భారతీయ చిత్రం అరుదైన ఘనత.. రెండు విభాగాల్లో నామినేట్! | Payal Kapadia All We Imagine As Light Gets 2 Nominations In Golden Globe Awards, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Golden Globe Awards: గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్‌లో ఏకైనా భారతీయ చిత్రం!

Published Mon, Dec 9 2024 8:53 PM | Last Updated on Tue, Dec 10 2024 11:47 AM

Payal Kapadia All We Imagine As Light gets 2 nominations In Golden Globe Awards

ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్‌కు ఎంపికైంది. తాజాగా ఈ ఏడాది అందించే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్‌ విభాగాల్లో  నామినేషన్స్‌ సాధించింది.

ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. గతనెల నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుడా  అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.

అంతేకాకుండా ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్‌లో జ్యూరీ గ్రాండ్ ప్రైజ్, గోథమ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను కూడా అందుకుంది. వచ్చే ఏడాది జనవరి 6న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ అందజేయనున్నారు. తాజాాగ 82వ గోల్డెన్‌ గ్లోబ్స్‌ అవార్డ్స్‌ నామినేషన్‌ జాబితాను జ్యూరీ ప్రకటించింది. భారత్ నుంచి కేవలం ఈ మూవీ మాత్రమే రెండు విభాగాల్లో నామినేట్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement