hollywood action directors
-
అడవుల్లో బుల్లెట్ల వర్షం.. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఎలా ఉందంటే?
టైటిల్: ల్యాండ్ ఆఫ్ బ్యాడ్డైరెక్టర్: విలియమ్ యూబ్యాంక్నిర్మాణ సంస్థలు: ఆర్ యూ రోబోట్ స్టూడియోస్, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్నిడివి: 113 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్కథేంటంటే..యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కొన్ని చిత్రాలు మాత్రమే ఉంటాయి. అలాగే మనవద్ద కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే ప్రధాన కాన్సెప్ట్. అలా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'ల్యాండ్ ఆఫ్ బ్యాడ్'. ఓ వైమానిక అధికారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులను అంతమొందించారా? లేదా? అన్నదే అసలు కథ. కేవలం నలుగురు కమాండోలతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..అమెరికా ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. యూఎస్‌లో ఉన్న ఎయిర్‌బేస్ నుంచే కథ మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం నలుగురు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కమాండోలు బయలుదేరుతారు. అయితే ఆపరేషన్ మొత్తం సముద్రంలోని డెల్టా అడవుల్లోనే జరుగుతుంది. టార్గెట్ ప్రాంతానికి చేరుకున్న కమాండోలకు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి.. ముందుగానే వార్‌లోకి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే యుద్ద సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఒకవైపు టెర్రరిస్టుల నుంచి బుల్లెట్ల వర్షం, వైమానికి దాడులు అబ్బుర పరిచేలా అనిపిస్తాయి. అయితే ఈ కథలో కాన్సెప్ట్ కొత్తగా లేనప్పటికీ ఈ ఆపరేషన్ చేపట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన లోకేషన్స్ మధ్య భీకరమైన బాంబు దాడులు, బుల్లెట్ల వర్షం ఆడియన్స్‌కు అద్భుతంగా ఉన్నాయి. ఎయిర్‌బేస్, కమాండోల మధ్య కమ్యూనికేషన్ అంత రోటీన్‌గానే ఉంటుంది. ఆపరేషన్ అంతా అడవుల్లోనే సాగడంతో ఎక్కడా బోర్ అనిపించదు. టెర్రరిస్టులతో ఎయిర్‌ఫోర్స్ కమాండోల పోరాడే సీన్స్ ఫుల్ యాక్షన్ ఫీస్ట్‌గా అనిపిస్తాయి. అయితే ఎయిర్‌బేస్ వైమానిక అధికారుల్లో ఆపరేషన్ పట్ల సీరియస్‌నెస్ లేకపోవడం ఈ కథకు పెద్ద మైనస్. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ మంచి ఆప్షన్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. -
సమంత 'యశోద'కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
Hollywood Action Director Yannick Ben For Samantha Yashoda Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ బిజీగా ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమా ఆఫర్లు, స్పెషల్ సాంగ్స్, కమర్షియల్ యాడ్స్‌తోపాటు వ్యాపార వ్యవహారాలు సైతం చూసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. అంతేకాకుండా హాట్‌హాట్ ఫోజులు, దుస్తులతో అభిమానులను అలరించే సామ్ కమర్షియల్ విలువలతోపాటు కంటెంట్ ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇటు కమర్షియల్ హంగులు, కంటెంట్ ఉన్న కథతో ఉన్న శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను సంప్రదించగా సామ్ ఓకే చెప్పింది. ఆ మూవీనే 'యశోద'. కాగా సమంత ఇంతకు మందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు భిన్నంగా ఉండే డిఫరెంట్ మూవీ ఇది. ఈ మూవీలో యాక్షన్ పార్ట్ కూడా ఉండనుంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెనిత్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లోని యాక్షన్ సన్నివేశాలకు యానిక్ బెన్ డైరెక్ట్ చేశారు. సమంతతో యానిక్ బెన్‌కు 'యశోద' సినిమా సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్గా కూడా బెనిక్ వర్క్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో పది రోజులపాటు యశోద యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. రూ. 3 కోట్ల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. మరొ యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. సమంత తదితరులపై పది రోజులపాటు 3 సెట్స్‌లో షూటింగ్ చేశామని, సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేసిందని శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్లిల్లర్ చిత్రమిదని పేర్కొన్నారు. హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. -
బాహుబలి-2 కోసం హాలీవుడ్ మొత్తం దిగింది!
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి-2 కోసం హాలీవుడ్ నుంచి పలువురు నిపుణులు దిగిపోయారు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇది పది వారాల పాటు కొనసాగనుంది. కొన్ని నెలల పాటు ముందుగా ప్లాన్ చేసి, రిహార్సల్స్ వేసుకున్న తర్వాత క్లైమాక్స్ షూటింగ్ మొదలుపెట్టామని, ఇప్పటినుంచి ఆగస్టు వరకు తుది షెడ్యూలులో భారీ యుద్ధ సన్నివేశం షూట్ చేస్తామని సినిమా వర్గాలు వెల్లడించాయి. గత రెండు నెలలుగా ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ యుద్ధ సన్నివేశం షూటింగ్ కోసం హాలీవుడ్ నుంచి నిపుణుల బృందం పెద్ద ఎత్తున దిగింది. గతంలో లింగా, బాహుబలి సినిమాలకు యాక్షన్ డైరెక్షన్ చేసిన లీ వీట్టేకర్ ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చాడు. అతడితో పాటు బ్రాడ్ అలన్, అతడి బృందం మొత్తం దిగింది. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాతో పాటు 'ద హంగర్ గేమ్స్' సిరీస్‌కు పనిచేసిన లార్నెల్ స్టోవాల్, 'ద హాబిట్' సినిమాకు పనిచేసిన మోర్న్ వాన్ టాండర్ లాంటివాళ్లు ఈ క్లైమాక్స్ సన్నివేశాలకు కీలకంగా మారనున్నారు. వీళ్లందరినీ సమన్వయం చేసుకుంటూ రాజమౌళి క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే ఈ సినిమా 2017 ఏప్రిల్ 18న విడుదల కావాలి.