సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థుల్లో కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. అలాగే తమపై నమోదైన కేసుల వివరాలను కూడా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
మాధవీరెడ్డి ఆస్తి రూ.325.61 కోట్లు
టీడీపీ కడప అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి ఆస్తుల విలువ రూ.133.3 కోట్లు కాగా, భర్త శ్రీనివాసులరెడ్డికి రూ. 192.61 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.12.62 లక్షలు ఉండగా, రూ.2.27 కోట్ల పెట్టుబడులున్నాయి. రూ.5.4 కోట్ల విలువ చేసే 6,438 గ్రాముల బంగారు, డైమండ్ ఆభరణాలున్నాయి. రూ.76 కోట్లు విలువ గల నివాస గృహాలు, రూ.12.70 కోట్లు విలువ గల కమర్షియల్ భవనాలు, రూ.2.02 కోట్లు విలువ గల స్థలాలు కలిగి ఉన్నారు. రూ.42.57 కోట్ల విలువైన 47. 33 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తెలిపారు. మాధవీరెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి.
కిరణ్‌కుమార్‌రెడ్డి ఆస్తి రూ.3.36 కోట్లు!
అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు వాహనం కూడా లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన దగ్గర నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఎన్‌ఎస్‌ఎస్, పోస్టల్ సేవింగ్ పథకం, ఇతరులకు ఇచ్చిన అప్పులు, బంగారు తదితర ఆభరణాలు, చరాస్తులు అన్నీ కలిపి రూ.3,35,84,334 ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఆయన సతీమణికి వివిధ రూపాల్లో రూ.6,90,14, 921 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం తన స్థిరాస్తులు రూ.62,12,37,500గా కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
బాలÔౌరి ఆస్తి రూ.101.25 కోట్లు
జనసేన తరఫున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలÔౌరి తనకు రూ.101,25,39,817 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.37,85,00,723, స్థిరాస్తుల విలువ 63,40,39,094 కాగా ఆయన సతీమణి వల్లభనేని భానుమతి పేరున మొత్తం రూ.32,46,74,747 ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై రెండు కేసులు నమోదయ్యాయని బాలÔౌరి తెలిపారు.
సీఎం రమేష్ ఆస్తి రూ.445.65 కోట్లు
బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన పేరిట రూ.445.65 కోట్ల ఆస్తులు, రూ.101.63 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున రూ.39,39,24,681, భార్య సీఆర్.శ్రీదేవి పేరున రూ.12,53,30,719 విలువైన చరాస్తులు చూపించారు. అలాగే ఆయన పేరిట రూ.252,66,21,246, భార్య పేరిట రూ.193,01,48,350 స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో డీఆర్‌ఐ అధికారుల విధులకు ఆటకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు సీఎం రమేష్‌పై కేసు నమోదైంది. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి.
కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులపై దాడికి సంబంధించి మరో కేసు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భూ వివాదం కేసు, లక్డీకాపూల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసు అధికారిని దూషించిన కేసు, అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హైదరాబాద్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించనందుకు కేసులు ఉన్నాయి.
థామస్ ఆస్తి రూ.124 కోట్లు
టీడీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి థామస్‌పై 2017లో చెన్నై సెండియం పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు, 2018లో ఆరింబాకం పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు, 2018లో తిరుపతి ఈస్టు పోలీస్‌స్టేషన్లో 420 కేసు నమోదయ్యాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.124 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి.
టీజీ భరత్ ఆస్తి రూ.243.57 కోట్లు
కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.243.57 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన పేరిట రూ.89.50 కోట్లు, ఆయన భార్య టీజీ శిల్పా పేరిట రూ.141 కోట్లు, కుమార్తె శ్రీ ఆర్య పేరిట రూ.10.99 కోట్లు, కుమారుడు టీజీ విభు పేరిట రూ.1.60 కోట్లు, ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తి రూ.46.76 లక్షలు ఉన్నాయి. అయితే టీజీ భరత్ సమరి్పంచిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలపలేదు. అలాగే టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.15,88,83, 622 విలువైన బంగారం ఉన్నట్లు వెల్లడించారు.
నారాయణ ఆస్తి రూ.824.05 కోట్లు
నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ, ఆయన భార్య రమాదేవి పేరిట రూ.824.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఇద్దరి పేరిట రూ.189.59 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. నారాయణ పేరిట బ్యాంకులో నగదు నిల్వ, వివిధ డిపాజిట్లు, వాహనాలు, బంగారు ఆభరణాల తదితరాలు కలిపి రూ.78.66 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య రమాదేవి పేరిట రూ.100.87 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.
నారాయణ పేరిట మొత్తం రూ.207.50 కోట్లు, భార్య పేరిట రూ.437.02 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నారాయణ తనపై ఎనిమిది కేసులున్నట్లు తెలిపారు. నారాయణ తమ్ముడి భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు, ప్రశ్నపత్రాలు లీక్ చేశారన్న అభియోగాలతో చిత్తూరులో మరో కేసు, నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య కేసు ఇందులో ఉన్నాయి. మిగిలిన ఐదు కేసులు రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసింది.
వేమిరెడ్డి ఆస్తి రూ.716.31 కోట్లు
టీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.716.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.77.05 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
అలాగే అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.1.28 కోట్ల ఖరీదైన 1,888.6 గ్రాముల బంగారం, 5.25 క్యారెట్స్ వజ్రాలు, రూ.66.80 లక్షల చేసే రెండు వాచ్‌లు, రూ.5.90 లక్షల వెండి వస్తువులు ఉన్నా యి. వేమిరెడ్డిపై 6 కేసులు కూడా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment