భార్య కన్నా గడ్కరీ ఆదాయం తక్కువ.. భూములు కూడా లేవు! | Nitin Gadkari Wealth In Maharashtra's Nagpur | Sakshi
Sakshi News home page

Nitin Gadkari: భార్య కన్నా గడ్కరీ ఆదాయం తక్కువ.. భూములు కూడా లేవు!

Published Thu, Mar 28 2024 2:22 PM | Last Updated on Thu, Mar 28 2024 2:51 PM

Nitin Gadkari Wealth Nagpur Maharashtra - Sakshi

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి  బీజేపీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తన నామినేషన్‌ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తిపాస్తుల వివరాలు తెలియజేశారు. ఆదాయం విషయంలో నితిన్ గడ్కరీ తన భార్య  కంచన్ నితిన్ గడ్కరీ  కంటే చాలా వెనుకబడివున్నారు. అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం నితిన్ గడ్కరీ 2022-23లో రూ. 13,84,550 ఆదాయం సంపాదించారు. ఆయన భార్య  కంచన్‌కు 2022-23లో రూ.40,62,140 ఆదాయం అందుకున్నారు. 

నితిన్ గడ్కరీ ఆస్తుల విలువ రూ. ఒక కోటీ 32 లక్షల 90 వేల 605. ఆయన భార్య కంచన్ ఆస్తుల విలువ రూ. ఒక కోటీ 24 లక్షల 86 వేల 441. నితిన్ గడ్కరీ కుటుంబానికి రూ.95,46,275 విలువైన చరాస్తులు ఉన్నాయి. గడ్కరీ పేరు మీద మూడు కార్లు ఉన్నాయి. వీటిలో అంబాసిడర్ కారు ఒకటి. 1994లో కొనుగోలు చేసిన ఈ కారు ధర రూ.10 వేలు. గడ్కరీ దగ్గర హోండా కంపెనీకి చెందిన కారు ఉంది. దీని ధర 6,75,000. గడ్కరీకి  ఎల్‌సుజు కంపెనీకి చెందిన మరో కారు ఉంది. దాని విలువ రూ.12,55,000. నితిన్ గడ్కరీ భార్య కంచన్ పేరు మీద మూడు కార్లు ఉన్నాయి. అవి రూ.5,25,000 విలువైన ఇన్నోవా, రూ.4,10,000 విలువైన మహీంద్రా కంపెనీ కారు, రూ.7,19,843 విలువైన టాటా కంపెనీ కారు. బంగారం, ఆభరణాల విషయంలో భార్య  కంచన్ కంటే నితిన్ గడ్కరీ ముందున్నాడు. నితిన్ గడ్కరీ వద్ద రూ.31,88,409 విలువైన బంగారం లేదా ఆభరణాలు ఉన్నాయి. అదే సమయంలో కంచన్ వద్ద రూ.24,13,348 విలువైన ఆభరణాలు ఉన్నాయి.

స్థిరాస్తుల విషయానికొస్తే  నితిన్ గడ్కరీ పేరు మీద వ్యవసాయ భూమి లేదు. ముంబైలో అతని పేరు మీద ఓ ఇల్లు ఉంది. 960 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి ధర రూ.4.95 కోట్లు. కంచన్‌కు ఇల్లు, భూమి ఉన్నాయి. వీటి ధర రూ.7 కోట్ల 99 లక్షల 83 వేలు. నితిన్ గడ్కరీ కుటుంబానికి రూ.11 కోట్ల 55 లక్షల 11 వేల విలువైన స్థిరాస్తి ఉంది. నితిన్ గడ్కరీకి రూ. ఒక కోటీ 66 లక్షల 82 వేల 750 రుణం, ఆయన భార్య కంచన్‌కు రూ.38 లక్షల 8 వేల 390 రుణం ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement