పుడు ఎలా ఉండాలో నాలుగు మంచి మాటలు చెప్పసాగారు. అయితే తాగుబోతుకి కోపం వచ్చింది. అతను తన చేతిలో ఉన్న సంగీత వాద్యంతో బిస్తామీ తల మీద కొట్టాడు. ఆయన తలకు గాయమైంది. రక్తం కారింది. అంతేకాదు, తాగుబోతు దగ్గరున్న వాద్యం కూడా విరిగింది. ఇంత జరిగినా సూఫీ జ్ఞాని అతనిని ఏమీ అనలేదు. ఆయన ఇంటికి దగ్గర్లోనే ఉంటాడా తాగుబోతు. మరుసటి రోజు ఆయన తీపి పదార్థాలను, కాస్తంత డబ్బు, ఒక ఉత్తరం ఒకరికి ఇచ్చి తాగుబోతు వద్దకు పంపించారు. తాగుబోతు ఆ ఉత్తరం చదివాడు. అందులో ఇలా ఉంది.‘మీ సంగీత వాద్యం ముక్కలైంది. అందుకు కారణం నా తలే. అందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. కనుక నేను మీకిస్తున్న డబ్బుతోవాద్యం కొనుక్కోండి. అన్నట్టు మరొక విషయం. మీరు నిన్న రాత్రి నాతో మాట్లాడుతున్నప్పుడు మీ నోటంట అనేక చేదు మాటలు దొర్లాయనిపించింది. కనుక మీకు పంపిన తీపి పదార్థాలు తినండి. లోపల ఉన్న చేదు పోతుంది. అప్పుడు మీ మాటలు తీయగా ఉంటాయి’.తాగుబోతు ఈ సంఘటన తర్వాత తాగుడు మానేశాడు. బిస్తామీ వద్దకు వెళ్ళి తన తప్పును క్షమించ మన్నాడు. ఇంకెప్పుడూ అలా చేయనని హామీ ఇచ్చాడు. ‘మీ సహనం, మీ మంచి మాటలు నా కళ్ళు తెరిపించాయ’న్నాడు. – యామిజాల జగదీశ్ -
స్థిరంగానే రూపాయి విలువ..
ఇటీవల మార్కెట్లో తలెత్తిన ఒడిదుడుకులకు అనేకానేక అంశాలు కారణం. అమెరికా ఆర్థిక డేటా ఊహించిన దానికన్నా బలహీనంగా ఉండటమనేది మాంద్యం అవకాశాలపై ఆందోళనలకు ఆజ్యం పోసింది. మాంద్యం తలెత్తే అవకాశాలు 10 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని ఈ ఏడాది జూన్‌లో అంచనా వేయగా ప్రస్తుతం 30-35 శాతం ఉండొచ్చన్న అభిప్రాయం నెలకొనడం ఇందుకు నిదర్శనం.బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్లు పెంచడంతో చోటు చేసుకున్న పరిణామాలు కూడా దీనికి తోడు కావడంతో మార్కెట్ మరింత అనిశ్చితికి లోనైంది. ఈ ప్రభావాలు రూపాయిపైనా పడ్డాయి. దీంతో 2022 అక్టోబర్ నాటి రికార్డు కనిష్ట స్థాయి 83.5ని (డాలరుతో పోలిస్తే) కూడా దాటేసి రూపాయి దాదాపు ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. అయితే, స్వల్పకాలికంగా రూపాయి మారకం క్షీణించినా, గత ఆరు నెలలుగా ఇతర వర్ధమాన, సంపన్న మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే స్థిరత్వాన్నే కనపర్చింది.జపాన్ యెన్, చైనా యువాన్, ఇండొనేషియా రూపయా అలాగే ఇతర వర్ధమాన, సంపన్న మార్కెట్ల కరెన్సీలు ఇటీవల పతనం కావడంతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు అలాగే టారిఫ్‌లపై భయాలు నెలకొన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో రూపాయి మరింత క్షీణించే అవకాశాలు, మానిటరీ పాలసీపై దాని ప్రభావాలపై ఆందోళన నెలకొంది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర ఒడిదుడుకులకు గాని క్షీణతకు గానీ గురయ్యే పెద్ద రిస్కులేమీ లేకుండా రూపాయి స్థిరంగానే కొనసాగేందుకు ఎక్కువ అవకాశం ఉంది.ఆర్బీఐ పాలసీపై కరెన్సీ ప్రభావం..సాధారణంగా కరెన్సీ పతనమైతే సెంట్రల్ బ్యాంకులు పాలసీని కఠినతరం చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవైపు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూ మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలన్న రెండు లక్ష్యాలు వాటికి ఉండటం ఇందుకు ప్రాథమిక కారణం. కరెన్సీ బలహీనపడుతుంటే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయి. దీంతో సెంట్రల్ బ్యాంకులు మరింత కఠినతరమైన ద్రవ్యపరపతి విధానాన్ని అమలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి చర్యలు సాధారణంగా బాండ్ల ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఈల్డ్‌లు పెరిగిపోతాయి.లిక్విడిటీ అలాగే ఆర్థిక పరిస్థితులను కఠినతరంగా మార్చడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ, కరెన్సీ స్థిరంగా ఉండేలా చూడాలనేది ఆర్బీఐ లక్ష్యంగా ఉంటుంది. అయితే, ఈ ధోరణి అనేది తాత్కాలికంగా బాండ్ మార్కెట్ ర్యాలీకి అవరోధంగా మారి, కొంత ఒడిదుడుకులకు దారి తీయొచ్చు.రూపాయి మారకం విలువ మరింత క్షీణించకుండా, కాపాడేందుకు విదేశీ మారక నిల్వలను ఆర్బీఐ క్రియాశీలకంగా గణనీయ స్థాయిలో ఉపయోగిస్తోంది. అయితే, ఇలా జోక్యం చేసుకోవడమనేది బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ తగ్గిపోవడానికి దారి తీయొచ్చు. అలాగే స్వల్పకాలిక వడ్డీ రేట్లు పెరగక తప్పని పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆర్బీఐ గత కొద్ది ట్రేడింగ్ సెషన్లలో 10–15 బిలియన్ డాలర్ల మేర నిల్వలను వినియోగించిందని ఇటీవలి డేటా ప్రకారం తెలుస్తోంది.జేపీ మోర్గాన్ సూచీల్లో భారతీయ బాండ్లను చేర్చడం వల్ల వచ్చిన లిక్విడిటీని తగ్గించే దిశగా అధిక లిక్విడిటీని సిస్టం నుంచి వెనక్కి లాగేందుకు ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ లావాదేవీలు (ఓఎంఓ) నిర్వహించవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీనికి ఒక మోస్తరు అవకాశాలే ఉన్నప్పటికీ, బాండ్ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహం తాత్కాలికంగా మందగించేందుకు ఇది దారితీయొచ్చు. అయినా, బాండ్లకు సంబంధించి డిమాండ్–సరఫరా డైనమిక్స్ సానుకూలంగా ఉండటం వల్ల ఈల్డ్‌లు గణనీయంగా పెరగకుండా నివారించే అవకాశం ఉందనే అభిప్రాయం నెలకొంది.పటిష్ట పరిస్థితుల దన్ను..స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉండటం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, సర్వీసులు వృద్ధి చెందుతుండటం వంటి అంశాలు ఈ నమ్మకానికి ఊతమిస్తున్నాయి. అమెరికాలో అధిక ద్రవ్యలోటు, జీడీపీతో పోలిస్తే రుణభారం పెరగడంవంటి బలహీన స్థూల ఆర్థిక గణాంకాలతో డాలరు మరింత క్షీణతకు గురయ్యే అవకాశం ఉంది.రూపాయి మారకం విలువ క్షీణించినా, ప్రతికూల ప్రభావాలు కాస్త తగ్గి, దేశీ కరెన్సీ కొంత నిలదొక్కుకునేందుకు ఆస్కారం ఉంది. అటు 675 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న విదేశీ మారక నిల్వలు సైతం భారత్‌కి ఉపయోగకరంగా ఉండనున్నాయి. సమీప భవిష్యత్తులో ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు, పెద్ద షాక్‌ల నుంచి రూపాయిని కాపాడుకునేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చు.చైనాలో భారీ సంస్కరణల ఊసు లేకపోవడం వల్ల మందగమనంతో కమోడిటీల ధరలు, ముఖ్యంగా చమురు ధరలు బలహీనపడటం భారత్‌కు సహాయకరంగా ఉండనుంది. మన దిగుమతుల బిల్లుల భారం తగ్గుతుంది కాబట్టి ఇది మన కరెన్సీకి సానుకూలంగా ఉండనుంది.దేవాంగ్ షా -ఫిక్సిడ్ ఇన్‌కం హెడ్, యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ -
భార్య కన్నా గడ్కరీ ఆదాయం తక్కువ.. భూములు కూడా లేవు!
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో ఆయన తన ఆస్తిపాస్తుల వివరాలు తెలియజేశారు. ఆదాయం విషయంలో నితిన్ గడ్కరీ తన భార్య కంచన్ నితిన్ గడ్కరీ కంటే చాలా వెనుకబడివున్నారు. అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం నితిన్ గడ్కరీ 2022-23లో రూ. 13,84,550 ఆదాయం సంపాదించారు. ఆయన భార్య కంచన్కు 2022-23లో రూ.40,62,140 ఆదాయం అందుకున్నారు. నితిన్ గడ్కరీ ఆస్తుల విలువ రూ. ఒక కోటీ 32 లక్షల 90 వేల 605. ఆయన భార్య కంచన్ ఆస్తుల విలువ రూ. ఒక కోటీ 24 లక్షల 86 వేల 441. నితిన్ గడ్కరీ కుటుంబానికి రూ.95,46,275 విలువైన చరాస్తులు ఉన్నాయి. గడ్కరీ పేరు మీద మూడు కార్లు ఉన్నాయి. వీటిలో అంబాసిడర్ కారు ఒకటి. 1994లో కొనుగోలు చేసిన ఈ కారు ధర రూ.10 వేలు. గడ్కరీ దగ్గర హోండా కంపెనీకి చెందిన కారు ఉంది. దీని ధర 6,75,000. గడ్కరీకి ఎల్సుజు కంపెనీకి చెందిన మరో కారు ఉంది. దాని విలువ రూ.12,55,000. నితిన్ గడ్కరీ భార్య కంచన్ పేరు మీద మూడు కార్లు ఉన్నాయి. అవి రూ.5,25,000 విలువైన ఇన్నోవా, రూ.4,10,000 విలువైన మహీంద్రా కంపెనీ కారు, రూ.7,19,843 విలువైన టాటా కంపెనీ కారు. బంగారం, ఆభరణాల విషయంలో భార్య కంచన్ కంటే నితిన్ గడ్కరీ ముందున్నాడు. నితిన్ గడ్కరీ వద్ద రూ.31,88,409 విలువైన బంగారం లేదా ఆభరణాలు ఉన్నాయి. అదే సమయంలో కంచన్ వద్ద రూ.24,13,348 విలువైన ఆభరణాలు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికొస్తే నితిన్ గడ్కరీ పేరు మీద వ్యవసాయ భూమి లేదు. ముంబైలో అతని పేరు మీద ఓ ఇల్లు ఉంది. 960 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి ధర రూ.4.95 కోట్లు. కంచన్కు ఇల్లు, భూమి ఉన్నాయి. వీటి ధర రూ.7 కోట్ల 99 లక్షల 83 వేలు. నితిన్ గడ్కరీ కుటుంబానికి రూ.11 కోట్ల 55 లక్షల 11 వేల విలువైన స్థిరాస్తి ఉంది. నితిన్ గడ్కరీకి రూ. ఒక కోటీ 66 లక్షల 82 వేల 750 రుణం, ఆయన భార్య కంచన్కు రూ.38 లక్షల 8 వేల 390 రుణం ఉంది. -
మన రూ.100కు ఏ దేశంలో ఎంత విలువ?
ప్రపంచంలోని ప్రతీదేశానికి సొంత కరెన్సీ ఉంది. దానికి విలువ ఉండటంతో పాటు, ఇతర దేశాలలోనూ తగినంత గుర్తింపు ఉంటుంది. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా డాలర్‌ను పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ చెల్లింపులు అత్యధికంగా డాలర్లలోనే జరుగుతుంటాయి. ఇక భారత కరెన్సీ విషయానికొస్తే దీని విలువ కొన్ని దేశాల్లో తక్కువగానూ, కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగానూ ఉంటుంది. భారత కరెన్సీ విలువ స్థానిక కరెన్సీ కంటే చాలా రెట్లు అధికంగా ఉన్న దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. దీనితో ప్రయోజనం ఏమిటంటే, భారతీయులు ఆయా దేశాలను సందర్శించడానికి వెళితే తక్కువ డబ్బుతో ఎంజాయ్ చేయవచ్చు. భారతదేశ కరెన్సీ ప్రపంచంలో 38వ స్థానంలో ఉంది. ప్రజాదరణపరంగా ఇది నాల్గవ స్థానంలో ఉంది. వియత్నాం చాలా అందమైన దేశంగా పేరొందింది. భారతీయులు వియత్నాం సందర్శించాలనుకుంటే, తక్కువ డబ్బుతోనే ఎంజాయ్ చేయవచ్చు. వియత్నాంలో భారతీయ కరెన్సీ రూ.100 విలువ 31,765 వియత్నామీస్ డాంగ్. నేపాల్లోనూ భారత కరెన్సీ విలువ ఎక్కువే. నేపాల్‌లో భారత రూ. 100.. 159 నేపాల్ రూపాయలకు సమానం. శ్రీలంకలో మన 100 రూపాయల విలువ 277 రూపాయలు. దీని ప్రకారం చూస్తే శ్రీలంక, నేపాల్‌లను సందర్శించడం భారతీయులకు అత్యంత చౌకైనది. ఇండోనేషియా స్థానిక సాంస్కృతిక వారసత్వం, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇండోనేషియాను సందర్శించాలనుకునే భారతీయులు తమ జేబుపై అధిక భారం పడకుండా ఆ దేశాన్ని సందర్శించవచ్చు. పాకిస్తాన్లో కూడా భారత కరెన్సీ విలువ అధికంగానే ఉంది. పాకిస్తాన్లో భారత రూ.100 విలువ రూ.210గా ఉంది. -
సరైన ఆచరణతోనే సంపద సృష్టి!
సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు. మనీ ఒక్కటేనా..? అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్‌తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం. దీర్ఘ ప్రయాణం సంపద సృష్టించడం అన్నది ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్ కట్స్, ఇన్స్టంట్స్ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి. సంపద అంటే..? సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. ఆదాయం.. వ్యయం.. ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్‌పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి. వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది. సరైన సాధనాలు సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్‌లో ఎన్‌ఎఫ్‌వోల కంటే ట్రాక్ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్‌లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు. ఇతరులను అనుసరించడం ట్రేడింగ్‌తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్‌లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఆర్థిక రక్షణ మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. రాబడి ఒక్కటే కాదు.. పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్‌్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తప్పులకు దూరంగా.. పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్‌లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్ మేనేజర్లపై వేయాలి. లక్ష్యం.. ప్రణాళిక ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి. రుణాలు–చెల్లింపులు తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి. నామినేషన్ చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్ ఖాతాలు, ఈపీఎఫ్ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్ లేకపోతే వెంటనే నమోదు చేయాలి. మార్గమిది... లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్‌తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం . ఇన్స్టంట్ సక్సెస్: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి. కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్ తెలిసి ఉండాలి. -
వ్యక్తం... అవ్యక్తం
పైకి పచ్చగా కనిపించే చెట్టు ఎంత విస్తరించి ఉన్నదో అంత కన్న ఎక్కువగా దాని వేళ్ళు నేలలో పాతుకుని పోయి ఉంటాయి. చెట్టు అంటే పైకి కనిపించే కొమ్మలు, ఆకులు, పూలు, పళ్ళు మాత్రమే అనుకుంటే ఎంత పొరపాటో తెలుస్తోంది కదా. అదే విధంగా మనకి పైకి కనిపించే ప్రపంచం వెనుక ఎంతో ప్రయత్నం ఉంది. కనపడేది ఒక వంతు మాత్రమే... మూలమైనది మూడు వంతులు అని మన ఋషులు దర్శించి తెలియ చేశారు. ఒక వైద్యుడి దగ్గరకి వెళ్లినప్పుడు ఆయన నాలుగు మాటలు చకచక రాయటం చూసి, ఈ మాత్రానికే రూ. 500 తీసుకున్నాడు అని వాపోతారు. కాని, ఆ నాలుగు మాటలు, అంటే మందుల పేర్లు రాయటానికి ఆయన ఎంత కాలం కృషి చేసి ఉంటారో . ఒకసారి ఒక యంత్రం హఠాత్తుగా ఆగిపోయిందట. అందరూ రకరకాలుగా ప్రయత్నం చేశారు కానీ అది మొండికేసింది. ఒక ఇంజినీర్ని పిలిచారు. ఆయన వచ్చి అటు ఇటు పరిశీలించి సుత్తి తీసుకుని సున్నితంగా ఒక దెబ్బ వెయ్యగానే అది పని చెయ్యటం మొదలు పెట్టింది. తన ఫీజు అడగగానే ఒక సుత్తిదెబ్బ ఇంత ఖరీదా? అని అడిగాడట యజమాని. దానికి ఆ ఇంజినీరు సుత్తి దెబ్బకి ఒక రూపాయే. కానీ ఎక్కడ కొట్టాలో, ఎట్లా కొట్టాలో తెలుసుకున్నందుకు మిగిలినది అన్నాడట. నిజమే కదా. సుత్తిదెబ్బ అయితే ఎవరైనా కొట్టి ఉండ వచ్చుగా. ఇంజినీరు ని పిలవటం ఎందుకు? పైకి కనిపించే పని వెనక ఉన్న కృషే పనిలో నైపుణ్యానికి కారణం. ‘‘పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతమ్ దివి’’ అంది పురుష సూక్తం. అది అర్థం కావటానికి మానవుడు స్వయంగా ఇతర ప్రమేయం లేకుండా తయారు చెయ్యగల ఒకే ఒక్కమాట ని ఉదాహరణగా తీసుకోవచ్చు.‘‘త్రీణి నిహితా గుహాని తాని విదుర్ర్బాహ్మణా మనీషిణః నేంగయన్తి తురీయమ్ వాచో మనుష్యా వదంతి’’పరా, పశ్యంతి, మాధ్య మా అనే మూడుస్థాయుల ప్రయత్నం తరువాత వైఖరి అనబడే అందరికి వినపడే వాక్కు వెలువడుతుంది. మనకి తెలియకుండానే ఇంత ప్రయత్నం జరిగిపోతోంది. ఇది అర్థం చేసుకోగలిగితే సృష్టి రహస్యం చాలా వరకు తెలిసినట్టే. దృశ్యమాన జగత్తుకి కారణమైన అదృశ్యంగా ఉన్న దానిని కనీసం ఊహించగలుగుతాం. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక నాటక ప్రదర్శననో, చలనచిత్రాన్నో చూడండి. రంగస్థలం మీద ఒక గంటో, రెండుగంటలో ప్రదర్శించే నాటకానికి పూర్వరంగం అంటే ముందు చేసే ప్రయత్నం ఎంతో. తెరమీద కనపడే ఒక దృశ్యాన్ని చిత్రీకరించటానికి ఎంతమంది ఎన్నిరోజులు శ్రమించి ఉంటారో ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం చేస్తూనే ఉన్నారుగా. ఒక గంట పాట కచేరీకి ఇన్ని వేలా? అని ప్రశ్నించే వారికి సమాధానం అది ఆ గంట కచేరీకి కాదు, దానికి ముందు చేసిన సాధనకి అని. ఒక మేథావి ఇచ్చిన గంట ఉపన్యాసం వింటే వంద గ్రంథాలు చదివినట్టే అనేది అందుకనే. ఒక్క గంట మాట్లాడటానికి వాళ్ళు అప్పటికి కొన్ని గ్రంథాలు చదువుతారు. అంతకుముందే ఎన్నో గ్రంథాలు చదివి ఉంటారు. దానికి వారి అనుభవం, విశ్లేషణ జోడించబడతాయి. ఈ దృష్టి అలవరచుకుంటే వ్యక్తం నుండి అవ్యక్తానికి ప్రస్థానం ప్రారంభమైనట్టే. ఒక చెట్టుని కొట్టటానికి గంట పట్టింది. ఎంత తేలిగ్గా అయిపోయిందో అని చూసే వాళ్ళు అనుకుంటారు. కాని, గంట సమయంలో కొట్టటానికి గాను గొడ్డలికి తగినంత పదును పెట్టటానికి కనీసం పది గంటలు పట్టి ఉంటుంది. కనపడే పని వెనక కనపడకుండా ఉన్న సంసిద్ధత కోసం చేసిన ప్రయత్నం ఎంత ఉంటుందో అర్థం చేసుకుంటే పని సమయాన్ని సరిగా అంచనా వేసినట్టు అవుతుంది. చాలా సందర్భాలలో చేసే పని విలువని సరిగా అంచనా వెయ్యలేకపోవటానికి ఇటువంటి అవగాహనాలోపమే కారణం. – డా. ఎన్.అనంత లక్ష్మి -
రేపు వేల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభం
హైదరాబాద్: వేల్యూ జోన్ హైపర్ మార్ట్ కొత్త అవుట్లెట్ మాల్ హైదరాబాద్‌లోని పటాన్చెరులో గురువారం (రేపు) ప్రారంభం కానుంది. సినీ నటుడు బాలకృష్ణ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. ఇందులో ప్రముఖ బ్రాండ్లపై 40% డిస్కౌంట్ లభిస్తుంది. అవుట్లెట్ చుట్టుపక్కల ఇక్రిశాట్, నిమ్జ్, ఐఐటీ, ప్రధాన సంస్థలు ఉండటంతో విద్యార్థులు, కుటుంబాలు, నిపుణులను మాల్ ఆకర్షిస్తుందన్న విశ్వాసాన్ని యాజమాన్యం వ్యక్తం చేసింది. ‘‘మాల్ ఆర్కిటెక్చర్, లేవుట్ నిర్మాణం భాగ్యనగర సంస్కృతి, అభివృద్ధికి వేదికగా నిలిచింది. వెడలై్పన కారిడార్లు, సహజకాంతి, అధునాతన పద్ధతుల్లో రూపొందించిన స్టోర్ల మిశ్రమం సందర్శకులకు గొప్ప షాపింగ్ అనుభూతి పంచుతాయి’’ అని యాజమాన్యం వివరించింది. -
మన వెయ్యి రూపాయలు.. అక్కడ లక్షపైమాటే!
మనం డాలర్‌తో భారత రూపాయిని పోల్చి చూసినప్పుడు మన కరెన్సీ విలువ చాలా తక్కువనిపిస్తుంది. అయితే కొన్ని దేశాల్లో భారత కరెన్సీకి అత్యధిక విలువ ఉంది. ఆ దేశానికి మనం మన వెయ్యి రూపాయలు తీసుకెళ్తే, అది అక్కడ లక్షలకు సమానమవుతుంది. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇదే వాస్తవం. వియత్నాం.. సంస్కృతికి, ప్రకృతి సౌందర్యానికి, ఫుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం వియత్నాంలో ఒక భారతీయ రూపాయి విలువ 291 వియత్నామీస్ డాంగ్. అంటే ఆ దేశానికి మనం వెయ్యి రూపాయలు తీసుకువెళితే, అది అక్కడ 2,91,000 వియత్నామీస్ డాంగ్ అవుతుంది. వియత్నాం వెళ్లడానికి ఏదోఒక ప్రత్యేక సీజన్ కోసం వేచి చూడాల్సిన పనిలేదు. ఏ సీజన్లోనైనా వియత్నాంను సందర్శించవచ్చు. అయితే చాలా మంది పర్యాటకులు డిసెంబర్-జనవరి మధ్య ఇక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో అక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. వియత్నాంలొని హాలాంగ్ బే ప్రముఖ పర్యాటక ప్రదేశం. దీనిని ‘బే ఆఫ్ డిస్కవరింగ్ డ్రాగన్స్’ అని కూడా అంటారు. 1994లో యునెస్కో ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చింది. వియత్నాం రాజధాని హనోయి కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. ఈ నగరానికి చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. వియత్నాం ఉత్తర భాగంలో ఉన్న హువా గియాంగ్ కూడా పర్యాటకపరంగా ప్రాచుర్యం పొందింది. ఇది కూడా చదవండి: యమునలో కరసేవకులకు పిండ ప్రధానం -
వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు!
ఆసియాలోనే అత్యంత సంపన్న బ్యాంకర్ అయిన ఉదయ్ కోటక్ (Uday Kotak).. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) సీఈవో, ఎండీ పదవి నంచి వైదొలిగారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎలా స్థాపించింది.. ఎలా అభివృద్ధి చేసింది వివరిస్తూ ‘ఎక్స్’ (ట్విటర్) (Twitter)లో సుదీర్ఘ ట్వీట్ చేశారు. "విశ్వసనీయత, పారదర్శకత అనే ప్రాథమిక సిద్ధాంతాలతో మేం ఏర్పాటు చేసిన సంస్థ ఇప్పడొక ప్రముఖ బ్యాంక్, ఆర్థిక సంస్థ. మా వాటాదారులకు అత్యంత విలువను సృష్టించాం. లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించాం. 1985లో సంస్థలో పెట్టిన రూ.10,000 పెట్టుబడి ఈరోజు దాదాపు రూ.300 కోట్లు అవుతుంది" అంటూ రాసుకొచ్చారు ఉదయ్ కోటక్. ఆ కలతోనే.. ‘జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ వంటి సంస్థను భారత్‌లో ఏర్పాటు చేయాలని 38 సంవత్సరాల క్రితం కల కన్నాను. ఆ కలతోనే ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల చిన్న కార్యాలయంలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో కోటక్ మహీంద్రా సంస్థను ప్రారంభించాం’ అని గుర్తు చేసుకున్నారు. భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో భారతీయ యాజమాన్యంలోని ఈ సంస్థ మరింత ముఖ్యమైన పాత్రను కొనసాగిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. రిటైర్మెంట్ కంటే ముందే పదవి నుంచి వైదొలగిన ఉదయ్ కోటక్.. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తాకు పగ్గాలు అందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ సభ్యుల ఆమోదానికి లోబడి డిసెంబర్ 31 వరకు దీపక్ గుప్తా తాత్కాలిక ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడతారని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. 2024 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త ఎండీ, సీఈవో నియామకానికి ఆమోదం కోసం ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్‌కి దరఖాస్తు చేసింది. Succession at Kotak Mahindra Bank has been foremost on my mind, since our Chairman, myself and Joint MD are all required to step down by year end. I am keen to ensure smooth transition by sequencing these departures. I initiate this process now and step down voluntarily as CEO.… — Uday Kotak (@udaykotak) September 2, 2023 -
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు..
History Of The Indian Rupee: భారతదేశానికి స్వాతంత్యం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. అయితే 1947 నుంచి ఇండియన్ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఎలా ఉండేది? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ. 3.30గా ఉండేది. అయితే ఈ విలువ క్రమంగా ప్రతి సంవత్సరం పడిపోతూ వచ్చింది. ఇప్పుడు అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 82.73 రూపాయలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మన కరెన్సీ విలువ ఎంతగా తగ్గిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. కాగా 1949 నుంచి 1966 వరకు USD-INR ఎక్సేంజ్ రేటు రూ. 4.76 వద్ద కొనసాగింది. ఆ తరువాత క్రమంగా పడిపోతూ వచ్చింది. 1947 నుంచి 2023 వరకు ఇండియన్ రూపాయి హిస్టరీ.. సంవత్సరం - ఎక్సేంజ్ రేట్(USD/INR) 1947 3.30 1949 4.76 1966 7.50 1975 8.39 1980 7.86 1985 12.38 1990 17.01 1995 32.427 2000 43.50 2005 (జనవరి) 43.47 2006 (జనవరి) 45.19 2007 (జనవరి) 39.42 2008 (అక్టోబర్) 48.88 2009 (అక్టోబర్) 46.37 2010 (జనవరి) 46.21 2011 (ఏప్రిల్) 44.17 2011 (సెప్టెంబర్) 48.24 2011 (నవంబర్) 55.39 2012 (జూన్) 57.15 2013 (మే) 54.73 2013 (సెప్టెంబర్) 62.92 2014 (మే) 59.44 2014 (సెప్టెంబర్) 60.95 2015 (ఏప్రిల్) 62.30 2015 (మే) 64.22 2015 (సెప్టెంబర్) 65.87 2015(నవంబర్) 66.79 2016(జనవరి) 68.01 2016(జనవరి) 67.63 2016(ఫిబ్రవరి) 68.82 2016 (ఏప్రిల్) 66.56 2016 (సెప్టెంబర్) 67.02 2016 (నవంబర్) 67.63 2017 (మార్చి) 65.04 2017 (ఏప్రిల్) 64.27 2017 (మే) 64.05 2017 (ఆగస్టు) 64.13 2017 (అక్టోబర్) 64.94 2018 (మే) 64.80 2018 (అక్టోబర్) 74.00 2019 (అక్టోబర్) 70.85 2020 (జనవరి) 70.96 2020 (డిసెంబర్) 73.78 2021 (జనవరి) 73.78 2021 (డిసెంబర్) 73.78 2022 (జనవరి) 75.50 2022 (డిసెంబర్) 81.32 2023 (జనవరి) 82.81 2023 (జూన్) 83.94 నిజానికి 1950 లలో ఒక రూపాయికి 16 అణాలు, 64 పైసలుగా విభజించారు. ఆ తరువాత 1 రూపాయికి 100 పైసలుగా ఫిక్స్ చేశారు. కాలక్రమంలో రూపాయి మాదిరిగానే అమెరికన్ డాలర్ కూడా ద్రవ్యోల్భణ ప్రభావానికి గురైంది. కొన్ని నివేదికల ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో రూపాయి & డాలర్ రెండూ సమానమే అని నమ్మేవాళ్ళు. దీనిపైనా అనేక వాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో మెట్రిక్ సిస్టం వంటివి లేదు కాబట్టి అన్ని కరెన్సీలు ఒక విలువను కలిగి ఉండేవని భావించేవారు. అధికారిక రికార్డుల ప్రకారం ఇది ఎప్పటికి సమానం కాదని తెలుస్తోంది. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా.. 1947కి ముందు భారతదేశం బ్రిటిష్ పాలిత రాష్ట్రంగా ఉండేది, కాబట్టి పౌండ్ విలువ ఎక్కువగా ఉన్నందున INR విలువ ఎక్కువగా ఉండేది. ఇక్కడ 1947లో 1 పౌండ్ 13.37 రూపాయలకు సమానమని నమ్మేవారు. 1944లో బ్రిటన్ వుడ్స్ ఒప్పందాన్ని ఆమోదించినప్పటి నుంచి చరిత్ర ప్రధానంగా ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందం ప్రపంచంలోని ప్రతి కరెన్సీ విలువను నిర్ణయించింది. -
తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ
దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనిక పారిశ్రామికవేత్తగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇపుడు కుటుంబ వారసురాలిగా బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంబానీ తనయ ఇషా అంబానీ కూడా సంచలనం సృష్టించారు. రిలయన్స్ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ లాభాల్లో మాతృ సంస్థనే అధిగమించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన రిలయన్స్‌తో పోలిస్తే దాదాపు రెండింతలు విలువను కలిగి ఉందట. బాధ్యతలను స్వీకరించిన అనతి కాలంలోనే రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు ఇషా. బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ తాజా నివేదిక ప్రకారం ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ విలువను రూ.9,26,055 కోట్లుగా (112 బిలియన్ డాలర్లు) అంచనా వేసింది. ఆయిల్ టు కెమికల్స్ రిలయన్స్ వ్యాపారం రూ.4,71,295 కోట్ల కంటే రెండు రెట్లు ఎక్కువ అని తెలిపింది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) రిలయన్స్ రిటైల్ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు, భారీ పెట్టుబడులతో సరికొత్త విస్తరణలతో కంపెనీని కొత్త పుంతలు తొక్కిస్తోంది. రిలయన్స్ EBITDA భారీ పెరుగుదలకు డిజిటల్ రిటైల్, న్యూ ఎనర్జీతో సాధ్యమైందని బెర్న్‌స్టెయిన్ వెల్లడించింది. అంతేకాదు 2027 రిలయన్స్ రిటైల్ వ్యయం రూ.18,900 కోట్లకు చేరుకుంటుందని అంచనావేసింది. రిలయన్స్ మొత్తం మూలధన వ్యయంలో 19శాతం వాటాను కలిగి ఉంటుందని కూడా అంచనా వేసింది.రిలయన్స్ రిటైల్ మార్కెట్ నాయకత్వం స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం (గత రెండు సంవత్సరాల్లో 1.5 రెట్లు), కొత్త బ్రాండ్లను (1.2 బిలియన్ డాలర్లుపెట్టుబడులు), ఇ-కామర్స్/న్యూ కామర్స్ (రూ. 18 శాతం మిశ్రమం) కొనుగోళ్లతో 7.7 శాతం ఆరోగ్యకరమైన మార్జిన్లతో ప్రత్యర్థులతో పోలిస్తే వార్షిక ప్రాతిపదిక (రూ. 20 శాతం)బలమైన వృద్ధిసాధిస్తోందని పేర్కొంది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) రిలయన్స్ రిటైల్ దేశంలో అతిపెద్ద ఆర్గనైజ్డ్ రీటైలర్ అని పేర్కొన్న బ్రోకరేజ్ సంస్థ, కంపెనీ ఆదాయం 30 బిలియన్ల డాలర్లతో దేశంలోని మూడు రిటైలర్ల ఉమ్మడి స్కేల్ కంటే 2.5 రెట్లు ఎక్కువఅని వ్యాఖ్యానించింది. 2022, ఆగస్టులో రిలయన్స్ రిటైల్ లీడర్‌గా ఇషా అంబానీ నియమితులైన సంగతి తెలిసిందే. -
మార్కెట్ విలువ ప్రకారం టాప్ 10 భారతీయ కంపెనీలు
-
నేను ఫామిలీ కి ఎందుకు వాల్యూ ఇవ్వనంటే
-
World Environment Day: ‘వాతావరణ న్యాయం’ కోరుతున్నాం
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఒక సందేశం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విషయంలో సొంత ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. వాతావరణాన్ని చక్కగా కాపాడుకోవాలని, ప్రపంచదేశాలు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొదట దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచిద్దామన్న ధోరణి ప్రపంచమంతటా పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అభివృద్ధి మోడల్‌తో విధ్వంసమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ అభివృద్ధి లక్ష్యాలు సాధించినప్పటికీ దాని మూల్యం ఇతర దేశాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న తప్పుడు విధానాలను ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాల ఎదుట భారత్ బిగ్గరగా గొంతెత్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బడా దేశాల స్వార్థానికి చిన్న దేశాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా ఒక భాగంగా కొనసాగుతూ వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరంచారు. 4జీ, 5జీ కన్టెక్టివిటీ మాత్రమే కాదు, మరోవైపు అడవుల పెంపకం చేపడుతున్నామని తెలియజేశారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. గత ఐదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం స్పష్టమైన రోడ్డుమ్యాప్‌తో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
పట్టు కోల్పోతున్న అమెరికన్ డాలర్
-
ఆర్‌క్యాప్ లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్లు?
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్ల వరకు ఉంటుందని ఇండిపెండెంట్ వాల్యూయర్లు తేల్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా పక్రియ ప్రారంభించే తేదీ నాటికి ఆస్తిని విక్రయించినప్పుడు ఆ ఆస్తిపై అప్పులుపోను కొనుగోలుదారుకు అందే తుది విలువ అంచనానే లిక్విడేషన్ విలువ. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతల కమిటీ (సీఓసీ) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో సంస్థకు సంబంధించి ఇండిపెండెంట్ వాల్యూయర్లు– డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు ఇచ్చిన లిక్విడేషన్ విలువ వివరాలను రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్ సమర్పించారు. సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ► ఆర్క్యాప్కు డఫ్ అండ్ ఫెల్పŠస్ రూ.12,500 కోట్ల లిక్విడేషన్ విలువ కడితే, ఆర్బీఎస్ఏ విలువ రూ.13,200 కోట్లుగా ఉంది. ► రిలయన్స్ క్యాపిటల్ కోసం నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేశాయి. వీటి బిడ్డింగ్ విలువ తాజా లిక్విడేషన్ అంచనా విలువకంటే 30 నుంచి 40 శాతం తక్కువగా ఉండడం గమనార్హం. ► రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు అందుకున్న అత్యధిక బిడ్ విలువ చూస్తే... కాస్మియా ఫైనాన్షియల్, పిరమల్ గ్రూప్ కన్సార్టియంల ఆఫర్ రూ. 5,231 కోట్లు. ► హిందూజా రూ.5,060 కోట్లకు బిడ్ చేసింది. ► టొరెంట్, ఓక్ట్రీ బిడ్ల పరిమాణం వరుసగా రూ.4,500 కోట్లు, రూ.4,200 కోట్లుగా ఉంది. ► లిక్విడేషన్ విలువ– వాస్తవ బిడ్ విలువల మధ్య ఉన్న భారీ అంతరాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ బిడ్లను సవరించమని సీఓసీ బిడ్డర్లను కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలుతెలిపాయి. రిలయన్స్ క్యాప్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ విలువలు ఇలా... రిలయన్స్ క్యాపిటల్ వ్యాపారం విలువలో దాదాపు 90 శాతం వాటా కలిగిన ఆ సంస్థ– జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాల లిక్విడేషన్ విలువలు చూస్తే.. డఫ్ అండ్ ఫెల్పŠస్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లిక్విడేషన్ విలువ రూ.7,000 కోట్లు. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విలువ రూ.4,000 కోట్లు. ఆర్బీఎస్ఏ విషయంలో ఈ అంచనా వరుసగా రూ.7,500 కోట్లు, రూ.4,300 కోట్లుగా ఉన్నాయి. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతలు.. మొత్తం సంస్థకు అలాగే సంస్థలోని విభిన్న వ్యాపారాలకు వేర్వేరుగా బిడ్డింగ్‌ను పిలవడం జరిగింది. సంస్థ మొత్తం కొనుగోలుకు పైన పేర్కొన్న నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేయగా, సెక్యూరిటీస్, రియల్టీ, ఏఆర్సీలకు మూడు బిడ్లు వచ్చాయి. మూడు బిడ్ల విలువ కేవలం రూ.120 కోట్లుగా ఉంది. అయితే డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు తాజాగా ఇచ్చిన లిక్విడేషన్ విలువలు వరుసగా రూ.280 కోట్లు, రూ.240 కోట్లుగా ఉన్నాయి. కాగా, జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాలకు మాత్రం వేర్వేరుగా ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదు. -
కొడిగడుతున్న డాలర్ దీపం
ఈ రోజున అమెరికా ప్రపంచంలోనే అత్యంత పెద్ద రుణగ్రస్త దేశం. ఆ దేశం మొత్తం అప్పు 31.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది ఆ దేశపు జీడీపీలో 126 శాతం. అమెరికా రుణభారంలో అతిపెద్ద వాటా జపాన్‌ది. తర్వాతి స్థానాలలో చైనా, బ్రిటన్ ఉన్నాయి. 1980 ముందు నుంచీ అమెరికా రుణభారం ప్రతి 8 సంవత్సరాలకు రెట్టింపు అవుతూ వస్తోంది. అమెరికా ఆర్థిక బలహీనతకు మరో ప్రధాన కారణం, విప రీతంగా డాలర్లను ముద్రిస్తూ ఉండటం. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2010 నాటికంటే 60 శాతం ఎదిగింది. కానీ ఫెడరల్ రిజర్వ్ ఇదే కాలంలో ముద్రించిన కరెన్సీలో 300 శాతం పెరుగుదల ఉంది. అంటే ఆర్థిక కార్యకలాపాల ద్వారా జరిగిన వృద్ధికంటే, కాగితం కరెన్సీ పెరుగుదల వల్ల వచ్చిన ‘వాపు’ ఎక్కువ! 2000 సంవత్సరం నాటికి ప్రపంచ ఎగుమతులలో అమెరికా వాటా 12.1 శాతం. నాడు చైనాకి సంబంధించి ఇది 3.9 శాతం. 2020 నాటికి పరిస్థితి తల్లకిందులైపోయింది. అంతర్జాతీయ ఎగుమతులలో చైనా వాటా 14.7 శాతంగానూ, అమెరికా వాటా 8.1 శాతంగానూ ఉంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయన్నమాట! 1980ల నుంచే మొదలైన అమెరికా ఆర్థికవ్యవస్థ పతనం నేడు పరాకాష్టకు చేరింది. ఇటువంటి బలహీనమైన దేశీయ ఆర్థిక పునాదులపై నిలబడే అమెరికా నేటి వరకూ అగ్రరాజ్యంగా చలామణి అయ్యింది. దీనం తటికీ కారణం ఆ దేశ కరెన్సీ అయిన డాలర్. 1944లో అంటే, రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న దశలోనే ప్రపంచదేశాలు తమ మధ్య లావాదేవీలకుగానూ రిజర్వ్ కరెన్సీ లేదా అంతర్జాతీయ కరెన్సీగా డాలర్‌ను ఆమోదించాయి. ఆ విధంగా బ్రిటన్ తాలూకు అగ్రదేశ స్థానాన్ని అమెరికా ఆక్రమించుకుంది. మూడు దశాబ్దాలకు పైబడి అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే బలమైనదిగా ఉండడం వలన కూడా డాలర్‌కు ఆ ప్రాభవం దక్కింది. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ డాలర్‌కు పునాదిగా బంగారాన్ని పొదివిన 1944 లోని బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం నుంచి వైదొలిగాడు. అయితే, చమురు ఉత్పత్తి దేశాలతో ఉన్న సాన్నిహిత్యంతో డాలర్ కరెన్సీకే చమురు అమ్ముతామని ఆ దేశాలతో అంగీకరింపజేయడం ద్వారా ప్రపంచ దేశాలకు డాలర్ అవసరాన్ని అట్టిపెట్టగలిగాడు. 1980ల అనంతరం అమెరికా ఆర్థిక వ్యవస్థలో తీవ్ర బలహీన తలు ప్రవేశించాయి. వీటిలో ప్రధానమైనది ఆ దేశంలోని పరిశ్రమలు ఔట్సోర్సింగ్ రూపంలో విదేశాలకు తరలివెళ్ళిపోవటం. ఈ క్రమం లోనే ప్రపంచదేశాల పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన చైనా ప్రపంచా నికి సరుకు ఉత్పత్తి ఫ్యాక్టరీగా రూపొందింది. మెక్సికో, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి అనేక చౌకశ్రమశక్తి ఉన్న దేశాలకు కూడా అమెరికా ఫ్యాక్టరీలు తరలిపోయాయి. ఫలితంగా ఆ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. సేవారంగం కూడా ఇంటర్నెట్ టెక్నాలజీ రంగ ప్రవేశం అనంతరం... ఔట్సోర్సింగ్ ప్రాజెక్టుల రూపంలో భారత్ వంటి ఆంగ్లం మాట్లాడగల నిపుణులు ఉన్న దేశాలకు తరలింది. మూలిగే నక్కపై తాటికాయలా సాంకేతిక ఎదుగుదల క్రమంలో మరమనుషుల రంగ ప్రవేశం వంటివి జరిగాయి. 1980ల నాటికే నాటి ముతకరకం రోబోటు ముగ్గురు కార్మికుల ఉపాధిని కొల్ల గొట్టేస్థాయిలో ఉంది. నేడు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎదుగుదల స్థాయిని చెప్పనవసరం లేదు. స్థూలంగా, ఉత్పత్తిరంగాలపై ఆధార పడి జీవించే అవకాశం ఇటు కార్మికులకూ, అటు ఉద్యోగులకూ కూడా లేకుండాపోయింది. ఈ క్రమంలోనే అమెరికా ఆర్థికవ్యవస్థ కేవలం తన కాగితం కరెన్సీ అయిన డాలర్‌పై లేదా స్పెక్యులేటివ్ రంగాలైన షేర్మార్కెట్లు, రియల్ ఎస్టేట్‌పై ఆధారపడటం పెరిగింది. దాంతోనే ముందుగా చెప్పినట్లు డాలర్ల ముద్రణ అపరిమితంగా పెరిగింది. ఈ పరిస్థితి రాత్రికిరాత్రే అమెరికాను అగ్రరాజ్యం పాత్ర నుంచి పడ దోసేయలేకపోయింది. దీనికి కారణం అమెరికా ప్రజానీకం విని మయం అత్యధికస్థాయిలో ఉండటమే. మరోరకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అనేకానేక దేశాలు అమెరికాకు సరుకులూ, సేవలను ఎగుమతి చేయడం ద్వారా తమ దేశాలలో ఉపాధి కల్పనను, ఆర్థిక ఎదుగుదలను పొందాయి. దీని వలన అటు ప్రధాన దిగుమతి దారుగా ఉన్న అమెరికాకు ఎగుమతులు చేసి మనుగడ సాగించే చట్రంలో ఇతర దేశాలు సుదీర్ఘకాలం ఉండిపోయాయి. కాగా, వాస్తవ ఉత్పత్తి లేని, డాలర్ల ముద్రణ మీద ఆధారపడిన అమెరికా ఆర్థికం ఇక ఎంతమాత్రమూ యధాతథంగా కొనసాగలేని పరిస్థితులు పుంజుకున్నాయి. మాయల ఫకీరు ప్రాణం చెట్టుతొర్రలో ఉన్నట్లుగా అమెరికా బలం దాని డాలర్లో ఉంది. దశాబ్దాలపాటు, తన డాలర్‌ను సవాల్ చేసిన దేశాలనూ, నేతలనూ అమెరికా నయానో భయానో కట్టడి చేసింది. ఈ క్రమంలోనివే... ఇరాక్‌పై యుద్ధం, లిబియాలో గడాఫీని తిరుగుబాటుతో అంతమొందించడం, ఇరాన్‌తో ఘర్షణ పడుతుండటం! రానురానూ అప్పులు పెరిగిపోతుండటం, యుద్ధాల కోసం మరింతగా ఖర్చుపెట్టలేని స్థితి ఏర్పడటం, అఫ్గాని స్తాన్, ఇరాక్లలో సైనిక పరాభవం వంటివన్నీ అమెరికా బలహీన తలను ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టాయి. ముఖ్యంగా అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైనిక దళాలు హడావిడిగా వైదొలిగిన తీరు, దాని మిత్ర దేశాలకు ఇక అమెరికా అండపై ఎంతమాత్రమూ ఆధారపడలేమనే పాఠాన్ని నేర్పాయి. ఇది ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో మరింతగా బోధపడింది. ఈ యుద్ధ క్రమంలో రష్యాను అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులకు అవసరమైన సమాచార వ్యవస్థ అయిన ‘స్విఫ్ట్’ నుంచి బహిష్కరించటం ద్వారా ప్రపంచ దేశాలకు అమెరికా ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చింది. కానీ అమెరికా డాలర్‌పై ఆధారపడితే ఏదో ఒక రోజు ఇటువంటి ఆర్థిక దిగ్బంధనమే మనకూ జరగొచ్చన్న పాఠాన్ని ప్రపంచదేశాలు నేర్చాయి. గత కొన్ని మాసాలుగా అమెరికా ఫెడరల్ బ్యాంకు తన వడ్డీరేట్లను పెంచుతోంది. ఫలితంగా డాలర్ కరెన్సీలో మదుపులు చేయడం, అంతర్జాతీయ మదుపుదారులకు లాభసాటిగా మార సాగింది. దాంతో వారు వివిధ దేశాల షేర్మార్కెట్లలో పెట్టిన పెట్టు బడులను ఉపసంహరించుకొని అమెరికా మార్కెట్లకు తరలిపోతు న్నారు. ఫలితంగా ఆయా దేశాల కరెన్సీల విలువలు పడిపోవటం, షేర్‌మార్కెట్ సూచీలు దిగజారిపోవడం జరుగుతోంది. అంటే అమె రికా డాలర్ చేతిలో తమ జుట్టును పెడితే అది తమకు ప్రమాదకర మని అన్ని దేశాలు నిర్ధారణకు వస్తున్నాయి. ఫలితంగానే గతంలో అమెరికాకు భారీ ఎత్తున అప్పులు ఇచ్చిన దేశాలన్నీ నేడు ఆ డాలర్ అప్పులను వదిలించుకుంటున్నాయి. అమెరికాకు అతిపెద్ద రుణదాత (ఇది అమెరికాకు ఎగుమతులను చేయడంతో పేరుకుపోయిన మొత్తం) అయిన జపాన్ ఇప్పటికే తన ఈ రుణంలోని 12 శాతాన్ని అమ్మేసుకుంది. ఇదే బాటలో నిన్నటి అనుంగు మిత్రదేశాలు సౌదీ అరేబియా 35 శాతం, ఇజ్రాయెల్ 20 శాతం అప్పులను అమ్మేసు కున్నాయి. సుమారు 71 దేశాలు డాలర్ కరెన్సీని, దాని రూపంలో అమెరికా చేసిన అప్పును వదిలించేసుకుంటున్నాయి. గతితర్కం (చలన సూత్రాలు) తాలూకు సూత్రీకరణ ప్రకారం ‘ఒక పరిణామం లేదా వస్తువు దాని ఆరంభ స్థానం నుంచి ముందుకు వెళ్తున్నకొద్దీ దాని తాలూకు వేగం పెరుగుతుంది’. ఇది అన్ని విష యాల్లోనూ జరిగేదే. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధినే చూస్తే– గత వంద సంవత్సరాల ప్రగతి కంటే తర్వాతి 20, 30 సంవత్సరాలలో జరిగిన పురోగమనం ఎక్కువ. తరువాతి ఐదు సంవత్సరాలలో మరింత వేగంగా ఈ పురోగతి జరిగింది. ఇదే సూత్రం సామాజిక, ఆర్థిక విషయాలకు కూడా వర్తించే వాస్తవం. కాబట్టి డాలర్ దిగ జారుడు వేగం మరింతగా పెరగటం ఖాయం. ఆర్థికపరంగా ఇదివరకే డొల్ల అయిన అమెరికా... డాలర్ ముద్రణపై కూడా ఆధారపడలేక కుదేలైపోగలదు. ఏకైక అగ్రరాజ్యంగా అమెరికా స్థానం ముగిసి పోగలదు! డి.పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు ‘ 98661 79615 -
మంచి మాట: కాలం మహత్తరం శక్తిమంతం
భగవంతుని సృష్టిలో అంతర్భాగమైన కాలానికి ఉన్న శక్తి అద్భుతమైనది, అమోఘమైనది. కష్ట సుఖాలని, మంచి–చెడులని, కలతలని, కన్నీళ్ళని ఇలా అన్నిటిని తనలో లీనం చేసుకుంటూ, వాటి తాలూకు జ్ఞాపకాలని మాత్రమే మిగులుస్తూ, కాలచక్రం గిర్రున తిరిగిపోతుంటుంది.. మన కళ్ళ ఎదుటే ఎంతోమంది మృత్యు ఒడిలోకి జారిపోతున్న వారిని చూస్తున్నా, ఆ దుఖాన్ని అనుభవిస్తున్నా, ఆ క్షణంలో ఎంతో విరక్తిని కల్గించి, కాలక్రమేణా ఆ దుఃఖభారాన్ని మరపింపచేసి, మన జీవితమే శాశ్వతమన్నంతగా మనసు మరల్చి మాయ చేస్తుంది. ఇంతకన్నా విచిత్రం ఏముంటుంది కనుక. ఇంతటి మహత్తరమైన, శక్తిమంతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ప్రయోగించే విధానాన్నిబట్టి కాలం అర్థం మారిపోతుంటుంది. ఏదో ఆలా కాలక్షేపం చేస్తున్నామండీ అని పెద్దలు అంటుంటారు. అంటే ‘రోజులు గడుపుతున్నాము’ అని అర్థం. ఏదైనా విచిత్ర సంఘటన కళ్ళబడితే ‘కలికాలం’,’పిదపకాలం’ అంటుంటారు. పురాణ పఠనం చేస్తుంటే దాన్ని ‘సత్కాలక్షేపం’ అంటుంటారు. ఇలా అర్థాలు ఎన్ని మారినా, కాలప్రభావంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. కాలం గడపటం అంటే ‘పొద్దుపుచ్చటం’ అని మాత్రమే కాదు. నిజానికి సద్వినియోగం చేసుకున్నా,దుర్వినియోగం చేసుకున్నా కాలం మాత్రం ఎవరికోసమూ ఆగదు. ఆటపాటలతో బాల్యం గడచిపోతుంది. అది సహజం. ఆశలు, ఆశయసాధనాలు, వివాహం, సంతానం, ఇలా ప్రౌఢ, యుక్తవయస్సులు గడచిపోతాయి. అది అప్పటికవసరం. ఇక మిగిలేది బాధ్యతలు తీరిన జీవితం, అలసిపోయిన శరీరం. మొదటి మూడు దశలలోనూ గిర్రున తిరిగిన కాలం, నాల్గవ దశలో, వయసు మీద పడేసరికి కొంత భారంగా గడుస్తున్నట్టనిపిస్తుంది. ఇంటి పెద్దగా ఎన్నో బాధ్యతలతో తలమునకలై, జీవనపోరాట ప్రవాహంలో కొట్టుకుపోతూ, ఒక్కసారిగా విశ్రాంతి లభించటంతో కాలం స్తంభించినట్టుగా భావిస్తాం. కాని ఆలోచిస్తే ఈ విశ్రాంతి పెద్దలకు ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే, నిబద్ధతతో కూడిన లక్ష్యసాధన, ఏ వయసు వారినైనా కాలాన్ని సద్వినియోగపరచుకునేలా చేస్తుంది. సక్రమంగా ఉపయోగించుకోలేక పోతే, సమయం వృథా అయిపోయి, జీవితం నిస్సారం గా తయారవుతుంది. వయస్సులో ఉన్నవారు తమ ఆశయసిద్ధి కోసం అవిరామంగా కృషి చేయాలి. వయసు మీరిన వారు తమకు వయసు నేర్పిన పాఠాలు, అనుభవాలు భావితరాలకు పంచవచ్చు. తమలోని మరుగుపడిపోయిన కళలను, సృజనాత్మక శక్తిని వెలికి తీసే అవకాశం పొందవచ్చు. చక్కని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. వృద్ధాశ్రమాలకి వెళ్లి, అక్కడి వారి యోగక్షేమాలని విచారిస్తూ, వారి అనుభవాలను పంచుకుంటూ, తగిన సలహాలు, సూచనలు అందించవచ్చు. ఎదుటివారికి చేతనైనంత సహాయం చేస్తూ, హాయిగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే కాస్త వయసు మీరాక, వీటికన్నిటికీ కాలాన్ని సక్రమంగా ఉపయోగించాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి యోగసాధన జీవితంలో ఒక భాగం కావాలి. యోగసాధన శారీరక, మానసిక రుగ్మతలని దూరం చేస్తుంది. ఏ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. ఆ కాయ కాస్తుంది. సకల జీవరాసులు, కాలానికి అనుగుణంగా తమ తమ జీవనశైలిని మార్చుకుంటూ, కాలానికి కట్టుబడి జీవిస్తాయి. కాలాన్ని సద్వినియోగపరచుకోవటంలో తన మేధస్సును మరింత చక్కగా ఉపయోగించుకోవాలి కదా. కర్మసిద్ధాంతం ప్రకారం జరగాల్సిందేదో అదే జరుగుతుందిలే అని వదిలి వేయకుండా మానవ ప్రయత్నం చేయాలి. భూత భవిష్యత్ ప్రభావాలని రంగరించుకుంటూ జీర్ణించుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ సాగాలి. ‘గతాన్ని తలచుకుని వగచవద్దు.. భవిష్యత్ గురించి భయపడవద్దు... వర్తమానంలో జీవించు’ అంటారు పెద్దలు. మనసుని కలచి వేసే సంఘటనలు, మధుర స్మృతులు– రెండూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. అయితే ఆ సంఘటనల వల్ల కలిగిన గాయం మనకు నేర్పుతున్న పాఠాలు ఏమిటి అని తరచి చూసుకోవాలి. దానిద్వారా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాని దాని గురించి అతిగా వ్యధపడ కూడదు.అలాగే మనసుని సంతోషపెట్టే సంఘటనలను తలచుకోవడం వల్ల మానసిక ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఉదాహరణకి బాల్యస్మృతులు ఇంచుమించు అందరికీ ఆనందం కలిగించేవే. ఇక భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పు కాదు కానీ అంతకే పరిమితమైపోకుండా, ఆ కలని సాకారం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. – అడవి అన్నపూర్ణ -
రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి విలువ
-
బ్లింకిట్ డీల్: జొమాటోలో వేల కోట్ల రూపాయలు హాంఫట్
బెంగళూరు: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు భారీ షాక్ తగిలింది. కిరాణా డెలివరీ స్టార్టప్ బ్లింకిట్‌ను కొనుగోలు ఒప్పందం ప్రకటించిన తరువాత దాదాపు ఒక బిలియన్ డాలర్ల మేర కోల్పోయింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ భారీ నష్టాన్న చవి చూసింది. ఈ డీల్‌పై పెట్టుబడిదారులు ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో జొమాటో లిమిటెడ్ షేర్లు వరుసగా రెండవ రోజు నష్టపోయి మంగళవారం 8.2 శాతం వరకు పతమైంది. మొత్తం రెండు రోజుల్లో 14.07 శాతం నష్టపోయింది. కాగా యాంట్ గ్రూప్-ఆధారిత ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రూ. 4,447 కోట్ల (568.16 మిలియన్ డాలర్లు) డీల్‌ను శుక్రవారం వెల్లడించింది. షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకోనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. తీవ్రమైన పోటీలో నిలదొక్కుకుని, మార్కెట్లో పట్టు సాధించే ప్రక్రియలో ఈ డీల్ కుదుర్చుకుంది. ఇది కూడా చదవండి: Indian Rupee Vs US Dollar: రూపాయి మరింత ఢమాల్! మున్ముందు మరింత కష్టం -
ఢిల్లీలో డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వారంలో ఆర్–వేల్యూ 2.1ని దాటిందని ఐఐటీ మద్రాస్ అంచనా వేసింది. జాతీయ స్థాయిలో ఇది 1.3 మాత్రమేనని తెలిపింది. ఐఐటీ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేథమెటిక్స్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ కంప్యూటేషనల్ మేథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ విభాగాధిపతులు ప్రొఫెసర్ నీలేశ్ ఉపాధ్యాయ్, ప్రొఫెసర్ ఎస్.సుందర్ ఈ వివరాలను వెల్లడించారు. ఆర్–వేల్యూ 2.1కు చేరుకోవడాన్ని బట్టి ఢిల్లీలో నాలుగో వేవ్ మొదలైందన్న అంచనాకు రావడం తొందరపాటే అవుతుందన్నారు. ‘ప్రస్తుతానికి ఒక్కో కరోనా బాధితుడి ద్వారా ఇద్దరికి వైరస్ వ్యాప్తి చెందుతోందని మాత్రమే ఆర్–వేల్యూ ద్వారా చెప్పగలం. ప్రజల్లో వ్యాధి నిరోధకత స్థాయిలు, జనవరిలో థర్డ్‌వేవ్ సమయంలో వైరస్ బారిన పడిన వారు మళ్లీ వ్యాధికి గురవుతారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అందుకే వ్యాప్తి అంచనాకు కొంత సమయం పడుతుంది’అని వారన్నారు. ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో స్వల్ప స్థాయిలో కేసులు వెలుగులోకి వస్తున్నందున వ్యాప్తి తీవ్రతను ఊహించలేమని చెప్పారు. ఢిల్లీలో తాజాగా 1,042 కరోనా కేసులు బయటపడగా పాజిటివిటీ రేట్ 4.64%గా ఉంది. దేశంలో కొత్త కేసులు 2,527 దేశంలో ఒక్క రోజు వ్యవధిలో కొత్తగా 2,527 కరోనా కేసులు బయటపడటంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 4,30,54,952కు చేరుకున్నాయని కేంద్రం శనివారం వెల్లడించింది. అదే సమయంలో, మరో 33 మంది బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,22,149కు చేరుకున్నట్లు తెలిపింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 838 యాక్టివ్ కేసులు నిర్థారణ కాగా మొత్తం యాక్టివ్ కేసులు 15,079 అయ్యాయని పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.04%గా ఉన్నాయని తెలిపింది. -
గుండు బాస్ ఖాతాలోకి లక్షా నలభై వేల కోట్లు!
ఆయన తల్చుకుంటే.. బోడిగుండుపైన జుట్టు మొలిపించుకోవడం ఎంత సేపు? కానీ, ఆయనకది ఇష్టం లేదు. ఎందుకంటే.. సక్సెస్ అనేది లుక్కులో కాదు.. లక్కులో, హార్డ్ వర్క్‌లో ఉందని నమ్ముతున్నాడాయన. అందుకే గుండ్ బాస్‌గా పాపులర్ అయ్యాడు. ఆయనే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. జెఫ్ బెజోస్(58).. అమెజాన్ అనే ఈ-కామర్స్ కంపెనీతో సంచలనాలకు నెలవయ్యాడు. అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి పక్కకు జరిగాక.. సొంత స్పేస్ కంపెనీ బ్లూఆరిజిన్ మీదే ఆయన ఫోకస్ ఉంటోంది. అయితే గత కొంతకాలంగా ఆయనకు కలిసి రావడం లేదు. పెద్దగా లాభాలు రాకపోవడంతో.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు ఆయన(ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం). ఈ తరుణంలో తాజా పరిణామాలు బెజోస్‌కి బాగా కలిసొచ్చాయి. అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ అమెజాన్ ఆమధ్య ఈవీ కంపెనీ రివియన్‌లో పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు ప్రైమ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో షేర్ల ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 15 శాతం పెరగ్గా.. అక్టోబర్ 2009 నుంచి ఇదే అధికం కావడం గమనార్హం. మరోవైపు అమెజాన్ కేవలం అడ్వర్టైజింగ్ బిజినెస్‌ల ద్వారా 31 బిలియన్ డాలర్లు సంపాదించుకోవడం గమనార్హం. ఈ దెబ్బతో బెజోస్ వ్యక్తిగత సంపద 20 బిలియన్ డాలర్లకు(మన కరెన్సీలో లక్షా నలభై వేల కోట్ల రూ.) పెరిగింది. ప్రస్తుతం ఈయన మొత్తం సంపద విలువ.. 164.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒకవైపు ఫేస్బుక్ యూజర్ల ఎఫెక్ట్‌తో జుకర్‌బర్గ్ ఒక్కరోజులోనే 2.2 లక్షల కోట్ల రూపాయలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్‌తో రియల్ టైం బిలియనీర్ల జాబితాలో దిగజారిపోగా.. భారతీయ బిజినెస్ టైకూన్స్ ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు జుకర్‌బర్గ్ కంటే పైస్థానాల్లోకి ఎగబాకడం తెలిసిందే. చదవండి: అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం! -
ఆర్–వాల్యూ 1.22.. కరోనా ఉధృతానికి ఇదే సంకేతం
న్యూఢిల్లీ : కేసులు పెరుగుతుండటం తో దేశంలో సగటు ఆర్– వాల్యూ 1.22గా ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. కరోనా వైరస్ ఒకరి నుంచి సరాసరిన ఎందరికి వ్యాపిస్తుందో సూచించేదే ఆర్– వాల్యూ. ఆర్–వాల్యూ అనేది ఒకటి లేదా అంతకంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు లెక్క. ఒకటిని దాటి ఏమాత్రం పెరిగినా కరోనా ఉధృతం కాబోతుందనే దానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇప్పుడు దేశసగటు 1.22గా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాల్లో నమోదైన 3,30,379 ఒమిక్రాన్ కేసుల్లో 59 మరణాలు మాత్రమే సంభవించాయని భార్గవ తెలిపారు. ఢిల్లీ, ముంబైల్లో డేంజర్ బెల్స్ కేసులు పెరుగుతున్న ఢిల్లీ, ముంబై మహానగరాల్లో ఆర్–వాల్యూ 2పైగానే నమోదైనట్లు పరిశోధకులు గురువారం తెలిపారు. చెన్నై, పుణే, బెంగళూరు, కోల్‌కతాల్లో కూడా ఆర్ వాల్యూ ఒకటికి పైగానే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు అన్నారు. డిసెంబర్ 23–29 తేదీల మధ్య ఢిల్లీలో ఆర్–వాల్యూ 2.54 వద్ద ఉండగా, ముంబైలో ఈనెల 23–28 తేదీల మధ్య ఆర్–వాల్యూ 2.01గా ఉందన్నారు. -
రూపాయికి ‘వైరస్’ భయం
ముంబై: కోవిడ్–19 కొత్త వేరియంట్ల భయాలు శుక్రవారం రూపాయిని బలహీనపరచాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 37పైసలు బలహీనపడి 74.89 వద్ద ముగిసింది. రూపాయికి ఇది నెల కనిష్ట స్థాయి. గురువారం రూపాయి ముగింపు 74.52. ట్రేడింగ్‌లో రూపాయి విలువ 74.60 వద్ద ప్రారంభమయ్యింది. 74.58 కనిష్ట–74.92 గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. కరోనా వైరస్ భయాలతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. ఈక్విటీ మార్కెట్ల భారీగా నిధులు వెనక్కు మళ్లడంతో డాలర్ ఇండెక్స్ బలోపేతం అవుతోంది. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.89 ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). క్రూడ్ ధర పతనం... ఇక వైరస్ వేరియంట్ల భయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరోసారి సవాళ్లు విసిరే అవకాశం ఉందన్న అంచనాలు క్రూడ్‌పై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర శుక్రవారం 10 శాతం పైగా పతనమై, 70 డాలర్ల లోపు ట్రేడవుతోంది. బ్రెంట్ విషయంలో ఈ ధర 74కు పడిపోయింది. బంగారం అప్... సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్ తక్షణం బంగారం ధరపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వార్త రాస్తున్న సమయంలో ఔన్స్ (31.1గ్రా) ధర 25 డాలర్ల వరకూ పెరిగి, 1,810 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీనికి అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర 10 గ్రాములకు రూ.500 లాభంతో 47,900 వద్ద ట్రేడవుతోంది. -
బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈ ఆర్థికసంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 63 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పుంజుకుని రూ. 1,302 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,244 కోట్లకు చేరా యి. కన్జూమర్ ప్రొడక్టుల విభాగం ఆదాయం 31 శాతం జంప్‌చేసి రూ. 1035 కోట్లను తాకగా.. ఈపీసీ బిజినెస్ 37 శాతం క్షీణించి రూ. 267 కోట్లకు పరిమితమైంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 1,092 వద్ద ముగిసింది. -
60 వేల 657 డాలర్లకు చేరిన బిట్ కాయిన్ విలువ
-
బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..!
గత కొద్ది రోజుల నుంచి బిట్‌కాయిన్ తీవ్ర అస్థిరతను చవిచూసింది. బిట్‌కాయిన్‌కు ఎల్ సాల్వాడార్ దేశం చట్టబద్దతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్‌కాయిన్‌కు చట్టబద్దతను కల్పించడంతో ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బిట్‌కాయిన్‌లో అనిశ్చితి నెలకొంది. కాగా ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ తిరిగి పుంజుకుంది. తాజాగా బిట్‌కాయిన్‌పై బ్లూమ్‌బర్గ్ విశ్లేకుడు మైక్ మెక్‌గ్లోన్ సంచలన ప్రకటన చేశాడు. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! ఈ ఏడాది చివర్లో బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్ల (సుమారు రూ. 73.65 లక్షలు)కు చేరుకుంటుందని తన ట్విట్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్‌ను ఎక్కువ మంది ప్రజలు స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో బిట్‌కాయిన్ 2021 చివర్లో గణనీయమైన పురోగతిని సాధిస్తుందని తెలిపారు. బిట్‌కాయిన్ పూర్వ ట్రేడింగ్ గణాంకాలను మూలంగా చేసుకొని బిట్‌కాయిన్ విలువ రెట్టింపు అవుతోందని అభిప్రాయపడ్డారు. 2021 ఏప్రిల్-మేలో జరిగిన బిట్‌కాయిన్ క్రాష్‌తో ప్రస్తుత ట్రేడింగ్ గణాంకాలతో సరిసమానం చేసుకుందని, భవిష్యత్తులో బిట్‌కాయిన్ భారీ ర్యాలీని నమోదుచేస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 45,542 డాలర్ల (సుమారు రూ. 33.54 లక్షలు) వద్ద ట్రేడవుతోంది. బిట్‌కాయిన్ త్వరలోనే 50వేల డాలర్ల మార్కును దాటేందుకు ప్రయత్నిస్తోంది. Can Bitcoin Reach $100,000 in 2021? Five Charts Show Potential - Past #Bitcoin trading trends and the crypto's declining supply vs. mainstream adoption suggest a significant advance in 2021, potentially to $100,000, we believe. pic.twitter.com/0tH7PS7QEI — Mike McGlone (@mikemcglone11) September 16, 2021 చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...! -
స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్ల (ఎస్ఈజడ్) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎగుమతులు భారీగా 41.5 శాతం పెరిగాయి. విలువలో ఇది 2.15 లక్షల కోట్లు. ఔషధాలు, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం ఎగుమతుల్లో నాల్గవ వంతు ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి జరుగుతుండడం గమనార్హం. 2019–20లో ఎస్ఈజడ్ల నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల విలువ రూ.7.97 లక్షల కోట్లు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020–21లో 7.56 లక్షల కోట్లకు తగ్గింది. జోన్ల పరిస్థితి ఇదీ... దేశంలో మొత్తం 427 జోన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర ఉంది. అయితే జూన్ 30వ తేదీ నాటికి వీటిలో 267 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2021 జూన్ 30వ తేదీ నాటికి ప్రత్యేక జోన్లపై రూ.6.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది. వీటిలో దాదాపు 24.47 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. జోన్ల నుంచి ఎగుమతుల భారీ పెరుగుదలకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి– ఈపీసీఈఎస్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. మండలికి భవనేశ్ సేథ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. దేశం ఎగుమతులు ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు దేశం లక్ష్యం. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశ ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య ఎగుమతులు 74.5 శాతం పెరిగి 130.82 బిలియన్ డాలర్లకు చేరాయి. మరో ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టు–మార్చి 2022) 269.44 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. అంటే నెలకు సగటును 33.68 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాల్సి ఉంది. కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో 2020 మార్చి నుంచి వరుసగా ఆరు నెలలు ఆగస్టు వరకూ ఎగుమతులు క్షీణతను చూశాయి. అయితే సెప్టెంబర్‌లో వృద్ధిబాటలోకి వచ్చినా, మళ్లీ మరుసటి రెండు నెలలూ (అక్టోబర్–నవంబర్) క్షీణతలోకి జారిపోయాయి. తిరిగి 2020 డిసెంబర్లో స్వల్పంగా 0.14 శాతం వృద్ధి నమోదయ్యింది. అప్పటి నుంచీ వృద్ధి బాటలోనే ఎగుమతులు పయనిస్తున్నాయి. 2020–21 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ చూస్తే, ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, మరింత పెరగనున్న ఇళ్ల కొనుగోళ్లు -
ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు!
న్యూఢిల్లీ: మధ్యాదాయ వర్గాల్లో 60 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో ఇళ్ల ధరలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. నైట్‌ఫ్రాంక్ నిర్వహించి న ఒక సర్వేలో ఈ విషయం తెలిసింది. 30 శాతం మంది 9 శాతం వరకు ధరలు పెరుగుతాయని భావిస్తుంటే.. 25 శాతం మంది 10–19 శాతం మధ్య ధరలు పెరగొచ్చని చెప్పారు. రేట్ల పెరుగుదల 20 శాతం కంటే ఎక్కువే ఉండొచ్చని 6 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇళ్ల కొనుగోలు దారులపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని ‘గ్లోబల్ బయ్యర్ సర్వే’లో భాగంగా నైట్‌ఫ్రాంక్ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లోనూ 550మందికిపైగా అభిప్రాయాలు తెలుసుకుంది. రెండు భాగాలుగా నిర్వహించిన సర్వేలో అధిక ఆదాయం కలిగిన వారి నుంచి, మధ్యస్థ ఆదాయం కలిగిన వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. నివేదికలో ప్రస్తావించిన అంశాలు ♦ 26 శాతం మంది భారతీయులు కరోనా వచ్చిన తర్వాత తమ నివాసాలను మార్చేశారు. మరింత విశాల స్థలం కోసం ఈ పనిచేశారు. ♦ వచ్చే 12 నెలల్లో తమ నివాసాలను మార్చాలనుకుంటున్న వారు 32 శాతం మంది ఉన్నారు. ♦ ఇళ్లు మారిపోవాలనుకుంటన్న వారిలో 87 శాతం మంది ప్రస్తుత పట్టణాల మధ్యలో ఉండడం కంటే.. పట్టణ పొరుగు ప్రాంతాల్లో ఉండేందుకు సుముఖత చూపిస్తున్నారు. ♦ 13 శాతం మంది అయితే ఇతర పట్టణాలకు మారిపోయే ఆలోచనలో ఉన్నారు. ♦ అన్ని నియంత్రణలు ఎత్తివేస్తే తిరిగి కార్యాలయాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో సగానికిపైనే చెప్పారు. ♦ 47 శాతం మంది వారంలో 2–4 రోజులు కార్యాలయాల నుంచి పనిచేయవచ్చని చెప్పారు. ♦ భవిష్యత్తులో పని విధానం అన్నది వాణిజ్య భవనాలే కాకుండా నివాస భవనాలపైనా గణనీయమైన ప్రభావం చూపిస్తుందని ఈ సర్వే నివేదిక తేల్చింది. చదవండి : కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్‌కే జై కొడుతున్నారు -
పట్టు దొరకడానికే పద్యం
అబ్దుల్ కలాంగారు విద్యార్థులతో మాట్లాడుతూ –‘‘నువ్వు ఒక కళాకారుడివి కావాలా, శాస్త్రవేత్తవి కావాలా, ఆధ్యాత్మికవేత్తవి కావాలా, ఆదర్శ రైతువి కావాలా... నీ ఇష్టం... నువ్వే నిర్ణయించుకో’–అంటారు. విద్యార్థులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ దేశ చరిత్రలో మీ పేరుమీద ఒక పేజీ చేరాలంటే.. మీకు జీవితం, కాలం విలువ తెలిసి ఉండాలి. చాలా మంది ఏదో ఒక బలహీనతకు ఆకర్షితులై వశపడిపోతారు. దాన్ని తట్టుకుని నిలబడి నిగ్రహంతో చదువుకోవడం విద్యార్థి దశలోనే ఎక్కువ సాధ్యపడుతుంది. ఆ తరువాత కాలంలో చదువుకుందామన్నా ఆ అవకాశం ఇంత సులభసాధ్యంగా మాత్రం ఉండదు. అన్నివేళలా కనిపెట్టుకుని ఉండే తల్లి, నీ అవసరాలు తీర్చే తండ్రి, ఇంటిపట్టున నీ చదువు సాఫీగా సాగేలా ఎన్నో సర్దుబాట్లు, నీ అభ్యున్నతిని కోరి నీకు నిత్యం అందుబాటులో ఉండే నీ గురువులు...ఇంత అనుకూలమైన స్థితి జీవితంలో మళ్ళీ రాదు. దీన్ని ఎవడు బాగా సద్వినియోగం చేసుకుంటాడో వాడు బాగా వృద్ధిలోకి వస్తాడు. అందుకే వాంఙ్మయాన్ని ఛందోబద్ధం చేసారు. దేనిని ఎక్కువకాలం జ్ఞాపకం ఉంచుకోనవసరం లేదో దానిని వచనంగా చెబుతారు. ఏది జీవితాంతం జ్ఞాపకంలో ఉండాలో దానిని ఛందస్సులో రాస్తారు. మత్తేభం, శార్దూలం, కందం, సీసం... ఇలా రాసిన పద్యాలు ధారణాయోగ్యాలయి ఉంటాయి. అవి చదివితే అలా గుర్తుండిపోతాయి. అందుకూ ఛందస్సున్నది. నీకు జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆ విద్య నీకు అక్కరకు వస్తుంది... అంతేతప్ప పుస్తకం గూట్లో ఉండి బుర్రలో లేకపోతే సమస్యలను తట్టుకోగలిగిన నైతిక మార్గదర్శనం, శక్తి నీకు ఉండదు. అందుకే అంది వచ్చిన కాలాన్ని వదులుకోకూడదు. దక్షిణ భారత దేశంలో ప్రఖ్యాతి వహించిన అరబిందో ఒకానొకనాడు అండమాన్ కారాగారంలో ఉన్నారు. శరీరాన్ని పూర్తిగా చాపుకుని పడుకోవడానికి కూడా చాలని గది. మంచినీళ్లు కావాలంటే... చువ్వల్లోంచి చేతులు పూర్తిగా చాపితే అందీ అందని చోట ఒక కుండ, ఒక గ్లాస్...పొరబాటున చేతినుంచి గ్లాస్ జారి పడిపోతే..ఇక ఆరోజుకు అంతే..కారాగారాన్ని శుభ్రపరిచే వ్యక్తి రోజుకు ఒకసారి అటువైపు వస్తాడు. కుండతో నీళ్ళు పెట్టి, అన్నం కంచం లోనికి తోసేసి వెళ్ళిపోతాడు. చాలామంది ఆ పరిస్థితులను తట్టుకోలేక మరణించేవారు. అలా పోయినవారి శరీరాల్ని పట్టుకు వెళ్ళి పక్కనే ఉన్న సముద్రంలోకి విసిరేసేవారు.... అరబిందో అన్నీ చూస్తుండేవారు. కానీ ఆయన మాత్రం...కాలం ప్రశాంతంగా లభించిందని, ఆ నరకకూపంలో కూర్చునే భగవద్గీత అంతా చదివి–వ్యాఖ్యానాలు తయారు చేసి... విడుదలయిన తరువాత తన సిద్ధాంతాలతో ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు. జవహర్ లాల్ నెహ్రూ గారిని కారాగారంలో ఉంచితే ...కాలాన్ని వృథా చేసుకోకూడదని అద్భుతమైన గ్రంథాలు రాసారు. అప్పటివరకు సామాన్యులుగా ఉన్నవారు, మన కళ్ళెదుటే మహాత్ములుగా మారడాన్ని చూస్తుంటాం. వారు చెప్పేదీ వింటూంటాం. మనసుకు ఎక్కనప్పుడు, ఎక్కించుకోనప్పుడు విని ఏం ప్రయోజనం !!! ఇన్ని గంటలకు లేస్తాను, రేపు ఈ పని చేస్తాను..అనుకుంటావు...కానీ లేవవు, చేయవు. నీవు చేయవలసిన పని గురించి నీకే ప్రణాళిక లేకపోతే రేపు ఏ ఉన్నత ఉద్యోగం పొందగలవు, దేశానికి లేదా నీవు పనిచేసే సంస్థకు ఏ ప్రణాళికలు రచించగలవు ??? మహాత్ముల జీవితాలగురించి ఎంత చదివారని కాదు, ఎంత విన్నారని కాదు, ఎంతగా ప్రేరణ పొందారు, దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి కాలాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకున్నారన్న దాని మీదే మీ విద్యార్థుల బంగారు భవిత ఆధారపడి ఉంది. -
ఐపీఎల్ విలువ రూ. 43 వేల కోట్లు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే ఓ సంచలనం. ప్రపంచ క్రికెట్లో ఎన్నో లీగ్‌లకు అంకుర సంస్థ ఐపీఎల్. ప్రపంచ వ్యాప్తంగా మరెన్నో ఆకర్షణలకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు కొత్త రికార్డులకు చిరునామా ఈ లీగ్. అందుకేనేమో లీగ్‌లో సిక్సర్లు ఎగిసినంత ఎత్తుగా ‘బ్రాండ్’ విలువ కూడా పెరుగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ వ్యవస్థ మొత్తం విలువెంతో తెలుసా... 6.3 బిలియన్ అమెరికా డాలర్లు. మన కరెన్సీలో అక్షరాలా 43 వేల కోట్ల రూపాయలు. ఒక్క ఏడాదిలోనే ఒక బిలియన్ డాలర్లు అంటే రూ. 6,866 కోట్లు పెరిగిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రముఖ అంతర్జాతీయ విలువ గణన కంపెనీ ‘డఫ్ అండ్ ఫెల్ప్స్’ తాజా నివేదికలో ఈ అంశాల్ని వెల్లడించింది. మొత్తం ఎనిమిది జట్లలో ముంబై ఇండియన్సే అత్యధిక విలువైన ఫ్రాంచైజీ. ముంబై బ్రాండ్ వ్యాల్యూ 113 మిలియన్ డాలర్లు (రూ. 6955 కోట్లు). బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ విలువ 104 మిలియన్ డాలర్లు (రూ.6867 కోట్లు). అత్యధిక మొత్తంతో బ్రాడ్ కాస్టింగ్ డీల్ కుదుర్చుకున్న స్టార్ స్పోర్ట్స్ ఒక విధంగా ఐపీఎల్ బ్రాండ్ విలువ పెరిగేందుకు దోహదం చేసింది. కేవలం ఇంగ్లిష్ వ్యాఖ్యానానికే పరిమితం కాకుండా 8 భారతీయ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని జోడించడం ద్వారా అనూహ్యంగా టీవీ ప్రేక్షకుల్ని పెంచేసింది. దీంతో ప్రేక్షకాదరణతో ప్రకటనలు, ఆదాయం ఇలా ఒకదానితో ఒకటి కలిసి ఐపీఎల్ బ్రాండ్ బాజాను మోగించినట్లు ‘డఫ్ అండ్ ఫెల్ప్స్’ తన నివేదికలో పేర్కొంది. -
వేల్యూ ఇన్వెస్టింగ్ ప్రాధాన్యం అయితే...
ఇటీవలి మార్కెట్ కరెక్షన్లో పేరొందిన పలు ఫండ్స్ కూడా రాబడుల విషయంలో సమస్యలను ఎదుర్కొన్నాయి. కానీ, కొన్ని ఫండ్స్ మాత్రం ప్రతికూలతలను గట్టిగా ఎదుర్కొని నిలబడ్డాయి. వాటిలో పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ కూడా ఒకటి. ఈ పథకం ఏడాది రాబడులను పరిశీలిస్తే బెంచ్ మార్క్ (నిఫ్టీ 500) కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. మల్టీ క్యాప్ కేటగిరీ రాబడులతో పోలిస్తే సగటున ఐదు శాతం అధికం కావడం ఈ పథకం పనితీరుకు నిదర్శనాలు. ఈ పథకం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయింది. అప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా సగటున 19.5 శాతం రాబడులు ఉన్నాయి. దీంతో ఈ విభాగంలో ఈ పథకం అగ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాన్ని కూడా చేర్చే అంశాన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ పేరులో ఉన్నట్టు వేల్యూ ఇన్వెస్టింగ్ సూత్రాన్ని పాటిస్తుంది. బుల్ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపని స్టాక్స్, విలువ పరంగా ఆకర్షణీయ స్థాయిల్లో ఉన్న వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది. బుల్స్ పరుగు నిదానించాక, ఈ స్టాక్స్ సత్తా చూపించే విధంగా ఉంటాయి. నాణ్యమైన స్టాక్స్‌ను, అది కూడా అధిక ధరల వద్ద కాకుండా సరసమైన ధరల వద్ద లభించే వాటిని దీర్ఘకాలిక దృష్టితో ఈ పథకం మేనేజర్లు పోర్ట్‌ఫోలియో కోసం ఎంపిక చేసుకుంటారు. బాటమ్ అప్, కొనుగోలు చేసిన తర్వాత వేచి ఉండే విధానాన్ని అనుసరిస్తారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ పథకం నగదు నిల్వలను, ఆర్బిట్రేజ్ పొజిషన్లను పెంచుకుంది. 2016 డిసెంబర్ నాటికి 9 శాతంగా ఉంటే, 2018 జూన్ నాటికి 24 శాతానికి పెంచుకోవడం జరిగింది. దేశీయ స్మాల్ స్టాక్స్‌లోనూ ఎక్స్పోజర్ను 20 శాతానికి తగ్గించుకుంది. ఏడాదిన్నర క్రితం ఇది 30 శాతం స్థాయిలో ఉంది. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ భారీ నష్టాలను చవిచూసిన తాజా మార్కెట్ కరెక్షన్లో ఈ పథకం మెరుగ్గా ఉండేందుకు తోడ్పడింది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలోని ఎంఫసిస్, మహారాష్ట్ర స్కూటర్స్ బాగా పెరిగాయి. ఈ పథకం తన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతు అంతర్జాతీయ బ్లూచిప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ పెట్టుబడులు 28 శాతంగా ఉన్నాయి. రాబడులు ఏడాది కాలంలో ఈ పథకం 16.5 శాతం రాబడులను అందించింది. మరి ఇదే కాలంలో బెంచ్ మార్క్ రాబడులు 7.9 శాతమే కావడం గమనార్హం. మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 12.7 శాతంగా ఉండగా, బెంచ్ మార్క్ రాబడులు 10.2 శాతం. ఐదేళ్ల రాబడులు 19.5 శాతం అయితే, బెంచ్ మార్క్ రాబడులు 16.1 శాతంగా ఉన్నాయి. వైవిధ్యం: అంతర్జాతీయంగా బ్లూచిప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఈ పథకంలో ప్రత్యేకత. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్లో ఈ పథకం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మొత్తం పథకం నిధుల్లో 10% ఆల్ఫాబెట్‌లోనే ఉన్నాయి. తర్వాత ఫేస్బుక్లో 5% ఇన్వెస్ట్ చేసింది. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ పథకం కనీసం 65% పెట్టుబడులను దేశీయ ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటుంది. -
విలువ తెలిసినవారు
విలువైనవి ఆనందించడం తెలిసినవాళ్లు అల్పమైన విషయాలను ఖాతరు చేయరు. ఒకానొక కాలంలో ఒక జెన్ గురువు ఉండేవాడు. ఆయన ఒక కొండవాలు దగ్గర చిన్న గుడిసె కట్టుకుని నివసిస్తుండేవాడు. ఆయన దగ్గర విలువైన వస్తువులు ఉండివుంటాయని పొరబడిన ఒక దొంగ ఒకరోజు రాత్రి దొంగతనానికి వచ్చాడు. గుడిసెలో కొన్ని ముంతల్లాంటివి తప్ప అపహరించదగినవేవీ కనబడలేదు. కనీసం పాత బట్టలు కూడా లేవు. దొంగ తీవ్ర నిరాశ చెందాడు. అయితే, దొంగతనానికి వచ్చిన మనిషి అలికిడి విని గురువు నిద్ర లేచాడు. దొంగ ఉత్తిచేతుల్తో తిరిగి వెళ్లడం ఆయన్ని బాధించింది. ‘మిత్రమా, కావాలంటే నువ్వు నేను వేసుకున్న బట్టలు తీసుకెళ్లు’ అన్నాడు. దొంగ దానికి ఒప్పుకున్నాడు. గురువు వాటిని విడిచి ఇచ్చేశాడు. దొంగ వెళ్లిపోయాడు. గురువు అలాగే ఆ రాత్రి ఆకాశంలో చందమామను చూస్తూ కూర్చున్నాడు. దివ్యంగా వెలుగుతున్న జాబిలి అందానికి ముగ్ధుడై, ‘అయ్యో, అతడికి నేను పాత బట్టలు ఇచ్చిపంపానే; ఈ చందమామను ఇవ్వగలిగివుంటే ఎంత బాగుండేది’ అని తలపోశాడు. ఈ కథ ఏం చెబుతోంది? దొంగతనం చేసినవాడిపట్ల కూడా చూపాల్సిన కరుణ గురించా? అదీ ఒక అంశమే. దానికన్నా కూడా ఇది చాటేది మరొకటుంది. విలువైనవి ఆనందించడం తెలిసినవాళ్లు అల్పమైన విషయాలను ఖాతరు చేయరు. బహుశా, మనలో చాలామందిమి దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామేమో! -
సత్యదేవుని ఆదాయానికి ‘క్షవరం’
- అన్నవరం దేవస్థానంలో రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయం - రూ.1.28 కోట్లకు వేలం పాడిన టీడీపీ నేత - షరతుల ప్రకారం సగం సొమ్ము చెల్లించకుండానే మూడు నెలల తలనీలాల తరలింపు - కుమ్మక్కైన సిబ్బంది - ఆలస్యంగా గుర్తించిన అధికారులు - గుమస్తా సస్పెన్షన్.. ఇద్దరికి ఛార్జ్ మెమోలు అన్నవరం : బీహార్‌లో పశువుల దాణాను మేసేసిన ప్రబుద్ధుల గురించి విన్నాం. రాష్ట్రంలో ఇసుక బుక్కేస్తున్న బకాసురుల బాగోతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని ఆదాయానికి కొంతమంది సిబ్బంది క్షవరం చేసేశారు. 18 రోజుల కాలానికి భక్తులు సమర్పించిన రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయమయ్యాయి. దాదాపు ఆరు నెలల కిందట జరిగిన ఈ వ్యవహారం బయటకు వెల్లడి కాకుండా కొందరు అధికారులు గోప్యత పాటించారు. ఎట్టకేలకు ఆ బాగోతం బయట పడడంతో కేశఖండన శాల గుమస్తాను సస్పెండ్ చేసి, సంబంధిత సూపరింటెండెంట్, ఏఈఓలకు మెమోలు జారీ చేసినట్లు ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం విలేకర్లకు తెలిపారు. అసలేం జరిగిందంటే.. పలువురు భక్తులు సత్యదేవునికి తలనీలాలు సమర్పిస్తూంటారు. అలా వచ్చిన తలనీలాలను దేవస్థానం ఏడాది ముందే టెండర్ కం వేలంపాట ద్వారా విక్రయిస్తుంది. పాటదారు ఆ ఏడాదంతా ఆ తలనీలాలను సేకరించుకోవాలి. గత ఏడాది ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ తలనీలాలు పోగు చేసుకుని, తీసుకునే హక్కును తుని మునిసిపాలిటీలో కీలక పదవిలో ఉన్న ఓ టీడీపీ నాయకుడు రూ.1.28 కోట్లకు దక్కించుకున్నారు. టెండర్ షరతుల ప్రకారం సగం మొత్తం అంటే రూ.64 లక్షలు చెల్లించాలి. అనంతరం తలనీలాలు తీసుకోవాలి. దీని ప్రకారం ఆ పాటదారు డిపాజిట్ రూపంలో రూ.10 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.18 లక్షలు నగదు, మిగిలిన మొత్తానికి చెక్కులు ఇచ్చాడు. అయితే ఆ చెక్కులు మారలేదు. దీంతో టెండర్ నిబంధనల ప్రకారం సగం సొమ్ము చెల్లించనందున, భక్తులు సమర్పించిన తలనీలాలను ఒక గదిలో దాచి ఉంచారు. దీనికి అటు దేవస్థానం అధికారులు, ఇటు పాటదారుని వద్ద పని చేసేవారు రెండు తాళాలు వేసి జాయింట్ కస్టడీలో ఉంచుకున్నారు. అయితే పాట పాడిన వ్యక్తి అధికార టీడీపీ నాయకుడు కావడంతో ఏ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ నిబంధనలకు విరుద్ధంగా తలనీలాలు తీసుకువెళ్లడానికి సంబంధిత అధికారులు అనుమతించారు. దీంతో గదిలో భద్రపరచిన మూడు నెలల తలనీలాలను అక్టోబర్ 29న పాటదారుకు అప్పగించారు. ఆ మర్నాటి నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలను పాటదారుకు ఇవ్వకుండా ప్రతి రోజూ కేశఖండన శాల సిబ్బంది గ్రేడింగ్ చేసి భద్రపర్చాలి. అయితే అధికారుల నుంచి తమకు అటువంటి ఆదేశాలు లేనందున తలనీలాలు ఉన్న గదికి తాళం వేయలేదని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. మొత్తానికి ఏం జరిగిందో కానీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకూ వచ్చిన తలనీలాలు మాయమయ్యాయి. ఏ రోజు ఎంత మొత్తంలో తలనీలాలు వచ్చాయన్న ఆధారాలు కూడా లేవు. దీంతో పాటదారు తరఫు మనుషులతో సిబ్బంది కుమ్మక్కై తలనీలాలను తరలించేసి, సొమ్ము చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు ఆదేశించాం తలనీలాలు మాయమైన వ్యవహారంలో కేశఖండన శాల గుమస్తా ఎం.రామకృష్ణను సస్పెండ్ చేశాం. ఈ వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ జి.సత్యనారాయణ, ఏఈఓ సాయిబాబాలకు ఛార్జి మెమోలు జారీ చేశాం. పెద్ద పెద్ద స్కామ్‌లు కూడా చాలా కాలం తరువాతే వెలుగు చూస్తాయి. ఇదీ అంతే. ఆరు నెలల క్రితం జరిగినా అందుకే మా దృష్టికి రాలేదు. పాటదారు చెల్లించిన సొమ్ము మేరకే తలనీలాలు తీసుకువెళ్లేందుకు అనుమతించాం. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం. నవంబర్ 17 నుంచి తలనీలాలను భద్రపరుస్తున్నాం. పూర్తి సొమ్ము కట్టని పాటదారుపై కేసు వేశాం. పాత వేలం రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహిస్తాం. - కె.నాగేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
గుట్కా విక్రయాలపై దాడులు
తాడేపల్లిగూడెం రూరల్ : గుట్కా, ఖైనీ ప్యాకెట్లు విక్రయిస్తున్న షాపులపై పట్టణ పోలీసులు దాడి చేశారు. సుమారు రూ.2.10 లక్షలు విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్, కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు నిషేధిత గుట్కా, ఖైనీ విక్రయ కేంద్రాలపై దృష్టి సారించామని చెప్పారు. ఈ క్రమంలో కర్రి కనికిరెడ్డి (భాగ్యలక్షి్మపేట), దువ్వి నాగేంద్ర (వీకర్స్ కాలనీ), బెజవాడ ప్రసాద్ (మసీదు సెంటర్), కడియాల రాధాకృష్ణ (రామారావుపేట), కోడూరి ప్రభాకర్ సతీష్ (సీతారాంపేట) దుకాణాలపై పట్టణ ఎస్ఐ ఐ.వీర్రాజు, సిబ్బందితో దాడి చేశారన్నారు. ఆయా దుకాణాల నుంచి గుట్కా, మీరజ్ ఖైనీ, రాజాఖైనీ, ఎంసీ ఖైనీ, ఎం అండ్ ఎం ఖైనీ కంపెనీలకు చెందిన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లోని ఆర్.భద్రం అండ్ స న్స్ యజమాని రాతంశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ భద్రం, అప్పన అప్పారావు వద్ద నుంచి గుట్కాను కొనుగోలు చేసి పట్టణంలో విక్రయిస్తున్నట్టు తెలిసిందన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ మూర్తి పేర్కొన్నారు. ఎస్ఐ ఐ.వీర్రాజు, ఏఎస్సై అప్పారావు, రైటర్లు జి.సుబ్బారావు, ఎ.సత్యనారాయణరాజు ఉన్నారు. -
ఆ నోట్లు చిత్తు కాగితాలు కాదు
- కాటంనేని భాస్కర్, జిల్లా కలెక్టర్ సాక్షి ప్రతినిధి, ఏలూరు ః కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్ల విలువ తగ్గిపోదని, వాటిని మార్చుకునే అవకాశం ఉందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఆ నోట్ల మార్పిడి విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బుధవారం ఆయన ’సాక్షి’తో మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో అవి దేనికీ పనికిరావనే ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని అన్నారు. రూ.500, రూ. వెయ్యి నోట్లను తక్కువకు మారకం చేయవద్దని ప్రజలకు సూచించారు. శుక్రవారం నుంచి అన్ని బ్యాంకుల్లో వీటిని మార్చుకునే వెసులబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రతి బ్యాంకులో రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక కౌంటర్లో వారి అకౌంట్లో ఎంత మొత్తమైనా జమ చేసుకునే అవకాశం ఉంటుందని, మరో కౌంటర్లో బ్యాంకు ఖాతా లేనివారు నిర్దేశిత పత్రంలో సమాచారాన్ని పొందుపరిచి విడతకు రూ.4 వేల చొప్పున మార్చుకునే అవకాశం ఉందని వివరించారు. ఈ నెల 11వ తేది నుండి అన్ని బ్యాంకు ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, ఖాతాదారులు 18వ తేదీ వరకు రోజుకు రూ. 2 వేల చొప్పున, 19వ తేదీ నుంచి రోజుకు రూ.4 వేల చొప్పున ఏటీఎంల ద్వారా నగదు పొందవచ్చన్నారు. బ్యాంకులో ఖాతా ఉండి నగదు పొందదలుచుకున్న ఖాతాదారుడు రోజుకు రూ.10 వేల చొప్పున వారంలో రూ.20 వేలకు మించకుండా నగదు పొందే సౌకర్యం కల్పించారని తెలిపారు. ఈ విధానం 24వ తేదీ వరకూ కొనసాగుతుందని, అనంతరం తదుపరి రిజర్వు బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా నగదు మొత్తాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయని వివరించారు. దేశంలో నల్లధనంతోపాటు నకిలీ నోట్ల చలామణిని పూర్తి స్థాయిలో అరికట్టాలనే సదుద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులపాటు కొన్ని సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడతారని, అయితే దేశ భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం ఎంతో కీలకమైందని చెప్పారు. బ్లాక్ మనీదారుల ఉచ్చులో పడవద్దు జిల్లాలో కొంతమంది బ్లాక్ మనీదారులు తమ నల్లధనాన్ని చలామణిలోకి తీసుకురావడానికి పేదలను పావులుగా వాడుకునే అవకాశాలున్నట్టు సమాచారం అందుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. పేదలు అలాంటి వారి ఉచ్చులోపడి నల్లధనాన్ని మార్చడానికి ఇస్తే వాటిని తీసుకోవద్దని సూచించారు. దానివల్ల భవిష్యత్‌లో అనేక చిక్కుల్లో పడతారన్నారు. అక్రమ సొమ్మును పేదలకిచ్చి బ్యాంకు ఖాతాలో వేయించి ఆ డబ్బును తిరిగి తీసుకునేందుకు ప్రయత్నిస్తారని, దీనివలన తాత్కాలికంగా కొంత సొమ్ము ముట్టచెబుతారని తరువాత మాత్రం పేదలు ఇబ్బందులు పడతారని అన్నారు. అటువంటి వారికి జిల్లాలో ఏ ఒక్కరూ సహకరించవద్దని కలెక్టరు హితవు పలికారు. -
కలెక్టర్ కారు, ఫర్నిచర్ జప్తునకు నిర్ణయం
– విలువను లెక్కించేందుకు అమీనాను పంపించిన హైకోర్టు – రైతుకు పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ఫలితం ఏలూరు (మెట్రో) : పోలవరం ప్రాజెక్ట్ కుడికాలువ నిర్మాణంలో భాగంగా 1997లో భూమిని సేకరించిన సందర్భంలో అధికారులు చేసిన తప్పిదానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ కె.భాస్కర్ వినియోగిస్తున్న కారును, కలెక్టరేట్ భవనంలోని ఫర్నిచర్‌ను జప్తు చేయాలని నిర్ణయించిన హైకోర్టు.. వాటి విలువను అంచనా వేసేందుకు అమీనాను సోమవారం ఇక్కడకు పంపించింది. వివరాల్లోకి వెళితే.. పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన పి.శ్రీనివాసరావు అనే రైతు తన పొలం మధ్యనుంచి పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ వెళ్లేలా డిజైన్ చేశారని, కాలువ అలైన్మెంట్ మార్చాలని 1997లో అప్పటి అధికారులను కోరాడు. స్పందించిన అధికారులు కాలువ పొలం మధ్యనుంచి కాకుండా చివరినుంచి నిర్మాణం చేపడితే ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఆ రైతు నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు. ఆ తరువాత ఇరిగేషన్ అధికారులు కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. అదే రైతుకు చెందిన పొలం చివరి భాగంలో ఎకరం మేర ముంపునకు గురైంది. ముంపునకు గురైన పొలానికి నష్టపరిహారం ఇవ్వాలని ఆ రైతు అధికారులను కోరాడు. ఇందుకు అధికారులు నిరాకరించారు. దీంతో రైతు శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించి కలెక్టర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలోని ఫర్నిచర్, కలెక్టర్ కారును జప్తు చేసి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు నిర్ణయించింది. దీంతో హైకోర్టు అమీనా సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ కారును, ఫర్నిచర్ విలువను అంచనా వేశారు. దీనిపై ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా, దీనిపై స్టే కోసం కోర్టుకు వెళుతున్నట్టు చెప్పారు. కోర్టు విషయంలో నిర్లక్ష్యమేల జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఈ విషయమై ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన ఆ శాఖ అధికారులను మందలించారు. కోర్టు కేసుల విషయంలోనూ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. తక్షణమే సదరు కేసుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
గుట్కా గుట్టురట్టు
రూ.50 లక్షల విలువైన గుట్కా, సామగ్రి పట్టివేత - బల్లేపల్లి సమీపంలోని మామిడి తోటలో విజిలెన్స్ దాడులు - నిర్వాహకులతో సహా 13 మంది కూలీల అరెస్ట్ - వాహనాలు, యంత్రాలు స్వాధీనం - రెండు రాష్ట్రాలకు సరఫరా: విజిలెన్స్ విభాగం అదనపు ఎస్పీ సురేందర్‌రెడ్డి ఖమ్మం అర్బన్/ఖమ్మం రూరల్: జిల్లా కేంద్రంలో అంతర్భాగంగా ఉన్న బల్లేపల్లి సమీపంలోని మామిడి తోటలో రూ.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకు, యంత్రాలను మంగళవారం అర్ధరాత్రి వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆశాఖ అదనపు ఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిర్వాహకులతో సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదనపు ఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బల్లేపల్లికి చెందిన మలీదు జగన్ మామిడి తోటలో పాత కోళ్ల ఫారం షెడ్ ఉంది. దీనిలో విజయవాడకు చెందిన బంటి అలియాస్ కుల్దీప్శర్మ, అతని మిత్రుడు జమలాపురం శ్రీనివాస్, ఎస్డీ ఆరిప్, దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గుట్కా తయారీ యూనిట్‌ను నెలకొల్పారు. జగన్‌కు వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని షెడ్‌ను అద్దెకు తీసుకొని సుమారు నెలరోజులుగా ఈ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 9 మంది కూలీలను తీసుకొచ్చి గుట్కా ప్యాకెట్లు తయారు చేయిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ముడిసరుకు, దానిలో కలిపే లిక్విడ్‌ను తీసుకొచ్చి షెడ్లో ఉన్న మిషన్ ద్వారా మిక్సింగ్ చేస్తున్నారు. గుట్కా తయారు అయ్యాక ప్యాకింగ్ చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మంగళవారం సాయంత్రం నుంచి మామిడితోట సమీపంలో మాటు వేసి అర్ధరాత్రి దాడులు చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. అప్పుడే అక్కడికి తెచ్చిన గుట్కా తయారీకి ఉపయోగించే లిక్విడ్‌ను, ఒక సఫారీ కారు, ట్ర్యాలీ వ్యాన్, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వాహనాల ద్వారా నిత్యం ముడి సరుకు తీసుకొచ్చి.. తయారైన ప్యాకెట్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. షెడ్డులో 5 ప్యాకింగ్ యంత్రాలతో పాటు సీఎం 1000 బ్రాండ్ పేరుతో తయారు చేస్తున్న సుమారు 5 లక్షల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ప్యాకెట్లను చిన్నచిన్న బస్తాలలో నింపి రెండు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు లక్షల గుట్కా ప్యాకెట్ల విలువ రూ.25,29,800 ఉంటుందని వివరించారు. యంత్రాలు, వాహనాలు, ముడిసరుకు మొత్తం కలిసి రూ.50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో అదనపు ఎస్పీతో పాటు వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఎన్.వెంకారెడ్డి, సీఐ ఎన్. వెంకటేష్, ఏఓ జి. సారయ్య, కానిస్టేబుల్ పి.సురేష్ పాల్గొన్నారు. -
నేడు రిజిస్ట్రేషన్లు బంద్..!
– ఇళ్లు, భూమి విలువ 30 శాతం పెంపు – కర్నూలులో ఆన్లైన్ కాని వివరాలు – సోమవారం నుంచి పెంపు అనుమానమే...! కర్నూలు: ఇళ్లు, భూముల విలువ పెరగడం..అందుకు అనుగుణంగా ఆన్లైన్ వివరాలు కాకపోవడం.. తదితర కారణాలో సోమవారం జిల్లాలో రిజిస్ట్రేషన్లు బంద్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగష్టు ఒకటో తేదీ నుంచి భూమి విలువ 20 నుంచి 30 శాతం పెంచుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. శనివారం పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ కావడం, ఆదివారం సెలవు రోజు కావడంతో ఆన్లైన్లో పెంపు వివరాలను నమోదు చేయలేకపోయారు. దీనికితోడు జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సైతం కర్నూలులో లేకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో సోమవారం(ఒకటో తేదీ) నుంచి పెంపు అమలు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ కారణంగా సోమవారం రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదు. పాత రేట్ల ప్రకారం సైతం కొత్త రిజిస్ట్రేషన్లు చేయకూడదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో పెంపు వివరాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం సాధ్యం కాదని ఓ అధికారి తెలిపారు. ఈ కారణంగా సోమవారం నుంచి గాకుండా మంగళవారం నుంచి కొత్త రిజిస్ట్రేషన్లు ఉండే అవకాశం ఉంది. ఈ విషయమై ఇన్‌ఛార్జి జిల్లా రిజిస్ట్రార్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఆన్లైన్లో పెరిగిన రేట్లు నమోదు చేయడానికి తమకు 5 రోజులు సమయం ఉంటుందని, ఈలోపు ప్రాంతాన్ని బట్టి 15 నుంచి 20 శాతం పెంచి రిజిస్ట్రేషన్లు చేస్తామని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో 24 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. వీటి పరిధిలో ప్రతిరోజూ ఒక్కో రిజిస్ట్రార్ కార్యాలయంలో సగటున రోజుకు భూములు, ఇళ్లు, స్థలాలకు సంబంధించి 30 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. -
మన వాల్యూ పడిపోదు
మనీ వాల్యూ కిందామీదా అయినా... దాదాపు ప్రతి కుటుంబంలో లేదా బంధుమిత్రులలో ఎవరో ఒకరు ఏదో ఒక ప్రత్యేక సందర్భాలలో విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తున్నప్పుడు ఏ దేశానికైతే వెళ్తున్నారో ఆ దేశంలోని కరెన్సీలోకి మన కరెన్సీని మార్చకోవలసి ఉంటుంది. (ఉదా: యు.ఎస్. వెళుతుంటే రూపాయలను డాలర్లలోకి మార్చుకోవాలి). అలాగే విదేశాల నుంచి మన దేశానికి డబ్బు పంపిస్తున్నప్పుడు అక్కడి కరెన్సీని మన రూపాయలలోకి మార్చుకోవలసి ఉంటుంది. మారకపు విలువను మన దేశంలో రిజర్వు బ్యాంకు వివిధ అంశాల ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ కరెన్సీ మారకపు విలువ ఆధారంగా కరెన్సీ డెరివేటివ్స్ 2008లో ప్రారంభం అయ్యాయి. మొదట ‘కరెన్సీ ఫ్యూచర్స్’ని ప్రారంభించారు. తరువాత 2010లో ‘కరెన్సీ ఆప్షన్స్’ని కూడా మొదలుపెట్టారు. ఈ కరెన్సీ డెరివేటివ్స్ని ఉపయోగించుకుని కరెన్సీ మారకపు విలువ హెచ్చుతగ్గుల నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి ముందుగా జాగ్రత్త పడవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కుమారుడిని 3 నెలల తర్వాత పైచదువుల కోసం అని యు.ఎస్. పంపించ దలచుకున్నారనుకుందాం. ప్రస్తుతం డాలరుకు 67 రూ. మారకపు విలువ అనుకుంటే కనుక 1500 డాలర్లు కావాలంటే 1,00,500 రూ. అవసరమౌతాయి. అయితే 3 నెలల తర్వాత కూడా డాలరుకు కరెన్సీ మారకపు విలువ ఇంతే ఉంటుందని గ్యారెంటీ లేదు. పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. తగ్గితే మంచితే కానీ, పెరిగితే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ ఇబ్బందిని నివారించడానికి ఆ తండ్రి యు.ఎస్.డాలరు కరెన్సీ ఫ్యూచర్ తీసుకుంటే లాభం గానీ, నష్టం గానీ లేకుండా తను అనుకున్న మారకపు విలువకు డాలర్లను పొందవచ్చు. ఇక ఈ కరెన్సీ డెరివేటివ్స్ ఎలా పనిచేస్తాయో, ఖాతా ఎలా ప్రారంభించాలో చూద్దాం. ఎక్స్ఛేంజీలలో ఎవరైతే కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కి సభ్యత్వం తీసుకుంటారో వారి దగ్గర ఖాతాను ప్రారంభించవచ్చు. ట్రేడింగ్ సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు, ఉదయం 9 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు ఉంటుంది. మొత్తం నాలుగు రకాల కరెన్సీలలో కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి : యు.ఎస్. డాలరు, యూరో, పౌండు స్టెర్లింగ్. జపనీస్ ఎన్. లాట్ సైజ్ జపనీస్ ఎన్ కి మాత్రమే 100000 ఒక యూనిట్‌గా ఉంటుంది. మిగతా మూడింటికి 1000 ఒక యూనిట్‌గా ఉంటుంది. ప్రతి కాంట్రాక్టు 12 నెలల కాలపరిమితి కలిగి ఉంటుంది. రేటు నాలుగు డిసిమల్స్లో కోట్ అవుతూ 0.25 పైసా / ఐ.ఎన్.ఆర్ 0.0025 టిక్ సైజ్ కలిగి ఉంటుంది. ఉదా: 67.0025; 67.0050 లా కోట్ ఉంటుంది. లాస్ట్ ట్రేడింగ్ డే అనేది ఆ కాంట్రాక్టు చివరి నెల చివరి బిజినెస్ డే కన్నా రెండు రోజుల ముందు వరకు ఉంటుంది. కాంట్రాక్టు సెటిల్మెంట్ ఇండియన్ రుపీస్లో మాత్రమే జరుగుతుంది. కాంట్రాక్టు తీసుకున్న తర్వాత ప్రతి రోజూ సెటిల్మెంట్ ప్రైస్‌కి సెటిల్ చేస్తారు. ఫైనల్ సెటిల్మెంట్ ఆర్.బి.ఐ. రిఫరెన్స్ ప్రైస్ ఆధారంగా జరుగుతుంది. కాంట్రాక్టు తీసుకున్నప్పుడు మొత్తం కాంట్రాక్టు విలువను కట్టనవసరం లేదు. ఎంత మొత్తాన్నైతే మార్జిన్‌గా నిర్ణయిస్తారో అంతవరకు కడితే సరిపోతుంది. పై చదువులకు వెళ్లే వారికి, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారికి, అలాగే తాము విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబానికి సొమ్మును పంపించేవారికి ఈ కరెన్సీ డెరివేటివ్స్ అనేవి మారకపు విలువ హెచ్చుతగ్గుల ఇబ్బందులను దాటడానికి బాగా తోడ్పడతాయి. ఇక ‘కరెన్సీ ఆప్షన్’ గురించి మరోసారి తెలుసుకుందాం. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
దానాల్లో గొప్ప దానం ‘విలువ’
డేట్లైన్ హైదరాబాద్ ప్రస్తుతానికి దానం నాగేందర్ మరొక్కసారి పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఆగినట్టే. మాటామంతీ అంతా అయిపోయింది.పోయిన సోమవారమే కాంగ్రెస్‌ను విడిచి తెలం గాణ రాష్ర్ట సమితిలో చేరడమే తరువాయి అనుకుంటుంటే ఆఖరి నిమిషంలో నాగేందర్ మనసు మార్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో హైదరాబాద్ బ్రదర్స్‌లో ఒకడిగా ప్రసిద్ధి చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి వలస పోతున్నాడంటే పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు. తెలం గాణ రాష్ర్ట సమితి నాయకత్వం ఆయనను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నది అన్న అంశం కూడా ఎవరినీ ఆశ్చ ర్యపరచలేదు. అంతకు రెండు రోజుల ముందు టీఆర్ఎస్లో చేరిన టీడీపీ శాసనసభ్యుడు సాయన్న విలేకరులతో ఒక మాటన్నారు. టీఆర్ఎస్లో సర్దుకు పోయి పని చేయగలరా వంటి ప్రశ్న ఒకటి అడిగితే, ‘అస్సలు ఇబ్బందే ఉండదు’ అన్నారాయన. అదెలా అంటే, ‘ఏముంది? అంతా తెలిసిన వాళ్లే, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా తె లుగుదేశంలో మంత్రిగా ఉన్నారు కదా!’ అన్నారు సాయన్న. ఔను! ముఖ్యమంత్రి సహా పలు వురు మంత్రులు, నాయకులు పూర్వాశ్రమంలో తెలుగు దేశం వారే. అలాంటప్పుడు సాయన్నకు కొత్తగా ఎందు కుంటుంది? పార్టీ కార్యాలయం చిరునామా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు మారినంత తేలికైన విషయంగా అనిపించింది ఆయనకు. సాయన్న వెంటే టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ ప్రభాకర్‌కు కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించదు. టీఆర్ఎస్ కార్యాల యం నిండా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నాయకులే కనిపించి, ఆయనకు కూడా అది మరో గాంధీభవన్ లాగా కనిపించింది తప్ప, కొత్త చోటికి వచ్చినట్టేమీ లేదు. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాగా, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి గాంధీభవన్ లాగా కనిపించేంతగా ప్రజాస్వామ్యీకరణ చెందిందన్నమాట తెలంగాణ భవన్. ఎవరినైనా ఇముడ్చుకోగల సహనం, ఔదార్యం, విశాల హృదయం తెలంగాణ భవన్‌కు ఉండ డం గొప్ప విషయమే. ఇంకా వస్తారు, రావాలి కూడా. సాధించుకున్న తెలంగాణకు సంపూర్ణత్వం సిద్ధించా లంటే తెలంగాణ భవన్ తప్ప అన్ని పార్టీల కార్యాల యాలకూ తాళాలు పడాలి. అప్పుడుగాని, మనం సాధించుకున్న తెలంగాణ కు అర్థం ఉండదు. రాష్ర్టంలో ఒకే పార్టీ కార్యాలయం ఉండాలి. దాని మీద ఒకే జెండా ఎగరాలి. ఇదే లక్ష్యం. ఈ అడుగులన్నీ దాని సాధన దిశగానే పడుతున్నాయి. జనవరి మాసాంతంలో జరగ బోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధిస్తే తప్ప తెలం గాణ రాష్ర్ట ఏర్పాటు సంపూర్ణం కాదు. తడబడిన అభిమానులు ఇదే లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్ఎస్ కండువాలు కప్పు తూనే ఉన్నది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు కప్పిం చుకుంటూనే ఉన్నారు. అదే క్రమంలో దానం నాగేందర్ చేరిక కూడా దాదాపు ఖరారయింది. ఆయనకేవో డిమాండ్లు ఉన్నాయి. అవి కూడా దాదాపుగా ఒప్పు కున్నట్టే కాబట్టి సోమవారం ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరతారని అంతా అనుకున్నారు. ఆయన అనుచరులు నగరమంతా దానం చేరికను ఆహ్వానిస్తూ, వెల్లడిస్తూ ఫ్లెక్సీలు కూడా కట్టారు. చివరి నిమిషంలో దానం పార్టీ మార్పిడి రద్దయింది. అనుచరులు యుద్ధ ప్రాతిపదికన ఫ్లెక్సీలను తొలగించేశారు. పార్టీ మారుడు వ్యవహారం ఇంత ఆషామాషీగా ఉంటుందా అని ఆశ్చర్యపోనక్కరలేదు. నాగేందర్ షరతులకు ముఖ్య మంత్రి అంగీకారం లభించలేదు. పైగా తన సమక్షంలో కాకుండా, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సమక్షంలో చేరమని కబురు పంపారట ముఖ్యమంత్రి. కేశవరావు సమక్షంలో చేరితే మరీ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్‌లోనే చేరినట్టే ఉంటుందని నాగేందర్, ఆయన అనుచరులూ భావించినట్టున్నారు. కేశవరావు నిన్నటి దాకా కాంగ్రెస్ నాయకుడు. పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంత వేగంగా మరిచిపోవడం కష్టం కదా! ఆ మాటంటే ఎక్కడ డి. శ్రీనివాస్ సమక్షంలో చేరండి అంటారోనని ఈ పార్టీ మార్పిడి ఆలోచనను ప్రస్తుతానికి మానుకు న్నారట దానం నాగేందర్. కేశవరావు కన్నా తాజా మాజీ పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్. ఈ మధ్యనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఒక తెలుగు దేశం బ్యాచ్ ఇంకో కాంగ్రెస్ బ్యాచ్ చేరిపోవడంతో, అసలు టీఆర్ఎస్ బ్యాచ్ తెలంగాణ భవన్లో తమ కెవరు దిక్కు అని దిక్కులు చూస్తున్నదట. మొత్తానికి నాగేందర్ తన పార్టీ మార్పిడి ఆలోచ నను కాసేపు పక్కన పెట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ ఎన్నికలకు కాంగ్రెస్‌ను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. అయితే ఇది చివరి దాకా నిలిచే నిర్ణయం అని భావించవలసిన పని లేదు. ఏ క్షణాన్నయినా, అర్ధరాత్రి అని కూడా చూడకుండా పార్టీ మారిపోయే, మళ్లీ అదే వేగంతో తిరిగొచ్చే చాకచక్యం దానం నాగేందర్ సొంతం. 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాగేం దర్‌కు ఆసిఫ్‌నగర్ టికెట్ నిరాకరించింది. అప్పటికి ఆయన సిట్టింగ్ సభ్యుడు. ఆ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డి. శ్రీనివాస్ నాగేందర్‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నాడని ఆరోపించి నాగేందర్ రాత్రికి రాత్రి రాజకీయ బద్ధ శత్రువు చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి పసుపుపచ్చ కండువా కప్పుకుని తెలుగు దేశంలో చేరిపోయి టికెట్ తెచ్చుకుని, అదే ఆసిఫ్‌నగర్ నుంచి టీడీపీ ఎమెల్యేగా గెలిచారు. ఎన్నికలలో తెలుగు దేశం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్ది నెలల్లోనే దానం టీడీపీని వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ అదే నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడి పోయారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణ శక్తి కూడా నాగేందర్‌ను గెలిపించలేకపోయింది. ఇప్పుడయితే ఆ సమస్యే లేదు. ఆయన శాసన సభ్యుడు కారు. కానీ 2004లో ఎవరి కారణంగా అయితే తనకు టికెట్ రాలేదో అదే శ్రీనివాస్‌తో టీఆర్ఎస్లో చేరే విషయంలో నాగేందర్ చర్చలు జరిపారని, ఆయనతో టచ్‌లో ఉన్నా రని వార్తలొచ్చాయి. రాజకీయాలు అంటే ఇట్లానే ఉంటాయి మరి. ఇలా ఇంకెందరో! ఇలా పార్టీలు మారుతున్న వారంతా ఘన చరిత్ర కలవారే. కంటోన్మెంట్ సాయన్నను చూడండి! మొన్ననే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమించారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తేనే అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవేవీ లెక్కలోకి రావన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరో శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్‌కు ఆ పదవి ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరతారని సాయన్న చేరికకు ముందే ప్రచారం జరిగింది. తన నియోజకవర్గం రాజేందర్‌నగర్ అభివృద్ధికి నిధులిస్తానంటే టీఆర్ఎస్లో చేరడానికి ఎప్పుడయినా సిద్ధమేనని ప్రకాష్ గౌడ్ బహిరంగంగానే చెప్పారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి టీటీడీకి మరో సభ్యుడిని వెతుక్కోవలసిరావచ్చు. శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు రాష్ర్ట వ్యాప్తంగా 12 మందిని ఎన్నుకోవలసి ఉన్న తరుణంలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముంచు కొస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ పార్టీ మార్పి డులను చూస్తే తెలంగాణ లో మరో రాజకీయ పార్టీ మిగులుతుందా లేదా అన్న సందేహం కలగక మానదు. కానీ ఇదంతా ఎక్కువ కాలం కొనసాగే బలం కాదనీ, తాత్కాలిక వాపేనని అందరికీ అర్థమయ్యే రోజు రాక తప్పదు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వాలు బాగా పనిచేయగలవనే ప్రజాస్వామ్య సూత్రం ఇప్పుడు అధికార పార్టీ చెవికి ఇంపుగా అనిపించదు. కానీ ఈ మొత్తం వ్యవహారం కప్పల తక్కెడగా మారాక తెలంగాణ రాష్ర్టసమితి తన సహజత్వాన్ని కోల్పోయిందన్న విష యం గుర్తిస్తే మంచిది. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బ్రాండ్ విలువ పెంచుకున్న భారత్
ప్రపంచ ప్రఖ్యాత 'బ్రాండ్ ఫైనాన్స్' వెలువరించిన వార్షిక నివేదికలో అత్యధిక బ్రాండ్ విలువ గల దేశాల జాబితాలో భారత్ 7 వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా అగ్ర స్థానంలో ఉండగా చైనా, జర్మనీలు రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత ఏడాది నివేదికతో పోలిస్తే 32 శాతం వృద్ధిని సాధించి 2.1 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో భారత్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకోవడం విశేషం. ఈ నివేదికలో బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి. -
భద్రత పూజ్యం దొంగలదే రాజ్యం
రైళ్లలో పెరిగిన చోరీలు.. పట్టుబడని దొంగలు సికింద్రాబాద్ పరిధిలో చోరీల విలువ రూ.2.45 కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే పోలీసు జిల్లాలో ఈ ఏడాది నవంబర్ నాటికి రైళ్లు, పట్టాలపైన జరిగిన దొంగతనాల్లో రూ. 2కోట్ల 45 లక్షల ఆస్తి చోరుల పాలైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి చోరీ విలువ మరో 20 లక్షలు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో పాటు గుంతకల్, విజయవాడ రైల్వే ఎస్పీ జిల్లాలు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే పోలీసు జిల్లా పరిధి మిగిలింది. దీనికింద మొత్తం మూడు సబ్ డివిజన్లు సికింద్రాబాద్ అర్బన్, సికింద్రాబాద్ రూరల్, కాజీపేట్‌లున్నాయి. గత జనవరి నుంచి నవంబర్ వరకు నడుస్తున్న ైరైళ్లలోకి ప్రవేశించి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను తెంచుకుపోవడం, నిద్రలో ఉన్న ప్రయాణికుల లగేజ్‌ను ఎత్తుకుపోవడం వంటివి అనేకం జరిగాయి. గత 11 నెలల్లో రైళ్లలో 695 చోరీలతోపాటు మొత్తం 777 కేసులు నమోదయ్యా యి. ఈ కేసుల్లో అపహరణకు గురైన సొత్తు విలువ రూ.2.45 కోట్లని పోలీసులు తేల్చా రు. కాగా పలువురు దొంగలను పట్టుకున్నప్పటికీ వారి నుంచి స్వాధీనం చేసుకుంది రూ.42 లక్షల 6 వేలే. కాగా నింది తుల కోసం ప్రత్యేకబృందాలతో గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. -
బంగారం ధర దిగి రావాలంటే..!
-
బంగారం ధర.. ఒక్కసారే పైకెగిసిందిలా..!
-
కళ్ళు చెదిరేలా.. 'కళ్యాణ్' సంపద!
-
ఇల్లు దాటాక స్వేచ్ఛ విలువ తెలిసింది!
లైఫ్ బుక్: వాణీకపూర్ మా నాన్నకు జంతువుల హక్కులకు సంబంధించి ఒక స్వచ్ఛంద సంస్థ ఉండేది. దీంతో మా ఫామ్‌హౌజ్‌లో ఎటు చూసిన బాతులు, శునకాలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు ఉండేవి. బుజ్జికుక్కపిల్లలు బయట ఎక్కడైనా దీనస్థితిలో కనిపించినా, మురికిగా కనిపించినా ఇంటికి తెచ్చేదాన్ని. వాటిని శుభ్రంగా ఉంచేదాన్ని. నాకు అలా జంతువులన్నీ ఫ్రెండ్స్‌గా మారిపోయాయి. మనుషులతో కంటే వాటితో ఆడుకున్నదే ఎక్కువ. చిన్నప్పుడు చాలా నియమనింబంధనల మధ్య పెరిగాను. కొంత కాలానికి నాకు స్వేచ్ఛ కావాలనిపించింది. ఢిల్లీలో టూరిజం కోర్సు చేసినప్పుడుగానీ నాకు ఆ అవకాశం రాలేదు. అప్పుడు నేను మొదటి సారిగా హాస్టల్లో ఉన్నాను. స్వేచ్ఛ విలువ ఏమిటో అప్పుడు తెలిసింది. అయినప్పటికీ, పబ్‌లకు, డిస్కోలకు వెళ్లడం కంటే ఇంట్లో జరిగే విందులనే బాగా ఇష్టపడతాను. నాలో ఆధునిక భావాలు ఉన్నప్పటికీ... నా హృదయం మాత్రం పాత ప్రపంచంలోనే ఉంది! కొన్నిసార్లు అడగకుండానే అదృష్టం ఆప్యాయంగా పలకరిస్తుంది. మోడల్ కావాలనేది నా కోరిక. అయితే నా కోరికకు నా బరువు ప్రతిబంధకంగా కనిపించేది. అయినప్పటికీ ఏదో ఆశ. 75 కిలోల బరువుతో ఢిల్లీలోని ఒక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీకి ఇంటర్వ్యూకు వెళ్లాను. ఎంపికవుతానని పొరపాటున కూడా అనుకోలేదు. అదేం అదృష్టమోగానీ ఎంపికయ్యాను. ఆ తరువాత చాలా బరువు తగ్గాను. ‘ఇది జరగాలి’ ‘అది జరగాలి’ అనే కోరికలు ఏమీ లేవు. జరగాల్సి ఉంటే కచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను. నేను పుట్టి పెరిగిన వాతావరణంలో సినిమాల్లో నటించాలనే ఊహే రాదు. నేను కూడా సినిమాల్లోకి రావాలనే ఎప్పుడు అనుకోలేదు. కానీ విధి ఇలా నిర్ణయించింది!