nominations
-
మళ్ళీ నామినేషన్ దందా షురూ!
సాక్షి, అమరావతి: రూ.లక్ష లోపు అంచనా ఉన్న పనులను ఈఈ.. రూ.2 లక్షల్లోపు పనులను ఎస్ఈ.. రూ.3 లక్షల్లోపు పనులను సీఈ నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చన్నది ప్రభుత్వ నిబంధన. అదీ వరదలు, కరువు వంటి ఉత్పాతాలు ఏర్పడినప్పుడు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన. ఆ పనులకు టెండర్లు పిలిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుండదు కాబట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులుబాటు కల్పించారు. కానీ, ఈ నిబంధనను నిక్కచ్చిగా అమలుచేయాల్సిన ప్రభుత్వమే దాన్ని నిలువునా పాతరేసింది. రూ.లక్ష కాదు, రూ.2 లక్షలు కాదు.. ఏకంగా రూ.480.22 కోట్ల విలువైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఎన్సీసీ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఇవి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సినవి కావు. అయినా, నిబంధనలు ఉల్లంఘించి వాటిని ఎన్సీసీ సంస్థకు అప్పగించడం వెనుక భారీఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలను కప్పెట్టుకోవడానికి కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించడం గమనార్హం. అక్రమాల దందా పునరావృతంఅస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి.. ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలుచేసుకోవడం 2014–19 మధ్య ముఖ్యనేతలు రివాజుగా మార్చుకున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ పనుల్లో రూ.2,917 కోట్ల పనులను నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టడమే అందుకు పరాకాష్ట. దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడాలేవు. కృష్ణా పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు–చెట్టు పనుల వరకూ రూ.15 వేల కోట్లకు పైగా విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టింది. ఇప్పుడూ అదే రీతిలో నామినేషన్ దందాకు తెరతీసింది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ ఒక్క పనిని కూడా నామినేషన్‌పై కట్టబెట్టకపోవడం గమనార్హం. పూర్తికాక ముందే నిధులు మిగులా?.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2014–19 తరహాలోనే మళ్లీ నామినేషన్ దందాకు తెరతీసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులను ఇందుకు వేదికగా చేసుకుంది. నిజానికి.. ఈ కెనాల్‌ను 79.6 కిమీ నుంచి 220.35 కిమీ వరకూ వెడల్పుచేసి, ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు రూ.1,929 కోట్ల వ్యయంతో 2021, సెపె్టంబరు 4న వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాంకేతిక అనుమతిచ్చింది. ఈ పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.1,217.49 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుని.. వాటిని పూర్తిచేయానికి 2023, ఫిబ్రవరి 1న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పనులను ఎన్సీసీ సంస్థ ఇప్పటివరకూ పూర్తిచేయలేదు. 25 శాతంలోపు మాత్రమే పూర్తయ్యాయని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వాస్తవానికి.. ఏదైనా పని పూర్తయ్యాకే ఆ పనికి కేటాయించిన నిధుల్లో మిగిలాయాన్నది తేల్చవచ్చు.కానీ.. ఇక్కడ పూర్తికాక ముందే వాటికి ప్రభుత్వం ఇచ్చిన సాంకేతిక అనుమతిలో రూ.711.51 కోట్ల మేర మిగులు ఉందంటూ తేల్చడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఇందులో రూ.480.22 కోట్ల వ్యయంతో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు 75.075 కిమీ నుంచి 207.80 కిమీ వరకూ లైనింగ్ చేసే పనులను నామినేషన్ పద్ధతిలో ఎన్సీసీ సంస్థకు కట్టబెట్టాలని ముఖ్యనేత ఆదేశించారు. దాంతో ఆ పనులను ఎన్సీసీకి అప్పగిస్తూ జలవనరుల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. -
ఐఐఎఫ్ఏ అవార్డ్స్ నామినేషన్స్.. సత్తా చాటిన లపతా లేడీస్
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ -2025 (IIFA) నామినేషన్స్‌లో బాలీవుడ్ చిత్రాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన ఐఐఎఫ్ఏ నామినేషన్స్‌లో అమిర్ ఖాన్, కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఏకంగా తొమ్మిది విభాగాల్లో లపతా లేడీస్ ఎంపికైంది. ఆ తర్వాత భూల్ భూలయ్యా-2, స్త్రీ-2 చిత్రాలు వరుసగా ఏడు, ఆరు విభాగాల్లో పోటీలో నిలిచాయి.ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ వేడుక మార్చిలో జరగనుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో మార్చి 8, 9 తేదీల్లో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో లాపతా లేడీస్, భూల్ భూలయ్యా- 3, స్త్రీ- 2, కిల్, ఆర్టికల్ 370, షైతాన్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో కిరణ్ రావు, నిఖిల్ నగేష్ భట్, అమర్ కౌశిక్, సిద్ధార్థ్ ఆనంద్, అనీస్ బజ్మీ, ఆదిత్య సుహాస్ ఝంబాలే నిలిచారు. ఉత్తమ నటి కేటగిరీలో నితాన్షి గోయెల్, అలియా భట్, యామీ గౌతమ్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్లు పోటీ పడుతుండగా.. ఉత్తమ నటులుగా స్పర్ష్ శ్రీవాస్తవ, రాజ్‌కుమార్ రావు, కార్తీక్ ఆర్యన్, అభిషేక్, బచ్చన్, అజయ్ దేవగన్‌లు నామినేషన్స్ దక్కించుకున్నారు.సపోర్టింగ్ రోల్ విభాగంలో ఛాయా కదమ్, విద్యాబాలన్, జాంకీ బోడివాలా, జ్యోతిక, ప్రియమణి నిలవగా.. రవి కిషన్, అభిషేక్ బెనర్జీ, ఫర్దీన్ ఖాన్, రాజ్‌పాల్ యాదవ్, మనోజ్ పహ్వా మేల్ విభాగంలో పోటీ పడుతున్నారు. బెస్ట్ విలన్ కేటగిరీలో రాఘవ్ జుయల్, ఆర్ మాధవన్, గజరాజ్ రావ్, వివేక్ గోంబర్, అర్జున్ కపూర్ నామినీలుగా నిలిచారు. -
ఆస్కార్ నామినేషన్స్‌లో ప్రియాంక చోప్రా చిత్రం.. ఏ విభాగంలో అంటే?
ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్‌లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చిత్రం స్థానం దక్కించుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో నిలిచింది. తాజాగా ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లో అనూజ చిత్రం పోటీ పడుతోంది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు. దీంతో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. కాగా.. ప్రియాంక చోప్రా నిర్మాతగా తెరకెక్కించిన అనూజ షార్ట్ ఫిల్మ్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కంగువా, ది గోట్ లైఫ్ చిత్రాలకు నిరాశ.. Short on time, big on talent, here are this year's nominees for Live Action Short Film. #Oscars pic.twitter.com/Wx0TZIpUen— The Academy (@TheAcademy) January 23, 2025 -
పుష్పా సరే పాయల్ని చూడండి
మన తెలుగు పుష్పా– 2 రికార్డు బద్దలు కొడుతోంటే అదే సమయంలో మన భారతీయ మహిళా డైరెక్టర్ 80 ఏళ్ల చరిత్ర గల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు నామినేషన్స్ సాధించి రికార్డు స్థాపించింది. బెస్ట్ డైరెక్టర్ (మోషన్ పిక్చర్) బెస్ట్ మోషన్ పిక్చర్ (నాన్ ఇంగ్లిష్) కేటగిరీల్లో ఆమె దర్శకత్వం సినిమా ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ నామినేషన్ పొందింది. ఇంతకు ముందు ఇలాంటి ఘనత సాధించిన మన దేశపు మహిళ మరొకరు లే రు.‘సినిమా తీయాలంటే అందరికీ ఫిల్మ్ స్కూల్ అక్కర్లేదు. కాని నాకు ఉపయోగపడింది’ అంటారు పాయల్ కపాడియా. ముంబైలో, ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీలో బాల్యం, కౌమారం గడిచిన పాయల్ పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సు చదివి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకురాలు అయారు. 2014 నుంచి సినిమాలు తీస్తున్నా 2021లో తీసిన డాక్యుమెంటరీ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’తో ఆమె ప్రతిభ లోకానికి పరిచయం కాసాగింది.ఎవరికీ లేని ఘనతఆస్కార్ అకాడెమీ అవార్డ్స్‌తో సమానమైన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం పోటీ పడే భారతీయ సినిమాలు చాలా తక్కువ. 1994 లో చివరిసారిగా ఒక భారతీయ సినిమా నామినేషన్ పొందింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు అదీ ఒక మహిళా దర్శకురాలిగా పాయల్ కపాడియా తాను తీసిన ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’తో 2024 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ విభాగం కింద రెండు నామినేషన్స్ పొందారు. ఇప్పటికే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండవ ప్రతిష్టాత్మకమైన బెస్ట్ డైరెక్టర్ అవార్డును (గ్రాండ్ ప్రి) పొందిన డింపుల్ కపాడియా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా సాధిస్తే ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది.సినిమాలు చూస్తూ...పాయల్ కపాడియా బాల్యంలో రిషి వ్యాలీలోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. ‘మా అమ్మా నాన్నలు నాకు చిన్నప్పుడు ప్రగతికాముక సినిమాలు చూపించేవారు. రష్యన్, ఫ్రెంచ్ సినిమాలు... ఆనంద్ పట్వర్థన్ తీసిన డాక్యుమెంటరీలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత పూణెలో డైరెక్షన్ కోర్సులో చేరాక వేరు వేరు ప్రాంతాల, నేపథ్యాల నుంచి వచ్చిన బ్యాచ్‌మేట్స్ సినిమాల గురించి ఎన్నో చర్చలు సాగించేవారు. రోజూ స్క్రిప్ట్‌లు వినడమే సరిపోయేది.అదంతా చిన్న ఎక్స్పోజర్ కాదు. అలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రాక్టికల్స్ ఉండేవి. అవి చేసే ముందు కష్టంగా ఉన్నా చేశాక ఏదో తెలుసుకున్నాం అనే సంతృప్తి ఉండేది. ఉదాహరణకు అందరూ తప్పనిసరిగా 4 నిమిషాల లాంగ్‌షాట్ తీయాలి మా ప్రాక్టికల్ ఫిల్మ్స్‌లో. ఎవరు ఎలా తీస్తారనేది ఒక అనుభవం. మా ్ర΄పొఫెసర్లు కూడా ఎంతో బాగా పాఠాలు చెప్పారు. అవన్నీ నేను దర్శకురాలు కావడానికి సాయం చేశాయి’ అంటారామె.ముగ్గురు స్త్రీలు, ఒక నగరంమూడు నాలుగేళ్లుగా రాసుకున్న స్క్రిప్ట్ ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ను తీయడానికి కావలసిన బడ్జెట్ కోసం ఫ్రాన్స్, ఇటలీ, లగ్జంబర్గ్, ఇండియా, నెదర్లాండ్స్‌లోని ్ర΄పొడక్షన్ సంస్థలను ఆశ్రయించి వారి సహ భాగస్వామ్యంతో పూర్తి చేశారు పాయల్. కేరళ నుంచి ముంబైకి భుక్తి కోసం వచ్చిన ఇద్దరు నర్సుల కథ ఇది. వీరు పనిచేసే ఆస్పత్రిలోనే వంటమనిషిగా చేస్తున్న మహారాష్ట్ర మహిళ వీరితో కలుస్తుంది.ఆ నర్సుల్లో ఒకామె భర్త ఆమెను విడిచిపెట్టి జర్మనీ వెళ్లిపోయి ఉంటాడు. మరో నర్సు అవివాహితగా ఉంటూనే ఒక యువకునితో రిలేషన్లో ఉంటుంది. ఇక వంటామె ఇరవై ఏళ్లుగా తాను ఏ చాల్ (చిన్న కొట్టం)లో అయితే నివసిస్తోందో ఆ చాల్ను బిల్డర్ కూల్చడానికి వస్తే దానిని సొంతం అని చెప్పుకోవడానికి ఏ పత్రమూ లేక కలిగే నిస్పృహ... ఈ ముగ్గురి జీవితం ఎక్కడకు చేరుతుంది... ఏ వెలుతురికీ ప్రస్థానం అని చూపేదే కథ.లోతైన కథనంపాయల్ కపాడియా ఈ కథలో ఎన్నో ΄పొరలు ఉంచి కథకు బహుముఖ పార్శా్వలు ఇవ్వడమే ప్రపంచ విమర్శకులను ఆకర్షించి అవార్డుల పంట పండేలా చేస్తోంది. ఈ కథలో మూడు పాత్రలతో పాటు ముంబై నగరం కూడా ఒక పాత్రగా ఉండటం విశేషం. ఒక నగరం పెరిగే కొద్దీ పేదవాళ్లను దూరంగా నెట్టేస్తూ ఉంటుందని ఈ సినిమా చూపుతుంది. ఒకప్పటి మామూలు ఏరియా ఖరీదైన భవంతులతో నిండిపోతే అప్పటివరకూ అక్కడ ఉన్నవారు ఎక్కడకు వెళ్లి వుంటారు? ఎవరూ ఆలోచించరు.‘ఈ నగరం కలల నగరం అని కొందరు అనుకుంటారు. ఇది భ్రాంతుల నగరం. కలా నిజమా... తెలుసుకునే లోపే జీవితం గడిచిపోతుంది’ అనే డైలాగ్ ఇందులో ఉంది. ‘నువ్వు జీవితాన్ని తప్పించుకోలేవు’ అనే డైలాగ్ కూడా ఉంది. తప్పించుకోలేని జీవితంలో తగిన ఆనందాలు వెతుక్కోవడం ఎలాగో ప్రతి జీవికీ తెలుస్తుంది. ఈ కథలోని ముగ్గురు స్త్రీలు ఆ ఆనందాలను వెతుక్కుని వెలుతురు పొందుతారు. జనవరి 5న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్ ఉంది. చూద్దాం మన అదృష్టం. -
భారతీయ చిత్రం అరుదైన ఘనత.. రెండు విభాగాల్లో నామినేట్!
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్‌కు ఎంపికైంది. తాజాగా ఈ ఏడాది అందించే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. గతనెల నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుడా అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.అంతేకాకుండా ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్‌లో జ్యూరీ గ్రాండ్ ప్రైజ్, గోథమ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను కూడా అందుకుంది. వచ్చే ఏడాది జనవరి 6న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అందజేయనున్నారు. తాజాాగ 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ నామినేషన్ జాబితాను జ్యూరీ ప్రకటించింది. భారత్ నుంచి కేవలం ఈ మూవీ మాత్రమే రెండు విభాగాల్లో నామినేట్ అయింది.Congratulations to the 82nd #GoldenGlobes nominees for Best Non-English Language Motion Picture:✨ ALL WE IMAGINE AS LIGHT | USA / FRANCE / INDIA✨ EMILIA PÉREZ | FRANCE✨ THE GIRL WITH THE NEEDLE | POLAND / SWEDEN / DENMARK✨ I’M STILL HERE | BRAZIL✨ THE SEED OF THE… pic.twitter.com/xzfsib2iov— Golden Globes (@goldenglobes) December 9, 2024Congratulations to the 82nd #GoldenGlobes nominees for Best Director Motion Picture:✨ JACQUES AUDIARD | EMILIA PÉREZ✨ SEAN BAKER | ANORA✨ EDWARD BERGER | CONCLAVE✨ BRADY CORBET | THE BRUTALIST✨ CORALIE FARGEAT | THE SUBSTANCE✨ PAYAL KAPADIA | ALL WE IMAGINE AS LIGHT pic.twitter.com/gTtCCMUCTp— Golden Globes (@goldenglobes) December 9, 2024 -
సంప్రదాయానికి తూట్లు
సాక్షి, అమరావతి: పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి రాకుండా చేసి శాసనసభ వ్యవహారాల్లో అనాదిగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారు. పారదర్శకత ఉండాలంటే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా ప్రతిపక్షానికి చెందిన సభ్యుడు ఉండటం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ఇవ్వాల్సిన పదవిని కూడా తమ కూటమికే దక్కేలా అన్ని స్థానాలకు తమ సభ్యులతో నామినేషన్లు వేయించి ఎన్నిక జరిగేలా చేశారు. దీంతో శాసనసభ చరిత్రలో తొలిసారి పీఏసీ కమిటీకి ఎన్నిక అనివార్యమైంది. ఈ కమిటీలో 12 మంది సభ్యులకు అవకాశం ఉండగా.. 9 ఎమ్మెల్యేల తరఫున, మూడు ఎమ్మెల్సీల తరఫున ఎన్నికవ్వాల్సి ఉంది. ఎమ్మెల్సీల తరఫున ఉన్న మూడు స్థానాలకు కేవలం మూడు నామినేషన్లు రావడంతో అవి ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 స్థానాలకు 10 నామినేషన్లు దాఖలవడంతో ఎన్నిక తప్పనిసరైంది. 9 స్థానాలకు కూటమి తరఫున 9 నామినేషన్లు, వైఎస్సార్సీపీ తరఫున ఒక నామినేషన్ (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి) దాఖలవడంతో శుక్రవారం ఎన్నిక నిర్వహించనున్నారు.ఆనవాయితీకి చెల్లుచీటీపీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పదవిని ప్రతిపక్ష పార్టీకి వదిలిపెట్టాలనే సంప్రదాయం పార్లమెంటు నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల శాసనసభల్లోనూ కొనసాగుతోంది. అప్పుడే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రతిపక్షానికి వస్తుందని ఈ సంప్రదాయాన్ని తెచ్చారు. ప్రతిపక్షానికి పీఏసీ కేటాయించాలనేది ప్రజాస్వామిక స్ఫూర్తి. కానీ.. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షం అనే దాన్నే గుర్తించకుండా, పీఏసీ కూడా వారికి ఇవ్వకుండా అసెంబ్లీలో ప్రజల గొంతు ఏమాత్రం వినపడకూడదనే ఉద్దేశంతో దాన్ని కూడా తామే చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లే పీఏసీ తీసుకుంటే ఇక ప్రజల తరఫున మాట్లాడేవాళ్లే ఉండరనే దుర్బుద్ధితోనే దాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది. పీఏసీ అనే దానిలోనే పబ్లిక్ అనే పదం ఉంది. అంటే ప్రజలకు సంబంధించిన పదవి అని అర్థం. ప్రతి అంశం పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరిగింది. నామినేషన్ దాఖలులో హైడ్రామా మరోవైపు పీఏసీ సభ్యత్వాలకు వైఎస్సార్సీపీ సభ్యులు నామినేషన్లు వేసే సమయంలోనూ హైడ్రామా నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సివుండగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆ సమయంలో అందుబాటులో లేకుండాపోయారు. పీఏసీ సహా ఇతర రెండు కమిటీల సభ్యత్వాలకు నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు సెక్రటరీ జనరల్ చాంబర్కి వెళ్లారు. కానీ.. ఆ సమయంలో ఆయన కావాలని అసెంబ్లీలోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికల అధికారి (సెక్రటరీ జనరల్) తన చాంబర్లో అందుబాటులో ఉండాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరొకరిని నియమించాలి. కానీ.. సమయం దాటిపోయే వరకూ నామినేషన్లు తీసుకోకుండా ఉండేందుకే ఆయన దురుద్దేశంతో అసెంబ్లీలో ఉండిపోయినట్టు సమాచారం. గంటన్నరపాటు ఎదురుచూసినా ఆయన రాకపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు. సెక్రటరీ జనరల్ దురుద్దేశపూర్వకంగా చాంబర్లోకి రావడంలేదనే విషయం తెలుసుకుని ఆయన కూడా చాంబర్ వద్దకెళ్లారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు తీసుకోకుండా ఉండటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుగా ఉన్న మరో చాంబర్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉండటంతో ఆయన్ను కూడా ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. దీంతో అచ్చెన్నాయుడు వెంటనే అసెంబ్లీలోకి వెళ్లి సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌ను బయటకు పంపారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కొద్ది నిమిషాలు ఉందనగా.. సెక్రటరీ జనరల్ హడావుడిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నుంచి నామినేషన్లు స్వీకరించారు. బొత్స సత్యనారాయణ సభలోనే ఉంటే నామినేషను దాఖలుకు అవకాశం ఇవ్వకుండా చేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా చేసి ఉంటే.. 2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి అప్పట్లో ఈ పదవి ఇచ్చారు. అప్పట్లో వైఎస్సార్సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించారు. సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ సంప్రదాయాలకు గండిపడింది. -
పీఏసీ ఛైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేయనున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?
బిగ్‌బాస్ 8లో పదోవారం కూడా అయిపోయింది. హరితేజ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఎప్పటిలానే సోమవారం వచ్చేసింది. దీంతో నామినేషన్స్ హంగామా మొదలైంది. హౌస్ట్ నాగార్జున ఇప్పటికే కన్నడ బ్యాచ్ చేసిన తప్పుల్ని చూసిచూడనట్లు వదిలేస్తున్నాడు. హౌస్‌లో మాత్రం అలా సాగదు కదా! తేజ, గౌతమ్ వాళ్లకు ఇచ్చిపడేశారు. ఈ ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు.11వ వారానికి సంబంధించిన నామినేషన్ వేసేందుకు ఈసారి హౌస్మేట్స్ పెయింటింగ్స్‌ని స్మాష్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ప్రేరణ.. గౌతమ్ ఫొటోని స్మాష్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాదన నడిచింది. నిఖిల్ వంత వచ్చేసరికి.. గతవారం తేజ చేసిన తప్పుని ఎత్తి చూపుతూ నామినేట్ చేశాడు. బయటకొచ్చిన తర్వాత తేజ వదల్లేదు. నేను చేసింది తప్పు సరే, యష్మీ చేసింది తప్పు కాదా అని ప్రశ్నించాడు. దానికి నేను సమాధానం చెప్పను అని నిఖిల్ మాట దాటవేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)అలా నిఖిల్-తేజ మధ్య చాలాసేపు గొడవ జరిగింది. ఇదంతా చూస్తుంటే హోస్ట్ నాగార్జున.. వీకెండ్ వచ్చి మిగతా వాళ్లు చేసిన తప్పుల్ని చెబుతున్నాడు. అదేదో పెద్ద పాపం అన్నట్లు రచ్చ చేస్తున్నాడు. సోమవారం వచ్చేసరికి దాన్నే కన్నడ బ్యాచ్.. నామినేషన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ వారం కూడా అదే జరిగేలా ఉంది. అలా ఈ వారం దాదాపు ఆరుగురు నామినేట్ అయినట్లు తెలుస్తోంది.నామినేట్ అయినవాళ్లలో పృథ్వీ, యష్మీ, విష్ణుప్రియ, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్ ఉన్నట్లు సమాచారం. లిస్ట్ చూస్తుంటే నిఖిల్, ప్రేరణ లేరు కాబట్టి వాళ్ల ఫ్యాన్స్.. కన్నడ బ్యాచ్‌లో భాగమైన పృథ్వీ, యష్మీకి సపోర్ట్ చేస్తారు. మిగతా వాళ్లలో ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్లకు ఉంది. కానీ ఈసారి ఎందుకు విష్ణుప్రియ మీద దెబ్బపడుద్దా అనే సందేహం వస్తోంది. చూడాలి మరి ఈ వారం ఎవరు బలైపోతారో?(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్) -
మహారాష్ట్ర ఎన్నికలు.. బరిలో 7,995 మంది
సాక్షి ముంబై: మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. మొత్తం 288 స్థానాల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్లకు ఆఖరు రోజైన అక్టోబర్ 29న దాదాపు 4,996 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.దీంతో ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండనున్నారనేది దాదాపు స్పష్టమైందని చెప్పవచ్చు. కాగా మహాయుతితోపాటు మహావికాస్ అఘాడిలపై పలువురు నాయకులు తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. తిరుగుబాటు చేసిన అభ్యర్థుల్లో గోపాల్ శెట్టి (బోరివలి), రాజు పారవే (ఉమరేడ్), స్వీకృతి శర్మ (తూర్పు అంధేరి), నానా కాటే (చించ్వడ్) తదితరులున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు నాలుగో తేదీ వరకు గడువు ఉండటంతో రెబల్స్‌ను బుజ్జగించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు... ప్రధాన కూటములైన బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల కలయికతో ఏర్పడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల కలయికతో ఏర్పడిన మహావికాస్ అఘాడీ కూటముల అభ్యర్థులు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో అత్యధికంగా బీజేపీ తరఫున 148 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున 103 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 164 స్థానాల్లో, కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేశాయి. కానీ ఈసారి రాజకీయ సమీకరణాలు మారడంతో ప్రధాన కూటముల్లో సీట్ల పంపకాలు ఆలస్యమయ్యాయి. ఇక మిగిలిన పార్టీలైన శివసేన (యూబీటీ) 89, శివసేన (శిందే) 80, ఎన్సీపీ (ఎస్పీ) 87, ఎన్సీపీ (ఏపీ) 53 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మహిం’లో ఎమ్మెన్నెస్‌కే మద్దతు -
వయనాడ్ ఉపఎన్నికల అభ్యర్థిగా ఇవాళ ప్రియాంక వాద్రా నామినేషన్
-
'నువ్వు ఎవరూ చెప్పడానికి?'.. విష్ణు ప్రియకు ప్రేరణ వార్నింగ్!
తెలుగులో బిగ్‌బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారం మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక సోమవారం మొదలవగానే నామినేషన్స్ గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ హౌస్‌లో ఓ చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ ఓ రేంజ్లో జరిగినట్లు తాజా ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఆ వివారాలేంటో చూసేద్దాం.ఇకపోతే మంగళవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్‌హాట్‌గా సాగింది. విష్ణు ప్రియ, యష్మి గౌడ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏడు వారాలైనా నీ సొంత గేమ్ ఎక్కడ కనిపించట్లేదు.. కొన్ని మాటలు కూడా చాలా హార్ష్‌గా ఉంటాయని విష్ణుప్రియను యష్మి నామినేట్ చేసింది. వీరి మధ్యలో అనుకోకుండా ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది. దీంతో విష్ణుప్రియతో గొడవ తారాస్థాయికి చేరింది. నా పేరు తీయకుండా మాట్లాడాలని ప్రేరణ అనడంతో..అలా అయితే హౌస్ నుంచి వెళ్లిపో అంటూ విష్ణుప్రియ వాదించింది. దీంతో నువ్వు ఎవరూ చెప్పడానికి.. నా గురించి మాట్లాడకు అంటూ ప్రేరణ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.ఆ తర్వాత మెహబూబ్‌ను నిఖిల్, యష్మి పలు కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఆ తర్వాత పృథ్వీని ముక్కు అవినాశ్ నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ రావడానికి మనీ తీసుకుంటావ్.. కానీ బిగ్‌బాస్ ఇస్తే తీసుకోవు అంటూ అవినాశ్ ప్రశ్నించాడు. ఆ తర్వాత మ్యాటర్ కాస్తా పృథ్వీ గడ్డం మీదకు వెళ్లింది. యాభై వేలు ఇచ్చినా నా గడ్డం తీయను బ్రో అంటూ పృథ్వీ గట్టిగానే అరిచేశాడు. మీరేందుకు యాభై వేలకు ఓకే చెప్పారంటూ అవినాశ్‌ను పృథ్వీ అడిగాడు. అది నా ఇష్టమని అవినాశ్ అనడంతో.. ఇది నా ఇష్టం అంటూ పృథ్వీ వాదించడంతో ప్రోమో ముగిసింది. హౌస్‌లో మరెంత హాట్‌హాట్‌గా సాగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. కాగా.. ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
మణికంఠకి మెంటలెక్కించారు.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరు?
ఆదివారం ఎపిసోడ్లో సోనియా ఎలిమినేట్ అయిపోయింది. అలా బిగ్‌బాస్ షో ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. సోమవారం వచ్చింది కాబట్టి ఎప్పటిలానే నామినేషన్స్ హడావుడి మొదలైంది. ఈసారి ఫొటోని మంటల్లో వేసే కాన్సెప్ట్‌తో నామినేషన్స్ సాగింది. ఎప్పటిలానే మణికంఠ టార్గెట్ అయ్యాడు. సీత అయితే మణిని ఓ రేంజులో రెచ్చగొట్టి వదిలేసింది.(ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?)ప్రోమో ప్రకారం మణికంఠ.. సరిగా ఆడట్లేదని నైనికని నామినేట్ చేశాడు. అలానే యష్మిని మళ్లీ టార్గెట్ చేశారు. నైనిక-నబీల్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. సీత-మణికంఠ మధ్య అయితే చిన్నపాటి యుద్ధమే జరిగింది. గత వారాల్లో జరిగిన పాయింట్స్ తెచ్చేసరికి మణి సైలెంట్ అయిపోయాడు. ఓ సందర్భంగా అతడిలా సీత ఇమిటేట్ చేసినట్లు అనిపించింది. దీంతో మణికంఠకి మెంటలెక్కిపోయింది.బాడీ లాంగ్వేజ్ మార్చుకో అని సీతతో మణికంఠ చెప్పగా.. ఇది నా బాడీ లాంగ్వేజ్, నేను ఎలా అయినా చేసుకుంటా అన్నట్లు సీత అంతే ధీటుగా సమాధానమిచ్చింది. ఇలా హోరాహోరీగానే సాగినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే నామినేషన్స్ షూటింగ్ పూర్తవగా ఎవరెవరు లిస్టులో ఉన్నారనేది బయటకొచ్చింది. ఈ వారం విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, నబీల్, మణికంఠ, నిఖిల్.. నామినేషన్స్‌లో ఉన్నారు. అలానే ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?) -
రాజ్యసభ అభ్యర్థిగా నామినేష్ దాఖలు చేసిన అభిషేక్ సింఘ్వి
-
YSRCP ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్
-
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్‌కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్‌ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్‌తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్‌సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్‌ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
శ్రీనగర్: లోక్‌సభ 2024 ఎన్నికలు ఇప్పటికి రెండు దశల్లో పూర్తయింది. ఈనెల 7న మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు, ఐదో దశల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాకుండా.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ జరగనుంది. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ 'ఒమర్ అబ్దుల్లా' జమ్మూ కాశ్మీలోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.నేషనల్ కాన్ఫరెన్స్ ట్రెజరర్ షమ్మీ ఒబెరాయ్, జమ్మూ & కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీఎన్ మోంగాతో పాటు ఒమర్ అబ్దుల్లా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈయన పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజాద్ లోన్‌తో పోటీపడనున్నట్లు తెలుస్తోంది. పీడీపీ ఈ స్థానం నుంచి రాజ్యసభ మాజీ ఎంపీ మీర్ ఫయాజ్ను బరిలోకి దింపింది.నామినేషన్ వేయడానికి మే 3 చివరి తేదీ. కాగా మే 20న పోలింగ్ జరగనుంది. బారాముల్లాలో విలేకరులతో మాట్లాడుతూ.. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంటే.. తాను తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పారు.నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడైన ఒమర్ అబ్దుల్లా 2009 తర్వాత తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన ప్రమాణం చేశారు. దీంతో సుమారు 20 సంవత్సరాల తరువాత మళ్ళీ లోక్‌సభ ఎన్నికల బరిలో అడుగుపెట్టారు. -
నేడే ఆఖరి తేదీ.. వివరాలు వెల్లడించిన ఈసీ
-
271 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం రాత్రి ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 271 మంది అభ్యర్థుల నామినేషన్లను పరిశీలన అనంతరం అధికారులు తిరస్కరించారు. 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. తిరస్కరణకు కారణాలెన్నో: నామినేషన్ పత్రా ల్లోని అన్ని కాలమ్స్ పూరించాల్సి ఉండగా, కొందరు అభ్యర్థులు కొన్ని కాలమ్స్‌ను భర్తీ చేయకుండా వదిలివేయడం, పత్రాలపై కొన్నిచోట్లలో సంతకాలు చేయకపోవడం వంటి కారణాలతో చాలా మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కనీసం 10 మంది ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులను ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. కొందరు స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ఓటర్లు కూడా ప్రతిపాదించకపోవడంతో వారి నామినేషన్లను సైతం జిల్లా ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్ నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి బీఎస్పీ తరఫున మాజీ ఎంపీ మందా జగన్నాథం వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇటీవల అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరిన ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే బీఎస్పీకి సంబంధించి బీఫాం అందజేయకపోవడంతో నామినేషన్ తిర్కరణకు గురై¯ంది. నామినేషన్ పత్రాల్లో నో అబ్జెక్షన్పత్రం అందజేయకపోవడం, గడువులోగా సమర్పించాల్సి ఉన్నా సమరి్పంచకపోవడంతో నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అయితే బీఎస్పీ తరఫున మరో అభ్యర్థి యోసేఫ్ నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ బీఫాంను అతనికి అందజేసింది. -
నేడు బీజేపీ కీలక నేతల నామినేషన్లు.. అక్కడి అభ్యర్థిపై ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటితో నామినేషన్ట ఘట్టం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా ట్విస్ట్ కొనసాగుతోంది. బీజేపీ హైకమాండ్ ప్రకటించిన అభ్యర్థికి ఇంకా బీఫామ్ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, నేడు నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. ఇక, కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ పార్లమెంట్‌కు పోతుగంటి భరత్ నామినేషన్ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి విషయంలో సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. మరోవైపు.. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత తాజాగా కిషన్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్‌తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేష్.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. అయితే, కాంగ్రెస్ ఆయనకు కాకుండా గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
-
ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
-
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం
-
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం
-
పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్
-
పులివెందులలో సీఎం జగన్ నామినేషన్
-
టీడీపీ దిగజారుడు రాజకీయం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు ఈస్ట్: ఓటమి తప్పదని తేలిపోవడంతో చంద్రబాబు, లోకేశ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నారు. ఓటర్లను గందరగోళానికి గురి చేసి, వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించాలన్న కుట్రతో మంగళగిరి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న మహిళలతో నామినేషన్లు వేయించారు. మంగళగిరిలో ఇద్దరితో ఇలా నామినేషన్లు వేయించారు. గుంటూరు పశ్చిమలో ఓ దళిత మహిళ పేరిట నామినేషన్ వేయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, రచ్చయింది. ఆ వీడియో బయటకు వచ్చింది. టీడీపీ నాయకులు తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె పేరుతో టీడీపీ నాయకులే నామినేషన్ వేశారు. టీడీపీ నేతలు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆ దళిత మహిళ స్పష్టం చేయడంతో వారి కుట్ర బట్టబయలైంది.గుంటూరు పశ్చిమలో కుట్ర బెడిసి కొట్టిందలా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు అదే పేరుతో ఉన్న మరో మహిళ పేరిట నామినేషన్ వేయించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి భర్త రామచంద్రరావు స్వయంగా ఈ వ్యవహారం నడిపించిన వీడియో బయటకు వచ్చింది. ఆయన శ్రీనివాసరావుపేటలో ఉంటున్న దళిత మహిళ విడదల రజిని ఇంటికి వెళ్లి నామినేషన్ వేసేలా ప్రలోభ పెట్టారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆమె భర్తకు ఉద్యోగంతో పొటు సొంత ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నామినేషన్ వేసే వరకూ తమతోనే ఉండాలని, స్కూృటినీ అయిన వెంటనే తమిళనాడులోని వేళంగిణి మాత టెంపుల్‌కు పంపిస్తామని, ఎన్నికలు ముగిసే వరకూ అక్కడే ఉండి రావాలని, ఖర్చంతా తాము పెట్టుకుంటామని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమెను తీసుకువెళ్లి టీడీపీ అభ్యర్థి ఉండే అపార్ట్మెంట్లోనే ఉంచారు. తన కుమార్తెను టీడీపీ నాయకులు తీసుకువెళ్లడాన్ని చూసిన మహిళ తండ్రి దేవరాజ్ తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంపాలెం సీఐ లోకనాథం, సిబ్బంది గాలించి నగరంపాలెం మెయిన్ రోడ్డులోని అపార్ట్మెంట్లో ఉందని గుర్తించారు. ఆమెను అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె తండ్రికి పోలీసులు అప్పగించారు. ఆమె తన తండ్రితో వెళ్లిపోవడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ఆమెను వైఎస్సార్సీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలతో కలిసి నగరంపాలెం పోలీసు స్టేషన్ ముందు హడావుడి చేశారు. అప్పటికే ఆమె నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు తీసుకున్న టీడీపీ నాయకులు ఆమె తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారమంతా తెలుసుకున్న వైఎస్సార్సీపీ లీగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి, లీగల్ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు ఝాన్సి, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, ఇతర నాయకులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని దళిత మహిళ రజినిని కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.రాజకీయాల్లోకి తనను లాగొద్దన్న దళిత మహిళఈ రాజకీయాల్లోకి తనను లాగొద్దని దళిత మహిళ విడదల రజిని కోరారు. ఈమేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తనకు నామినేషన్ వేయడం ఇష్టంలేదని, టీడీపీ నాయకులు తన వద్ద నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని స్పష్టం చేశారు.మంగళగిరిలో ఇద్దరు లావణ్యలతో నామినేషన్లుఈసారి మంగళగిరిలో గెలుస్తానంటూ లోకేశ్ ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఆయనపై రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బీసీ వర్గాలకు చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తుండటంతో ఆయన ఓటమి ముందే ఖాయమైపోయింది. దీంతో ఓటర్లను గందరగోళానికి గురి చేసేందుకు అదే పేరు ఉన్న మరో ఇద్దరు మహిళలతో ఇండిపెండెంట్లుగా చివరిరోజున నామినేషన్లు వేయించారు. వీరిలో ఓ మహిళ ఇంటిపేరు కూడా మురుగుడే కావడం గమనార్హం. రాజీవ్ గృహకల్పలో ఉండే బంగారం పని చేసే మురుగుడు సాంబశివరావు భార్య మురుగుడు లావణ్య గురువారం నామినేషన్ వేశారు. లావణ్య అనే పేరుతో ఉన్న మరో మహిళతో కూడా నామినేషన్ వేయించారు. -
Nominations: తెలుగు రాష్ట్రాల్లో రేపే లాస్ట్ డేట్
హైదరాబాద్, సాక్షి: ‘‘సమయం లేదు మిత్రమా’’.. అంటూ రాజకీయ నేతలు త్వరపడాల్సిన టైం వచ్చింది. ఇటు తెలంగాణ లోక్‌సభ, అటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరి తేదీ. దీంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. నాలుగో దశలో తెలంగాణ(17), ఏపీ(25) లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, ఝూర్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇప్పటిదాకా(మంగళవారం నాటికి) 415 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏపీలో 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 417 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2 వేల 350 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 18వ తేదీన నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. రేపటితో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుంది. ఎల్లుండి.. అంటే 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
టీడీపీ అభ్యర్థులు కళ్లుచెదిరే ఆస్తిపరులు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థుల్లో కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. అలాగే తమపై నమోదైన కేసుల వివరాలను కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు. మాధవీరెడ్డి ఆస్తి రూ.325.61 కోట్లుటీడీపీ కడప అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి ఆస్తుల విలువ రూ.133.3 కోట్లు కాగా, భర్త శ్రీనివాసులరెడ్డికి రూ. 192.61 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.12.62 లక్షలు ఉండగా, రూ.2.27 కోట్ల పెట్టుబడులున్నాయి. రూ.5.4 కోట్ల విలువ చేసే 6,438 గ్రాముల బంగారు, డైమండ్ ఆభరణాలున్నాయి. రూ.76 కోట్లు విలువ గల నివాస గృహాలు, రూ.12.70 కోట్లు విలువ గల కమర్షియల్ భవనాలు, రూ.2.02 కోట్లు విలువ గల స్థలాలు కలిగి ఉన్నారు. రూ.42.57 కోట్ల విలువైన 47. 33 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తెలిపారు. మాధవీరెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆస్తి రూ.3.36 కోట్లు! అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు వాహనం కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన దగ్గర నగదు, ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్ పథకం, ఇతరులకు ఇచ్చిన అప్పులు, బంగారు తదితర ఆభరణాలు, చరాస్తులు అన్నీ కలిపి రూ.3,35,84,334 ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఆయన సతీమణికి వివిధ రూపాల్లో రూ.6,90,14, 921 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం తన స్థిరాస్తులు రూ.62,12,37,500గా కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాలÔౌరి ఆస్తి రూ.101.25 కోట్లు జనసేన తరఫున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలÔౌరి తనకు రూ.101,25,39,817 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.37,85,00,723, స్థిరాస్తుల విలువ 63,40,39,094 కాగా ఆయన సతీమణి వల్లభనేని భానుమతి పేరున మొత్తం రూ.32,46,74,747 ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై రెండు కేసులు నమోదయ్యాయని బాలÔౌరి తెలిపారు. సీఎం రమేష్ ఆస్తి రూ.445.65 కోట్లుబీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన పేరిట రూ.445.65 కోట్ల ఆస్తులు, రూ.101.63 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున రూ.39,39,24,681, భార్య సీఆర్.శ్రీదేవి పేరున రూ.12,53,30,719 విలువైన చరాస్తులు చూపించారు. అలాగే ఆయన పేరిట రూ.252,66,21,246, భార్య పేరిట రూ.193,01,48,350 స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో డీఆర్ఐ అధికారుల విధులకు ఆటకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు సీఎం రమేష్‌పై కేసు నమోదైంది. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి.కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులపై దాడికి సంబంధించి మరో కేసు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భూ వివాదం కేసు, లక్డీకాపూల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసు అధికారిని దూషించిన కేసు, అంబర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హైదరాబాద్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించనందుకు కేసులు ఉన్నాయి. థామస్ ఆస్తి రూ.124 కోట్లు టీడీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి థామస్‌పై 2017లో చెన్నై సెండియం పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు, 2018లో ఆరింబాకం పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు, 2018లో తిరుపతి ఈస్టు పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు నమోదయ్యాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.124 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. టీజీ భరత్ ఆస్తి రూ.243.57 కోట్లు కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.243.57 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన పేరిట రూ.89.50 కోట్లు, ఆయన భార్య టీజీ శిల్పా పేరిట రూ.141 కోట్లు, కుమార్తె శ్రీ ఆర్య పేరిట రూ.10.99 కోట్లు, కుమారుడు టీజీ విభు పేరిట రూ.1.60 కోట్లు, ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తి రూ.46.76 లక్షలు ఉన్నాయి. అయితే టీజీ భరత్ సమరి్పంచిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలపలేదు. అలాగే టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.15,88,83, 622 విలువైన బంగారం ఉన్నట్లు వెల్లడించారు. నారాయణ ఆస్తి రూ.824.05 కోట్లునెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ, ఆయన భార్య రమాదేవి పేరిట రూ.824.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఇద్దరి పేరిట రూ.189.59 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. నారాయణ పేరిట బ్యాంకులో నగదు నిల్వ, వివిధ డిపాజిట్లు, వాహనాలు, బంగారు ఆభరణాల తదితరాలు కలిపి రూ.78.66 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య రమాదేవి పేరిట రూ.100.87 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.నారాయణ పేరిట మొత్తం రూ.207.50 కోట్లు, భార్య పేరిట రూ.437.02 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నారాయణ తనపై ఎనిమిది కేసులున్నట్లు తెలిపారు. నారాయణ తమ్ముడి భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు, ప్రశ్నపత్రాలు లీక్ చేశారన్న అభియోగాలతో చిత్తూరులో మరో కేసు, నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య కేసు ఇందులో ఉన్నాయి. మిగిలిన ఐదు కేసులు రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసింది. వేమిరెడ్డి ఆస్తి రూ.716.31 కోట్లుటీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.716.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.77.05 కోట్లు ఉన్నట్లు తెలిపారు.అలాగే అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.1.28 కోట్ల ఖరీదైన 1,888.6 గ్రాముల బంగారం, 5.25 క్యారెట్స్ వజ్రాలు, రూ.66.80 లక్షల చేసే రెండు వాచ్‌లు, రూ.5.90 లక్షల వెండి వస్తువులు ఉన్నా యి. వేమిరెడ్డిపై 6 కేసులు కూడా నమోదయ్యాయి. -
AP: నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ
రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగియ నుంది. బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో ఈ సారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఒకరోజు గడువు ఉండగానే బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 653 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్‌సభకు బుధవారం నామినేషన్లు వేసినవారిలో బీజేపీ తరఫున పురందేశ్వరి, జనసేన తరఫున వల్లభనేని బాలశౌరి,ఉదయ్ శ్రీనివాస్ తదితరులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు రోజుల్లో.. 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 555 మంది 653 సెట్ల నామినేషన్లు దాఖలు.తొలిరోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు రెండోరోజు 68 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 40 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగోరోజు 112 సెట్ల నామినేషన్లు దాఖలు ఐదోరోజు 124 సెట్ల నామినేషన్లు దాఖలు ఆరోరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు ఆరు రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 3057 మంది 3701 సెట్ల నామినేషన్లు దాఖలుతొలిరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండోరోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడోరోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదోరోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలుఆరోరోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు -
నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ కౌన్సిలర్
ఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి రెబల్ ఆప్ కౌన్సిలర్ 'నరేంద్ర కుమార్' తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. విజయ్ కుమార్ ఆ పదవికి సెల్ఫ్-నామినేట్ చేసిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం జరిగింది. ఏప్రిల్ 18న, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ ఎన్నికలకు తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత , మేయర్ పదవికి మహేష్ ఖిచి, డిప్యూటీ మేయర్‌గా రవీందర్ భరద్వాజ్‌ని నిలబెట్టారు. అయితే కౌన్సిలర్లు విజయ్ కుమార్, నరేంద్ర మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా వారు నామినేషన్స్ దాఖలు చేశారు. కాగా ఇప్పుడు నరేంద్ర కుమార్ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. నరేంద్ర కుమార్ తన నామినేషన్‌ను ఎందుకు వెనక్కు తీసుకున్నారు అనేదానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. పార్టీ నుంచి తనకు ఎటువంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. పార్టీ ఎంపికకు వ్యతిరేఖంగా ఎందుకు నామినేషన్ వేశారు అనే దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నరేంద్ర కుమార్ వార్డు-119 మంగళపురి కౌన్సిలర్ కాగా, విజయ్ కుమార్ వార్డు-192 త్రిలోకపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
బాలినేని శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
-
ఏపీలో జోరుగా నామినేషన్లు
-
బియ్యపు మధుసూధన్ రెడ్డి నామినేషన్
-
వైఎస్ ఆర్ సీపీలో నామినేషన్ల జాతర
-
భారీ జనంతో పెద్ది రెడ్డి నామినేషన్
-
వేలాదిగా తరలివచ్చిన జనం...లోకేష్ విలవిల..
-
ఆఖరి నిమిషం దాకా అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై లోక్‌సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసిన అభ్యర్థులు కొందరు చివరి నిమిషంలో ఇతర పార్టీల్లో చేరడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కడా అభ్యర్థులు చేజారిపోకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థులను బరిలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నందినగర్ నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు, బస్సు యాత్ర షెడ్యూల్‌తో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై లోతుగా చర్చించారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నాటికి ఒకరిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు పార్టీ మారిన చోట లోక్‌సభ ఎన్నికల ప్రచారం, సమన్వయ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను సిద్ధం చేశారు. గురువారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు, వాటిపై విపక్ష శిబిరం నుంచి వచి్చన స్పందనపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ ఇరువురు నేతలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిధుల వ్యయం అభ్యర్థుల చేతుల మీదుగా కాకుండా పార్టీ పర్యవేక్షణలోనే జరిగేలా చూడాలని ఆదేశించారు. రైతాంగ సమస్యలు ఎత్తిచూపేలా యాత్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చేసే బస్సుయాత్ర తీరుతెన్నులపై సుదీర్ఘంగా చర్చించారు. బస్సు యాత్ర చేయాల్సిన మార్గం, ఏయే తేదీల్లో ఏయే ప్రదేశాల్లో సభలు, వీధి మలుపు (స్ట్రీట్ కార్నర్) సమావేశాలు ఏర్పాటు చేయాలనే అంశంపై కసరత్తు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటల లోపు ఇటీవల కేసీఆర్ చేసిన ‘పొలంబాట’తరహా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో రైతులు, యువత, మహిళలు, మైనారిటీలు ఇతర సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అయ్యేలా చేపట్టాల్సిన కార్యక్రమాల జాబితాను సిద్ధం చేశారు. రైతాంగ సమస్యలను ప్రధానంగా ఎత్తి చూపేలా బస్సు యాత్ర ఉదయం పూట షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. సాయంత్రం సమయంలో రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు, మినీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తనతో పాటు బస్సు యాత్రలో పాల్గొనే బృందం బస, భోజన వసతి తదితరాల బాధ్యతలు స్థానికంగా ఎవరికి అప్పగించాలనే అంశంపైనా చర్చ జరిగింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సభలు, రోడ్‌షోలకు వచ్చే వారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా చేయాలని నిర్ణయించారు. కాగా బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లాల నేతలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రతిపాదనలను క్రోడీకరించి శనివారం సాయంత్రంలోగా కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్, బీజేపీల కంటేఓ అడుగు ముందే..! లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు జరిగిన సన్నాహక భేటీలను, కేడర్‌ను సన్నద్ధం చేసిన తీరుపై కేసీఆర్ సమీక్షించారు. సన్నాహక భేటీలు, సభల నిర్వహణ, ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పోలిస్తే ఓ అడుగు ముందు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్న అంశాలు, ఉపయోగిస్తున్న భాష తదితరాలు భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. రెండు జాతీయ పార్టీలను ఇరకాట స్థితిలోకి నెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర కోసం ప్రజలకు చేరువయ్యే రీతిలో కొత్త పాటలను రికార్డు చేసే పనులు సాగుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఇలావుండగా శుక్రవారం పలువురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలిశారు. -
రెండో రోజు 57 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు శుక్రవారం ఊపందుకున్నాయి. ఏకాదశి మంచిరోజు కావడంతో ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. మొత్తంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను.. రెండో రోజున 57 మంది అభ్యర్థులు 69 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందించారు. తొలిరోజున 42 మంది అభ్యర్థులు వేసిన 48 సెట్ల నామినేషన్లు కలిపి.. మొత్తంగా 117 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. భారీ ర్యాలీలు, బల ప్రదర్శనతో..: నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించి భారీ ర్యాలీలు నిర్వహించారు. హంగూ ఆర్భాటాలతో బల ప్రదర్శన చేశారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయానికి వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. సికింద్రాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు నామినేషన్లు వేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం నిర్వహించిన సభల్లో మాట్లాడారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావుగౌడ్ నామినేషన్ వేశారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. పలువురు సీనియర్ల నామినేషన్లు..: శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్ (మహబూబాబాద్), గడ్డం వంశీ (పెద్దపల్లి), చల్లా వంశీచంద్‌రెడ్డి (మహబూబ్‌నగర్) ఆత్రం సుగుణ (ఆదిలాబాద్) ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (నాగర్ కర్నూల్).. బీజేపీ తరఫున బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్).. సీపీఎం నుంచి ఎండీ జహంగీర్ (భువనగిరి) నామినేషన్లు వేశారు. పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలతో పాటు బీఎస్పీ, ధర్మ సమాజ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు కాకుండా.. భువనగిరి నుంచి ఇద్దరు, మహబూబాబాద్‌లో ఐదుగురు, నల్గొండలో నలుగురు, పెద్దపల్లిలో ముగ్గురు, మహబూబ్‌నగర్‌లో ఐదుగురు, వరంగల్‌లో ముగ్గురు, నిజామాబాద్‌లో ఆరుగురు చొప్పున నామినేషన్లు సమర్పించారు. -
వైఎస్ఆర్ సీపీ నామినేషన్ల పర్వం
-
నామినేషన్ దాఖలు చేసిన శెట్టిపల్లె రఘురామిరెడ్డి
-
ఫ్యామిలీతో ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్
-
పంచకట్టులో భూమా అభినయ్ రెడ్డి నామినేషన్
-
AP: తొలిరోజే భారీగా నామినేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్‌సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు పార్లమెంటుకు నామినేషన్లు దాఖలు చేసిన ముఖ్యుల్లో వైఎస్సార్సీపీ తరఫున రాజంపేట నియోజకవర్గం నుంచి పి.మిథున్‌రెడ్డి, హిందూపురం నుంచి జె.శాంత, తెలుగుదేశం తరఫున నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు (ఎస్సీ) నుంచి డి.ప్రసాదరావు ఉన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 190 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీకి నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆళ్ల నాని, అనంత వెంకటరామిరెడ్డి, ఎస్.చక్రపాణిరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, బుట్టా రేణుక, కేతిరెడ్డి పెద్దారెడ్డి, బూచేపల్లి, కొరుముట్ల శ్రీనివాసులరెడ్డి, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, తెలుగుదేశం తరఫున పయ్యావుల కేశవ్, లోకేశ్, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి, బీజేపీ తరఫున సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి తదితరులున్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్‌లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్‌రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్‌రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
బీజేపీ అభ్యర్థికి 'ముహూర్తం' చిక్కులు.. నామినేషన్ వేయకుండానే..
అహద్మాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో నామినేషన్ వేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ డేట్స్ కూడా ఇచ్చేసింది. ఇప్పటికే చాలామంది నామినేషన్స్ కూడా వేసేసారు. అయితే ముహూర్తం దాటిపోయిందని ఓ బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పాటిల్ నామినేషన్ దాఖలు చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. నాయకుడు నామినేషన్ వేయడానికి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అయితే ముహూర్తం దాటిపోయిందని పాటిల్ నామినేషన్ వేయకుండానే వెనక్కి వెళ్లి కార్యకర్తలకు నిరాశ కలిగించారు. పాటిల్ ముందుగా అనుకున్నట్లు మధ్యాహ్నం 12.39 గంటలకు నామినేషన్ వేయాలి. అయితే ఆ సమయానికి అక్కడికి ఆయన చేరుకోలేకపోయారు. శుభ గడియలు మిస్ కావడంతో నామినేషన్ ఏప్రిల్ 19న వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. -
తెలంగాణలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ
-
నేడు నామినేషన్ వేయనున్న బుట్టా రేణుక
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక గురువారం ఉదయం 9.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పార్టీ నాయకులు కోరారు. రేపు నామినేషన్ వేయనున్న సతీష్ కర్నూలు సిటీ: కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న డా.ఆదిమూలపు సతీష్ రేపు(శుక్రవారం)నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు చిల్డ్రన్ పార్క్(ఎస్వీ కాంప్లెక్స్) దగ్గరకు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. అక్కడి నుంచి వెళ్లి కర్నూలు ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
నామినేషన్లకు సర్వం సిద్ధం...
-
నేటి నుంచే నామినేషన్ల పర్వం
-
సార్వత్రిక ఎన్నికలు.. తొలిరోజు ప్రముఖుల నామినేషన్లు
Upadates తెలంగాణలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. నల్గొండ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. సంగారెడ్డి జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ మొదటి సెట్ నామినేషన్ సురేష్ షెట్కార్ తరపున నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకులు ఈ నెల 24న సురేష్ షెట్కార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ: డీకే అరుణ నామినేషన్ దాఖలు భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన డీకే అరుణ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మహారాష్ట్ర నామినేషన్ సమర్పించిన సుప్రియా సూలే ఎన్సీపీ (శరద చంద్ర పవార్) పార్టీ సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే నామినేషన్ దాఖలు చేశారు బారామతి స్థానంలో పోటీలో ఉన్నారు Maharashtra: NCP-SCP sitting MP and candidate from Baramati, Supriya Sule files her nomination papers. Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar has been fielded by NCP against NCP-SCP MP Supriya Sule from Baramati. pic.twitter.com/8uS99KwDTk — ANI (@ANI) April 18, 2024 తెలంగాణ నల్లగొండ లోక్ సభ స్థానంలో తొలి నామినేషన్ దాఖలు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున తొలి సెట్టు నామినేషన్ సమర్పించిన పార్టీ నేతలు తెలంగాణ కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ నేడు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు నామినేషన్ వేయనున్నారు నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశి్చమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. The Gazette notification has been issued for the 4th phase of general elections. Polling will take place for 96 Lok Sabha seats across 10 states Andhra Pradesh, Bihar, Jharkhand, Madhya Pradesh, Maharashtra, Odisha, Telangana, Uttar Pradesh, West Bengal, and Jammu & Kashmir.… pic.twitter.com/xyjCS0xesf — ANI (@ANI) April 18, 2024 సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధం అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరుగనుంది. గురువారం ఉదయం నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఈ విడతకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 96 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకొనేందుకు అవకాశం కలి్పంచారు. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 న జరుగనుంది. అనంతరం ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. కాగా నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిషాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగో విడతలో పోలింగ్ జరుగనుంది. -
ఏపీలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
Updates ఏలూరు జిల్లా : నూజివీడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రబోయిన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురు దెబ్బ రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ రాప్తాడు ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్ పరిటాల సునీత ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా... రామచంద్రపురం ఆర్డీఒ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్.... పిల్లి సూర్యప్రకాష్ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి సుధా సుధా సాగర్‌కు అందజేత. అనంతపురం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ శాంత తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు అన్నమయ్య : రాజంపేటంలో అట్టహాసంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అకేపాటి అమరనాథరెడ్డి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించిన అమరనాథరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తిరుపతి కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు సూళ్లూరుపేట రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య హాజరైన ఎన్డీసిసిబి బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి, కలికి మాధవరెడ్డి ఎన్టీఆర్ జిల్లా నామినేషన్ సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ పూనూరు గౌతమ్ రెడ్డి తూర్పుగోదావరి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు కొవ్వూరులో ఆర్డిఓ ఆఫీస్ వద్ద 10 వేలమంది పార్టీ కార్యకర్తలు అభిమానులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు నెల్లూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కర్నూలు జిల్లా నామినేషన్ వేసిన బుట్ట రేణుక ఎమ్మిగనూరులో పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్ట రేణుక పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, వీరశైవ లింగాయత్ కార్పోరేషన్ చైర్మన్ రుద్ర గౌడ్ వైఎస్సార్ జిల్లా నామినేషన్ వేసిన రఘురామి రెడ్డి మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామి రెడ్డి పాల్గొన్న వైఎస్ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు భూమన అభినయ్ రెడ్డి నామినేషన్ దాఖలు తిరుపతి నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వెంట మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యుడు వెంకటేష్ తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన ఎం.సీ విజయనందరెడ్డి చిత్తూరులో అటహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం సి విజయనందరెడ్డి పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీ రెడ్డప్ప, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్ రెడ్డి తదితరులు నామినేషన్ దాఖలు చేసిన కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్సార్సీపీ తరుఫున కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక శ్రీశైలం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చక్రపాణిరెడ్డి ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న బుట్టా రేణుక మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న లోకేష్ చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న విజయానందరెడ్డి దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న శివ ప్రసాద్‌రెడ్డి నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ నేటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం నేడు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు. అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్‌గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేశారు. ఫారం–26 తప్పనిసరి.. ఇక నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్ సింబల్ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. నామినేషన్ రుసుం ఇలా.. పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నామినేషన్‌తో పాటు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది. నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్ నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి. ముఖ్యమైన తేదీలు నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్ 25 గురువారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18 గురువారం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 సోమవారం పోలింగ్ తేదీ మే 13 సోమవారం ఓట్ల లెక్కింపు జూన్ 4 మంగళవారం ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్ 6 గురువారం -
నేటి నుంచి నామినేషన్ల పర్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో అప్పటి నుంచే అంటే ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు. అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్‌గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేశారు. ఫారం–26 తప్పనిసరి.. ఇక నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్ సింబల్ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. నామినేషన్ రుసుం ఇలా.. పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నామినేషన్‌తో పాటు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది. నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్ నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి. ముఖ్యమైన తేదీలు నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్ 25 గురువారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18 గురువారం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 సోమవారం పోలింగ్ తేదీ మే 13 సోమవారం ఓట్ల లెక్కింపు జూన్ 4 మంగళవారం ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్ 6 గురువారం -
Telangana: రేపటి నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు..
సాక్షి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో గురువారం కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నోటిషికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ విడతలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఘట్టం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. రాష్ట్ర బీజేపీ నేతల నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరుకానున్నారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ తేదీల వివరాలు 18న మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ మెదక్ రఘునందన్ రావు నామినేషన్‌కు హజరు కానున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్ మల్కాజ్ గిరి ఈటెల రాజేందర్ నామినేషన్‌కు హాజరు కానున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మహబూబ్ నగర్ డికే అరుణ నామినేషన్‌కు పీయూష్ గోయల్ 19న సికింద్రాబాద్, ఖమ్మం బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్‌కు హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబ్ బాద్ బీజేపీ నేతల నామినేషన్లు జహీరాబాద్ బీబీ పాటిల్ నామినేషన్‌కు దేవేంద్ర ఫడ్నవీస్ చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ సైది రెడ్డి నామినేషన్‌కు పియుష్ గోయల్ మహబూబాబాద్ సీతారాం నాయక్ నామినేషన్‌కు కిరణ్ రిజిజు 23న భువనగిరి, 24 న పెద్దపల్లి, అదిలాబాద్ ,హైదారాబాద్, వరంగల్ అభ్యర్ధుల నామినేషన్లు పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్ అదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి హైదారాబాద్ మాధవి లత నామినేషన్‌కు అనురాగ్ సింగ్ ఠాకూర్, వరంగల్ అరూర్ రమేష్ నామినేషన్‌కు అశ్వినీ వైష్ణవ్ 25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్ కరీంనగర్ బండి సంజయ్, నాగర్ కర్నూల్ భరత్ నామినేషన్‌కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డిలు. నిజామాబాద్ అరవింద్ నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్‌లు హాజరుకానున్నారు. -
మంచి ముహూర్తానికి..!
సాక్షి, విశాఖపట్నం : నామినేషన్ల హడావుడి గురువారం నుంచి ప్రారంభమకానుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల సమర్పణకు అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ మధ్య కాలంలో ఏరోజు ముహూర్తం బాగుందో తెలుసుకుని, ఆరోజు నామినేషన్లు వేయాలని చాలామంది అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకులు మంచి ముహూర్తాల కోసం పండితులు, సిద్ధాంతులను ఆశ్రయిస్తున్నారు. ఆయా అభ్యర్థుల జాతక చక్రాలు, నామ/జన్మ నక్షత్రాలకు అనుగుణంగా వీరు ముహూర్తాలను నిర్ణయిస్తున్నారు. పంచాంగం ప్రకారం చూస్తే ఈనెల 18, 19, 22, 23, 24 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు చాలావరకు ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల జాతకంలో రవి గ్రహం, రవి, కుజ, శని గ్రహాలు బలంగా ఉంటే విజయావకాశాలు మెండుగా ఉంటాయని చెబుతారు. అందువల్ల అలాంటి ముహూర్తాలు ఏ సమయంలో ఉన్నాయో పరిశీలించి నిర్ణయం జరుగుతుందని విశాఖకు చెందిన స్మార్త పురోహితుడు చేబియ్యం రవిశర్మ ‘సాక్షి’కి చెప్పారు. కొంతమంది అభ్యర్థులు మంచి ముహూర్తాలకు, మరికొందరు సెంటిమెంటుతో పాటు వారాలకు ప్రాధాన్యతనిస్తారని అందుకనుగుణంగా శుభగడియలను పడికట్టి ముహూర్తాలను నిర్ణయిస్తామని కేవీకే శాస్త్రి అనే మరో పురోహితుడు తెలిపారు. -
మహాకూటమి అభ్యర్థుల నామినేషన్లు
సోలాపూర్: మహాకూటమి అభ్యర్థులు రామ్ సాత్ పూతే, రంజిత్ సింహ నింబాల్కర్ మంగళవారం సోలాపూర్, మాడా లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు ముందుగా ధర్మవీర్ చత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్‌కు ఇరువురు అభ్యర్ధులు ఘన నివాళులర్పించారు. అనంతరం ఛత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్ చౌక్ నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలిరాగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో సోలాపూర్ అభ్యర్థిగా రామ్ సాత్ పూతే మాడా అభ్యరి్థగా రంజిత్ సింహ నింబాల్కర్ సోలాపూర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల నిర్వహణాధికారి కుమార్ ఆశీర్వాద్‌కు నామినేషన్లను సమర్పించారు. ఈ ర్యాలీలో ఎంపీ జై సిద్దేశ్వర స్వామి, ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, సచిన్ కళ్యాణ్ శెట్టి, సుభాష్ దేశముఖ్, యశ్వంత్ మానే, సమాధాన్ అవతాడే, భవన్ రావు షిండే, సంజయ్ షిండే, జై కుమార్ గోరే, షాహాజీ పాటిల్, మాజీ మంత్రి లక్ష్మణరావు డోబలే, మాజీ ఎమ్మెల్యే రాజన్ పాటిల్, ప్రశాంత్ పరిచారక్, దీపక్ బాబా సాలోంకే, కిషోర్ దేశ్ పాండే, విక్రం దేశముఖ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నరేంద్ర కాలే, జిల్లా అధ్యక్షుడు చేతన సింహ కేదార్, షాజీపవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ, శివసేనలతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల ఆఫీస్ బేరర్లు, ప్రతినిధులు, కార్యకర్తలు తమ పార్టీల జెండాలను చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. నాయకులందరూ ప్రత్యేక ప్రచార రథంలో నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలగా వేలాది మంది కార్యకర్తలు నినాదాలు చేస్తూ వారిని అనుసరించారు. ర్యాలీ చత్రపతి శ్రీ శంభాజీ మహరాజ్ చౌక్ నుంచి ప్రారంభమై చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చౌక్, సరస్వతి చౌక్, చారు హుతాత్మ పూతల చౌక్‌కు చేరుకున్న అనంతరం శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి అలాగే అక్కడ ఉన్న నలుగురు అమర వీరుల విగ్రహాలకు, అహల్యా దేవి హోల్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు నాయకులంతా అంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసంగిస్తూ ...ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా మార్గదర్శనం చేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి వల్ల బీజేపీ ఈ రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ధైర్య శీల మోహితే పాటిల్ కూడా... మరోవైపు మాడా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ పవార్ పార్టీ తరపున ధైర్య శీల మోహితే పాటిల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మాడా నియోజకవర్గం ఎన్నికల అధికారి మోనికా సింహ ఠాకూర్‌కు నామినేషన్‌ను సమర్పించారు. పాటిల్ రెండు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసి ఎన్సీపీ పవార్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సింహ మోహితే పాటిల్ డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ధైర్యశీల్ మోహితే పాటిల్ సతీమణి శీతల్ దేవి, సోదరుడు జయసింహ మోహితే పాటిల్ , మాజీ ఎమ్మెల్యే నారాయణ పాటిల్, పవార్ ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు బలిరాం కాకాసాటే, సురేష్ అసాపురే, శివసేనకు చెందిన అనిల్ కోకిల్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ నామినేషన్ డేట్...
-
Pulivendula : ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్
సాక్షి, విజయవాడ: ఏప్రిల్ 25, గురువారం.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేయబోయే రోజు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం నామినేషన్‌కు ముహూర్తాన్ని ఖరారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ నెల 25, గురువారం రోజున పులివెందులలో సీఎం జగన్ స్వయంగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఏప్రిల్ 24న శ్రీకాకుళంలో బస్సుయాత్ర ముగించుకొని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు సీఎం. అదే విధంగా ఈ నెల 22న సీఎం జగన్ తరుపున వైఎస్ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సతీశ్ కుమార్ రెడ్డిపై 90 వేల 110 ఓట్ల మెజారిటీతో వైఎస్ జగన్ గెలుపొందారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టి 15 ఏళ్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 15 ఏళ్లు దాటుతోంది. 2009లో కడప లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత ఓదార్పు యాత్రతో జనంలోకి వెళ్లిన వైఎస్ జగన్.. ఆ యాత్రను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి, లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2011లో కడప ఎంపీ స్థానానికి జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్ ఏకంగా 5 లక్షల 45వేల 672 ఓట్ల తేడాతో గెలిచి రికార్డులు బద్దలు కొట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్, 75వేల 243 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2019లోనూ పులివెందుల నుంచే పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 90 వేల 110 ఓట్ల మెజార్టీతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించే అవకాశం ఉంది. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. -
నామినేషన్లలోనే సగం మంది అవుట్!
నోయిడా: లోక్‌సభ ఎన్నికల రెండో దశ నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఉత్తర ప్రదేశ్‌లోని రెండు స్థానాల్లో దాఖలైన నామినేషన్లలో సగానికి పైగా తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్‌లో 60 శాతం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా)లో దాదాపు 56 శాతం మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు స్థానిక ఎన్నికల అధికారులు తెలిపారు. ఘజియాబాద్‌లో 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 14 మంది అభ్యర్థుల దరఖాస్తులు ఆమోదించినట్లు జిల్లా ఎన్నికల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పక్కనే ఉన్న గౌతంబుద్ధ్ నగర్లో 34 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చాయని, వారిలో 15 మంది అభ్యర్థులు చెల్లుబాటయ్యారని పేర్కొంది. రెండు నియోజకవర్గాల్లో కలిపి 69 నామినేషన్లు రాగా అందులో 40 తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్‌లో నామినేషన్ల తిరస్కరణ 60 శాతం కాగా, గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో 55.89 శాతంగా నమోదైంది. అధికారిక జాబితా ప్రకారం.. ఘజియాబాద్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రెండు స్థానాల్లోనూ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8 కాగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. -
రాహుల్ గాంధీ కోటీశ్వరుడేనా?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన అదే స్థానం నుంచి ఈసారి లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం... ఆయన వద్ద స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు రూ.3.81 కోట్లు, బ్యాంకు ఖాతాలో రూ.26.25 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం తన వద్ద రూ. 55,000 నగదు ఉందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1,02,78,680 ఆర్జించినట్లు పేర్కన్నారు. #Congress leader Rahul Gandhi's Asset and Liability!!👇👇 Assets worth 20,29,52,000. Liability- 49,70,000. Also Invested in Stocks-Mutual Fund and Gold Bond.#stockmarkets #stockmarkets #RahulGandhi #BJP #NarendraModi pic.twitter.com/tx6eCcrWrf — House of Stocks~NISM certified (@CommonInsan) April 4, 2024 రాహుల్ గాంధీ వద్ద రూ.15.2 లక్షల విలువైన బంగారు బాండ్లు కూడా ఉన్నాయి. అలాగే జాతీయ పొదుపు పథకాలు, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో రూ. 61.52 లక్షల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. ఇక ఆయన దగ్గరున్న ఆభరణాల విలువ రూ.4.2 లక్షలు. రాహుల్ గాంధీ చరాస్తుల మొత్తం విలువ రూ.9.24 కోట్లు కాగా, స్థిరాస్తుల మొత్తం విలువ దాదాపు రూ.11.14 కోట్లు. ఆయన నామినేషన్‌తోపాటు అందించిన వివరాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగా ఉంది. అదే సమయంలో సుమారు రూ.49.7 లక్షల అప్పు కూడా ఉంది. -
లోక్‌సభ ఎన్నికలు: నేడే తొలి దశ నామినేషన్లకు చివరి తేదీ
ఢిల్లీ:సార్వత్రిక ఎన్నికల మొదటి దశ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ నేడు(బుధవారం)తో ముగియనుంది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరగనుంది. అదే విధంగా మార్చి 30న నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. ఇక.. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికలను ఎన్నికలు సంఘం మొత్తం ఏడు విడతల్లో నిర్వహించనుంది. మొదటి దశలో 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తమిళనాడులో ఒకే దశలో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్‌లోని 15 అసెంబ్లీ స్థానాలకు కూడా మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలను మొత్తం 21 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఒకే దశలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. జూన్ నాలుగో తేదీన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
నేటితో ముగియనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు
-
రేపటితో ముగియనున్న రాజ్యసభ సభ్యుల ఎన్నికల నామినేషన్ గడువు
-
రాజ్యసభ సభ్యత్వానికి.. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు
సాక్షి, అమరావతి : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు సోమవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎం. విజయరాజుకి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి, ఉప కార్యదర్శి వనితారాణి, అభ్యర్థుల తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్పీపీ నేత వి. విజయసాయిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 3 స్థానాల్లో విజయం సాధిస్తాం: వైవీ శాసనసభలో అత్యధిక సంఖ్యా బలం మాకే ఉంది. వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురం విజయం సాధిస్తాం. సీఎం వైఎస్ జగన్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో మాకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్‌కి ధన్యవాదాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు. గతంలో బీసీలు నలుగురికి అవకాశం కల్పించగా.. తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశమిచ్చారు. చరిత్రలో ఎప్పుడులేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని పార్లమెంట్ మెట్లు ఎక్కిస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్న, సంక్షేమ–అభివృద్ధి పథకాలు అందాలన్నా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలి. వైఎస్సార్సీపీ ఆశయ సాధనకు పనిచేస్తాం : మేడా రఘునాథరెడ్డి అన్నా.. నువ్వు పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టి ముఖ్యమంత్రి జగన్ నాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి త్వం కేటాయించారు. వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ని. నేను దేశవ్యాప్తంగా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ, ఇలాంటి మనస్సున్న సీఎంను ఎక్కడా చూడలేదు. ఒకరికి మేలుచేసే విషయంలోనూ, గౌరవించే విషయంలోను ముఖ్యమంత్రి జగన్ తర్వాతే ఎవరైనా. ఎంతో పోటీ ఉన్నా నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి పిలిచి మరీ నాకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా, వైఎస్సార్సీపీ ఆశయాల సాధనకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మేడా సోదరులం కలిసి పనిచేస్తాం. పేదలను జగన్ రాజ్యసభకు పంపిస్తున్నారు: గొల్ల బాబురావు అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు నడుస్తున్న రోజులివి. ఈ కాలంలో మానవీయాన్ని ఒంటినిండా నింపుకున్న ఏకైక రాజకీయ నేతగా ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే కన్పింస్తారు. కష్టకాలంలో సీఎం జగన్ వెంట నడిచాను. ఎవరు మన వారు.. ఎవరు పరాయి వారు అనేది ఆయనకు తెలుసు. నమ్మిన వారిని గుండెల్లో పెట్టుకునే కుటుంబం వైఎస్సార్‌ది. చంద్రబాబు పార్టీలో దళితులకు రాజ్యసభ సీటు అందని ద్రాక్షే. అదే ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి పదవులైనా అన్ని వర్గాలకు సమంగా పంచుతారు. పేద వర్గాలను ఆయన రాజ్యసభకి పంపిస్తున్నారు. వైఎస్సార్ కుటుంబ రుణం తీర్చుకోలేనిది. సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు మేమే దక్కించుకుంటాం. బీ–ఫారాలు అందజేసిన సీఎం జగన్ సీఎం జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వారికి సీఎం జగన్మోహన్రెడ్డి బీ–ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
జయా బచ్చన్‌కు మరోమారు రాజ్యసభ?
రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో యూపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఈరోజు (సోమవారం) ప్రకటించే అవకాశాలున్నాయి. మీడియాకు తెలిసిన వివరాలప్రకారం సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ) మరోమారు జయ బచ్చన్‌ను రాజ్యసభకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరో ఇద్దరి పేర్లను ఈరోజు వెల్లడించనున్నారు. సమాజ్‌వాదీపార్టీ కార్యాలయంలో జరిగే ఎమ్మెల్యేల సమావేశంలో రాజ్యసభకు పంపే అభ్యర్థులను నిర్ణయించడంతో పాటు ఏ అభ్యర్థికి ఓటు వేయాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసేందుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. -
ఆస్కార్ బరిలో మన డాక్యుమెంటరీ
జార్ఖండ్‌లో తన పదమూడేళ్ల కుమార్తెపై ముగ్గురు కుర్రాళ్లు దారుణంగా లైంగిక దాడి చేశారు. ఆమెను చంపడానికి చూశారు. ఆ అమ్మాయి కుంగిపోయింది. కాని తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలనుకుంది. నిరుపేద గ్రామీణ తండ్రి అందుకు సిద్ధమయ్యాడు. ఊరు ఊరంతా వారికి వ్యతిరేకమైనా ఆ తండ్రీ కూతుళ్లు న్యాయం కోసం పోరాడారు. ‘బాధితులు పోరాడాల్సిందే’ననే పిలుపునిస్తూ ఈ ఉదంతాన్ని ‘టు కిల్ ఏ టైగర్’ పేరుతో డాక్యుమెంటరీగా తీసింది నిషా పహూజా. 2024 సంవత్సరానికి ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది ‘టు కిల్ ఏ టైగర్’. ‘ఈసారి ఇటువైపు వస్తే నిన్ను చంపినా చంపుతాం’ అని నిషా పహూజాతో జార్ఖండ్‌లోని ఆ గ్రామస్తులు అన్నారు. ఆరేళ్ల క్రితం జార్ఖండ్‌లోని ఒక గ్రామంలో 13 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆ ఘటన తర్వాత అమ్మాయి, అమ్మాయి తండ్రి న్యాయ పోరాటానికి సంకల్పించారు. అక్కడి నుంచి ఆ గ్రామవాసులు తండ్రీ కూతుళ్లపై ఎలాంటి వొత్తిడి తెచ్చారు, అయినా సరే న్యాయం కోసం ఆ తండ్రీకూతుళ్లు ఎలా నిలబడ్డారు అని తెలిపే సంక్షిప్త చిత్రమే నిషా పహూజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ. గత సంవత్సరం మన దేశం నుంచి ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది. రేపు మార్చి 10, 2024న జరగనున్న ఆస్కార్ వేడుకలో ‘టు కిల్ ఏ టైగర్’ కూడా గెలిస్తే అది చాలా పెద్ద విశేషమే అవుతుంది. బాధితులు పోరాడాల్సిందే ‘భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ నమోదు అవుతోంది. నమోదు కానివి ఎన్ని ఉన్నాయో లెక్క తెలియదు. నేరం నమోదు అయ్యాక కూడా కేవలం 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. లైంగిక దాడులను ఎదుర్కొన్నవారు న్యాయం కోసం పోరాడినప్పుడే పెత్తందారీ స్వభావ ప్రతిఫలాలైన లైంగికదాడులు తగ్గుతాయి’ అంటుంది నిషా పహూజా. చత్తీస్‌గఢ్‌లోని 13 ఏళ్ల అమ్మాయి (ఇప్పుడు 19 సంవత్సరాలు) న్యాయ పోరాటాన్ని నిషా 2022లో డాక్యుమెంటరీగా తీసింది. అత్యాచార ఘటన జరిగిందని గ్రామస్తులు అంగీకరించినా తమ ఊరి కుర్రాళ్లపై కేసు నడవడం ఇష్టపడటం లేదు. అంతేకాదు ఇలా తమ ఊరు పరువు బజారున పడటం కూడా ఇష్టపడటం లేదు. దాంతో డాక్యుమెంటరీ యూనిట్‌ని బెదిరించారు. బాలికపై జరిగిన అత్యాచారాన్ని ‘అదో ఆకతాయి చర్య’ అని కొందరు అంటే ‘ఆ ముగ్గురిలో ఎవరో ఒక కుర్రాణ్ణి అమ్మాయి పెళ్లి చేసుకుంటే సరి’ అని మరికొందరు భావిస్తున్నారు. కాని బాధితురాలు మాత్రం ‘చితికిపోయిన నా కలలను ఎవరు తిరిగి తెచ్చిస్తారు’ అని ప్రశ్నిస్తోంది. స్త్రీ సమస్యలే ఆమె ఇతివృత్తాలు 55 ఏళ్ల నిషా పహూజా తన నాలుగేళ్ల వయసులో ఢిల్లీ నుంచి కెనడా వలస వెళ్లింది. అక్కడే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఆంగ్ల సాహిత్యం చదివింది. సీబీసీ (కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్)లో రీసెర్చర్‌గా పని చేసి జాన్ వాకర్, అలీ కజిమి వంటి కెనడియన్ ఫిల్మ్ మేకర్స్ వద్ద డాక్యుమెంటరీ నిర్మాణ మెళకువలు గ్రహించింది. ఆపై తనే సొంతంగా డాక్యుమెంటరీలు తీయడం మొదలు పెట్టింది. భారతదేశంతో సంబంధాలు తెంచుకోకుండా తరచూ వచ్చి వెళ్లే నిషా ఇక్కడి స్త్రీల సమస్యలకే ఎక్కువ డాక్యుమెంటరీ రూపం ఇచ్చింది. 2002లో ‘బాలీవుడ్ బౌండ్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. నలుగురు భారతీయ కెనడియన్ వ్యక్తులు ముంబై మహానగరానికి వచ్చి బాలీవుడ్లో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకున్నారనేది అందులో మూలాంశం. 2012లో నిషా తీసిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. మిస్ ఇండియా కావాలని కలలు కనే భారతీయ యువతుల సంఘర్షణాయుతమైన తతంగాన్ని చూపుతూ ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాల్లో ‘ఔట్‌స్టాండింగ్ కవరేజ్ ఆఫ్ ఎ కరెంట్ న్యూస్ స్టోరీ’ విభాగంలో పురస్కారం అందుకుంది. 2022లో నిషా తీసిన డాక్యుమెంటరీయే ‘టు కిల్ ఎ టైగర్’. 90 నిమిషాల ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కెనడా టాప్–10 చిత్రంగా నిలిచింది. అనంతరం వివిధ వేదికలపై 19 పురస్కారాలు కైవసం చేసుకుంది. ఆస్కార్ గెలుచుకుంటే అదో విశిష్ట పురస్కారం అవుతుంది. -
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. ఈ ఏడాది బరిలో నిలిచిన చిత్రాలివే!
గతేడాదిలో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు మన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల వేడుకకు సమయం ఆసన్నమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాగే లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. మార్చి 10, 2024న ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేట్ అయిన చిత్రాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఆస్కార్ అకాడమీ.. బరిలో నిలిచిన చిత్రాల జాబితాను వెల్లడించింది. 2024 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఈ ఏడాది కూడా వరుసగా నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ఇండియా నుంచి ఆస్కార్ పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. 2024లో వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే! ►ఉత్తమ చిత్రం విభాగం అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ఒప్పైన్ హైమర్ పాస్ట్ లైవ్స్ పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ►ఉత్తమ దర్శకుడి విభాగం అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్స్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ►ఉత్తమ నటుడు విభాగం బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ►ఉత్తమ నటి విభాగం అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్ ►ఉత్తమ సహాయ నటుడు స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్ రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్ రేయాన్ గాస్లింగ్: బార్బీ మార్క్ రఫెలో: పూర్ థింగ్స్ ► ఉత్తమ సహాయ నటి ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్ డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్ అమెరికా ఫెర్రారా: బార్బీ జోడీ ఫాస్టర్: నయాడ్ డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్ ►బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్ మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్ మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్ పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్ ►బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ది ఫైర్ ఇన్సైడ్: ఫ్లామిన్ హాట్ ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ ఇట్నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ ►బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అమెరికన్ ఫిక్షన్ ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ కిల్లర్స్ ఆఫ్‌ది ఫ్లవర్ మూన్ ఒప్పైన్ హైమర్ పూర్ థింగ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్ ది ఇటర్నల్మెమెరీ ఫోర్ డాటర్స్ టు కిల్ ఏ టైగర్ 20 డేస్ ఇన్ మరియా పోల్ ►బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ ది ఏబీసీస్ఆఫ్ బుక్ బ్యానింగ్ ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్ ఐలాండ్ ఇన్ బిట్విన్ ది లాస్ట్ రిపేష్ షాప్ నైనాయ్ అండ్ వైపో ►బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఇయల్కాపిటానో (ఇటలీ పర్ఫెక్ట్ డేస్ (జపాన్) సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్) ది టీచర్స్ లాంజ్ (జర్మనీ) ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ( యూకే) ► బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్సన్ బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: టోనీ మెక్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్ ►బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్ ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: తెల్మా స్కూన్మేకర్ ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్ పూర్ థింగ్స్: యోర్గోస్ ►బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ బార్బీ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ నెపోలియన్ ఓపెన్‌హైమర్ పూర్ థింగ్స్ ►బెస్ట్ సౌండ్ ది క్రియేటర్ మ్యాస్ట్రో మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 ఒప్పైన్ హైమర్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ► ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ది క్రియేటర్ గాడ్జిల్లా మైనస్ వన్ గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్3 మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 నెపోలియన్ ►బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎల్కాండే : ఎడ్వర్డ్ లచ్మెన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా పూర్ థింగ్స్: రాబిన్ రియాన్ ► బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ జాక్వెలిన్ దురన్: బార్బీ జాక్వెలిన్ వెస్ట్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ జాంటీ ఏట్స్, డేవ్ క్రాస్‌మన్: నెపోలియన్ ఎలెన్ మిరాజ్నిక్: ఒప్పెన్ హైమర్ హాలీ వాడింగ్టన్: పూర్ థింగ్స్ ► బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ గోల్డా మాస్ట్రో ఓపెన్‌హైమర్ పూర్ థింగ్స్ సొసైటీ ఆఫ్ ది స్నో ► బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ది ఆఫ్టర్ ఇన్విన్సిబుల్ నైట్ ఆఫ్ ఫార్చ్యూన్ రెడ్, వైట్ అండ్ బ్లూ ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్ ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ లెటర్ టు ఎ పిగ్ నైంటీ- ఫైవ్ సెన్సెస్ అవర్ యూనిఫామ్ ప్యాచిడమ్ వార్ ఈజ్ ఓవర్! -
ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, మహేశ్ గౌడ్ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 11న వెలువడింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కాగా కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజర య్యారు. వీరితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నిక ఏకగ్రీవమే రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 119 ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో సీపీఐతో కలుపుకుని కాంగ్రెస్‌కు 65 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలు కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక పక్రియకు దూరంగా ఉంది. దీంతో కాంగ్రెస్ తరపున ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. నామినేషన్ల అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందనేందుకు ఈ ఇద్దరు నాయకులను శాసన మండలికి పంపడమే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కు నేడే చివరిరోజు
-
ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. నామినేషన్ తిరస్కరణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2024లో జరగబోయే పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించింది. ఈ మేరకు ఆయన నామినేషన్ పాకిస్తాన్ ఎన్నికల సంఘం తిరస్కరించిందని ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ స్వస్థలమైన మియాన్వాలి నుంచి ఆయన పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక ఆయన అధికార రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన న్యాయస్థానంలో దోషిగా నిర్ధారించబడినందుకే నామినేషన్‌ను తిరస్కరించామని ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకస్తాన్ లెక్కల ప్రకారం.. 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 28, 626 మంది తమ నామినేషన్లను దాఖలు చేసిట్లు పేర్కొంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో జైల్లో ఉన్నాడని.. పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి జైలు నుంచి బయటకు రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పీటీఐ పార్టీ వర్గాలు చర్చించుకోవటం గమనార్హం. కాగా.. సాధరాణ ఎన్నికల సమయంలో తనను జైలులోనే ఉంచడానికి తనపై తప్పుడు, రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టారని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. చదవండి: ఇజ్రాయెల్ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి -
నేను మోసపోయానంటూ రైతుబిడ్డ ఫైర్.. కప్పు ఇచ్చేయండన్న అమర్!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో చివరిదశకు చేరుకుంది. మరో వారంలో గ్రాండ్ ఫినాలేకు తెరలేవనుంది. గతవారం గౌతమ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఇంకా ఏడుగురు ఉన్నారు. వారిలో ఇప్పటికే అర్జున్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించాడు. ఇక మరోవారం మొదలైందంటే నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. హౌస్‌లో ఒకరిపై ఒకరు కారణాలు చెబుతూ నామినేట్ చేసే సమయంలో జరిగే తంతు మామూలుగా ఉండదు. అసలే ఈ వారం నుంచి టగ్ ఆఫ్ వార్ అన్న రీతిలో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. బిగ్‌బాస్ సీజన్-7 ఇవాల్టి ఎపిసోడ్ల నామినేషన్స్ ప్రక్రియలో విమర్శలు వేరే లెవల్‌కు చేరుకున్నాయి. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రశాంత్‌ను అమర్దీప్ నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడించింది. నువ్వు నన్ను రా అనొద్దంటూ వాదించగా.. నా తమ్ముడిని రా అనే అంటానురా.. పలికితే పలుకు.. లేదంటే పో అంటూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత అర్జున్.. అమర్, యావర్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత హౌస్‌లో సేఫ్ ప్లేయర్ ఎవరంటే.. ఒక్క పల్లవి ప్రశాంతే అంటూ శోభా శెట్టి నామినేట్ చేసింది. ఆ తర్వాత శివాజీ, ప్రియాంకల చిన్నపాటి వార్ నడిచింది. ఫ్రెండ్షిప్ విషయాకొనిస్తే త్యాగం చేసే వాళ్లు కావాలని శివాజీ అనగా.. ప్రియాంక ఏదో అనడంతో.. నువ్వు ఓవర్ స్మార్ట్ ఇక్కడ చేయొద్దమ్మ అంటూ చురకలంటించాడు. దీనికి ఐయామ్ నాట్ ఓవర్ స్మార్ట్ అంటూ ప్రియాంక సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ మధ్యే పెద్ద వార్ నడిచింది. అమర్ అన్న ఫస్ట్ నుంచి నా మీద నెగెటివ్‌గానే ఉన్నాడు అనడంతో మధ్యలో శోభా ఎంటరైంది. మాట అంటే మాటే.. తగ్గేదేలే.. ప్రాణమైనా ఇస్తాడు అని లోపలికి వెళ్లి దాచి కూర్చోలే అని శోభా అనడంతో.. ఇది నిజ స్వరూపం.. అందరినీ మోసం చేసే గుణం నీది అంటూ ప్రశాంత్ రెచ్చిపోయాడు. దీంతో టాపిక్ డైవర్ట్ చేసి తవ్వుకోద్దంటూ అని అమర్ అన్నాడు. దీనికి ప్రశాంత్ బరాబర్ తవ్వుతా.. తగ్గదేలే అన్నాడు. దీంతో ఆగరా.. నువ్వు..నీ అబద్ధాలు అంటూ అమర్ ఫైరయ్యాడు. ఎదుటివాళ్లను మోసం చేసుడు నీగుణం.. మోసపోయింది నువ్వు కాదు.. నేను అంటూ ప్రశాంత్ మరింత రెచ్చిపోయాడు. ఆ తర్వాత నన్ను బయటకు పంపించేయండి.. వాడికి కప్పు ఇచ్చేయండి.. మీరందరూ హ్యాపీగా ఉండండి.. వాడు హ్యాపీగా ఉంటాడు అని అమర్ అనడంతో ప్రోమో ముగిసింది. మొత్తానికి ప్రోమో చూస్తే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హీటెక్కినట్లు తెలుస్తోంది. ఎవరు ఎవరినీ నామినేట్ చేశారో పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. -
'మీ దోస్తాన్ మళ్లీ స్టార్ట్ చేసిర్రు'.. నా కళ్లు తెరుచుకున్నాయన్న రైతు బిడ్డ!
బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 మరో వారం ముగిసింది. గతవారం ఎవరిని ఎలిమినేట్ చేయని బిగ్‌బాస్.. ఈ సారి ఏకంగా ఇద్దరిని ఇంటికి పంపించేశాడు. ఇప్పటివరకు హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ ముగియడంతో మళ్లీ నామినేషన్స్ పర్వం మొదలైంది. ఇప్పటి నుంచి టాప్-5 లో నిలిచేందుకు టఫ్ ఫైట్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియలో వాదనలు వేరే లెవెల్లో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. ప్రోమో ప్రారంభంలోనే యావర్‌ను నామినేట్ చేస్తూ శోభాశెట్టి.. గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అంటూ చెప్పింది. దీనికి నువ్వు చూశావా అని యావర్ అడగడంతో.. నేను చూడలేదంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్‌ను అమర్ నామినేట్ చేశాడు. దీంతో రైతు బిడ్డ ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. దీంతో అమర్.. పోరా కూర్చోపో.. ఎలిమినేట్ చేయను పో అన్నాడు. దీనికి అన్నా నిన్ను నమ్మినందుకు నేను బాధపడతున్నా అంటూ ప్రశాంత్ మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వతా శివాజీని నామినేట్ చేస్తూ మధ్యలో ప్రశాంత్ టాపిక్ తీసుకొచ్చాడు గౌతమ్. నేను ఎప్పుడైనా యావర్, ప్రశాంత్‌కు సపోర్ట్ చేశానా? అని గౌతమ్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత గౌతమ్‌ను అమర్ నామినేట్ చేశాడు. నాకు సపోర్ట్ చేస్తా అని మోసం చేశావ్ అన్నాడు. మధ్యలో శివాజీ ఎంటరయ్యాడు. వాంటెడ్‌గా చేస్తుంటే జనాలేమైనా పిచ్చోళ్లా ఇక్కడ ఉంచడానికి అని గౌతమ్ ఫైరయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ను శోభా నామినేట్ చేస్తూ.. నువ్వు చాలా సేఫ్‌గా ఆడావు.. నీవల్లే అమర్ కెప్టెన్సీ పోయిందంటూ నామినేట్ చేసింది. దీనికి ఆశ్చర్యపోయిన ప్రశాంత్ అన్నా.. నా వల్లే కెప్టెన్సీ పోయిందా? అని అమర్‌ను అడిగాడు. దీనికి ప్రశాంత్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయింది శోభా. దీనికి మీరు మళ్లీ దోస్తాన్ స్టార్ట్ చేసిర్రు.. నా కళ్లు ఇప్పడే తెరుచుకున్నాయి అన్నాడు ప్రశాంత్. దీనికి శోభా.. అవును బరాబర్ ఆ రోజు సేఫ్ గేమ్ ఆడింది పల్లవి ప్రశాంత్ అంటూ గట్టిగానే వాదించింది. దీంతో ప్రోమో ముగిసింది. ఎవరు, ఎవరినీ నామినేట్ చేశారనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
చిట్టా విప్పాల్సిందే..! లేదంటే న్యాయపరమైన చిక్కులు!
సాక్షి, మెదక్: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమపై ఉన్న కేసుల చిట్టాను బయట పెట్టాల్సిందే.. ఎవరిపై ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎన్ని కేసులు ఉన్నాయి? అనే విషయాలు ప్రజలకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే. దాని కోసం అభ్యర్థులు కూడా సిద్ధమయ్యారు. నామినేషన్లు వేసిన సమయంలో తమ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని ప్రముఖ దినపత్రికల్లో ప్రకటిస్తున్నారు. పారదర్శకంగా వ్యవహరించాలి.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి నేరచరిత్ర ఉన్నా బయట పెట్టాలన్న సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అభ్యర్థులు తమపై ఉన్న కేసులను బయట పెడుతున్నారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ నియోజకవర్గం బరిలో 13 మంది అభ్యర్థులు ఉండగా, నర్సాపూర్ బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాలి. రాజకీయంగా పారదర్శకత పాటించే ఏ నాయకుడికీ ఈ ప్రకటనలు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రాజకీయ నాయకుడు అన్నాక కేసులు ఉండడం సర్వసాధారణమే. ప్రజా సమస్యల పోరాటంలో భాగంగా.. ఏదో ఒక సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసే సమయంలో కేసులు నమోదవుతుంటాయి. తెలంగాణ ఉద్యమంలో దాదాపు అన్ని పార్టీల నాయకులపైనా కేసులు నమోదయ్యాయి. అందులో చాలా వరకు కొట్టివేయగా.. ఇంకొన్ని విచారణ దశలో ఉన్నాయి. రాజకీయ జీవితం మొదలు కాకముందు, రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత కారణాలతో నమోదైన క్రిమినల్ కేసులు కొందరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ముగ్గురు అందజేత.. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు పత్రికా ప్రకటనల ద్వారా కేసుల వివరాలు వెల్లడించారు. తర్వాత ఆ పేపర్ కటింగ్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఒకవేళ సదరు అభ్యర్థులపై కేసులు ఉండి పత్రికల ద్వారా వెల్లడించకపోతే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసుల్లో ప్రజాసమస్యలపై పోరాటాలు చేసిన వారికి ఇది కలిసొచ్చే అంశం కాగా, ఉద్దేశపూర్వక నేరచరిత్రులకు మాత్రం ఇబ్బంది కలిగే అంశమని అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: వస్తారా.. రారా..? -
ఆర్వోల నిర్ణయమే అంతిమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల పరి శీలనలో రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లు తీసుకున్న నిర్ణయాలే అంతిమమని, వాటిపై పునః సమీక్ష జరిపే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం లేదని రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధాన అధికారి (డిప్యూటీ సీఈఓ) సత్యవాణి స్పష్టం చేశారు. కొందరు అభ్యర్థుల విషయంలో ఆర్వోల నిర్ణయాలపై వచ్చిన ఫిర్యాదులను తిరిగి వారికే పంపించినట్టు తెలిపారు. ఆర్వోలకు క్వాజీ జ్యుడీషియల్ అధికారాలుంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను వివరించేందుకు శుక్రవారం ఆమె బీఆర్కేఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 18లోగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, 20 లోగా ఈవీఎంల బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి చేస్తామన్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం 299 అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతినిచ్చిందని, దీంతో రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655కి పెరిగిందని చెప్పారు. ప్రతి జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దే ఈవీఎంలను నిల్వ చేసే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయని తెలిపారు. పోలింగ్‌లో వినియోగించిన ఈవీఎంలను కేటగిరీ–ఏ, పోలింగ్ సందర్భంగా మొరాయించిన ఈవీఎంలను కేటగిరీ–బీ కింద పరిగణించి ఒకే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తామన్నారు. మాక్‌పోల్‌కి వాడిన ఈవీఎంలను కేటగిరీ–సీ, రిజర్వ్ ఈవీఎంలను కేటగిరీ–డీ కింద పరిగణించి వేర్వేరు స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరుస్తామని వివరించారు. 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించే తేదీలను స్థానిక రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారని సత్యవాణి తెలిపారు. మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను నిర్వహిస్తారన్నారు. పోలింగ్ నవంబర్ 30న జరగనుండగా, దానికి 3 రోజుల ముందులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పాస్‌లు రావడంలో జాప్యం కావడంతో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులను జిల్లాల కలెక్టర్లు తిరస్కరించిన అంశంపై పరిశీలన చేస్తామన్నారు. -
నామినేషన్ విత్ డ్రాకు పోతున్న రాజేష్
-
లీడర్‌కు కే‘డర్’
అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి రాజకీయ వలసలు అన్ని పార్టీల్లోనూ నిత్యకృత్యంగా మారాయి. దిగ్గజ నేతలు మొదలుకొని క్షేత్రస్థాయి కార్యకర్త వరకు పార్టీని వీడటం అన్ని పార్టీల్లోనూ రివాజుగా మారింది. టికెట్ల కేటాయింపుపర్వం అన్ని రాజకీయ పక్షాల్లోనూ ప్రకంపనలు సృష్టించగా, భంగపడిన ఆశావహులు సొంతపార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలోకి చేరిపోయారు. తమ టికెట్ ఎగురేసుకు వెళ్లిన అభ్యర్థులను ఓడిస్తామంటూ శపథం చేస్తూ ఎదుటి పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇక టికెట్ దక్కించుకున్న నేతలు ఎదుటి శిబిరాలపై కన్నేసి క్షేత్రస్థాయి కేడర్‌ను లాక్కునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా తాయిలాలు ఎర వేస్తూ తమవైపు లాక్కునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక మరోవైపు ఉన్న సొంతకేడర్ను కాపాడుకునేందుకూ తంటాలు పడుతున్నారు. స్థానికంగా జనంలో కాస్త పలుకుబడి ఉన్న నేతలకు సైతం పార్టీ మారాల్సిందిగా వివిధ పక్షాల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఎటూ తేల్చుకోలేని కిందిస్థాయి నేతలు కొందరు ఫోన్లు బంద్ పెట్టుకొని అందుబాటులో లేకుండా పోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. స్థానిక సంస్థల ప్రతినిధులకు గిరాకీ... ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు క్షేత్రస్థాయి కేడర్ చేరికలపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. వలసలను ప్రోత్సహించే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన వార్డు మెంబర్లు మొదలు ఉప సర్పంచ్‌లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, చైర్మన్లు, స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు గిరాకీ ఏర్పడింది. పార్టీ నిర్ణయానికి కంకణబద్ధులైన స్థానిక సంస్థల ప్రతినిధులు కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారు. మరికొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతోనూ బేరసారాలు సాగిస్తున్నారు. వలసలను అరికట్టే క్రమంలో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే అడ్వాన్సు రూపంలో కొంత మేర చెల్లింపులు పూర్తి చేశారు. అయినా సంతృప్తి చెందని కొందరు క్షేత్ర స్థాయి నేతలు, కేడర్ ఎదుటి పార్టీ అభ్యర్థులతో మంతనాలు జరుపుతుండటం సొంత పార్టీ అభ్యర్థులకు తలనొప్పులు తెచ్చి పెడుతోంది. కొందరు కిందిస్థాయి నాయకులు అడ్వాన్సులు పుచ్చుకుని కూడా పార్టీలు మారుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొత్త కేడర్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్లో కింది స్థాయిలో వీరిదే ప్రధాన పాత్ర కావడంతో తమకు విధేయతతో పనిచేసే కేడర్ కోసం నేతలు వెతుకులాట ముమ్మరం చేస్తున్నారు. సొంత సైన్యం మోహరింపు క్షేత్రస్థాయిలో కేడర్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందు కు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ సొంత సైన్యాన్ని మండలాల వారీగా మోహరింపజేశారు. ఓవైపు పార్టీ నేతలకు మండలాలు, కీలక గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగిస్తూనే తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నారు. బీఆర్ఎస్ లాంటి పార్టీలు కీలక నియోజకవర్గాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాయి. వారు తమ అనుచరగణంతో కేటాయించిన మండలాల్లో మకాం వేసి కేడర్ సమన్వయం, ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ తదితరాల్లో అభ్యర్థులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్లో అత్యంత కీలకమైన డబ్బు, మద్యం పంపిణీ బాధ్యతలను అభ్యర్థులు తమ సొంత సైన్యానికే అప్పగిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమకు నమ్మకస్తులైన వారి ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో మద్యం డంప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగదు తరలింపులో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కీలక స్థావరాలకు చేర్చినట్లు సమాచారం. అయితే కొన్ని చోట్ల పార్టీ ఇన్‌చార్జ్‌లు, అభ్యర్థుల నడుమ కూడా సమన్వయ లోపం తలెత్తుతోంది. -కల్వల మల్లికార్జున్ రెడ్డి -
తెలంగాణలో భారీగా నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం.. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. భారీ సంఖ్యలోనే అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు తెలియజేశారు. బుజ్జగింపుల పర్వం, చర్చల నడుమ ప్రధాన పార్టీల రెబల్స్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కాగా.. సగానికి సగం అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల స్క్రూటినీ(పరిశీలన) తర్వాత 114 మంది బరిలో ఉండగా.. బుధవారం 70 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరకు.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత గజ్వేల్ బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. గజ్వేల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో రెబల్స్‌తో అధిష్టానం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. చాలా స్థానాల్లో రెబల్స్ తమ నామినేషన్స్ వెనక్కి తీసుకున్నారు. సూర్యాపేటలో పటేల్ రమేష్‌రెడ్డి, జుక్కల్‌లో గంగారాం, బాన్సువాడలో బాలరాజు, డోర్నకల్‌లో నెహ్రూనాయక్, వరంగల్ ఈస్ట్‌లో రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రాంరెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరోవైపు బీజేపీ రెబల్స్ సైతం భారీ సంఖ్యలోనే నామినేషన్లు వెనక్కి తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన తర్వాత.. 2,898 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఈసీ ఆమోదం పొందాయి. నిబంధనల మేరకు 606 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు ప్రకటించారు. సూర్యాపేటలో 12 మంది ఉపసంహరణ.. బరిలో 20 మంది సిద్ధిపేట జిల్లా.. హుస్నాబాద్‌లో 15 నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో 19 మంది హుజూరాబాద్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.. ఎన్నికల బరిలో 22 మంది రాజన్న సిరిసిల్ల జిల్లా.. సిరిసిల్లలో ఇద్దరి నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో 21 మంది వేములవాడలో నలుగురి ఉపసంహరణ.. బరిలో 16 మంది పెద్దపల్లి జిల్లాలో.. మంథనిలో ముగ్గురు ఇండిపెండెంట్ల ఉపసంహరణ.. బరిలో 21 మంది అభ్యర్థులు నల్లగొండ జిల్లా.. మిర్యాలగూడలో 10 మంది విత్‌డ్రా.. బరిలో 23 మంది నల్లగొండ నాగార్జున సాగార్‌లో ఆరుగురు సభ్యుల విత్‌డ్రా.. బరిలో 15 మంది నిజామాబాద్ జిల్లాలో.. ఆర్మూర్‌లో 21 మంది బాన్సువాడలో 17 మంది బోధన్ బరిలో 15 మంది నిజామాబాద్ అర్బన్‌లో 23 మంది నిజామాబాద్ రూరల్‌లో 17 మంది బాల్కొండ బరిలో 9 మంది కామారెడ్డి జిల్లాలో.. కామారెడ్డి సెగ్మెంట్లో 58 నామినేషన్లలో 19 విత్‌డ్రా.. బరిలో 39 మంది గజ్వేల్‌తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గం కామారెడ్డి నామినేషన్ల స్క్రూటినీ తర్వాత ఈ నియోజకవర్గంలో 58 మంది పోటీలో ఉండగా.. ఇవాళ 19 మంది నామినేషన్ల ఉపసంహరణ కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి కె.వెంకట రమణారెడ్డి పోటీలో జుక్కల్‌లో 7 విత్‌డ్రా.. బరిలో 16 మంది ►ఉమ్మడి వరంగల్.. 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 216 మంది పోటీ వరంగల్ తూర్పు సెగ్మెంట్లో పోటీలో నిలిచిన 29 మంది అభ్యర్థులు. పరకాల బరిలో 28 మంది అభ్యర్థులు. వర్ధన్నపేట బరిలో 14 మంది అభ్యర్థులు నర్సంపేట బరిలో 19 మంది అభ్యర్థులు. జనగామ బరిలో 19 మంది అభ్యర్థులు. పాలకుర్తి బరిలో 15 మంది అభ్యర్థులు. స్టేషన్ ఘనపూర్ బరిలో 19 మంది అభ్యర్థులు. ములుగు బరిలో 9మంది అభ్యర్థులు. భూపాలపల్లి సెగ్మెంట్ బరిలో 23 మంది అభ్యర్థులు. మహబూబాబాద్ సెగ్మెంట్ బరిలో 12మంది అభ్యర్థులు డోర్నకల్ సెగ్మెంట్ బరిలో 14మంది అభ్యర్థులు వరంగల్ పశ్చిమ బరిలో 15మంది అభ్యర్థులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. పినపాకలో నలుగురు ఉపసంహరణ.. బరిలో 18 మంది ఇల్లందులో 10 మంది ఉపసంహరణ.. పోటీలో 20 మంది కొత్తగూడెంలో నలుగురు ఉపసంహరణ.. పోటీలో 30 మంది అశ్వారావుపేటలో ఏడుగురి ఉపసంహరణ.. 14 మంది పోటీలో భద్రాచలంలో ఎవరూ విత్‌డ్రా చేసుకోలేదు. దీంతో 13 మంది పోటీ లో ఉన్నారు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో.. 15 స్థానాలకు 20 మంది అభ్యర్థుల ఉపసంహరించుకోగా.. 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో.. 6 నియోజకవర్గాల పరిధిలో 173 మంది అభ్యర్థులు బరిలో ఇబ్రహీంపట్నంలో 28 మంది, ఎల్బీనగర్లో 38 మంది, మహేశ్వరంలో 27, రాజేంద్రనగర్‌లో 25, శేరిలింగంపల్లిలో 33, చేవెళ్లలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. -
గజ్వేల్ లో అధిక నామినేషన్లు..టార్గెట్ కేసీఆర్..
-
కాంగ్రెస్‌లో రె‘బెల్స్’
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ బెడద తప్పేలా లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు నేతలు టికెట్లు ఆశించగా, అందులో టికెట్లు రాని అసంతృప్తులు రాష్ట్రవ్యాప్తంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 24 మందిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కనీసం 10 చోట్ల ఆ పార్టీకి రె‘బెల్స్’మోగక తప్పదని గాందీభవన్ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, బాన్సువాడ, వరంగల్ వెస్ట్, డోర్నకల్, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌కు రండి.. ఈసారి కాంగ్రెస్ రెబెల్స్‌గా జంగా రాఘవరెడ్డి (వరంగల్ వెస్ట్), నరేశ్ జాదవ్ (బోథ్), గాలి అనిల్‌కుమార్ (నర్సాపూర్), ఎస్.గంగారాం (జుక్కల్), కాసుల బాలరాజు (బాన్సువాడ), నాగి శేఖర్ (చొప్పదండి), దైద రవీందర్ (నకిరేకల్), రామ్మూర్తి నాయక్ (వైరా), ప్రవీణ్ నాయక్, చీమల వెంకటేశ్వర్లు (ఇల్లందు), విజయ్‌కుమార్‌రెడ్డి (ముథోల్), లక్ష్మీనారాయణ నాయక్ (పాలకుర్తి), సున్నం వసంత (చేవెళ్ల), నెహ్రూ నాయక్ (డోర్నకల్), భూక్యా మంగీలాల్ (మహబూబాబాద్), పటేల్ రమేశ్‌రెడ్డి (సూర్యాపేట), చిమ్మని దేవరాజు (పరకాల), సిరిసిల్ల రాజయ్య (వర్ధన్నపేట)తోపాటు మరికొంత మంది రంగంలోకి దిగారు. వీరిలో ఒకరిద్దరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) టికెట్లు తెచ్చుకుని సింహం గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారితో మంతనాలు జరిపి వారి నామినేషన్లను ఉపసంహరింపజేసే బాధ్యతలను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు పార్టీ అప్పగించింది. దీంతో వీరందరినీ హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించారు. వీరిలో నలుగురైదుగురు మాత్రమే అందుబాటులోకి రాగా, మిగిలిన వారితో ఠాక్రే, మహేశ్‌గౌడ్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. దీనిపై మహేశ్‌కుమార్‌గౌడ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రెబెల్స్‌గా బరిలోకి దిగిన పార్టీ నాయకులందరితో మాట్లాడామని, అందరూ సర్దుకుంటారని చెప్పారు. బుధవారం సాయంత్రానికి మెజార్టీ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నించినా... టికెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ నెల రోజులుగా బుజ్జగింపు యత్నాలు చేస్తూనే ఉంది. టికెట్లు రాని వారితో సంప్రదింపులు జరిపేందుకు సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీతోపాటు ఏఐసీసీ నుంచి సమన్వయకర్తలుగా వచ్చిన దీపాదాస్ మున్షీ, జ్యోతిమణి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలు టికెట్లు దక్కవని తెలిసిన వారితో మంతనాలు జరిపి వారికి భవిష్యత్తుపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు 15 మంది నేతలతో సమావేశమై బుజ్జగించారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా 20 మందికి పైగా రెబెల్స్ నామినేషన్లు వేశారు. వీరిలో ఓ 10 మంది వెనక్కు తగ్గినా, మరో 10 మంది బరిలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. వీరిలో ఎంతమంది బరిలో ఉంటారు? ఎంత మంది ఉపసంహరించుకుంటారనే దానిపై బుధవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. పార్టీలు మారిన చాలా మంది రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన వారితోపాటు చివరి క్షణంలో పార్టీలు మారిన వారి నుంచి ఎలాంటి ముప్పు వస్తుందోననే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. మునుగోడు నుంచి ముషీరాబాద్ వరకు, ఆదిలాబాద్ నుంచి నకిరేకల్ వరకు 20కి పైగా నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఇటీవలే పార్టీ నుంచి వెళ్లిపోయారు. వీరిలో చాలా తక్కువ మంది బీజేపీలోకి వెళ్లగా, మెజార్టీ నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. చివరి క్షణం వరకు టికెట్ రేసులో ఉండి పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు కాంగ్రెస్‌ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. వీరికితోడు మరో 10 మంది వరకు రెబెల్స్ బరిలో ఉండే అవకాశాలుండటంతో టికెట్ల ‘అసంతృప్తి’పార్టీ పుట్టి ముంచుతుందేమోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. -
కోట్లున్నా..కారుండదు..ఎందుకు?
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సమయంలో ఓ అంశం సాధారణ ప్రజల్లో కొత్త ఆలోచనను రేపుతుంటుంది. మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర కీలక పదవుల్లో ఉన్న కొందరు ‘నాకు సొంత కారు లేదు’ అని నామినేషన్ల అఫిడవిట్లో చూపుతుంటారు. వారి ఆస్తులు మాత్రం రూ.కోట్లలో ఉంటాయి. ఇంత ఆస్తి పరులకు సొంత వాహనం ఎందుకు ఉండదు..?? కోట్లకు పడగలెత్తిన బడా నేతలు సొంత వాహనాన్ని కొనుక్కునే పరిస్థితిలో లేరా..?? వారి ఇళ్ల ఎదుట డజనుకుపైగా కనిపించే ఖరీదైన విలాసవంతమైన కార్లు ఎవరివి..?? ఈ అనుమానాలు చాలా మంది బుర్రలను తొలిచేస్తూంటాయి. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కొందరు మంత్రులు సహా పలు పార్టీలకు చెందిన బడా నేతలు సొంత కారు లేదని ప్రకటించారు. ఇలా ఎందుకంటే.. ఏ కేసు పెట్టినా.. వెళ్లాల్సిందే... ఆ వాహనం ఏదైనా వివాదంలో చిక్కుకున్నా, ప్రమాదానికి గురైనా న్యాయపరమైన అంశాల్లో యజమాని పేరు నమోదవుతుంది. ప్రమాదానికి గురైన సందర్భాల్లో యజ మాని వాహనంలో ప్రత్యక్షంగా లేకున్నా, కేసులను మాత్రం స్వయంగా ఎదుర్కొనక తప్పదు. పోలీసులు, న్యాయస్థానం ముందు యజమాని ప్రస్తావన రావటంతోపాటు, నేరుగా హాజరు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వాహన యజమానులు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు ఇవి ఇబ్బందికరంగా మారుతాయి. ఇక వాహనాలు నేతల పేర్లతో లేకున్నా, కొన్ని సందర్భాల్లో వాటిపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్టిక్కర్లు ఉంటుంటాయి. అలా ఉన్న కార్లు ప్రమాదాలకు గురైనా, ఇతర వివాదాల్లో చిక్కుకున్నా.. ఆ స్టిక్కర్ల వల్ల నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు ఎన్నో. కేవలం స్టిక్కర్ల ద్వారానే అలాంటి పరిస్థితి ఎదురైతే, వాహన రిజిస్ట్రేషన్‌లో యజమానిగా నేతల పేర్లు ఉంటే వారికి మరిన్ని ఇబ్బందులు సహజం. ఈ పరిణామాలను ముందుగా ఊహించే కొందరు బడా నేతలు తమ పేర్లతో వాహనాలు కొనటం లేదు. ఇది కేవలంనేతలకే పరిమితం కాలేదు. పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థలవారు, బడా వ్యాపారులు, సినిమా నటులు.. ఇలా చాలా రంగాలకు చెందిన వారిలో ఈ ధోరణి ఉంది. నామినేషన్ వేసిన ఓ మంత్రి తన అఫిడవిట్లో సొంత వాహనం లేదని చూపించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయన విద్యా సంస్థల అధిపతిగా ఉన్నారు. అప్పుడు గానీ, ఇప్పుడు గానీ ఆయన వాహనాలను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లేదు. ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సి రావటం.. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో యజమాని ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సి ఉండటం కూడా దీనికి మరో కారణం. అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ తంతు పూర్తి చేసే వరకు ఉండటం ఇబ్బందిగా భావిస్తున్నారు. నామ బలం.. అభిమానంతో కొంతమంది.. వాహనాన్ని కొనేప్పుడు ఎవరి పేరుతో కొంటే మంచి జరుగుతుందో అన్న నమ్మకాలు కొందరిలో ఉంటాయి. ప్రతి పనికీ ముహూర్తాలు, నామ బలం చూసుకునే అలవాటు ఉన్నవారు దీనికి ప్రాధాన్యం ఇస్తారు. తమ పేరుతో కలిసి రాదని భావిస్తే వేరేవారి పేరుతో కొంటుంటారు. ఇక కొందరు ఆప్తులుగా భావించే వారిపై ఉన్న అభిమానంతో వారి పేరుతో వాహనాలు కొంటుంటారు. ఇది కూడా వాహనాలు యజమాని పేరుతో కాకుండా ఇతరుల పేరుతో ఉండటానికి కారణమవుతోంది. ఆదాయ పన్నుల భారం లేకుండా.. ఆయనో పారిశ్రామికవేత్త.. రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఇంటి ఆవరణలో డజనుకుపైగా విలాసవంతమైన కార్లు ఉంటాయి.. కానీ ఏదీ ఆయన పేరుతో ఉండదు. వాటి ఖర్చు, బ్యాంకు లోన్ల వ్యవహారం ఆయనకు సంబంధం లేదు. అన్నీ ఆయన సంస్థల నుంచే భరిస్తున్నట్టు చూపుతున్నారు. దీంతో ఆదాయపన్నులో ఆ కార్ల ఖాతా ఉండటం లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలు, విద్యా సంస్థల అధిపతులు దాదాపు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. -గౌరీభట్ల నరసింహమూర్తి -
TS: పూర్తైన పరిశీలన.. 2,898 నామినేషన్లకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో.. నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఈసీ ఈ వివరాలను మంగళవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించింది. మొత్తం 4,798 మంది నామినేషన్లు దాఖలు కాగా.. 2,898 నామినేషన్లకు ఆమోదం లభించింది. అలాగే 606 తిరస్కరణకు గురయ్యాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో రేపటితో(నవంబర్ 15తో) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. మధ్యాహ్నాం 3గంటల లోపు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. దీంతో 2,898 మందిలో ఎంత మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారు? ఎన్నికల బరిలో చివరకు ఎంత మంది మిగులుతారు? అనేది రేపు సాయంత్రం కల్లా తేలనుంది. ఇక నామినేషన్ల పరిశీలన తర్వాత ఆమోదించినవాటి లెక్కల ప్రకారం.. కేసీఆర్ పోటీ చేయబోతున్న గజ్వేల్ అత్యధికంగా 114 నామినేషన్లకు ఆమోదం లభించింది. వీళ్లలో 28 మంది విత్‌డ్రా చేసుకోగా(ఇవాళ సాయంత్రం వరకు).. 86 మంది అభ్యర్థులు మిగిలారు. మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 56(కేసీఆర్ పోటీ చేయబోయే రెండో స్థానం), ఎల్బీ నగర్లో 57 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. 10వ తేదీతో ముగిసింది. మొదటి రోజు 96 మంది, రెండో రోజు 136, 6వ తేదీన 207, 7వ తేదీన 281 మంది, 8వ తేదీన 618 మంది, 9వ తేదీన 1,133 మంది, ఆఖరి రోజు అధికంగా 2,327 మంది వేశారు. అలా.. ఎన్నికల్లో మొత్తం 4,798 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2018 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 2,399 నామినేషన్లు వేయగా అందులో 456 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వాళ్లలో 367 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. చివరకు 1,821 మంది ఎన్నికలో బరిలో నిలిచారు. అయితే.. ఎన్నికల్లో 1,569 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం.