ఉత్తమ చిత్రంగా నిలిచిన ఆ సినిమా.. ఏకంగా ఐదు అవార్డులు! | Oppenheimer Wins Five Awards At Golden Globes 2024 | Sakshi
Sakshi News home page

Golden Globes Winners 2024: ఉత్తమ చిత్రంగా నిలిచిన ఓపెన్‌హైమర్.. ఏకంగా ఐదు అవార్డులు!

Published Mon, Jan 8 2024 2:13 PM | Last Updated on Mon, Jan 8 2024 2:27 PM

Oppenheimer Wins Five Awards At Golden Globes 2024 - Sakshi

గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజైన హాలీవుడ్‌ సినిమా 'ఓపెన్‌హైమర్'. ఇండియాలోనూ ఈ సినిమా అద్భుతమైన  కలెక్షన్స్‌ సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశాడు. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త 'రాబర్ట్ జె ఓపెన్ హైమర్' జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు డైరెక్టర్‌ క్రిస్టోఫర్ నోలన్. 

తాజాగా ప్రకటించిన  గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ఓపెన్‌ హైమర్ సత్తా చాటింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన అవార్డుల వేడుకలో  ఈ చిత్రం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే మార్గరెట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన బార్బీ మూవీ సైతం పలు అవార్డులను సొంతం చేసుకుంది.

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వివరాలు

  •     ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్‌
  •     ఉత్తమ కామెడీ చిత్రం- పూర్‌ థింగ్స్‌
  •     ఉత్తమ దర్శకుడు -  క్రిస్టఫర్‌ నోలన్‌(ఓపెన్‌హైమర్‌)
  •     ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్‌ సాగ్‌ ట్రైట్‌, ఆర్ధర్‌ హరారి ( అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
  •     ఉత్తమ నటుడు- సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్‌)
  •     ఉత్తమ నటి - లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
  •     ఉత్తమ హాస్య నటి - ఎమ్మా స్టోన్ (పూర్‌ థింగ్స్‌)
  •     ఉత్తమ హాస్య నటుడు - పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్)
  •     ఉత్తమ సహాయనటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్)
  •     ఉత్తమ సహాయనటి - డావిన్ జాయ్ రాండోల్ఫ్(ది హోల్డోవర్స్)
  •     ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ - లుడ్విగ్ గోరాన్సన్(ఓపెన్‌హైమర్)
  •     ఉత్తమ ఆంగ్లేతర చిత్రం - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
  •     ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ - వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ (బార్బీ)
  •     ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం - ది బాయ్ అండ్ ది హెరాన్
  •     బాక్సాఫీస్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు -  వార్నర్ బ్రదర్స్(బార్బీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement