Golden Globe Awards
-
చరిత్ర ఈమెదే.. గోల్డెన్ గ్లోబ్స్‌కు పాయల్ కపాడియా.. ఇంట్రెస్టింగ్ జర్నీ..! (ఫొటోలు)
-
పుష్పా సరే పాయల్ని చూడండి
మన తెలుగు పుష్పా– 2 రికార్డు బద్దలు కొడుతోంటే అదే సమయంలో మన భారతీయ మహిళా డైరెక్టర్ 80 ఏళ్ల చరిత్ర గల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు నామినేషన్స్ సాధించి రికార్డు స్థాపించింది. బెస్ట్ డైరెక్టర్ (మోషన్ పిక్చర్) బెస్ట్ మోషన్ పిక్చర్ (నాన్ ఇంగ్లిష్) కేటగిరీల్లో ఆమె దర్శకత్వం సినిమా ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ నామినేషన్ పొందింది. ఇంతకు ముందు ఇలాంటి ఘనత సాధించిన మన దేశపు మహిళ మరొకరు లే రు.‘సినిమా తీయాలంటే అందరికీ ఫిల్మ్ స్కూల్ అక్కర్లేదు. కాని నాకు ఉపయోగపడింది’ అంటారు పాయల్ కపాడియా. ముంబైలో, ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీలో బాల్యం, కౌమారం గడిచిన పాయల్ పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సు చదివి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకురాలు అయారు. 2014 నుంచి సినిమాలు తీస్తున్నా 2021లో తీసిన డాక్యుమెంటరీ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’తో ఆమె ప్రతిభ లోకానికి పరిచయం కాసాగింది.ఎవరికీ లేని ఘనతఆస్కార్ అకాడెమీ అవార్డ్స్‌తో సమానమైన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం పోటీ పడే భారతీయ సినిమాలు చాలా తక్కువ. 1994 లో చివరిసారిగా ఒక భారతీయ సినిమా నామినేషన్ పొందింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు అదీ ఒక మహిళా దర్శకురాలిగా పాయల్ కపాడియా తాను తీసిన ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’తో 2024 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ విభాగం కింద రెండు నామినేషన్స్ పొందారు. ఇప్పటికే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండవ ప్రతిష్టాత్మకమైన బెస్ట్ డైరెక్టర్ అవార్డును (గ్రాండ్ ప్రి) పొందిన డింపుల్ కపాడియా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా సాధిస్తే ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది.సినిమాలు చూస్తూ...పాయల్ కపాడియా బాల్యంలో రిషి వ్యాలీలోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. ‘మా అమ్మా నాన్నలు నాకు చిన్నప్పుడు ప్రగతికాముక సినిమాలు చూపించేవారు. రష్యన్, ఫ్రెంచ్ సినిమాలు... ఆనంద్ పట్వర్థన్ తీసిన డాక్యుమెంటరీలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత పూణెలో డైరెక్షన్ కోర్సులో చేరాక వేరు వేరు ప్రాంతాల, నేపథ్యాల నుంచి వచ్చిన బ్యాచ్‌మేట్స్ సినిమాల గురించి ఎన్నో చర్చలు సాగించేవారు. రోజూ స్క్రిప్ట్‌లు వినడమే సరిపోయేది.అదంతా చిన్న ఎక్స్పోజర్ కాదు. అలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రాక్టికల్స్ ఉండేవి. అవి చేసే ముందు కష్టంగా ఉన్నా చేశాక ఏదో తెలుసుకున్నాం అనే సంతృప్తి ఉండేది. ఉదాహరణకు అందరూ తప్పనిసరిగా 4 నిమిషాల లాంగ్‌షాట్ తీయాలి మా ప్రాక్టికల్ ఫిల్మ్స్‌లో. ఎవరు ఎలా తీస్తారనేది ఒక అనుభవం. మా ్ర΄పొఫెసర్లు కూడా ఎంతో బాగా పాఠాలు చెప్పారు. అవన్నీ నేను దర్శకురాలు కావడానికి సాయం చేశాయి’ అంటారామె.ముగ్గురు స్త్రీలు, ఒక నగరంమూడు నాలుగేళ్లుగా రాసుకున్న స్క్రిప్ట్ ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ను తీయడానికి కావలసిన బడ్జెట్ కోసం ఫ్రాన్స్, ఇటలీ, లగ్జంబర్గ్, ఇండియా, నెదర్లాండ్స్‌లోని ్ర΄పొడక్షన్ సంస్థలను ఆశ్రయించి వారి సహ భాగస్వామ్యంతో పూర్తి చేశారు పాయల్. కేరళ నుంచి ముంబైకి భుక్తి కోసం వచ్చిన ఇద్దరు నర్సుల కథ ఇది. వీరు పనిచేసే ఆస్పత్రిలోనే వంటమనిషిగా చేస్తున్న మహారాష్ట్ర మహిళ వీరితో కలుస్తుంది.ఆ నర్సుల్లో ఒకామె భర్త ఆమెను విడిచిపెట్టి జర్మనీ వెళ్లిపోయి ఉంటాడు. మరో నర్సు అవివాహితగా ఉంటూనే ఒక యువకునితో రిలేషన్లో ఉంటుంది. ఇక వంటామె ఇరవై ఏళ్లుగా తాను ఏ చాల్ (చిన్న కొట్టం)లో అయితే నివసిస్తోందో ఆ చాల్ను బిల్డర్ కూల్చడానికి వస్తే దానిని సొంతం అని చెప్పుకోవడానికి ఏ పత్రమూ లేక కలిగే నిస్పృహ... ఈ ముగ్గురి జీవితం ఎక్కడకు చేరుతుంది... ఏ వెలుతురికీ ప్రస్థానం అని చూపేదే కథ.లోతైన కథనంపాయల్ కపాడియా ఈ కథలో ఎన్నో ΄పొరలు ఉంచి కథకు బహుముఖ పార్శా్వలు ఇవ్వడమే ప్రపంచ విమర్శకులను ఆకర్షించి అవార్డుల పంట పండేలా చేస్తోంది. ఈ కథలో మూడు పాత్రలతో పాటు ముంబై నగరం కూడా ఒక పాత్రగా ఉండటం విశేషం. ఒక నగరం పెరిగే కొద్దీ పేదవాళ్లను దూరంగా నెట్టేస్తూ ఉంటుందని ఈ సినిమా చూపుతుంది. ఒకప్పటి మామూలు ఏరియా ఖరీదైన భవంతులతో నిండిపోతే అప్పటివరకూ అక్కడ ఉన్నవారు ఎక్కడకు వెళ్లి వుంటారు? ఎవరూ ఆలోచించరు.‘ఈ నగరం కలల నగరం అని కొందరు అనుకుంటారు. ఇది భ్రాంతుల నగరం. కలా నిజమా... తెలుసుకునే లోపే జీవితం గడిచిపోతుంది’ అనే డైలాగ్ ఇందులో ఉంది. ‘నువ్వు జీవితాన్ని తప్పించుకోలేవు’ అనే డైలాగ్ కూడా ఉంది. తప్పించుకోలేని జీవితంలో తగిన ఆనందాలు వెతుక్కోవడం ఎలాగో ప్రతి జీవికీ తెలుస్తుంది. ఈ కథలోని ముగ్గురు స్త్రీలు ఆ ఆనందాలను వెతుక్కుని వెలుతురు పొందుతారు. జనవరి 5న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్ ఉంది. చూద్దాం మన అదృష్టం. -
భారతీయ చిత్రం అరుదైన ఘనత.. రెండు విభాగాల్లో నామినేట్!
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్‌కు ఎంపికైంది. తాజాగా ఈ ఏడాది అందించే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. గతనెల నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుడా అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.అంతేకాకుండా ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్‌లో జ్యూరీ గ్రాండ్ ప్రైజ్, గోథమ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను కూడా అందుకుంది. వచ్చే ఏడాది జనవరి 6న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అందజేయనున్నారు. తాజాాగ 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ నామినేషన్ జాబితాను జ్యూరీ ప్రకటించింది. భారత్ నుంచి కేవలం ఈ మూవీ మాత్రమే రెండు విభాగాల్లో నామినేట్ అయింది.Congratulations to the 82nd #GoldenGlobes nominees for Best Non-English Language Motion Picture:✨ ALL WE IMAGINE AS LIGHT | USA / FRANCE / INDIA✨ EMILIA PÉREZ | FRANCE✨ THE GIRL WITH THE NEEDLE | POLAND / SWEDEN / DENMARK✨ I’M STILL HERE | BRAZIL✨ THE SEED OF THE… pic.twitter.com/xzfsib2iov— Golden Globes (@goldenglobes) December 9, 2024Congratulations to the 82nd #GoldenGlobes nominees for Best Director Motion Picture:✨ JACQUES AUDIARD | EMILIA PÉREZ✨ SEAN BAKER | ANORA✨ EDWARD BERGER | CONCLAVE✨ BRADY CORBET | THE BRUTALIST✨ CORALIE FARGEAT | THE SUBSTANCE✨ PAYAL KAPADIA | ALL WE IMAGINE AS LIGHT pic.twitter.com/gTtCCMUCTp— Golden Globes (@goldenglobes) December 9, 2024 -
ఉత్తమ చిత్రంగా నిలిచిన ఆ సినిమా.. ఏకంగా ఐదు అవార్డులు!
గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ సినిమా 'ఓపెన్‌హైమర్'. ఇండియాలోనూ ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త 'రాబర్ట్ జె ఓపెన్ హైమర్' జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. తాజాగా ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఓపెన్ హైమర్ సత్తా చాటింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ చిత్రం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే మార్గరెట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన బార్బీ మూవీ సైతం పలు అవార్డులను సొంతం చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వివరాలు ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్ ఉత్తమ కామెడీ చిత్రం- పూర్ థింగ్స్ ఉత్తమ దర్శకుడు - క్రిస్టఫర్ నోలన్(ఓపెన్‌హైమర్) ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్ సాగ్ ట్రైట్, ఆర్ధర్ హరారి ( అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) ఉత్తమ నటుడు- సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్) ఉత్తమ నటి - లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్) ఉత్తమ హాస్య నటి - ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ హాస్య నటుడు - పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్) ఉత్తమ సహాయనటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్) ఉత్తమ సహాయనటి - డావిన్ జాయ్ రాండోల్ఫ్(ది హోల్డోవర్స్) ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - లుడ్విగ్ గోరాన్సన్(ఓపెన్‌హైమర్) ఉత్తమ ఆంగ్లేతర చిత్రం - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - వాట్ వాస్ ఐ మేడ్ (బార్బీ) ఉత్తమ యానిమేటెడ్ చిత్రం - ది బాయ్ అండ్ ది హెరాన్ బాక్సాఫీస్ అచీవ్మెంట్ అవార్డు - వార్నర్ బ్రదర్స్(బార్బీ) -
‘‘మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. బంగారు భూగోళమా..’’
ఈ ఏడాది జనవరిలో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో గల ‘ది బెవర్లీ హిల్టన్’ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు లభించింది. ఈ పాటకు గాను సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు అవార్డు దక్కింది. అవార్డుల ప్రదానోత్సవం రోజున కీరవాణి ఆ అవార్డును వేదికపైనే అందుకున్నారు. కాగా, ప్రస్తుతం లాస్ఏంజెల్స్లో ఉన్న రచయిత చంద్రబోస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును స్వీకరించారు. ‘గోల్డెన్ గ్లోబ్ విన్నర్ చంద్రబోస్ మా కార్యాలయానికి వచ్చి ఆయనకు చెందిన అవార్డును (నాటు నాటు పాటకు..) స్వీకరించారు. ఆయనకు మరోసారి శుభాకాంక్షలు’’ అని గోల్డెన్ గ్లోబ్ ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంపై చంద్రబోస్ స్పందిస్తూ ‘‘మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. బంగారు భూగోళమా.. (లవ్యూ)’’ అని ట్వీట్ చేశారు. ‘నాటు నాటు’ పాట 95వ ఆస్కార్ అవార్డ్స్లోని ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కా ర్ వేడుక మార్చి 12 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13)న లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది. మనస్ఫూర్తిగా అందరికీ ధన్వవాదాలు-బంగారు భూగోళమా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ https://t.co/xzV6WIhexI — chandrabose (@boselyricist) February 15, 2023 -
ఎన్టీఆర్ యాసపై ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ టైగర్
ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు కీరవాణితో పాటు జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ హాలీవుడ్ యాంకర్ ఎన్టీఆర్‌ని ఇంటర్వ్యూ చేయగా.. అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్లో తారక్ ఇరగదీశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రాగా.. ఫేక్ యాక్సెంట్ అంటూ కొంతమంది నెటిజన్స్ ఎన్టీఆర్‌ని ట్రోల్స్ చేశారు. తాజాగా దీనిపై ఎన్టీఆర్ పరోక్షంగా స్పందించారు. ఒక్కో జోన్లో ఒక్కో యాస ఉండడం సహజమని, కాలమానం, యాసల పరంగా తమ మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు కానీ.. పశ్చిమ దేశాల్లో ఒక నటులు ఎలాంటి విధానాన్ని అవలంభిస్తాడో.. తూర్పు దేశాల్లోనూ అలాగే ఉంటుందని అన్నారు. ‘నాటు నాటు’పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా.. ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ విధంగా స్పందించారు. అలాగే రాజమౌళి, ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘రాజమౌళి..తన చిత్రాలతో ప్రపంచం మొత్తాన్ని అలరించిన వ్యక్తి. సినిమా సినిమాకు మరింత వృద్ధి చెందుతున్నారు. `ఆర్ఆర్ఆర్`ని వెస్ట్ కి తీసుకెళ్లాలనేది ఆయన ప్లాన్. దక్షినాదిలోని టాలీవుడ్ అనే చిన్న పరిశ్రమకు చెందిన మేము.. ఆర్ఆర్ఆర్ కారణంగా ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. -
మ్యాన్ ఆఫ్ మాసెస్.. జూనియర్‌పై టీమిండియా బౌలర్ ట్వీట్
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ టాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ పోటీలో నిలవడంతో యంగ్ టైగర్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా టీమిండియా క్రికెటర్లు సైతం టాలీవుడ్ యంగ్ టైగర్‌ను కలిశారు. న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆటగాళ్లు జూనియర్‌తో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చాహల్ తన ట్విటర్లో రాస్తూ..' మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలిచినందుకు అభినందనలు. ఇది మనమందరం గర్వపడాల్సిన సమయం.' అంటూ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. It was indeed a pleasure meeting the man of masses @tarak9999 What a gentleman. Congratulations on the golden globe win. We all are proud. 🇮🇳 pic.twitter.com/tw79z2YtAw — Yuzvendra Chahal (@yuzi_chahal) January 17, 2023 -
తగ్గేదేలే.. ఆర్ఆర్ఆర్ మూవీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ప్రపంచస్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. తాజాగా అమెరికాలోని 'లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డు దక్కింది. (ఇది చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంఎం కీరవాణిని ఎంపిక చేసింది. ఈ అవార్డ్ అందుకున్న ఫోటోలు ఆర్ఆర్ఆర్ బృందం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కీరవాణికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే ఊపులో ఆస్కార్ అవార్డ్ కూడా తీసుకురావాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. .@mmkeeravaani’s acceptance speech for #RRRMovie’s score at @LAFCA. ❤️🔥🔥🌊 pic.twitter.com/XIDhze3ZkW — RRR Movie (@RRRMovie) January 15, 2023 -
నాటు నాట్ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాల గర్వంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి
-
ఆయన సరస్వతి పుత్రుడు.. తెలుగువారికి ఇది గర్వకారణం: చిరంజీవి
టాలీవుడ్ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. ఆయన రచించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చినందుకు మెగాస్టార్ ప్రత్యేకంగా అభినందించారు. చిరు తాజా చిత్రం వాల్తేరు వీరయ్య విజయోత్సవ సమావేశంలో చంద్రబోస్‌ను చిరంజీవి, రవితేజ ఘనంగా సన్మానించారు. చిరంజీవి మాట్లాడుతూ.. 'చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం గర్వకారణంగా ఉంది. తొలిసారి తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణితోపాటు ఈ పాటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. తెలుగు వాళ్లందరి తరఫున చంద్రబోస్‌కు నా ప్రత్యేక అభినందనలు. చంద్రబోస్ సరస్వతీ పుత్రుడు.' అంటూ కొనియాడారు. కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. మొదటిసారి తెలుగు సినిమాకు ఈ ఘనత దక్కడంతో పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
హాలీవుడ్ దిగ్గజంతో రాజమౌళి.. మైండ్ బ్లోయింగ్
సాక్షి, సినిమా: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బ్లాక్‌బస్టర్ పీరియడ్ డ్రామా ఆర్ఆర్ఆర్ మేనియా ప్రపంచమంతా సాగుతోంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది ఇందులోని నాటు నాటు సాంగ్. తద్వారా అరుదైన ఘనత సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్.. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీతో పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలోనూ ఏదైనా అద్భుతం సృష్టిస్తుందా? అని ఎదురు చూస్తున్నారంతా. ఈ లోపు రాజమౌళి తన ఫ్యాన్ బాయ్ ముచ్చటను తీర్చుకున్నాడు. హాలీవుడ్ దిగ్గజ ఫిల్మ్‌మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్(76)ను కలిశాడు. ఐ జస్ట్ మెట్ గాడ్ అంటూ తన భావాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆయన. మొదటి చిత్రంలో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ ఫొటోల్లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సైతం ఉన్నారు. జురాసిక్ పార్క్ లాంటి చిత్రాలతో స్టీవెన్ స్పీల్బర్గ్ మన దేశంలోనూ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. I just met GOD!!! ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NYsNgbS8Fw — rajamouli ss (@ssrajamouli) January 14, 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకల సందర్భంలోనే వీళ్ల కలయిక జరిగినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ వెటరన్ ఫిల్మ్‌మేకర్ ది ఫాబెల్స్మ్యాన్ చిత్రానికి గానూ బెస్ట్ డైరెక్టర్(మోషన్ పిక్చర్)కేటగిరీలో అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం రెండే గంటల్లో జక్కన్న పోస్ట్‌కి మిలియన్‌కి పైగా వ్యూస్ రావడం విశేషం. -
‘నాటునాటు’: అంత ఎనర్జీలేదు అయినా ఓకే.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
సాక్షి,ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఇక తాజాగా ఈ మూవీలోని పాట ‘నాటునాటు’ ప్రపంచ చలన చిత్ర రంగానికి చెందిన ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనిపైనే ఆనంద్ మహీంద్ర తాజాగా ట్విటర్ ద్వారా స్పందించారు. ‘నాటు నాటు పాట తెలియని వారుండరు. ఈ వీడియోలోని ఈ రెండు పాత్రల్లో బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్- హార్డీ డ్యాన్స్‌లో ఆర్ఆర్ఆర్ హీరోల్లో కనిపించినంత ఎనర్జీ కనిపించకపోవచ్చు..కానీ పర్లేదు. ఎంజాయ్ చేయండి’ అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొనడంతో నాటునాటు మేనియా ఒక రేంజ్లో సాగుతోంది. పర్ఫెక్ట్ ఫ్రైడే అంటూ తెగ సంబరపడి పోతున్నారు. కామెడీ కింగ్స్ బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్-హార్డీ స్టెప్పులేస్తున్న ఒక వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ‘నాటునాటు’ పాటకు వారు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో.. అచ్చంగా ఆ పాటకు తగినట్టుగా ఉన్న ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్‌గా సెట్ అయిందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ముఖ్యంగా భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా కూడా దీనిపై స్పందించారు. సంగీతం, నృత్యం, సినిమాలకు సంస్కృతి, భాష, జాతీయ, అంతర్జాతీయ అపుడు ఇపుడూ సరిహద్దులు లేవు. మూకీ సినిమాల కాలం నుండి ఇది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది!! అంటూ ఆమె ట్వీట్ చేశారు. కాగా నాటునాటు పాటకు ఇన్సిపిరేషన్‌గా ఉన్న ఈ వీడియో గత ఏడాది సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. No wonder music , dance & cinema have no boundaries of culture , language , national, international , now or from the past too !! proven world over since the time of silent movies !! — Suchitra Ella (@SuchitraElla) January 13, 2023 No one is immune from the catchiness of #NaatuNaatu. Not even inhabitants of the past..😄 L&H may not have the same energy as the #RRR duo but they’re not bad! Enjoy the #FridayFeeling pic.twitter.com/9tMSfAKux5 — anand mahindra (@anandmahindra) January 13, 2023 -
రాహుల్‌కు కంగ్రాట్స్ చెప్పిన అషురెడ్డి, మరోసారి తెరపైకి ఎఫైర్ రూమర్స్
ప్రస్తుతం నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ పాటకు బెస్ట్ ఓరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ క్యాటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి అందుకున్నారు. ఆస్కార్ తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు పొందిన అవార్డు మన ఇండియన్ మూవీకి రావడం ఇదే తొలిసారి. దీంతో ఆర్ఆర్ఆర్ టీం, డైరెక్టర్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణిలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు నీరాజనాలు పలుకుతున్నారు. చదవండి: పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఉపాసన, ట్వీట్ వైరల్ ఇక ఈ పాట పాడిన సింగర్ రాహుల్ సిప్లగంజ్ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు. ఇంటర్నేషనల్ స్టేజ్‌పై కీరవాణి రాహుల్ పేరు చెప్పడం, ఈ అవార్డు విన్నింగ్ క్రెడిట్ ఇవ్వడంతో అనందంలో తేలిపోతున్నాడు. ఇక ఈ గ్రేట్ సక్సెస్ మూమెంట్‌ను తన స్నేహితులు, సన్నిహితుల మధ్య బుధవారం సాయంత్రం సెలబ్రెట్ చేసుకున్నాడు రాహుల్. అందులో రాహుల్ స్నేహితురాలు, అతడి రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ అషురెడ్డి కూడా పాల్గొంది. ఈ పార్టీలో రాహుల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ అతడికి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో వీరిద్దరి ఎఫైర్ రూమార్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. చదవండి: అందుకే మీరు దళపతి అయ్యారు!: విజయ్‌పై షారుక్ ట్వీట్ బిగ్‌బాస్ అనంతరం చట్టాపట్టేసుకుని తిరిగిన వీరిద్దరు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అంతా అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అషు, రాహుల్‌ను కౌగిలించుకుని అంత సన్నిహితంగా కనిపించడంతో ‘మళ్లీ కలిసిపోయారా?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారి రిలేషన్ గురించి అడిగనప్పుడల్లా అషు, రాహుల్ తాము స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. కానీ వారిద్దరు అతిసన్నిహితం చూసి నెటిజన్లు వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఉపాసన, ట్వీట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని ఇటీవల మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఉపాసన మూడు నెలల గర్భవతిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పుట్టబోయే బిడ్డ గురించి ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసనలు అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నాటు నాటుకు పాటకు ఈ అవార్డు వరించింది. చదవండి: అందుకే మీరు దళపతి అయ్యారు!: విజయ్‌పై షారుక్ ట్వీట్ దీనిని మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆర్ఆర్ఆర్ టీం షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికే రామ్‌చరణ్, ఎన్టీర్, రాజమౌళి ఇలా ప్రతిఒక్కరు ఈ గ్రేట్ మూమెంట్‌ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఉపాసన సైతం ఆర్ఆర్ఆర్ టీంతో కలిసి ఈ హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వారితో కలిసి లాస్ఎంజిల్స్లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఆర్ఆర్ఆర్ టీంకి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: థ్యాంక్యూ శ్రీవల్లి.. వేదికపై భావోద్వేగానికి గురైన ఎంఎం కీరవాణి ‘ఆర్ఆర్ఆర్ కుటుంబంలో భాగమైనందుకు చాలా గౌరవంగా ఉంది. మన ఇండియన్ సినిమాకు సగర్వంగా ప్రాతినిధ్యం వహిస్తూ విజయం సాధించారు. ఈ హ్యాపీ మూమెంట్లో నన్ను భాగం చేసిన రామ్‌చరణ్, ఎస్ఎస్ రాజమౌళికి ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నాతో పాటు నా బిడ్డ కూడా ఈ గౌరవం పొందడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను’ అంటూ ఉపాసన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ మెగా ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. కాగా 2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్-ఉపాసనలు పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు కాబోతుండటంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం మురిసిపోతున్నారు. Such an honour to be a part of the #RRR family. Proudly winning for Indian Cinema #jaihind Thank u @AlwaysRamCharan & @ssrajamouli Garu for making me part of this journey. I’m sooo happy my baby can experience this along with me 🤗❤️ I’m soooooo emotional 🥹 @rrrmovie pic.twitter.com/ng6IXeULBY — Upasana Konidela (@upasanakonidela) January 11, 2023 -
అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది: జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాటు నాటు సాంగ్ ఈ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డ్‌తో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్ బరిలోనూ నిలిచింది. తాజాగా ఈ అవార్డ్ దక్కటం పట్ల రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఐరన్ మ్యాన్ అంటే ఇష్టం – ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతబ.. ‘రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పుడే ఈ సినిమా ఎక్కువమందికి రీచ్ అవుతుందని తెలుసు. ఆయనతో సినిమాలు చేయడం వల్ల, ఆయన ట్రాక్ రికార్డుని దృష్టిని పెట్టుకోవడం వల్ల తప్పకుండా మేం గెలుస్తామనే నమ్మకం ఏర్పడింది’’ అన్నారు ఎన్టీఆర్. మార్వెల్ సినిమాల గురించి మీడియా ప్రతినిధి అడిగితే... ‘‘మార్వెల్ సినిమా చేయాలని ఉంది. నా ఫ్యాన్స్ దీని గురించి క్రేజీగా మాట్లాడుకుంటున్నారు. నాకు ఐరన్ మ్యాన్ అంటే ఇష్టం. ఆ క్యారెక్టర్ మాకు దగ్గరగా అనిపిస్తుంది’’ అని అన్నారు. అది మాత్రమే కాదు.. ‘‘ఇవాళ మీ బర్త్‌డే కదూ.. హ్యాపీ బర్త్‌డే... మీకో చిన్న గిఫ్ట్. మీకు నచ్చుతుందనుకుంటున్నా’’ అంటూ ఓ గిఫ్ట్‌ని విలేకరికి అందజేశారు ఎన్టీఆర్. అది అందమైన టార్చర్ – రామ్‌చరణ్ హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘మా టీమ్ కష్టమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. అదొక అందమైన టార్చర్. సౌత్ ఇండియా నుంచి సినిమాలకు ఎంతో పాపులర్ అయిన ఈ ప్రాంతానికి రావడం, ప్రశంసలు పొందడం మాకు ఎనర్జీని ఇచ్చే విషయం. నాకిష్టమైన ప్లేస్ ఇది. హాలిడే ట్రిప్స్‌కి వస్తుంటాను. ఈ 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు రామ్‌చరణ్. కాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ‘మార్వెల్’ మూవీస్‌ని తలపించిందని, మీరు మార్వెల్ యాక్టర్లా కనిపించారని, మార్వెల్ స్టార్‌గా, సూపర్ హీరోగా చేయాలనుకుంటున్నారా? అని రామ్‌చరణ్‌ని ఓ విలేకరి అడగ్గా, ‘‘తప్పకుండా చేస్తాను. నా ఫేవరెట్ మార్వెల్ మూవీ ‘కెప్టెన్ అమెరికా’’ అన్నారు. అవార్డు వేడుకకు ముందు రెడ్ కార్పెట్‌పై రామ్ చరణ్ మాట్లాడారు. ఇక్కడి టాప్ టెక్నీషియన్లతో పని చేయాలని ఉందని.. అలాగే ఇండియాలో సూపర్ హీరోలు ఉన్నారు. వారి నటనని ఇక్కడి దర్శకులు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ మీ సినిమాకి అవార్డు వస్తే ఏం చేస్తారని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా– ‘‘మా డైరెక్టర్ రాజమౌళిగారిని ఆ అవార్డుని నాకు ఇవ్వమని అడుగుతాను. కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకుని ఆ తర్వాత వెనక్కి ఇచ్చేస్తాను’. అని అన్నారు. మాటలు రావడం లేదు: రాజమౌళి దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. 'మాటలు రావడం లేదు. సంగీతానికి హద్దులు లేవు. నాకు ‘నాటు నాటు..’ లాంటి పాట ఇచ్చిన పెద్దన్నా (కీరవాణి) మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ అవార్డు చాలా ప్రత్యేకమైనది. ‘నాటు నాటు...’ స్టెప్ వేస్తూ, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు.' అని అన్నారు. -
అద్నాన్ సమీ అతి వ్యాఖ్యలు
నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై నిన్నంతా పలువురు సినీ, సంగీత, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు RRR టీంను ప్రశంసలతో ముంచెత్తారు. పాట సమకూర్చిన సినిమా టీంను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రశంసించారు. అంతర్జాతీయ యవనికపై తెలుగు వారి ఖ్యాతి అత్యున్నత స్థాయిలో ఎగుర వేసినందుకు ఆంధ్రప్రదేశ్ తరపున RRR టీంకు అభినందనలు తెలుపుతున్నానని, ఈ పురస్కారం సాధించడం పట్ల గర్వంగా భావిస్తున్నామన్నారు. The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY — YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023 దీనిపై గాయకుడు అద్నాన్ సమీ అతిగా స్పందించారు. ఈ కీర్తిని తెలుగు వారికి మాత్రమే అంటూ చెప్పుకోవడం వద్దని, దేశాన్నివిభజించవద్దంటూ విచిత్ర రాగం అందుకున్నారు. Telugu flag? You mean INDIAN flag right? We are Indians first & so kindly stop separating yourself from the rest of the country…Especially internationally, we are one country! This ‘separatist’ attitude is highly unhealthy as we saw in 1947!!! Thank you…Jai HIND!🇮🇳 https://t.co/rE7Ilmcdzb — Adnan Sami (@AdnanSamiLive) January 11, 2023 అసలు సినిమాకు గానీ, అవార్డుకు గానీ, లేదా ఏపీ సీఎం చేసిన ట్వీట్‌కు గానీ ఏమాత్రం సంబంధం లేకుండా.. 1947ను గుర్తు చేసి అద్నాన్ సమీ స్పందించడం తెలుగు వారిపై ఆరోపణలు గుప్పించడం ఏ మాత్రం సరికాదంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. Dear @AdnanSamiLive its beyond ur comprehensive levels to understand what #Telugu Flag means. It signifies our PRIDE. V don't have to hear lectures on patriotism from likes of U. Better keep that borrowed NATIONALISM to urself. @ysjagan @ssrajamouli @AlwaysRamCharan @tarak9999 — Hyderabad Intellectuals Forum 🇮🇳 (@HydForum) January 11, 2023 RRR టీంను ప్రశంసిస్తూ తెలుగులో (ఇంగ్లీషు అక్షరాలతో తెలుగును) షారూఖ్ ట్వీట్ చేశారు. Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!! (Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! ) Love you. — Shah Rukh Khan (@iamsrk) January 10, 2023 బాలీవుడ్లో బాద్షా లాంటి షారూఖ్ లాంటి వాళ్లు తెలుగును గౌరవిస్తే.. నీకేమయిందంటూ నెటిజన్లు సమీకి గుర్తు చేసి చురకలంటించారు. And SRK tweeted in telugu 👇🏻 Don’t politicise everything Mr Adnan, you are not a politician https://t.co/vncXhNLtN1 — Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) January 11, 2023 అద్నాన్ సమీ ఓవరాక్షన్ పట్ల ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క దేశం పాకిస్తాన్ నుంచి భారత్‌కు వలస వచ్చి ఇప్పుడు భారతీయులకే పాఠాలు చెబుతావా అంటూ ప్రశ్నించారు. Clear Lack of knowledge in Adnan Sami’s comments. Cannot blame him because he wasn’t an Indian Citizen before 2016. All Telugu people are naturally patriotic and need no certificate. Reference to Telugu Flag is because ‘Naatu-Naatu’ won the Golden Globe award not ‘Nacho-Nacho’! — Vijayasai Reddy V (@VSReddy_MP) January 12, 2023 అద్నాన్‌సమీ వ్యాఖ్యల వెనక అక్కడి సినిమా మాఫియా అక్కసు కనిపిస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా బాలీవుడ్‌కు బ్యాడ్ టైం నడుస్తోంది. చెప్పుకోదగ్గ ఒక్క హిట్ లేకపోగా.. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలన్నీ ఎదురుతంతున్నాయి. అదే సమయంలో దక్షిణాది సినిమాలయిన RRR, KGF లాంటివి బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. -
థ్యాంక్యూ శ్రీవల్లి.. వేదికపై భావోద్వేగానికి గురైన ఎంఎం కీరవాణి
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్‌కు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఈ అవార్డ్ రావడానికి అద్భుతమైన చిత్రబృందమే కారణమని తెలిపారు. ఈ అవార్డును తన భార్య శ్రీవల్లితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కీరవాణి. ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ– 'ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉద్వేగాన్ని ఇక్కడే కూర్చుని ఉన్న నా వైఫ్ (శ్రీవల్లి)తో షేర్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది. మామూలుగా అవార్డులు అందుకున్నప్పుడు ‘నిజానికి ఇది నాది కాదు.. మరొకరికి దక్కుతుంది’ అని అంటుంటారు. అందుకని ఇలాంటి అవార్డు అందుకున్నప్పుడు నేను అలా మాట్లాడకూడదని ప్లాన్ చేసుకున్నాను. కానీ సారీ... నేను ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. ఎందుకంటే ఇవి నా హృదయంలోంచి వచ్చే మాటలు. వరుస క్రమంలో చెప్పాలంటే ముందుగా ఈ అవార్డు నా సోదరుడు, ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి విజన్‌కి దక్కుతుంది. నా పనిని నమ్మి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు తనకు ధన్యవాదాలు. తర్వాత ప్రేమ్ రక్షిత్ గురించి చెప్పాలి. అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. తను లేకపోతే ఈ పాట లేదు. తర్వాత ఈ పాటకు అన్నీ సమకూర్చిన కాలభైరవ, అద్భుతంగా రాసిన రచయిత చంద్రబోస్, కాలభైరవతో కలిసి ఎనర్జిటిక్‌గా పాడిన రాహుల్ సిప్లిగంజ్, ఫుల్ స్టామినాతో డ్యాన్స్ చేసిన ఎన్.టి. రామారావు, రామ్‌చరణ్‌లకు ధన్యవాదాలు. చివరిగా.. ఈ పాటకు ప్రోగ్రామ్ చేసిన సాహు సిద్ధార్థ్, జీవన్బాబులకు కూడా ధన్యవాదాలు. ఇంకొన్ని వర్డ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే.. థ్యాంక్యూ శ్రీవల్లి... థ్యాంక్యూ వల్లీ’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు కీరవాణి. MM Keeravaani’s #GoldenGlobes2023 acceptance Speech!! ❤️🔥❤️🔥 #RRRMovie #NaatuNaatu pic.twitter.com/9q7DY7Pn5G — RRR Movie (@RRRMovie) January 11, 2023 -
Golden Globe Awards 2023: తెలుగు నాటు యమా హిట్టు
నాటుదనంలో మాయామర్మం ఉండదు. నాటుదనంలో కల్లాకపటం ఉండదు. నాటుదనంలో హొయలు వగలు ఉండవు. నాటుదనంలో తళుకూ జిలుగూ ఉండవు. నాటుదనం గ్రామీణం. నాటుదనం భోళాతనం. నాటుదనం సాంస్కృతిక వరం. నాటుదనం మేకప్పు లేని సౌందర్యం. అందుకే ప్రపంచం మెచ్చింది. తెలుగు నాటుదనానికి చరిత్రాత్మక గుర్తింపునిచ్చింది. 78 ఏళ్లుగా ఇస్తున్న హాలీవుడ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో భారతదేశం నుంచి అందునా తెలుగు నుంచి మొట్ట మొదటిసారి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా ఆర్.ఆర్.ఆర్‌లోని ‘నాటు నాటు’ పాట అవార్డు గెలుచుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి తెలుగు కీర్తిని పెంచారు. రాసినవారు, పాడినవారు, ఆడినవారు, ఆడించినవారు, ఆదరించిన తెలుగు కుటుంబాలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. పరమ నాటు సమయం. పాట కూడా ఒక్కోసారి బాకులా గుచ్చుకుంటుంది. గజమో రెండు గజాలో దూరం కాకుండా సముద్రాలు దాటి తియ్యటి గాటు పెడుతుంది. పల్లవి చెంప నిమురుతుంది. చరణం గుండె తడుముతుంది. పదం పదం కలిసి జ్వరం తెప్పించి వెర్రెక్కిస్తుంది. భాష తెలియని భావం అక్కర్లేని నాదం ముందుకు దుముకుతుంది. హోరున తాకే జలపాతం కింద నిలబడినవాడి జాతి ఏదైతే ఏంటి... రీతి ఏదైతే ఏంటి... నిలువునా తడిపేస్తుంది. పాట కూడా అంతే. ప్రణతి, ఎన్టీఆర్, రాజమౌళి, రమ, శ్రీవల్లి, కీరవాణి, ఉపాసన, రామ్‌చరణ్, కార్తికేయ, శోభు యార్లగడ్డ పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు... అది గుంటూరు మిర్చి పొలం కావచ్చు. బహుశా నెల్లూరు పోలేరమ్మ జాతర కావచ్చు. కాకుంటే లష్కర్ బోనాలు కావచ్చు. అయితే మేడారం మహా సంగమం కావచ్చు. తెలుగుదనం అది. తెలుగు ఘనం. తెలుగు జనం. తెలుగు జయం. గ్రామీణ తేటదనం. అమాయక నాటుదనం. అది ఊరి పెద్దమనిషి తలపాగ. పేదరైతు భుజాన కండువ. నిండు గాజుల ఇల్లాలి నుదుటి బొట్టు. రోకలి దంచే యువతి చెంపన చెమట చుక్క. అది నిర్మల్ కొయ్యబొమ్మ. కొండపల్లి పూలకొమ్మ. ఉత్త నాటు సౌందర్యం. బహుమేటి సౌందర్యం. నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు ఈ నాటు ఇప్పడు ప్రపంచాన్ని గెలిచింది. సినిమా ద్వారా అయితేనేమి తెలుగు మాట ఖండాతరాలలో మోగింది. తెలుగు బాణి దేశదేశాల వాళ్లతో చిందులు వేయించింది. తెలుగు దరువు భూగోళాన్ని డండనకర ఆడించింది. తెలుగువారికి ఏం తక్కువ? మనకంటే ఎవరు ఎక్కువ? చులకన చేయని ఘనత ఆర్.ఆర్.ఆర్‌లో ‘నాటు నాటు’ పాట వచ్చే సందర్భం ఆంగ్లేయులు తమను తాము గొప్ప చేసుకుంటూ తెలుగు వారికి ఏం వచ్చు అని ప్రశ్నించే సందర్భం. వాళ్ల స్టయిలు డాన్సులు, నైసు స్టెప్పులే గొప్ప అనుకుంటూ కథా నాయకులైన రామ్‌ను, భీమ్‌ను నిలదీసే సందర్భం. దానికి జవాబుగా తెలుగువారు రంగంలోకి దిగితే పరిస్థితి ఎంత నాటుగా ఉంటుందో హీరోలు చెప్పాలి. అందుకు పాట కావాలి. గీత రచయిత చంద్రబోస్‌కు సిట్యుయేషన్ చెప్పి ‘నువ్వు ఏదైనా రాయి మన ఘనత చాటుకునేలా ఉండాలి. ఎదుటివారిని అవమానించేలా తిట్టేలా ఉండకూడదు’ అన్నాడు దర్శకుడు రాజమౌళి. ఇంగ్లిష్ వాణ్ణి తిట్టకుండా చెంప పగులగొట్టాలన్న మాట. చల్లగరిగ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) లాంటి చిన్న పల్లెలో పుట్టిన చంద్రబోస్‌కి తెలుగు వేగం, తెలంగాణ యోగం తెలియనిది ఏముంది? పాట పుట్టింది. కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు నా పాట చూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు చంద్రబోస్ మొత్తం పాట రాశాక కీరవాణి దానికి ట్యూన్ చేశాడు. పాట రాశాక ఫైనల్ వెర్షన్‌గా పాట బయటపడటానికి మధ్య దాదాపు 19 నెలలు ఉన్నాయి కరోనా వల్ల. ‘లోపలున పానమంతా దముకు దుముకులాడేలా’ చంద్రబోస్ రాయడం, ‘వొంటిలోన రగతమంతా రంకెలేసి ఎగిరేలా’ కీరవాణి ట్యూన్ చేయడం... దాంతో అది కోటి ఈలల పాటైంది. జపాన్ వాడి ఈల.. రష్యావాడి ఈల... చైనా వాడిదీ... వమెరికా వాడిదీనూ. పాదాల తుఫాను రికార్డింగ్ థియేటర్లో వాయుగుండం బలపడింది. ఇక అది తెర మీద తుఫానులా తాకాలి. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయాలి. పులి ఒకరు, బెబ్బులి ఒకరుగా ఇద్దరు హీరోలు... ఎన్టీఆర్, రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నారు. వీరి కాళ్లకు గజ్జెలు కట్టే వీరుడు కావాలి. ప్రేమ రక్షిత్. ఈ పాండిచ్చేరి కుర్రాడు హైదరాబాద్‌నే తన రెండో ఇల్లు చేసుకున్నాడు. కొరియోగ్రఫీని ఒంట్లో నింపుకున్నాడు. ‘ఈ పాటను నువ్వు ఎలాగైనా కంపోజ్ చెయ్. కాని ఇద్దరు హీరోలు ఈక్వల్‌గా కనిపించాలి’ అనేది దర్శకుడి షరతు. ‘ఎవరి ఎనర్జీ లెవల్ కూడా తగ్గినట్టుగా స్క్రీన్ మీద ఉండరాదు’ అన్నాడు దర్శకుడు. ప్రేమ్ రక్షిత్ పాటను అందుకున్నాడు. నెల రోజులు తపస్సు చేశాడు. హుక్ స్టెప్ (వైరల్ అయిన స్టెప్) కోసం యాభై రకాల మూవ్మెంట్స్ సిద్ధం చేస్తే దర్శకుడికి ఇప్పుడు ఉన్నది నచ్చింది. పాట కోసం మొత్తం 94 రకాల మూవ్‌మెంట్స్‌ని కంపోజ్ చేశాడు ప్రేమ్ రక్షిత్. పాటను ఉక్రెయిన్‌లో ప్రెసిడెంట్ ప్యాలెస్ దగ్గర 20 రోజులు షూట్ చేశారు. ఇద్దరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే అయినా పర్ఫెక్ట్ సింక్ కోసం దాదాపు 46 రీటేకులు అయ్యాయి. నాటు నాటు నాచో నాచో తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో నాటు నాటు వీర నాటు హిట్ కొట్టింది. ఇందులోని హుక్ స్టెప్‌ను ఆబాల గోపాలం ఇమిటేట్ చేసింది. యూ ట్యూబ్ షాట్స్, ఇన్‌స్టా రీల్స్ వందల వేలుగా తయారయ్యాయి. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కూడా ఈ స్టెప్‌ను రిపీట్ చేశారు. ప్రపంచమంతా తెలుగు మోత మోగింది. ఒకప్పుడు రాజ్ కపూర్ చేసిన ‘ఆవారా హూ’ పాట ఇంత పెద్ద హిట్ అయ్యింది. తమిళంలో రహెమాన్ చేసిన ‘తిల్లానా తిల్లానా’ ఇలాగే హిట్ అయ్యింది. ఇప్పుడు తెలుగు వంతు. మన జానపదం, మన నాటుదనం ఇప్పుడు కేకమీదున్నాయి. ఇది తెలుగు ఘనం. ఇది తెలుగు జయం. ఇద్దరు స్టార్స్‌కి కొరియోగ్రాఫ్ చేయడం అనేది పెద్ద సవాల్. ఎందుకంటే ఒక్కో స్టార్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ‘నాటు నాటు..’కి రెండు స్టయిల్స్ తీసుకుని, ఒకే స్టయిల్‌గా మార్చడం జరిగింది. నేను సవాల్‌గా తీసుకుని ఈ పాట చేశాను. కొరియోగ్రాఫ్ చేయడానికి నాకు రెండు నెలలు పట్టింది. చిత్రీకరణకు 20 రోజులు. 43 రీటేక్స్ తీసుకోవడం జరిగింది. మొదట్లో కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే ఇద్దరు స్టార్స్‌ని సమానంగా చూపించాలి. అందుకే చివరి వరకూ పాటకు మెరుగులు దిద్దుతూనే ఉండేవాళ్లం. – ప్రేమ్ రక్షిత్, కొరియోగ్రాఫర్ కీరవాణి సార్‌తో నా ప్రయాణం ఒక దశాబ్దం నాటిది. సార్ నన్ను న మ్మి ‘నాటు నాటు..’ ని నాలుగు భాషల్లో పాడేలా చేశారు. ఇది నాకు అద్భుతమైన అవకాశం. ‘ఆర్ఆర్ఆర్’కి పాడటం అనేది నాకో పెద్ద చాలెంజ్. నిరూపించుకోవాలని చాలా కష్టపడి పాట పాడాను. ఈ పాటను పెద్ద హిట్ చేసినందుకు యావత్ భారతదేశానికి ధన్యవాదాలు. – రాహుల్ సిప్లిగంజ్, గాయకుడు ‘‘నా జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలివి. ఎందుకంటే ‘నాటు నాటు’ పాట విశ్వ వేదిక మీద విజయం సాధించింది. రచయితగా చాలా చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు చంద్రబోస్.‘‘28 ఏళ్ల ప్రస్థానం, 850 చిత్రాలు, 3,600లకు పైగా పాటలు.. మొట్ట మొదటి పాట ‘తాజ్‌మహల్’లోని ‘మంచు కొండల్లోన చంద్రమా..’ నుండి ఇప్పటి ‘వాల్తేరు వీరయ్య’లోని పాట వరకూ.. ప్రతి పాటకూ తపస్సే, మథనమే జ్వలనమే. 3500 సార్లకు పైగా తపస్సు చేస్తే ఒక్కసారైనా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు కదా. ఈసారి ‘నాటు నాటు..’ పాటకు భగవంతుడు ప్రత్యక్షం అయి, వరం ఇచ్చాడని భావిస్తున్నాను. – చంద్రబోస్, రచయిత ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసింది ‘‘ఈ విజయం చాలా ప్రత్యేకం. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్‌లకు అభి నందనలు. ఎస్.ఎస్. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతగానో గర్వించేలా చేసింది’’ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి మరిన్ని విజయాలు సాధించాలి ‘నాటు నాటు’ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి నందుకు ‘ఆర్ఆర్ ఆర్’ యూనిట్‌ని గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. ఈ పాటకు అవార్డు రావడం ద్వారా తెలుగు సినిమా ప్రపంచ సంగీత వేదికపై గర్వించదగ్గ స్థాయిలో నిలిచిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించా లని గవర్నర్ ఆకాంక్షించినట్లుగా రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. – విశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి తెలుగుజెండాను రెపరెపలాడించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఈ విజయాన్ని చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), రామ్ చరణ్‌తోపాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. – వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి తెలుగు పాటకు దక్కిన గౌరవం ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం భారతీయ సంగీతానికి, ప్రత్యేకంగా తెలుగు పాటకు దక్కిన అద్భుత గౌరవమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి, నటులు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో పాటు యావత్ చిత్ర యూనిట్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మన సంగీతం, మన కొరియోగ్రఫీ, మన దర్శకత్వం, మన చిత్రాలు మరింత గుర్తింపును అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. – కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి -
ఆర్ఆర్ఆర్పై సీఎం జగన్ ప్రశంసలు, తారక్ రిప్లై..
ప్రపంచ స్థాయిలో ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రఖ్యాత అవార్డును దక్కించుకున్న చిత్రయూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్లో.. 'తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. కీరవాణి, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి ఆంధ్రరాష్ట్రం తరపున అభినందనలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం' అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దీనికి తారక్, రాజమౌళి, కీరవాణి స్పందిస్తూ థ్యాంక్యూ సర్ అని రిప్లై ఇచ్చారు. Thank you Sir. — Jr NTR (@tarak9999) January 11, 2023 చదవండి: 29 రోజులు కోమాలో నటి, బతకడం కష్టమేనన్న డాక్టర్స్, చివరికి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. మరో ప్రతిష్టాత్మక అవార్డు -
రిపోర్టర్ బర్త్‌డే.. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తారక్
-
Naatu Naatu Song: నాటు నాటు.. ఎందుకంత క్రేజ్!
ఇండియన్ సినిమా మరోసారి అంతర్జాతీయ వేదికపై సగర్వంగా మెరిసింది. అదీ ఒక తెలుగు సినిమా ద్వారా కావడం గమనార్హం. ఏ సినిమా దక్కించుకోని ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గౌరవాన్ని దక్కించుకుందీ రాజమౌళి ఆర్ఆర్ఆర్. నాటు నాటు సాంగ్‌కి గానూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకున్నారు. అయితే రాజమౌళి పాన్ ఇండియా రేంజ్లో ట్రిపుల్ ఆర్ మీద విపరీతమైన బజ్ నెలకొన్న టైంలోనూ.. నాటు నాటు రిలీజ్ అయ్యి నెగెటివిటీ చుట్టూరానే తిరిగింది. మరి అది దాటుకుని గ్లోబల్ స్థాయి అవార్డును ఎలా దక్కించుకుందో ఓసారి విశ్లేషిస్తే.. పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సేసినట్టు మర్రి సెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు.. నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు నాటు నాటు నాటు విచ్చుకత్తిలాగా వెర్రి నాటు ఏం పాట ఇది? నిజంగానే బాహుబలి లాంటి మహత్తర ప్రాజెక్టు తీసిన రాజమౌళి సినిమాలో ఉండాల్సిన రేంజ్ పాటనా ఇది?.. చంద్రబోస్ రాసి రాసి ఎలా రాయాలో మరిచిపోయి ఉంటాడు!. నాటు నాటు అంటూ అర్థం పర్థం లేకుండా రాసేస్తాడా?.. కీరవాణి ఎలాంటి బీట్ కొట్టాడు.. అసలు ఏమాత్రం శ్రద్ధ లేకుండా. నాటు సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఓ ఇండిపెండెంట్ తెలుగు సీనియర్ జర్నలిస్ట్ తనదైన శైలిలో గుప్పించిన విమర్శలివి. ఈయనొక్కడే కాదు.. చాలా వరకు వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్, చివరాఖరికి మీమ్స్ పేజీలు కూడా కూడా నెగెటివ్ రివ్యూలు ఇచ్చాయి ఈ పాటకు. కానీ, టాలీవుడ్లో ఇద్దరు యంగ్ స్టార్లు. పైగా టాప్ డ్యాన్సర్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు. ఆ ఇద్దరూ కలిసి గంతులేసే పాట ఎలా ఉండాలి?. ఆడియొన్స్ పూనకాలతో ఊగిపోవాలి.. థియేటర్లు దద్దరిల్లిపోవాలి కదా. అందుకే ఆ మూడ్‌కు తగ్గట్లు పాటను రాయమని రాజమౌళి.. రచయిత చంద్రబోస్‌ను పురమాయించారు. సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించి లిరిక్స్ రాసిన చంద్రబోస్.. దానికి అంతే సమయం తీసుకుని 30కిపైగా స్వరాలు సమకూర్చారు కీరవాణి. చివరకు ఒక్క ట్యూన్ ఒకే కావడం, యువ సింగర్లు సిప్లీగంజ్-కాలభైరవలు గాత్రం అందించడం.. విమర్శలను తొక్కిపారేసి ఆ పాట సూపర్ హిట్ కావడం చకచకా జరిగిపోయాయి. కేవలం ఒకేఒక్క పాట విషయంలోనే రాజమౌళి కనబరిచిన శ్రద్ధ ఇది. అది ఫలించి ఇప్పుడు అవార్డు వరించేలా చేసింది. పాట విజయంలో విజువలైజేషన్స్ ప్రధాన భూమిక పోషించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటు నాటు సాంగ్‌కు దక్కిన అవార్డు.. ట్రిపుల్ ఆర్కు దక్కిన భారీ విజయమనే చెప్పొచ్చు. అయితే.. ఈ పాట రిలీజ్ అయినప్పుడు పెదవి విరిచిన వాళ్లూ ఎక్కువే. సాంగ్ ప్రొమో రిలీజ్ అయినప్పుడు కేవలం స్టార్ల అప్పీయరెన్స్ తప్పించి పాట అంతగా ఏం లేదని తేల్చేసిన విశ్లేషకులు కొందరు ఉన్నారు. కానీ, ఆ నెగెటివిటీని తొక్కి పాడేసి గ్లోబల్ గుర్తింపు దక్కించుకుంది నాటు సాంగ్. మన నాటు సాంగ్‌కు దేశ విదేశాల నుంచి కూడా గుర్తింపు దక్కింది. షార్ట్ వీడియోల ద్వారా ఈ పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. సెలబ్రిటీల దగ్గరి నుంచి టీవీ షోలు, ఈవెంట్స్.. ఇలా ఎక్కడ చూసినా ఈ పాట సందడే కనిపించింది. మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ నాటు స్టెప్పులకు ఫిదా అయ్యారు జనాలు. షార్ట్ వీడియోస్‌తో అనుకరణకు యత్నించారు. అలా పాటకు దక్కిన పాపులారిటీ మరింతగా విస్తరించింది. 2021, నవంబర్ 10వ తేదీన నాటు నాటు సాంగ్ రిలీజ్(లిరిక్ వెర్షన్) అయ్యింది. సోకాల్డ్ విశ్లేషకుల సంగతి పక్కన పెడితే.. నాటు నాటు సాంగ్ లిజనర్స్‌కు తెగ ఎక్కేసింది. నాటు లిరిక్స్.. నాటు మ్యూజిక్.. దానికి తోడు చెర్రీ-తారక్‌ల సింక్రనైజ్డ్ నాటు స్టెప్పుల బిట్టు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ స్టెప్పు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. ఎక్కడికి వెళ్లినా.. సినిమా ప్రమోషన్స్‌లో ఇద్దరు హీరోలేసిన ఆ స్టెప్పు కీలక పాత్ర పోషించింది కూడా. 25 మార్చి 2022న సినిమా రిలీజ్ అయ్యాక.. ప్రేక్షకులు, అభిమానుల కోలాహలంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చివరకు ఆ పాట సక్సెస్.. సక్సెస్ మీట్లోనూ రాజమౌళి చేత ఆ స్టెప్పు వేయించింది మరి. రికార్డులు.. తెలుగులో నాటు నాటు.. హిందీలో నాచో నాచో, తమిళ్లో నాట్టు కూథూ, కన్నడలో హల్లి నాటు, మలయాళంలో కరినోథల్.. ఇలా భాష ఏదైనా సరే బీట్ ఒక్కటే. ఊపు తెప్పించే స్టెప్పులొక్కటే. అందుకు సాంగ్ అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక ఫుల్ వీడియో సాంగ్.. ఏప్రిల్ 11, 2022లో రిలీజ్ అయ్యింది. నాటు నాటు సాంగ్‌కు అన్ని భాషల్లో కలిపి వ్యూస్ కుమ్మేశాయి. తెలుగులో ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ దక్కించుకున్న పాట ఇదే. ప్రస్తుతం తెలుగులోనే 140 మిలియన్ వ్యూస్(లిరిక్స్ వెర్షన్‌కి), వీడియో వెర్షన్‌కి 111 మిలియన్ వ్యూస్ దక్కాయి. హిందీ లిరిక్స్ వెర్షన్ 87 మిలియన్ వ్యూస్, వీడియో వెర్షన్‌కి 217 మిలియన్ వ్యూస్ దక్కాయి. 4కే వ్యూస్ ప్రత్యేకంగా ఉన్నాయి. మిగతా అన్ని భాషల్లో అన్ని వెర్షన్లకు కలిపి వంద మిలియన్ వ్యూస్ పైనే వచ్చాయి. అలా.. ఒక తెలుగు మాస్ సాంగ్‌కు మిగతా భాషల్లోనూ విపరీతమైన ఆదరణ దక్కింది. గుండెలదిరిపోయేలా దండనకర మోగినట్టు సేవులు సిల్లు పడేలాగా కీసుపిట్ట కూసినట్టు ఏలు సిటీకేలేసేలా యవ్వారం సాగినట్టు కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం సేసినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు నాటు నాటు నాటు పచ్చి గడ్డపార లాగ చెడ్డ నాటు నాటు నాటు నాటు ఉక్కపోత లాగా తిక్క నాటు ఆర్ఆర్ఆర్లో.. నాటు నాటు సాంగ్ నేపథ్యం ఇంగ్లీషోళ్ల పార్టీలో మన డ్యాన్స్ సామర్థ్యాన్ని హేళన చేయడం నుంచి పుడుతుంది. అక్తర్(భీమ్)కు కలిగిన అవమానం భరించలేక స్నేహితుడైన రామ్.. ఈ మాస్ బీట్‌కు ఆజ్యం పోస్తాడు. అక్తర్‌తో కలిసి ఊర మాస్ స్టెప్పుల మంట రాజేస్తాడు. మన లోకల్ డ్యాన్స్ సత్తా చాటుతారిద్దరూ. పాట వచ్చే సందర్భానికి ఆడియొన్స్ కనెక్ట్ కావడం, అందులో హుషారైన స్టెప్పులు.. ఆయా భాషల్లో లిరిక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగలిగాయి. ఉక్రెయిన్‌లో షూటింగ్ నాటు నాటు సాంగ్ షూటింగ్ జరిగింది ఎక్కడో తెలుసా? ప్రస్తుతం రష్యా ఆక్రమణతో విలవిలలాడుతున్న ఉక్రెయిన్ గడ్డపై. అవును.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అధికారిక భవనం మరియిన్స్కీ ప్యాలెస్ బయట.. ఆగష్టు 2021లో నాటు నాటు సాంగ్ షూటింగ్ జరిగింది. విశేషం ఏంటంటే.. ట్రిపుల్ ఆర్ సినిమాకు అదే చివరి షెడ్యూల్ కూడా. ఆ సమయంలో మెడలో ఐడీ కార్డు ధరించి ఎన్టీఆర్ జక్కన్న తో ఫొటోను షేర్ చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో అక్కడి పరిణామాలపై తమకు అవగాహన లేదని, యుద్ధ సమయంలోనే అక్కడి పరిస్థితులు తెలిశాయని దర్శకధీరుడు దిగ్భ్రాంతి సైతం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) రెండు వారాల నరకం.. నాటు నాటు సాంగ్ చిత్రీకరణకు రెండు వారాలకు పైనే పట్టిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. పాటలో ప్రేమ్ రక్షిత్ కంపోజిషన్ ప్రకారం.. కాళ్లను ఎడమవైపు, కుడివైపుతోపాటు ముందుకు, వెనక్కు కదులుతూ ఉండాలి. ఈ స్టెప్స్ పర్ఫెక్ట్ గా రావడానికి ఇద్దరం దాదాపు 15-18 టేక్స్ తీసుకున్నామని స్వయానా తారక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. స్టెప్స్ సరిగ్గా రావడం కోసం జక్కన్న నరకం చూపించాడని, మధ్య మధ్యలో డ్యాన్స్ ఆపేసి మరీ చూసేవాడని ఇద్దరూ వాపోయారు(సరదాగా) కూడా. పోనీ.. 18 టేక్స్ తీసుకున్న తర్వాత అందులో ఓకే చేసింది రెండో స్టెప్పు అని, అప్పుడే ఆపేసి ఉంటే అంత కష్టం ఉండేది కాదు కదా అని చెప్పారు కూడా. అయితే.. పర్ఫెక్షన్ కోసమే తాను ఆ పని చేశానంటూ రాజమౌళి వివరణ ఇచ్చుకున్నాడులేండి. భూమి దద్దరయ్యేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా ఎసెయ్ రో ఏక ఏకి నాటు నాటు నాటు.. అరె దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా దుముకు దుముకులాడేలా దూకేయ్ రో సరాసరి నాటు నాటు నాటు నాటు నాటు సాంగ్ రిలీజ్ అయిన తొలినాళ్లలో భయంకరమైన విశ్లేషణలతో ఏకిపడేసినవాళ్లలో కొందరు ఇప్పుడు ఆ పాటను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాట సక్సెస్‌ను జీర్ణించుకోలేని మరికొందరు గప్‌చుప్‌గా ఉండడమో, మరింత విశ్లేషించి విమర్శించడమో చేస్తున్నారు. కానీ, అదే పాట దేశ విదేశాలు దాటుకుని.. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో అవార్డును దక్కించుకోగలిగింది. ఆ విజయం వెనుక పాట కోసం కృషి చేసిన ట్రిపుల్ ఆర్ టీం కష్టం ఉంది. ఆ కష్టానికి ఓ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! -
ఆర్ఆర్ఆర్పై ప్రధాని మోదీ ప్రశంసలు
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటునాటు సాంగ్‌కి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మక విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ టీంపై ట్విట్టర్ వేదికగా ప్రసంశల జల్లు కురిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందంటూ నటినటులను, చిత్ర బృందాన్ని పేరుపేరున అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విట్టర్లో ఈ చిత్ర నటీనటులు, సిబ్బందిని అభినందించారు. మన కళకు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందడం కంటే మన దేశం గర్వించదగ్గ క్షణం మరోకటి ఉండదు అని అన్నారు. కాగా, రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్లోని 'నాటు నాటు' పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది. అంతేగాదు ఈ చిత్రం ఉత్తమ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయ్యి ఈ అవార్డును గెలుపొందింది. దీంతో ఇప్పటికే పలువురు పలువురు ప్రముఖులు ఆ సినీ చిత్ర బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఒక భారతీయ సినిమా దక్కించుకోవడం విశేషమైతే, ఆ ఆవార్డును దక్కించకున్న తొలి ఏషియన్ సినిమాగానూ ఆర్ఆర్ఆర్ నిలిచింది. A very special accomplishment! Compliments to @mmkeeravaani, Prem Rakshith, Kaala Bhairava, Chandrabose, @Rahulsipligunj. I also congratulate @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. This prestigious honour has made every Indian very proud. https://t.co/zYRLCCeGdE — Narendra Modi (@narendramodi) January 11, 2023 (చదవండి: ఆర్ఆర్ఆర్కు అవార్డు రావడం గర్వంగా ఉంది.. చిత్ర బృందానికి ఏపీ సీఎం జగన్ అభినందనలు) -
తెలుగు జెండా రెపరెపలాడుతోంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. యావత్ రాష్ట్రం తరపున.. కీరవాణి, రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ మొత్తం ఆర్ఆర్ఆర్ టీంకు అభినందలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాము అంటూ ట్వీట్ చేశారాయన. The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY — YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023 బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ అవార్డును దక్కించుకోవడంతో.. ఇండియన్ సినిమా సంబురాలు చేసుకుంటోంది. -
ఈ గల్లిబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించింది
-
ఈ గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించింది: రాహుల్ ఎమోషనల్
ఆర్ఆర్ఆర్ మూవీకి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. దీనికి ఎమ్ఎమ్ కీరవాని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీకి కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటి ముందుకు మీడియా, అభిమానుల భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా, ఫ్యాన్స్ మధ్య రాహుల్ కేక్ కట్ చేసి ఈ గ్రేట్ మూమెంట్‌ను సెలబ్రెట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావాడం చాలా హ్యపీగా ఉంది. ఆ రేంజ్లో పాటకు గుర్తింపు వస్తుందని అనుకోలేదు. నన్ను నేను ఎప్పుడు గల్లీబాయ్‌గా పోల్చుకుంటా. కానీ ఇప్పుడు ఈ గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించింది. స్టేజ్‌పై కీరవాణి గారు నా పేరు చెప్పడం గర్వంగా అనిపిస్తుంది. మళ్లీ ఇలాంటి మూమెంట్ వస్తుందో రాదో తెలియదు. నా వాయిస్‌ను అంగీకరించిన ఆర్ఆర్ఆర్ టీం, కీరవాణి సార్, రాజమౌళి సార్, రమ మేడమ్ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: గోల్డెన్ గ్లోబ్ అవార్డు: ఆర్ఆర్ఆర్ టీంకి చిరు, ఏఆర్ రెహమాన్ శుభాకాంక్షలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్... అవార్డ్ వచ్చేసింది!