Christopher Nolan
-
ఓటీటీలోకి 'ఓపెన్‌హైమర్' తెలుగు వర్షన్ వచ్చేసింది
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఓపెన్‌హైమర్’ తెలుగు అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ హిట్ సినిమా తాజాగా ఓటీటీలో తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. అణు బాంబును కనుగొన్న శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా చేసుకుని ‘ఓపెన్ హైమర్’ను రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇంగ్లీష్,హిందీ వర్షన్లో రూ. 119 రెంట్ విధానంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఓపెన్‌హైమర్.. మార్చి 21 నుంచి జియో సినిమాలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటుగా ఇంగ్లీష్,తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. జియో సినిమా వినియోగదారులు అయితే ఎలాంటి రెంట్ లేకుండా ఈ చిత్రాన్ని చూడొచ్చు. 96వ ఆస్కార్ వేడుకల్లో ‘ఓపెన్‌హైమర్’ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం సహా ఏడు విభాగాల్లో అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫి, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగాల్లోనూ ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది. రూ. 835 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.7,600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
Aaron Taylor-Johnson: కొత్త జేమ్స్ బాండ్?
హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్. ‘జేమ్స్ బాండ్’ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 25 సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ ఎక్కువ సార్లు జేమ్స్ బాండ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. 2021లో వచ్చిన జేమ్స్ బాండ్ 25వ చిత్రం ‘జేమ్స్ బాండ్: నో టైమ్ టు డై’లోనూ డేనియల్ క్రెగ్ బాండ్‌గా కనిపించారు. తాజాగా జేమ్స్ బాండ్ 26వ సినిమా గురించిన వార్తలు హాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తొలుత డేనియల్ క్రెగ్ పేరు వినిపించింది. కానీ మరోసారి బాండ్‌గా కనిపించేందుకు డేనియల్ ఆసక్తికరంగా లేరట. దీంతో కొత్త జేమ్స్ బాండ్‌గా ఎవరు కనిపిస్తారు? అనే చర్చ హాలీవుడ్లో మొదలైంది. ఈ క్రమంలో ఆరోన్ టేలర్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం, వయసు రీత్యా కూడా జేమ్స్ బాండ్‌గా ఆరోన్ పర్ఫెక్ట్ చాయిస్ అంటున్నారు కొందరు హాలీవుడ్ సినీ ప్రేమికులు. అలాగే ‘జేమ్స్‌బాండ్ 26’వ చిత్రానికి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక హాలీవుడ్ చిత్రాలు ‘కిక్కాస్’, ‘చాట్ రూమ్’, ‘గాడ్జిల్లా’, ‘అవెంజర్స్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఆరోన్ టేలర్. -
ఓటీటీకి ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల ప్రకటించిన 96వ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు క్లాసిక్స్ తీసిన ఇతడు.. తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌లో ఉన్న ఆయన.. తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆస్కార్‌లో అవార్డులు కొల్లగొట్టిన ఓపెన్ హైమర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కానీ రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నుంచి జియో సినిమాలో ఉచితంగానే చూసేయొచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. Keep the awards season spirit alive by binge-watching these cult movies! 🏆✨ Get ready to witness the cinematic phenomenon of Oppenheimer, streaming on #JioCinema March 21 onwards. pic.twitter.com/PUBSIFn94m — JioCinema (@JioCinema) March 18, 2024 -
ఆస్కార్‌లో 'ఓపెన్ హైమర్' సెన్సేషన్.. ఈ సినిమా ఎందుకంత స్పెషల్?
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమా గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఏకంగా ఆస్కార్ వచ్చేంతలా ఈ మూవీలో ఏముంది? ప్రత్యేకత ఏంటి? హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు క్లాసిక్స్ తీసిన ఇతడు.. తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌లో ఇప్పుడు తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?) సాధారణంగా హాలీవుడ్ సినిమాలంటే గ్రాఫిక్స్ కచ్చితంగా ఉంటాయి. కానీ 'ఓపెన్ హైమర్' కోసం అన్ని రియల్‌గా తీశారు. న్యూక్లియర్ బాంబు పేలుడు సీన్స్ కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ లాంటివి చేయకుండానే తీయడం విశేషం. అలానే ఇంగ్లీష్ సినిమాల నిడివి గంటన్నర లేదంటే రెండు గంటల్లోపే ఉంటుంది. 'ఓపెన్ హైమర్' మాత్రం దాదాపు మూడు గంటలకు పైగా నిడివితో తీశారు. గతేడాది జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు అనమాట. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) ఇప్పుడంతా కలర్ ఫార్మాట్లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు తీస్తున్నారు. 'ఓపెన్ హైమర్'లో కొన్ని సీన్స్ మాత్రం బ్లాక్ అండ్ వైట్‌లో తీశారు. అలా ఇది తొలి బ్లాక్ అండ్ వైట్ ఐమాక్స్ మూవీగా రికార్డ్ సృష్టించింది. ఇదే సినిమాలోని రొమాంటిక్ సన్నివేశంలో భారతీయ మతగ్రంథాలు ఉండటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది సరికాదని చాలామంది భారతీయ ప్రేక్షకుల విమర్శలు చేశారు. ఆ సీన్ తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. ఇన్ని విశేషాలున్న సినిమా.. మన ప్రేక్షకుల్లో ముప్పావంతు మందికి నచ్చలేదు! ఇది ఇక్కడ ట్విస్ట్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్
96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి భారతీయ సినిమాలు గానీ భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ పురస్కారాలేం దక్కలేదు. మరోవైపు చాలామంది ఊహించినట్లే 'ఓపెన్ హైమర్' సినిమాకు ప్రధాన విభాగాల్లో ఏకంగా ఏడు అవార్డులు రావడం విశేషం. దీనితో పాటు 'పూర్ థింగ్స్' అనే సినిమాకు నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయనేది పూర్తి జాబితా ఇదిగో.. ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్ ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్) ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటుడు – రాబర్డ్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటి – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్– 20 డేస్ ఇన్ మరియూపోల్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – ది బాయ్ అండ్ ది హిరాన్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్న్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా) బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్) బెస్ట్ సౌండ్ – ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ – నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం-ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- వార్ ఈజ్ ఓవర్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్) G.O.A.T #ChristopherNolan Won His First Ever #Oscars For #Oppenheimer 🥹❤️🔥pic.twitter.com/ygyZM2uBhj — Saloon Kada Shanmugam (@saloon_kada) March 11, 2024 -
మరో ఓటీటీకి బ్లాక్‌బస్టర్ మూవీ.. కేవలం వారు మాత్రమే చూసే ఛాన్స్!
గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రం ఓపెన్ హైమర్. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ నామినేషన్స్‌లో ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఇటీవల ప్రకటించిన బాఫ్టా అవార్డుల్లో ఏడింటిని కైవసం చేసుకుంది. అయితే ఇప్పటికే ఓటీటీకి వచ్చేసిన ఓపెన్ హైమర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ కేవలం రెంట్ విధానంలో మాత్రం చూసే అవకాశం ఉంది. దీంతో తాజాగా మరో ఓటీటీకి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు. థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత హాలీవుడ్ మూవీ జియో సినిమాలో రాబోతోంది. మార్చి 21 నుంచి ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని జియో సినిమా అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే జియో ప్రీమియమ్ కస్టమర్స్ మాత్రమే ఓపెన్‌హైమర్ మూవీని ఓటీటీలో చూడవచ్చు. ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. 13 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ ఇటీవల ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్‌లో ఓపెన్ హైమర్ ఓరేంజ్‌లో అదరగొట్టింది. ఏకంగా పదమూడు విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న మూవీగా ఓపెన్ హైమర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కనీసం పది వరకు ఆస్కార్ అవార్డులు దక్కే అవకాశం ఉందని హాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాదిలో లాస్ ఎంజిల్స్ వేదికగా మార్చి 11న ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు. ఓపెన్ హైమర్ కథేంటంటే.. అణుబాంబు సృష్టికర్త ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీని తెరకెక్కించాడు. రెండో ప్రపంచయుద్ద సమయంలో అణుబాంబును తయారు చేయడానికి ఓపెన్ హైమర్ ఎలాంటి ప్రయోగాలు చేశాడు? తనను తాను ప్రపంచవినాశకారిగా ఓపెన్ హైమర్ ఎందుకు ప్రకటించుకోవాల్సి వచ్చిందనే కోణంలో రూపొందించారు. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్‌గా సిలియన్ మార్ఫీ, అమెరికా అధ్యక్షుడు లూయిస్ స్ట్రాస్‌గా రాబర్ట్ డౌనీ నటించారు. -
బాఫ్టాలో మెరిసిన దీపికా పదుకోన్
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఒప్పెన్ హైమర్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల (బాఫ్టా) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. దేశం నుంచి దీపికా పదుకోన్ ఈ వేడుకల్లో పాల్గొని, ‘నాన్ ఇంగ్లిష్’ విభాగంలో ఉత్తమ చిత్రానికి (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) అవార్డు అందజేశారు. ఇక ‘భాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో పురస్కారాలు అందుకుని సత్తా చాటింది. అవార్డులతో ‘ఒప్పెన్ హైమర్’ టీమ్ ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, సహాయనటుడు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల్లో ‘ఒప్పెన్ హైమర్’కి అవార్డులు దక్కాయి. క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డు ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం తాజాగా బాఫ్టాలో ఏడు పురస్కారాలు దక్కించుకుని, వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో 13 విభాగాల్లో పోటీలో ఉంది. ఇక ‘బాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ తర్వాత ‘పూర్ థింగ్స్’ మూవీ అధికంగా ఐదు (కాస్ట్యూమ్, మేకప్, హెయిర్–స్టైలింగ్,ప్రోడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో) అవార్డులను పొందింది. ఆ తర్వాత ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి. భారతీయత ఉట్టిపడేలా... ‘భాఫ్టా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయ నటి దీపికా కావడం విశేషం. ఈ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరలో మెరిశారు దీపికా పదుకోన్. ‘చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది’ అనే ప్రశంసలు ఈ బ్యూటీ సొంతమయ్యాయి. ఈ వేడుకలో బ్యాక్ స్టేజీలో దీపికా దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపికా పదుకోన్ పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో దీపిక ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటను ఆమె ఆస్కార్ వేదికపై పరిచయం చేశారు. -
బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ 2024 విన్నర్స్.. ఆ హిట్ సినిమాదే పైచేయి
క్రిస్టోఫర్ నోలన్ ఆధారంగా తెరకెక్కిన ఓపెన్‌హైమర్ బయోపిక్ మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. 77వ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు (BAFTA) వేడుకల్లో తన సత్తా చాటింది. 2024 ఏడాదికి సంబంధించి ఓపెన్‌హైమర్ అవార్డ్స్‌లో అగ్రగామిగా నిలిచింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా ఏడు అవార్డులను గెలుచుకుంది. నోలన్‌కు దర్శకుడిగా ఇదే తొలి BAFTA అవార్డు కావడం విషేశం. బాఫ్టా ఫిల్మ్ 2024 అవార్డుల వేడుక లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో జరిగింది. పూర్ థింగ్స్ లో తన నటనకు గాను ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఓపెన్ హైమర్‌లో మనోజ్ఞ నటనకు సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. పూర్ థింగ్స్ చిత్రానికి సంబంధించి కాస్ట్యూమ్, మేకప్, హెయిర్-స్టైలింగ్, ప్రొడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో ఐదు బాఫ్టా అవార్డులను పొందింది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న 'ఓపెన్‌హైమర్' వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఇవన్నీ చూస్తే ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్‌హైమర్ పంట పండటం ఖాయం అని చెప్పవచ్చు. BAFTA అవార్డు విజేతలు ఉత్తమ చిత్రం: ఓపెన్‌హైమర్ ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్) ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్) ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్) ఉత్తమ సహాయ నటి: డావిన్ జాయ్ రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) ఉత్తమ కాస్ట్యూమ్: హోలీ వాడింగ్టన్ (పూర్ థింగ్స్) ఉత్తమ బ్రిటిష్ చిత్రం: జోనాథన్ గ్లేజర్, జేమ్స్ విల్సన్ (క్రాబ్ డే) ఉత్తమ సినిమాటోగ్రఫీ: హోట్ వాన్ హోటిమా (ఓపెన్‌హైమర్) ఉత్తమ ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్) ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రిట్, ఆర్థర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ ) ఉత్తమ విజువల్స్: సైమన్ హ్యూస్ (పూర్ థింగ్స్ ) ఉత్తమ డాక్యుమెంటరీ: 20 డేస్ ఇన్ మరియోపోల్ Oh boy! Cillian Murphy collects his Leading Actor BAFTA for Oppenheimer 🙌 #EEBAFTAs pic.twitter.com/M5pjKhtrqZ — BAFTA (@BAFTA) February 18, 2024 Your Leading Actress winner is Emma Stone! #EEBAFTAs pic.twitter.com/Gyk48SQXrZ — BAFTA (@BAFTA) February 18, 2024 -
ఉత్తమ చిత్రంగా నిలిచిన ఆ సినిమా.. ఏకంగా ఐదు అవార్డులు!
గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ సినిమా 'ఓపెన్‌హైమర్'. ఇండియాలోనూ ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త 'రాబర్ట్ జె ఓపెన్ హైమర్' జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. తాజాగా ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఓపెన్ హైమర్ సత్తా చాటింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ చిత్రం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే మార్గరెట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన బార్బీ మూవీ సైతం పలు అవార్డులను సొంతం చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వివరాలు ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్ ఉత్తమ కామెడీ చిత్రం- పూర్ థింగ్స్ ఉత్తమ దర్శకుడు - క్రిస్టఫర్ నోలన్(ఓపెన్‌హైమర్) ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్ సాగ్ ట్రైట్, ఆర్ధర్ హరారి ( అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) ఉత్తమ నటుడు- సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్) ఉత్తమ నటి - లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్) ఉత్తమ హాస్య నటి - ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ హాస్య నటుడు - పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్) ఉత్తమ సహాయనటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్) ఉత్తమ సహాయనటి - డావిన్ జాయ్ రాండోల్ఫ్(ది హోల్డోవర్స్) ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - లుడ్విగ్ గోరాన్సన్(ఓపెన్‌హైమర్) ఉత్తమ ఆంగ్లేతర చిత్రం - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - వాట్ వాస్ ఐ మేడ్ (బార్బీ) ఉత్తమ యానిమేటెడ్ చిత్రం - ది బాయ్ అండ్ ది హెరాన్ బాక్సాఫీస్ అచీవ్మెంట్ అవార్డు - వార్నర్ బ్రదర్స్(బార్బీ) -
ఓటీటీకి వచ్చేస్తోన్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కించిన హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమర్. ఈ ఏడాది జూలైలో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ హాలీవుడ్ మూవీ తాజాగా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఓటీటీ రిలీజ్‌కు మరో పది రోజులు ఉండగానే ఈ మూవీ ఆన్లైన్లో లీకైంది. గురువారం రోజే హెచ్డీ వర్షన్ ఆన్ లైన్లో దర్శనమివ్వడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జూలై 21న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది హాలీవుడ్లో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: ఏడాదిగా వెయిటింగ్.. ఎస్ చెప్పిన పవిత్ర.. నిశ్చితార్థం ఫోటో వైరల్) అణుబాంబును కనిపెట్టిన సైంటిస్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీని తెరకెక్కించాడు. అణుబాంబును కనిపెట్టడంలో ఓపెన్హైపర్ ఎదురైన సంఘటనలను ఈ సినిమాలో చూపించారు. కాగా.. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్, మాట్ డామన్ కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ) Oppenheimer is yours to own on 4K, Blu-ray™, and Digital November 21. Christopher Nolan’s global blockbuster premieres at home with over 3 hours of special features. pic.twitter.com/qUJRCwPoUC — Oppenheimer (@OppenheimerFilm) October 17, 2023 -
ఆ సీన్లో ఎలాంటి తప్పులేదు.. మహాభారత్ నటుడు షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఇండియాలోను విడుదల కావడంతో ఈ సినిమాకు ప్రేక్షాదరణ పెరుగుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ సన్నివేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలోని ఓ సీన్లో భగవద్గీత గురించి ప్రస్తావించడంపై ఇండియన్స్ మండిపడుతున్నారు. అలాంటి సీన్స్‌లో భగవద్గీతను చూపించాల్సిన అవసరం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. ఆ సీన్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు నితీశ్ భరద్వాజ్ స్పందించారు. ఆయన శ్రీకృష్ణ, మహాభారతం సీరియల్స్‌లో కృష్ణుడి పాత్ర పోషించారు. అయితే ఆ సన్నివేశంలో ఎలాంటి తప్పులేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాన్ని ఆయన సమర్థించారు. అణుబాంబు సృష్టితో జపాన్‌లో పెద్దసంఖ్యలో ప్రజలు మరణించారని.. ఆ సమయంలో ఆయన ఆందోళనకు గురయ్యారని వివరించారు. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో.. ఆయన చేతుల్లో ఉందన్న నటుడు!) ఇంటర్వ్యూలో నితీష్ భరద్వాజ్ మాట్లాడుతూ..'జపాన్ జనాభాలో మెజారిటీ ప్రజలు నాశనం కావడానికి కారణంఅణు బాంబు. అలాంటి మారణహోమానికి కారణమైన ఓపెన్ హైమర్ పశ్చాత్తాప పడ్డారు. ఆ సంఘటన అతనికి కన్నీళ్లను తెప్పించింది. దీంతో అతని చేసిన తప్పుకు చింతిస్తున్నాడు. గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమవడం నేను చూశా. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. ఆయన కోణం నుంచి ఆ సీన్ చూడాలి. అది శృంగార సన్నివేశమైనప్పటికీ.. అతని ఆలోచనలన్నీ జరిగిన విధ్వంసంపైనే ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశారు. అతనిది మానసిక సంఘర్షణ. ఆ సన్నివేశాన్ని వివాదం చేయకుండా..ఓపెన్ హైమర్ భావోద్వేగం కోణంలో చూడాలని ప్రజలను కోరుతున్నా.' అంటూ సలహా ఇచ్చారాయన. కాగా.. కై బర్డ్, మార్టిన్ J షెర్విన్ రాసిన 2005 జీవిత చరిత్ర అమెరికన్ ప్రోమేథియస్: ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ J రాబర్ట్ ఓపెన్‌హైమర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రంలో రామి మాలెక్, గ్యారీ ఓల్డ్మన్, డేన్ డెహాన్, జోష్ హార్ట్‌నెట్, కెన్నెత్ బ్రానాగ్, మాథ్యూ మోడిన్, కేసీ అఫ్లెక్, ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్, జాసన్ క్లార్క్ ప్రధాన పాత్రలు పోషించారు. (ఇది చదవండి: సినిమాల్లో నటనే కాదు.. అమ్మతనం ఉట్టి పడుతోంది!) -
'ఓపెన్‌హైమర్' సినిమాలో ఆ సీన్ తొలగించండి: సమాచార మంత్రిత్వ శాఖ
హాలీవుడ్ సినిమా 'ఓపెన్‌హైమర్' భారతదేశంలో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ ఓపెనింగ్‌ను సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జులై 21 న విడుదలైంది. 'అణుబాంబు పితామహుడు' అని పిలువబడే వ్యక్తి J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ బయోపిక్ కావడంతో భారీ అంచనాలతోనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో నోలన్ క్రియేటివిటీ అద్భుతంగా ఉన్నా.. భారతీయుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. (ఇదీ చదవండి: 'కల్కి' టైటిల్ రిలీజ్‌కు ఎందుకు రాలేదంటే: అమితాబ్) భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన 'సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే' అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేశానని J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ అప్పట్లో చెప్పారు. ఈ వ్యాఖ్యాన్ని కూడా సినిమాలో చూపించారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఒక సన్నివేశం మాత్రం కొంతమంది భారతీయ సినీ ప్రేక్షకులను కలవరపరిచింది. అశ్లీల సన్నివేశంలో భగవద్గీత ప్రస్తావన తీసుకురావడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. అంతేకాకుండా సినిమాను నిషేధించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సమాచార ప్రసార (ఐబి) మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ సీన్‌కు అభ్యంతరం చెప్పకుండా ఎలా సెన్సార్ ఇచ్చారని ఫైర్ అవుతున్నారు. దీంతో తాజాగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వివాదంపై స్పందించింది. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించాలని 'ఓపెన్‌హైమర్' టీమ్‌ను కోరింది. దీంతో నేటి నుంచి ఆ సన్నివేశాన్ని తొలిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. -
Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ
టైటిల్: ఓపెన్‌హైమర్ నటీనటులు: సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మేట్ డెమన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్, జోష్ హార్ట్ నెట్, కేసీ ఎఫ్లెక్ తదితరులు నిర్మాత: ఎమ్మా థామస్ , క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం: క్రిస్టోఫర్ నోలన్ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ సినిమాటోగ్రఫీ: Hoyte van Hoytema విడుదల తేది: జులై 21 ది బాట్మాన్ బిగిన్స్, ది డార్క్ నైట్ , డన్కిర్క్, టెనెట్ వంటి అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన క్రిస్టోఫర్ నోలన్ నుంచి తాజాగా 'ఓపెన్‌హైమర్' చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా జులై 21న విడుదలైంది. ఇది ఒక బయోపిక్. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త 'రాబర్ట్ జె ఓపెన్ హైమర్' జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఓపెన్‌హైమర్ కథేంటంటే.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న యంగ్ ఓపెన్‌హైమర్ (సిలియాన్ మర్ఫీ) పరిచయంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అతను న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తగా క్రమంగా ఎదుగుతుంటాడు. అదే సమయంలో అమెరికా అణు బాంబును తయారు చేసే పనిలో ఉంటుంది. అప్పుడు 1945 రెండో ప్రపంచ యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో శత్రు దేశాలని ఎదుర్కొనేందుకు అణుబాంబు తయారు చేసి పరీక్షించాలని 'మాన్హాటన్ ప్రాజెక్టు'ను అమెరికా ప్రారంభిస్తుంది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మంచి పరిజ్ఞానం ఉన్న సైంటిస్ట్‌గా గుర్తింపు ఉన్న ఓపెన్‌హైమర్‌ను (సిలియాన్ మర్ఫీ) నాయకుడిగా నియమిస్తుంది. అతనికి సహాయంగా లూయిస్ స్ట్రాస్ (రాబర్ట్ డౌనీ జూనియర్)ను భాగస్వామిని చేస్తుంది. అలా అతను ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్‌గా తన జర్నీ ఎలా మొదలైందో డైరెక్టర్ నోలన్ అద్భుతంగా చూపించాడు. అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? హిరోషిమా-నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? అనేది ఈ కథలో తెలుపుతాడు నోలన్. ఈ దాడి తర్వాత ఓపెన్‌హైమర్ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపై అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అతనిపై వచ్చిన విమర్శలను ఓపెన్ హైమర్ భార్య కెథెరిన్ లేదా కిట్టి (ఎమిలీ బ్లంట్) ఎలా ఎదుర్కొంది? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన 'సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే' అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేశానని ఓపెన్‌హైమర్ ఎందుకు వెల్లడించారు? చివరికి ఓపెన్ హైమర్ రియలైజ్ అయ్యింది ఏంటి ? లాంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయి. ఇంటర్వెల్ సమయంలో ఒక రొమాన్స్ సీన్లో భగవద్గీతను చూపిస్తూ వచ్చే సీన్ కొంతమేరకు ఇబ్బందిని కలిగిస్తుంది. దీనిని సెన్సార్ ఎలా అంగీకరించిందనేది ప్రశ్నార్థకం. ఎలా ఉందంటే.. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటి వరకు 6 ఆస్కార్ అవార్డులు, 21 సార్లు అస్కార్ నామినేషన్లకు వెళ్లిన టాప్ డైరెక్టర్. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా 3 గంటల 10 నిమిషాల నిడివితో విడుదలైంది. ఇదొక్కటే కొంచెం మైనస్ అని చెప్పవచ్చు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ప్రేక్షకులకి అంత సులభంగా అర్థం కావు. ఎందుకంటే అతని స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంటుంది. నిడివి ఎక్కువగానే ఉన్నా అతని ఫ్యాన్స్‌ను మాత్రం నిరాశపరచలేదు. ఈ సినిమాలో ఎలాంటి తికమకలు లేకుండా కథను చాలా నీట్‌గా చెప్పుకుంటూ వెళ్లాడు కాబట్టి అందరికీ కనెక్ట్ కావచ్చు. సినిమా ప్రారంభంలో కొంచెం స్లోగానే కథ రన్ అవుతుంది. ప్రజెంట్, పాస్ట్.. ఇలా నడుస్తూ ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉన్నా ఓపెన్ హైమర్ అణుబాంబు తయారీ టీమ్‌లోకి అడుగుపెట్టిన సమయం నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి చాలా ఆసక్తిగా స్టోరీ నడుస్తుంది. అణుబాంబును తయారు చేసిన తరువాత ట్రయల్ విజయవంతం కావడం, ఆపై మొదటిసారి హిరోషిమా-నాగసాకిపై ప్రయోగించడం.. దాని వల్ల కలిగిన విధ్వంసం ఆ శాస్త్రవేత్తను ఎలాంటి మానసిక వేదనకి గురి చేసింది అన్న సన్నివేశాలు బాగా చూపించాడు నోలన్. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్, ఓపెన్ హైమర్ మధ్య నడిచే అప్పటి రాజకీయాలే కాకుండా ఆ సమయంలో వారిద్దరి మధ్య వచ్చే సంభాషణల భావోద్వేగాల సీన్లు బాగుంటాయి. మానవత్వాన్ని ఒక వెపన్‌లో పెట్టి వినాశనం చేస్తున్నాను అని ఓపెన్ హైమర్ వేదన చెందే సన్నివేశంలో 'సిల్లియన్ మర్ఫీ' ఎంతో ఎమోషనల్‌గా నటించారు. ఫిజిక్స్, న్యూక్లియర్ సైన్స్‌పై ఆసక్తితో పాటు అవగాహన ఉన్న వారు ఈ కథకు బాగా రిలేట్ కాగలుగుతారు. ఈ చిత్రంలోని కొన్ని టెక్నికల్ బ్రిలియన్స్ ని ఎంజాయ్ చేయాలంటే అణుబాంబు దాడి గురించి ముందే కొంత అవగాహనతో సినిమాకు వెళ్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో సగటు ప్రేక్షకుడిని అంత సమయం పాటు థియేటర్లో కూర్చోబెట్టడం కొంచెం మైనస్. మొదట్లో ఒక గంటపాటు సీన్లన్నీ చాలా నెమ్మదిగా ఉంటాయి. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంతో కనెక్ట్ అవుతారని గ్యారెంటీ లేదు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్ పాత్రలో 'సిలియాన్ మర్ఫీ' పర్ఫెక్ట్గా నటించాడు. మనం సినిమా చూస్తున్నంత సేపు.. అణుబాంబును తయారు చేసిన వ్యక్తి ఆ సమయంలో ఇంతలా మదనపడ్డాడా..? అని తప్పకుండా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని ఓపెన్‌హైమర్‌గా సిలియాన్ మర్ఫీనే క్యారీ చేశారు. అతనికి భార్యగా నటించిన ఎమిలీ బ్లంట్ పాత్ర సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుంది. తన భర్త తయారు చేసిన బాంబ్ వల్ల కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని ఎలా ఎదుర్కొంది? భర్తకు సపోర్ట్‌గా నిలిచిన విధానం ఆడియన్స్‌ని మెప్పిస్తుంది. ఈ సినిమాలో ఓపెన్హైమర్కు సహాయకుడిగా నటించిన రోల్లో 'రాబర్ట్ డౌనీ జూనియర్' మెప్పించాడు. అటామిక్ కమిషన్ హెడ్‌గా అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రధానంగా 'మేట్ డెమన్' ఎయిర్‌ఫోర్స్ జనరల్ పాత్రలో కావాల్సినంత ఇంటెన్సిటీని తీసుకొచ్చారు. టెక్నికల్ పరంగా చూస్తే.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ టైమ్‌లోని సీన్లను ఈ జనరేషన్‌కు రీచ్ అయ్యేవిధంగా చూపించాడు. దీంతో స్క్రీన్‌పై మంచి ప్రజంటేషన్ కనిపిస్తుంది. సినిమాలో ఒకపైపు రియాలిటీని చూపిస్తూనే.. మరోవైపు ఆర్టిఫిషియాలిటీని కూడా చూపించారు. ఇక ఈ సినిమాలో ఎడిటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పవచ్చు. సినిమాలో చాలా మంది రోల్స్ కనిపిస్తూ పోతున్నా.. పర్ఫెక్ట్ కంటిన్యూటీని ఫాలో అయ్యాడు. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఈజీగా అర్థం అయ్యేలా కథను ఎడిట్ చేశారు. నోలన్ సినిమాలో సౌండ్ వర్క్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా అణుబాంబు పేలుడు సమయంలో వచ్చే సీన్ మెప్పిస్తుంది. ఈ సినిమాకు రియల్ బాంబ్ ఉపయోగించామని చెప్పారు. అది నిజమో కాదో తెలియదు. నోలన్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. ఒకవేళ నార్మల్ ఆడియన్ అయితే స్టోరీ కొంచెం నిడివి ఎక్కువ ఉందని అనిపించక మానదు, అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా కూడా ఉంటాయి. సినిమా అభిమానులకు మాత్రం మంచి అనుభూతి అయితే ఇస్తుంది. ఏదేమైనా ఈసారి హాలీవుడ్ నుంచి ఆస్కార్ బరిలో ఈ సినిమా కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. ఈ చిత్రం జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ఇండియాలోనూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు. (ఇది చదవండి: స్వీయ దర్శకత్వంలో నచ్చినవాడు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది! ) అయితే భారత్‌లో ఇప్పటికే టికెట్స్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి ఐమాక్స్‌లో కళ్లు చెదిరే రేట్లకు టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ మూవీ మొదటి రోజు షోలకు ఒక్కో టికెట్ ధర రూ.2450 పలుకుతోంది. గతంలో జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్-2 సినిమా టికెట్ ధర బెంగళూరులో గరిష్ఠంగా రూ.1700 మాత్రమే పలికింది. అంతటి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న అవతార్‌ను సినిమాను మించి టికెట్ ధరలు ఉండడంతో సినీ ప్రియులు ఆశ్చర్య పోతున్నారు. మనదేశంలో సాధారణంగా టిక్కెట్ ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. తాజాగా ముంబయిలో ఓపెన్ హైమర్ మూవీ టికెట్ ధర రూ.2450 ( ఎలాంటి పన్నులు లేకుండా) ఇప్పటికే అమ్ముడయ్యాయి. ముంబయిలోని పీవీఆర్ ఐకాన్, ఫీనిక్స్ పల్లాడియంలో సాయంత్రం ఏడు, రాత్రి పది గంటల షో కోసం సినిమా రిలీజ్ రోజున టిక్కెట్స్ బుక్ కావడంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ భారీ టికెట్ ధరలు చూస్తే ఓపెన్ హైమర్ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. గతవారంలో టామ్ క్రూజ్ మూవీ మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ వన్ ఇండియాలో మొదటి రోజు రూ.12.50 కోట్లు వసూలు చేసింది. తాజాగా సిలియన్ మర్ఫీ నటించిన ఓపెన్‌హైమర్ ఆ చిత్రాన్ని అధిగమిస్తోందేమో వేచి చూడాల్సిందే. అసలేంటీ ఓపెన్‌హైమర్? ఒపెన్‌హైమర్ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయన మొదటి అణు బాంబును అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్రవేత్త. కై బర్డ్, మార్టిన్ జె షెర్విన్ రచించిన రాబర్ట్ జీవిత చరిత్ర అమెరికన్ ప్రోమేథియస్ ఆధారంగా రూపొందించారు. కాగా.. ఇప్పటికే హాలీవుడ్ సమ్మె ప్రభావం ఈ చిత్రంపై ఉండదని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీరనుకునే హీరోయిన్ మాత్రం కాదు!) -
పాత్రను అర్థం చేసుకోవడానికి భగవద్గీత చదివా!
అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపన్హైమర్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఓపెన్‌హైమర్’. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఓపన్హైమర్ పాత్రను సిలియన్ మర్ఫీ పోషించారు. ఈ పాత్రను అర్థం చేసుకోవడానికి తాను భగవద్గీత చదివానని పేర్కొన్నారు సిలియన్. భగవద్గీతకి, ఈ పాత్రకి లింక్ ఏంటీ? అంటే.. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు అణు బాంబు తయారు చేయడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ‘సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే’ అనే శ్లోకం ప్రేరణగా నిలిచిందని ఓపెన్‌హైమర్ వెల్లడించారు. అందుకే ఆయన పాత్ర చేయడానికి భగవద్గీత చదివానని సిలియన్ మర్ఫీ అన్నారు. ఓపెన్‌హైమర్ జీవితంలో కీలకంగా నిలిచిన అణు బాంబు తయారీ ప్రధానాంశంగా రూపొందిన ‘ఓపెన్‌హైమర్’ యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా ఇంగ్లిష్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 21న విడుదల కానుంది. -
సినీ కార్మికుల సమ్మె.. రిలీజ్‌కు సిద్ధమైన భారీ బడ్జెట్ మూవీ!
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హైమర్ . యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్‌లో మాత్రమే జులై 21న విడుదలవుతుంది. ఈ మూవీ 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. (ఇది చదవండి: అలా చేస్తే కఠిన చర్యలు.. సల్మాన్ ఖాన్ మాస్ వార్నింగ్..!) మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ టైటిల్ క్యారెక్టర్‌గా నటించగా.. ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు. హాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె.. ప్రభావం ఉండదన్న మేకర్స్ ఇప్పటికే ఏఐ వల్ల వచ్చే ముప్పుపై సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ వేతనాలు పెంచాలని రోడ్డెక్కారు. ఇప్పటికే హాలీవుడ్లో అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. అయినప్పటికీ సినిమా విడుదలకు ఎటువంటి ప్రభావం ఉండదని యూనివర్సల్ పిక్చర్స్ ప్రకటించింది. ఆందోళనల నడుమ ఓపెన్ హైమర్ రిలీజ్ కానుంది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒళ్లు గగుర్పాటు కలిగించే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు! ) -
ఆ సినిమా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు: మాధవన్
Madhavan Rocketry The Nambi Effect Showing In Cannes Festival 2022: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో మంచి గుర్తింపు ఉన్న నటుడు మాధవన్. ఇప్పటి వరకు హీరోగా, నటుడిగా అలరించిన మాధవన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మాధవన్ మొదటిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మాధవన్ చిత్రం 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'ను ప్రదర్శించారు. అనంతరం ఈ కార్యక్రమంలో నిర్వహించిన చర్చలో భాగంగా మాధవన్‌తోపాటు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, నంబి నారాయణ్ చిత్ర నిర్మాత శేఖర్ కపూర్, గీత రచయిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాధవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'ఆర్యభట్ట నుంచి సుందర్ పిచాయ్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియాకి చెందిన అనేక వ్యక్తులకు ఎన్నో అసాధరణమైన చరిత్ర ఉంది. వీరికి సినీతారలు, నటీనటుల కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. యువతకు వారెంతో స్ఫూర్తి. కానీ ఇలాంటి వారిపై మేము సినిమాలు తీయడం లేదు.సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించి వరల్డ్‌వైడ్‌గా గుర్తింపు పొందిన వ్యక్తులను సినీ ప్రొడ్యూసర్స్ గుర్తించడం లేదు. క్రిస్టోఫర్ నోలాన్ సినిమాకు రివ్యూ ఇవ్వడానికి సమీక్షకులు భయపడతారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అర్థంకాకో, ఏదో ఒకటి రాసి ఫూల్ అవ్వడానికి ఇష్టపడరు. నిజం చెప్పాలంటే ఆయన తెరకెక్కించిన 'ఇన్సెప్షన్' నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ ఆయనకు సైన్స్‌పై ఉన్న పరిజ్ఞానం వల్ల ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది.' అని మాధవన్ తెలిపాడు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
2 నెలలు... 7 లక్షల టికెట్లు...
దాదాపు ఏడు నెలల తర్వాత సినిమా థియేటర్లు మళ్లీ ఆరంభమైన విషయం తెలిసిందే. లాక్డౌన్లో విడుదలైన తొలి సినిమా ‘టెనెట్’. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హాలీవుడ్ చిత్రాన్ని ఎక్కువమంది ప్రేక్షకులు చూశారని ‘బుక్ మై షో’ పేర్కొంది. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 18 వరకూ ఈ సినిమా టికెట్లు 3 లక్షల వరకూ అమ్ముడుపోయాయని కూడా లెక్క చెప్పింది. థియేటర్ల రీ–ఓపెన్ తర్వాత మన దేశంలో ఇన్ని టికెట్లు తెగిన సినిమా ఇదేనంటూ ‘షో ఆఫ్ ది ఇయర్ –2020’ అనే తన రిపోర్ట్‌లో తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెరిచిన 2800 థియేటర్ స్క్రీన్లలో, ఈ రెండు నెలల్లో మొత్తం మీద 7 లక్షల టికెట్లు తెగినట్టు బుక్ మై షో వారి నివేదిక వివరించింది. ఎక్కువ మంది చూసిన చిత్రాలలో రెండు, మూడు స్థానాల్లో తమిళ సినిమా ‘బిస్కోత్’, ఆ తర్వాత ‘ఇరండామ్ కూత్తు’ నిలిచాయి. ఆ తర్వాత హిందీ చిత్రం ‘సూరజ్ పే మంగళ్ భారీ’, బెంగాలీ సినిమా ‘డ్రాకులా సార్’ టికెట్లు బాగా తెగాయి. -
అత్తకు ప్రశంసలు.. అల్లుడి ఆనందం
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ‘టెనెట్’ శుక్రవారం(డిసెబంర్ 4) భారత్‌లో విడుదలైంది. జూన్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లో కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా కీలక పాత్రలో నటించారు. ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలో డైరెక్టర్ క్రిస్టఫర్ నంచి డింపుడ్ కపాడియా ఓ లెటర్ అందుకున్నారు. సినిమాలో ముఖ్య పాత్ర పోషించింనందుకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలో రాశారు. చదవండి: యూపీ సీఎంతో అక్షయ్ భేటీ ఈ లెటర్‌ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. అల్లుడిగా గర్వించే క్షణం అంటూ ఉప్పొంగిపోయారు.‘ క్రిస్టోఫర్ నోలస్ నుంచి డింపుల్ కపాడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ వచ్చింది. నేను ఆమె స్థానంలో ఉంటే ఆశ్యర్చంతో ఉండిపోయేవాడిని. టెనెట్‌లో ఆమె నటన చూసి సంతోషంగా అనిపించింది. ఆమె అల్లుడిగా గర్వంగా ఫీల్ అవుతున్నాను’. అని ట్వీట్ చేశారు. కాగా డింపుల్ కపాడియా కూతురు ట్వింకిల్ ఖన్నాని అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: అల్లు అర్జున్‌కు నో చెప్పిన అనసూయ Here’s my proud son-in-law moment! #ChristopherNolan pens a heartfelt note to #DimpleKapadia on the eve of their release.Had I been in her place,I wouldn’t have been able to move in awe but having watched her working her magic in #Tenet,I couldn’t be more happy and proud of Ma ♥️ pic.twitter.com/EgSehxio1I — Akshay Kumar (@akshaykumar) December 5, 2020 -
‘టెనెట్’ చూసి ఆనందించండి: క్రిస్టోఫర్ నోలాన్
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ భారతీయ సినీ అభిమానులకు ఓ తీపి కబురు అందించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘టెనెట్’ సినిమాను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ‘టెనెట్’ చిత్రాన్ని ఆయన కరోనా కాలంలోనే విడుదల చేసి అందరిని అశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ సినిమా డిసెంబర్ 4 (శుక్రవారం)న భారత్‌లోని పలు నగరాల్లో విడుదల కాబోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ అభిమానులకు కోసం ఓ విడియోను సందేశాన్ని పంచుకున్నారు. ‘హాయ్.. నేను ‘టెనెట్’ చిత్ర దర్శకుడైన మీ క్రిస్టోఫర్ నోలాన్. భారతీయ అభిమానులకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. మీరు(అభిమానులు) రేపు టెనెట్ సినిమా చూడబోతున్నారు. మీకు ఈ అవకాశం రావటం పట్ల నాకు చాలా థిల్లింగ్ ఉంది. టెనెట్ బిగ్ స్క్రీన్‌పై విడుదల కాబోతుంది. ముంబైతో పాటు పలు దేశాల్లో విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చూసి ఆనందించండి. మీకు కృతజ్ఞతలు’అని ఆ వీడియో ద్వారా నోలాన్ అభిమానులను పలకరించారు. చదవండి: అందరి సమక్షంలో ఆస్కార్ అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇండియాలోని ముంబైలో తెరకెక్కించామని, ఆ సీన్స్‌లో ఇండియన్, బాలీవుడ్ నటి డింపుల్ కపాడియాతో నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమెతో నటించిన పలు సన్నివేశాలు తనకు చాలా ఉత్సాహం కలిగించాయని తెలిపారు. తనతో కలిసి షూటింగ్లో పాల్గొనడం ఆనందం కలిగించిందని చెప్పారు. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది. కరోనా వైరస్‌తో సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ మళ్లీ థియేటర్లను ప్రారంభించుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. కాగా, లాక్డౌన్ అనంతరం థియేటర్లలో విడుదలయ్యే భారీ బడ్జెట్ చిత్రం టెనెట్. ఇప్పటికే ఈ చిత్రాన్ని 70 దేశాల్లో విడుదల చేశారు. తాజాగా ఇండియాతో పాటు డెన్మార్క్, ఎస్టోనియా, ఇటలీ, నార్వే, యూకే, అమెరికాలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. బాట్మాన్ బిగిన్స్, ది డార్క్ నైట్ సిరీస్, ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టోఫర్ నోలాన్ అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. Christopher Nolan has a special message for audiences in India. #Tenet In Cinemas Tomorrow. #ChristopherNolan pic.twitter.com/Fhtr8ZYEq2 — Warner Bros. India (@warnerbrosindia) December 3, 2020 -
కరోనా కాలంలోనూ భారీ వసూళ్లును రాబట్టిన ‘టెనెట్’
కరోనావైరస్ కారణంగా టాలీవుడ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పట్లో సినిమాలు లేవనుకున్న సమయంలో అందరిని ఆశ్చర్యపరుస్తూ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన టెనెట్ సినిమాలను విడుదల చేశారు. జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికీ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 26 ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. 225 మిలియన్ డాలర్లతో వార్నర్ బ్రదర్స్ ఈ సినిమాను నిర్మించారు. సైన్స్‌ఫిక్షన్ స్పై డ్రామా ఇది. ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధంలో పొంచివున్న అణుధార్మిక ప్రమాదం గురించి ఈ సినిమాలో చూపించారు. అయితే సినిమా తీయడమే ఓ సాహసం అయితే.. కరోనా సమయంలో విడుదల చేయడం మరో సాహసం అని చెప్పొచ్చు. కోవిడ్ సమయంలోనూ టెనెట్ 53 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే మన భారత కరెన్సీలో 387 కోట్లు. ఇంకా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 180 మిలియన్ డాలర్లు రాబాట్టాలి. అయితే కరోనా కష్టకాలంలోనూ ఆ మాత్రం వసూలు రాబట్టిందంటే గొప్పవిషయమనే చెప్పాలి. అసలు ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ పై మొదటి నుంచి కూడా చాలా అనుమానాలు వచ్చాయి. ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని ఎవరు అనుకోలేదు. త్వరలోనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇండియాలో ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. -
భవిష్యత్తుని చూపెట్టే టెనెట్
టైమ్ ట్రావెల్ సినిమా అనగానే మన ‘ఆదిత్య 369’ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గుర్తుకు వస్తారు. హాలీవుడ్ సినిమాల్లో టైమ్ ట్రావెల్ అనగానే క్రిస్టోఫర్ నోలన్ గుర్తుకు వస్తారు. ‘మెమెంటో’, ‘బ్యాట్‌మెన్ సిరీస్’లతో పాటు ‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్స్టెల్లార్’ వంటి పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిస్టోఫర్. కాగా ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ తదితర చిత్రాల్లో టైమ్ ట్రావెల్ నేపథ్యం ఉంటుంది. దాంతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘టెనెట్’ కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని చాలామంది ఊహించారు. ‘‘ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉండదు. అలాగే నా గత కొన్ని చిత్రాల్లోలా ఇందులో నేను ఫిజిక్స్ పాఠం చెప్పటం లేదు. అయితే గతం నుండి భవిష్యత్తుని చూడటం ఈ సినిమాలో ఉంటుంది. కానీ అదొక జర్నీలా ఉండదు. ఇది ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పగలను అన్నారు క్రిస్టోఫర్. తన భార్య ఎమ్మా థామస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు నోలన్. ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలను కుంటోంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ థియేటర్లు రీ ఓపెన్ అవుతాయో అక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. విడుదల తేదీని వాయిదా వేయాలనుకోవడంలేదని హాలీవుడ్ టాక్. -
ఏడు దేశాల్లో సినిమా షూటింగ్
బాలీవుడ్ తారలు హాలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంటారు. ప్రియాంక చోప్రా అయితే ఏకంగా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడి అక్కడికే మకాం మార్చేసింది. ఇక ఐశ్వర్యరాయ్, దీపికా పదుకోన్‌లు హాలీవుడ్లో సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా సీనియర్ నటి డింపుల్ కపాడియా, హాలీవుడ్ క్రేజీ దర్శకుడైన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అకాడమీ అవార్డు గ్రహిత క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో డింపుల్ కపాడియా నటిస్తున్న చిత్రం ‘టెనిట్’. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో సినిమానికి సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డింపుల్, క్రిస్టోఫర్‌లు సెట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ‘టెనిట్’ను దాదాపు ఏడు దేశాల్లో షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆస్కార్ విజేత డేవిడ్ వాషింగ్టన్ హీరోగా నటిస్తున్నారు. బాబీ(1973), సాగర్(1985) సినిమాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న డింపుల్ కపాడియా...‘లీలా’(2000) తో హాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. Christopher Nolan & Dimple Kapadia on set todayhttps://t.co/97zmLc9nxd #TENET pic.twitter.com/pN9qeGSi7f — ibabysky (@Ibabysky) July 27, 2019 -
హాలీవుడ్ మళ్లీ పిలిచింది
హాలీవుడ్ సినిమాల్లో మన ఇండియన్ తారలు అప్పుడప్పుడు మెరుస్తూనేఉన్నారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ ఇలా హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూనే వచ్చారు. ప్రియాంక అయితే ఏకంగా హాలీవుడ్‌కే మకాం మార్చేశారు. తాజాగా సీనియర్ నటి డింపుల్ కపాడియా ఓ హాలీవుడ్ సినిమాలో నటించడానికి అంగీకరించారు. హాలీవుడ్ క్రేజీ దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో డింపుల్ నటించనున్నారు. ఇంగ్లీష్ సినిమాలో నటించడం ఆమెకు ఇది మొదటిసారేం కాదు, ‘లీలా’ (2002) అనే ఆంగ్ల చిత్రంలో ఆల్రెడీ నటించారామె. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే తాజా చిత్రంలో ఆస్కార్ విజేత డేవిడ్ వాషింగ్టన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘టెనిట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుమారు ఏడు దేశాల్లో ఈ సినిమాను షూట్ చేయనున్నారట. వచ్చే ఏడాది జూలై 17న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. -
నెక్ట్స్ ఏంటి?
‘డంకర్క్’ తర్వాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఏ జానర్లో ఉంటుందో అనే ఆసక్తి హాలీవుడ్ ఇండస్ట్రీలో, ఆయన అభిమానుల్లో ఉంది. లేటెస్ట్గా వినిపిస్తున్న వార్తేంటంటే.. నోలన్ ఓ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్టు హాలీవుడ్ సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుందట. ‘బ్లాక్లాన్స్మేన్’ చిత్రంలో హీరోగా నటించిన జాన్ డేవిడ్ వాషింగ్టన్ ఇందులో హీరోగా నటించనున్నారట. ‘ట్విలైట్’ కథానాయిక రోబర్ట్ పాటిసన్ హీరోయిన్గా నటిస్తారట. నోలన్, అతని భార్య ఎమ్మా థామస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు కానీ ఈ చిత్రాన్ని జూలై 17, 2020లో విడుదల చేస్తామని ప్రకటించారు.