టైటిల్: ల్యాండ్ ఆఫ్ బ్యాడ్
డైరెక్టర్: విలియమ్ యూబ్యాంక్
నిర్మాణ సంస్థలు: ఆర్ యూ రోబోట్ స్టూడియోస్, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్
నిడివి: 113 నిమిషాలు
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
కథేంటంటే..
యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కొన్ని చిత్రాలు మాత్రమే ఉంటాయి. అలాగే మనవద్ద కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే ప్రధాన కాన్సెప్ట్. అలా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'ల్యాండ్ ఆఫ్ బ్యాడ్'. ఓ వైమానిక అధికారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులను అంతమొందించారా? లేదా? అన్నదే అసలు కథ. కేవలం నలుగురు కమాండోలతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం.
ఎలా ఉందంటే..
అమెరికా ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. యూఎస్‌లో ఉన్న ఎయిర్‌బేస్ నుంచే కథ మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం నలుగురు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కమాండోలు బయలుదేరుతారు. అయితే ఆపరేషన్ మొత్తం సముద్రంలోని డెల్టా అడవుల్లోనే జరుగుతుంది. టార్గెట్ ప్రాంతానికి చేరుకున్న కమాండోలకు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి.. ముందుగానే వార్‌లోకి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే యుద్ద సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఒకవైపు టెర్రరిస్టుల నుంచి బుల్లెట్ల వర్షం, వైమానికి దాడులు అబ్బుర పరిచేలా అనిపిస్తాయి.
అయితే ఈ కథలో కాన్సెప్ట్ కొత్తగా లేనప్పటికీ ఈ ఆపరేషన్ చేపట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన లోకేషన్స్ మధ్య భీకరమైన బాంబు దాడులు, బుల్లెట్ల వర్షం ఆడియన్స్‌కు అద్భుతంగా ఉన్నాయి. ఎయిర్‌బేస్, కమాండోల మధ్య కమ్యూనికేషన్ అంత రోటీన్‌గానే ఉంటుంది. ఆపరేషన్ అంతా అడవుల్లోనే సాగడంతో ఎక్కడా బోర్ అనిపించదు. టెర్రరిస్టులతో ఎయిర్‌ఫోర్స్ కమాండోల పోరాడే సీన్స్ ఫుల్ యాక్షన్ ఫీస్ట్‌గా అనిపిస్తాయి. అయితే ఎయిర్‌బేస్ వైమానిక అధికారుల్లో ఆపరేషన్ పట్ల సీరియస్‌నెస్ లేకపోవడం ఈ కథకు పెద్ద మైనస్. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ మంచి ఆప్షన్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment