క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హైమర్ . యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్‌లో మాత్రమే జులై 21న విడుదలవుతుంది. ఈ మూవీ 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు.
(ఇది చదవండి: అలా చేస్తే కఠిన చర్యలు.. సల్మాన్ ఖాన్ మాస్ వార్నింగ్..!)
మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ టైటిల్ క్యారెక్టర్‌గా నటించగా.. ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు.
హాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె.. ప్రభావం ఉండదన్న మేకర్స్
ఇప్పటికే ఏఐ వల్ల వచ్చే ముప్పుపై సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ వేతనాలు పెంచాలని రోడ్డెక్కారు. ఇప్పటికే హాలీవుడ్‌లో అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. అయినప్పటికీ సినిమా విడుదలకు ఎటువంటి ప్రభావం ఉండదని యూనివర్సల్ పిక్చర్స్ ప్రకటించింది. ఆందోళనల నడుమ ఓపెన్ హైమర్ రిలీజ్ కానుంది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒళ్లు గగుర్పాటు కలిగించే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి.
(ఇది చదవండి: స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు! )
Comments
Please login to add a commentAdd a comment