ఓటీటీల్లో బోర్ కొట్టని జానర్ అంటే థ్రిల్లరే. మిగతా సినిమాల సంగతేమో గానీ థ్రిల్లర్స్ ని థియేటర్లలో కంటే సింగిల్ గా ఇంట్లోనే చూడటం బెస్ట్ అని చెప్పొచ్చు. అలా హాలీవుడ్ లో 2014లోనే వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ 'ప్రీ డెస్టినేషన్'. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నిజంగా అంత బాగుందా? ఏంటనేది డీటైల్డ్ గా చూద్దాం.
(ఇదీ చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ)
'ప్రీ డెస్టినేషన్' విషయానికొస్తే.. ఈ సినిమాలో బేబీ జేన్, జేన్, జాన్, బార్ కీప్, ఫిజిల్ బాంబర్ అని ఐదు పాత్రలు ఉంటాయి. 1945-1992 మధ్య కాలంలో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అసలు వీళ్ల ఐదుగురికి కనెక్షన్ ఏంటి? చివరకు ఏమైందనేదే అసలు కథ.
కొన్ని సినిమాలు చూడటానికి చాలా సాధారణంగా ఉంటాయి. 40 నిమిషాలు అయ్యేవరకు 'ప్రీ డెస్టినేషన్' కూడా అలానే అనిపిస్తుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఐదు పాత్రలకు సంబంధించిన డీటైల్స్ అన్ని ప్రేక్షకుల అర్థమైన దగ్గర నుంచి థ్రిల్ కలిగిస్తుంది. ఐదు పాత్రలు టైమ్ ట్రావెలింగ్ చేస్తుంటే.. చూస్తున్న మనకు సరికొత్త అనుభూతి, థ్రిల్ అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా టైమ్ ట్రావెల్ అనేది సాధ్యమా కాదా అనేది పక్కనబెట్టి చూస్తే మాత్రం మూవీ నచ్చేస్తుంది. ఇంతకంటే ఒక్క విషయం ఎక్కువ చెప్పినా సరే మళ్లీ కథ లీక్ చేసి, మేమే మీకు స్పాయిలర్స్ ఇచ్చేసినట్లు అయిపోద్ది!
(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)
'ప్రీ డెస్టినేషన్' సినిమాని గ్రేటెస్ట్ అని చెప్పలేం కానీ డిఫరెంట్ మూవీస్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్ కచ్చితంగా మిస్సవకుండా చూడాల్సిన మూవీ. 2014లోనే రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్ ఆడియెన్స్ కి తెగ నచ్చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువైంది. ఇదే మూవీ కథని స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో పలు సినిమాలు తీయడం విశేషం. అవేంటో చెబితే మళ్లీ స్టోరీ చెప్పిసినట్లు అవుతుంది.
లాస్ట్ అండ్ ఫైనల్.. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత 'అత్తారింటికి దారేది' సినిమాలోని ఫేమస్ డైలాగ్ కచ్చితంగా గుర్తొస్తుంది. అదేంటనేది 'ప్రీ డెస్టినేషన్' చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కేవలం 97 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాని అలా మొదలుపెడితే ఇలా ముగించేయొచ్చు. మరి ఇంకెందుకు లేటు త్వరగా చూసేయండి.
(ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!)
Comments
Please login to add a commentAdd a comment